
బాధితురాలు చిట్టెమ్మె
కర్నూలు, ఆస్పరి: ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరం తీర్చుకున్నాడు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతడి చేతిలో మోసపోయిన యువతి తనకు న్యాయం చేయాలని శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కైరుప్పల గ్రామానికి చెందిన చిట్టెమ్మ, గోనెగండ్లకు చెందిన గంజెల్లి రంగ దగ్గరి బంధువులు. రెండేళ్ల క్రితం చిట్టెమ్మకు ప్రేమ పేరుతో రంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న చిట్టెమ్మ శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ట్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. విచారణ చేసి, న్యాయం చేస్తామని ఎస్‌ఐ నాగేంద్ర హామీ ఇవ్వడంతో ఆమె వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment