
కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకుంటున్న యువతి
అనంతపురం సెంట్రల్: కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ఓ యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. అదే సమయంలో కలెక్టర్ వీరపాండియన్ రావడంతో బాధితురాలిని కార్యాలయంలోకి పిలిపించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... నగరంలో నవోదయకాలనీలో నివాసముంటున్న గాయత్రి అనే యువతి శింగనమల మండలం కొరివిపల్లికి చెందిన రాజు అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి సదరు యువకుడు నిరాకరిస్తూ వస్తుండటంతో మనస్తాపం చెందిన గాయత్రి బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. సమస్యను విన్న కలెక్టర్ యువతికి న్యాయం చేయాలని వన్‌టౌన్ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతి నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి మహిళా,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలలో నడుస్తున్న సర్వీసు హోంలో ఆమెకు ఆశ్రయం కల్పించారు. యువకున్ని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తామని వన్‌టౌన్ సీఐ విజయభాస్కర్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment