భిక్షాటన చేస్తూ నిరసన
కర్నూలు (న్యూసిటీ): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు సోమవారం మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ముందుగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బ్రహ్మేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదో పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక దీక్షలు 18వ రోజుకు చేరాయి. వీరికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కేసీ రాముడు, అధికార ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య, కో కన్వీనర్ ఎస్‌ఎండీ రఫిక్, రామకృష్ణ, రవూఫ్, షేక్షావళి మద్దతు తెలిపారు. నిరాహారదీక్షలో నాయకులు రంగస్వామి, కె.రామక్రిష్ణ కూర్చున్నారు. లెక్చరర్లు శివరంగ ప్రసాద్, సోమేష్, ఆనంద్, భువనీశ్వరీ, రమేష్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.