Love failure
-
అమెరికా వెళ్లాక గర్ల్‌ఫ్రెండ్ హ్యాండిచ్చిందని..
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్‌కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్‌కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్‌తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్‌కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్‌బాబు తెలిపారు.భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని.. ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్‌లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది. చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్‌కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..!
ఫిలింనగర్: జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులోని బారాముల్లా ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రేమలో విఫలమై ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బారాముల్లా మాలాపొరా ప్రాంతానికి చెందిన ఇరం నబీడార్ (23) షేక్‌పేట గుల్షన్కాలనీలో ఓ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా గత జనవరి నుంచి పనిచేస్తున్నది. ఈ నెల 8వ తేదీన ఉదయం ఆమె స్నేహితుడు అబ్దుల్ ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటికే ఆమె తల్లి కూడా అబ్దుల్‌కు ఫోన్ చేసి తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావాలని తెలిపింది. ఆందోళన చెందిన అబ్దుల్ సాయంత్రం 5.30 గంటలకు ఇరం ఉంటున్న గదికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదు. దీంతో పక్కనే ఉన్న వాచ్‌మెన్‌ను పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అబ్దుల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అంతకముందు రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లుగా నిర్థారించారు. ప్రేమ విఫలం కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని విమానంలో కశీ్మర్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘లేరని ఊహించుకోవడం చాలా కష్టం’
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్‌టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.సిమీ గరేవాల్ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.They say you have gone ..It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయంరతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)లో ఉంచనున్నారు . -
యువతితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య
దుండిగల్: ఓ యువతితో చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడుతూ తాను చనిపోతున్న దృశ్యాలను చూపిస్తూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామం చెర్రీ తాండాకు చెందిన రాజు కుమారుడు డి.శ్రీకాంత్(22) డి.పోచంపల్లిలోని సర్వే నం.120లో తన అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. అతడు గండిమైసమ్మలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత గ్రామంలో పొలం పనులు ఉండటంతో అన్నా వదినలు 15 రోజుల క్రితమే ఊరికి వెళ్లిపోగా శ్రీకాంత్ ఒక్కడే ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి శ్రీకాంత్ ఫోన్లో ఎవరితోనో గొడవ పడ్డాడు. తన గదిలోకి వెళ్లి తాడుతో రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్ చివరిసారిగా ఓ యువతితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మంచంపై ఫోన్ పెట్టి తాను ఉరి వేసుకుని చనిపోతున్న దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ఆ యువతికి చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ప్రేమ విఫలమైందని.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
మహబూబాబాద్: ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన వినోద్(25) మానుకోట జిల్లా కలెక్టరేట్లోని దివ్యాంగుల విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోలారం గ్రామానికే చెందిన ఓ యువతితో ఆయన ప్రేమలోపడగా, యువతి తండ్రి వినోద్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వినోద్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదుతో యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే
సాక్షి, వరంగల్: ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు. గణేష్‌కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్‌ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్‌కు వేలాడుతూ గణేష్ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్ ఉరి వేసుకున్న చోట ఫోన్‌కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! -
Hyderabad: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..
సాక్షి, మియాపూర్: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని, తన నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామానికి చెందిన చెల్మెడ అఖిల్(28) పటాన్‌చెరులోని శ్రీనగర్‌కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 16న చందానగర్‌లోని ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఎంతకూ అఖిల్ బయటకు రాకపోవడంతో యాజమాన్యం కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో పరిశీలించగా అతడి మెయిల్లో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో ‘ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. గత కొన్ని రోజులుగా తనతో మాట్లాడకుండా తన ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని.. రాసి ఉంది. మృతుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పృథ్వీ షా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్ పడిందా!
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్ పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పృథ్వీ షా నిధి తపాడియా అనే అమ్మాయితో లవ్‌లో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు తమ రిలేషన్‌షిప్‌ను బ్రేక్ చేసుకున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఇటీవలే నిధి తపాడియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకుంది. పంజాబీ నేపథ్యంలో ఉన్న బ్రేకప్ పాటను షేర్ చేసుకుంది. ఆ తర్వాత పృథ్వీ షా, నిధి తపాడియాలు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం బ్రేకప్ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇక నిధి తపాడియా మోడల్, నటిగా రాణిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 108కె ఫాలోవర్లు ఉన్నారు. నిధి తపాడియా స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్. కాగా ఇటీవలే ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్‌గా జరుపుకొన్నారు. పృథ్వీ షా రంజీల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది. ఈ ఇద్దరు ఇలా తమ లవ్‌ను బ్రేక్ చేసుకోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో కూడా సన్నిహితంగా మెలిగాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు పార్టీలకు, పబ్‌లకు వెళ్లారు. పృథ్వీ షా ప్రేమలో ఉన్నాడని తెలిసేలోపే ఇద్దరి మధ్య రిలేషిన్షిప్కు బ్రేక్ పడింది. ఇక పృథ్వీ షా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆడుతున్నాడు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చినప్పటికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు.మూడో టి20కి వరుసగా విఫలం అవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సహా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsxhmemewala🔵 (@harsxhmemewala) చదవండి: బట్లర్‌కు ఇదేమి కొత్త కాదు.. -
ఆమె వల్ల పిచ్చోడినయ్యా.. ప్లీజ్ వారినైనా కాపాడండి: బీటెక్ విద్యార్థి సూసైడ్
సాక్షి, విజయవాడ: సూసైడ్ నోట్ రాసిపెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమైనట్టు తెలుస్తోంది. ప్రేయసి చేసిన మోసం తట్టుకోలేకనే.. పేరెంట్స్‌కు ఏం చెప్పాలో తెలియకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని లేఖలో రాసుకొచ్చాడు. ఆమె టైమ్ పాస్ ప్రేమ వల్ల తాను పిచ్చోడిని అయ్యానని.. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటిస్తూ.. వివాహితుడైన ఓ లెక్చరర్‌తో సంబంధం కొనసాగిస్తున్నదని.. వీడియో కాల్స్‌తో అసభ్యకరంగా వీడియోలు తీసుకున్నదని సలామ్ లేఖలో రాశాడు. అర్ధరాత్రి మరో వ్యక్తితో కూడా ఇలా వీడియో కాల్స్ మాట్లాడుతోందని తెలిపాడు. తన ప్రవర్తనను మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారలేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నించాడు. కుసుమిక చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో రాశాడు. -
రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..
సాక్షి, బెంగళూరు: విధానసౌధలో బాంబు పెట్టామని శుక్రవారం బెదిరింపులకు పాల్పడిన టెక్కీని విధానసౌధ పోలీసులు అరెస్ట్‌చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఫోన్ చేసిన టెక్కీ సౌధలో బాంబు పెట్టామని, త్వరలో పేలిపోతుందని పదే పదే చెప్పాడు. సౌధలో పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి బాంబు కనబడలేదు. ఊరికే బెదిరించడానికి పోన్ చేశాడని అనుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. హెబ్బగోడికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీరు ప్రశాంత్ ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో టెక్కీని అరెస్ట్ చేశారు. కాగా, రెండుసార్లు ప్రేమలో విఫలం చెంది ఆ డిప్రెషన్లో నకిలీ బాంబు కాల్స్ చేసినట్లు చెప్పాడు. అతడు గతంలోనే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలిసింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..) -
Trisha: ప్రేమలో మరోసారి ఫెయిల్ అయ్యిందా?
సాక్షి, చెన్నై: అందమైన రూపం, చక్కని నటనా ప్రతిభ త్రిష సొంతం. అందుకే మోడలింగ్ రంగం నుంచి కేరీర్‌ను ప్రారంభించి మిస్ తమిళనాడు కీరీటాన్ని గెలుచుకుంది. 2002లో కథానాయికగా పరిచయం అయ్యి నేటికీ ఎవర్గ్రీన్ నటిగా వెలిగిపోతోంది. రెండు దశాబ్దాలుగా కథానాయకగా రాణిస్తున్న బహుభాషా నటి బ్యూటీ. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో దాదాపు అగ్ర నటులందరితోనూ నటించింది. లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అయితే వ్యక్తిగతంగా 40వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమెకు ప్రేమ, పెళ్లి వంటి అంశాలు ఇంకా సెట్ కాలేదనే చెప్పాలి. ఈ వ్యవహారంపై ఇంతకు ముందు నిత్యం వార్తల్లో నానింది. అప్పట్లో ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమ వ్యవహారం నడిచిందని, ఆ తర్వాత ఆ ప్రేమ విఫలం అయిందని టాక్. ఆ తర్వాత వరుణ్ మణియన్ అనే సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ పెళ్లి పీటలు ఎక్కలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే అంశాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ సంచలన నటి ఇటీవల తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన ఒక విషయం సంచలనంగా మారింది. అదేంటో చూద్దాం ‘వక్ర బుద్ధి కలిగిన నీలాంటి వాడితో మాట్లాడకుండటమే ఉత్తమం’అని పేర్కొంది. దీంతో అలా పేర్కొనడానికి కారణం ఏమిటి? ఎవరిని అంతగా ద్వేషిస్తోంది. ప్రేమలో మూడోసారి ఫెయిల్ అయ్యిందా? ఇలాంటి ప్రశ్నలు ఇటు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి: సండే సినిమా: వెండితెరపై జై జవాన్ -
ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే..
సాక్షి, మామిడికుదురు (తూర్పుగోదావరి): వారిద్దరిదీ ఒకే గ్రామం. ఒకే కులం. ఐదేళ్ల నుంచి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు. చివరకు అతడిని పెళ్లి చేసుకునేందుకు యువతి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు శుక్రవారం వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలో దూకి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పూర్వాపరాలివీ.. మొగలికుదురు గ్రామానికి చెందిన బిళ్ల సూర్యప్రతాప్ (22) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన గ్రామానికే చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. ప్రతాప్‌ను పెళ్లి చేసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా నగరం పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు కూడా చేశారు. సూర్యప్రతాప్తో తన కుమార్తె చేసిన చాటింగ్, అతడితో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయాలని, తన కుమార్తె జోలికి రాకుండా చూడాలని కోరాడు. దీనిపై గురువారం రాత్రి పోలీసులు ప్రతాప్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అతడి సెల్‌ఫోన్ తీసుకుని ఫొటోలు, మెసేజ్‌లు డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువతి ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన చావుకు ఆమె, ఆమె తండ్రి కారణమని సెల్లో మెసేజ్ చేసిన సూర్యప్రతాప్ పాశర్లపూడి బ్రిడ్జిపై సెల్‌ఫోన్ పెట్టి వైనతేయ గోదావరి నదిలో దూకేశాడు. అతడి ఆచూకీ కోసం నగరం ఎస్సై షేక్ జానీబాషా ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద కారణంగా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యప్రతాప్ ఆచూకీ తెలియరాలేదు. యువకుడి తండ్రి బిళ్ల గణపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Tirupati: ప్రయాణికులకు పది ప్రత్యేక రైళ్లు) -
లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు..
తగరపువలస (భీమిలి) విశాఖపట్నం: ప్రేమ విఫలమై భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కొయ్య లావణ్య(16) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొయ్య లావణ్య, ఇదే గ్రామానికి చెందిన మణి కుమార్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్కూల్ కరస్పాండెంట్ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి.. ఈ క్రమంలో వివాహం చేసుకోమని మణికుమార్‌ను లావణ్య కోరగా నిరాకరించాడని ఒక కథనం వినిపిస్తుండగా.., మణికుమార్ కుటుంబ సభ్యులు లావణ్య కుటుంబ సభ్యులను కలిసి వివాహం గురించి మాట్లాడగా వారు నిరాకరించారని మరో కథనం వినిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న లావణ్యను సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు నిర్ధారించారు. మధ్యాహ్నం గ్రామంలో జరిగిన రజస్వల ఫంక్షన్లో ఉత్సాహంగా పాల్గొన్న లావణ్య ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభిన్న కథనాలపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి!
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్‌తో కాల్చి, ఆపై సురేష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్‌రెడ్డి బిహార్‌లో పిస్టల్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం మంగళవారం అక్కడికి వెళ్లారు. సురేష్‌రెడ్డి సెల్ఫోన్లను సీజ్చేసిన పోలీసులు అతడు మాట్లాడిన, చాటింగ్ చేసిన వారి వివరాలు, మెస్సేజ్‌లు సేకరించి ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. అతడి స్నేహితుల వివరాలు సేకరించి పిస్టల్‌పై ఆరాతీస్తున్నారు. çఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న అతడు గత ఏడాది డిసెంబర్లో సుమారు 20 రోజులు బిహార్‌లో ఉన్నాడని, ఆ సమయంలోనే పిస్టల్ కొనుగోలు చేశాడని గుర్తించినట్లు తెలిసింది. సాంకేతికతను వినియోగించి ఎవరివద్ద కొనుగోలు చేశాడో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం బిహార్ వెళ్లారు. పిస్టల్ అమ్మిన వ్యక్తిని పట్టుకుని నెల్లూరు తీసుకొస్తారని తెలిసింది. కొందరు పోలీసులు ముంబై కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. ఐదోసారి తూటా పేలి.. సురేష్‌రెడ్డి వినియోగించిన పిస్టల్ 7.5 ఎంఎంగా గుర్తించారు. మ్యాగజిన్ సామర్థ్యం 9 బుల్లెట్లు. దా న్లో ఏడు బుల్లెట్లు మాత్రమే ఉంచి నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కావ్యారెడ్డిపై మొదటిసారి కాల్పులు జరపగా ఆమె తప్పించుకుందని, మరో మూడుసార్లు కాల్చినా తూటాలు పేలలేదని, అయిదోసారి కాల్చడంతో తూటాపేలి కావ్యారెడ్డి తలలోకి దూసుకూళ్లిందని భావిస్తున్నారు. మిస్సయిన, పేలని తూటాలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సురేష్‌రెడ్డి ఆరో రౌండ్ కాల్చుకుని మృతిచెందాడు. ఏడో బుల్లెట్ పిస్టల్‌లోనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్లపై నంబర్లను బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం.. కావ్యారెడ్డి, సురేష్‌రెడ్డి మృతదేహాలకు నెల్లూరు జీజీహెచ్‌లో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు శవపంచనామా, వైద్యులు పోస్టుమార్టం చేశారు. తాటిపర్తిలో రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Nellore: పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి.. ఒకప్పుడు వర్గ రాజకీయ హత్యలతో అట్టుడికిన గ్రామం. ఆ ఊరంతా వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. నేటితరం యువత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. కాలంతో పాటు ఆ ఊరు రాజకీయ వైషమ్యాలకు దూరమైంది. ఒకరికొకరు కలుపుగోలుగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటున్న ఆ పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ఇష్టపడిన యువతి పెళ్లికి నిరాకరించిందని తుపాకీతో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. పొదలకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయం, పాడి–పంటలతో అలరారుతున్న ఆ పల్లెలో ప్రేమోన్మాద తూటాలు పేలాయి. ఆ ఊరు ఉలిక్కిపడింది. విషయం తెలిసి విషాదంలో మునిగిపోయింది. తాను మనసు పడిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు తుపాకీతో ఆమెను కాల్చి, తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నా డు. మండలంలోని తాటిపర్తిలో దిగువ మధ్య తరగతికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ రెండు కుటుంబాలు ఉన్నంతలో ఉన్నతంగా జీవనం సాగి స్తున్నారు. గౌరవంగా జీవిస్తున్న ఆ కుటుంబాలు విధి ఆడిన వింత నాటకంలో విషాదంలో మునిగిపోయా యి. హతురాలు కావ్య, ఆత్మహత్య చేసుకున్న సురేష్‌రెడ్డి కుటుంబాల నేప«థ్యాలు ఇంచుమించుగా ఒకటే. ఉన్నతంగా ఎదగాలని ఉన్నత చదువులు చదు వుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుండగానే.. హతురాలు పలుకూరు కావ్య తండ్రి వెంకటనారపరెడ్డి మూడెకరాల రైతు. ఆయనకు ఇద్దరమ్మాయిలు. ఉన్నంతలో ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాడు. కావ్య పెద్దామ్మాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడాదిన్నర కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. చిన్నమ్మాయి కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుని చదువుతోంది. కావ్య సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతలోనే ప్రేమోన్మాదానికి బలైపోయింది. పెళ్లి ఆశ నెరవేరలేదు.. మాలపాటి సురేష్‌రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి సైతం సన్నకారు రైతు. వ్యవసాయంతో పాటు వరిగడ్డి వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనకు కొడుకు, కుమార్తె. ఆడపిల్లకు పెళ్లి చేశాడు. సురేష్‌రెడ్డి పెద్దవాడు కావడంతో బాగా చదివించాడు. ఐదేళ్ల కిందటే సురేష్‌రెడ్డి బెంగళూరులో సాప్‌్టవేర్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డాడు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఆమెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాదఛాయలు కాల్పుల ఘటనతో గ్రామం ఉలిక్కి పడింది. విష యం తెలియడంతో విషాదఛాయలు అలముకున్నా యి. ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి, యువ కుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో బంధువర్గాలు తల్లిడిల్లిపోతున్నాయి. పోలీసుల సమగ్ర దర్యాప్తు కాల్పుల ఘటనపై పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై కరిముల్లా దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మాట్లాడు తూ కావ్యతో సురేష్‌రెడ్డి చాటింగ్ చేశాడని, అయితే ఆమె మాత్రం తిరిగి చాటింగ్ చేయలేదని తెలిపారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వాధినం చేసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పిస్టల్ చుట్టూ క్రైమ్ స్టోరీ నడుస్తోంది. సురేష్‌రెడ్డి పిస్టల్ ఎక్కడ సంపాదించాడు? ఎవరి వద్ద పిస్టల్ కొనుగోలు చేశాడనే కోణంలో ప్రధానంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్‌పై ‘మేడిన్ యూఎస్ఏ’ ఉంది. కావ్య అంటే ఇష్టంతో.. కావ్య, సురేష్రెడ్డిలది ఇద్దరిది ఒకే ఊరు. కావ్య అంటే ఇష్టం పెంచుకున్న సురేష్‌రెడ్డి ఏడాది కాలంగా తల్లిదండ్రుల ద్వారా ఆమెను తనకిచ్చి వివాహం జరిపించాల్సిందిగా కోరుతున్నాడు. ఇదే విషయాన్ని కావ్య కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే కావ్య తల్లిదండ్రులు ఈ వివాహానికి సమ్మతించలేదు. బహుశా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయస్సు తేడా ఉండడంతో ఒప్పుకోలేదని గ్రామస్తుల అభిప్రాయం. కానీ సురే‹Ù రెడ్డి పట్టు వదలకుండా కావ్యతోనే తన పెళ్లి జరగాలని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒంటిరి తనాన్ని అలవాటు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి తెగబడినట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఘోరం ఊహించలేదు ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. మా గ్రామంలో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. అన్యాయంగా నా మనమరాలిని హత్య చేశాడు. ఏ పాపం తెలియని అమ్మాయి బలికావాల్సి వచ్చింది. – పలుకూరు మస్తాన్‌రెడ్డి, కావ్య తాత పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు మా అబ్బాయి సురేష్‌రెడ్డికి పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు. మా దురదృష్టం కొద్ది ఈ ఘటన జరిగింది. ఇంట్లో మా వాడు బాగానే ఉండేవాడు. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియడం లేదు. మాకు పుత్రశోకం మిగిల్చి వెళ్లాడు. – మాలపాటి పరమేశ్వరి, సురేష్‌రెడ్డి తల్లి -
ప్రేమను నిరాకరించింది.. ఇనుప కడ్డీకి తాడుతో..
సాక్షి,ఉరవకొండ( అనంతపురం): యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన షణ్ముఖ (25).. నాలుగేళ్లుగా స్థానిక ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు. ఆ సమయంలో ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురైన షణ్ముఖ... నిర్మాణంలో ఉన్న షాదీఖానాలో ఇనుప కడ్డీకి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ రమేష్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెళ్లై ఏడాది కూడా అవ్వలేదు.. వివాహిత ఆత్మహత్య -
నా చావుకు ఎవరూ కారణం కాదు..!
సాక్షి, చందంపేట(నల్లగొండ): ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని గువ్వలగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావత్ భూర్య, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాల్గో కుమారుడు సపావత్ నరేశ్(32) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ పూర్తిచేశాడు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన నరేశ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గాని శనివారం తెల్లవారుజామున నరేశ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో నరేశ్‌కు ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ రాసిన సూసైడ్ నోట్ లభించిందని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు.. -
జిమ్ ట్రైనర్ ప్రేమ విఫలం.. పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా..
బనశంకరి: ప్రేమ ఫలించలేదని జిమ్ శిక్షకుడు వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారప్పలేఔట్ కు చెందిన కార్తీక్ (29) అనే యువకుడు జిమ్ ట్రైనర్‌గా ఉంటున్నాడు. ఇతను గత మూడేళ్లు నుంచి ఓ యువతి ని ప్రేమిస్తున్నాడు. కానీ ఇటీవల యువతి దూరం కావడంతో కార్తీక్ కుంగిపోయినట్లు తెలిసింది. ఈ తరుణంలో అతనికి తల్లిదండ్రులు ఒక సంబంధం చూశారు. ఆదివారం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. కానీ శనివారం రాత్రి ఇంట్లో తన ప్రేమ వైఫల్యం గురించి సెల్ఫీ వీడియో తీసుకుని షీట్ హ్యాంగర్ కు ఉరివేసుకున్నాడు. స్థానిక పోలీసులు కార్తీక్ మొబైల్‌ను స్వా«దీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. (చదవండి: రిక్షా కార్మికుడిని రూ.3 కోట్లు టాక్స్ కట్టాలన్న ఐటీ అధికారులు) -
లవ్ ఫెయిల్యూర్: రన్నింగ్ బస్సు దిగి.. హస్సేన్సాగర్లో దూకి..
సాక్షి, రాంగోపాల్‌పేట్: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు హుటాహుటిన రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన 23 సంవత్సరాల ఓ యువకుడు మౌలాలిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ యువకుడిని మందలించారు. చదవండి: మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ.. దీంతో తీవ్ర భయాందోళనకు గురై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో వెళుతూ రన్నింగ్ బస్సులో నుంచి కిందకు దిగాడు. వెంటనే అంతే వేగంగా వెళ్లి హుస్సేన్‌సాగర్‌లోకి దూకాడు. వెంటనే అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నీళ్లలోకి దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులను పిలిపించిన ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారికి అప్పగించారు .ఆ యువకుడిని కాపాడిన లేక్ కానిస్టేబుళ్లు అభిలాష్, రాజులను ఇన్స్పెక్టర్ అభినందించారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత -
'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
అమీర్‌పేట: ‘నిన్ను మనసారా ప్రేమించాను. నీవు నాకు దూరమవుతున్నావన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నీవు లేకుండా నేను బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నీరజ్‌కుమార్ కుటుంబం మధురానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరి కుమారుడు కె.విశాల్ (26)ఓ యువతిని ప్రేమిచాడు. చదవండి: సెంట్రల్ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక.. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ఇటీవలే యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే తన గదిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో తండ్రి నీరజ్ వెళ్లి విశాల్‌ను లేపేందుకు ప్రయతి్నంచాడు. ఎలాంటి చలనం లేకపోడంతో వెంటనే అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విశాల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. సెనైడ్ ఎలా వచ్చింది? సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. తాను అమితంగా ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 40 నిమిషాల వీడియో తీసుకున్నాడు. గదిలోని ఓ సీసాలో సెనైడ్ ఉంది. దాన్ని ముట్టుకోవద్దని రాసిపెట్టి బెడ్ కింద ఉంచిన కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్ సెనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే విశాల్‌కు సెనైడ్ ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి -
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుణదల (విజయవాడ తూర్పు) : ప్రేమ వివాహం జరగకపోగా ప్రియుడు తన నుంచి దూరమయ్యాడనే మనస్తాపంతో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణాజిల్లా తిరువూరు మండలం, రాజుగూడెం గ్రామానికి చెందిన చెరుకూరి సింధు (29) గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఉంటోంది. సీఏ చదువుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ప్రసేన్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. కానీ, ప్రసేన్ కుటుంబ సభ్యులు వారిద్దరి ప్రేమ వివాహానికి నిరాకరించారు. సింధు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు.. సింధు, ప్రసేన్ మధ్య కూడా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. దీంతో సింధు విజయవాడ గుణదల ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. అటు సొంత కుటుంబ సభ్యులు, ఇటు ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో.. జీవితంపై విరక్తి చెంది తాను ఉంటున్న గదిలోనే ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజులుగా సింధు ఉన్న గది తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రులు విజయవాడ చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రసేనే పొట్టన పెట్టుకున్నాడు తన కూతురు ఉరి వేసుకుని చనిపోయేంత పిరికి వ్యక్తి కాదని.. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రసేనే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని సింధు తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయనన్నారు. సింధు మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. సింధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే తాను ఉరికి వేలాడకుండా నేలపై ఎలా పడిఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, సింధు తలభాగం నుంచి రక్తం కారడంతో ప్రసేన్ హత్యచేసి ఉంటాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రేమించిన యువతితో వరుస కాదనడంతో.. ఇంటి నుంచి వెళ్లి..
సాక్షి, చిత్తూరు: మండలంలోని గుండ్లూరు గ్రామం కొర్నమిట్టపల్లె చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబసభ్యుల కథనం మేరకు... కొర్నమిట్టపల్లెకు చెందిన సుబ్బరాజ కుమారుడు కే.అశోక్ బాబు(23) తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో తన సమీప బంధువుల అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆ అమ్మాయితో నీకు వరుసలేదని, వద్దని మందలించారు. దీంతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొర్లకుంట గ్రామం టి.మాదిగపల్లె సమీపంలోని అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు అశోక్‌బాబుగా గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఆత్మహత్యకు పాల్పడిందని తమ కుమారుడేనని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సుబ్బరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మెట్రో స్టేషన్ పిల్లర్ పై నుంచి దూకే ప్రయత్నం
-
దారుణం: ప్రేమించిన యువతి దక్కలేదని..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హమిర్పూర్ జిల్లా జాఖరీ గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసాద్ ప్రజాపతి అనే యువకుడు రాజస్థాన్‌లోని అల్వాల్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో, తను ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే, లక్ష్మీ ప్రసాద్ ప్రేమను అతని, తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. తాను ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుందనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నేరుగా వ్యవసాయ భూమికి చేరుకున్నాడు. అక్కడ, తీవ్ర ఆవేదనకు లోనై ఏడుస్తూ.. సెల్ఫీవీడియో తీసి బంధువులకు, తన మిత్రులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా ఉన్న సదరు యువకుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలం: లవర్‌తో సెల్ఫోన్లో మాట్లాడుతూనే..
సిద్దిపేటకమాన్: ప్రేమ విఫలమై యవకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం వెలుగు చూసింది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న మనోజ్‌కుమార్ (33) పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మనోజ్‌కుమార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దలు ఇరువురికి రాజీ కుదుర్చారు. ఈ క్రమంలో మనోజ్‌కుమార్ బుధవారం రాత్రి అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. సర్జికల్ బ్లేడ్‌తో చేతి మణికట్టు, ఆపై గొంతు భాగంలో కొసుకున్నాడు. వెంటనే అమ్మాయి మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపింది. దీంతో మనోజ్ కుటుంబీకులు హుటాహుటిన అతడి గదికి వెళ్లి చూడగా రక్తం మడుగులో పడి ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మనోజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమ విఫలం.. వైద్య విద్యార్థి బలవన్మరణం
సిద్దిపేట: ‘ఒక అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాను.. కొద్దిరోజులుగా ఆమె నా ప్రేమను నిరాకరిస్తోంది. అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మెగావత్ సంతోష్ కుమార్ (21) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్నాడు. మూడ్రోజుల క్రితం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా ఒక పరీక్ష పూర్తయింది. గురువారం మైక్రో బయాలజీ పరీక్ష రాసేందుకు ఉదయం 9 గంటలకు మిత్రులంతా వెళ్లారు. దీంతో గదిలో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయాల్సిన సంతోష్ ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటిమిత్రులు సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెళ్లి చూడగా సంతోష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, రూరల్ ఎస్ఐ శంకర్ ఘటనా స్థలికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు బోరున విలపించారు. అనంతరం ఘటనపై సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య -
ఆమె కోసం అన్నదమ్ముల పచ్చబొట్టు, చివరికి పట్టాల పైకి
జైపూర్: ఇద్దరు అన్మదమ్ములు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఆమెతోనే జీవితం అనుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని బుంది జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం..కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. అయితే ఒకరికి తెలయకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ప్రేయసి ఆశా పేరును ఇద్దరు అన్నదమ్ములు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తర్వాత గానీ తెలియలేదు ఇద్దరూ ప్రేమిస్తుంది ఒకరినే అని. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్ ట్రాక్ నడిపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత యువతి కనిపించకుండా పోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని చెబుతూ ఓ వీడియోను రికార్డ్ చేశారు. అంతేకాకుండా తాము ఇద్దరం ప్రేమిస్తున్న యువతికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత నిర్ణయంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు యువకులు వీడియోలో పేర్కొన్నారు. మా చావుకు ఎవరినీ నిందించవద్దని కోరారు. చదవండి : (మహిళను చంపి, ముక్కలుగా నరికి.. ఆపై) (73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా) -
ప్రేమ విఫలం, ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
కడప అర్బన్: కడప నగరంలోని ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న శ్రీలేఖ అలియాస్ ప్రసాద్ (18) అనే ట్రాన్స్‌జెండర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. సహచరుల, స్థానికుల సమాచారం మేరకు.. ట్రాన్స్‌జెండర్, ఓ యువకుడిని ప్రేమించింది. తనకు యువకుడి ప్రేమ దక్కలేదని, మానసిక వేదనకు గురై ఈనెల 4వ తేదీ రాత్రి పురుగుల మందు సేవించింది. స్థానికులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు. -
ప్రేమ విఫలం: క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే!
గుంటూరు ఈస్ట్: ప్రేమ విఫలమైందంటూ అరండల్‌పేట బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేస్తున్న విద్యార్థిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని ప్రాణాలు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అరండల్‌పేట ఎస్హెచ్ఓ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి నికి చెందిన ఓ యువకుడు గుంటూరులో సీఏ ఇంటర్ పూర్తి చేశాడు. విశాఖపట్నంలోనే ఓ సంస్థలో ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరులో సీఏ చదివే సమయంలో తోటి విద్యార్థినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సీఏ పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట సదరు విద్యార్థి గుంటూరు వచ్చాడు. అయితే శుక్రవారం ఉదయం హోం మంత్రి రూట్ బందోబస్తు నిమిత్తం అరండల్‌పేట ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా ఆ విద్యార్థి ఫ్లైఓవర్‌పై వేచి చూస్తూ రైలు వచ్చే సమయానికి కిందకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ట్రాఫిక్ హోంగార్డు శేఖర్, కానిస్టేబుల్ శివనాగేశ్వరావు అతనిని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో విద్యార్థి తప్పించుకుని కిందికి దూకేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న ఏఏస్ఐ రాధ, హెడ్ కానిస్టేబుల్ శేఖర్‌బాబు విద్యార్థిని నిలువరించి అరండల్‌పేట పోలీస్టేషన్‌కు తరలించారు. ఎస్హెచ్ఓ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సమయస్ఫూర్తిని ప్రదర్శించి విద్యార్థి జీవితాన్ని కాపాడిన సిబ్బందిని తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. -
పెళ్లికి ప్రియుడు ఒప్పుకోలేదని..
పటాన్చెరు టౌన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి విషయం వచ్చేసరికి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని ప్రియుడు చెప్పడంతో మనస్తాపం చెంది న ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధి లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి కి ఇద్దరు కూతుర్లు. రెండో కూతురు శ్రావణి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటుంది. శ్రావణి అదే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అలియాస్ విక్కీ ప్రేమించుకున్నారు. శ్రావణి మామ రాజశేఖర్‌రెడ్డి.. వెంకట్రామిరెడ్డితో పెళ్లి గు రించి మాట్లాడగా, శ్రావణి తో పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే శ్రావణి వెంటపడొద్దని మందలించడంతో, అప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి శ్రావణిని కలవలేదు. గతేడాది శ్రావణి మామ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందడంతో మళ్లీ వెంకట్రామిరెడ్డి శ్రావణిని ప్రేమిస్తున్నానని వెంటపడటం ప్రారంభించాడు. ఇది గమనించిన శ్రావణి తల్లి విజయలక్ష్మి తన కూతురుతో మాట్లాడొద్దని విక్కీని మందలించింది. ఈ క్రమంలో ఈనెల 10న విజయలక్ష్మి పెద్దనాన్న చనిపోవడంతో కుటుంబసభ్యుల తో కలసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం శ్రావణి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. సాయంత్రం కుటుంబసభ్యులు కార్యక్రమం ముగించుకొని ఇం టికి వచ్చేసరికి శ్రావణి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే తన కూతురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. -
ప్రేమకు గుర్తుగా పుస్తకం రాసినా పట్టించుకోలేదని..
సాక్షి, సూర్యాపేట: ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తర్వాత సదరు యువకుడు అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. వివరాలు.. సూర్యాపేటకు చెందిన ఇరుగు రామన్ హైదరాబాద్‌లో మల్టీ మీడియా రంగంలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మునగాల మండలానికి చెందిన అనూష అనే యువతితో పరిచయం ఏర్పడింది. 10 సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కాగా అనూష సూర్యపేట జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చిన తరువాత అనూష తనను పట్టించుకోవడం లేదని రామన్ మనస్తాపానికి గురయ్యాడు. అయితే అనూషతో 10 సంవత్సరాల ప్రేమకు గుర్తుగా ఒక పుస్తకాన్ని రాసి దానిని తన మిత్రులకు పంచిపెట్టాడు. పుస్తకాలు పంచి పెట్టి, కాల్ రికార్డింగ్‌లు వెబ్ సైట్ లో పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని అనూష రామన్‌పై చివ్వేంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రామన్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అయితే వెంటనే స్పందించిన పట్టణ పోలీసులు రామన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నైన్త్లోనే ప్రేమలో పడ్డ టాప్ హీరోయిన్!
తొలి ముద్దు, తొలి ప్రేమ ఎప్పుడు గుర్తు చేసుకున్నా తెలియని అనుభూతికి లోనవడం సహజం. సామాన్యులకు అయినా సెలబ్రిటీలకైనా ఆ ఫీలింగ్ ఒకేలా ఉంటుంది. ఇటీవల ఓ సందర్భంలో తాప్సీ ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తాప్సీ ప్రేమలో పడ్డారట. వన్ ఫైన్ డే బాయ్‌ఫ్రెండ్ దగ్గర ఆ విషయం చెప్పారట కూడా. మొదట ఆ అబ్బాయి తనకు ఇష్టమే అని చెప్పి, తాప్సీని మురిపించాడు. కొన్నాళ్లకు నేను బాగా చదువుకోవా లని చెప్పి తాప్సీకి దూరంగా ఉండ టం మొదలుపెట్టాడు. ఈ బ్యూటీ ఫస్ట్ క్రష్ అలా మటాష్ అయింది. ఆ అబ్బాయిని మిస్సయిన తాప్సీ ఫోన్బూత్కు వెళ్లి అతనికి కాల్ చేసి ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. టీనేజ్‌లో ఏర్పడిన ఆ ప్రేమ గురించి ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తుందని తాప్సీ అన్నారు. -
ఫ్లైఓవర్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
సాక్షి, చిలకలగూడ : ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ సమాచారం మేరకు... సీతాఫల్‌మండీ జోషి కంపౌండ్ ప్రాంతానికి చెందిన పాండుకు నలుగురు కుమార్తెలు. రెండవ కుమార్తె పూజిత (19) ఇంటరీ్మడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి మూడేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని పూజిత తరుచు ఒత్తిడి తెచ్చేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సీతాఫల్‌మండీ ఫ్లైఓవర్ పైకి రావాలని చెప్పడంతో ప్రదీప్ మరో మిత్రునితో కలిసి వచ్చాడు. పూజిత, ప్రదీప్‌లు కొంతసేపు మాట్లాడుకున్నారు. మరోమారు వీరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. మరి మరికొన్నాళ్లు ఆగితే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో క్షణికావేశానికిలోనైన పూజిత పరిగెత్తుకుంటూ కొంతదూరం వెళ్లి ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకింది. రాత్రి 11 గంటల సమయంలో పెద్దశబ్ధం రాడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా ఫ్లైఓవర్ కింద రక్తపు మడుగులో యువతి పడుంది. భయకంపితులైన ప్రదీప్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పూజితను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే పూజిత మృతి చెందింది. పూజిత తండ్రి పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఉస్మానియా మార్చురీలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పూజిత మృతికి కారణమైన ప్రదీప్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
ఒకేసారి చనిపోవాలనుకున్నా..!
పేదింట పుట్టినా ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ తనకంటూ గుర్తింపు సాధించుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘రోజూ చనిపోవడం కంటే ఒకసారే చనిపోవాలనుకున్నాను’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడం హృదయాలను కలిచివేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ సమాచారం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన వంకబోయిన గాలయ్య, నాగమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు వంకరబోయిన శ్రీనివాసులు(27) గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసే అన్న కృష్ణమూర్తితో కలిసి సుదర్శన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం 8.30 గంటలకు తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే బెడ్రూమ్ గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. (ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!) ఎంత పిలిచినా తమ్ముడు శ్రీనివాసులు పలుకలేదు. దీంతో తలుపు విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కాల్ చేయగా 108 వచ్చి చూసి శ్రీనివాసులు అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్‌తో పాటు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు ‘తన చావుకు ఎవరు కారణం కాదని... బతకాలని లేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... రోజు చావడం కంటే ఒకే సారి చస్తున్నా’నని సూసైడ్ నోట్లో రాశాడు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమ విఫలమే కారణమా? మేస్త్రీ పని చేసే గాలయ్య, కూలీ పనులు చేసే నాగమ్మల చిన్న కొడుకు శ్రీనివాసులు ఉన్నత చదువు చదివి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతిని ప్రేమించగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు సోదరుడు కృష్ణమూర్తి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆరు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. లాక్డౌన్ సమయంలో ఊరికి వెళ్లిన సోదరుడు ఇంటి నుంచే కొద్ది రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేశారని తెలిపారు. యువతి కుటంబ సభ్యులతో తాను వెళ్లి మాట్లాడతానని చెప్పినా తన తమ్ముడు శ్రీనివాసులు అంగీకరించలేదన్నారు. మూడు నెలల క్రితం నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుదర్శన్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని మరువలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై న్యూస్ చానల్ ఉద్యోగిని ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: ప్రేమ విఫలమై మానసిక ఆందోళనకు గురైన ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ సమాచారం మేరకు... సిద్దిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు పి.కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్ చానల్లో పనిచేస్తున్నది. కళ్యాణి అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడిని ప్రేమించిందని పోలీసులు చెప్పారు. రెండు సంవత్సరాలుగా వీరి ప్రేమ కొనసాగుతున్నది. అయితే ఇటీవల కళ్యాణి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని కోరింది. ఆ యుకువడు నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తన సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఉంటున్నారు. ఓ బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం విధులకు వెళ్లాడు. రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగుచూసింది. వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుమార్తె మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశ్ వివరించారు. -
చనిపోయేముందు టిక్‌టాక్‌లో వీడియో తీసి..
సాక్షి, కామారెడ్డి : ప్రేమ విఫలమైందనే కారణంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కామారెడ్డి పట్టణం అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. అశోక్ నగర్ కాలనీకి చెందిన సంతోష్(23) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్న సంతోష్, సదరు యువతి ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. కాగా సంతోష్ చనిపోయే అరగంట ముందు టిక్‌టాక్‌లో వీడియో తీశాడు. దానిని అప్డేట్ చేసి తన స్టేటస్‌గా పెట్టుకున్నాడు. సంతోష్ స్వస్థలం కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి కాగా కొంతకాలంగా తల్లితో కలిసి అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.గతంలో సంతోష్ తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, తాజా ఘటనతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది. -
ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి..
మహబూబ్‌నగ,బల్మూర్ (అచ్చంపేట): ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని గర్భం చేసి.. ఇప్పుడు కులం పేరుతో అన్యాయం చేస్తున్నాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి బుధవారం దీక్ష చేపట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన రోహిణి(25), అదే గ్రామానికి చెందిన సురేశ్‌రెడ్డి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకోగా రెండేళ్ల క్రితం గర్భం దాల్చింది. దీంతో అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావటంతో మీరు దళితులని.. ముఖం చాటేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కౌన్సెలింగ్ ఇచ్చి గడువు ఇచ్చారని.. ఈలోపే మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలియటంతో తనకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి దీక్షకు పూనుకున్నట్లు బాధితురాలు వాపోయింది. కాగా రోహిణి తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని సురేశ్‌రెడ్డి తెలిపారు. అధికారులకు తప్పడు సమాచారం అందించి తనను మానసిక వేదనకు గురిచేయటంతో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడి ఈ మధ్యనే కొలుకున్నట్లు చెప్పకొచ్చాడు. ఈ విషయమై ఎస్ఐ వీరబాబును వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాలను విచారించామన్నారు. లాక్డౌన్ పర్యవేక్షణ నేపథ్యంలో వారికి రెండురోజుల గడువు ఇచ్చామని తెలిపారు. దీక్షకు కూర్చున్న విషయం తెలియదన్నారు. -
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
-
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్ రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోలను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె ) -
ప్రేమను చంపుకోలేక..
ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేకపోయాడు. నిశ్చితార్ధమయిన యువతితో పెళ్లికి సిద్ధం కాలేకపోయాడు. వంచన సరికాదని భావించాడు. క్షమాపణ కోరడానికి భయపడ్డాడు. దీంతో తానే చనిపోవాలని నిర్ణయించుకున్నాడో యువకుడు..తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. కన్న తండ్రిని ఒంటరి చేసి మృత్యు ఒడి చేరాడు. వైఎస్ఆర్ జిల్లా,ఖాజీపేట: ప్రేమ..పెళ్లి మధ్య నలిగిన ఓ యువకుడు తనువు చాలించాడు. ప్రేమను చంపుకోలేక మరొకరితో పెళ్లికి సిద్ధం కాలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిశ్చితార్ధమైన యువతికి క్షమాపణ చెప్పడానికి బయలుదేరి మార్గం మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్న వైనమిది. వివరాలివి. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన కోపూరి గంగాధర్(27) ఇంటర్ వరకు చదువుకున్నాడు, బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయం తెలియని తండ్రి లక్షుమయ్య తన కుమారునికి పోరుమామిళ్ల మండలం కవలకుంట్లలో ఓ యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. గతనెలలో నిశ్చితార్థం కూడా జరిగింది. తొందరలోనే వివాహానికి ముహూర్తం పెట్టుకోవాలనుకున్నారు. ఈ తరుణంలో గంగాధర్ తన ప్రేమ సంగతిని తండ్రికి చెప్పాడు. లక్షుమయ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. పునరాలోచనలో పడ్డాడు. నిశ్చితార్ధం చేసుకున్న వారింటికి వెళ్లి కుమారునితో క్షమాపణలు చెప్పించాలని భావించాడు. ఈనేపథ్యంలో గంగాధర్‌ను తీసుకుని మంగళవారం కవలకుంట్ల బయలుదేరాడు. ప్రేమను దాచి నిశ్చితార్ధమయ్యాక క్షమాపణ అడగడం విషయంలో గంగాధర్ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. దారిలో తండ్రిని విడిచి పరారయ్యాడు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రిగాలించి విఫలమయ్యాడు.(జైలులో ఆత్మహత్య చేసుకున్న తండ్రి) రావులపల్లె చెరువులో మృతదేహం రావులపల్లె చెరువులో బుధవారం ఉదయం గంగాధర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. మృతుని జేబులో సెల్‌ఫోను, ఒక పేపర్ పోలీసులకు కనిపించింది. పేపరుపై తండ్రి సెల్‌ఫోన్ నెంబరు రాసి ఆయనకు తన మృతదేహాన్ని అప్పగించాలని గంగాధర్ కోరాడు. పేపరుమీద ఉన్న నెంబరుకు పోలీసులు సమాచారమివ్వడంతో లక్షుమయ్య చెరవుగట్టుకు చేరుకున్నా డు. చెట్టంత కుమారుడు నిర్జీవంగా కనిపించేసరికి కన్నీరు మున్నీరయ్యాడు. మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. నిశ్చితార్థం అయిన అమ్మా యి ఇంటికి వెళ్లి క్షమాపణ కోరితే వారు ఏమంటారో అని గంగాధర్ బాగా మానసిక ఆందోళనకు.. ఒత్తిడికిగురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. వృద్ధాప్యంలో లక్షుమ య్య ఒంటరయ్యాడు. పెళ్లి చేసుకుని జీవిత చరమాంకంతో తోడుగా నిలుస్తాడనుకున్న కొడుకు అకాల మరణంతో ఆ వృద్ధుడు తేరుకోలేకపోతున్నాడు. 2012లో అనారోగ్యంతో ఇతని భార్య చనిపోయింది. గంగాధర్ ఒక్కడే కుమారుడు. నన్ను ఒంటరిని చేసే వెళ్లిపోతావా అంటూ రోదిస్తుంటే అక్కడున్నవారి హృదయాలు చలించిపోయాయి. -
ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమవ్యవహారం
మంచిర్యాలక్రైం: ఓ యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాల మీదకే తెచ్చింది. ఓ బాలికను వెంటపడి వేధిస్తుండగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దీనిని గమనించిన సదరు యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. సీఐ ముత్తి లింగయ్య కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మల్యాల సాగర్ (22) కొద్ది కాలంగా మంచిర్యాలలోని చున్నంబట్టివాడలో ఉంటూ పేయింటర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను కొంతకాలంగా ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆదివారం సదరు బాలిక ఇంటికి వెళ్లిన సాగర్.. ఇంటిముందు గొడవకు దిగాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో సాగర్ ఉంటున్న రూమ్‌కు వెళ్లి మందలించినట్లు తెల్సింది. దీంతో సాగర్ తనపై పోలీస్ కేసు అవుతుందన్న భయంతో వారికంటే ముందుగానే పోలీసులను కలిసేందుకు స్టేషన్‌కు బయల్దేరాడు. అప్పటికే బాలిక కుటుంబ సభ్యులు ఠాణాలో ఉండడంతో భయాందోళనకు గురై వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన సీఐ డ్రైవర్ లక్ష్మణ్, డ్యూటీ ఆఫీసర్ తిరుపతి సాగర్‌పై గొంగడి కప్పి మంటలను ఆర్పివేశారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మె రుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు సాగర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎందుకో.. ఏమో?
పెద్దదోర్నాల: చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మేఘావత్ మంత్రునాయక్ (23)గ్రామ సమీపంలో రోడ్డు పక్కనున్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ హుటాహుటిన నల్లగుంట్లకు చేరుకుని కేసు విచారణ చేపట్టారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మంత్రునాయక్ తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి సాధునాయక్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి, సవతి తల్లి శ్రీశైలంలో నివాసం ఉంటున్నారు. మంత్రునాయక్ తన తల్లిదండ్రులతో పాటు వెళ్లకుండా నల్లగుంట్లలో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. ఆటోలు, ట్రాక్టర్లకు బాడుగలకు వెళ్తూ తద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. వివాద రహితుడిగా, ఎటువంటి గొడవల్లో తలదూర్చని మంత్రునాయక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతుడి చేతిపై గతంలో ఏర్పడిన గాట్ల ఆధారంగా ప్రేమ వ్యవహారమే అతడి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసుకు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మరొకరు కూడా.. వేటపాలెం: ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. వేటపాలెం చుండూరిలొంపకు చెందిన యాసం వెంకటస్వామి (42) కుందేరు రోడ్డులోని తన సిమెంటు ఖార్ఖానాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి సన్నిహితులు, బంధువులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరికి సుపరిచితుడైన వెంకటస్వామి అకాల మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టారు. -
పరిచయం + ప్రేమ + పెళ్లి = మోసం
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: రైల్లో ఆ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి ఆమెను గర్భిణిని చేసింది. ఆ తర్వాత ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని మనువాడాడు. ఇప్పుడు తక్కువ కులం దానివంటూ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో దిక్కుతోచని ఆమె తనకు న్యాయం చేయాలని గురువారం టెక్కలి పోలీసులకు మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం మేరకు... టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో విజయనగరం కోచింగ్ నిమిత్తం వెళ్తుండగా, అదే రైలులో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కొంకి వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్‌కి సంబంధించిన ఐడీ కార్డును ఆమె వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. వివాహ సర్టిఫికెట్ ,పెళ్లి రోజు ఫొటో ఆ తర్వాత ఈ కార్డు అతడికి అవసరమైనదని గుర్తించి దానిపై ఉన్న నంబర్‌కు ఆమె ఫోన్ చేసింది. అయితే తను కావాలనే వదిలి వెళ్లానని, ఆమెను ప్రేమిస్తున్నానని, రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెబుతూ రోజూ ఫోన్ చేసేవాడు. అలా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నెల రోజుల తర్వాత ఆమె కూడా రాజమండ్రి బీఈడీ కోచింగ్‌కు వెళ్లింది. దాంతో ఇరువురు కలుసుకోవడంతో ప్రమీల గర్భం దాల్చింది. ఈ విషయం అతడికి చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చర్చిలో గత నెల 4న పెళ్లి చేసుకున్నారు. 15 రోజులపాటు కాపురం చేసిన వెంకటేష్ ఆ తర్వాత తన నాన్న కరువులు దగ్గరకు వచ్చేశాడు. అప్పటి నుంచి గర్భం తొలిగించుకోవాలని ఒత్తిడి చేసేవాడు. దానికామె తిరస్కరించగా ఏలుకోనని తేల్చి చె ప్పాడు. తక్కువ కులం దానివంటూ దూషించడంతో బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి టెక్కలి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం బాధితురాలు ఐదు నెలల గర్భిణి కావడంతో న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
ఇక్కడే ఉంటూ యూఎస్‌లో ఉన్నట్టు కాల్స్
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ మారుతున్న ఆధునిక సాంకేతికతతోనే సైబర్ వేధింపులను సరికొత్త మార్గంలో చేస్తున్నారు. ఇన్నాళ్లు ఫేస్బుక్, ట్విట్టర్, అర్కుట్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, యువతులను వేధిస్తున్న సైబర్ స్టాకర్స్ రూటు మార్చారు. మెదడుకు పదునుపెట్టి సరికొత్త రీతిలో ఆన్లైన్ వేధింపులు చేస్తున్నారు. నిందితుడు హైదరాబాద్‌లోనే ఉంటూ అమెరికా ఫోన్ నంబర్ ద్వారా అక్కడి నుంచి వేధింపులకు పాల్పడుతున్నట్టగా నమ్మించేలా చేసిన కేసు రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాలో తొలిది నమోదైంది. పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆ మొబైల్ నంబర్ కనిపెట్టడంతో నిందితుడు నిజాంపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కోట్ల మాధవ్రావును రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం గురువారం అరెస్టు చేసింది. అమెరికా నుంచే వేధింపులు చేస్తున్నట్టుగా... మాధవ్‌రావు డిగ్రీ క్లాస్మేట్ అయిన బాధితురాలి అక్కకు 2015 సంవత్సరంలోకాంటాక్ట్లోకి వచ్చాడు. గతంలో ఉన్న కాస్తా పరిచయంతో స్నేహితులుగా మారారు. కొన్నిరోజులకే ప్రేమిస్తున్నానంటూ మాధవ్‌రావు చెప్పడంతో ఆమె తిరస్కరించింది. కొన్నిరోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిన మాధవ్‌రావు తన ప్రేమను తిరస్కరించిన యువతిపై కక్ష కట్టాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో గూగుల్ ప్లేస్టోర్‌లోని ఓ యాప్ ద్వారా అమెరికా ఫోన్ నంబర్ (వర్చువల్ నంబర్ ఎవరూ ఉపయోగించనిది) డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ వినియోగించడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపాడు. వీడియోలు కూడా పంపాడు. శారీరక వాంఛ తీర్చాలంటూ రకరకాల మెసేజ్‌లు వాట్సాప్ చేశాడు. ఈ వేధింపులు తారాస్థాయికి వెళ్లడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం టెక్నికల్ టీమ్‌తో బాగా అధ్యయనం చేసి చివరకు నిందితుడు మాధవరావును పట్టుకున్నారు. వర్చువల్ నంబర్ ఉపయోగించి వాట్సాప్ వేధింపుల వేధించిన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు. -
పెళ్లి పేరుతో మోసం
కర్నూలు, ఆస్పరి: ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరం తీర్చుకున్నాడు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతడి చేతిలో మోసపోయిన యువతి తనకు న్యాయం చేయాలని శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కైరుప్పల గ్రామానికి చెందిన చిట్టెమ్మ, గోనెగండ్లకు చెందిన గంజెల్లి రంగ దగ్గరి బంధువులు. రెండేళ్ల క్రితం చిట్టెమ్మకు ప్రేమ పేరుతో రంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న చిట్టెమ్మ శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ట్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. విచారణ చేసి, న్యాయం చేస్తామని ఎస్ఐ నాగేంద్ర హామీ ఇవ్వడంతో ఆమె వెనుదిరిగింది. -
ప్రేమ విఫలమైంది.. బతుకు ఆగమైంది..
గచ్చిబౌలి: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోవర్ధన్ రెడ్డి కథనం ప్రకారం.. కృష్ణ జిల్లా గుడివాడకు చెందిన మల్లిరెడ్డి నాగ సుబ్రహ్మణ్యం రెడ్డి (24) ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. గచ్చిబౌలి ఏపీహెచ్‌బీ కాలనీలోని ప్లాట్ నంబర్ 161లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం నుంచి కుటంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం ఉదయం కూడా స్పందించకపోవడంతో సాయంత్రం 5 గంటల సమయంలో సోదరి, బావ, మామ కలిసి అతడు నివాసముంటున్న చోటికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా పలకకపోవడంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. ఓ యువతిని ప్రేమించగా ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డానని, దీనిపై దర్యాప్తు చేయవద్దని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్‌నోట్‌లో పేర్కొనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మరుగుజ్జును వివాహమాడిన యువతి
టీ.నగర్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మరుగుజ్జును యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ కరూర్ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. కరూర్ సమీపంలోని తేరూరుకు చెందిన విఘ్నేశ్వరన్ (25) నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాడు. ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్లో శివగంగైకు చెందిన ఫార్మసీ విద్యార్థిని పవిత్రతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపాయి. ఇలా ఉండగా బుధవారం కరూర్ ఈశ్వరన్ ఆలయంలో పవిత్రను విఘ్నేశ్వరన్ వివాహం చేసుకున్నాడు. అనంతరం తమకు భద్రత కల్పించాలని కోరుతూ కరూర్ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. -
తమ ప్రేమను అంగీకరించడం లేదని..
కుల్కచర్ల: వరుసకు ఇద్దరూ అక్కాతమ్ముడు. అయినా, వారి మనసులు కలిశాయి. కొంత కాలంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దలు.. వరుస సరికాదు.. వద్దని వారించి సర్దిచెప్పారు. తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరించడం లేదని మనోవేదనకు గురైన యువతి, యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కామునిపల్లిలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రశాంత్ (19) అదే గ్రామానికి చెందిన ఓ యువతి(20) పదో తరగతి వరకు చదివారు. యువతి ఇంటి వద్దే ఉంటోంది. వీరిద్దరూ వరుసకు అక్కాతమ్ముడు. ప్రశాంత్ తల్లిదండ్రులు నగరంలో ఉంటూ సెంట్రింగ్ పనిచేస్తున్నారు. యువకుడు వారికి సాయంగా ఉంటే అక్కడే ఉంటున్నాడు. కొంతకాలంగా ప్రశాంత్, యువతి ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు విషయం తెలుసుకొని వారించారు. వరుస సరికాదని వద్దని సర్దిచెప్పి హెచ్చరించారు. అయినా, యువతి, యువకుడు తమ ప్రేమను కొనసాగించారు. ప్రశాంత్ సోమవారం స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున యువతితోపాటు ప్రశాంత్ తన ఇంట్లో ఒకే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొరుగింటి వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్ తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
నేను ప్రేమించడం లేదు.. చస్తే చావు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ప్రేమ వ్యవహారమే ఇంటర్ విద్యార్థిని మృతికి దారి తీసిందని.. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలించి.. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విలేకర్లకు మంగళవారం వెల్లడించారు. ఆత్మహత్యకు కారణమైన బాలుడ్ని అరెస్టు చేసి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఆత్యహత్యగా నిర్ధారించడంతో మిస్టరీ వీడింది. అసలేం జరిగింది.. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జనవరి 26న గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించింది. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన తర్వాత రైల్వే ట్రాక్‌పై పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును పలాస రైల్వే పోలీసులు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 8 రోజులపాటు అన్ని కోణాల్లో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కూడా రావడంతో దర్యాప్తు వేగవంతమైంది. బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం కావడంతో హత్య కోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆత్మహత్య కోణంపై దర్యాప్తు సాగింది. మొత్తం 50 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఇంటర్ విద్యార్థిని ప్రశ్నించారు. కాల్ డేటా, మెసేజ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లు పరిశీలించారు. ఈ విద్యార్థి వ్యవహారం వల్లే బాలిక మృతి చెందినట్లు భావించారు. నిందితుడిపై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ వేణుగోపాలరావు నిన్ను ప్రేమించడం లేదు.. ప్రియుడిగా అనుమానిస్తున్న విద్యార్థితో బాలికకు మూడు నెలల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత నెల 23వ తేదీన చివరి సందేశంలో ‘నేను ప్రేమించడం లేదు. చస్తే చావు’ అని చేప్పాడు. ప్రేమించడం లేదని చెప్పడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 25న అర్ధరాత్రి దాటిన తర్వాత బహిర్భూమికని వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి విద్యార్థిని అరెస్టు చేశామని, విద్యార్థి మైనర్ కావడంతో జువైనల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్‌రావు సిబ్బంది ఉన్నారు. బంధువులు, గ్రామస్తుల ఆందోళన విద్యార్థిని జువైనెల్ కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల అదుపులో వారం రోజులకుపైగా స్టేషన్లోనే ఎందుకు ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బాలుడ్ని చూపించడంతో పట్టువిడిచారు. అనంతరం శ్రీకాకుళం కోర్టుకు వాహనంలో తరలించారు. -
మూడు లక్షల జీతం సంపాదించేవాడు కావాలి!
నాకు ఆ అమ్మాయి కావాలి ,కానీ వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయిని నెలకు 3 లక్షల సంపాదించే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఉంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. కలిసి బ్రతకాలి అంటే కులం అడ్డు కాకపోయినా నువ్వు చేసే ఉద్యోగం మా నాన్నకు నచ్చదు. ప్రేమించడం వరకు ఐతే నా చేతిలో ఉంది కానీ, పెళ్లి చేసుకోవడం మాత్రం మా నాన్న గారు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి తను వెళ్ళిపోయింది. చాలా తేలికగా నన్ను ఇక నుంచి గుర్తుకు తెచ్చుకొని బాధ పడకుండా ఇంత కంటే మంచి ఉద్యోగం చూసుకొని, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని కూడా చెప్పింది. వెతికితే మంచి అమ్మాయి, నచ్చిన ఉద్యోగం వస్తుంది ఏమో కానీ నువ్వు నా లైఫ్ లో ఉండవు కదా బుజ్జి. అప్పుడు అర్ధమయ్యింది మధ్య తరగతి అబ్బాయిలు గొప్పగా డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమించకూడదు అని. నేనింకా నీ కోసమే వేచి చూస్తున్న బుజ్జి మనిషి ప్రేమ కంటే నెలకి 3 లక్షలు తెచ్చే వాడు అవసరం లేదు అని నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వస్తావు అని. ఇట్లు నీ శివ -
నా ప్రాణం పోయినట్లు అనిపించేది!
సరిగ్గా అది 2017వ సంవత్సరం. నాకు ఫేసుబుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. వాళ్ళది మా ఊరి పక్కనే. కానీ వాళ్ళు నల్గొండలో సెటిల్ అయ్యారు. తను నర్సింగ్ చదువుతూ ఉండేది. మేమిద్దరం రోజు మెస్సేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మేమిద్దరం కాల్ చేసుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. తనకోసం వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్లేవాడిని. చాలా సరదాగా ఉండేవాళ్ళం. మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. నేను ఒకరోజు తనకి ప్రపోస్ చేశాను. తను ఒప్పుకోలేదు. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. చాలా రిక్వెస్ట్ చేశాను. అప్పటికీ తాను మాత్రం ఒప్పుకోలేదు. చాలా ఏడ్చాను. కొన్ని రోజుల తరువాత తను నా లవ్‌ను ఒప్పుకుంది. ఆ టైం లో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. తనకోసం కాలేజీ దగ్గరికి వెళ్ళేవాడిని. తనని చూసినప్పుడు ఏదో తెలియని సంతోషం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. తన కోసం బస్టాండ్‌కు వెళ్ళేవాడిని. మేము ఇద్దరం కలిసి బస్‌లో నల్గొండకు వెళ్లే వాళ్లం. బస్‌లో వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఆ టైంలో నా ఆనందానికి హద్దులు ఉండేవి కావు. తన లేకపోతే నేను ఉండలేను అనేంత ప్రేమ ఎక్కువైంది. నేను జాబ్ కోసం అని హైదరాబాద్ వచ్చేశాను. తను కూడా చదవు ముగించుకొని హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వచ్చేసింది. మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. తను హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నేను కొంచెం పనిమీద మాఊరికి వెళ్ళాను. తను సడన్‌గా కాల్ చేసి నాకు జాబ్ నచ్చడం లేదు, నేను మా ఇంటికి వెళ్తున్న అని చెప్పింది. ఆ టైంలో నాకు చాలా బాధవేసింది. తను చదివిన కాలేజీ లోనే జాబ్ చేస్తోంది. తనకోసం నేను హైదరాబాద్ నుంచి ఆమె పనిచేసే హాస్పిటల్ దగ్గరకి వెళ్లి కలిసేవాడిని. ఆమెను చూడడానికి కనీసం నెలకు ఐదుసార్లు వెళ్ళేవాడిని. తనంటే నాకు ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం.సడన్‌గా తనకి ఇంట్లో పెళ్లి బంధాలు చూస్తున్నారు అని నాకు చెప్పింది. మేమిద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంట్లో తనంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా పెంచుకున్నారు.ఆమెకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం. నా బంగారాన్ని అంత ప్రేమగా చూసుకున్నారు. తను లేకుంటే వాళ్ళ నాన్న ఉండలేరు అని తెలిసింది. వాళ్ళ నాన్న దుబాయ్‌లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తునారు. ఆయనకు తన కూతురిమీద ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. కావాలని తనని దూరం చేస్తూ వచ్చాను. నేను మంచివాడిని కాదు అని మా ఫ్రెండ్స్ తో చెప్పించాను. నాకు చెడు అలవాట్లు ఉన్నాయని కూడా చెప్పించాను. తను మాత్రం నమ్మలేదు. నాకు కాల్ చేస్తే కట్ చేస్తూ ఉండేవాడి. ఎందుకు అలా చేశానంటే నాతో తను వస్తే వాళ్ల నాన్న బతకలేరు. వాళ్ల నాన్నకు హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది. నా వల్ల వాళ్ల ఫ్యామిలీ కి ఏం కావద్దు అని కావాలని దూరం చేస్తూవచ్చాను. కానీ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అవాయిడ్ చేస్తుంటే నా ప్రాణం పోయినట్టు ఉంది. చాలా అంటే చాలా ఏడ్చాను. అలా కొన్ని రోజులు గడిచాక ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలిసింది. ఆ టైంలో ఎంత ఏడ్చానంటే అది మాటల్లో చెప్పలేను. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడి సొంతం అవుతుంది అని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. 10 నెలల దాకా మనిషిని కాలేదు. తనని నేను బ్రతికి ఉన్నంత వరకు మర్చిపోలేను. సారీ బంగారం నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఐ లవ్ యూ బంగారం, ఐ మిస్ యూ. జగదీష్ ( నల్గొండ). -
టిక్‌టాక్ వైపరీత్యం..ప్రేమించలేదని..
చెన్నై, టీ.నగర్: ప్రేమించలేదని ఓ పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ప్రేమికుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం సమీపానగల కలూరు ప్రాంతానికి చెందిన ఇవా డేనియల్ ప్లస్‌టూ విద్యార్థిని. ఈమెకు అతే ప్రాంతానికి చెందిన సబర్షా అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇలావుండగా వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడంతో ఆమె అతనితో మాట్లాడడం నిలిపేసింది. ఇలావుండగా మంగళవారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇవా డేనియల్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు విచారణ జరపగా సబర్షా పనిచేస్తున్న వర్క్‌షాపులో నిలిపి ఉంచిన కారు మాయమైంది. దీంతో ఇవా డేనియల్ను సబర్షా కిడ్నాప్ చేసి ఉండొచ్చని భావించిన పోలీసులు కారు తమిళనాడుకు వస్తున్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం సాయింత్రం కారు వాల్పారై వద్ద వస్తుండగా పోలీసులు కారును అటకాయించారు. అయితే కారులో విద్యార్థిని కనిపించలేదు. దీంతో సబర్షా వద్ద విచారణ జరపగా ఆమెను హత్య చేసి ఓ ప్రాంతంలో పారేసినట్లు తెలిపారు. దీంతో సబర్షాను అరెస్టు చేసిన పోలీసులు ఘటనా ప్రాంతానికి అతన్ని తీసుకువెళ్లి ఇవా డేనియల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. టిక్‌టాక్ వైపరీత్యం: టిక్‌టాక్ వైపరీత్యం కారణంగా ప్రియురాల్ని హత్య చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్యాకుమారి జిల్లా కేరళ సరిహద్దులో కారకోణం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయిని 19 ఏళ్ల కుమార్తె ఆసికా. ఈమె టిక్‌టాక్‌లో పోస్టులు చేస్తుంటుంది. దీనిద్వారా అను అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి అతనితో సంబంధాన్ని తెంచుకుంది. సెల్‌ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో అను నేరుగా ఆసికాకు బెదిరిస్తూ వచ్చాడు. సంఘటన జరిగిన రోజున ఆసికను కత్తితో హతమార్చిన అతను తను కూడా గొంతుకోసుకుని మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఒకే రోజు ఏడుగురి బలవన్మరణం
హైదరాబాద్ నగరంలో ఒకే రోజు వేర్వేరు కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఓ యువతి సహా ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు మంగళవారం చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రేమ విఫలమై.. యువకుడు.. మారేడుపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనర్సయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న రవిచైతన్య (21) బేగంపేట్‌లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను గత కొంత కాలంగా ఓల్డ్ మారేడుపల్లికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతి అతడి ప్రతిపాదనను తిరస్కరించడంతో మనస్తాపానికి లోనైన రవి చైతన్య సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాలవ్యాపారి.. దూద్‌బౌలి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ పాల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్ డీఐ నరేశ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన అమిత్ గుప్తా (40) నగరానికి వలస వచ్చి కుటుంబంతో సహా శివరాంపల్లిలో ఉంటున్నాడు. నాలుగు నెలలుగా అతను చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీబేగం మసీదు వద్ద పాలు, పాల పదార్థాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి రూ.12 లక్షల అప్పులు ఉండటంతో వీటిని తీర్చలేక మనస్తాపానికి లోనయ్యాడు. మంగళవారం ఉదయం దుకాణాన్ని తెరిచిన అమిత్ గుప్తా మధ్యాహ్నం దుకాణంలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య సరళ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకుని యువతి.. గచ్చిబౌలి : గెస్ట్ హౌస్‌లో ఉంటున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నవీన్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం, గుర్గావ్ ప్రాంతానికి చెందిన మౌనికరావు (25) గచ్చిబౌలిలోని ఓయోలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ రాజరాజేశ్వరీ కాలనీలోని కాకతీయ రెసిడెన్సీలో ఉంటోంది. ఆదివారం రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లిన ఆమె బయటికి రాలేదు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె స్నేహితుడు రీహాన్ అక్కడికి వెళ్లాడు. డోర్ దగ్గరకు వేసి ఉండడంతో తలుపు తీసి చూడగా మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. రీహాన్ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె సోదరుడు అమీత్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో గొడవపడి యువకుడు.. గచ్చిబౌలి : భార్యతో గొడవపడి మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ దేవేందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, గట్టురయపాకల గ్రామానికి చెందిన గౌనీ బొగురయ్య (30) ఎనిమిదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గచ్చిబౌలి, అంజయ్యనగర్‌లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అదే ప్రాంతంలో ఉంటున్న అత్తవారింట్లో ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉండగా తాను రానని చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో భార్య పద్మ, మామ వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన అతడి భార్య కిటికీలో నుంచి చూడగా బొంగురయ్య సీలింగ్ రాడుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా సోమవారం ఉదయంభార్యభర్తల మధ్య గొడవ జరిగిందని ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమను నిరాకరించిందని.. మైలార్‌దేవ్‌పల్లి: ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ విశాఖ జిల్లాకు చెందిన కోటేశ్వరరావు(25) తన తండ్రితో కలిసి మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో పదిహేనేళ్లుగా నివాసముంటున్నాడు. అతడు ఆర్కేస్ట్రా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో అతడికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నూతన సంవత్సర వేడుకల్లో ఆమెను కలిసిన కోటేశ్వరరావు ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకుని మహిళ.. అల్వాల్: ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, మల్లేపల్లికి చెందిన రవి,రాజేశ్వరి(33) దంపతులు నగరానికి వలసవచ్చి అల్వాల్, మంగాపురం కాలనీలో ఉంటున్న దామోదర్‌రెడ్డి వద్ద పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజేశ్వరి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కులాయప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై హిజ్రా ఆత్మహత్య
చెన్నై,అన్నానగర్: ఈరోడ్ సమీపంలో మంగళవారం ప్రేమ ఓటమి వల్ల హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్ సమీపం మూలప్పాలైయమ్ వినాయకుడి ఆలయ వీధికి చెందిన మురుగేషన్ అనే సుస్మితా (22) హిజ్రా. ఈమె తన అమ్మ చిన్నపొన్నుతో నివసిస్తూ వచ్చింది. సుస్మితాకి, ఈరోడ్ వీరప్పన్ చత్రమ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తరువాత సుస్మితా ఆ యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. అనంతరం సుస్మితా, ఆ యువకుడి వద్ద తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. కానీ ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందువల్ల సుస్మితా కొన్ని రోజులుగా మనస్తాపంతో బాధపడుతోంది. ఈ స్థితిలో మంగళవారం ఎవరు ఇంట్లో లేని సమయంలో సుస్మితా ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్నిచూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె తల్లి, స్థానికుల సహాయంతో రక్షించి చికిత్స కోసం ఈ రోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్క డ పరిశోధన చేసిన డాక్టర్లు అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి ఎంబీఏ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా కె.సముద్రం మండలానికి చెందిన ఓ యువకుడు గుంటూరు నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో నాలుగు సంవత్సరాల క్రితం బీఫార్మసీ చదువుతూ ప్రతి ఆదివారం యువతి ఇంటి సమీపంలోని చర్చికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయిన తరువాత యువకుడు దుబాయ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులను తీసుకుని డిసెంబరు 26వ తేదీ యువకుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లిదండ్రులతో వివాహ విషయం ప్రస్తావించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు వివాహం విషయం కొంతకాలం తరువాత చర్చిద్దామని చెప్పి పంపించారు. యువకుడు తన సెల్లో ప్రియురాలి నంబరు బ్లాక్ చేశాడు. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైందని సమాచారం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్ నంబరు ప్రియుడు బ్లాక్ చేయడంతో సూసైడ్ మెసేజ్ అతని ఫ్రెండ్ ఫోన్‌కు పంపింది. తన ప్రియుడు లేని జీవితాన్ని తాను ఊహించలేనని పేర్కొంది. మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనని, ఆ కారణంగా తల్లిదండ్రులకు తాను భారమవుతానని భావించానని రాసింది. వచ్చే జన్మలోనైనా నీవు నాకు దక్కుతావా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని చూడడానికి కూడా నువ్వు రావులే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. పెళ్లి కానుకగా తాను కొన్న వాచీని స్వీకరించాలని అభ్యర్థిచింది. మెసేజ్ చేరిన కొంతసేపటికే తాను ప్రాణాలను విడుస్తున్నట్లు, తనను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని తెలిపింది. -
ప్రేమలో విఫలమై మనస్తాపంతో..
పశ్చిమగోదావరి, తాళ్లపూడి: ప్రేమలో విఫలమై మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడికి చెందిన ఇర్లపాటి నవీన్ (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన నవీన్ శుక్రవారం ఉదయం తిరిగొచ్చాడు. అనంతరం గోదావరి గట్టు వద్దకు వెళ్లిన నవీన్ అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతనిని చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లి విషయమై యువతి నిరాకరించడం వల్లే నవీన్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసింది. నవీన్ తన మొబైల్లో “తాను మోసపోయానని.. ఇంక ఎవరిని ఇలా మోసం చేయవద్దు’ అని పోస్టు పెట్టడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లపూడి ఎస్సై జి.సతీష్ చెప్పారు. వైసీపీలో చురుకైన యువనేత వైఎస్సార్ సీపీలో నవీన్ చురుగ్గా వ్యహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేశారు. అదేవిధంగా జైభీమ్ యూత్‌లో పాల్గొంటూ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు నవీన్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రేమలో ఫెయిల్ అయ్యారా? ఇలా చేయండి!
‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ ఈ మూడు మాటల్ని ఎదుటి వ్యక్తికి చెప్పటానికి అల్లాడిపోయేవారు చాలా మందే ఉన్నారు. తమ ప్రేమను చెప్పగానే ఆవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారన్నదే ఓ పెద్ద ప్రశ్న! చాలా మందిని కలవరపెట్టేది కూడా ఈ పశ్నే. ‘‘ నువ్వు అవునంటే ఆకాశంలోకి.. కాదంటే పాతాళంలోకి’’ అన్నట్లు ఆలోచిస్తుంటారు. ప్రేమలో గెలిచినవారి సంగతి పక్కన పెడితే.. ఒడిపోయిన, ముఖ్యంగా ఆదిలోనే తిరస్కరణకు గురైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొంతమంది మానసికంగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవటమో, ప్రయత్నించటమో, తమను తాము తరుచు బాధించుకోవటమో చేస్తుంటారు. మరికొంతమంది ఆ బాధనుంచి బయటపడలేక, ఎలా బయటపడాలో తెలియక కృంగిపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. 1) జ్ఞాపకాలను చెరిపేయండి ప్రేమ చేసిన గాయం మానాలంటే అందుకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేయటం ప్రధానం. ముందుగా భౌతికమైన వాటిని వారికి సంబంధించినవి ఏవైనా( వారిని గుర్తు చేసేవి)వాటిని కంటికి కనిపించనంత దూరంగా ఉంచండి. 2) బిజీగా ఉండండి మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు ఎదుటి వ్యక్తి ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి వేధిస్తుంటాయి. అందుకని ఎప్పుడూ ఏదో పనిలో నిమజ్ఞమై ఉండండి. ఒంటరిగా కాకుండా మిత్రులతో, కుటుంబసభ్యులతో సమయం గడపటానికి ప్రయత్నించండి. 3) ప్రతికూల(నెగిటివ్) ఆలోచనలు ఎట్టి ప్రరిస్థితిలో ప్రతికూల ఆలోచనలు చేయకండి. అలాంటి ఆలోచనలే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాయి. ఆ బాధనుంచి బయటపడగలమనే ధృడ సంకల్పంతో ఎల్లప్పుడూ ఉండండి. 4) వ్యాయామం మనసు గట్టిపడాలంటే ముందుగా మన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆరోగ్యవంతమైన శరీరమే ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయగలదు. వ్యాయామం చేయటం ద్వారా శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి రోజుకు కనీసం ఓ అరగంటేనా వ్యాయామం చేయటం మంచిది. 5) మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మనల్ని మనం ప్రేమించుకోవటం అన్నది ప్రధానం. ఇతరులు మన మనసును బాధపెట్టారని, మనల్ని మనం బాధించుకోవటం మంచిది కాదు. కోరుకున్న వ్యక్తి ప్రేమే జీవితం కాదు! వారి ప్రేమ మన జీవితంలో ఓ చిన్న భాగంగా గుర్తించాలి. జీవితం వారి ప్రేమతోటే ముగియదని, మరొకరి రూపంలో మన ముందు ప్రత్యక్షమవుతుందని తెలుసుకోవాలి. మనల్ని మనం పూర్తిగా ప్రేమించినపుడే ఎదుటివ్యక్తిని సంపూర్తిగా ప్రేమించగలము. 6) కొంచెం నవ్వండి ! ఇలాంటి సమయంలో నవ్వు నాలుగు వందల విధాల మేలు! అని కచ్చితంగా చెప్పొచ్చు. నవ్వు మానసికంగానే కాదు శారీరకంగానూ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. నవ్వినపుడు ముఖంలో కదిలే కండరాల కారణంగా కొన్ని నరాలు ప్రభావితమవుతాయి. తద్వారా మనకు ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్న వారిలా ప్రతిక్షణం దిగాలుగా ఉండకుండా కొద్దిగా నవ్వటానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నమే నవ్వులకు మనల్ని మరింత దగ్గర చేస్తుంది. -
రెండు కుటుంబాల్లో ప్రేమ విషాదం
కర్ణాటక, మండ్య : ప్రేమకథ రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన జిల్లాలోని నాగమంగల తాలూకాలో మంగళవారం వెలుగు చూసింది. తాలూకాలోని మంచనహళ్లి గ్రామానికి చెందిన కాంచన (16) సమీపంలోని హొన్నెహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే యువకుడి మధ్య కొద్ది కాలం క్రితం ప్రేమ చిగురించింది. ఈ విషయం తల్లితండ్రులకు తెలియడంతో మనస్తాపం చెందిన కాంచన ఈనెల 5వ తేదీన విషం తాగింది. దీంతో కడుపు నొప్పి తాళలేక ఉరేసుకోవడానికి యత్నించింది. ఇది గమనించిన కాంచన తల్లితండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాలంటూ వైద్యులు తల్లితండ్రులకు సూచించారు. దీంతో దిక్కుతోచని తల్లితండ్రులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించసాగారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి యశ్వంత్ కారణమంటూ కాంచన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యశ్వంత్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంగళూరులో డ్రైవర్‌గా పని చేస్తున్న యశ్వంత్ తండ్రి సోమశేఖర్ ఈనెల 10వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనవరాలిని చూడడానికి వచ్చిన కాంచన తాత చంద్రు (65) మనవరాలి పరిస్థితి చూసి గుండెపోటుతో ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంచన సైతం ఈనెల 20వ తేదీన చికిత్స ఫలించక మృతి చెందింది. ఇలా ఒక ప్రేమకథ రెండు కుటుంబాల్లోనూ విషాదం నింపింది. -
అతడి కోసం విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది...
కర్ణాటక, యశవంతపుర: సోషల్ మీడియా ప్రేమలు ముక్కుపచ్చలారని బాలలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో మరోసారి వెల్లడైంది. సిలికాన్ సిటిలో 10వ తరగతి బాలిక ఒకరు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితున్ని వెతుకుతూ విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది. అతడు కూడా మైనర్ దాటని బాలుడే కావడం గమనార్హం. చివరకు శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలికకు నచ్చజెప్పి బెంగళూరుకు తీసుకురావడంతో సుఖాంతమైంది. ఏం జరిగిందంటే వివరాలు.. బెంగళూరులో ఓ ధనవంతుని కుమార్తె కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లో తరచూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఒక కుర్రవానితో ఫేస్బుక్లో పరిచయం కుదిరింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ప్రేమలో పడినట్లు కూడా సమాచారం. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియటంతో బాలికను మందలించారు. ఒకవైపు తల్లిదండ్రు లు ఆగ్రహించడం, మరోవైపు ప్రియున్ని కలవాలన్న భావనలో ఆ బాలిక బెంగళూరు విమానశ్రయం నుండి విమానంలో భోపాల్‌కు వెళ్లిపోయింది. భోపాల్‌లోని ప్రేమికుని ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారు చూస్తే గొడవ అవుతుందని ఆ అబ్బాయి బాలికను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇంతదూరం ఎందుకు వచ్చావంటూ బుద్ధిమాటలు చెప్పి బెంగళూరుకు వెళ్లాలని సూచించాడు. ఇందుకు బాలిక ససేమిరా అంది. తాను ఇక్కడే ఉంటానని బాలిక మారాం చేయడంతో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. బాలికకు కౌన్సెలింగ్ ఇంతలో బాలిక మిస్సయిన సంగతి తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ జరిపి భోపాల్‌లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు గాలించి మైనర్ ప్రేమజంటను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలల సంరక్షణ సమితి ఆ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫేస్బుక్ స్నేహితున్ని కసిసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. తండ్రితో గొడవపడిన బాలిక కొద్దిరోజుల పాటు కాల్ సెంటర్లో పని చేసి వచ్చిన డబ్బులతో భోపాల్‌కు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి బాలికను క్షేమంగా బెంగళూరుకు తీసుకొచ్చారు. -
ఏడేళ్లు చిన్నవాడైనా నిజాయితీ చూసి ఓకే చేశాను.
హాయ్ సార్! నాకొక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నాకంటే ఏడేళ్లు చిన్నవాడైనా తన ప్రేమలో నిజాయితీ చూసి ఓకే చేశాను. కలిసి ఇద్దరం ఫోర్ ఇయర్స్ ఉన్నాం. మా అమ్మని కూడా ఒప్పించాడు. వాళ్ల ఫాదర్ చనిపోవడంతో ఆయన గవర్నమెంట్ జాబ్ తనకి వచ్చింది. తర్వాత వన్ ఇయర్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అవాయిడ్ చెయ్యడం మొదలుపెట్టాడు. నిలదీసి అడిగితే ‘ఏం లేదు’ అన్నాడు. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ చేశాడనే నిజం నాకు తెలిసిపోయింది. వాళ్లు కలిసి తిరగడం, కలిసి దిగిన ఫొటోస్ అన్నీ చూశాను. ‘ఏంటిదంతా?’ అని వాళ్ల ఆఫీస్‌కి వెళ్లి అడిగాను. దాంతో తను రివర్స్ అయిపోయాడు. ‘నీకు అనుమానం.. నువ్వు నాకు వద్దు’ అని తిట్టడమే కాకుండా మా అమ్మకి ఫోన్ చేసి.. ‘మీ అమ్మాయికి అనుమానం ఎక్కువ. తను నాకొద్దు’ అని చెప్పి నన్ను శాశ్వతంగా వదిలేశాడు. తను రాడని నాకు తెలుసు. కానీ త్రీ ఇయర్స్‌గా తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా సంబంధాలు కాదనుకున్నాను. అమ్మ నన్ను ఏం అనలేక బాధపడుతోంది. నాకు కొంచెం ధైర్యం చెప్పండి అన్నయ్యా ప్లీజ్. – ధరణి వాడొక పెంట రాస్కెల్!! ప్రేమ బ్యాండ్ వేసి వాడుకునే దుర్మార్గుడు!! ఇంత చిన్నవయసులోనే అంత మోసం నేర్చుకున్నాడంటే..వాడిని నమ్మి.. వాడి కోసం వెయిట్ చేసి.. వాడే నా లవ్ అనుకుని.. నువ్వు నీ లైఫ్‌ని దుర్భరం చేసుకోవడం వెరీ సిల్లీ బంగారం!! లవ్ చాలా పవిత్రమైనది! లవ్ చాలా పవర్ఫుల్! లవ్ చాలా గ్రేట్! ఒకరోజు నీకు వాడు చేసిన అన్యాయానికి..మూల్యం చెల్లించక తప్పదు.. ఒక దరిద్రుడు నీ జీవితంలో నుంచి వెళ్లిపోయాడని కాలర్ ఎగరేసుకుని ముందుకు సాగిపో..!! ‘సార్ అమ్మాయిలు కాలర్ ఉన్న డ్రెస్‌లు తక్కువగా వేసుకుంటారు సార్!’ అయితే తలెత్తుకుని లైఫ్‌ని మళ్లీ హ్యాపీగా జీవించమను నీలూ!! ‘అవును ధరణీ..! వాడొక యాక్.... థూ!! గాడు.. బీ స్ట్రాంగ్!!’ lovedoctorram@sakshi.com -
తనను ప్రేమించట్లేదని వీఆర్ఏ ఆత్మహత్య
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ : వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇంటి యజమాని ఎడ్ల రాజు, స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ రాజిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవాపూర్‌కు చెందిన నరేందర్, అనిత దంపతుల కుమారుడైన సాయికృష్ణ(22)కు రెండేళ్ల క్రితం అతడి తాత ఉప్పలయ్యకు చెందిన వీఆర్ఏ ఉద్యోగం కారుణ్య నియామకం కింద వచ్చింది. వీఆర్ఏగా విధుల్లో చేరిన అతను ప్రస్తుతం ఘన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో అతడి తల్లిదండ్రులు విడిపోగా తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సాయికృష్ణ తల్లి కరీంనగర్లో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. ప్రస్తుతం సాయిక్రిష్ణ తనతో పాటు వీఆర్ఏగా పనిచేస్తున్న ఎం.వెంకటస్వామితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల ఉన్న కాలనీలో ఓ గదిలో ఆరునెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడ అద్దెకు ఉంటూ సెలవుల్లో కరీంనగర్‌లోని అమ్మ వద్దకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన ఓ అమ్మాయితో అతడు ప్రేమలో పడినట్లు తెలిసింది. తరచూ ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం, సెల్లో చాట్ చేసేవాడు. గురువారం రాఖీ పౌర్ణమి పండుగ రావడంతో వెంకటస్వామి హైదరాబాద్‌లోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాడు. గదిలో ఒంటరిగా ఉన్న సాయికృష్ణ రాత్రి మద్యం ఫుల్‌బాటిల్ తెచ్చుకుని తాగాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో తన ప్రియురాలితో పాటు తల్లి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అర్థరాత్రి దాటాక అతడు గది పైకప్పుకు ఉన్న కొండికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హైదరాబాద్‌కు వెళ్లిన అతడి రూంమెట్, తోటి వీఆర్ఏ వెంకటస్వామి విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం ఘన్‌పూర్‌కు వచ్చాడు. వారి గదికి వెళ్లేసరికి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సాయికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించగా ఇంటియజమాని పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి కు టుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీఆర్ఏ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సీఐ తెలిపారు. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీఆర్ఏ మృతిపై రెవెన్యూ అధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’
న్యూఢిల్లీ: ‘తనకు మరొకరితో వివాహం జరుగుతుందనే ఊహనే భరించలేకున్నాను. తను లేకుండా నేను బతకలేను. తను నాకు దూరమవుతుందనే బాధ నా గుండెను మెలిపెడుతుంది. ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఉద్యోగం కూడా పోయింది... తను లేని జీవితం నాకు వద్దు. అందుకే చనిపోతున్నాను. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి’ అంటూ ఆగ్రావాసి ఒకరు ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆగ్రాకు చెందిన శ్యామ్ సికార్వార్ అలియాస్ రాజ్(22) అనే వ్యక్తి కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాక యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. దాంతో రాజ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో సమీపంలోని ఆలయానికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోవడానికి గల కారణాలను ఫేస్బుక్ లైవ్ ద్వారా పంచుకున్నాడు రాజ్. అంతేకాక తన చావుకు ఎవరిని బాధ్యుల్ని చేయవద్దని పోలీసులను కూడా కోరాడు. దాంతో పాటు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు రాజ్. దానిలో తల్లిదండ్రుల్ని బాధపెడుతున్నందుకు క్షమించమని కోరడమే కాక తన అవయవాలను దానం చేయాల్సిందిగా కోరాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడు వివాహానికి ఒప్పుకోలేదని..
చెన్నై ,అన్నానగర్: ప్రియుడు వివాహాం చేసుకోవడానికి అంగీకరించలేదని మంగళవారం దిండుగల్ కలెక్టర్ ఇంటి ముందు యువతి ఆత్మాహుతి చేసుకోవడానికి యత్నించింది. మంగళవారం యువతి సహా ముగ్గురు వ్యక్తులు కలెక్టర్ ఇంటి ముందు వచ్చారు. అనంతరం ఆ యువతి హఠాత్తుగా బాటిల్లో ఉన్న పెట్రోల్‌ను తన శరీరం మీద పోసుకుని మంటలు పెట్టుకోవడానికి యత్నించింది. వెంటనే స్థానికులు ఆమెపై నీళ్లు పోసి రక్షించారు. దీంతో ఆ మహిళతో సహా ఆ ముగ్గురు నేలపై కూర్చొని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆత్మాహుతికి యత్నించిన యువతిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో ఆమె దిండుక్కల్ మేట్టుపట్టికి చెందిన దివ్యరోస్లిన్ (24) అని తెలసింది. ఆమె వెంట వచ్చిన వారు తండ్రి ప్రాన్సిస్, తల్లి జెమినామేరి అని తెలిసింది. పోలిసుల దివ్యరోస్లిన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘దిండుక్కల్– పళణి రోడ్డులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కశాశాలలో నేను బీఈ చదివాను. అదే కళాశాలకి చెందిన పళణి తిరునగర్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ప్రస్తుతం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు. కాబట్టి ప్రియుడితో వివాహాం జరిపించమని దిండుగల్ మహిళ పోలీసుస్టేషన్లో, కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీయకపోవడం వలన విరక్తితో ఆత్మాహుతికి యత్నించాను.’’ అని దివ్యరోస్లిన్ చెప్పింది. ఫిర్యాదు ఆధారంగా దిండుగల్‌లో మహిళా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సాక్షి, తగరపువలస(విశాఖపట్టణం) : జీవీఎంసీ భీమిలి జోన్ 10వ వార్డు గ్రంథాలయం వీధికి చెందిన మాదాబత్తుల ప్రసాద్(23) 5వ వార్డు కొత్తపేటలోని తన స్నేహితుడు ఇస్పరి జగదీష్ ఇంట్లో శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితుని ఇంటికి మాట్లాడడానికి వచ్చిన ప్రసాద్ కొంతసేపు అక్కడే గడిపాడు. తరువాత జగదీష్ అతడిని కూర్చోబెట్టి స్నానానికి వెళ్లిపోయాడు. తరువాత ప్రసాద్.. జగదీష్ స్నానం చేస్తున్న గదికి బయట నుంచి గడియపెట్టి వరండాలో లుంగీ తీసుకుని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్నానానికి వెళ్లిన జగదీష్ బయట గడియ పెట్టి ఉండటంతో తలుపులు బాదగా పక్కింటి వారు వచ్చి చూసేసరికి ప్రసాద్ ఉరి వేసుకుని కనిపించాడు. సీమెన్‌గా ఎంపికైన ప్రసాద్ మార్కెట్లో అరటి పండ్ల వ్యాపారం చేసుకునే మాదాబత్తుల వెంకటరావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నెల రోజులు క్రితం పెద్ద కుమారుడు గణేష్‌కు వివాహమైంది. రెండో కుమారుడైన ప్రసాద్ సీమెన్‌గా ఎంపికై ఈ నెల 18న ముంబయిలో విధుల్లో చేరనున్నాడు. దీనికోసం తల్లిదండ్రులు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ప్రసాద్ భీమిలికి చెందిన ఓ యువతిని ప్రేమించాడని, ఆమె ఇంట్లో కోసం వస్తువులు కొని కూడా ఇచ్చాడని, తీరా ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు అతని స్నేహితులు చెబుతున్నారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై...
వర్ధన్నపేట: యువతి యువకుడు ప్రేమించుకుని ఆ ప్రేమ విఫలమై యువతి ఇంటిలోకి వెళ్లిన ఆ యువకుడు కాలిన గాయాలతో బయటకు రావడం, యువతిపై కిరోసిన్ పడి ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని దమ్మన్నపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యువకుడు దుబ్బ యాకయ్య అదే గ్రామానికి చెందిన యువతి గత కొందీ కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇటీవల ఇరువరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో పెద్ద మనుషుల సమక్షంలో ఎవరికీ సంబంధం లేకుండా తీర్మానం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడి వంటిపై కిరోసిన్‌తో మంటలు అంటుకోగా యువతి వంటిపై కూడా కిరోసిన్ పడింది. అయితే ఈ ఘటనలో యువకుడు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటిచే ప్రయత్నం చేశాడా.. లేక యువతి ఆ పని చేసిందా.. అనే విషయం పోలీసు విచారణలో స్పష్టం కానుంది. మంటలతో గాయపడిన యువకుడు యాకయ్యను హుటాహుటిన 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
వాణికి చెడు అలవాట్లు ఉన్నాయంటూ..
మారేడుపల్లి : పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి, శేషాచల కాలనీకి చెందిన జార్జి అలియాస్ జెర్రి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బోయినపల్లిలో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన వాణికి 2015లో లయోలా కాలేజీలో బీకాం చదువుతున్న సమయంలో తన స్నేహితురాలి ద్వారా జార్జితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేసినట్లు తెలిపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. జార్జి త్వరలో మరో యువతిని వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో శేషాచలకాలనీలోని అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితురాలికి మహిళా సంఘాలు సంఘీభావం తెలిపాయి. బాధితురాలితో సంప్రదింపులు జరిపిన జార్జి కుటుంబ సభ్యులు మూడురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వాణి తెలిపింది. ఇదిలా ఉండగా జార్జి మాత్రం వాణిని ప్రేమించలేదని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. వాణికి చెడు అలవాట్లు ఉన్నందున ఆమెకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాడు. -
ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని..
అమీర్‌పేట: ప్రేమించిన యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది చేసిందని మనస్తాపానికిలోనైన ఓ సాఫ్ట్వేర్ కంపనీ ఎండీ ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మంగళవారం అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్‌రెడ్డి (27) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని శ్రీ సాయితి టెక్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీగా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల నిఖిల్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె తిరస్కరించింది. దీంతో మనస్తాపానికిలోనైన అతను మంగళవారం తెల్లవారుజామున తన చాంబర్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం దీనిని గుర్తించిన సిబ్బంది ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరళించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ అజయ్‌కుమార్ తెలిపారు. -
కొంపముంచిన ఫేస్బుక్ ప్రేమ
టెక్కలి రూరల్: ఫేస్బుక్లో యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఏడాదికి పైగా చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగారు. యువతి పెళ్లి విషయం ప్రస్తావించడంతో యువకుడు ముఖం చాటేశాడు. మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రావివలస గ్రామానికి చెందిన యువతి డిప్లామో పూర్తిచేసి విశాఖపట్నంలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అక్కడ తన స్నేహితురాలి ఫేస్బుక్లో విజయనగరం జిల్లా మొదవలస గ్రామానికి చెందిన గిరిడి రాకేష్‌కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి యువకుడు ముఖం చాటేస్తూ తిరిగాడు. చివరకు నిలదీసే సరికి తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్ఐ షేక్‌ఖాదర్ బాషా వివరాలు సేకరించారు. -
నీవు లేక నేను లేను..
సనత్‌నగర్: ప్రియురాలు ఆత్మహత్యతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియుడు సైతం నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కుటుంబం కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. యాదగిరి కుమార్తె రిషిత (18) కూకట్‌పల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన వెంకటేష్ కుమారుడు రమేష్ (26) జగద్గిరిగుట్టలో ఉంటూ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఫతేనగర్‌లో ఉండే మేనమామ ఇంటికి రమేష్ తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ ఇంటికి సమీపంలోనే ఉండే రిషితతో ఏర్పడిన పరిచయం ఇరువురి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరి మధ్య ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రిషిత సోదరుడు వీరి ప్రేమను వ్యతిరేకించడమే కాకుండా తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రిషిత ఈ నెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రేమికుడు రమేష్ తీవ్ర మనస్తాపం చెందాడు. తన ప్రేయసి రిషిత లేని జీవితం తనకు వద్దంటూ అయినవారు, స్నేహితుల వద్ద చెప్పాడు. ఇదే క్రమంలో అందరూ చూస్తుండగా ఈ నెల 29న సాయంత్రం నాలుగతంతస్తుల భవనంపైకి ఎక్కి కిందకు దూకాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రియురాలు ఆత్మహత్యను జీర్ణించుకోలేక మనోవేదనతోనే రమేష్ ప్రాణాలు తీసుకున్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మా మతాలు వేరు గానీ.. మా నేపథ్యాలు ఒకటే. వాళ్ల పేరెంట్స్ వాళ్ల మత పద్థతిలోనే పెళ్లి చేస్తామన్నారు. రెండు లక్షలు కట్నం ఇస్తామన్నారు. మా పేరెంట్స్ మొదట్లో ఒప్పుకోలేదు. నేనే కష్టపడి ఒప్పించాను. తను మా ఇంటికి వచ్చాక కూడా వాళ్ల మతాన్నే పాటిస్తాను అంటోంది. దానికి మా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాకు అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేదు. ఇద్దరం కలిసి చాలా బాగుండేవాళ్లం. తనకి అన్యాయం చెయ్యడం ఇష్టం లేదు. దీనికి మంచి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్!– కృష్ణ ప్రేమకు మతం లేదు, కులం లేదని చెప్పినా నీకు ఎక్కదు! కట్నం తీసుకోవడం నేరమని చెప్పినా నీకు అర్థం కాదు!! ఏదైనా పెళ్లికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి అంటే విసుక్కుంటావు! నీకు అమ్మాయి నచ్చిందంతే! అంటే.. రూపం నచ్చిందంతే...!! అమ్మాయి కావాలి కాబట్టి ఇంట్లో వాళ్ల పీకల మీద కూర్చుని పెళ్లికి ఒప్పించావు. ఇప్పటికైనా మారు అన్నయ్యా ప్లీజ్!! నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో! తన మతాన్ని గౌరవించు..!! తన పద్ధతులను గౌరవించలేనివాడివి.. తనను మనస్ఫూర్తిగా అంగీకరించలేవు. నీ కోసం అమ్మాయి చెయ్యని త్యాగం లేదు. నీ కోసం తన వాళ్లని వదిలి నీ నమ్మకం మీద వచ్చింది..!! నువ్వు ఆ నమ్మకం మరిచి.. ఈ నమ్మకాల కోసం గింజుకుంటున్నావు..!! వద్దు అన్నయ్యా! అలా చెయ్యకు. ఏ నమ్మకమైనా నేర్పించేది ప్రేమే..!! నువ్వు ప్రేమనే నమ్మకం చేసుకో..!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమికులూ.. 'ఆత్మహత్యలకు పాల్పడవద్దు’
మన్సూరాబాద్: ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని లవ్ ఫెయిల్యూర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సతీష్‌గౌడ్ సూచించారు. ఎల్బీనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఇటీవల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందన్నారు. ఆ జంటకు కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. వారి ఇంట్లో పెద్దలకు నచ్చజెప్పి ఈ నెల 10న ఆర్య సమాజ్‌లో వివాహం జరిపించినట్లు తెలిపారు. ప్రేమే జీవితం కాదనే సత్యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల ప్రేమజంటల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, వీటిని నిరోధించటానికి అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రేమికులు 81065 87621 నంబర్‌ను సంప్రదిస్తే ఇంట్లోని పెద్దలను ఒప్పించి పెళ్లి జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. -
కూతురి ప్రేమ విఫలం.. తండ్రి ఆత్మహత్య
కృష్ణరాజపురం : కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన ఉదయ్ అదే ప్రాంతానికి చెందిన యువతి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అప్పటికే వివాహమైన ఉదయ్ తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టి ప్రేమ నాటకాన్ని కొనసాగించాడు. ఇరువురి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తండ్రి గతనెల 30వ తేదీన వారి వివాహానికి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. మహూర్తానికి సమయం మించిపోతున్నా ఉదయ్ రాకపోవడంతో గాలింపు చేపట్టగా హఠాత్తుగా ఆ యువతి ఇంటివద్ద ప్రత్యక్షమైన ఉదయ్ భార్య విషయం మొత్తం బయటపెట్టింది. కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక ఆ యువతి తండ్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని లేఅవుట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! ఈ మధ్యనే ఒక అబ్బాయిని కలిశాను. కలిసిన కొద్దిరోజుల్లోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. కానీ తన జీవితంలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. నన్ను ప్రస్తుతానికి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – కృప మనం ముచ్చటగా మూడో లవ్ స్టోరీ అయ్యామా చెల్లీ..? ఎందుకమ్మా అంత తొందరపాటు?? వాడు ఇద్దరికి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాడు... వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి కన్సిడర్ చెయ్యమ్మా... ఒట్టి పెంటగాడు.. వాడితో చెయ్యి కలిపితే.. మనకు అంటుకుంటుంది ఆ పెంట వాసన! ఈ సమాజం ఆ పెంట వాసన చూసి.. నిన్నూ రెస్పెక్ట్ చెయ్యదు!! ‘సార్..! కానీ ఫస్ట్, సెకండ్ లవ్ స్టోరీలు వర్కౌట్ కాక.. కృపతోనే లవ్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కదా సార్???’ నీలూ..! రెండు చోట్ల రిజెక్ట్ అయిన కాండిడేట్ నా చెల్లెలికి ఎందుకు? అసలు ఇలాంటి ఫెయిల్యూర్ కాండిడేట్ మీద అనవసరంగా సింపతీ చూపించి.. దాన్ని లవ్ అనుకుని, ఆ కన్ఫ్యూజన్లో హార్ట్ పారేసుకుని.. ఆ తర్వాత వీడు నెక్ట్స్ ఫిట్టింగ్ కోసం వెళ్లిపోతే.. కృప ఏం కావాలి??? అసలే స్టెబిలిటీ లేని యూజ్లెస్ ఫెలో వాడు.. మనకు వద్దే వద్దు!!‘విన్నావుగా కృప.. బీ కేర్‌ఫుల్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
మియాపూర్: ప్రేమ విఫలమై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగానాయక్ సమాచారం మేరకు... వైజాగ్ అక్కయ్య పాలెంకు చెందిన ముని కనకదుర్గ, ముని వెంకటరావుల కూతురు అంజలి ఉమామహేశ్వరి(23) వైజాగ్‌లోని సిన సెంట్రీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న జాజిబాబు, ఉమామహేశ్వరి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా జాజిబాబుకు వసుంధర అనే అమ్మాయి దగ్గరైంది. వసుంధరతో చాటింగ్ చేయడాన్ని గమనించిన ఉమ మహేశ్వరి.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య గొడవ రావడంతో వైజాగ్‌లోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ జరగడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరువురు దూరయమ్యారు. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్ ఆల్విన్‌కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత వసుంధర నుంచి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి దగ్గర్లో ఉన్న శ్రీకార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ముందు నా చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని శిక్షించాలి అంటూ సెల్ఫీ వీడియో తీసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడు పెళ్లికిఒప్పుకోలేదని ఆత్మహత్య..
గజపతినగరం రూరల్: గజపతినగరం ఠానా వీదికి చెందిన కర్రి గీత (22) మనస్తాపంతో బుధవారం ఇంటిలోనే ఉరివేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండల కేంద్రానికి చెందిన గవిరెడ్డి క్రాంత్ అనే యువకుడిని గీత ప్రేమించింది. క్రాంత్ ప్రస్తుతం జమ్మూలో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తుండగా... గీత పాలిటెక్నికల్ కోర్సు పూర్తి చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని గీత పలుమార్లు క్రాంత్‌ను ప్రశ్నించగా.. తర్వాత చేసుకుందాంలే అని బదులివ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను గజపతినగరం సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గీత మృతితో తల్లిదండ్రులు ఈశ్వరరావు, మంగమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అల్వాల్: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ మట్టయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రాజ్యం సుజాత కుమారుడు సాయికిరణ్(27) బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలల క్రితం సదరు యువతితో మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో మనస్తాపానికిలోనైన సాయికిరణ్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రాజ్యం సుజాత ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తాళిబొట్టు పట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ..
మంగళగిరి: మూడేళ్లుగా ఆ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటాడనుకుని నమ్మి మోసపోయింది. కొంతకాలంగా వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు పోలీసుల వద్దకు వెళ్లి తనకు ప్రేమించిన వాడితో వివాహం చేయించాలని కోరింది. కొద్ది రోజులుగా తనకు ఈ రోజు వివాహం అంటూ తాళిబొట్టు పట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. యువకుడిపై కేసు వద్దని తనతో వివాహం చేసుకునేలా ఒప్పిస్తే చాలని పోలీసులను కోరింది. ఎన్నిసార్లు బతిమాలినా యువకుడి మనస్సు కరగకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి చివరకు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కేవలం కుల జాడ్యం కారణంగానే తన లాంటి యువతులు మోసపోతున్నారని ఆవేదనతో రాసిన ఏడు పేజీల లేఖ సమాజంలో కుల అసమానతలపై మరోసారి ప్రశ్న లేవనెత్తింది. ‘‘అమ్మా... నేను ఇలా మోసపోతానని అనుకోలేదు.. ఏనాడూ మీకు చెడ్డ పేరు తేవాలని అనుకోలేదు.,. అయినా మోసపోయాను ఇక నేను బతకలేను.. నన్ను క్షమించండి..నా చివరి కోరిక మేరకు ప్రతి ఏడాది నా తరఫున కల్వరి సిరి మందిరంలో ప్రార్థనలు జరిగేలా చూడండి.’’ అంటూ రాసిన యువతి చివరి లేఖ మరోసారి కులాల అసమానతలపై ఆలోచన రేకెత్తించింది. సేకరించిన వివరాల మేరకు మండలంలోని నవులూరు ఉడా కాలనీలో నివసిస్తున్న గుడిసె లోయదాసు అన్నపూర్ణమ్మలకు ఇద్దరు సంతానం. నాగరాణి పెద్ద అమ్మాయి కాగా రమేష్ అనే కుమారుడు ఉన్నారు. లోయదాసు గతంలోనే మృతి చెందగా కృష్ణాజిల్లా నుంచి 12 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగరాణి మండలంలోని యర్రబాలెంలో కల బ్రిక్స్ ఇండస్ట్రీలో కూలి పనికి వెళ్తోంది. బాపనయ్యనగర్లో నివాసముంటున్న బల్లా నాగార్జున అదే బ్రిక్స్ ఇండస్ట్రీలో పనిచేస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో నాగార్జున తల్లితండ్రులు వివాహానికి ససేమిరా అనడంతో నాగార్జున కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నాగరాణి పది రోజుల కిందట రూరల్ పోలీసులను ఆశ్రయించింది. నాగార్జునను పిలిపించి తమకు వివాహం జరిపించాలని కోరడంతో నాగార్జునను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. నాగరాణి ఏరోజుకా రోజు పోలీసులు తనకు నాగార్జునతో పెళ్లి జరిపిస్తారని ప్రతిరోజు తాళిబొట్టుతో సహా స్టేషన్‌కు వెళుతోంది. తన ఆశలు నెరవేరకపోవడంతో చివరకు ఈనెల 26న తన నివాసంలో తన మనస్సులోని ఆవేదనంతా ఏడు పేజీల లేఖలో రాసి పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మంగళగిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నాగరాణి తల్లి అన్నపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు నాగరాజును అదుపులోకి తీసుకోగా గుంటూరు ఆసుపత్రిలో ఉన్న నాగరాణి నాగార్జునను కలవాలని మరోసారి పోలీసులను కోరింది. దీంతో పోలీసులు నాగార్జునను ఆసుపత్రికి తీసుకువెళ్లి అరగంట పాటు మాట్లాడించారు. చివరగా నాగార్జునతో మాట్లాడిన నాగరాణి అనంతరం పరిస్థితి విషమించడంతో ఈనెల 29 వతేదీ తెల్లవారుజామున కన్నుమూసింది. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం మంగళవారం మృతదేహాన్ని నవులూరు ఉడా కాలనీలోని నివాసానికి తరలించారు. తన కుమార్తె మోస పోయిందని తల్లి చేస్తున్న ఆర్తనాదాలు చుట్టుపక్కల వారిని కంట తడి పెట్టించాయి. దళిత సంఘాల నేతలు కారుమంచి రామారావు, ఎం.రవి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ రాంప్రసాద్, రూరల్ సీఐ శరత్‌బాబు, ఎస్ఐ నాగుల్‌మీరా వివరాలు సేకరించారు. రూరల్ సీఐ శరత్‌బాబు మాట్లాడుతూ యువతి తల్లి ఫిర్యాదు మేరకు నాగార్జునను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి అందవలసిన పరిహారం అందజేయడంతో పాటు నాగరాణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నా! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో నేను చూస్తుంటే తనూ చూడటం స్టార్ట్ చేసింది. అలా కొన్నిరోజుల తర్వాత తన ఫోన్ నంబర్ అడిగాను. ఇచ్చింది. ఫోన్లోనే ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఓకే అంది. బాగానే మాట్లాడుకున్నాం. అన్నీ షేర్ చేసుకున్నాం. కొన్ని రోజులకి మా మధ్య క్యాస్ట్ గురించి చర్చ వచ్చింది. మా కులాలు వేరని తెలిసింది. దాంతో ‘మా ఇంట్లో ఒప్పుకోరు. ఇక్కడితో వదిలేద్దాం’ అంది. సరే..! నీకే లేనప్పుడు నాకెందుకని ఫోన్లు, మెసేజులు చెయ్యడం మానేశాను. తర్వాత కొన్ని రోజులకి తన నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాను. ‘మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అంది. దానికి నేను ఒప్పుకోలేదు. ‘మనం వెళ్లిపోతే మన ఇంట్లో వాళ్లకి ఇబ్బంది అవుతుంది. వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. తను వినట్లేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటోంది. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను’ అని బెదిరిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా ఒక్కడికే కాకుండా ఇద్దరికీ హెల్ప్ అయ్యే సలహా ఇవ్వండి ప్లీజ్. – ప్రవీణ్ బెదిరిస్తోందా????‘సార్..! ‘‘బెదిరిస్తోందా..దా..దా..?’’ అని దీర్ఘం తీస్తున్నారంటే అమ్మాయి నిజంగా ఏం చేసుకోదని లైట్‌గా తీసుకుంటున్నారా సార్? మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్! ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారని అంటారా సార్? మనకు లవ్ వర్కౌట్ కాకపోతే ఇంక వేరే మార్గమే లేదని మీ చెల్లెలు వాపోతుంటే ఏంటి సార్ మీ సెటైర్లు..?? ‘‘బెదిరిస్తోందా.. దా..దా’’?? అని అంటున్నారు. టూ మచ్ సార్!’అది కాదు నీలూ! ముందేమో తాను క్యాస్ట్ సేమ్ కాదు.. లవ్ స్టాప్ చేద్దామంటే.. తనకేనా పొగరు నేను కూడా కట్ ఆఫ్ చేసేస్తా.. అని పోజ్ కొట్టాడు ప్రవీణ్. లవ్ లేకపోయినా బతకొచ్చు అనుకుంటున్నాడు. పాపం ఆ అమ్మాయి ప్రాణం సైతం వదిలేస్తా ప్రేమ కోసం అని బాధపడుతుంటే.. పారిపోవడానికి కూడా రెడీ అంటుంటే... మనవాడు స్లో మోషన్లో మనకు ఉత్తరం రాస్తున్నాడని కొంచెం ఫీలయ్యి వెక్కిరించా నీలాంబరి. ‘‘బెదిరిస్తుందా..దా..దా?’’ అని.‘మరి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ప్రవీణ్ వాళ్ల ఇంట్లో కన్విన్స్ చేసి మమ్మీ డాడీలను తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్‌ని కన్విన్స్ చేసుకోవాలి!!‘తంతారేమో సార్!?’బెదిరిస్తున్నావా నీలూ???? ‘లేదు సార్! ప్రవీణ్ ఈజ్ స్ట్రాంగ్. మీరు చెప్పినట్లే చేస్తాడు!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రియురాలు మాట్లాడటం లేదని ఓ మైనర్..
చాంద్రాయణగుట్ట: ప్రియురాలు మాట్లాడటం లేదని మనస్థాపానికి గురైన ఓ మైనర్ బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ టి.సాయి కుమార్ గౌడ్ తెలిపిన మేరకు.. ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్‌కు చెందిన యాదయ్యకు ఒక కుమారుడు బి.నరేష్(16), ఇద్దరు కుమార్తెలు. నరేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చాంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లిన నరేష్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నైట్ షిప్ట్ కూడా డ్యూటీ ఉందని...ఇంటికి రావడం లేదని తెలిపాడు. బుధవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వారి వారి పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న నరేష్ ఇంటి పైకప్పు రేకుల పైప్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తలుపులు నెట్టినా రాకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా నరేష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఓ బాలికతో నరేష్ ప్రేమలో ఉన్నాడని....ఇటీవల ఆ బాలిక మాట్లాడకపోవడంతో వారం రోజుల నుంచి ముభా వంగా ఉన్నాడని....ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నైట్ డ్యూటీ అని చెప్పి...ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన నరేష్.. తాను నైట్ డ్యూటీ చేస్తున్నానని ఇంటికి ఫోన్ చేసిన నరేష్....స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్నేహితులంతా కలిసి మంగళవారం రాత్రి విందు చేసుకొని బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరుగా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. నరేష్ ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి అతని స్నేహితులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎప్పుడు చూసినా స్నేహితులు...స్నేహితులంటూ వెళ్లేవాడని...చెడు స్నేహం కారణంగానే తమకొడుకును పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నాకు ఒక అమ్మాయితో త్రీ ఇయర్స్‌గా పరిచయముంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అసలు సమస్య ఏమిటంటే.. తనకి అందరితో మాట్లాడటమంటే ఇష్టం. అబ్బాయిలతో అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతోంది. వాళ్లతో మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. దాంతో నా ఫ్రెండ్స్ చాలా మంది ‘ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఆ అమ్మాయిని లవ్ చెయ్యకు’ అని అంటున్నారు. దాంతో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. ప్లీజ్ ఏదైనా మంచి సలహా ఇవ్వండి. – జయరాజు చెయ్యి..! చెయ్యకు!!‘ఏంటి సార్?? డబుల్ మీనింగ్ ఆన్సర్ ఇస్తున్నారు?’చెయ్యగలిగితే చెయ్యి..! చెయ్యలేకపోతే మానెయ్యి!!‘సార్...!! మరీ ఇంత పచ్చిగా డబుల్ మీనింగ్‌లో ఆన్సర్ ఇస్తున్నారేంటి సార్??’నీలూ! జయరాజు ఏం చేస్తాడు.. చెయ్యాలంటే దమ్ము ఉండాలి.‘సార్! స్టాప్ ఇట్!!’చూశావా నీలూ! నేను చాలా సింపుల్‌గా లవ్ చెయ్యగలిగితే చెయ్యి అన్నాను. లవ్వు చేసే దమ్ము లేకపోతే మానెయ్యి అన్నాను. నేను అంత సింగిల్ మీనింగ్‌తో చెప్పినా నీకు డబుల్ మీనింగ్‌లా అనిపించింది.. చెప్పడంలో డబుల్ మీనింగ్ లేదు నీ మనసులో డబుల్ మీనింగ్ ఉంది కాబట్టి నీకది బూతులా అనిపించింది.‘అబ్బా! ఏం కొట్టారు సార్! మీ కొట్టుడే కొట్టుడు సార్!!’నీలూ! ఏంటి ఆ మాటలు? స్టాప్ ఇట్ ఐసే!!‘చూశారా సార్! నేనేమన్నాను? ఎంత సూపర్ డైలాగ్ కొట్టి నాకు స్పష్టత తెచ్చారు అని చెబితే మీరు డర్టీ మైండ్‌తో ఇంకో రకంగా రిసీవ్ చేసుకున్నారు. నా మాటలు సింపుల్! మీరే డబుల్!!’చూశావా జయరాజు..! నీ ఫ్రెండ్స్ డబుల్ మీనింగ్ గాళ్లు. వాళ్లను నమ్మద్దు. నీ లవర్ సింపుల్ గర్ల్. సింపుల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో...‘అవును జయరాజు! అపార్థాలు ఆన్సర్లు ఇచ్చే మా మధ్యే వస్తున్నప్పుడు.. సున్నితమైన మీ మనసులకు అపార్థాలు రావడం నాచురల్. గుడ్ లక్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేయసి చున్నీతోనే ఉరి
కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో ప్రారంభమైన పరిచయాన్ని ప్రేమగా మార్చాలనుకున్నాడు. మనద్దిరం ప్రేమించుకుందామని...భవిష్యత్‌లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. వయసులో తనకంటే చిన్నవాడివని అది కుదిరే పని కాదని ఆ యువతి పదే పదే నచ్చచెబుతూ వచ్చింది. ఇంతలో ఆ యువతికి పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. తనకు పెళ్లి కుదిరిందని ఆ పెళ్లికి తాను అంగీకారం కూడా తెలిపానని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఓసారి మాట్లాడాలని పిలిచి, పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటానని ఆ యవతి స్పష్టం చేయడంతో ఆ యువకుడు కాస్త దూరం వెళ్లి ఆమె మెడలో ఉన్న చున్నీతో చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయబ్రాంతులకు లోనైన యువతి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏం చేయాలో తెలియక మృతదేహం వద్ద ఒంటరిగానే కూర్చుని రోదించింది. దీంతో చుట్టు పక్కల పంట పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు అక్కడకు వచ్చి ఆమెను వారించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్ దాటి ఆరుఖానాలు సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటలు సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి: మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్(17) అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలలు క్రితం వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్ ఏడాది వయస్సులో చిన్న కావడంతో ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ వెంటపడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరినట్టు చెబుతున్నారు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. దీంతో ఆమె కూడా పెళ్లికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న ప్రవీణ్ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది. మాట్లాడేందుకు రమ్మని.... ఇదిలా ఉండగా చీపురుపల్లి శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్ ఆ యువతిని పిలిచినట్టు తెలిసింది. అయితే ఆ యువతి వెళ్లిన సమయానికి ప్రవీణ్ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని తిరిగి ఆ యువతి వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్ తాను వచ్చానని రమ్మని ఫోన్లో పిలిచాడు. దీంతో ఆ యువతి వెళ్లగా అమ్మవారి ఆలయం నుంచి పొలాలు గుండా ఆరుఖానాలు వైపు నడుచుకుంటూ వచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు. అలా కుదరదని ఆ యువతి నచ్చజెప్పింది. దీనికి మనస్తాపం చెందాడు. కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆమె చున్నీ పట్టుకుని వెళ్లి చాలా సేపు తరువాత ఫోన్ చేసి ఇదే ఆఖరి మాట గుడ్‌బై అని ఫోన్ పెట్టేసాడు. దీంతో ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ యవతి కన్నీరు మున్నీరుగా విలపించింది. దర్యాప్తు చేస్తాం.... మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందింది. వెంటనే సిబ్బందిని పంపించాం. అప్పటికే యువతి అక్కడ రోదిస్తూ ఉంది. దర్యాప్తు చేస్తున్నాం. ఆ యువతి వాంగ్మూలం కూడా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. – ఐ.దుర్గాప్రసాద్, ఎస్ఐ, చీపురుపల్లి -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేను మీ లవ్ డాక్టర్ కాలమ్ ప్రతిరోజూ చదువుతాను. నాకొక సమస్య వచ్చింది సార్. నేను నా మేనమామ కూతురిని ప్రేమించాను. తనూ నన్ను ప్రేమించింది. అలా మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాం. సడెన్‌గా తన నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. చాలా కాలం బాధపడ్డాను. తర్వాత తను వేరే అతడిని ప్రేమిస్తోందని తెలిసింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాను. ‘సారీ బావా.. నేను ఇంకెప్పుడూ ఇలా చెయ్యను, నిన్నే పెళ్లి చేసుకుంటాను’ అంది. దాంతో నేను ‘సరే మారుతుందిలే.. పెళ్లి చేసుకుందాం’ అనుకున్నాను. కానీ మళ్ళీ ఫోన్, మెసేజ్ ఏమీ చెయ్యట్లేదు. అలాగని ఇంట్లో ఏమైనా సమస్యా అంటే అది కూడా లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా నేను చాలా ఇష్టమే. అసలు ఈ అమ్మాయిని నమ్మొచ్చో లేదో అర్థం కావడం లేదు. మంచి సలహా ఇవ్వండి సార్ ప్లీజ్. – రవి ‘రవీ.. ఈ లవ్ డాక్టర్ని ఆ ఒక్కటీ అడగొద్దు!!నువ్వు ఎన్నిసార్లు అడిగినా...ఎన్ని రకాలుగా అడిగినా...ఏమార్చి అడిగినా...బతిమాలీ బామాలీ అడిగినా...కాళ్లూ గడ్డం పట్టుకుని అడిగినా...మీసం ముట్టుకుని అడిగినా...నో.. అనే చెబుతారు!!మేనరికాలు.. ససేమిరా అంటారు.మీకు పుట్టబోయే పిల్లలు అవిటివాళ్లు అయ్యే చాన్స్ ఉందని రివర్స్‌లో మిమ్మల్నే కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి.. బామాలి.. నీకు మీసం ఉంటే.. రోషం ఉంటే వద్దని అడుక్కుంటారు.. అందుకే ఇంకో లవ్ డాక్టర్ ఎవరైనా ఉన్నారేమో అడుక్కోవడం బెటర్!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి..
సాక్షి, ఆత్మకూర్ (కొత్తకోట): నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయి దూరమైందని కలత చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌గౌడ్(25) హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఉంటూ కన్ స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ అమ్మాయి కిరణ్ ప్రేమను తిరస్కరించింది. అనంతరం హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్టేషన్లో, అలాగే షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్యకు పాల్పడుతున్న కారణాలను సూసైడ్ నోట్‌తోపాటు తన ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అనంతరం మండలంలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మధ్యాహ్నం 2.25 గంటలకు ఏపీ సంపర్క్ క్రాంతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో కిరణ్ మృతదేహం ముక్కలుగా విడిపోయి చాలాదూరం పడిపోయాయి. గద్వాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మా ఆఫీస్‌లో నా పక్క సీట్లోనే కూర్చుంటుంది. ఎప్పుడూ ఏదో పాట పాడుతూనే ఉంటుంది. ఆ పాట నాకోసమే అనిపిస్తుంది. అడిగేద్దామంటే జాబ్ పోతుందేమోనని భయం! ఏం చెయ్యమంటారు సార్? – శివ కుమార్ పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదా వ వహవా ఎవరేమనుకున్నా వినదీ ప్రేమవ వహవా ఎదురేమున్నా కనదీ ప్రేమవ వహవా కనులే తెరిచిన కల ఈ ప్రేమవ వహవా ఎదురే రాకున్నా నిజమీ ప్రేమఓ చెలీ.. సఖీ.. ప్రియా.. యూ లవ్ మీ నౌ ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నే....పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ..ఓ.. పల్లవి ఐతేప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ..ఓ.. ప్రేయసి కాదాఓ.. ఓహోహో.. వయస్సాగక నిన్ను కలిసిననన్ను మరచిన పదే పదే పరాకులేఓ.. ఓ... నీ ఆశలో.. నీ ధ్యాసలో.. చిగురించగ అదే అదే నీదాయెలేప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంతే అది ప్రేమించిందో ఏమో నన్నే ఐ లవ్ యు అంటుందేనువ్వంటే చాలా ఇష్టం లవ్వంటే ఎంతో ఇష్టంఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు.....‘ఈ పాట పాడాలా సార్? అమ్మాయి ఫీల్ అయ్యి ముందు పీకుతుంది. తర్వాత బాస్‌కి చెప్పి ఉద్యోగం పీకిస్తుంది సార్!’డైరెక్ట్‌గా చెప్పలేనప్పుడు ఇదో మెథడ్ నీలూ! అమ్మాయి అర్థం చేసుకుని చరణం అందుకుంటే ఓకే... చరణాలకు ఉన్న చెప్పు తీసి.. బాస్ దగ్గరకు తీసుకుని వెళ్తే.. ‘‘అయ్యో తను అలా అనుకున్నారా..? నేనేదో నా వంతు పాట పాడుకుంటున్నాను సార్’’ అని సంజాయిషీ ఇచ్చుకోవచ్చు! -ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -lovedoctorram@sakshi.com -
యువతిపై యాసిడ్ దాడి
పార్వతీపురం: పట్టణంలోని వేమకోటివారి వీధికి చెందిన ఓ యువతిపై శివశంకర్ అనే యువకుడు యాసిడ్ పోసిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై ఉప్పిలి మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వేమకోటవారివీధిలో నివాసం ఉంటున్న యువతిని పట్టణానికి చెందిన శివశంకర్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటబడేవాడు. అయితే కొంతకాలంగా ఉద్యోగం కోసం శివశంకర్ దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి ఆమెకు మెసేజ్‌లు పంపించడం చేసేవాడు. అయితే ఆ యువతి అతని ప్రేమను తిరస్కరించడంతో... తీవ్ర ఆగ్రహానికి లోనైన శివశంకర్ ఇటీవల దుబాయ్ నుంచి వచ్చేశాడు. ఈ క్రమంలో బుధవారం బాధిత యువతి ఇంటికెళ్లి ముఖంపై యాసిడ్ పోశాడు. ఆ సమయంలో యువతి ముఖం పక్కకు తిప్పడంతో మెడపై యాసిడ్ పడింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి నుంచి ఎస్సై వివరాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేనొక అబ్బాయిని ఆరేళ్లుగా లవ్ చేస్తున్నాను. తను ఇప్పుడు యూఎస్‌లో ఉంటున్నాడు. ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. కానీ ప్రాబ్లమ్ ఏమిటంటే... నేను వాళ్ల ఫ్యామిలీకి అంతగా నచ్చలేదు. మా మతాలు వేరు. ‘మా ఫ్యామిలీ కోసం నువ్వు మారాలి’ అంటున్నాడు. ఇంకా మా విషయం మా ఇంట్లో తెలియదు. తను చాలా మంచివాడు అన్నయ్యా. బట్ ఇప్పుడు యూఎస్ వస్తేనే పెళ్లి చేసుకోవడానికి కుదురుతుందని అంటున్నాడు అన్నయ్యా. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్. – కీర్తి మారడానికి, మార్చుకోవడానికి ఇదేమైనా చున్నీనా తల్లీ..!? జీవితం. ఎన్నో ఏళ్లుగా... అసలు నువ్వు పుట్టకముందు నీ తల్లి కడుపులో ఉన్నప్పుడు... ధరించిన అభిమానం తల్లీ!! నువ్వు అన్నది ఒక మనిషి కాదు.. ఒక ఫిలాసఫీ.. ఒక జీవన విధానం.. ఒక నమ్మకం.. ఎన్నో ఏళ్లు మన ఇంట్లో వ్యవస్థ మనకు ఉగ్గు పాలతో పట్టిన మన ఉనికి... మారకూడదు.. ఎప్పుడూ ఇంకొకరి కోసం మారకూడదు. నువ్వు ఎలా ఉన్నావో అలా నచ్చే కదా నిన్ను ఇష్టపడింది. నువ్వు మారిన మరుక్షణం నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. నిజానికి రిలేషన్షిప్లో నువ్వు తగ్గిపోతావు.‘సార్ ఇంత ఉపన్యాసం యూత్‌కి అవసరమా సార్? వాళ్లకు తలపోటు వస్తుంది. ఏదో పుస్తకంలో నీతుల్లాగా చెప్పుకుంటూనే పోతున్నారు. అన్నీ బౌన్సర్లలాగ నెత్తి మీద నుంచి వెళ్లిపోతున్నాయి. కొంచెం సింపుల్‌గా చెప్పండి ప్లీజ్!’కీర్తీ! నువ్వు నమ్మిన దాన్ని వదులుకున్న రోజు.. అది ఏదేమైనా కావచ్చు... నీలో ఒక భాగం కట్ అయిపోయినట్టే...! నువ్వు ఫుల్‌గా అనిపించవు. ప్రేమించుకున్నది మీరిద్దరూ. పెళ్లి చేసుకోవలసింది మీరిద్దరూ. వాడికి ప్రేమ ఉంటే చేసుకుంటాడు. వాడికి డౌట్స్ ఉంటే నువ్వే చేసుకోవద్దు. బీ స్ట్రాంగ్!! lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నేను లవ్‌లో ఫెయిలయ్యా: ఐశ్వర్యరాజేష్
చెన్నై : ఆ విషయంలో తాను దురదృష్టవంతురాలిని అని అంటోంది నటి ఐశ్వర్యరాజేశ్. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది ఈ బ్యూటీనే అవుతుంది. నటిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన కథానాయకి ఈమె. ఈ అచ్చ తెలుగు భామ తమిళంలో ప్రముఖ కథానాయకిగా రాణించడం విశేషమే. ఇటీవలే మాతృభాషలోకి ఎంటర్ అయిన ఐశ్యర్యరాజేశ్ చిన్న వయసులోనే అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించి కథానాయకి స్థాయికి ఎదిగింది. ఇటీవల నటించిన కనా చిత్రంలో సెంట్రిక్ కథాపాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్యరాజేశ్ వ్యక్తిగతంగా, ముఖ్యంగా ప్రేమలో ఓడిపోయానని చెప్పింది. అంతే కాదు ఆ విషయంలో తాను దురదృష్టవంతురాలినని పేర్కొంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ప్రేమ, సినిమా, మగాళ్ల గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికీ సింగిల్‌నేనని తెలిపింది. ప్లస్‌టూ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. అయితే అది మొదట్లోనే ముగిసిపోయిందని అంది. తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలే తన్నుకుపోయి తనను మోసం చేసిందని చెప్పింది. ఆ తరువాత కొన్నేళ్లకు మరోసారి ప్రేమలో పడ్డానని, అప్పుడూ తాము విడిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ప్రేమిస్తే అది కలకాలం సాగాలని భావించే అమ్మాయిని తానని అంది. కొందరు కొంత కాలం ప్రేమించుకుని బ్రేకప్ అయిన వెంటనే మరొకరిని ప్రేమిస్తుంటారని, అది ఎలా సాధ్యమో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. ఒక నటి ప్రేమించడం అన్నది సులభం కాదని, అయినా ప్రేమించడం ఒక మంచి అనుభవం అని అంది. ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టి సారిస్తున్నానని అంది. తనకు బందా చేసే కుర్రాళ్లు, పని పాటాలేకుండా తిరిగే వాళ్లు తనకు నచ్చరని ఐశ్వర్యరాజేశ్ చెప్పింది. -
ప్రేమికుడి వంచనతో యువతి ఆత్మహత్య
కర్ణాటక ,మైసూరు : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమికుడు మోసం చేయడంతో మనస్థాపానికి గురై యువతి మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం జిల్లాలోని హుణుసూరు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కట్టెమళలవాడి పట్టణానికి చెందిన అర్పిత(19)అదే ప్రాంతానికి చెందిన లోకేశ్‌గౌడ అనే యవకుడు ఏడాది కాలంగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని యువతిని నమ్మించిన నిందితుడు కొద్ది కాలంగా యువతితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహం చేసుకోవాలంటూ యువతి కొద్ది రోజులుగా ఒత్తిడి చేయడంతో లోకేశ్‌గౌడ ముఖం చాటేశాడు. మోసాన్ని తట్టుకోలేకపోయిన అర్పిత మరణ వాంగ్మూలాన్ని రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో నమ్మించి దారుణంగా మోసం చేసిన లోకేశ్‌గౌడకు జీవితఖైదు శిక్ష విధించాలని, తన మరణానికి లోకేశ్గౌడనే కారణమని పేర్కొంటూ వాంగ్మూలంలో పేర్కొంది. అర్పిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు హుణుసూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
వేర్వేరుచోట్ల ముగ్గురి ఆత్మహత్య
నూరేళ్ల జీవితాన్ని క్షణికావేశంతో చిదిమేసుకున్నారు. ఉపాధ్యాయులు మందలించారని ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థి, ప్రేమ విఫలమైందని పాతనగరంలో ఓ యువకుడు, వ్యక్తిగత కారణాలతో గాజువాకలో మరో యువకుడు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కన్నవారిని, కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ముంచంగిపుట్టు(పెదబయలు): ఉపాధ్యాయులు మందలించడంతో ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల–1లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇదే మండలం దోడిపుట్టు గ్రామానికి చెందిన కొర్రా మోహనరావు(13) అనే విద్యార్థి బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల ఉపాధ్యాయులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొర్రా మోహనరావు తరుచూ తరగతులకు గైర్హాజరవుతున్నాడు. ఇదే తరహాలో రెండు రెండు రోజులుగా పాఠశాలకు రాలేదు. బుధవారం మధ్యాహ్న భోజనం సమయంలో పాఠశాలకు రావడంతో ఉపా«ధ్యాయులు మందలించారు. అనంతరం భోజనం చేసి, తరగతి గదికి వెళ్లకుండా వసతి గృహంలో ఉండిపోయాడు. తోటి విద్యార్థులందరూ తరగతి గదులకు వెళ్లిపోయిన తరువాత మోహనరావు నైలాన్ తాడుతో శ్లాబు కొక్కేనికి ఉరి వేసికుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే అటుగా వెళ్లిన కొంతమంది విద్యార్థులు చూసి ఉపాధ్యాయులకు చెప్పడంతో హెచ్ఎం మాణిక్యాలరావు, ఉపాధ్యాయులు హాస్టల్ గది కి వెళ్లి, విద్యార్థిని కిందకు దింపి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. ఉపాధ్యాయుల వల్లే... ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో మోహన్‌రావు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చదువుకోవడానికి వెళ్లిన కుమారుడు శవంగా మారాడని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి తండ్రి కొర్రా రామారావు ఆరోపించారు. తన కుమారుడు సక్రమంగానే పాఠశాలకు వెళ్తాడని, మంగళవారం తోటిస్నేహితులతో కలిసి స్వగ్రామం దోడిపుట్టుకు వచ్చాడని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం తీసుకుని బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడని తెలిపాడు. పాఠశాలకు వెళ్లిన కొద్ది గంటలకే మృతి చెందాడని వాపోయాడు. దీనంతటికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తన కుమారుడి మృతిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపా«ధ్యాయులు, హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు డిమాండ్ చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ అరుణ్‌కిరణ్ పీహెచ్‌సీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అందరినీ విచారించి కేసు నమోదు చేశారు. గాజువాక గణేష్‌నగర్‌లో... గాజువాక : గాజువాక మార్కెట్ సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అక్కయ్యపాలేనికి చెందిన నక్కా సన్యాసిరావు (25) గాజువాకలోని గణేష్‌నగర్‌లో ఒంటరిగా నివాసముంటున్నాడు. ఇక్కడి మార్కెట్ సమీపంలోని రాజీవ్‌మార్గ్‌లో ఆరేడేళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులందరూ నగరంలోనే ఉంటున్నారు. మేనమామ కుమార్తెను వివాహం చేసుకోవాలని మంగళవారం రాత్రి అతడి తల్లిదండ్రులు సన్యాసిరావును ఫోన్లో అడిగారు. తనకు ఇష్టం లేదని, వివాహం విషయం తరువాత మాట్లాడుదామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తరువాత ఫోన్ స్విచాఫ్ అయ్యింది. ఇంతలో సన్యాసిరావు తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బుధవారం ఉదయం సమాచారం అందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన సోదరుడుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన ఇబ్బందులు లేవని మృతుని అన్న రామస్వామి గాజువాక పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తమకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సీఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపంతో యువకుడు... పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): పాతనగరం పరిధిలో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతనగరం 25వ వార్డు పరిధి చిలకపేట గ్యాసు గోదాము వద్ద తల్లిదండ్రులతో కలిసి సూరాడ నూకరాజు (21) నివసిస్తున్నాడు. ఈ నెల 12న అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు. మరుసటి రోజు ఉదయం విషయాన్ని గమనించిన తల్లి సూరాడ లక్ష్మి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో నూకరాజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న అనుమానాన్ని తల్లి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను చనిపోయాక నా ప్రేమ నిజమని నమ్ము
వెల్గటూరు(ధర్మపురి): ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేక నిద్రమాత్రలు మింగింది. బాధితురాలి కుటుం బసభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గ టూరు మండలం ముక్కట్రావుపేటకు చెందిన కొప్పుల స్వామి–సుశీలకు ఐదుగురు కూతుళ్లు. చిన్నకుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం జగిత్యాలలోని జ్యోత్స్న ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేసింది. ఈక్రమంలో అక్కడే పనిచేస్తున్న జగిత్యాలకు చెందిన కిరణ్‌తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అనూష కరీంనగర్‌లోని అపెక్స్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. వీరి ప్రేమాయణం మూ డేళ్లు కొనసాగింది. ఈక్రమంలో అనూష పెళ్లి చేసుకుందామనడంతో, మన కులాలు వేరని, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని కిరణ్ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని తన రూములో సూసైడ్ నోట్ రాసుకుని, స్వగ్రామం ముక్కట్రావుపేటకు చేరుకుని నిద్రమాత్రలు మింగింది. ఆలస్యంగా గమనించిన తల్లితండ్రులు ఆమెను కరీంనగర్ అపెక్స్ ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో పోరాడుతోంది. సూసైడ్ నోట్ వివరాలు.. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి. అక్కయ్యలు బావలు అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి. నేను ఎంతగానో ప్రేమించిన కిరణ్ వారి ఫ్యామిలీ నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. నేను ప్రాణంగా భావించిన కిరణ్ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. పైగా మన కుటుంబాన్ని మొత్తంగా రోడ్డున పడేస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన ద్వేషించడం తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవ్వరినీ తెలిసి బాధపెట్టలేదు. నా చావుకు పూర్తిగా కిరణ్ కుటుంబమే కారణం. నాకు బతకాలని ఉంది. అందరి ఆడపిల్లల్లాగా ఉండాలని ఉంది. అయినా కిరణ్ పెట్టే టార్చర్‌ను భరించలేకపోతున్నాను. అందుకే అందరిని విడిచి వెళ్తున్నాను. కిరణ్ నా ప్రాణాలను అడిగావు కదా ఇస్తున్నాను. నేను చనిపోయాక అయినా నా ప్రేమ నిజమని నమ్ము. ఇప్పటికైనా ఆడపిల్లను అనుమానించడం మానుకో, నీవు జాగ్రత్త. లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేసుకో. బై నిన్ను ప్రాణంగా త్రీ ఇయర్స్ ప్రేమించిన నీ అను’ అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మీరెప్పుడూ ఎందుకని అమ్మాయిలనే సపోర్ట్ చేస్తారు? నాకొకటి అనిపిస్తోంది. బహుశ ఒక ఆర్గనైజేషన్ నేమ్‌తో మీరు సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయిలు తప్పు చేసినా ఏం అనట్లేదనిపిస్తోంది. ఇప్పుడు నాకు న్యాయంగా సమాధానం చెప్పండి. తనే నన్ను ‘లవ్ చేశాను’ అంది. తనే ‘మా వాళ్లు ఒప్పుకోరు సారీ’ అంది. ఈ మధ్యలో నన్ను పిచ్చోడిని చేసి తన అవసరాలు, ఆశలు అన్నీ తీర్చుకుని వాళ్ల పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. అంటే తనకో క్లారిటీ ఉందనేగా అర్థం. అదే విషయం నాకు చెప్పి ఉంటే.. నేను హ్యాపీగా తిరిగి, హ్యాపీగా మరిచిపోయి ఉండేవాడినిగా? సార్ మాట మార్చకండి. న్యాయం చెప్పండి. ఆ అమ్మాయిది తప్పేనని ఒప్పుకోండి. కనీసం నా మనసు సంతోషిస్తుంది.– రఘు అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... అమ్మాయిదే తప్పు... ‘సార్... రామకోటి లాగ.. తప్పు కోటి రాస్తున్నారు. ఎందుకో మీరు అలా రాస్తుంటే మీరు లెంపలేసుకుంటున్నారేమోనన్న ఫీలింగ్ రఘుకి వచ్చి చాలా.. చాలా.. చాలా.. చాలా... చాలా... సంతోషిస్తాడు సార్!’ అని కడుపు పట్టుకుని నేల మీద దొల్లుతూ నీలాంబరి నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ ఉండిపోయింది!! lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
ప్రేమించిన యువతికి సెల్ఫీ సూసైడ్
తిరువొత్తియూరు: యువతి ప్రేమించలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫీ తీసి ప్రేమించిన విద్యార్థిని వాట్సాప్‌నకు పంపాడు. అనంతరం యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడునులోని కోవై సమీపం సింగనల్లూరులో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కోవై, సింగనల్లూరుకు చెందిన సత్యశీలన్ కుమారుడు హరిహరసుదన్ (19). ఇతను ఈసానరిలోని ప్రైవేట్ పాఠశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతను మరో కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని చాలాకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల ముందు హరిహరసుదన్ తన ప్రేమ సంగతిని ఆ విద్యార్థినికి తెలిపాడు. ఆ విద్యార్థిని ప్రేమను తిరస్కరించి అతన్ని తిట్టి పంపినట్టు తెలిసింది. దీంతో విరక్తి చెందిన హరిహరసుదన్ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు వేలాడి సెల్ఫీ తీసుకున్నాడు. ఆ చిత్రాన్ని ఆ యువతి వాట్సాప్‌నకు పంపాడు. తరువాత అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మీరు అమ్మాయిలకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. అందుకే మీరంటే ఇష్టం. నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను. తను కూడా మీలానే అమ్మాయిలని చాలా గౌరవిస్తాడు. అలానే వాళ్ల మమ్మీ అంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ల మమ్మీ మా పెళ్లికి నో అంటున్నారు. ‘ఒప్పుకోకపోతే లైఫ్‌లో పెళ్లే చేసుకోను. నీ మాట కాదని ఆ అమ్మాయినీ చేసుకోను’ అని చెప్పాడట వాళ్ల మమ్మీకి. ఆమె మనసు గెలవాలంటే నేనేం చెయ్యాలి? – రాధిక ‘పడింది సార్.. బాంబు..! దీనికి ఆన్సర్ చెప్పలేకపోతే... మీ మీద లవర్స్‌కి ఫుల్‌గా కాన్ఫిడెన్స్ కూలిపోతుంది సార్!’ అవును నీలూ చాలా టఫ్ క్వశ్చన్. నువ్వేమైనా ట్రై చేస్తావా ఆన్సర్ చెప్పడానికి... ‘సార్ రాసింది మీ సిస్టర్! అబ్బాయి రాసుంటే నేనే ఆన్సర్ ఇచ్చేదాన్ని!’ ఫర్ సపోజ్ అబ్బాయే రాశాడనుకుందాం. ఈ అబ్బాయికి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం కదా నీలూ! వాళ్ల అమ్మకి అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా. మరి అబ్బాయేమో మమ్మీ..మమ్మీ..మమ్మీ.. అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు కదా.. ఆ అబ్బాయికి ఏం ఆన్సర్ ఇస్తావు నీలూ????? ‘చెబుతాను సార్..! సూపర్ ఆన్సర్ చెబుతాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇస్తాను సార్!’ దేనికి వెయింటింగ్ నీలూ! కమాన్ ఐసే అటాక్!! ‘ఓరీ అబ్బాయీ!! ప్రేమించక ముందు మమ్మీ.. మమ్మీ.. అని ఏడ్చావా? ఏడ్చివుంటే... ఇవ్వాళ లవ్ డాక్టర్ గారి చెల్లి ఏడ్చేది కాదు కదా!! ప్రేమించినప్పుడు ఆలోచించాలి. ఆలోచించి ప్రేమించాలి. అయినా ప్రేమేమైనా ఆలోచించి వస్తుందా? ఓరీ అబ్బాయీ!! ఆలోచిస్తే వచ్చే ప్రేమ ప్రేమే కాదు. ఓరీ శుంఠా!! ప్రేమించాక ఆలోచించడం ఆడపిల్లను గౌరవించడం ఎలా అవుతుంది. అమ్మను కన్విన్స్ చేసుకో... లేదంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ బిడ్డకు కాబోయే అమ్మను గౌరవించు!!’ నీలూ! నీలూ!! ఆవేశం తగ్గించుకో...!! ఇవిగో నీళ్లు తాగు. కూల్..కూల్..కూల్!!! - lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
ప్రేమ విఫలమైందని..
చాంద్రాయణగుట్ట: ప్రేమ విఫలమై మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై అరవింద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గౌలిపురా మేకలమండి ప్రాంతానికి చెందిన మాధవ రావు కుమారుడు రాçహుల్(25) వెల్డర్‌గా పని చేసేవాడు. ప్రేమ విఫలం కావడంతో ఆరు నెలల క్రితం అతను రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్న రాహుల్ సీలింగ్‌కు ఉన్న హుక్కుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నాకు మూడేళ్ల క్రితం ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నాకూ తనంటే ఇష్టం ఉండటంతో ఓకే అన్నాను. అయితే ఐదు నెలలుగా తను నాతో సరిగా మాట్లాడటం లేదు. నా మెసేజ్లకి రిప్లై ఇవ్వడం లేదు. ‘నన్ను పెళ్లి చేసుకో’ అని అడిగితే... క్యాస్ట్ కారణంగా చూపించి.. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటున్నాడు. పైగా ‘నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి’ అంటూ సోది చెబుతున్నాడు. నేను ప్రతిరోజూ ఏడుస్తూనే ఉంటున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా! ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – సాయి లత వీడు దొంగ రాస్కెల్, క్యాస్ట్ అడ్డం పెట్టుకుని... నిన్ను వాడుకుంటున్నాడు... ఏ క్యాస్ట్‌లోనూ ఒక అమ్మాయిని కష్టబెట్టమని ఉండదు!ఏ క్యాస్ట్‌లోనూ ప్రేమను ఛిద్రం చెయ్యమని ఉండదు!క్యాస్ట్ట్ స్ట్రెన్త్ ఇస్తుంది, ప్రేమను కూల్చదు...పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానెయ్యమను!క్యాస్ట్‌కి చెడ్డ పేరు... ప్రేమకు చీడ పెట్టొద్దని హెచ్చరించు!గుండె దిటవు చేసుకో.. ఇలాంటి వాడి అసలు రంగు ముందే బయటపడినందుకు దేవుడికి థ్యాంక్యూ చెప్పుకో..! ఆల్ ది బెస్ట్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
చెన్నై , అన్నానగర్: ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. చెన్నై సమీపం పూందమల్లి కుమరన్‌చావడి మురుగపిల్లై నగర్‌కి చెందిన రాజామణి. ఇతని కుమార్తె ఆశ (24). ఈమె, పూందమల్లిలో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈమె ఎన్జీఆర్ నగర్‌కు చెందిన రవి కుమారుడు వినోద్‌కుమార్ (29) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను శ్రీపెరుంబత్తూర్లో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఇదిలాఉండగా తనను వివాహం చేసుకోవాలని ఆశ ఒత్తిడి చేసింది. అందుకు వినోద్‌కుమార్ అంగీకరించలేదు. ఆశ తల్లిదండ్రులు వెళ్లి వినోద్‌కుమార్ కుటుంబీకులతో వివాహం గురించి మాట్లడగా వారు తిరస్కరించారు. ఈ స్థితిలో బుధవారం ఆశ తన ప్రియుడు వినోద్‌కుమార్ ఇంటి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగింది. ఆమె మాట్లాడుతూ మేమిద్దరం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. వినోద్‌కుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో వినోద్‌కుమార్ మాట్లాడడం మానేశాడు. దీనిపై పూందమల్లి మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాను. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో 2నెలల తరువాత నన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం మళ్లీ వివాహానికి ఒప్పుకోవడం లేదని వాపోయింది. పోలీసులు ఆమెతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితురాలు ధర్నా విరమించింది. -
ప్రేమ కోసం విద్యార్థిని.. పరువు కొసం ప్రియుడి తండ్రి
వెంకటాపురం(ఎం): సంక్రాంతి పండుగ వేళ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మండలంలోని పాలంపేటకు చెందిన బోడ సుమలత–సంజీవయ్య దంపతుల పెద్ద కూతురు సింధూజ(18) మండలంలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదారాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి సెలవులకు ఈనెల 10న సాయంత్రం సింధూజ పాలంపేటలోని తన పెద్దనాన్న రవి ఇంటికి వచ్చింది. సింధూజ పాలంపేటకు చెందిన కొండబత్తుల రమేష్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలిసింది. ఈనెల 14న సింధూజ ఇంటివద్దే ఉదయం 10 గంటలకు పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు ము లుగు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొం దుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. తన కూతురు కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సింధూజ తల్లి సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సింధూజ తల్లిదండ్రులు ఆమె ఫోన్ డాటాను పరిశీలించారు. సింధూజ మృతికి ఇదే గ్రామానికి చెందిన కొండబత్తుల రమేష్ కారణమని 15న ఉదయం వెంకటాపురం పోలీసులకు ఆమె తల్లి దండ్రులు మరోసారి ఫిర్యాదు చేశారు. అలాగే రమేష్ ఇంటి ఎదుట మృతదేహంతో మంగళవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ క్రమంలో కొండబత్తుల రమేష్ తండ్రి రాజు సాయంత్రం ఇంటివద్దే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యల మృతి చెందాడు. -
విషం తాగిన తమ్ముడు.. తెలియక అన్న
సాక్షి, చెన్నై: ప్రియురాలు దూరమైందన్న మనోవేదనతో మద్యంలో విషం కలిపి తాగడంతో తమ్ముడు మరణించగా..అందులో విషం ఉందన్న సమాచారం తెలియక దాన్ని సేవించి అన్న మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి మణినగర్ పుదూర్‌లో ఆదివారం జరిగింది. సాత్తాన్ కుళం సమీపంలోని మణినగర్ పుదూర్‌కు చెందిన రాజా, విజయ్ అన్నదమ్ముళ్లు. రాజాకు ఐదు నెలల క్రితం వివాహమైంది. చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న విజయ్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో యువతి దూరం కావడంతో విజయ్ మనోవేదనకు గురయ్యాడు. ప్రియురాలు దూరమవ్వడం, తన ప్రేమ విఫలమవడంతో వేదనలో పడ్డ విజయ్ ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. మద్యం బాటిల్ తీసుకువచ్చి అందులో విషం కలిపి దాన్ని సేవించి స్పృహ తప్పాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రాజా అందులో విషం ఉందన్న సమాచారం తెలియక అక్కడ మిగిలి ఉన్న మద్యాన్ని సేవించాడు. కాసేపటికి నోట్లో నుంచి నురగలు రావడంతో ఆందోళన చెంది కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు అన్నదమ్ములను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని. ఆరు నెలల క్రితం నేనొక అమ్మాయిని చూశాను. తను నాకు బాగా నచ్చింది. నేను తనని కలిసినప్పుడు తను బిజినెస్ చేసేది. దానికి సంబంధించి మనీ కావాలంటే కొంతవరకు హెల్ప్ చేశాను. నెల తర్వాత ‘నా బిజినెస్ కొలాప్స్ అయ్యింది. నేను చచ్చిపోతాను’ అంది. నేను తనకు బాగా ధైర్యం చెప్పి, లాస్ అయిన మనీ నేనే ఎలాగైనా ఎరేంజ్ చేస్తానన్నాను. తనకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా ఖర్చులకు నేనే ఇచ్చేవాడిని. ఒకసారి మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజ్ చేశాను. తనేమో ‘మా పేరెంట్స్ ఎవరిని చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాను’ అంది. తనకు ఆల్రెడీ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే అదే సమాధానం చెప్పిందట. కానీ ఇప్పటికీ నా దగ్గర ఖర్చులకు మనీ తీసుకుంటూనే ఉంది. మనీ ఇవ్వకపోతే ఏడుస్తోంది. ఇప్పటికే తన కోసం చాలా మనీ ఖర్చుచేశాను. ‘నువ్విచ్చిన మనీ లెక్క అంతా నా దగ్గర ఉంది. నీకు తిరిగి ఇచ్చేస్తాను’ అంటోంది. అసలు తనకి నా మీద లవ్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? తను లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – నాగు టాటా..!! వీడుకోలు ..!గుడ్ బై..! ఇంక సెలవు..!తొలినాటి స్నేహితులారా...చెలరేగే కోరికలారా...ప్రియురాలి వలపుల కన్నా...నును వెచ్చనిదేదీ లేదని...నిన్నను నాకు తెలిసింది...ఒక చిన్నది నాకు తెలిపింది...ఆ ప్రేమ నగరుకే పోతాను.. పోతాను.. పోతాను..!!‘ఏంటి సార్!? ఎప్పుడో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో పాట పాడుతున్నారు. అక్కడ నాగు డబ్బులు... ఇస్తూ... ఇస్తూ.. ఇస్తూ... పోతాడు...పోతాడు... పోతాడు..’ఇచ్చుటలో ఉన్న హాయీ.. వేరెచ్చటనూ లేనే లేదని...లేటుగ తెలుసుకున్నాను.. నా లోటును దిద్దుకున్నాను...‘సార్! సార్!! సార్!! ఆపండి సార్! అదే పాట పాడి నాగును కన్ఫ్యూజ్ చెయ్యకండి. నాగు...! అర్థమైందా..!? లేటుగా అయినా లోటును తెలుసుకో. లేకపోతే మునిగిపోతావు... పోతావు...పోతావు...!’అవును నాగు! అమ్మాయి స్టేబుల్ పర్సన్ కాదు. అసలు ఇన్వాల్వ్ కావద్దు. గుండె దిటవు చేసుకో. బి స్ట్రాంగ్! లవ్ యు. టేక్ కేర్! టాటా.. వీడుకోలు.. గుడ్ బై.. ఇంక సెలవు!! ‘అని చెప్పమంటున్నారు కదా సార్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్ లవ్ చేశాను. తనకి ఎనిమిది నెలల క్రితమే ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. కానీ తనకి అంతకు ముందే ఒకరితో బ్రేకప్ అయ్యిందని చెప్పింది. ‘నువ్వు ఆ అబ్బాయిని పూర్తిగా మరిచిపోతేనే నన్ను లవ్ చెయ్యి. లేకపోతే వద్దు’ అని చెప్పాను. తనని పూర్తిగా మరిచిపోయానంది. ‘సరే అయితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ఓకే అంది. అయితే రెండు నెలలు తర్వాత అతను కాల్ చేసి.. ‘మనం మళ్లీ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం’ అన్నాడట. ఆ విషయం నాకు పదిరోజుల తర్వాత చెప్పింది. ‘ఇది సరికాదు.. అతనికి నో అని చెప్పెయ్’ అన్నాను. తను మాత్రం ‘అతడిని వదులుకోవాలని అనిపించట్లేదు’ అంది. ‘నేను నీ లైఫ్‌లోకి రాక ముందు ఏం జరిగినా నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది?’ అని అడిగాను. దాంతో మా విషయం ఆ అబ్బాయికి చెప్పిందట. ‘సరే గుడ్ బై’ అని చెప్పి వెళ్లిపోయాడట. ఆ తర్వాత ఇప్పటివరకూ బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకోరు, మనం విడిపోదాం’ అంటోంది. నాకు తను కావాలి. తన ప్రేమ కావాలి. ఒక్క వన్ ఇయర్ ఆగితే నేను లైఫ్‌లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత మీ పేరెంట్స్‌ని ఒప్పిస్తాను’ అని చెబుతున్నా తను వినట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్? – ఆంజనేయులు అమ్మాయి జంపు కొట్టేసింది అన్నా!‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే... ‘పెళ్లికూతురు లవ్ స్టేటస్ ఏంటి?’ అని అడిగాడట మునుపటికి ఓ ప్రబుద్ధుడు. అలా మిమ్మల్ని ఆంజనేయులు కలపమని సలహా అడుగుతుంటే.. అమ్మాయి జంపు గింపు అంటారేంటి సార్?’అమ్మాయి ఇంకా పాత లవ్వులోనే కూరుకుపోయి ఉంది. ఆంజనేయులు ప్రేమ చూసి అక్కడ నుంచి రీబౌండ్ అయ్యి ఆంజనేయులు హార్ట్‌లో పడింది. మళ్లీ ఆ అబ్బాయి కనపడేటప్పటికి...‘మళ్లీ రీబౌండ్ అయ్యి హార్ట్ అక్కడ పడిందా సార్ అమ్మాయిది?’అవును నీలూ! అమ్మాయి ఎమోషనల్ కండిషన్ చాలా వీక్‌గా ఉంది. ఇలాంటప్పుడు మనంఇన్వాల్వ్ అయితే...‘హార్ట్ ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా సార్!?’అబ్బా ఏం క్యాచ్ చేశావు నీలూ! ఆంజనేయులు మెయిన్‌టెయిన్ డిస్టెన్స్. అలాంటి స్టేజ్‌లో ఉన్న అమ్మాయితో రిలేషన్ కోరుకోవడం....‘కొరివితో కాపురంలాంటిదే కదా సార్?’అబ్బబ్బబ్బా నీలూ.....! యూ ఆర్ వెరీ స్మార్ట్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్: కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ఓ యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. అదే సమయంలో కలెక్టర్ వీరపాండియన్ రావడంతో బాధితురాలిని కార్యాలయంలోకి పిలిపించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... నగరంలో నవోదయకాలనీలో నివాసముంటున్న గాయత్రి అనే యువతి శింగనమల మండలం కొరివిపల్లికి చెందిన రాజు అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి సదరు యువకుడు నిరాకరిస్తూ వస్తుండటంతో మనస్తాపం చెందిన గాయత్రి బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. సమస్యను విన్న కలెక్టర్ యువతికి న్యాయం చేయాలని వన్‌టౌన్ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతి నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి మహిళా,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలలో నడుస్తున్న సర్వీసు హోంలో ఆమెకు ఆశ్రయం కల్పించారు. యువకున్ని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తామని వన్‌టౌన్ సీఐ విజయభాస్కర్‌గౌడ్ తెలిపారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనూ ఒక అమ్మాయీ 3 ఇయర్స్ లవ్ చేసుకున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉన్నాం. కానీ లాస్ట్ ఇయర్లో ఆమెకూ నాకూ మధ్య మా ఫ్రెండ్స్ గొడవ క్రీయేట్ చేశారు. ఆ విషయం నాకు లాస్ట్‌లో తెలిసింది. తను మాత్రం నాకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది. నాకు ఏం అర్థం కాలేదు. కాల్ చేసిన రెస్పాన్స్ ఇవ్వలేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. ‘‘ఏంటిది..? ఇన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నాం. ‘నీకంటే ఎవ్వరూ ఎక్కవ కాద’ని చెప్పిన అమ్మాయి... కనీసం ఒక్క మెసేజ్ కూడా పెట్టడంలేదేంటి?? ఇదే నా లవ్ అంటే??’’ అని చాలా బాధపడ్డాను. ఇదంతా 2016లో జరిగింది. అయితే కొన్ని రోజులుగా తను కాల్ చేసి మాట్లాడుతోంది. ఇప్పుడు నేను ఏం అనుకోవాలి?? లవ్ అనుకోవాలా? లేదా క్యాజువల్‌గా ఫోన్ చేస్తుందనుకోవాలా? అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి లవ్ గురు..! – రాహుల్ చాలా క్యాజువల్ రాహుల్!!చాలా క్యాజువల్ అంటే క్యాజువల్..!!ఇది కన్ఫార్మడ్..!!డౌట్ లేదు!!ఒక్క క్షణం కూడా ఇంకోలా ఆలోచించకు..!!మళ్లీ ప్రేమ అనుకుని పడ్డావో...అరటి తొక్క మీద కాలు వేసినట్లే...!జీవితం మాడిన పెసరట్టే..!!తెల్లటి చొక్కా వేసుకుని వీధిలోకి రాగానే పడ్డ కాకి రెట్టే..!!నీ పీస్ ఆఫ్ మైండ్ ఫట్టే!!ఇక్కడేదో జట్టు అవుతుందనుకుంటే ఇంకో లవ్ స్టోరీ లైఫ్‌లో లేనట్టే..!!‘ఎందుకు సార్..!? అంతగా డిస్కరేజ్ చేస్తున్నారు. పాపం రాహుల్‌కి ఉన్న కాస్త హోప్ కూడా ఫట్టే!!’అవును నీలూ..!! ఫాల్స్ హోప్ పెట్టుకుంటే లైఫ్ లైఫ్ అంతా డౌటే!‘రాహుల్ ఇది నిజమే! మళ్లీ హోప్స్ పెట్టుకుంటే... మళ్లీ ఎగిరిపోయేది పిట్టే!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నాకొక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరం మంచిగా క్లోజ్‌గా ఉంటాం. కానీ వన్ మంత్ నుంచి అవాయిడ్ చేస్తోంది. చూసి చూడనట్లు ఉంటోంది. నేనొక రోజు గట్టిగ అడిగాను. అడిగితే.. ‘మా ఇంట్లో సంబంధం చూశారు, మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది’ అని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరు ఏదైనా సలహా ఇవ్వండీ ప్లీజ్. – నన్నే సాహెబ్ నువ్వు కూడా మీ ఇంట్లో గట్టిగా చెప్పు..!‘ఏం చెప్పాలి సార్?’నాకు ఫిక్స్ చెయ్యండి అని.‘మరి లవ్ ఏం కావాలి సార్?’అదేంటి నీలూ? మన లవ్ అమ్మాయి లవ్ కంటే ఏమైనా తక్కువా?‘మరి అలాంటప్పుడు ఆ అమ్మాయితోనే ఎలాగైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాలి కదా సార్??’కాదు నీలూ..! ఇక్కడ లవ్ కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా గట్టిగా దెబ్బతిన్నది.‘అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి సార్ మన హీరో?’ ఆ అమ్మాయి కంటే ముందు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తన మ్యారేజ్ కార్డ్ అమ్మాయికి ఇవ్వాలి నీలూ..! మెగా లవర్ అంటే ఏంటో అమ్మాయికి చూపించాలి..!!‘గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ మ్యారేజ్ కార్డ్ అనాలి కదా సార్?!??’అబ్బబ్బబ్బా నీలూ.. యు ఆర్ వెరీ స్మార్ట్! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలమైందని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కృష్ణలంక(విజయవాడ తూర్పు): ప్రేమ విఫలం అయిందని మనస్తాపానికి గురైన విద్యార్థి చదువుకుంటున్న కళాశాలలోనే తరగతి గదిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు అప్రమత్తంతో విద్యార్థినిని రక్షించారు. వివరాలు.. మోహబూబాబాద్కు చెందిన సాయిరెడ్డి(21) లబ్బిపేటలోని పైడయ్యవీధిలోని సీఎంఎస్ సీఏ అకాడమిలో సీఏ చదువుతున్నాడు. ఈ క్రమంలో అదే కళశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. ఆమెకు తెలియజేయడంతో అందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం సాయంత్రం స్నేహితులకు చెప్పి కత్తి తీసుకుని కళాశాలలోని ఒక తరగతి గదిలోకి దూరి ఎవరు రాకుండా బెంచ్‌లు అడ్డుపెట్టుకున్నాడు. 100కి సమాచారం అందించడంతో అక్కడే విధులు నిర్వరిస్తున్న కృష్ణలంక ఎస్ఐ చినబాబు, విద్యార్థికి నచ్చచెప్పందుకు ప్రయత్నిస్తున్నా వినలేదు. ఎస్ఐ గంటన్నరపాటు కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రెండు సార్లు మెడపై కోసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విద్యార్థిని పట్టుకుని చేతిలోని కత్తిని వదిలించి తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని పోలీసు వాహనంలోనే దగ్గరగా ఉన్న వైవీ రావు ఆస్పత్రికి తరలించగా అక్కడ సిబ్బంది సకాలంలో స్పందించక పోగా మరో ఆస్పత్రికి తరలించేందుకు వారి వద్ద అందుబాటులో ఉన్న అంబులెన్స్‌ను కూడా అందించకపోవడంతో గత్యతరం లేని పరిస్థితిలో పోలీసులే వారి వాహనంలో ఆంధ్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
యువకుడి బలవన్మరణం.. ఇంట్లో దొరికిన ప్రేమ లేఖ
విశాఖపట్నం, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): స్థానిక దుర్గాపురంలో ఓ యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు, మహేష్ అక్క పుష్ప తెలిపిన వివరాలు ప్రకారం .. దుర్గాపురంలో నివాసముంటున్న కల్లేపల్లి మహేష్ (25) ఆదివారం సాయంత్రం తన ఇంట్లో పైకప్పు హుక్కుకు దుప్పటి కట్టి ఉరివేసుకున్నాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తన పిల్లలతో పాటు మహేష్‌కు టిఫిన్ పెట్టింది. మధ్యాహ్నం సమయంలో భోజనం పెట్టేందుకు చూడగా తాళం వేసి ఉంది. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో గ్యాస్ బండ అవసరమై ఇంటికి వెళ్ల గా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపు కొట్టినా తీయలేదు. వెనుక వైపు నుంచి తలుపు కొట్టారు. అయినా తీయక పోవడంతో అనుమానం వచ్చి తలుపు విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. లోపలి గొల్లెం విరగడంతో తెరుచుకుంది. వెళ్లి చూసేసరకి వ్లాబ్ హుక్కు దుప్పటి కట్టి ఉరివేసుకున్నాడు. అయితే ఎందుకు ఉరి వేసుకున్నాడు.. ఆర్థిక ఇబ్బందులా! మరో కోణం ఏదైనా ఉందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తల్లి దండ్రులు లేరు మృతుడు మహేష్‌కు తల్లి దండ్రులు లేరు. కొన్నాళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు.ఇతను కొన్నాళ్లు కొరియర్ బాయ్‌గా పని చేశారు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇటీవల పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో దొరికిన ప్రేమ లేఖ అయితే మహేష్ ఇంట్లో ఏడాది కిందట రాసిన ప్రేమ లేఖ దొరికింది. ఇందులో ఓ యువతికి మహేష్ ప్రేమతో రాసినట్లుగా ఉంది. దీంతో ప్రేమ వ్యవహరమే మృతికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. -
ప్రేమ విఫలమై యువతుల ఆత్మహత్య
యుక్త వయసులో వచ్చిన ఆకర్షణే ప్రేమని భావించారుగానీ.. 18 ఏళ్లపాటు గుండెలపై పెట్టుకుని పెంచుకున్న తల్లిదండ్రుల ప్రేమను గుర్తించలేకపోయారు.. తాము కోరుకున్న వ్యక్తి లేకుండా బతకలేమని తలచారుగానీ.. బిడ్డలు లేకుండా ఒక్క క్షణమైనా అమ్మానాన్నల గుండె కొట్టుకోదని ఆలోచించలేకపోయారు.. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులు.. తమ ప్రేమను అర్థం చేసుకోరని అపోహపడ్డారుగానీ.. పిల్లలు లేకపోతే అమ్మానాన్నల జీవితానికి వెలుగు లేదనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు.. క్రోసూరు మండలం గుడిపాడు, సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామాల్లో ఇద్దరు యువతులు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. గుంటూరు జిల్లా/ సత్తెనపల్లి: ప్రేమ విఫలమై ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందని నంబూరినాగ తిరుతపతమ్మ (19) అదే గ్రామానికి చెందిన ముక్కాల నాగ సురేష్‌ను ప్రేమించింది. అయితే నాగసురేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో మనస్తాపానికి గురైన నాగ తిరుపతమ్మను సత్తెనపల్లి మండలం వెన్నాదేవిలో నివశిస్తున్న చిన్నమ్మ చింతల వెంకటలక్ష్మి వద్దకు పంపారు. డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ నాగతిరుతపమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో సత్తెనపల్లి పట్టణపోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే చింతల వెంకటలక్ష్మి కుమార్తె చింతల రవళి (18) మేనమామ కుమారుడైన కోటేశ్వరరావును ప్రేమించింది. తల్లిదండ్రులు ఆ ప్రేమను అంగీకరించి వివాహం చేయరని రవళి భావించింది. దీంతో నాగ తిరుపతమ్మ, రవళిలు మాట్లాడుకుని ఈనెల 25న రాత్రి సమయంలో శీతల పానియంలో ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్యకు యత్నించారు. నాగతిరుపతమ్మ అదే రోజు మృతిచెందగా రవళి ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడంతో హుటాహుటిన సత్తెనపల్లిలోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని నాలుగేళ్లుగా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్ చేశాడు. మేమిద్దరం క్లాస్మేట్స్. చదువు పూర్తికాగానే జాబ్ చేద్దామనుకున్నాను. కానీ తను ‘నేను జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోను, వద్దు’ అన్నాడు. నేను కూడా తన మాటకు గౌరవమిచ్చి జాబ్ చెయ్యాలనే ఆలోచనను మానుకున్నాను. తనకి మంచి జాబ్ వచ్చింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ తర్వాత నుంచి నన్ను ఇగ్నోర్ చెయ్యడం మొదలుపెట్టాడు. రీజన్ లేకపోయినా తిట్టేవాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అడిగితే... ‘నాకు నువ్వు వద్దు, మా ఆఫీస్‌లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను’ అన్నాడు. చాలా ఏడ్చాను. కొన్ని రోజులకి మళ్లీ తనే కాల్ చేసి సారీ చెప్పాడు. ‘ఇద్దరం జాబ్ చేస్తేనే లైఫ్ బాగుంటుంది. నువ్వు కూడా జాబ్ ట్రై చెయ్యి’ అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా కష్టపడి ఓ మంచి జాబ్ సంపాదించాను. తర్వాత తనకి మరో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ తను దాన్ని వదులుకున్నాడు. ఎందుకు అని అడిగితే.. ‘ఇప్పుడు నేను చేస్తున్న ఆఫీస్‌లో నాకో మంచి ఫ్రెండ్ ఉంది. తనని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. తనని నేను మిస్ అవ్వలేను’ అన్నాడు. తను చెబుతున్న ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. తన ఫ్రెండ్షిప్ కోసం మంచి జాబ్ వదిలేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘నీకు వచ్చిన జాబ్ నాకు నచ్చడం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండలేను’ అంటున్నాడు. చాలా మంచి అబ్బాయి అన్నయ్యా. మేము చాలా బాగా ఉండేవాళ్లం. ఆ జాబ్ వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయాడు. ఇప్పటికీ తన మీద నాకు ప్రేమ పోవట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – సౌమ్య మంచోడా పాడా????ఒట్టి దగుల్బాజీ!!కుట్రకామకుడు..!‘అంటే ఏంటి సార్??’నాకూ తెలియదు నీలూ..! ఒక దొంగ రాజకీయ నాయకుడి గురించి ఎవరో మంచోడు అంటుంటే విన్నాను. నేను అనేశాను.కుట్రకామకుడు, ఏబ్రాసి...అబద్ధాల కోరు...మోసాల దిబ్బ...వెన్నుపోటుదారుడు...ఐరన్ లెగ్...చీటర్ కాక్...యాక్ తూ ఫెలో...సెల్ఫిష్ ధార్ది ఎంకమ్మ....................‘సార్..! ఇదంతా ఏదో రాజకీయ దుర్మార్గుడిని అన్నట్లుంది సార్!’వాడేమైనా తక్కువా నీలూ! విశ్వాసం లేని అక్కుపక్షి..!రోజుకో మాట మార్చే పెంటగాడు...!ఎప్పుడు ఎవరితో కనెక్షన్ పెట్టుకుంటాడో తెలియని యాగీగాడు...!!‘అంటే ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని పొలిటీషియన్ లాటి వాడా సార్..??’కరెక్ట్‌గా గెస్ చేశావు నీలూ..! మన అమ్మాయి లక్కీ. ఇంకా పొత్తు ఫైనల్ కాలేదు. అయ్యుంటే లైఫ్ మటాష్ అయ్యేది..!!‘అంటే ఫసక్ అయ్యేదా సార్?’ అబ్బబ్బబ్బా... నువ్వు ఎంత స్మార్ట్ నీలూ!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! ఎలా ఉన్నారు? నేను మాత్రం హ్యాపీగా లేను. తన పేరు ప్రశాంతి. తను నాతో చాలా క్లోజ్‌గా ఉండేది. ఒక రోజు తనే ప్రపోజ్ చెయ్యమంటే.. నేను ప్రపోజ్ చేశాను. తీరా ప్రపోజ్ చేశాక సరదాగా అన్నానంది. ఆ తర్వాత ఫ్రెండ్లీగానే ఉన్నాం. అప్పుడప్పుడు లవ్ సింబల్స్ పెట్టేది. ఈ మధ్య తను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నానంటోంది. ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీనే. కానీ వాడు మోసం చేసే రకం. అందుకే ప్రశాంతి పరిస్థితి ఏమవుతుందోనని భయంగా ఉంది. తనకి చెబుతున్నా అర్థం చేసుకోవడం లేదు. మీరే ఏదైనా సలహా ఇవ్వండి సార్. – కృష్ణ ఇంకో అబ్బాయిని చూసిపెట్టు కృష్ణా!!‘అదేంటి సార్ అంత మాట అనేశారు?’నీలూ! ఈ అబ్బాయి మంచోడు కాదు, చీటింగ్ టైప్ అని చెబుతున్నాడు కదా..! అందుకే ఒక మంచివాడిని చూడమని చెబుతున్నాను..!!‘ఎట్లా కనపడుతున్నాడు సార్ మీకు కృష్ణ????’పేపర్లో, టీవీల్లో, ఫేస్బుక్లో అడ్వర్టయిజ్మెంట్లు వేసేవాడిలా కనబడుతున్నాడు నీలూ!!‘ఎలాంటి అడ్వర్టయిజ్మెంట్లు సార్????’గుణవతి, శీలవతి, భాగ్యవతి, ‘అంద’వతి, ప్రశాంతి.. ఒక మంచి లవర్ అండ్ మొగుడు కావలెను! అని అడ్వర్టయిజ్మెంట్ వేసేవాడిలా కనబడుతున్నాడు. ‘అయ్యో.. పాపం కృష్ణ కంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు సార్ ప్రశాంతికి???’అది చెప్పలేకే.. ఉన్నవాడు మంచివాడు కాదని మొర పెట్టుకుంటున్నాడు కదా నీలూ!‘అయితే కృష్ణా..! అర్జెంట్‌గా వెళ్లి అమ్మాయికి నువ్వే కరెక్ట్’ అని గట్టిగా చెప్పు. ఒప్పుకోకపోతే ఈ జన్మలో తనకి కృష్ణలాంటి లవర్ దొరకడని చెప్పి.. అబౌటర్న్ కొట్టి సినిమా హీరోలా దుమ్ము లేపుతూ వెళ్లిపో కృష్ణా!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
పెళ్లికి ప్రియుడు నిరాకరించాడని..
విశాఖపట్నం, సబ్బవరం(పెందుర్తి): తనను ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఓ యువతి పురుగులు మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇరువర్గాల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాయనమ్మపాలెంన కు చెందిన గెంజి కుమారి (23), రావులమ్మపాలెంనకు చెందిన షేక్ రెహమాన్ (23) క్లాస్ మేట్లు. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లగా సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఏడోతరగతి నుంచే వీరిద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే కుమారిని పెళ్లి చేసుకుంటానని తుదవరకు నమ్మించి ఇటీవలే నిరాకరించడంతో ఇరువర్గాల పెద్దలు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఆమెతో తాను కలిసి తిరిగిన మాట వాస్తవమేనని, కోపిష్టి అని, పెళ్లిచేసుకునేది లేదని రెహమాన్ తెగేసి చెప్పేశాడు. ఇలా రెండుమూడుసార్లు పెద్దలు పంచా యితీ పెట్టినా ఫలితం దక్కలేదు. మంగళవారం కూడా కౌన్సెలింగ్ జరిగింది. రెహమాన్ పెళ్లి ఊసెత్తకపోవడంతో విసు గు చెందిన కుమారి పంచాయితీ జరిపిన చోటే తన వెంట తెచ్చుకున్న పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో 108వా హనంలో కేజీహెచ్‌కు పంపించారు. రెహమాన్ లంకెలపాలెంలో బీటెక్ చదువుతున్నాడు. కుమారి ఇటీవలే బీఈడీ పూర్తి చేసింది. కుమారి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లి సోములమ్మ బోరున విలపిస్తోంది. గతంలోనూ వివా దం పోలీస్‌స్టేషన్‌కు చేరినా లిఖితపూర్వక ఫిర్యా దు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మంగళవారం నాటి ఘటనపైనా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఎన్. ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్ అన్నయ్యా! నేనొక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను కూడా ఫస్ట్‌లో ‘లవ్ చేస్తున్నాను... పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. ఎందుకంటే మొదట తనే నాకు ప్రపోజ్ చేసాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే ‘మా పేరెంట్స్ ఒప్పుకోరు. వాళ్లకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ’ అంటున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. తన మనసు మార్చాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్..? – అవంతిక వాణి ఏంటీ మార్చేది??‘మనసు మారితే మళ్లీ లవ్ చేస్తాడు కదా సార్..!!???’ ఏంటీ చేసేది????‘పెళ్లి చేసుకుంటాడు కదా సార్..!!??’ ఏంటీ చేసుకునేది????? ‘ఏంటి సార్?? అప్పటి నుంచి చూస్తున్నాను, క్వశ్చన్‌కి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారు???’ వాడు దొంగ...! సింగిల్ లెగ్ మీద నిలబడి లవ్ చేస్తున్న కొంగ..!! ఏబ్రాసి... దూబ్రాసి... సచ్చినోడు..! డర్టీ ఫెలో..! పెంటగాడు..!! అబద్ధాలకోరు..! ఛీటర్!!‘అంటే వాడు మారడు. మారినట్లు యాక్టింగ్ చేసినా మళ్లీ అవంతికకి టోకరా ఇస్తాడన్నమాట. కరెక్ట్‌గా చెప్పారు సార్. అవంతికా..! లక్కీగా ఆ దరిద్రుడి గుణం ముందే తెలిసిపోయి మనం సేఫ్ అయిపోయాం. డోంట్ వర్రీ. ఇంతకంటే మంచివాడే నీకు దొరుకుతాడు!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్.! నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తోంది. పెళ్లి చేసుకుందామని తనే నన్ను ఫోర్స్ చేసింది. కానీ ‘‘నాకు ఉద్యోగం లేదుగా నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా..?’’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ తను ఒప్పుకొకపోగా బాగా ఏడ్చింది. అయినా సరే తనని బలవంతంగా ఇంటికి పంపించేశాను. అప్పటికే వాళ్ల ఇంట్లో మా విషయం తెలుసు కానీ వాళ్ల నాన్నకి మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. తను మూడు రోజుల తర్వాత కాలేజ్‌కి వచ్చింది. అదే రోజు వెళ్లి తనతో మాట్లాడటానికి ప్రయత్నించాను. తను మాత్రం ‘నువ్వు ఎవరో నాకు తెలియదు’ అని ముఖం మీదే చెప్పిండి. ఎంత రిక్వెస్ట్ చేసినా ‘నువ్వంటే ఇష్టం లేదు, నన్ను చంపకు’ అని కోప్పడింది. తనెప్పుడూ ‘నాకు నువ్వు తప్ప ఎవరూ వద్దు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను’’ అనేది. అలాంటిది ఇలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. తనేమో ఎంతో ఈజీగా నన్ను మరచిపోయింది. కానీ నేను మరచి పోలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి సార్... నా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్. – రాజేష్ వద్దనుకుని వెనక్కి పంపేశావు కదా...!?ఇప్పుడు కూర్చుని బాధపడితే ఏం దొరుకుద్ది బ్రో...నిరాశ... నిస్పృహ.... నిర్వేదం.... తప్ప.. ???????????‘నిర్వేదం అంటే ఏంటి సార్???’నాకు తెలియదు నీలూ..! ఏదో ఫ్లోలో అనేశాను...!‘రాజేష్ కూడా ఫ్లోలో అనేశాడు సార్ ‘‘కుదరదు ఇంటికి పో’’ అని. అమ్మాయి అన్నంత పనీ చేసింది.. పోయింది..! మరి ఇప్పుడేమి చెయ్యాలి సార్..?పాపం రాజేష్ గుండె.. పుండై ఏడుస్తోంది సార్?!?’ఎందుకు ఏడవడం...? ఒక్కోసారి వర్కౌట్ కాదు. ఆ రోజు వెళ్లమని చెప్పకుండా ఉండమని చెప్పినా వర్కౌట్ అవుతుందని గ్యారెంటీ ఏంటి? అమ్మాయి పేరెంట్స్ ఎలాగూ కుదరదని చెప్పేశారు కదా!?!‘సార్....! ఉన్న విషయాన్నే న్యూస్‌లా చదవకుండా యూజ్ ఏమైనా ఉంటే చెప్పండి సార్!’ప్రేమను మింగి.. బాధను దిగమింగాలి..! వేరే మార్గం లేదు..!! మనోడికి కూడా మంచి రోజులు వస్తాయి.!! అప్పటిదాకా జాబ్ ట్రయల్స్ చెయ్యడం మంచిది..!!!‘మంచిది సార్!!!!!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ఆ ఆత్మహత్యలకు.. ‘ఆర్ఎక్స్100’స్ఫూర్తి!
సాక్షి, జగిత్యాల: ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి దర్యాప్తు అనంతరం డీఎస్పీ వెంకట రమణ నిజానిజాలు వెల్లడించారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరి విద్యార్థుల లవ్ ఫెయిల్ కావడంతో గత కొద్దిరోజులుగా డిప్రెషన్లోకి వెళ్లారు. ఈ క్రమంలో టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 సినిమాను చూసి వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ సినిమాతో ప్రభావితులైన విద్యార్థులు మద్యం సేవించి, పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. సినిమాలు కేవలం వినోదం కోసమేనని, వాటి ప్రభావానికి లోనే ప్రాణాలు పోగోట్టుకోవద్దని సూచించారు. ఎన్ని పనులున్నా పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి ఉండాలని.. వారి ప్రవర్తనను నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వారిలో ఏమైన మార్పులు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ.. విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. చెబితే ఎక్కడ కాదంటుందోనని పెదవి దాటనీయలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఎక్కడ తప్పుబడతారోనని.. ఎక్కడ కాదంటారోనని... ఎవరికివారే మానసిక ఆవేదనకు గుర య్యారు. ఇటీవలే తాము ప్రేమించింది ఒకే అమ్మా యిని అని తెలుసుకున్నారు. అమ్మాయి లేకుండా ఉండలేమని భావించారు. చదివే వయసులో ప్రేమేంటని స్కూల్ యాజమాన్యం ప్రశ్నిస్తుందనుకున్నారో.. లేక పెద్దలు కొడతారని భయపడ్డారో... తెలియదు కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలిద్దామని నిర్ణయించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి కలసి తిరిగిన ఇద్దరూ రాత్రి 7 గంటలకు ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. మైకం వచ్చిన తర్వాత మద్యంతోపాటు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థిని కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే అతనూ చనిపోయాడు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను చాలా ఇష్టపడుతోంది. తను నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు సార్. బట్ వాళ్ల డాడీ మాత్రం మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – శివ నువ్వు టోటల్ సిన్సియర్..! అమ్మాయి ఫుల్‌గా కమిటెడ్..!! డాడ్ కంప్లీట్‌గా కంపు చెయ్యడానికి రెడీ..!!‘సార్ ఆన్సర్ ఇవ్వమంటే క్వశ్చన్ చెబుతున్నారేంటి సార్????’వాళ్ల డాడ్ అంటే అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా...‘అబ్బాయికి కూడా... ఏంటి సార్???’లవ్..!!‘ఏంటి సార్..!? అమ్మాయి వాళ్ల డాడీని అబ్బాయి లవ్ చేస్తున్నాడా? వాట్ ఆర్ యు టాకింగ్ సార్?????!?’చేసుకోకపోతే అమ్మాయి బాధపడుతుందనీ.. చేసుకుంటే డాడీ బాధపడతారనీ.. ఇద్దరినీ లవ్ చేస్తున్నాడు నీలూ!!‘అయితే ఇప్పుడు శివ ఏం చెయ్యాలి సార్????’చక్కగా అమ్మాయి ఇంటికి వెళ్లి ‘డాడీ గారండీ.. మీ అమ్మాయిని నేను లవ్వాడుతున్నానండీ’ అని చెప్పి ధైర్యంగా అమ్మాయి హ్యాండ్ అడగొచ్చు. ఆ డాడీ ఎక్కడ ఫీల్ అయిపోతాడోనని మనకు ఉత్తరం రాస్తే ఎలా????‘డాడీ ఒకటి పీకితే అప్పుడు ఎకో సౌండ్‌లో శివ..శివ..శివ... అని వినపడుతుందేమో సార్??’ప్రేమించడానికే కాదు గుండె ఉండాల్సింది, ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా గుండె కావాలి...!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హలో సార్..! నాది విచిత్రమైన సమస్య. నేను మాయ అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను నన్ను ప్రేమించట్లేదని తెలుసు. కానీ నేను తనని వదులుకోలేకపోతున్నాను. తను నన్ను కేవలం మనీ ఇచ్చే వ్యక్తిగానే చూస్తోంది. తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రతి చిన్న దానిని పెద్దదిగా చూపించి నన్ను మనీ అడుగుతూనే ఉంటుంది. నేను ప్రేమించాను కాబట్టి ప్రతిసారీ చూసుకుంటున్నాను. ఈ మధ్య తనకి మంచి జాబ్ వచ్చిందట. ఆ విషయం నాకు చెప్పకుండా తన కష్టాలు చెప్పుకుంటూ నా దగ్గర మనీ అడుగుతూనే ఉంది. పైగా నేను తనకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ వేరే వాళ్లకు ఇచ్చేస్తోంది. ఇన్నీ చేస్తున్నా తనని మరచిపోలేకపోతున్నాను. తనని నిలదీసినా ఉపయోగం ఉండదు కదా! అందుకే తననేం అడగలేదు. సార్ ప్లీజ్..! నేను ఈ బాధ నుంచి, ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వండి. – రామ్ అమ్మాయి ఫొటో తీసుకో...!‘ఫొటో ఎందుకు సార్?’చెప్పనివ్వు....!‘అసలు అడిగితే ఇస్తుందా సార్ ఫొటో..???’కొంచెం ఓపిక పట్టు నీలాంబరీ!‘ఫొటో అడిగితే పీకి పట్టుకుంటుందేమో సార్?’ష్...ష్....ష్....!‘ఓకే సార్..! నేను సైలెంట్ అయిపోతాను. ఫొటోతో ఏం చెయ్యాలి సార్!’ ఫొటో తీసుకుని.....‘తీసుకుని... తీసుకుని..!!’దాన్ని గిఫ్ట్ పేపర్లో చుట్టి....‘చుట్టి.. చుట్టి..!?’చుట్టి.. చుట్టి... చుట్టి... అమ్మాయికే గిఫ్ట్‌గా ఇచ్చెయ్యి..!‘చుట్టి.. చుట్టి... చుట్టి... అమ్మాయికే గిఫ్ట్‌గా ఇచ్చెయ్యాలా?’అవును నీలూ! ఇదే ఫైనల్ గిఫ్ట్ అని చెప్పి.. తన మనస్సులో నుంచి తన ఫొటోను తీసేశానని చెప్పి... నరసింహ సినిమాలో రజనీకాంత్‌లా ‘వెయ్యి ఎత్తుకు పైఎత్తు – చెయ్యి గిఫ్ట్‌తో గేర్ షిఫ్ట్..’ అని పాడుకుంటూ స్టైల్‌గా ఎగ్జిట్ కొట్టు రామ్..!‘సార్.. ఆ పాట ‘ఎక్కు తొలి మెట్టు.. కొట్టు కొండను ఢీ కొట్టు.. జీవితమంటే పోరాటం..’ తెలుసు నీలాంబరీ..! కానీ ఈ సిట్యుయేషన్లో ‘ఎత్తుకు పై ఎత్తు’ చాలా అవసరం. అమ్మాయిని గుండెల్లో నుంచి పీకి.. ఫ్రేమ్ కట్టి.. అమ్మాయి ముఖాన్న పారేసి... స్టైల్‌గా నడుస్తుంటే ఉంటుంది నా సామిరంగా..!!...రామ్..! ప్రేమ ఎప్పటికీ తరగని గిఫ్ట్‌లా ఉండిపోవాలి గానీ ఎప్పటికీ తరగని గిఫ్టుల లిస్ట్ కాకూడదు..! ‘అబ్బా..! ఏం చెప్పారు సార్..! ఇదిగోండి అరటిపండ్ల గిఫ్ట్’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తనెప్పుడూ నన్ను ప్రేమించానని చెప్పలేదుగానీ నేను తనని చాలా ఎక్కువగా ప్రేమించాను. ఇప్పుడు తను ఒక అబ్బాయిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. అది తెలిసినప్పటి నుంచి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్? – నాగ్ ఓరీ..! అమాయకుడా..!!ఏమైందన్నా నీ విచక్షణకు!??ఎలా మిస్ అయ్యావన్నా బస్సు!??ప్రేమ పీకడం లేదా మనసు?!?మరెందుకన్నా ఇలా చేసావు!? ఛస్సు!!ఎలా చేసుకున్నావన్నా లవ్వుని తుస్సు!!‘ఏమైంది సార్..!? ఇవాళ ఎందుకీ కస్సు! బుస్సు!?!’చూడు నీలూ..! అబ్బాయిలంతా ఒక్క లుక్కు కోసం చస్తుంటే.. ఫోర్ ఇయర్స్ ఛాన్స్ ఉండి ఇలా ఎలా చేసుకుంటాడు నాగన్న మిస్!?‘దానికేముంది సార్..! ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇస్తుంది ఛాన్స్!’లెస్స పలికితివి నీలూ.... లెస్స పలికితివి.!! ఎక్కమను మళ్లీ మరో లవ్ బస్సు!! ప్రియదర్శిని రామ్లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమించిన యువతి పెళ్లి చెడగొట్టానన్న క్షోభతో..
విశాఖసిటీ, అగనంపూడి(గాజువాక): ప్రేమించిన యువతి దక్కడం లేదన్న అక్కసు ఓ పక్క.. పెళ్లి చెడగొట్టానన్న ఆత్మక్షోభ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు.. అగనంపూడి నిర్వాసితకాలనీ దిబ్బపాలేనికి చెందిన దుల్ల రమేష్ (28) ఐటీఐ పూర్తిచేసి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రమేష్ ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు 2న రఘు అనే అతనితో వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ రఘు వద్దకు వెళ్లి మీరు పెళ్లి చేసుకోవాల్సిన యువతిని ప్రే మిస్తున్నానని, ఆ యువతి కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పడంతో రఘు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు రమేష్‌పై దువ్వాడ పో లీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం రమేష్‌పై కేసు నమోదు చేసి పూచీకత్తుపై రాత్రి ఇంటికి పంపించేశారు. ఇంటికి చేరుకున్న రమేష్ మనస్తాపానికి గురై దువ్వాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ జేబులో దొరికిన సూసైడ్ నోట్లో యువతి చాలా మంచిదని, నాది వన్‌సైడ్ లవ్ అని, యువతిని దక్కించుకోడానికి నేను ఆమెపై నిందలు వేశానని, రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతూ లేఖ రాశాడు. రమేష్ తండ్రి నూకరాజు చిన్నతనంలోనే మరణించగా, తల్లి వరహాలమ్మ, అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. -
చికిత్స పొందుతూ భాస్కర్ మృతి
మహబూబ్‌నగర్ క్రైం : పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన భాస్కర్(24) జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ప్రాణాలు వదిలాడు. హైదరాబాద్ బొరబండ సంజయ్‌నగర్ కాలనీకి చెందిన భాస్కర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం భాస్కర్ ఇంటికి వెళ్లి నచ్చజెప్పి వచ్చాడు. అయినా వినకుండా ఆమె ఇంటిచుట్టూ తిరిగాడు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిసరాలలో తిరిగాడు. అదేరోజు రాత్రి నిద్రమాత్రలు మింగి ఆకస్మరక స్థితిలోకి వెళ్లాడు. వైద్యం చేయించుకుని అంతటితో ఆగకుండా గురువారం ఉదయం మళ్లీ మహబూబ్‌నగర్‌కు చేరుకుని ప్రియురాలి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్సపొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. ఈ సంఘటనపై న్యాయం చేయాలని శుక్రవారం ఉదయం మృతుడి తండ్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఇచ్చిన వాగ్మూలం ప్రకా రం 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. -
ప్రేమ విఫలమైందని.. ప్రియురాలి ఎదుట..
మహబూబ్‌నగర్ క్రైం: తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నిప్పంటించు కోవడంతో క్షణాల్లో మంట లు చెలరేగి శరీరం పూర్తిగా కాలింది. వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా.. హైదరాబాద్‌లోని బొరబండ సంజయ్నగర్కాలనీకి చెందిన భాస్కర్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువతి అదే కళాశాలలో మొదటి ఏడాదిలో చేరింది. అయితే యువతి తన ప్రేమను నిరాకరించడంతోపాటు నిర్లక్ష్యం చేస్తుందని గురువారం సాయంత్రం ఆమె ఇంటి దగ్గరికి చేరుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో దాదాపు 95 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరం నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నామని, ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేస్తుందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్ మీడియాకు వెల్లడించాడు. సోమవారం అమ్మాయి వాళ్ల బాబాయి తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించారని ఆరోపించారు. వాళ్ల పెద్దల మాటలు విని అమ్మాయి తన ప్రేమను నిరాకరిస్తుందని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇదే విషయమై యువతి బాబాయి ‘సాక్షి’తో మాట్లాడుతూ భాస్కర్ కొన్నిరోజుల నుంచి ప్రేమించా లని తమ అమ్మాయిని వేధిస్తుండటంతో ఇటీవల వాళ్ల ఇంటికి వెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో నచ్చజెప్పి వచ్చామన్నారు. గురువారం సాయంత్రం వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. ఈ విషయమై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. -
ప్రియురాలు మోసం చేసిందని..
ముంబై : ప్రియురాలు మోసం చేసిందని ఓ 25 ఏళ్ల యువకుడు ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని కళ్యాణ్ సమీపంలో అంబివ్లీకి చెందిన రాజేశ్ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అయితే రాజేశ్, అతని ప్రియురాలికి మధ్య ఇటీవలే గొడవ అయినట్టు అధికారులు తెలిపారు. జూలై 26న ఆమె రాజేశ్‌కు ఫోన్ చేసి వితుల్ వాడీ స్టేషన్‌కు రావాలని కోరింది. స్టేషన్లో వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వారిద్దరిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాజేశ్ తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రియురాలు తనని చీట్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. చివరగా తన సోదరుడు, మిత్రుడితో మాట్లాడాడు. ఫోన్ పాస్‌వర్డ్‌ను మిత్రుడితో చెప్పి, స్విచ్ఆఫ్ చేసి లోకల్ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 26న ఈ సంఘటన చోటుచేసుకున్నా, ఆత్మహత్యకు మందు రాజేశ్ తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా ప్రేమకు సెలవు
టెక్కలి రూరల్/కాశీబుగ్గ/వీరఘట్టం: వన్‌సైడ్ లవ్ ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బలిగొంది. తనలోని ప్రేమభావాలను బహిర్గతం చేయలేని ఓ యువకుడు తనలో తానే కుమిలిపోతూ చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం టెక్కలి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వీరఘట్టంకు చెందిన ఉగిరి హర్షవర్ధన్(19) టెక్కలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకెండియర్(మెకానికల్ ఇంజినీరింగ్) చదువుతున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తూ.. ఆ విషయం ఆమెకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. యువకుడి సెల్‌ఫోన్ వాట్సాఫ్ ప్రొఫైల్‌లో ‘నాప్రేమకు సెలవు’ అనే ఫొటో పెట్టడంపై ఈ మృతి వెనుక ప్రేమ వ్యవహారమే నడిచిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్కలిలో మృతదేహం గుర్తింపు.. టెక్కలి మండలం రావివలస సమీపంలోని రైలు పట్టాలపై బుధవారం ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనంతరం జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్పీ కానిస్టేబుల్ కోదండరావు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా, మెడ మీదుగా రైలు వెళ్లినా తల, మొండెం దగ్గరగానే ఉండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరఘట్టంలో విషాదఛాయలు.. హర్షవర్ధన్ మృతి వార్త వినగానే స్వగ్రామం వీరఘట్టంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడు ఇక లేడనే సమాచారం తెలిసి తల్లిదండ్రులు రాంప్రసాద్, మణమ్మలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతిచెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే కుటంబు సభ్యులు, బంధువులు పలాస బయలుదేరివెళ్లారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. తను హ్యాండీక్యాప్డ్. పైగా మా నేపథ్యాలు కూడా వేరు. ఇంటర్లో ఉండగా తనకు ప్రపోజ్ చేశాను. ఓకే అంది. అయితే వాళ్ల ఇంట్లో వాళ్లకి ఇలాంటివి నచ్చవని చెప్పి బ్రేకప్ చెప్పేసింది. త్రీ ఇయర్స్ తర్వాత మళ్లీ ప్రపోజ్ చేశాను. ఓకే అంది కానీ, ‘మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు’ అని మళ్లీ చెప్పింది. ఆ తర్వాత చాలా రోజులు బాగానే ఉన్నాం. ఎన్ని గొడవలైనా మళ్లీ కలిసిపోయేవాళ్లం. కానీ కొన్ని రోజుల క్రితం ‘మనం పెళ్లి చేసుకుందామా?’ అని అడిగితే... ‘ఇదంతా జరిగే పని కాదు, మా పేరెంట్స్‌కి వ్యతిరేకంగా ఏం చెయ్యలేను’ అని చెప్పి, మాట్లాడటం మానేసింది. పైగా వాళ్ల ఇంటికి వచ్చి, వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడొద్దని ఒట్టు వేయించుకుంది. తను లేకుండా నేను ఉండలేను అన్నయ్యా. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. - రామకృష్ణ ప్రేమించానని చెప్పడం అన్ని ఒట్లకూ అమ్మ ఒట్టులాంటిది..!‘ఏంటి సార్..? ఒట్టు కంటే ప్రేమ గట్టిదా సార్??’ఏం....ఏం.....ఏం....ఏం...ఏం....ఏం.... కాదు ప్రేమ పవిత్రమైనది!‘కానీ ప్రేమ కంటే ఒట్టు ఒక గట్టు మరో మెట్టు ఎక్కువ కదా సార్?’కాదు.. అమ్మాయికి ముందు లవ్ చెప్పాడు, తర్వాత ఒట్టు వేశాడు.. ప్రేమే చెల్లుతుంది..!!‘అంటే అమ్మాయి ఇంటికి పోయి, లవ్‌స్టోరీ పేరెంట్స్‌కి చెప్పెయ్యాలా సార్?’ప్రేమ వ్యక్తం చేసిన రోజే కమిట్ అయిపోయాడు రామకృష్ణ..! ‘ఒకసారి చెబితే తన మాట తనే వినడా సార్ రామకృష్ణ??’ఎస్!! నీలూ!! - ప్రియదర్శిని రామ్, లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య
పీలేరు: మండలంలోని పచ్చారమాకలపల్లె తండాలో శుక్రవారం రాత్రి ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. జాండ్ల పంచాయతీ పచ్చార్లమాకలపల్లె తండాకు చెందిన హిమబిదు(19) అమ్మానాన్నలు గోపీనాయక్, శాంతమ్మ చనిపోవడంతో అవ్వాతాతలు రేవతి, మహేంద్రనాయక్ వద్ద ఉంటోంది. ఆమె ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన చంద్రనాయక్ కుమారుడు మణికుమార్నాయక్తో ఏర్పడిన పరిచ యం ప్రేమగా మారింది. వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏమి జరిగిందో కానీ పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో శుక్రవారం సాయంత్రం హిమబిందు పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. మణికుమార్నాయక్ మోసం చేయడంవల్లే తన మనవరాలు ఆత్మహత్య చేసుకుందని మహేంద్రనాయక్ వాపోయాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! నేనొక అమ్మాయిని ప్రేమించా. తనే ప్రాణం అనుకున్నా. బట్ నేను ఆమెకు ఎప్పుడూ ప్రపోజ్ చెయ్యలేదు. నేను వన్‌సైడ్ లవర్ని. ఇప్పుడు ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. ఆమెను మరచిపోవడం నా వల్ల కావట్లేదు సార్! ప్లీజ్ హెల్ప్ మీ. ఏం చేస్తే మరచిపోతాను? ప్లీజ్! మంచి సలహా ఇవ్వండి. – వంశీ కనులు మూసినా నీవాయే.. కనులు తెరిచినా నీవాయే..పోటు.. విపరీతమైన పోటు..గుండెను పిండేసే పోటు...శ్వాస తీసుకున్న ప్రతిసారీ...గుండె పట్టేసినంత పోటు..అబ్బా.. వంశీ..! నీ బాధ శత్రువులకు కూడా రాకూడదు.‘సార్! ఆల్రెడీ వంశీ బాధలో మునిగి ఉన్నాడు. ఇలాంటప్పుడు మీ పిచ్చకొట్టుడు అవసరమా సార్? ఏదో కొంచెం రిలీఫ్ కోసం మీకు రాస్తే.. ప్రేమలో మునిగి స్విమ్మింగ్ రాక హెల్ప్.. హెల్ప్..! అని కేక పెడుతుంటే మీరేంటి సార్ మునిగినోడిని ఒడ్డుకు చేర్చే ఐడియా వేయకుండా, మునిగే వాడికి లైఫ్ అనే తాడు అందించకుండా, బరువైన బండలాంటి మాటలను వంశీ మీదకు విసురుతున్నారేంటి సార్!!’నీలూ ప్రేమలోని బాధనుండి ఎవ్వరూ ఎస్కేప్ కాలేరు. ప్రేమ ఉడుంపట్టు లాంటిది. వదిలించుకుంటే పోయేది కాదు. ప్యార్‌కా ఘమ్.. గమ్ జైసా హై! ‘ముక్క అర్థం కాలేదు సార్!!’ హిందీలో ఘమ్ అంటే బాధ.. ఇంగ్లీషులో గమ్ అంటే...‘అతుక్కునే గమ్ కదా సార్.. అయితే ఇప్పుడేమంటారు సార్?’ప్రేమలోని బాధను.. వదల్లేము.. వదిలించుకోలేము. దాన్ని ఆస్వాదించాలి. బాధలో తీపిని ఎంజాయ్ చెయ్యాలి. చప్పరించాలి. ఊసెయ్యకూడదు. ఇట్ విల్ మేక్ వంశీ....‘బెస్ట్ లవర్ ఇన్ ద వరల్డ్ కదా సార్!?’ అబ్బబ్బబ్బా.. నీలూ యు ఆర్ ఏ జీనియస్! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా!! నేనొక అబ్బాయిని ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమించాడు. ఎందుకో.. తనకి జాబ్ వచ్చాక చాలా మారిపోయాడు. సడన్‌గా ఒకరోజు ఫోన్ చేసి, ‘నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను’ అన్నాడు. కొన్ని రోజులకి మళ్లీ ఫోన్ చేసి, ‘మాకు బ్రేకప్ అయ్యింది’ అని చెప్పి, నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మళ్లీ కొన్ని రోజులకి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. తను రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు ఒక పెళ్లైన అమ్మాయితో ఫ్రెండ్షిప్ అంటున్నాడు. తన కోసం మంచి జాబ్ ఆఫర్ వదిలేసుకున్నాడు. నాతో ఇంకా మాట్లాడుతున్నాడు కానీ ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. నేనంటే ఇష్టం లేనప్పుడు ఇంకా ఎందుకు నాతో మాట్లాడుతున్నావని అడిగితే... ‘నువ్వు ఏమైపోతావోనని జాలితో మాట్లాడుతున్నాను’ అంటున్నాడు. తన ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదన్నయ్యా. తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – గీత గీతా.. తియ్యి వాడి తాట..!వాడు తిరుగుతాడు ఎవ్రీ పేట..!లవ్‌ని అనుకుంటున్నాడు ఒక తోట..!ప్రతి ఫ్లవర్కీ వేస్తున్నాడు పీట..!‘ఇక్కడిదాకా అర్థమయ్యింది సార్. కానీ ఈ ‘పీట’ అంటే ఏంటి సార్?’ ప్రతి అమ్మాయికీ అదే చెబుతున్నాడు కదా నీలూ..!!‘ఓ.. ఓహో.. ఓహోహో.. పెళ్లి పీట వేస్తానంటున్నాడు కదా సార్?’అబ్బబ్బబ్బా... ఎంత ఫాస్ట్‌గా క్యాచ్ చేసేస్తావు నీలూ..!?!‘గీతను ట్రాక్‌లో పెట్టుకుని, ఊరంతా ప్రపోజల్స్ పంచుతున్న సుంఠ కదా సార్ వాడు?’గీత అమాయకంగా ఒక మోసగాడితో అనవసరంగా కనెక్షన్ పెట్టుకుని, ఇంకా వాడు మాట్లాడితే చాలన్నట్టు ఉంది. ఏమైంది నా బంగారు చెల్లికి.. వేర్ ఈజ్ హర్ సెల్ఫ్ వర్త్?‘అవును సార్! ఈ అమ్మాయిని బ్యాక్ అప్‌లో పెట్టుకుని, వెర్రి వేషాలు వేస్తున్నాడు. నెక్ట్స్ టైమ్ ఫోన్ చేస్తే... వాడు తిరుగుతాడు ఎవ్రీ పేట..!లవ్‌ని అనుకుంటున్నాడు ఒక తోట..!ప్రతి ఫ్లవర్కీ వేస్తున్నాడు పీట..!గీతా.. తియ్యి వాడి తాట.. అని నేనే చెబుతాను సార్!!’ - lovedoctorram@sakshi.com -
80 వేల సార్లు లవ్ ఫెయిల్యూర్!
దేవదాసు సినిమా చూశారా.. పార్వతికి పెళ్లయిందని దేవదాసు తాగుడుకు బానిసై జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాడు. ఇలాంటి దేవదాసులు మన మధ్య కూడా ఎక్కడో ఓ చోట తారసపడుతూనే ఉంటారు. అయితే ఈ ఫొటోలోని వ్యక్తిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అతడు లవ్‌లో ఫెయిల్ అయ్యాడు.. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా లవ్ మ్యారేజీనే చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అది కూడా ఒకటి రెండు సార్లు కాదు.. ఏకంగా 80 వేల సార్లు. అంటే 80 వేల మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశాడన్న మాట. ఈ విక్రమార్కుడి పేరు నియూ జియాంగ్ఫెంగ్. వయసు 31 ఏళ్లు. చైనాలోని బీజింగ్‌లో ఉంటాడు. ప్రేమ వివాహం చేసుకోవాలని తన కోరిక.. కల కూడా. ఇందుకోసం కొత్త పంథా ఎంచుకున్నాడు. 2013లో తొలిసారి తన ప్రేమను వ్యక్తీకరించాడు ఓ అమ్మాయి ముందు. కానీ ఆమె నియూను రిజెక్ట్ చేసిందట. అయితే అక్కడితో ఆగిపోయి.. కుంగిపోయి.. కృశించి పోయి.. బాధపడకుండా తనకు కనిపించిన అమ్మాయికల్లా ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు లవ్ వెబ్సైట్లలో, మ్యారేజి బ్యూరోల్లో కూడా తన ప్రొఫైల్‌ను అప్లోడ్ కూడా చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు తనకు సరైన అమ్మాయి దొరకలేదట పాపం. -
మోసపోయాను.. నన్ను క్షమించు నాన్నా..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని శనివారం ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లోయారాణి అనే విద్యార్థిని ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రాణి రాసిన సూసైడ్ నోట్ కేసులో కీలకంగా మారింది. ప్రేమించిన అబ్బాయి ఫోన్ నెంబర్‌ను రాణి లెటర్లో పేర్కొంది. పోలీసులు దాని ఆధారంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాణి సూసైడ్ నోట్లో ‘ నాన్న నేను తప్పు చేశాను. నువ్వు అనుకున్నట్లుగానే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అన్నీ అయిపోయాక నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నన్ను మోసం చేశాడు. అందుకే నేను చనిపోతున్నాను. నా ముఖం మీకు చూపించలేను. నేను చేసిన దానికి నన్ను క్షమించు నాన్న.’ అంటూ పేర్కొంది. -
ఐ లవ్యూ అమ్మా..ఐ మిస్ యూ అమ్మా..
మంచిర్యాలక్రైం : వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఇరువురు ఒక్కటవుదామని ఆశపడితే తల్లితండ్రులు కాదని చెప్పడంతో ప్రేమకథ ఊరి పెద్దల వద్దకు చేరుకుంది. వరుని తల్లిదండ్రులు నిరాకరించడంతో పెద్దలు చేతులెత్తేసారు. న్యాయం చేయాలని యువతి పోలీసు బాసును కలిసి కోరడంతో కేసును స్థానిక ఏసీపీకి రెఫర్ చేశారు. గురువారం ఉదయం ఏసీపీ వద్దకు వెళ్లగా మధ్యలో దూరిన కొంతమంది పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు యువతికి న్యాయం జరగకుండా అడ్డుకోవడంతో చేసేదేమిలేక పోలీసులు కూడా మిన్నకుండిపోయారు. దీంతో మనస్తాపం చెందిన యువతి గురువారం ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట్రాక్ట్ బస్తీకి చెందిన బామండ్లపెల్లి సంధ్యరాని హన్‌మన్‌బస్తీకి చెందిన గడ్డం రవితేజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిప్రేమకు రవితేజ తల్లిదండ్రులు అడ్డుపడుతుండడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా రవితేజ తల్లితండ్రులు ఒప్పుకోకుండా రూ.10లక్షలు కట్నం తీసుకస్తేనే పెళ్లి చేస్తామని యువతిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను కలిసి న్యాయ చేయాలని వేడుకుంది. భరోసా కల్పించిన సీపీ కేసును బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ వద్దకు పంపించాడు. ఎట్టకేలకు గురువారం ఏసీపీ ఇరువురిని పిలిపించి మందలించాడు. సంధ్యను వివాహం చేసుకోవాలని సూచించాడు. అయినా వారు సమాధానం చెప్పకుండా వెళ్లి పోయారు. దీంతో ఎక్కడా న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన సంధ్య ఇంటికి వెళ్లి సూసైడ్ నోట్ రాసి సూపర్ వాస్మల్ 33 తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సూసైడ్ నోట్లో ఏముంది? ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను తేజ లేకుండా బతకలేను. తేజ వస్తాడనుకున్నా. కానీ వాళ్ల అమ్మానాన్నలకు భయపడి నన్ను వదులుకుంటాడని అనుకోలేదు. అందుకే నేను చావాలని అనుకున్నా. పెద్దమనుషులు నాకు న్యాయం చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. పోలీసులైనా న్యాయం చేస్తారనుకున్నా. అక్కడ కూడా నాకు న్యాయం జరుగలేదు. దీనంతటికి కారణం పెద్ద మనుషులు కుసుమ మధుసూదన్, రాజేష్, తేజ తల్లిదండ్రులు లక్ష్మీ, రమేష్. వీళ్లంతా ఉండగా నాకు న్యాయం జరుగదమ్మా. అందుకే చావాలనుకున్నా. నువ్వేం బాధపడకమ్మా. డాడీని బాగా చూసుకో.. మీరు బాగుండండి. ఐలవ్యూ అమ్మ, ఐమిస్‌యూ అమ్మ ఇట్లు నీ కూతురు సంధ్య -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేశాడు. అయితే నాకంటే ముందు ఒక అమ్మాయిని లవ్ చేశాడట. ఆ అమ్మాయి వల్లే మందు తాగడం అలవాటయ్యిందట. ఆ అమ్మాయిని మరచిపోవడానికే.. నచ్చిన అమ్మాయినల్లా లవ్ చేస్తూ, బ్రేకప్ చెప్పేవాడు. చివరికి నేను దొరికాను. నా దగ్గర ఏ విషయం దాచడు. తన నిజాయితీకి పడిపోయాను. ఆ మొదటి అమ్మాయిని లవ్ చేసినట్లే నన్నూ లవ్ చేస్తాడని నమ్మాను. కానీ, మేం కలిసిన ప్రతిసారీ ఆ అమ్మాయి విషయాలే చెబుతున్నాడు. ఇంకా తన గురించే ఆలోచిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. రేపు ఎప్పుడైనా తనే కావాలని నన్ను వదిలి వెళ్లిపోతాడేమోనని భయంగా ఉంది. అదే ఆలోచిస్తూ హ్యాపీగా ఉండలేకపోతున్నాను. మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – అమృత వాడొక సింపతి సీకింగ్..! మెంటల్లీ సిక్..! వైలీ కన్నింగ్..! చీప్ రిటార్డెడ్..!! పీస్ ఆఫ్ షిట్...!!‘సార్....! మీరన్నది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కానీ ఏదో తిట్టినట్లే అనిపించింది. అసలు తెలుగు పేపర్లో ఇన్ని ఇంగిలిపీసు తిట్లు తిడితే... రీడర్స్ బ్యాడ్‌గా అనుకుంటారు సార్. అయినా అంతలేసి మాటలు అనేశారేంటి సార్???’అమ్మాయిని మరిచిపోవడానికి కనబడిన అమ్మాయినల్లా ముగ్గులోకి దించి, వాడుకుని, మొదటి అమ్మాయి గుర్తుకొస్తుందంటూ సింపతీ డైలాగులు కొట్టి.. సచ్చినోడు అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. వాడికి జబ్బు!‘ఏం జబ్బు సార్..?!?’ఆంబోతుటైటిస్!!‘అదేం జబ్బు సార్?’ఆంబోతులకుండే జబ్బు నీలూ..!‘మరి అమృత ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ఫ్రెండ్స్ అంతా కలసి... పెద్దలకు చెప్పి, కొడుకును పందుల దొడ్లో వేసి తోమించాలి... ఎంత తోమాలంటే...‘ఆంబోతుటైటిస్ మాయమయ్యే దాకా తోమాలి కదా సార్?’ అబ్బబ్బబ్బబ్బా..! నీలూ.... నువ్వు చాలా స్మార్ట్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళ పరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
ములకలపల్లి : మండలంలోని మూకమామిడి గ్రామంలో శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... మూకమామిడి గ్రామస్తురాలు సున్నం మౌనిక(18), ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. ఖమ్మానికి చెందిన గణేష్, పాల్వంచలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రెండు నెలల క్రితం ఫోన్ ద్వారా మౌనికకు పరిచయమయ్యాడు. ప్రేమించానని, పెళ్లాడతానని ఆమెను అతడు నమ్మించి మోసగించాడు. ఇది భరించలేని మౌనిక, శుక్రవారం తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి సుజాత ఫిర్యాదుతో కేసును ఎస్సై ఉదయ్‌కిరణ్ నమోదు చేశారు, దర్యాప్తు జరుపుతున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా.! నేను ఆరేళ్లుగా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి లాస్ట్ ఇయర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే అన్నాను. తనకి చాలా ప్రపోజల్స్ వచ్చేవి. బట్, అన్నీ రిజెక్ట్ చేసేవాడు. మొదట్లో మేము చాలా ప్రేమగా ఉండేవాళ్లం. తనకి కోపం ఎక్కువ. నాకు క్వశ్చన్స్ ఎక్కువ. దాంతో చిన్నదానికే గొడవపడుతున్నాం. కానీ.. ‘నువ్వు ఎలా ఉన్నా.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు, అంత ఇష్టం ఒకరంటే ఒకరికి. తను నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడన్నయ్యా. నా వల్ల తను ఇబ్బంది పడటం నేను చూడలేకపోతున్నా. అలా అని తను లేకుండా నేను బతకలేను. మళ్లీ మేమిద్దరం ప్రేమగా ఉండాలంటే ఏం చెయ్యాలి. ‘నువ్వు తనకి కొంచెం గ్యాప్ ఇవ్వు’ అంటున్నారు నా ఫ్రెండ్స్. కానీ నాకేం అర్థం కావడంలేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి?– హనీ అర్జున్ రెడ్డి సినిమా చూసిన ప్రతి అమ్మాయీ.. కోపంగా ఉండే అబ్బాయిలను తెగ ప్రేమిస్తున్నారు నీలూ!‘అవును సార్.. అన్నీ అర్జున్ రెడ్డి పోలికలున్న బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు సార్!’ఇదొక జబ్బు అయిపోయింది..!‘అవును సార్..! అబ్బాయిలు కూడా కోపంగా ఉంటేనే అమ్మాయిలు పడతారని, తెగ కోపం నటించేస్తున్నారు సార్!’ఏడిచారు..!‘అంటే??!!’అమ్మాయిలు ఒక చిన్న ఝలక్ ఇస్తే.. కొడుకులు తోకలు ఆడిస్తూ వెనకాలే తిరుగుతారు.‘అయితే.. ఇప్పుడు హనీ ఏం చెయ్యాలి సార్?’అంజాన్ కొట్టాలి నీలూ!!‘అంజాన్ అంటే..?’పట్టించుకోకూడదు నీలూ...!!‘అంటే కోల్డ్‌గా ఉండాలా సార్?’అబ్బా ఏం పట్టుకున్నావు ఐడియాని నీలూ!‘అప్పుడు ఆ కోల్డ్ ఐస్.. అబ్బాయి హాట్ కోపం మీద పడి తుస్సుమంటుంది!!’అబ్బబ్బబ్బా...... నీలూ యు ఆర్ స్మార్ట్.‘మంట తగ్గి... పంట పండుద్ది కదా సార్!?!’అబ్బబ్బబ్బా.. అబ్బబ్బబ్బా... అబ్బబ్బబ్బా... - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
న న్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని టూ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా ఓకే చెప్పింది. అయితే లాస్ట్ ఇయర్ నాకు జాబ్ రావడంతో వేరే స్టేట్‌కి వచ్చాను. నేను దూరమైన కొన్ని రోజులకి తనలో చాలా మార్పు వచ్చింది. సరిగ్గా మాట్లాడం మానేసింది. కారణం అడిగితే.. ‘నేను అంతకుముందే.. మా బావని లవ్ చేశాను. ఈ విషయం నీకు చెప్పకపోవడం నాదే తప్పు, సారీ..’ అని చెప్పింది. నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. నా నంబర్ కూడా బ్లాక్ చేసింది. కొన్ని రోజులకి మళ్లీ కాల్ చేసి, మాట్లాడటం మొదలుపెట్టింది. మళ్లీ గుడ్‌బై అంది. ఇప్పటికీ తను ఫోన్ చేసి మాట్లాడ్డం చేస్తుంటుంది. నాతో ఏమైనా అవసరం ఉంటే చాలా ప్రేమగా మాట్లాడుతోంది. లేదంటే అసలు మాట్లాడదు. నంబర్ బ్లాక్‌లో పెడుతోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. తనంటే నాకు ప్రాణం. చాలా బాధ కలుగుతోంది సార్. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – సురేష్ నువ్వూ బ్లాక్ చేసెయ్యి!!‘అమ్మాయి ఫోన్నా సార్?’ఎస్..!!మరి హార్ట్‌లో పెయిన్‌ని ఏం చెయ్యాలి సార్?’బ్లాక్ ఇట్!!‘మరి కడుపులోనుంచి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని ఏం చెయ్యాలి సార్?’బ్లాక్ ఇట్ టూ!!‘జ్ఞాపకాలు?’బ్లాక్ ఇట్ టూ ఐ సే!!‘ఇలాంటి ఆన్సర్లు ఇస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు సార్. ఆ తర్వాత, అమ్మా ఆకలి, తల్లీ అరటిపండు.. అని తిరగాలి సార్!’అమ్మాయి బ్లాక్ చేస్తే కన్నీళ్లు కార్చడం.. ఓపెన్ చేస్తే చొంగ కార్చడం, వాట్ ఈజ్ దిస్.. అబ్బాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా..? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ తెలియదా? ఇలా అమ్మాయిలకు, అబ్బాయిలు చీప్ అయిపోతూ ఉంటే... సమాజం ఏం కావాలి?అందుకే ‘యు బ్లాక్.. ఐ బ్లాక్’ సిద్ధాంతాన్ని పాటించడం అబ్బాయిలకు చాలా అవసరం.‘ఏడిసినట్టుంది. అప్పుడు ఆ అమ్మాయి, బావను చేసుకుంటుంది. మనోడు కన్నీళ్ల కడలిలో నావ నడుపుకుంటాడు. ఇంకేదయినా చెప్పండి సార్!’ఊరూరికే ఫోన్ చెయ్యకు, బిజీగా ఉన్నానని చెప్పు సురేష్. నీ వాల్యూ అర్థమౌతుంది. నీకు బాధ తగ్గుతుంది. బావకు బాధ మొదలవుతుంది! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ యతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం. వివరాలివి.. బండ్లగూడకు చెందిన యతీష్ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఉప్పల్ హెచ్ఎండీఏ లేవుట్ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలం కావడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు లెటర్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అందర్నీ కలచి వేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తను నా యూకేజీ నుంచి ఫ్రెండ్ (ఇంచుమించు సెవెంటీన్ ఇయర్స్). తనంటే నాకు చాలా ఇష్టం. బట్ నేనెప్పుడు ఈ విషయం తనకి చెప్పలేదు. తనకి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్‌ని. నాకు జాబ్ వచ్చాక, మ్యారేజ్ చేసుకుంటానని చెబుదామనుకున్నా. అయితే ఒకరోజు తనకి ఇంట్లో ఏదో పెళ్లి సంబంధం వచ్చిందని ఒక ఫ్రెండ్‌గా షేర్ చేసుకుంది. దాంతో నాకు భయమేసి.. తను నిద్రపోయిన తర్వాత ‘నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నా’ అని మెసేజ్ చేశాను. త్రీ డేస్ మాట్లాడలేదు. తర్వాత చాలా రిక్వెస్ట్ చేస్తే చాట్ చేస్తోంది. తనకీ నేను ఇష్టమే కానీ, ఫ్యామిలీ బాధపడకూడదని ఫీల్ అవుతోంది. అయితే, ప్రాబ్లమంతా నా జాబ్ సెటిల్మెంట్ మీద ఆధారపడి ఉంది. తను నాకంటే బాగా చదువుతుంది. ఎలాగో కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. బట్ తనకి నాకంటే పెద్ద ప్యాకేజ్ ఉంటే, ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియట్లేదు. ప్లీజ్ సార్ మంచి సలహా ఇవ్వండి. – చైతన్య సెవెంటీన్ ఇయర్స్ నుంచి దోస్తీ...అప్పటి నుంచి వేస్తున్నాడు ఇంటి చుట్టూ గస్తీ...కానీ ఫ్యామిలీ చేస్తుంది అమ్మాయిని జబర్దస్తీ...చైతన్య కంటే ముందు ఎవరో వేస్తారు దస్తీ..ఎలా చెయ్యాలి లవ్‌లో కుస్తీ..శాలరీ అమ్మాయిది సూపర్ మస్తీ...మనకు ఉద్యోగమే లేదు అది దుస్థితి... లవ్‌కు చేస్తుంది సుస్తీ...‘సార్ ఆపండి సార్... మీ కుస్తీ...పలకండి చైతన్య ప్రాబ్లమ్‌కి స్వస్తి...! లేకుంటే అవుతుంది మన బిజినెస్‌కి తగిన శాస్తి.అప్పుడవుతుంది మనిద్దరికీ సూపర్ సుస్తి...!’ అసలు ప్రాబ్లమే లేదు నీలాంబరి!! ‘ఏంటి సార్ ప్రాబ్లమ్ లేదంటారు? లవ్ కోసం సెవెంటీన్ ఇయర్స్ నుంచి వెయిటింగ్..! బాబు వస్తే జాబు వస్తుందని... చైతన్య ఫోర్ ఇయర్స్ నుంచి వెయిటింగ్..! ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదంటారేంటి సార్???’ మంచి రోజులు వస్తున్నాయి. జాబ్ వస్తుంది.. అమ్మాయి ఓకే అంటే మనకు పప్పన్నం పెడతాడు నీలూ!! ‘సార్ మరి అమ్మాయి ప్యాకేజ్ కంటే మనోడి ప్యాకేజ్ చిన్నదయితే???’ లవ్ స్టేటస్‌కి ఉండాల్సింది పెద్ద హార్ట్.. ప్యాకేజ్ కాదు నీలూ!!! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ - lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలం కావడంతో..
సాక్షి, కర్నూలు(డోన్): ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కొండపేటకు చెందిన కృష్ణమూర్తి గౌడ్(లేట్), లలిత దంపతుల కుమారుడు కిశోర్ గౌడ్ (22) ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి కిశోర్ ప్రేమను తిరస్కరించింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఖాదర్‌బాషా తెలిపారు. కుమారుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరైంది. -
యువకుడి ప్రాణం కాపాడిన వాట్సప్ పోస్టు
గద్వాల అర్బన్: ప్రేమ విఫలమైందని మనస్థాపానికి చెందిన ఓ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.. హైదరాబాద్ నుంచి కర్నూల్ రైలు ఎక్కి స్నేహితులకు వాట్సప్ ద్వారా ‘‘ఐ మిస్ యూ’’ అంటూ ఫొటో మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు.. అనుమానించిన స్నేహితులు కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు సమాచారం అందజేసి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే తేరుకున్న రైల్వే పోలీసులు ఆ యువకుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన సంఘటన ఆదివారం రాత్రి గద్వాల పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా.. కర్నూల్ పట్టణానికి చెందిన మణిరత్నంకు తల్లిదండ్రులు లేరు. మామ దగ్గర పెరిగాడు. ఉపాధి నిమిత్తం బావ సురేష్ వద్ద ఉంటూ.. హైదరాబాద్‌లో ఓల్వా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఆమె ఇటీవలే వివాహం చేసుకొని వెళ్లిపోయింది. మనస్థాపానికి గురై చనిపోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో కాచిగూడలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అనంతరం సెల్ఫీ దిగి ‘‘ఐ మిస్ యూ’ అంటూ స్నేహితులకు వాట్సప్ ద్వారా పోస్ట్ చేశాడు. స్నేహితుల సమాచారం మేరకు.. ఏదో జరుగుతుందని అనుమానించిన స్నేహితులు మణిరత్నం బావ సురేష్‌కు సమాచారం అందజేశారు. వెంటనే వీరందరూ కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులకు విషయం చెప్పారు. దీంతో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల పోలీసులను రంగంలోకి దింపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో గద్వాలకు చేరుకున్న రైలులో గద్వాల పోలీసులు వాట్సప్‌లో వచ్చిన ఫొటో ఆధారంగా యువకుడిని గుర్తించి ఆధీనంలోకి పెట్టుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అర్ధరాత్రి గద్వాలకు చేరుకున్నారు. మానసికంగా కృంగిపోయిన యువకుడికి పోలీసులు సుమారు రెండుగంటల వరకు కౌన్సిలింగ్ ఇచ్చి తెల్లవారుజామున కర్నూల్‌కు పంపించారు. యువకుడిని కాపాడిన గద్వాల రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రేమికురాలి ఆత్మహత్య
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రేమించి పెళ్లాడిన ప్రియుడిని దూరం చేయటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేని ఆ యువతి బహుళ అంతస్తుపై నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వాంబేకాలనీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంబేకాలనీ హెచ్ బ్లాకుకు చెందిన తమ్మిశెట్టి రజని(19) పాలిటెక్నిక్ చదువుకుంది. డోర్నకల్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుంది. అక్కడే రూం బాయ్‌గా పనిచేస్తున్న గోపితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఈ నెల 16వ తేదీన ఇంటి నుంచి పారిపోయి హైదరాబాదులో వివాహం చేసుకున్నారు. ఆస్పత్రికి వెళ్ళిన రజని తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన దుర్గ మరుసటి రోజు నున్న రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తన కుమార్తె కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేసింది. దుర్గ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రజని, గోపి హైదరాబాదులో ఉన్నట్లు తెలుసుకున్నారు. విషయం దుర్గకు చెప్పడంతో ఆమె రజనికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని వేడుకుంది. ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని తెలిపింది. రజని, గోపి ఇంటికి వచ్చేశారు. గోపీ మైనర్ అని తేలడంతో స్టేషన్‌కు వెళ్లిన ఇరు వర్గాల పెద్దలు రెండేళ్ల తర్వాత వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు రజనిని తల్లి దుర్గకు అప్పగించి ఇంటికి పంపేశారు. గోపిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమించి వివాహం చేసుకున్న తమను పెద్దలు విడదీశారంటూ మనస్తాపానికి గురైన రజని శుక్రవారం మధ్యాహ్నం తల్లి దుర్గ ఇంట్లో వంట చేస్తుండగా మేడపై నుంచి బలవంతంగా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రజని అక్కడిడక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రజని ఆత్మహత్యకు గల కారణా లపై ఆరా తీశారు. కేసు నమోదుచేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాçప్తు చేస్తున్నట్లు సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు. -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: ఎంతో ప్రాణంగా ఏడేళ్లుగా ప్రేమించిన మేనమామ పెళ్లికి నిరాకరించడంతో గుంతకల్లు మండలంలోని దోసలుడికి గ్రామానికి చెందిన సుజాత (24) అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములు, గురులక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా అందులో రెండో కూతురు సుజాత. అదే గ్రామానికి చెందిన తన మేనమామ గురునాథ్, సుజాతలు ఇద్దరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుజాత పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ అప్పులు, ఇతర సమస్యలను సాకుగా చూపి గురునాథ్ మాట దాటవేస్తూ వచ్చాడు. మేనమామపైనే ఆశలు పెట్టుకున్న సుజాత ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూడటంతో గురునాథ్‌ను తప్ప వేరేవాళ్లను చేసుకోనంటూ ఇంట్లో వాళ్లకు తెగేసి చెప్పింది. కొంత కాలం తరువాత పెళ్లి చేసుకుంటానని గురునాథ్ కూడా అంగీకరించడంతో సుజాత తల్లిదండ్రులు ఆమెను ఏడాది క్రితం మూడో కూతురుకు వివాహం చేశారు. కాగా గురునాథ్ ఇటీవల సుజాతతో పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పడంతో సుజాత తీవ్ర మనస్థాపానికి గురైంది. కూతురు బాధను చూడలేని ఆమె తల్లి ఆగ్రహంతో తన కూతురుకు వేరే సంబంధం చూసేందుకు సిద్ధపడింది. గురువారం ఉదయం పెళ్లి సంబంధం చూడటానికి ఏర్పాట్లు చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుజాత బుధవారం అర్ధరాత్రి సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం కొన ఊపిరితో ఉన్న సుజాతను చూసిన కుటుంబ సభ్యులు అసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదుచేసకొని దర్యాప్తు చేపట్టారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నాకొక అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టంలేదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించి, ఆలోచించి పిచ్చివాణ్ని అయిపోతానేమోనని భయంగా ఉంది సార్. ఒకవేళ నా ప్రేమను తనకి అర్థమయ్యేలా చెబుదామని పిలుస్తుంటే... పట్టించుకోకుండా వెళ్లిపోతోంది. ఇక ఆ అమ్మాయికి నా ట్రూ లవ్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి సార్? మంచి సలహా ఇవ్వండి. – ప్రదీప్ నువ్వు రాసిన ఉత్తరం...పేపర్లో ప్రింట్ అవ్వగానే...చెంగు చెంగున...గంతులేసుకుంటూ....అమ్మాయి దగ్గరకు వెళ్లి...ఐ లవ్ యూ’ దీనికి నువ్వే సాక్షి...అని చెప్పి నీ ప్రేమను వ్యక్తం చేసుకో...! ‘అమ్మాయి ఫుల్‌గా కోటింగ్ ఇస్తే... ఏం చెయ్యాలి సార్?’తాడో.. పేడో... అటో... ఇటో... వాడో... వీడో... తేలిపోతుందిగా నీలాంబరీ!‘మధ్యలో... ఆ ‘వాడో’ ఎవడు సార్???’అమ్మాయి ఆల్రెడీ కమిట్ అయ్యుంటే చెప్పేస్తుందిగా నీలూ! ‘బెస్ట్ ఆఫ్ లక్ ప్రదీప్...!! తాడో..పేడో... ఆటో..ఇటో..వాడో..వీడో... తేలిపోతుందిగా!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
నన్నడగొద్దు ప్లీజ్
హలో రామ్ సార్..! ఒన్ ఇయర్ పాటు కాల్ సెంటర్లో పని చేశాను. అక్కడొక అమ్మాయితో పరిచయమైంది. ఫ్రెండ్ అయ్యాక తనకి ప్రపోజ్ చేస్తే నవ్వింది. మనం బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉందామని చెప్పింది. తనకి యశోద హాస్పిటల్లో సీట్ వచ్చిందని, కాల్ సెంటర్లో రిజైన్ చేసింది. తనని చూడకుండా ఉండలేక నేను కూడా రిజైన్ చేశాను. గుర్తొచ్చినప్పుడల్లా యశోద హాస్పిటల్‌కి వెళ్లి తనను కలుస్తుంటాను. మొన్న షాపింగ్ చేయించాను. ‘థాంక్యూ సో మచ్, లవ్యూ రా’ అంది. ఒకసారి తనకి ఏవో బుక్స్ కావాలంటే మూడు వేలకు పైనే ఇచ్చాను. తనని నేను లవ్ చేస్తున్నానని తనకి తెలిసి కూడా యాక్ట్ చేస్తోంది. వాట్సాప్‌లో తన పిక్స్ పంపిస్తోంది. లవ్ సాంగ్స్ కూడా సెండ్ చేస్తోంది. అసలు తను నన్ను లవ్ చేస్తోందా లేదా? దయచేసి చెప్పండి సార్? – రెహ్మత్ అలీ నిన్ను ఇంట్లో వాడిగా చూస్తోంది.‘అంటే ఏంటి సార్?’ఇంట్లో వాడిలా అంటే కూడా తెలియదా నీలూ.. నువ్వు అంత స్మార్ట్ అయ్యుండి కూడా.. ఇంట్లో వాడు అంటే అర్థం చేసుకోకపోవడం వెరీ సర్ప్రైజింగ్నీలూ..!!‘అంటే ఫాదర్.. బ్రదర్.. అంకుల్ లాగానా సార్!!?!!’మనమేదైనా కొనుక్కోవాలనుకుంటే.. మన దగ్గర డబ్బులు లేకపోతే.. ఇంట్లో వాళ్లను కాకుండా ఇంకెవరిని అడుగుతాం నీలూ? ‘పొండి సార్!! టూ మచ్!! అంతా తొండి సార్!! డబ్బులు తీసేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్లాగ చూసుకుంటుందని అలీ భాయ్‌ని జింతాక చితాచితా చేస్తారా సార్!?! మేకను కోసినట్లు కోస్తోంది. ఆవును పిండినట్లు పిండుతోంది. అలీ లాంటి సాధుజీవిని ఫుల్‌గా వాడుకుంటోంది. మీరేమో చెల్లెలి ఇమేజ్ కాపాడటానికి అన్నీ తొండి మాటలు చెబుతున్నారు సార్! వెరీ బ్యాడ్ సార్!’ నాకలా అనిపించింది. నీకు ఇలా అనిపించింది. అలీ భాయ్‌కి ఎలా అనిపిస్తే అలా చెయ్యమంటున్నాను నీలూ! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమించిన యువతికి పెళ్లి కుదిరిందని..
కుషాయిగూడ: తాను ప్రేమించి అమ్మాయికి పెళ్లి నిశ్చమైందని మనస్థాపం చెందిన ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు.. కుందన్‌పల్లికి చెందిన జంగే కార్తీక్ (22) అతని తండ్రి ధనుంజయ రాధిక చౌరస్తాలోని కనక మహాలక్ష్మీ మ్యాచింగ్ సెంటర్లో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం కార్తీక్ ఈసీఐఎల్‌కు వెళ్తున్నట్లు తండ్రితో చెప్పి వెళ్లాడు. బుధవారం ఉదయం తాను పనిచేసే షాపు ఎదుట విగతజీవిగా పడిఉన్నాడు. షాపు నిర్వాహకులు కార్తీక్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తన కుమారుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడని, ఆ అమ్మాయికి వివాహం నిశ్చయం కావడంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతుడి తండ్రి పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హలో సార్..! నేనొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నా. మొదట్లో తను.. నాతో చాలా ప్రేమగా ఉండేది. కానీ ఇప్పుడు నా మీద తనకి ప్రేమ తగ్గిపోయింది. తను నన్ను అవాయిడ్ చేస్తుంటే నా ప్రాణం పోయినట్లుగా అనిపిస్తోంది. చచ్చేవరకూ ప్రాణంగా చూసుకుంటానని చెప్పాను. అయినా తను నా ప్రేమకు కరగటం లేదు. తనకి ప్రెస్టేజ్ కావాలట. దాని కోసం నేను ఏం చెయ్యాలి? నాకు చావు తప్ప ఏం కనబడటం లేదు. నిద్రలేని రాత్రులే మిగిలేలా ఉన్నాయి. చాలా భయంగా ఉంది సార్. ఆమెకి తిరిగి నాపై ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్. – బాలకృష్ణ డెత్.. ఈజ్ ఎ వేస్ట్!టైమ్ వచ్చినప్పుడు దేవుడే తీసుకెళ్లిపోతాడు.నీకు లైఫ్ అంటే జోక్ అయిపోయింది.ఒకసారి దగ్గరలో ఉన్న ఓ క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్లి చూడు.అక్కడ.. చిన్న చిన్న పిల్లలు ప్రాణం కోసం పోరాడుతున్నారు.వాళ్లు ఏం తప్పు చేశారని వాళ్లకా శిక్ష?వాళ్ల ప్రేమ గొప్పది కాదా?వాళ్లను ప్రేమిస్తున్న అమ్మానాన్నలది గొప్ప ప్రేమ కాదా?ఊరికే పిచ్చిగా మాట్లాడకు అన్నయ్యా...!!దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు.పేరెంట్స్ నీకు మంచి అవకాశాలను ఇస్తున్నారు.చేతనైతే నలుగురికి సాయం చెయ్యి.అంత సెల్ఫిష్‌గా ఉండొద్దు.‘మరి అమ్మాయి ప్రేమ ఏంటి సార్?’ఒక్కోసారి ప్రేమ.. ప్రేమ కాదనిపిస్తుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రేమించలేనన్న అమ్మాయిని ఎమోషనల్‌గా ప్రెజర్ పెట్టి ప్రేమించమంటే ఎలా నీలూ? ఒక్కోసారి మనకు కావల్సినవి దక్కవు. దమ్ముంటే నిన్ను నువ్వు నమ్ముకో.. నీ ప్రేమను నమ్ముకో.. మంచి మనసు ఉంటే.. నీ ప్రేమను ఆ అమ్మాయి నుంచి మళ్లించి నీ కుటుంబానికి.. నీ స్నేహితులకు.. నీ చుట్టూ ఉన్న వాళ్లకు పంచు. అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది బాలయ్యా! టేక్ మై వర్డ్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నేను ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నాను. నా కొలీగ్ని లవ్ చేస్తున్నాను. ఆ విషయం ఆమెకి చెప్పలేదు. చెబితే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయమేసి చెప్పలేకపోతున్నాను. నేను లవ్ చేయడం మొదలుపెట్టి ఒన్ వీక్ అయింది. నేను గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నా. సార్..! నాదో స్మాల్ డౌట్.. ఇది లవ్వా? లేక అట్రాక్షనా? సలహా ఇవ్వండి ప్లీజ్. – సురేంద్ర ఒన్ వీక్ అంటే అట్రాక్షన్ అనే కన్ఫర్మ్ చేసుకో...!‘సార్.... ఎన్ని వీక్స్ అయితే లవ్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి సార్?’లవ్ అని కన్ఫర్మ్ అవడానికి ఒన్ సెకండ్ చాలు...!‘సార్ మళ్లీ... సమ్మర్ ఎఫెక్ట్‌తో ఆన్సర్లు తికమకగా చెబుతున్నారు’తిక లేదు... మక లేదు.. తలా లేదు.. తోకా లేదు..‘సార్ ఇంకా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు’ఏం లేదు నీలూ! ఇంకా లవ్ అని అనిపించలేదంటే అది లవ్ కాదు. ఒన్ వీక్ అయినా హండ్రెడ్ వీక్స్ అయినా అది అట్రాక్షన్ మాత్రమే. లవ్ అంటే ఇన్స్టెంట్ కాఫీ లాంటిది.‘ఫిల్టర్ కాఫీలాగా... లవ్ స్లోగా తయారై ఇంకా స్లోగా హార్ట్‌కి ఎక్కితే... రుచిగా ఉండదా సార్? ఇన్స్టెంట్ కాఫీలాగా లవ్ జివ్వుమనదా సార్?’ఫిల్టర్ కాఫీ లాంటి లవ్ కూడా జివ్వుమంటుంది నీలూ.. కానీ లవ్ ఇన్స్టెంట్గా జరిగిపోతుంది. దానికి వీకులు, మంతులు, ఇయర్లు అంటూ వెయిట్ చేస్తే ఎక్కేది కాదు అని చెబుతున్నా నీలూ..‘పొండి సార్ కొంతమందికి స్లో... స్లోగా లవ్ ఎక్కుతుంది కదా సార్?’ టైమ్ పట్టచ్చు కానీ ఎక్కినప్పుడు మాత్రం లవ్వు జివ్వుమనే ఎక్కుతుంది. సురేంద్రది లవ్ కాదు. కేస్ క్లోజ్డ్!్ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్..! నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వాళ్లది టూ సైడ్ లవ్. వాళ్లు రాంగ్ కాల్‌తో కలుసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోస్ షేర్ చేసుకున్నారు తప్ప ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే ఒకరోజు నా ఫ్రెండ్ చనిపోయాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్యతో మాట్లాడుతుండేది. తర్వాత కొన్నిరోజులకి ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు ఆ అమ్మాయి.. ఆ అబ్బాయిని లవ్ చెయ్యడం కరెక్టేనా చెప్పండి సార్? – మధు మధు నువ్వు మంచివాడివి.ఆ అమ్మాయిని తూలనాడక, చీప్‌గా చూడకుండా, లోకువ చెయ్యకుండా, తన మొదటి ప్రేమను హేళన చెయ్యకుండా.. తన కొత్త ప్రేమను ఛీ కొట్టకుండా...!!‘ఏంటి సార్..? మధు యాక్చువల్లీ... ఆ అమ్మాయి ప్రేమ కరెక్టా అని రాశాడు. కాబట్టి.. మధు ఆ అమ్మాయిని తూలనాడుతూ.. చీప్‌గా చూస్తూ.. లోకువ చేస్తూ.. మొదటి లవ్‌ను హేళన చూస్తూ.. సెకెండ్ లవ్‌ను ఛీ కొట్టినంత పని చేశాడేమోనని అనుమానిస్తున్నారా సార్? మధు అలాంటి వాడు కాదు సార్. ఆ అమ్మాయిని తూలనాడక.. చీప్‌గా చూడకుండా.. లోకువ చెయ్యకుండా.. తన మొదటి ప్రేమను హేళన చెయ్యకుండా.. తన కొత్త ప్రేమను ఛీ కొట్టకుండా ఏదో చిన్న డౌట్ క్లియర్ చేసుకోవడానికి రాశాడు సార్!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను టెన్త్ అయిపోయాక ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఇప్పుడు నా ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాను. కానీ తను నా లవ్‌ని ఇంకా యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇంకో విషయం ఏంటంటే తను నాకంటే వన్ ఇయర్ సీనియర్. లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి తనకు రెగ్యులర్‌గా మెసేజ్ చేస్తున్నాను. తను మాత్రం ఇంకా రిప్లై ఇవ్వడం లేదు. తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా. మీరు ఏదైనా çసజెషన్ ఇవ్వండి ప్లీజ్. – రోహిత్ ఏజ్ ఏదైతే ఏంటి?‘అలా ఎలా కుదురుద్ది సార్...?’లవ్వుకు ఏజ్ ఏంటి? గేజ్ ఉండాలి గానీ...‘అదేంటి సార్ అలా అనేశారు..? అల్మారాలు చేసే రేకులకు గేజ్ ఉంటుంది.. ఎంత ఎక్కువ గేజు ఉంటే అంత బలమైన అల్మారా తయారవుతుంది కదా సార్?’భలే కనిపెట్టావు నీలూ..!‘ఆ గేజుకి రోహిత్ లవ్ చేసే అమ్మాయి ఏజ్‌కి ఏంటి సార్ కనెక్షన్?’అమ్మాయి ఏజ్ కాదు ఆమె హృదయం చుట్టూ ఉన్న గేజు కూడా ఎక్కువే. తొందరగా మనోడి ప్రేమ ఆ బలమైన రేకును దాటి వెళ్లలేకపోయింది.‘అంటే అమ్మాయిది ఇనుము లాంటి హృదయమా సార్?’రోజులు బాగోలేవు.. మగాళ్లను నమ్మేటట్టు లేదు. అమ్మాయికి నమ్మకం కుదిరినప్పుడు...‘ఇనుములో హృదయం మొలిచెనే.. అని రోబో సినిమా పాట పాడుకోవచ్చు కదా సార్?’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలమై..యువకుడి బలవన్మరణం
శాంతినగర్ (అలంపూర్ ): ప్రేమించిన యువతి మో సం చేసిందని మనస్తా పానికి గురైన ఓ యువకు డు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మానవ పాడు మండలం జక్కిరెడ్డిపల్లిలో చోటుచేసు కుంది. ఎస్ఐ మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పరి మహేంద్ర(26) వారి కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు కుటుంబ సభ్యులు మరొకరితో వివాహం చేయడానికి పూనుకున్నారు. విషయం తెలుసుకున్న మహేంద్ర మనస్తాపానికి గురయ్యాడు. అమ్మాయి కుటుంబ సభ్యులే గాక తాను ప్రేమించిన యువతి మోసం చేసిందని ఆవేదనతో గురువారం సాయంత్రం పురుగు మందు తాగాడు. తన ఆవేదనను సెల్ఫోన్లో చిత్రీకరించి తెలిసిన వాళ్లకు పంపాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరు కుని అపస్మారక స్థితిలో ఉన్న మహేంద్రను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందు తూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. శుక్రవారం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మహేంద్ర పెదనాన్న బీసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేను లేకపోతే చచ్చిపోతా అంటాడు. బట్ నేను వేరే అబ్బాయిలతో మాట్లాడితే సహించలేడు. ఎవరితోనూ మాట్లాడొద్దు అంటాడు. బట్ నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా అన్నయ్యా. వాళ్లతో కూడా మాట్లాడకపోతే వాళ్లు ఫీల్ అవుతారు కదా. మాట్లాడితే ఇతను ఫీల్ అవుతున్నాడు. ఏం చెయ్యాలి అన్నయ్యా? ప్లీజ్ ఒక మంచి సలహా ఇవ్వండి. – రెహానా కొత్త ఫ్రెండ్స్ ఇంకొందరు దొరికితే చూడు బంగారం!‘చచ్చిపోతాడు సార్.. భరించలేక’మినిమం హండ్రెడ్ ఫ్రెండ్స్‌ని చూడు ఛాంపియన్...!‘సార్... కక్ష కట్టారా సార్ ఆ లవర్ మీద..?’హండ్రెడ్ డేస్ ఆ అబ్బాయికి కనబడేలా ఈ ఫ్రెండ్స్‌తో కుర్చో.‘సన్యాసం పుచ్చుకుంటాడు సార్!’ఒక్కో ఫ్రెండ్‌ను ఆ అబ్బాయికి ఇంట్రడ్యూస్ చెయ్యి.‘రోజుకు ఒకడినా సార్? అబ్బా ఎంత శాడిస్ట్ సార్ మీరు...’నీలాంబరి వాడేమైనా తక్కువ శాడిస్టా? నా బంగారం గౌరవంగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే వెర్రి వేషాలు వెయ్యట్లా?‘సార్ అది ప్రేమ సార్. లవర్ భరించలేడు సార్... తన గర్ల్‌ఫ్రెండ్ ఇంకో అబ్బాయితో మాట్లాడితే వాడి లైఫ్ చిరిగిన చాటే సార్. చింపిన విస్తరి సార్. పీలికల గుడ్డే సార్. పాపం ఆ బిడ్డ ప్రేమతో కుమిలిపోతుంటే మీరు, మీ సిస్టర్ కుళ్లబొడుస్తున్నారు కదా సార్! అనవసరంగా మీ చెల్లెళ్లకు ఇలాంటి టెక్నిక్‌లు నేర్పి అబ్బాయిల గుండెల్లోగునపాలు గుచ్చుతున్నారు సార్’ఆపు నీలాంబరీ ఆపు!! ‘ఏంటి సార్ ఆపేది? మీ సిస్టర్లైతే ఫ్రెండ్షిప్లు ఆపరుగానీ నేను ఆపాలా సార్?’పెళ్లికి ముందే ఇలా ఉన్నాడంటే.. రేపు పెళ్లయ్యాక.. ఆఫీసులో ఎవరితోనో మాట్లాడిందని, కాలనీలో ఎవరితోనో మాట్లాడిందని, టార్చర్ చేస్తూ ఉంటే బతికేదెలా? అందుకే వాడికి ట్రైనింగ్ అవసరం. అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ని ట్రెయిన్ చెయ్యకపోతే బ్యాడ్ హజ్బెండ్స్ అవుతారు నీలాంబరీ..!‘ఈ కుక్కలను ట్రెయిన్ చేసే బదులు ఇంకో సింపుల్ ట్రిక్ చెప్పండి సార్ ప్లీజ్!!’ లవర్స్ ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే ఉండాల్సింది ప్రేమ ఒక్కటే కాదు నీలూ.. నమ్మకం కూడా! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నాకు మీ సమాధానాలు బాగా నచ్చుతాయి. నిజానికి నాకే లవ్ ప్రాబ్లమ్ లేదు. కానీ నేను ఎవరితో మాట్లాడినా, కొన్నిరోజులకు వాళ్లు నాకు ప్రపోజ్ చేస్తున్నారు. నేను నో అని చెప్పేసరికి నా గురించి బ్యాడ్‌గా ప్రచారం చేస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. నాకు ఒక మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – గీతిక ఏం చేద్దాం బంగారం?‘సార్ సలహా అడిగితే ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అని రివర్స్‌లో మీరే అడిగితే...’నిజమే నీలూ.. ప్రశ్న నన్ను అడిగే బదులు తనను తానే ప్రశ్నించుకుంటే.. నేను చెప్పే సమాధానం కంటే మంచి సమాధానం తనకే తెలుస్తుందని నా నమ్మకం నీలూ!‘ఏడ్చినట్లుంది.. మీకు ఈ ఎండాకాలంలో బుర్ర బాగా వేడెక్కి పోతుందేమో సార్.. లవర్స్ అంతా మీకు రాయడం బదులు వాళ్లకు వాళ్లే ఉత్తరాలు రాసేసుకుని, వాళ్లకు వాళ్లే సమాధానాలు ఇచ్చేసుకుంటూ.. లవ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసుకుంటే... ఇక మనమెందుకు? మన క్లినిక్ ఎందుకు? పేపర్లో లవ్ డాక్టర్ కాలమ్ ఎందుకు? మీకు అరటి పండుఎందుకు???’అంత ఎమోషనల్‌గా అయిపోకు నీలూ!‘అరే! ఎమోషనల్ కాకపోతే ఎలా సార్.. వాళ్లకు వాళ్లే సమాధానాలు చెప్పేసుకుంటే వాట్ విల్ వి డూ సార్?’ఏదో... మన వ్యాపకానికో.. మన బతుకు తెరువు కోసమో కాకుండా గీతిక లాంటి మంచి బంగారం.. తన ఆలోచనను పెంచుకుని, ఎవరితో మాట్లాడాలో.. ఎవరితో జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకునే అవసరం ఉంది. నీలాంబరి, రామ్... జీవితంలో ప్రతి స్టెప్‌లోనూ తోడుగా ఉండలేరు కదా. అప్పుడు కూడా ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించే అవసరం ఉంటుంది కదా.. అందుకే...!‘ఓహో.. గీతిక స్ట్రాంగ్ కావాలంటే.. ఆలోచన స్ట్రాంగ్ చేసుకోవాలి కదా సార్!’శభాష్ నీలూ.. సూపర్ శభాష్ గీతిక! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను లవ్ చేసింది. మా మతాలు వేరు. టూ ఇయర్స్ పైనే ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరోజు నాతో మాట్లాడుతూ ఉండగా తన మమ్మీకి దొరికింది. ఆ తర్వాత ‘నన్ను మరిచిపో’ అని చెప్పింది. కొన్నిరోజులకి తనే కాల్ చేసి ‘నువ్వు లేకుండా నేను బతకలేను’ అని చెప్పింది. ఏం జరిగిందో ఏమో.. సడన్‌గా నా నంబర్ బ్లాక్ చేసింది. నేను తనకోసమే వెయిట్ చేస్తున్నా. న్యూ నంబర్‌తో చాట్ చేశాను. ‘నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో’ అంది. ఎందుకు అని అడిగితే.. ‘మా డాడ్ కోసం నేను.. నా లవ్‌ని బ్రేక్ చేసుకున్నా’ అంది. మీ వాళ్లని ఒప్పించే పెళ్లి చేసుకుందామని చెప్పాను. కానీ తను ఒప్పుకోవడంలేదు. నా మ్యాటర్లోనూ, మా ఫ్యామిలీ మ్యాటర్లోనూ ఎంటర్ అయితే బాగుండదని నా నంబర్స్ అన్నీ బ్లాక్ చేస్తోంది. కొత్త నంబర్స్‌తో ట్రై చేస్తూనే ఉన్నా. బట్ తను మాత్రం మారడంలేదు. తన కోసం ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశా అన్నయ్యా. తనని ఎలా మరిచిపోవాలో అర్థం కావడంలేదు. ప్లీజ్ నాకు మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – అశోక్ చెట్లు నాటాలి.‘సార్ అశోక్ చక్రవర్తి చెట్లు నాటినట్లు... మన అశోక్ కూడా చెట్లు నాటితే.. లవ్ సక్సెస్ అవుతుందా సార్?’చెట్లు నాటితే పండ్లు వస్తాయి.‘అంటే రిలేషన్షిప్ అనే మొక్క నాటితే... అది ఎదిగి లవ్ ఫ్రూట్ ఇస్తుందని కదా సార్ మీ అర్థం?’శభాష్ నీలూ... యు ఆర్ సూపర్ స్మార్ట్..!‘ఒక అమ్మాయితో కలిసి రిలేషన్షిప్ అనే మొక్క ఆల్రెడీ నాటాడు కదా సార్. దాంట్లో ఆకులు తప్ప పండ్లు రాలేదు. కాబట్టి, ఇంకో రిలేషన్‌షిప్‌తో కలసి ఇంకో మొక్క నాటమంటున్నారా సార్?’అట్లా కాదు నీలూ. మొక్క పెట్టిన రోజు నుంచి ఎవ్రీడే ‘పండూ..పండూ’ అని యావగా మొక్కను చూస్తే ఎలా..? ‘కొంచెం వెయిట్ చెయ్యి, వర్కౌట్ అవుతుంది’ అని చెబుతున్నా...!‘వర్కౌట్ కాకపోతే.. ఫైవ్ ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి కదా సార్?’అశోక్ నీకంటే చాలా స్మార్ట్ నీలూ.‘మొక్క చూసి పండు చెప్పగల సమర్ధుడు కదా సార్! ఆల్ ది బెస్ట్ అశోక్. హీ విల్ డిసైడ్ వెయిటింగ్ ఈజ్ బెటర్ ఆర్ నాట్! కదా సార్?’ ఎస్ నీలూ!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా..! నేను పదేళ్లుగా మా బావగారి తమ్ముడిని ప్రేమిస్తున్నా. అతనికి కూడా నేనంటే ఇష్టం. మా ఇంట్లో, వాళ్ల ఇంట్లో కూడా ఓకే. కానీ వాళ్ల పెద్దనాన్న కొడుక్కి నన్ను అడిగారు. అప్పుడు మా వాళ్లు కుదరదని చెప్పేశారు. అంతే! అప్పటి నుంచి మా బావగారి తమ్ముడు ‘నువ్వంటే ఇష్టమే కానీ, ఐదు లక్షల కట్నం కావాలి’ అంటున్నాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఇప్పుడు నేను.. ‘నన్ను ఇష్టపడే వాడిని చేసుకోవాలి? లేక నేను ఇష్టపడేవాడిని చేసుకోవాలా?’ దయచేసి చెప్పండి అన్నయ్యా. నీలాంబరి హెల్ప్ తీసుకుని ఓ మంచి సలహా ఇవ్వండి. – షమీమ్ ఇద్దరినీ చేసుకోకు...!‘ఎంత శాడిస్ట్ సార్ మీరు?’ఇష్టమని చెప్పి డబ్బు గుంజే వెధవని చేసుకోమంటావా నీలూ?‘ఇష్టపడే బావగారి తమ్ముడి వాళ్ల పెద్దమ్మ కొడుకుని చేసుకోవచ్చు కదా సార్?’ షమీమ్ నా చెల్లెలు, షీ ఈజ్ స్ట్రాంగ్. వీడు కాకపోతే వాడు.. వాడు కాకపోతే ఇంకొకడు.. అని ప్రపోజ్ చేసిన ప్రతివాణ్ని కన్సిడర్ చెయ్యడానికి షమీమ్ ఆర్డినరీ గర్ల్ కాదు. నా బంగారం. తన ప్రేమకు వర్త్ కాండిడేట్దొరికిన రోజు, తనని గౌరవించే లక్షణాలు ఉన్నవాడు అయినప్పుడు, లైఫ్ లాంగ్ లవ్ చేసే వాడైనప్పుడు.. పెళ్లికి ఓకే చెప్పాలి. అప్పటి దాకా......... ‘డోంట్ హర్రీ... డోంట్ వర్రీ... డోంట్ మ్యారీ... అంటారు షమీమ్ వాళ్ల అన్నయ్య’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com