భిక్షాటన చేస్తూ నిరసన
Published Thu, Dec 15 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): సగం నెల గడిచినా పింఛన్ డబ్బు అందకపోవడంతో కర్నూలులోని 47వ వార్డుకు చెందిన వృద్ధులు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. స్థానికులు సుమలత, ఫరీదా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పింఛన్ డబ్బులు అందకపోవడంతో జ్వరం వచ్చినా, జబ్బులు వచ్చినా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలకు నోట్ల కట్టలు అందుతుంటే, వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్ కూడా అందకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో శేషమ్మ, పుల్లమ్మ, బిచ్చమ్మ, చిన్నలక్ష్మిదేవి, కరీంబాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement