
ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న కుమారి
కర్నూలు,ప్యాపిలి: ప్రేమ పేరుతో తనను మోసం చేసినవాడిపై చర్యలు తీసుకోవాలని ఓ యువతి గురువారం ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. జలదుర్గం ఎస్‌ఐ శ్రీధర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఊటకొండ గ్రామానికి చెందిన యువతి.. డోన్‌లో టీటీసీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన బంధువు దావీదు ఆటోలో రోజూ కళాశాలకు రాకపోకలు సాగించేది. ఈక్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కాగా ఇటీవల మరో అమ్మాయిని వివాహం చేసుకునేందుకు దావీదు సిద్ధమయ్యాడని తెలుసుకున్న యువతి.. వెళ్లి నిలదీయగా కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని యువతి ధర్నాకు దిగింది. అనంతరం జలదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దావీదుతో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment