contract lecturers
-
చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
-
పాపం.. కాంట్రాక్ట్ లెక్చరర్లు!
‘కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్దీకరిస్తాం. ఈ బాధ్యత నేను తీసుకుంటున్నాను’.. ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ఇది. కానీ.. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి ఈ హామీని గుర్తుచేస్తే క్రమబద్దీకరణ కుదరదు పొమ్మన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖి సమావేశమై ‘ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు పోరాడుతా’.. అని హామీ ఇచ్చారు. ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖం కూడా చూపించలేదు. సాక్షి, అమరావతి : కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఝులక్ ఇచ్చింది. ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని, వారి సర్వీసును క్రమబద్దీకరిస్తామని మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఆ అంశాన్నే పక్కన పెట్టేశారు. అంతేకాదు.. ఈ అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడంతో కాంట్రాక్టు లెక్చరర్లు కంగుతిన్నారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2021లో తెలంగాణ ప్రభుత్వం అక్కడి కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కూడా క్రమబద్దీకరించేందుకు గతేడాది అక్టోబరులో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. 2014 జూన్‌కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్దీకరించాలని జీఓ–114 ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పనిచేస్తున్న 3 వేల మందిని రెగ్యులరైజ్ చేయగా, మిగిలిన వారి వివరాలు తీసుకునేసరికి ఎన్నికల కోడ్ అమలుతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆందోళనలో ఐదువేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు.. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లే ఉన్నారు. వీరిలో ఇంటర్మీడియట్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది పనిచేస్తున్నారు. 2023 అక్టోబరులో చేసిన చట్టం ప్రకారం వీరినీ క్రమబద్ధీకరించేందుకు వారి వివరాలు, సర్వీసు, విద్యార్హతల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసి ఫైల్‌ను న్యాయ నిపుణుల సలహా కోసం పంపారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. క్రమబద్దీకరణ కోసం అర్హులుగా గుర్తించిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరు మాత్రమే రెగ్యులర్ కావడంతో మిగిలిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెర్ఫార్మెన్స్ పేరుతో కొత్త నిబంధన.. ఇదిలా ఉంటే.. ఏటా కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యువల్‌ను జూన్‌లో ఇవ్వాల్సి ఉండగా, ఈసారి మూడు నెలలు ఆలస్యంగా రెన్యువల్ చేశారు. అందులోనూ 3,618 మందిలో 558 మంది పనితీరు సరిగ్గాలేదని పక్కనపెట్టారు. పైగా.. ఈ విద్యా సంవత్సరం ఒప్పందంలో ‘పెర్ఫార్మెన్స్’ అనే కొత్త నిబంధనను తీసుకురావడం గమనార్హం. అంటే వచ్చే ఏడాది ఈ వంకతో ఎంతమందిని తొలగిస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. త్వరలో డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 350 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. కానీ, ఆ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది.మా గోడు ఆలకించండితమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ పాదగయలో హోమం పిఠాపురం: ఎన్నికల ముందు తమకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో వినూత్న నిరసన నిర్వహించారు. ఎన్నో రోజులుగా తమ గోడు వినిపించుకోండంటూ ప్రభుత్వం వద్ద వాపోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో దేవుడి వద్ద తమ గోడు తెలుపుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు బీఎస్ఆర్ శర్మ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తమ సమస్యలను పట్టించుకోవాలనే..ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసన చేపట్టామన్నారు. ఆదివారం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసనలు నిర్వహించి వచ్చే ఆదివారం విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, ఆపై ఆదివారం సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో వినూత్న నిరసనలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి, పురూహూతికా అమ్మవారి సన్నిధిలో పొర్లు దండాలు పెట్టి, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి దేవుడా! ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి, మా బాధలు వినేలా చేయి అంటూ తమ గోడును విన్నవించుకున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో వీరంతా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్‌ను కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు పలువురు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. గత పాలకులు ఎగతాళి చేశారు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచమంటే మీకిదే ఎక్కువని గత పాలకులు గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న మా బాధలు చూసి స్వయంగా మా ధర్నా శిబిరాలకు వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కలకాలం ఆయనకు రుణపడి ఉంటాం. – కల్లూరి శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ కో–చైర్మన్ 10 వేలకు పైగా కుటుంబాల్లో వెలుగులు రెండు దశాబ్దాలకు పైగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ, జగన్ పాదయాత్రలో మా సమస్యను విని సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పరిష్కరించారు. ఈ నిర్ణయంతో 10,117 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ఆయనకు అండగా ఉంటాయి. – డి. ఉమాదేవి, కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి సీఎం మేలు మరువలేం.. సీఎం జగనన్న మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. పది కాలాలపాటు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మహిళా ఉద్యోగులందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు దైవకృçప, ప్రజల ఆశీçస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.– ఆర్. దీప, కాంట్రాక్ట్ లెక్చరర్ (కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి) ఐదేళ్ల నిబంధన తొలగింపు చరిత్రాత్మకం.. సీఎం జగనన్న తీసుకున్న రెగ్యులరైజేషన్ నిర్ణయం 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఐదేళ్ల నిబంధన తొలగింపు నిర్ణయం చరిత్రాత్మకం. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకుకృషిచేస్తాం.– కుమ్మరకుంట సురేష్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్లలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వివారలను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారి వివరాలు పంపించాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. దీంతో తమ తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి, వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. 230 మంది కాంట్రాక్ట్ లెక్చర్ర్లు నకిలీలుగా తేలింది. మరికొంతమంది మంజూరు లేని పోస్టులలోపనిచేస్తున్నట్లు, క్వాలిఫికేషన్ లేకున్నా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా జాయిన్ అయినట్లు బయటపడింది. ఇప్పటి వరకు 18 మంది డిగ్రీ లెక్చర్లు, ఆరుగురు పాలిటెక్నిక్ లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. మరి నకిలీ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. చదవండి: బండి సంజయ్‌కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు -
రెసిడెన్షియల్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఏపీఆర్ఈఐ) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను ప్రభుత్వం పెంచింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనుంది. యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైమ్‌స్కేల్‌ను మంజూరు చేస్తూ గతంలో ఆర్థికశాఖ 40వ నంబరు జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఏపీఆర్ఈఐ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహరావు మెమో ఇచ్చారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం పెరగనున్న జీతాల వివరాలు.. -
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు) -
కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం: మంత్రి హరీశ్
సిద్దిపేట ఎడ్యుకేషన్ : ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు పీఆర్సీ అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ (జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్) ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో రాష్ట్రస్థాయి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. సభకు మంత్రి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి 2014 నుంచి నేటి వరకు రూ.567 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. పీఆర్సీ అమలుతో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ తదితర 1.20 లక్షల మంది చిరు ఉద్యోగులకు లబ్ధి కలిగిందన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అని పేర్కొన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి సబ్‌కమిటీని ఏర్పాటు చేశామని, రూ.4 వేల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు. -
పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత కొంతకాలంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. వారికి 12 నెలల జీతం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత అధ్యాపకుల వినతి మేరకు 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆయన ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రైవేట్ ఓరియంటల్.. ప్రభుత్వ ఓకేషనల్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇది వర్తించనుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 5,042 మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. (చదవండి: అక్టోబర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం) -
వేదన తీరె.. బోధన మారె!
శ్రీకాకుళం న్యూకాలనీ: కాంట్రాక్ట్ లెక్చరర్లకు జగన్మోహన్రెడ్డి సర్కారు తీపి కబురును అందించింది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్ల అర్హతలు, సీనియారిటీ ప్రాతిపదికన క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల తమ చిరకా ల న్యాయపరమైన డిమాండ్ నెరవేరిందని పట్టరాని ఆనందంతో ఉన్నారు. బుధవారం రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా కళాశాలలు తెరుచుకున్న సమయంలో ఆ నోటా ఈ నోటా ఇదే చర్చ. దశాబ్దాల డిమాండ్‌ను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పదిరోజుల్లోనే మోక్షం కలకడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు సంతోషంతో మునిగితేలుతున్నారు. సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకోవడంపై వారంతా నూతనోత్సాహంతో పనిచేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇది.. రాష్ట్రవ్యాప్తంగా 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3800 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 44 ప్రభుత్వ జూని యర్ కళాశాలలు ఉండగా దాదాపు 388 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న మరో 80 మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 20శాతం మంది రెండు దశాబ్దాల నుంచి కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తుండగా, మరో 50 శాతం మంది దశాబ్దానికి పైగా ప్రభుత్వ కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. 1999లో కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థను నాటి చంద్రబాబు తీసుకొచ్చారు. ఒక లెక్చరర్‌కు ఇచ్చే జీతంతో నలుగురుగు కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాఠాలు బోధించవచ్చని దుర్మార్గపు ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారని విద్యావేత్తలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్లపై పూర్తిగా శీత కన్నేసింది. తమకు జీతాలు పెంచాల ని, సమాన పనికి సమాన వేతనం మంజూరుచేయాలని, క్రమబద్ధీకరణ జరపాలని వివిధ రూపాల్లో ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, వంటా వార్పు చేపట్టారు. ఎంత చేసినా ఏంచేసినా కాంట్రాక్ట్ లెక్చరర్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. పొరుగునే ఉన్న తెలంగాణా రాష్ట్రంలో బేసిక్ (రూ.38,000) వేతనాన్ని జీతంగా చెల్లిస్తుండగా రాష్ట్రంలో మాత్రం కాంట్రాక్ట్ లెక్చరర్లకు నెలకు రూ.27వేల జీతాన్నే చెల్లిస్తున్నారు. డిగ్రీ లెక్చరర్లకు 30వేలు వరకు లభిస్తుంది. నేను ఉన్నానంటూ.. పాదయాత్రలో జగన్ హామీ ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర సమయంలో అన్నిశాఖల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరిల ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్ల దీనగా థను తెలుసుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘాలు నేరుగా జగన్ దృష్టికి తమ న్యాయపరమైన డిమాండ్ల ను తీసుకెళ్లాయి. మీ సమస్యను నేను విన్నాను .. నేను ఉన్నానంటూ ఆనాడే భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తానని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘ నాయకుల కు జగన్మోహన్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చా రు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పది రోజుల్లోనే జరిగిన మొదటి కేబినేట్ సమావేశంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు శుభం కార్డు పడేలా నిర్ణయం తీసుకోవడంపై సర్వాత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమతో పాటు తమ కుటుంబాల్లో వెలుగులు నింపుతు న్న జగన్మోహన్రెడ్డిని రుణం తీర్చుకోలేమని వారంతా చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకు న్యాయం ఇదే సమయంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు, పార్ట్‌టైం లెక్చరర్లకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల స్థానంలో ఆరేళ్ల కిందట సత్సమాన విద్యార్హతలతో కూడిన గెస్ట్ లెక్చరర్లు నియామకాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. వీరికి ప్రస్తుతం పీరియడ్‌కు రూ.150 చెల్లిస్తూ నెలకు గరిష్టంగా రూ.10 వేలు అందజేస్తున్నారు. పార్ట్‌టైమ్ లెక్చరర్లకు గత ఏడాది దీన్ని పీరియడ్‌కు రూ.375 చెల్లిస్తూ నెలకు రూ.27 వేలు చెల్లిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేసి మీకు న్యాయం చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చినట్లు గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. కాంట్రా క్ట్ లెక్చరర్ల మాదిరి తమకు కూడా జగన్మోహన్రెడ్డి సర్కారు న్యాయం చేస్తుందని వారంతా ఆశగా ఎదురుచేస్తున్నారు. మా జీవితాల్లో వెలుగులు.. దశాబ్దాల నుంచి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు పాఠాలు బోధిస్తున్నారు. రెగ్యులర్ లెక్చరర్‌తో సరిసమానంగా విధులు నిర్వర్తిస్తు కళాశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఎదుగుదల, మెరుగైన ఫలితాలకు కారణం అవుతున్నారు. మమ్మల్ని క్రమబద్ధీకరించాలని దశాబ్దం నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. సీఎం జగన్ పుణ్యమా అని మా జీవితాల్లో వెలుగులు రానున్నాయి. – బొడ్డు ప్రవీణ్‌కుమార్, మ్యాథ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్, జీజేసీ మందస రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఉన్నారు. వారంతా ఆఖరి దశలో ఉన్నారు. దశాబ్దాలుగా ఎన్నో విధాలుగా పోరాటాలు, ధర్నాలు చేశాం. ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో మీ సమస్య నేను విన్నాను.. మీకు నేను ఉన్నాను అంటూ అభయం ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే మొదటి కేబినేట్ భేటీలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం. – కరణం రవీంద్రనాధ్ ఠాగూర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, జీజేసీ బూర్జ అందరికీ న్యాయం చేయాలి.. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మేము ముందునుంచి నమ్ముతున్నాం. ఆయన్ని గెలిపించుకున్నాం. ఆయన ఇచ్చిన మాటకోసం ఎందాకైనా వెళ్తారని అంతా అంటుంటారు. అది మరోసారి రుజువైంది. క్రమబద్ధీకరణకు సర్వీసు, విద్యార్హత తీసుకోవడం మంచిదే. అయితే సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. – హనుమంతు రామ్మోహన్దొర(బుజ్జి), కాంట్రాక్ట్ లెక్చకరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
కాంట్రాక్టు లెక్చరర్లకు తీపి కబురు
వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఏటా 12 నెలలకూ వేతన విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ప్రకటనతో జిల్లాలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలువెల్లివిరిశాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు ఏడాది కాలానికి పూర్తి వేతనం అందుకోవడమనే కలను సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆచరణలోకి వచ్చింది. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత మాట అటుంచితే మిగతా ఉద్యోగుల మాదిరిగా కనీసం ఏడాదిలో 12 నెలల వేతనాన్ని సైతం పొందలేని దుర్భర పరిస్థితులకు ఇక తెరపడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కలను సాకారం చేశారు. కాంట్రాక్టుఅధ్యాపకులకు 12 నెలలకు పూర్తి వేతనాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చిన ఆదేశం అప్పటికప్పుడే జీవో రూపం దాల్చింది. దీంతో ఈ ఉత్తర్వులకోసం 19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు, విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించే విధంగా ఏడాదికి 12 నెలలకు వేతనం చెల్లించే విధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలో 319 మంది కాంట్రాక్టు అధ్యాపకులు విశాఖపట్నం జిల్లాలో 34 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒక ఒకేషనల్ జూనియర్ కాలేజీ ఉన్నాయి. వీటిలో 319 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.27 వేల వేతనం అందుతోంది. ఇకపై రెండు నెలల జీతం కూడా చెల్లించనుండడంతో ఈ కాంట్రాక్టు లెక్చరర్లు ఒక్కొక్కరు ఏటా రూ.54 వేలు అదనంగా పొందనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లుగా కాలయాపన... ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంది ఉద్యోగులు,ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను సావధానంగా ఆలకించారు. అందులో భాగంగానే కాంట్రాక్టు అధ్యాçప³కులకు ఏడాదిలో కేవలం 10 నెలలకే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో ఏప్రిల్, మే నెలలకు వేతనం ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒక్క సంతకంతో వారి తలరాతలు మార్చివేశారు. గత ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో తమకు 12 నెలల కాలానికి వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు అధ్యాపకులు ఎన్నోమార్లు సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసి, వినతి పత్రాలు సమర్పించారు. 10 నెలలు చెల్లిస్తున్న వేతనాన్ని 12 నెలలకు పెంచేందుకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, చేతులు దులుపుకొంది. రాష్ట్ర వ్యాప్తం గా 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబా లకు సంబంధించిన విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాదాపు మూడేళ్లు తాత్సారం చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఎటూ తేల్చలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, శ్రమ కు తగిన వేతనాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాని ని ఆచరణలోకి తెచ్చి విశ్వసనీయత చాటుకున్నారు. వైఎస్ హయాంలో పెరిగిన జీతాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2000లో చేరిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేవారికి రూ.4,500, పట్టణ ప్రాంతాల్లో పని చేసే వారికి రూ.5,500 జీతం ఇచ్చేవారు. 2005లో వైఎస్ సీఎం అయిన తర్వాత అందరికీ రూ. 8,500 జీతం అమలు చేశారు. తర్వాత 2009లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ.18,000 వేలు చేశారు. గత ప్రభుత్వం దానిని రూ. 27 వేలుకు పెంచింది. ఇచ్చిన హామీని నెరవేర్చని ‘బాబు’ ‘తమ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తాం (రెగ్యులరైజ్)’ అంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాక ఈ హామీని ఎన్నికల మేని ఫెస్టోలో కూడా పెట్టారు. అనుకున్నట్లే అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించినా హామీని మాత్రం అమలు చేయలేదు. సాధ్యాసాధ్యాలను పరిశీలించే ందుకని 2016లో జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కమిటీని ఏ ర్పాటు చేశారు. 2017లో మరోసారి ఎమ్మెల్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను చంద్రబాబు ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. సంతోషాన్ని పెంచారు.. కాంట్రాక్టు లెక్చరర్ల వ్యవస్థ ఆరంభమైనప్పట్నుంచి ఏడాదిలో పది నెలలే జీతాలు ఇస్తున్నారు. 12 నెలలూ వేతనాలివ్వాలని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నాం. అయినా ఎవరూ స్పందించలేదు. ఇటీవల ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా ఇబ్బందులు చెప్పుకున్నాం. అధికారంలోకి రాగానే మీ సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాటతప్పకుండా వెంటనే 12 నెలల జీతాలూ ఇచ్చేలా నిర్ణయం తీసుకుని మా అందరిలో ఆయన సంతోషాన్ని పెంచారు. మా ఇతర సమస్యలను కూడా అలాగే పరిష్కరిస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. సీఎంకు కృతజ్ఞతలు. –శర్మ, రాష్ట్ర కార్యదర్శి,ఏపీ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ -
ఆనందమానందమాయే..
రాయవరం (మండపేట): జనహృదయ విజేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కొలువు దీరింది. ఇక అసలుసిసలు ప్రజాప్రభుత్వం వచ్చేసిందన్న విశ్వాసం అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ఇది నిజమే అన్నట్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పండుటాకుల సంక్షేమానికి జగన్ పెద్ద పీట వేసి, వారి పింఛనును పెంచారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీనీ అమలు చేస్తూ వస్తున్న జగన్ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా తీపి కబురు అందించారు. ఇప్పటివరకూ ఏడాది మొత్తం పని చేసినా.. 10 నెలలకు మాత్రమే వారికి వేతనం చెల్లించేవారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ 12 నెలల వేతన విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంట్రాక్టు లెక్చరర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. హామీకే పరిమితమైన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతనాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ ప్రభుత్వం 10 నెలల వేతనాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ నేతలు పలుమార్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 12 నెలల వేతన విధానంతో కూడిన టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బేసిక్‌పై డీఏ ఇవ్వాలన్న వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్ ఎమ్మెల్సీ – ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచారు. మంత్రి ఉపసంఘం నిర్ణయం తెలపకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులకు చివరికి నిరాశే మిగిలింది. హామీ నిలబెట్టుకున్న జననేత నడిసంద్రంలో కొట్టుకుపోతున్న వారికి తెప్ప దొరికినట్లు.. ఎడారిలో ఒయాసిస్సు కనిపించినట్టుగా.. కాంట్రాక్టు లెక్చరర్లకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కనిపించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంలో కాంట్రాక్టు లెక్చరర్లు రాజమహేంద్రవరం, బూరుగుపూడి, కోరుకొండల్లో కలిసి, తమ గోడు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతన విధానాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ మెమో నంబరు 1290413 జారీ చేశారు. ఈ మెమో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రయోజనం కలగనుండగా, జిల్లాలోని ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 498 మందికి మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే వారి సమస్యలను మర్చిపోకుండా ప్రత్యేక మెమో ద్వారా 12 నెలల వేతనాన్ని మంజూరు చేస్తూ (ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకూ.. మార్చి నెల చివరిలో 10 రోజుల బ్రేక్‌తో) వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందని భావించామని, అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదని కాంట్రాక్టు లెక్చరర్లు ఆనందంగా చెబుతున్నారు. మాట తప్పని నైజం తనది మాట తప్పని, మడమ తిప్పని నైజమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు. తండ్రి వైఎస్ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. మాకు మంచి రోజులు వచ్చాయి. భవిష్యత్తులో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాం. – డాక్టర్ వలుపు కనకరాజు, జిల్లా అధ్యక్షుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ సంతోషంగా ఉంది ఇచ్చిన హామీని మర్చిపోకుండా వెంటనే అమలు చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలన్న విషయాన్ని నిజం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయి. – టి.అమర్ కళ్యాణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్, ఏలేశ్వరం -
పార్ట్ టైం లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేయాలి
ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో 1000 మందికిపైగా ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందని.. వారి ఉద్యోగ భద్రతకు ప్రతిపక్ష నేతగా కృషి చేయాలని తాళ్లూరు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నేత టి.లక్ష్మయ్య జగన్‌కు వినతిపత్రం అందించారు. గత 20 సంవత్సరాలుగా సర్వీస్‌లో ఉండి గంటకు వేతనం ప్రాతిపదికన పని చేస్తున్నారన్నారు. వీరిని రెగ్యులర్ చేయటం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించవచ్చని చెప్పారు. ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు చేపట్టాలి ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనశాఖలో ఇంత వరకు ఒక్క ఉద్యాన విస్తరణాధికారి పోస్ట్ నియామకం కూడా జరగలేదని అద్దంకి హార్టికల్చరల్ ఎంపీఈఓ ఎ.స్వర్ణలత జగన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎంపీఈఓలు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు మండలాల పరిశీలకులుగా ఉన్నారన్నారు. 20 వేల నుంచి 25 వేల ఎకరాల భూములను పరిశీలించటం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. ఉద్యాన విస్తరణాధికారి నియామకాలు చేపట్టడం ద్వారా బీఎస్సీ డిప్లమో (హార్టికల్చర్) పూర్తి చేసిన సుమారు వెయ్యి మందికిపైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలొస్తాయని వివరించారు. -
2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
-
2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
ఏకీకృత సర్వీసు పేరిట ఇంటికి పంపాలని సర్కారు నిర్ణయం సాక్షి, అమరావతి: జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఇది 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు మాట. ఆ మాట చెప్పి ఎన్నికల్లో నెగ్గిన చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చుని మూడేళ్లు గడిచిపోయాయి. కొత్తగా ఉద్యోగాల కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకు సైతం ఆయన ఎసరు పెడుతున్నారు. తాజాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 4000 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 1900 మందికి పైగానే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనల పేరిట ప్రభుత్వం వీరిపై వేటు వేయాలని చూస్తోంది. తమను రెగ్యులర్ చేయాలని గత ఏడాదిలో వీరు సమ్మె చేయగా ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, దశల వారీగా రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తామని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తూ హూస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇలా ఇళ్లకు పంపుతారా? ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం, దానిపై కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. ఈ నెల 16లోపు వీటి ముసాయిదాకు తుది రూపు ఇచ్చి అనంతరం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు శాపంగా మారుతోంది. దాదాపు 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడు తమ జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారని వారు ఆక్రోశిస్తున్నారు. 21న గుంటూరులో నిరసన తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని చూడడం దారుణమని ప్రభుత్వ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాంధీ, ఇతర నాయకులు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై ఈ నెల 21న చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపు నిస్తున్నామన్నారు. -
దగా పడ్డారు!
వీరఘట్టం(పాలకొండ): కాంట్రాక్ట్ లెక్చరర్లను కచ్చితంగా క్రమబద్ధీకరిస్తామంటూ 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని మరిచిపోయారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యమబాట పట్టారు. హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో గత ఏడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి మూడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 రోజుల పాటు సమ్మె చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతోకాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. తర్వాత భేటీ అయిన మంత్రి వర్గం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేమని.. అయితే జీతాన్ని మాత్రం 50 శాతం పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ హామీకి రెండు నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు జీవోను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నా యి. సర్కారు అధ్యాపకులతో పాటు 487 మం ది కాంట్రాక్ట్ అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నా రు. ఈ విద్యా సంవత్సరం కూడా జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇంతవర కు ప్రభుత్వం రెన్యూవల్స్ ఇవ్వకపోవడంతో వీరి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మార్చి 31వ తేదీతో గత విద్యా సంవత్సరం ముగిసింది. రెండు నెలల వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో జీతాలు ఇవ్వరు. దీంతో ఉన్న ఉద్యోగం రెన్యువల్ అవ్వక.. జీతం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలా గే వీరితో పాటు జిల్లాలో ఉన్న 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా రెన్యూవల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో కీలకం.. ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనలో కాంట్రాక్టు లెక్చరర్ల కృషి చాలా ఉందని కొన్ని సందర్భాల్లో అధికారులే కితాబు ఇచ్చారు. అయితే శక్తివంచన లేకుండా పనిచేస్తున్న ఒప్పం ద అధ్యాపకులపై ప్రభుత్వం కత్తికట్టిందనే చెప్పాలి. ఇంటర్లో ప్రైవేటు విద్యను అమితంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. సర్కారు విద్య ను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభమైనప్పటికీ...తగినంత మంది అధ్యాపకులు మాత్రం లేదు. దీంతో చాలామంది పిల్లలు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే కారణమనే విమర్శలు వస్తున్నాయి. బుట్టదాఖలైన ఎన్నికల హమీ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ఎన్ని కల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తుంగలో కలిసిపోయాయి. ఇప్పటివరకూ ఎని మిదిసార్లు మంత్రి వర్గం భేటీ అయింది. క్రమబద్ధీకరణకు అడ్డంకిగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అవాంతరాలను తొలగించాలనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించి మూడేళ్లయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. విద్యార్థుల అవస్థలు ప్రైవేటుకు దీటుగా సర్కారు విద్య ఉండాలంటే పోటీ తప్పదు. అయితే ప్రభుత్వం తీరుతో ఒప్పంద అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. తరగతులు ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయిలో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడంతో కళాశాలలు వెలవెలబోతున్నాయి. తక్షణమే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెన్యూవల్ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నకిలీ సర్టిఫికెట్లపై కాంట్రాక్టు లెక్చరర్లు !
► ఇంటర్, డిగ్రీలలో 4,375 మంది... ► సగం మంది నకిలి సర్టిఫికెట్లపైన్నే... ► పాత కరీంనగర్‌లోనే 22 మంది నకిలీలు ► ఈ భాగోతానికి ఆద్యుడు చంద్రబాబు ► లోకాయుక్తలో నిరుద్యోగుల ఫిర్యాదు ► వచ్చే నెల 20న హైదరాబాద్‌లో విచారణ సాక్షి, కరీంనగర్ : ఇంటర్మీడియట్ విద్యావిధానంలో నకిలీ సర్టిఫికెట్లు కలిగిన కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల (పర్మినెంట్)ను రెగ్యులరైజ్ చేసే వ్యవహారం లోకాయిక్తకు చేరింది. ఈ విధానం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టుతుందని ఫిర్యాదు చేశారు. బీహార్, కువ్వంపు, వినాయక మిషన్, ద్రావిడ తదితర యూనివర్శిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు పొందిన పలువురి నియామకం వివాదస్పదం అవుతోంది. నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విధానం అతిదారుణమని నిరుద్యోగులు, అర్హులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఈ విధానంలో అనేకమైన లొసుగులున్నాయని వారంటున్నారు. రిజర్వేషన్లను ఉల్లంఘించడం, అనర్హులను అందలమెక్కించడం రాజ్యాంగ విరుద్దమైన విధానంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అనర్హులతో గెజిటెడ్ పోస్టులలో నింపివేశారంటూ పలువురు లోకాయుక్తను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్లో 3685 లెక్చరర్ల పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 1050 వరకు పోస్టులు పూర్తి స్థాయిలో అనర్హులతో నింపివేయగా, ఒక్క పూర్వ కరీంనగర్ జిల్లాలోనే 22 మంది నకిలీలని తేలడం వివాదస్పదం అవుతోంది. నిబంధనలు ఏమి చెప్తున్నాయి.. ఇంటర్మీడియట్లో ఇతర రాష్ట్రాల నుంచి, కొని తెచ్చుకున్న యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీల డిగ్రీలు వీరికి ఎలాంటి విద్యా ప్రావీణ్యత లేదు. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉంటేనే అదే సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇలాంటి నియమాలు లేని డిగ్రీలు ఉన్నవి. ఒక సబ్జెక్టు లెక్చరర్‌గా నకిలీ (ఫేక్) సర్టిఫికేట్స్‌తో జాయిన్ అయిన అతడే మరో సర్టిఫికెట్ సృష్టించుకోని పోస్టు డిమాండ్ ప్రకారం అందులోకి మారినవారున్నారు. దాదాపు అంటే ఇందులో 80 శాతం మంది ఇలాంటి డిగ్రీలు కలిగిన వారున్నారు. ఇక వీరి నియామకం చాలా హాస్యాస్పదం. ఈ ఫేక్ సర్టిఫెకెట్గాళ్లకు ఎలాంటి రాత పరీక్ష లేదు. 2000 సంవత్సరంలో కాలేజీ వైజ్‌గా పేపర్ ప్రకటన అంటే (ప్రెస్‌నోట్)చిన్నగా ఇచ్చి ఇలాంటి వారిని ప్రిన్సిపల్స్ ద్వారా ఎంపిక చేశారు. రెగ్యులర్ పోస్టులు రాజ్యాంగ బద్ద సంస్థ ఏపీపీఎస్సీ ద్వారా నింపాల్సిన పోస్టులను చాలా ‘ఛీప్’గా వారితో నింపారు. వాస్తవంగా గెజిటెడ్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా నింపాలి. నేడైతే తెలంగాణ టీఎస్పీపీఎస్సీ ద్వారా జాతీయ పేపర్లో నోటిఫికేషన్స్ ఇచ్చి రాత పరీక్ష– ఇంటర్వ్యూల ద్వారా నింపాలి. కానీ అలా కాకుండా ఇలా ఫేక్ సర్టిఫికేట్ వారితో వారి అనుకూలమైన వారితో నింపారు. దశాబ్దకాలంగా ఏపీపీఎస్సీ ని నిర్వీర్యం చేసిన ఆంధ్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల విధానంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే వస్తుంది. అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత లేని వారే కొనసాగుతున్నారు. ఇదిలా వుంటే 2007–08 లో శాసనసభ కమిటి సిఫారసు మేరకు ఆర్జేడీ ద్వారా రోస్టర్వైజుగా నోటిఫికేషన్ వేసి 14 సబ్జెక్టులలో 355 మందిని మాత్రమే రోస్టర్ ద్వారా ఎంపిక చేశామంటున్నారు. కానీ ఇందులో కూడా అనేక మంది ఫేక్ సర్టిఫికేట్లతో చేరినారు. రోస్టర్ విధానంకు వక్రభాష్యం.. 3650 పోస్టులలో కేవలం 355 మందిని 14 సబ్జెక్టులలో అదీ శాసనసభ కమిటీ సిఫారసు మేరకు రోస్టర్ లో ఎంపిక చేశామంటున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గెజిటెడ్ పోస్టులను ఎక్కడి వారే అక్కడ స్థానికులను అందులో ఫేక్ సర్టిఫికేట్ దూర విద్యా విధానం ఇతర రాష్ట్రాల డిగ్రీల వారే ఉన్నారు. ఎందరో నిరుద్యోగులు రెగ్యులర్ యూనివర్సిటీలు, అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలలో చదివిన వారు నిరుద్యోగులుగా ఉన్నారు. వారి నోట్లో మట్టి కోట్టే కనీస విద్యా ప్రావీణ్యత లేనివారు ఎలాంటి పరీక్ష పాస్ కాకుండానే ఇందులో చేరినారు. ఎలా గెజిటెడ్ పోస్టులలో రెగ్యులర్ చేస్తారు? అంటూ నిరుద్యోగులు లోకాయుక్తలో సవాల్ చేశారు. ఇంగ్లీష్ వాటికి అందులో ప్రావీణ్యత ఉండదు గనక కనీస ప్రావీణ్యత లేని వీరికి టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహించి వీరి కొనసాగింపు అపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అన్ని పోస్టులను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా చేయాలంటున్నారు. ఈ వ్యవహారంపై వచ్చే నెల 20న విచారణ జరపనుండగా, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఫేక్ సర్టిఫికేట్లపై తక్షణం సీబీసీఐడీతో దర్యాప్తు జరుపాలని కోరుతున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తేలేనా?
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లలో వేలల్లో ఖాళీ పోస్టులు - కాంట్రాక్టు క్రమబద్ధీకరణ కుదరదన్న హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరేనా? - కాంట్రాక్టు పోస్టుల్లో 5,027 మంది లెక్చరర్లు - అయినా మరో 2350 పోస్టులు ఖాళీయే - కాంట్రాక్టు అంశం తేలకున్నా భర్తీకి వీలుగా 2,650 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు కొట్టివేయడమే కాకుండా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం గందరగోళంలో పడింది. డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తే కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెబుతోంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరదేమోనన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లోనూ ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, వివరణలతో కూడిన మార్గదర్శకాల ప్రకారమే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుదరదని హైకోర్టు స్పష్టం చేయడమే అందుకు కారణం. రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనుకున్నారంటే.. రాష్ట్ర విభజన, ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేందుకు ప్రొహిబిషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ (యాక్టు 2/1994) చట్టాన్ని సవరించింది. ఇందుకు అనుగుణంగా 2016 ఫిబ్రవరి 26న జీవో 16 తెచ్చింది. 2014 జూన్ 2 నాటికి ముందు నుంచీ పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలేజీలవారీగా పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిల్ దాఖలు చేయగా కాంట్రాక్టు క్రమబద్ధీకరణ విషయంలో స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రమబద్ధీకరణ కుదరదంటూ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లినా రెగ్యులరైజేషన్ అనేది సాగదీతే తప్ప సాధ్యం కాదని అధికారులే పేర్కొంటున్నారు. మిగిలిన పోస్టులను భర్తీ చేయొచ్చు కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం ఇప్పట్లో తేలకపోయినా ప్రభుత్వం తలచు కుంటే ఇప్పటికిప్పుడు 2,650 పోస్టులను భర్తీ చేసే వీలుంది. కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని 5,027 పోస్టులు కాకుండా మిగిలిన ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఇదీ కాలేజీలవారీగా పరిస్థితి... - జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 5,905 ఉండగా అందులో 900 పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగిలిన 5,005 ఖాళీల్లో 3,638 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తుండగా మరో 1,367 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. - డిగ్రీ కాలేజీల్లో మొత్తం 2700 పోస్టులు ఉన్నాయి. అందులో 1,600 మంది రెగ్యులర్ అధ్యాపకులు పని చేస్తున్నారు. మరో 924 పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కాంట్రాక్టు అధ్యాపకుల్లో 117 మందికే నిర్ణీత అర్హతలు ఉండగా మిగిలిన 807 పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 176 పోస్టులను కలుపుకొని 983 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు. - పాలిటెక్నిక్ కాలేజీల్లో 465 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉంటే మంజూరైన ఖాళీలు 165 మాత్రమే ఉన్నాయి. అయితే కాలేజీల్లో అవసరాల మేరకు పోస్టులు లేకపోయినా కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టి కొనసాగిస్తున్నారు. మిగతా 300 పోస్టులను సృష్టించి భర్తీ చేయాల్సి ఉంది. -
విద్యాశాఖలో అవినీతిని అరికడతాం: కడియం
హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ శాసనమండలిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లోని 16 మదర్సాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇందుకు సంబంధించి పదిమంది విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇందులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యాశాఖలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిపై విచారణ జరుపుతున్నామని వివరించారు. -
వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ అయ్యేనా!
⇒ రెగ్యులరైజేషన్ కోసం ఆందోళన ఉధృతం చేసిన కాంట్రాక్టు లెక్చరర్లు ⇒ పోస్టుల భర్తీ, క్రమబద్ధీకరణపై ఏం చేయాలన్న ఆలోచనల్లోనే ప్రభుత్వం ⇒ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు పెండింగ్‌లోనే.. సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు ఇప్పట్లో భర్తీ అవుతాయా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఓవైపు కాంట్రాక్టు లెక్చరర్ల నిరవధిక సమ్మె.. మరోవైపు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్.. ఇంకోవైపు పోస్టులను భర్తీ చేయాలంటున్న నిరుద్యోగుల డిమాండ్లతో యూనివర్సిటీల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఒక్కొక్కటి పరస్పరం ఒక్కో సమస్యతో ముడిపడి ఉండటంతో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇద్దామంటే సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్టు లెక్చరర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పైగా రెగ్యులరైజ్ చేస్తామంటూ సీఎం హామీ ఉండటం.. పోనీ అదీ చేద్దామన్నా న్యాయ పరమైన చిక్కులతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుదామంటే నోటిఫికేషన్లు ఇవ్వరా? అంటూ నిరుద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం సతమతం అవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ నియామకాలు ఇప్పట్లో అయ్యేనా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. దశల వారీగానైనా నియామకాలు జరిగేనా? ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు మొత్తంగా 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రాధాన్య క్రమంలో పోస్టులను భర్తీ చేయాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏయే యూనివర్సిటీలో ఏయే సబ్జెక్టుల పోస్టులను మొదట భర్తీ చేయాలి? ఏయే పోస్టులను రెండో దశలో భర్తీ చేయాలి? అన్న అంశాలపై వర్సిటీల వారీగా వివరాలను సేకరించి, అవసరాలను గుర్తించి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. దీంతో మండలి ఆ కసరత్తు పూర్తి చేసి గత నవంబరు నెలలోనే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఇందులో మొదటి దశలో 11 యూనివర్సిటీల్లో 32 ప్రొఫెసర్ పోస్టులను, 109 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 701 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మొత్తంగా 842 అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. అలాగే రెండో దేశలో 586 పోస్టులను భర్తీ చేయాలని, రెండు దశల్లో 1,428 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే అవి నవంబరులో ప్రభుత్వానికి నివేదిక అందజేసే సమయానికి ఉన్న ఖాళీలు మాత్రమే. ఈ రెండు నెలల కాలంలోనూ పలు పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల సమస్య, కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తంటాలు వచ్చి పడ్డాయి. పైగా యూజీసీ నిబంధనలు, యూ నివర్సిటీల పోస్టుల భర్తీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంత సులభం కాదని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రెండు దశల్లో 1,428 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుండగా.. కాంట్రాక్టు లెక్చరర్లే 1,531 మంది వరకు ఉన్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ప్రభుత్వం పడింది. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
► అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మానవహారం నిర్మల్ రూరల్ : ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట లెక్చరర్లతో కలిసి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు లోక లక్ష్మారెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు గండ్రత్ రమేశ్, అయ్యన్నగారి పోశెట్టి తదితరులు మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల బేసిక్ పే, డీఏ, రెగ్యులరైజేషన్ వంటి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు ఎస్ఎన్ రెడ్డి, రాంలక్ష్మణ్, ఏబీవీపీ నాయకులు మెహర్, టీఎన్ ఎస్ నాయకులు శ్రీకాంత్, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్గ రవీందర్, నాయకులు వెంకటేశ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ కాలేజీల బంద్ విజయవంతం
– కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ – బంద్‌లో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ సంఘాలు కర్నూలు (సిటీ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన కాలేజీల బంద్ విజయవంతమైంది. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి నగరంలోని ప్రభుత్వ కాలేజీలను బంద్ చేయించారు. ఈ సందర్బంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందనా్నరు. తమకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తే వారిని పట్టించుకోవడం లేదనా్నరు. ఈనెల చివరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని, అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మతో ప్రభుత్వ జూనియర్ (టౌన్ మోడల్) కాలేజీ నుంచి రాజ్‌విహార్ వరకు శవయాత్ర నిర్వహించారు. పోలీసులు శవయాత్రను అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా కాలేజీల బంద్ చేయించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమాల్లో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఇతర నాయకులు అక్బర్, శివ, రమణ, వినోద్, మోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం
హైదరాబాద్: కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసులను త్వరలో క్రమబద్దీకరిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం కడియం శ్రీహరి మాట్లాడారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించే ప్రయత్నంలో ఉస్మానియా విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం పెండింగ్‌లో పడిందని చెప్పారు. అయినప్పటికీ కోర్టు అననుమతితో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు రూ.18 వేల నుంచి రూ. 27 వేలకు, డిగ్రీ కళాశాల లెక్చరర్లకు రూ. 20 వేల నుంచి రూ. 31 వేలకు పెంచామని వివరించారు. -
పదో పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలి
► కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె ► పలువురి సంఘీభావం పెద్దపల్లిఅర్బన్ : ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కళాశాలల్లో అధ్యాపకులుగా పని చేస్తున్నామని, తమను క్రమబద్ధీకరణ చేయాలని అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను క్రమబద్ధీకరిస్తామని జీవో 16ను విడుదల చేసిందని, ఆ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాలేదని తెలిపారు. క్రమబద్ధీకరణ ఆలస్యమైతే ప్రస్తుతం అమలవుతున్న పదో పీఆర్సీ ప్రకారం బేసిక్ పే, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సునీల్, పవన్ కుమార్, శ్రీనివాస్, విక్రమాదిత్య, శంకరయ్య, రమేశ్, శ్రీధర్‌రావు, సంతోషి, లలిత, రాజ్యలక్ష్మి, కవిత, ప్రశాంతి పాల్గొన్నారు. పలువురి మద్దుతు కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మె శిబిరాన్ని పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు సహకారంతో ప్రభుత్వానికి సమస్యలను విన్నవించి పరిష్కారం కోసం చొరవ తీసుకుంటానన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ బాలసాని లెనిన్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్, నాగరాజు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ‘వెన్నపూస’ మద్దతు
అనంతపురం రూరల్ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మద్దతు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శిబిరాన్ని శనివారం గోపాల్‌రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధాల బాబు పాలనకు కలిసికట్టుగా చమరగీతం పాడుదామని పిలుపు నిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు రామాంజనేయులు, అన్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్ల డిమాండ్లను నెరవేర్చాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రొద్దం : కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు నెల రోజులుగా వారు సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తామంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. వారి సమ్మెకు మద్దతు తెలుపుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను రూలాఫ్ రిజర్వేష¯ŒSలోకి తీసుకొచ్చి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ రద్దుపై పోరాటం చేస్తామన్నారు. తాను సుదీర్ఘకాలం ఉద్యోగ సంఘాల నాయకుడిగా నిస్వార్థంగా పని చేశానన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో పోరాడినట్లు తెలిపారు. 10వ పీఆర్సీ కమిష¯ŒSను సకాలంలో నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రానున్న రోజుల్లో సమస్యలపై పోరాడేందుకు ముందుటానన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాములు, వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గుర్రం గోవర్ధన్, ఉపాధ్యాయులు రామచంద్రరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.