suicide attempt
-
నా జీవితాన్ని సర్వనాశనం చేసింది వాళ్లే
సాక్షి, భీమవరం/తణుకు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు, పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్లో ఆడియో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయం, తన భార్య, పిల్లలు ఏమైపోతారోనని ఆయన పడిన ఆవేదన అందరిని కలచివేస్తోంది. తణుకు రూరల్ ఎస్సైగా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణల్లో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశువును చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్సై మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది. పై అధికారులు తనను ఏ విధంగా బలిపశువును చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఆడియో సంభాషణల్లో కొంత భాగం..ఎస్సై: ఇంట్రెస్ట్ లేదురా.. ఫ్రెండ్: ఏంటి జాబా?ఎస్సై: లేదురా లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా. నన్ను మోసం చేసిన వాళ్లు హ్యాపీగా ఉన్నారు.ఎస్సై: ఆ కృష్ణకుమార్, ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఏదో అలా గెంటుతున్నాను. సరే వీఆర్ భీమవరం కదా చూద్దాం చూద్దాం అని.. చెప్పాను ఆ కృష్ణకుమార్‌కు నన్ను ఇబ్బంది పెట్టకండి సార్! అని. లేదు లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అదీ ఇదీ అని పెంట చేశాడు నా జీవితాన్ని. సీఐ నాగేశ్వరరావుకు చెప్తే ఇలా పెంట చేశాడు. ఇద్దరు కలిసి సర్వనాశనం చేశారు నా జీవితాన్ని.. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటూ ఫ్యామిలీతో ఉండొచ్చు కదా అనుకున్నాను.ఫ్రెండ్: పోన్లే ఇప్పటి దాకా ఉన్నావ్.. నాకు లూప్ కావాలి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిపోతానని అడుగు ఒకసారిఎస్సై: అంతా ఊహించిందే జరుగుతుంది.ఎస్సై: పిల్లలు, విజ్జిని చూస్తుంటే బాధేస్తుంది రా..ఫ్రెండ్: ఏం మాట్లాడుతున్నావ్ రా ఊరుకో..ఎస్సై: లేదురా పిల్లలు, విజ్జి గురించి ఆలోచిస్తుంటే చాలా చాలా బాధేస్తుంది రా.ఫ్రెండ్: అసలేమైనా బుర్రా ఉందా! నీకుఎస్సై: మనం చాలా హ్యాపీగా ఉంటామనకున్నాం.ఫ్రెండ్: రేయ్ ఏమైంది రా! ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని తెలుసుకోకుండా.. పాజిటివ్ నెగిటివో తెలుసుకోకుండా.ఎస్సై: అక్కడికి వెళ్తే కృష్ణా జిల్లా ఎలాట్మెంట్ అనేది తెలుసు నాకు. నేను అస్సలు ఉండలేను. ఒక్కరోజు కూడా నేను అక్కడ ఉండలేను. అక్కడ వాతావరణం అది నా వల్ల అయితే కాదు.ఫ్రెండ్: రేయ్ బాబు నువ్ కంగారు పడకు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు! -
పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: వివాహానికి ఆమోదం తెలపక పోవడాన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా భావించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తన కుమారుడితో పెళ్లికి నిరాకరించడం వల్లే అతడి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ మహిళపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. ఐపీసీలోని సెక్షన్–306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా భావించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. పిటిషనర్ కుమారుడు, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న విభేదాలే ఆధారంగానే ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు వంటి నమోదైన ఆధారాలు సరైనవే అని భావించినా, పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా పిటిషనర్ చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా, పిటిషనర్, కుటుంబంతో కలిసి తన కుమారుడితో బంధం తెంచుకోవాలని మృతురాలిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపలేకపోయారని ధర్మాసం తెలిపింది. ప్రియురాలితో తన కుమారుడి వివాహానికి పిటిషనర్ నిరాకరించినా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది. వాస్తవానికి మృతురాలి కుటుంబానికే ఈ పెళ్లి ఇష్టం లేదన్నది నిజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా?’అంటూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐపీసీలోని సెక్షన్ 306ను అనుసరించి తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయానికి కారణమని చెప్పలేమంది. -
విద్యార్థిని ఆత్మహత్య
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మంగళవారం ఉదయం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. పెద్దకోడూరుకు చెందిన భార్గవిగా గుర్తించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. -
ఏంటో నా జీవితం... పిచ్చిలేస్తోంది
శామీర్‌పేట్: ‘నాకు ఏమీ రావు.. ఏంటో నా జీవితం.. పిచ్చిలేస్తుంది.. అసలు లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా.. నాకు చనిపోవాలనిపిస్తుంది’ అంటూ స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగ వెంకటరమణ–లక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం తుర్కపల్లికి వలస వచ్చి ఉమాశంకర్ రైస్‌మిల్‌లో కారి్మకులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురు తేజస్విని సాయిదుర్గాలక్ష్మి (16) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 3న తలనొప్పిగా ఉందని తేజస్విని స్కూల్‌కు వెళ్లలేదు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తల్లి లక్ష్మి బాత్ రూంకు వెళ్లగా తేజస్విని బాత్రూంలో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ గుర్తించారు. కాగా తేజస్విని అతిగా నిద్రించేదని, తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. -
సిద్దిపేటలో విషాదం.. కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మృతిచెందగా.. భార్య, పిల్లలు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారందరికీ ముందు పురుగుల మందు ఇచ్చిన తర్వాత తాను ఉరివేసుకుని బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ క్రమంలో బాలకృష్ణ మృతిచెందాడు. పురుగుల మందు తాగిన ఆయన భార్య, పిల్లలను స్థానికులు గుర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
పండంటి కాపురంలో ఫోన్ పెట్టిన చిచ్చు
సాక్షి, చెన్నై : భర్తపై కోపంతో ఓ వివాహిత ఏడాదిన్నర వయస్సు కుమారుడి గొంతు కోసి హత్య చేసి, తర్వాత నాలుగేళ్ల కుమారుడి గొంతు కోసింది. చివరికి తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన చెన్నై పుల్లాపరంలో శనివారం కలకలం రేపింది. వివరాలు.. చెన్నై కీల్పాక్కం పుల్లాపురం 3వ వీధికి చెందిన దివ్య (32)కు ఆరేళ్ల క్రితం పెరుంగలత్తూర్కు చెందిన ప్రైవేటు కొరియర్ సంస్థ ఉద్యోగి రామ్‌కుమార్ (34)తో వివాహం జరిగింది. వీరికి లక్షణ్ కుమార్ (4), పునిత్ కుమార్ (ఒకటిన్నర సంవత్సరం) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పేదరికం కారణంగానూ, దివ్యా నిత్యం సెల్‌ఫోన్ సామాజిక మాధ్యమాలలో గడుపుతున్న కారణంగానూ భార్య భర్తల మధ్య అప్పుడప్పుడూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పుట్టింటికి వచ్చిన దివ్య.. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భర్తతో గొడవ పడిన దివ్య ఇద్దరు కుమారులతో పుల్లాపురంలో ఉన్న పుట్టింటికి వచ్చేసింది. ఈ స్థితిలో శనివారం ఇద్దరు పిల్లలతో దివ్య ఒంటరిగా ఇంటిలో ఉన్న సమయంలో ఫోన్ చేసిన రామ్‌కుమార్ కాపురానికి రావాల్సిందిగా కోరగా, అందుకు ఆమె నిరాకరించడంతో ఫోన్లో ఇద్దరికి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అసహనంతో.. దీంతో తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్న దివ్య పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. వెంటనే భర్త మీద కోపంతో దివ్య ఇంటిలో ఉన్న తన చిన్న కుమారుడు పునిత్ కుమార్‌ను బాత్రూమ్లోకి తీసుకు వెళ్లి కూరలు నరికే కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. తర్వాత తన పెద్ద కుమారుడు లక్షణ్‌ను కూడా బాత్రూమ్లోకి తీసుకు వెళ్లి గొంతు కోసింది. అప్పుడు అతని అరుపులు విన్న దివ్య అత్త పద్మావతి అడ్డుకోవడంతో తీవ్ర ఆక్రోశంతో ఉన్న దివ్య తన గొంతు కోసుకుని పడిపోయింది. తర్వాత తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన బంధువులు దివ్యను, పెద్ద కుమారుడు లక్షణ్‌ను చికిత్స నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిపై హత్య, హత్యాయత్నం కేసు కీల్పాక్కం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పునీత్ కుమార్ మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దివ్యపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దివ్య కోలుకున్న తర్వాత ఆమెను అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దివ్య గొంతు స్వరపెటిక తెగిపోవడంతో సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
మా చావులకు ఎవరూ కారణం కాదు..
ఉప్పల్: భార్యకు కేన్సర్ అని తేలడంతో భర్త తల్లడిల్లిపోయాడు. అనారోగ్యంతో భార్య రోజురోజుకూ కుంగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మానసిక వ్యధకు గురైన దంపతులు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్ డివిజన్ ధర్మపురి కాలనీకి చెందిన దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి (60), జగదీశ్వరి (56) భార్యాభర్తలు. సూర్యనారాయణ ఎన్టీపీసీలో జీఎంగా పని చేసి మూడేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరి కుమారుడు సుశాంత్ గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జగదీశ్వరి కేన్సర్ వ్యాధికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలో ఈ నెల 3న సూర్యనారాయణ శాస్త్రి తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఓ సెమినార్ కోసం బయటకు వెళ్తున్నానని, అమ్మను కూడా తీసుకెళ్తున్నాను.. నాలుగు రోజుల వరకు రాను అని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులుగా ఎలాంటి ఫోన్ రాకపోవడంతో బుధవారం కుమారుడు తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సెమినార్కూ వెళ్లలేదని తెలిసింది. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం ఉప్పల్‌లోని ఇంటికి వచ్చి చూడగా గేట్‌కు తాళం వేసి ఉంది. పని మనిషికి ఫోన్ చేసి పిలిపించి తాళం తీసి వెళ్లగా ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా దుర్వాసన రావడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల పక్కన, ఇంకా రెండు చోట్ల మూడు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ‘అనారోగ్య కారణాల చేత సూసైడ్ చేసుకుంటున్నాం. మా చావులకు ఎవరూ కారణం కాదు’ అంటూ రెండు లైన్లు తెలుగులో నోట్ రాసి ఉంది. దీంతో కుమారుడు సుశాంత్ ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాదీనం చేసుకున్నారు. సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వారం రోజుల క్రితమే సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి దంపతులు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి -
అండర్‌వేర్‌తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ.. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్‌వేర్‌తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కిమ్ యోంగ్ హైయున్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్‌కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.అండర్‌వేర్‌తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్‌కు నివేదించింది.South Korean ex-defense minister Kim Yong-hyun Wednesday attempted suicide at detention facility, Yonhap news agency reported, citing a correction official. #SouthKorea https://t.co/QbHxSw64PA https://t.co/3Mat8pNHh2— 贺亮 (@HeLiang74893) December 11, 2024సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్‌కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.దక్షిణ కొరియా డిసెంబర్ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హఠాత్తుగా టీవీ ఛానెల్స్ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్‌కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్‌పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి -
మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : మాజీ సైనికుడి కోటాలో మంజూరైన భూమిని సబ్ డివిజన్ చేయాలని కోరితే.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్యకు యత్నించాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరుగు తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమంలో రామచంద్ర బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడుఅధికారులు, పోలీసు లు వెంటనే అడ్డుకుని అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర మాట్లాడుతూ 2006లో తనతో పాటు మాజీ సైనికులైన మరో ఇద్దరికి వెంకప్పకోట పంచాయతీలో డీకేటీ పట్టాలు మంజూరు చేసినట్టు తెలిపారు. తమ స్థలానికి పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంతో దానికి రోడ్డు అవసరమై కింద ఉన్న ఇద్దరు సైనికుల భూములకు స్కెచ్‌లతో పాటు ఎన్ఓసీని రెవెన్యూ అధికారులు మంజూరుచేసినట్టు తెలిపారు.వారికి ఆనుకుని ఉ న్న తన భూమి సర్వే నంబర్‌ను రీ సర్వేలో భాగంగా తొలగించారని, దీనిపై ఐదేళ్లుగా కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తహ సీల్దార్ ఖాజాబీ మాట్లాడుతూ స్కెచ్‌ల ఆధారంగా రామచంద్రకు న్యాయం చేస్తామని తెలిపారు. -
అమ్మ.. మరో జన్మ ఉంటే నీ కడుపున పుడతా
నిర్మల్‌టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తనకన్నా జూనియర్లు రెగ్యలర్ అయ్యారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి వకులాభరణం భరత్ కుమార్ (37) ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భరత్ రాసిన ఓ సూసైడ్ లేక అందరినీ కంటతడి పెట్టిస్తోంది.‘మా అమ్మానాన్నల కడుపులో పుట్టడం నా అదృష్టం. ఎంతో పెద్ద ఉద్యోగం వస్తుందని కలలు కన్నాను. 2018 లో ఆరోగ్యశాఖలో ఆర్ఎన్టీసీపీ విభాగంలో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందాను. జీవితంలో స్థిరపడతానని ఆశించాను. కానీ నాకన్నా హోదా తక్కువ ఉన్నవారికి ఇదే శాఖలో జీతం ఎక్కువగా రావడం.. నా జీతం మాత్రం పెరగకుండా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను. నాతోపాటు నాలాంటి వాళ్లను రెగ్యులర్ చేసే విషయంలో జీవో 510 అన్యాయం చేసింది. అప్పటి ప్రభుత్వంలో వచ్చిన ఈ జీవో వల్ల నష్టపోయాం. ఇటీవల జీవో 16 కూడా అమలు చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మాకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశా. కానీ అది జరగక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యా. నా భార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా. మీ ఇద్దరినీ బాగా చూసుకుంటానని కలలు కన్నా. కానీ ఉద్యోగం రెగ్యులర్ కాకపోవడంతో మీకు చెప్పినట్లుగా ముందుకు వెళ్లలేకపోయా. ఇంతకాలం పనిచేసిన కాలంలో నాకు రావాల్సిన పీవోఎల్ బకాయిలు నా భార్యకు ఇవ్వండి. నా ఆత్మహత్యతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలి. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తెలిసేలా చూడండి. సహచర ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటా. అమ్మా నాన్న సారీ..’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. భరత్ మృతి ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని.. -
పోలీస్ స్టేషన్లోహోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఘట్కేసర్: ఓ హోంగార్డు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పరుశురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా , మక్త అనంతారం గ్రామానికి చెందిన మహ్మద్ ఘని హైమద్ చెర్లపల్లి పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 258, 268లో 30 గుంటల భూమి ఉంది. దాయాదులు అఫ్జల్, జబ్బార్ తన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకోకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. అయినా తనకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి లోనైన మహ్మద్ ఘని బుధవారం సాయత్రం బాటిల్లో డీజిల్ తీసుకుని స్టేషన్‌కు వచ్చాడు. నేరుగా ఇన్స్పెక్టర్ క్యాబిన్లోకి వెళ్లిన అతను ఆయన ఎదుటే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తక్షణమే స్పందించిన ఇన్స్పెక్టర్, ఇతర పోలీసులు అతడి నుంచి డీజిల్ బాటిల్‌ను లాక్కున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించిన ఉ.కొరియా
సియోల్: లక్ష్యాలపైకి దూసుకెళ్లి పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. వీటి దాడులను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టిన తరుణంలో ఉత్తరకొరియా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించడం గమనార్హం. ఈ మానవరహిత ఏరియల్ వెహికిల్స్‌కు ‘ఎక్స్’ ఆకృతిలో రెక్కలు, తోక భాగం ఉన్నాయి. ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లను పోలి ఉన్నాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అధ్యక్షుడు కిమ్ సైనిక అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. ఈ డ్రోన్లు ఒక బీఎండబ్ల్యూ కారును, పాత యుద్ధ ట్యాంకులను ఢీకొని పేలి్చవేసిన దృశ్యాలను ప్రసారం చేసింది. వివిధ దిశల్లో ఈ డ్రోన్లు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించాయి. వీటి పనితీరు పట్ట కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ల తయారీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు. సైనిక అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున తయారు చేయాలని, చవకైన ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. -
ఎస్సైకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
రామడుగు: తన తల్లికి స్థలాన్ని అమ్మిన మహిళ, అదే స్థలాన్ని మరొకరికి విక్రయించడంతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపులకు పాల్పడడంతో మండలంలోని వెలిచాల గ్రామానికి చెందిన దైవాల రమేశ్(35) ఎస్సైకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మహిళ 2004లో మృతుడి తల్లి వరమ్మకు 35 గుంటల స్థలాన్ని విక్రయించగా రమేశ్ పంటలు సాగు చేసుకుంటున్నాడు. ఇదే స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించింది. ఇదేంటని ప్రశ్నించగా కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించడంతో మనోవేధనకు గురైన రమేశ్ బుధవారం గ్రామ పరిధిలోని అయ్యవారి కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, రమేశ్‌కు ముగ్గురు పిల్లలని ఎస్సై వి.శేఖర్ వివరించారు. -
క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించలేకనే...
దుగ్గొండి: క్రెడిట్ కార్డులపై తీసుకు న్న రుణం చెల్లించాలని బ్యాంకర్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగ ల్ జిల్లా నాచినపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నాచినపల్లికి చెందిన దార ప్రసాద్ (35) కాకతీయ వర్సిటీలో డిగ్రీ పూ ర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేశాడు. ఈ క్రమంలోనే వివిధ బ్యాంకులకు చెందిన 10 క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి ద్వారా రుణం తీసుకొని హైదరాబాద్‌లోనే చిట్టీ వేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ దివాలా తీయడంతో ఆ డబ్బులు రాలేదు. దీంతో క్రెడిట్ కార్డుల కిస్తీ లు చెల్లించలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయా బ్యాంకుల రికవరీ బృందా లు నాచినపల్లికి వచ్చి ప్రసాద్‌ను నిలదీయగా, ఈ నెల 19న చెల్లిస్తానని చెప్పాడు. వాయిదా సమయం రావడం.. డబ్బు చేతిలో లేక భయపడి ఇంట్లో ఉరివేసుకున్నాడు. ప్రసాద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గన్‌తో కాల్చేస్తా.. నా కొడకా!
సాక్షి, టాస్‌్కఫోర్స్: పట్టా భూమి విషయంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన చంద్రగిరి సీఐ జనసేన నేతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా ‘నా కొడకా.. గన్‌తో కాల్చేస్తా..’ అంటూ బూతులు లంకించుకున్నారు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని జనసేన నేత పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లికి చెందిన పాశం గురుమూర్తి జనసేన నేత. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని విజయానికి తీవ్రంగా కృషి చేశాడు. కాగా.. గురుమూర్తి తండ్రి గురవయ్యకు అదే మండలం పనపాకంలో సర్వే నంబర్ 395/2డిలో రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. తండ్రి చనిపోవడంతో భూమిని తనపేరిట మార్చాలని గురుమూర్తి రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చాడు. ఆ భూమిని కాజేసేందుకు టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఆ భూమి ఆన్లైన్ కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత సుబ్రహ్యణ్యంనాయుడు గురుమూర్తిపై చంద్రగిరి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించడంతో పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆత్మహత్యకు ప్రయత్నం గౌరవంగా బతుకుతున్న తనను సీఐ అసభ్యంగా దూషించడమే కాకుండా చంపుతామని బెదిరించడాన్ని గురుమూర్తి తట్టుకోలేకపోయాడు. ఇంటికెళ్లిన గురుమూర్తి మనస్తాపంతో అదే రోజు రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని, సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. ‘కాల్చి పారేస్తే అడిగే దిక్కుండదు’ పట్టా భూమి వ్యవహారంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన సీఐ సుబ్బరామిరెడ్డి ఆదివారం నాడు గురుమూర్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి బెదిరించారు. ‘నా కొ..ను.. పగలకొట్టి లోపలేయండి. నీయమ్మా లం.. కొడకా. ఏమనుకుంటున్నావురా. దొంగ నా కొ.. బూటు కాలితో తంతా నా కొ.. మళ్లీ మాట్లాడితే గన్‌తో కాల్చిపారేస్తా’ అంటూ సీఐ సుబ్బరామిరెడ్డి తనను దూషించి కొట్టినట్టు బాధితుడు గురుమూర్తి వాపోయాడు. కాల్చేస్తా.. అంటూ టేబుల్‌పై తుపాకీ పెట్టి బెదిరించినట్టు కన్నీరుమున్నీరయ్యాడు. ‘నా మాట కూడా వినండి సార్. నేనూ చదువుకున్న వాడినే. అలా తిట్టకండి సార్’ అని వేడుకున్నా కనికరించలేదని గురుమూర్తి వాపోయాడు. కాగా.. సీఐ సుబ్బరామిరెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గ్రావెల్, ఇసుక దందాలకు సీఐ వత్తాసు పలుకుతున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతూ అనేక ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. -
కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బియ్యం వ్యాపారి ఆత్మహత్యాయత్నం
ఏలూరు టౌన్: అధికారుల వేధింపులు తాళలేక ఏలూరులో ఒక బియ్యం వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. తాను బియ్యం వ్యాపారం చేస్తున్నానని, అక్రమాలేవీ లేకపోయినా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వలేనని చెప్పడంతో అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితుడు చెప్పాడు.బాధితుడు, అతని కుమారుడి కథనం మేరకు వివరాలు.. జంధ్యావుల సుధాకర్ అలియాస్ నాని గత కొంతకాలంగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇళ్ల వద్దకు వెళ్లి ఎవరైనా బియ్యం విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి రెండు, మూడు రూపాయలు ఎక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్ముతూ ఉంటాడు. ఈ నెల 11న సుధాకర్ పెదవేగి మండలం పినకడిమిలో బియ్యం కొనుగోలుకు వెళ్లాడు. అదే సమయంలో పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్ అక్కడికి వెళ్లారు. వేరే బియ్యం బస్తాలను సుధాకర్‌కు చెందిన వ్యాన్‌లో వేయించి, బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడంటూ కేసు నమోదు చేస్తానని బెదిరించారు.రూ.50 వేలు ఇస్తేనే కేసు లేకుండా చేస్తానని, లేకుంటే కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. తాను అంత సొమ్ము ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. ‘నాకు డబ్బులు ఇవ్వాల్సిందే.. లేదంటే నీ చావు నువ్వు చావు.. నాకు సంబంధం లేదు..’ అంటూ తేల్చి చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవటంతో డీటీ ప్రమోద్ కేసు నమోదు చేసి, పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుధాకర్ ఈ నెల 12న పురుగుల మందు తాగి పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.పోలీసులు స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పడంతో తన కుమారుడు పృథ్వీని స్టేషన్ వద్దకు రమ్మని చెప్పాడు. అనంతరం తాను విషం తాగిన విషయాన్ని కుమారుడికి చెప్పడంతో వెంటనే ఏలూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. పెదవేగి మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రమోద్ను దీనిపై వివరణ కోరగా.. సుధాకర్ నుంచి తాము డబ్బులు డిమాండ్ లేదని చెప్పారు. 650 కిలోల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. -
కోడలు వరకట్నం కేసు పెట్టిందని...
రాంగోపాల్‌పేట్: భర్తతో పాటు అత్తా, మామలపైన కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించడంతో మనస్థాపం చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నాగోల్‌కు చెందిన తోట భావనారాయణ (52), పద్మావతి (47) భార్యాభర్తలు, వీరి కుమారుడు సుజన్ (23). భావనారాయణ, సుజన్లు ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా పద్మావతి గృహిణి. సుజన్(23)కు కొత్తగూడెం చుంచుపల్లి ప్రాంతానికి చెందిన కావ్యశ్రీతో ఇదే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కావ్యశ్రీ ఇటీవల చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. చుంచుపల్లి పోలీసులు సుజన్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ కోసం రావాలని ఇటీవల కోరగా రెండు మూడు రోజులు టైం అడిగారు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు రావాలని మరో మారు పోలీసులు సూచించారు. దీంతో ఈ నెల 5వ తేదీ ఉదయం ఆన్లైన్ ద్వారా సికింద్రాబాద్ ప్రాంతంలోని తాజ్ ట్రైస్టార్ హోటల్ మూడవ అంతస్తులోని 308 గదిని బుక్ చేసుకుని ముగ్గురు అక్కడ దిగారు. సోమవారం రాత్రి కోడలు కావ్యశ్రీకి ఫోన్ చేసి కేసు విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసికుంటామని చెప్పారు.ఆ తర్వాత వారి మధ్య సంభాషణ ఏమి జరిగిందో తెలియదు కానీ..మంగళవారం ముగ్గురు డైజోఫాం ట్యాబ్లెట్లు, షుగర్‌కు వాడే ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు వీరి గది తలుపులు తెరవకపోవడంతో పాటు హోటల్ సిబ్బంది తలుపు కొట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరో తాళం చెవితో తాళం తెరిచి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించి వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పద్మావతి సోదరి అక్కడికి చేరుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేదని గాం«దీకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని వెల్లడించారు. మహంకాళి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేత కుట్ర... దివ్యాంగుని పింఛను కోత
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛను లబి్ధదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగుడి పింఛన్‌ను టీడీపీ నాయకుడు రద్దు చేయించారు. దీంతో బాధితుడు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీరంగరాజపురం మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు హేమాద్రి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాధవనాయుడి ఇంటి వద్ద కూలి పనులు చేయడానికి నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న మాధవనాయుడు అధికారులపై ఒత్తిడి పెంచి హేమాద్రికి వస్తున్న వికలాంగ పింఛను తొలగించడమే కాకుండా దుర్భాషలాడి కుటుంబం అంతు చూస్తానని బెదిరించాడు. హేమాద్రికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ మొత్తం హేమాద్రికి వచ్చే పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో బాధితుడు హేమాద్రి గురువారం శ్రీ రంగరాజపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యతి్నస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అలాగే, మండలంలోని జీఎంఆర్ పురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఢిల్లీకి వస్తున్న వికలాంగ పింఛన్ కూడా తొలగించారని, తనకు కూడా పింఛన్‌ను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు. -
ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై దాడి చేయడంతోనే తన అన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బొల్లారపు శివప్రసాద్ సోదరి ప్రశాంతి బుధవారం వీడియో విడుదల చేశారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన శివప్రసాద్ ఈనెల 23న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. ఆయన భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈనెల 22న కోరుట్ల ఎస్సై శివప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వకుండా చేయిచేసుకున్నారని, తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తన అన్నపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు..సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే అతనిని బహిరంగంగా దూషించడమే కాక బుధవారం చిట్టేల వెళ్లి దాడికి యత్నించడంతో ఆమె కలతచెంది నిద్రమాత్రలు మింగారు. ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హుటాహుటిన విజయవాడ తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్నారు.ఎమ్మెల్యే వేధింపులతోనే ఆత్మహత్యాయత్నంఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి యత్నిస్తుండడంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరువూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించడమేకాక చిట్టేల వాగు నుంచి ఇసుక తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరోపిస్తూ అంతమొందిస్తానని బెదిరించారని చెప్పారు. తిరువూరు మెయిన్‌రోడ్డులో బహిరంగంగా తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపైకి ఉసిగొల్పుతున్నాడని సర్పంచ్ వివరించారు. చిట్టేలలో బుధవారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దురుసు ప్రవర్తన, దౌర్జన్యంతో ఆందోళనకు గురైన తన భార్య కవిత నిద్రమాత్రలు మింగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తుల ఆందోళన..ఈ ఘటన నేపథ్యంలో చిట్టేల గ్రామస్తులు బుధవారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి çకూడా పరామర్శించిఅండగా ఉంటామని చెప్పారు. -
జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను కోర్టులో జడ్జి వేధించాడని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి చనిపోయేందుకు ప్రయత్నించాడు. అదృష్టం బాగుండి అధికారులు కాపాడటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన అలీఘర్‌లో వెలుగుచూసింది.బన్నాదేవి పోలీస్ స్టేసన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సచిన్ కుమార్ ఇటీవల బైక్ చోరికి పాల్పడిన అయిదుగురు నిందితులను పట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా వారిని కోర్టులో హాజరుపరిచారు.అయితే నిందితులను కాకుండా తప్పుడు వ్యక్తులను పట్టుకున్నారని స్థానిక న్యాయమూర్తి త్రిపాఠి.. ఎస్సై సచిన్‌ను మందలించారు. కోర్టు విచారణ సమయంలో మేజిస్ట్రేట్ తన పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించారని.. కోరిన రిమాండ్‌ను మంజూరు చేయకుండా సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి ఉండేలా చేశారని కుమార్ ఆరోపించారు.Sub Inspector Sachin Kumar sitting on the railway track to commit su!cide, over He said that "The police had caught 5 bike thieves. I presented them in the court. The judge said that you have caught wrong people. The judge misbehaved with me" pic.twitter.com/WWck5gBpnU— Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2024దీంతో మనస్తాపం చెందిన సచిన్ కుమార్ రైల్వే ట్రక్‌పై కూర్చొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన స్టేషన్ ఇంచార్జ్ పంకజ్ కుమార్ మిత్రా, ఇతర పోలీసులు వెంటనే స్పందిచి కుమార్‌ను రక్షించారు. అయితే ఈ ఆరోపణలపై న్యాయమూర్తి త్రిపాఠి ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు. -
పరువు పోతుందని...
జీడిమెట్ల: దొంగతనంలో కీలక పాత్ర పోషించాడు.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.. ఇంటి యజమానితో మంచిగా ఉంటూనే దొంగతనం చేసిన వ్యక్తికి పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాడు. తీరా పోలీసులకు అసలు విషయం తెలిసిపోవడంతో పరువు పోయిందని ఓ వైపు, డబ్బులు కట్టాలంటూ యజమాని ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు ఉరి వేసుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళితే రాజస్ధాన్‌కు చెందిన హనుమాన్రాం కుత్బుల్లాపూర్ విలేజ్‌లో స్టీల్ సామాన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈనెల 3న అతడి ఇంట్లో రూ.14లక్షలు చోరీకి గురయ్యాయి. డూప్లికేట్ కీతో బీరువా తెరిచి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. దీంతో అతను తన దుకాణంలో పనిచేసే కిషన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కిషన్, రాంలాల్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గుర్తించారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బాధితుడు హనుమాన్రాంతో పాటు అతడిని పనికి కుదిర్చిన అశోక్‌తో సహా రాజస్థాన్ బయలుదేరారు. ఈ క్రమంలో అశోక్ పోలీసుల కదలికలపై కిషన్, రాంలాల్లకు ఎప్పటికప్పుడు వాట్సప్ కాల్స్, మేసేజ్‌ల ద్వారా సమాచారాన్ని అందించాడు. దీంతో అప్రమత్తమైన వారు అక్కడి నుంచి పరారయ్యారు. కిషన్ తల్లిదండ్రుల ద్వారా కిషన్‌ను ఇంటికి రప్పించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు కాగా రాంలాల్ పరారీలో ఉన్నాడు. కిష నుంచి రూ.2.70లక్షలు స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. విషమంగా అశోక్ ఆరోగ్యం... అశోక్‌కు తెలిసే ఈ చోరీ జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో బాధితుడు హనుమాన్రాం కిషన్‌ను పనిలో కుదిర్చినందుకు చోరీకి గురైన సొమ్ము కట్టాలంటూ అశోక్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన అశోక్ ఆదివారం ఉదయం జేకేనగర్లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు.దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని అజూదా అస్పత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా అశోక్ కుటుంబ సభ్యులు అత్మహత్యాయత్నానికి కారణం హనుమాన్రాం అని పేర్కొంటూ పేట్‌బïÙరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడమేగా గాక తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు.అశోక్‌ను ఇంటరాగేట్ చేయలేదుఈ విషయమై ఇన్స్పెక్టర్ మల్లేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా అశోక్‌ను పోలీసులు కొట్టినందునే అతను అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వచి్చన కథనాలు పచ్చి అబద్ధమన్నారు. అనుమానం ఉంటే పోలీస్‌స్టేషన్‌లోని సీసీ పుటేజీలు పరిశీలించుకోవచ్చునని తెలిపారు. -
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్‌కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుమల: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక యువకుడితో ప్రేమలో పడిన వివాహిత మహిళ.. ముగ్గురు పిల్లలు, భర్తను వదిలి ప్రియుడు సతీష్‌తో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది.తిరుమలకు వెళ్ళే శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గర వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. చివరి నిమిషంలో రాధిక.. భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె భర్త శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి పురుగుల మందు తాగిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు సతీష్ కోలుకుంటున్నాడు వీరిది చిత్తూరులోని బంగారురెడ్డిపల్లెకు చెందిన సతీష్, రాధికగా గుర్తించారు. -
ఏం కష్టం వచ్చిందో.. డ్రైవర్, పోలీసులు లేకుంటే ఆమె పరిస్థితి ఏంటో!
మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ సేతు బ్రిడ్జి (ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్) గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వారికి ఈ బ్రిడ్జి ఒక స్పాట్‌గా మారింది. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.. తాజాగా మరో మహిళ బలవన్మరనానికి యత్నించింది.అయితే వెంటనే స్పందించిన కారు డ్రైవర్, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఆమెను కాపాడటంతో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్ ముంబైలోని ములుండ్‌లో నివసిస్తున్నారు.ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ క్యాబ్‌లో అటల్ సేతు బ్రిడ్జి వద్దకు వచ్చింది. కారు దిగి సముద్రంలోకి ఏదో విసిరినట్లు చేసి వెంటనే నీళ్లలోకి దూకేందుకు యత్నించింది. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఆమె సముద్రంలోకి పడిపోకుండా జుట్టు పట్టుకొని ఆపాడు. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం కూడా అక్కడికి రావడంతో.. ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా స్పందించి ఆమెను రెస్క్యూ చేశారు. దీంతో మహిళ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. మహిళను డ్రైవర్, పోలీసులు జాగ్రత్తగా పైకి లాగుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను ముంబై పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు.‘అటల్ సేతు బ్రిడ్జి రైలింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను గమనించిన డ్యూటీ అధికారులు, లలిత్ షిర్సత్, కిరణ్ మహత్రే, యశ్ సోనావానే, మయూర్ పాటిల్ వెంటనే స్పందించి కాపాడారు’ అని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు.అదే విధంగా జీవితం ఎంతో విలువైనది అని, దానిని గౌరవించాలని తెలిపారు. ఎలాంటి కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఒక్క క్షణం మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. -
ముమ్మా..నిన్ను మిస్సవుతున్నా..
సుభాష్‌నగర్: ‘‘ముమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీవు లేకుండా అసలు అయితలే..నేను నీ దగ్గరకే వచ్చేస్తున్నా.. మన మధ్య మనస్పర్థలు సృష్టించారు., నేను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుంది.. అరేయ్ రాజురెడ్డి అన్నింటికీ నీవే కారణం, ఇద్దరం పెళ్లి చేసుకునేందుకు వెళ్లాం. తేజు లేనిదే నేను లేను.. నాది వన్ సైడ్ లవ్ కాదు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ముమ్మా నీ దగ్గరికే వస్తున్నా శ్రీ.. అక్క నీవే మమ్మీని చూసుకో’’.. అంటూ.. ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9న దోమడుగుకు చెందిన తేజస్వి అనే యువతి ఇంటి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తేజస్వి ఆత్మహత్యకు శ్రీహరి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికిలోనైన శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీహరి సోమవారం రాత్రి ఆస్పత్రి నుండి తప్పించుకున్నాడు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.బుధవారం బహదూర్‌పల్లిలోని సాయినా సొసైటీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని శ్రీహరిగా గుర్తించారు. ఘటనా స్థలంలో శ్రీహరి రాసిన సుసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నారు. అందులో తాను, తేజస్వీ ప్రేమించుకున్నామని, బీజేపీ నాయకుడు రాజురెడ్డి, తేజస్వీ తండ్రి, సోదరుడు తమను విడదీసేందుకు యతి్నంచారని పేర్కొన్నాడు. తేజస్వీ లేనిదే తాను లేనని, తాను కూడా ఆమె దగ్గరకే వెళ్తున్నానని, తమ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అందులో పేర్కొన్నాడు. పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సోషల్ మీడియాలో వేధింపులు.. తేజస్వినీ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక, విద్యార్ధిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్వినీ బీఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలో ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేక తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.ఈ క్రమంలో.. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆసుపత్రికి చేరుకునేలోపే తేజస్వినీ మృతి చెందింది. అయితే, తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేజస్వినీ పేరెంట్స్ చెప్పారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చమూక.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సత్యసాయి: నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఆవేదన, బాధను సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో మరో దారుణం జరిగింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో సుగుణమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా, చిలమత్తూరులో వికలాంగుడు నాగరాజు వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా అకారణంగా నాగరాజును విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో తనను ఎందుకు తొలగించారని నాగరాజు, అతడి భార్య సుగుణమ్మ ప్రశ్నించగా టీడీపీ నేతలు వేధింపులకు గురిచేశారు.దీంతో, సుగుణమ్మ మనాస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సందర్భంగా టీడీపీ నేతల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నెయిల్ పాలిష్ తాగి ఆమె ఆత్మహత్యయత్నం చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
నందిగాం: స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న లిమ్మక అక్షిత (16) మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపాల్ దమయంతి, నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం పారాపురం సమీపంలోని మహసింగి గ్రామానికి చెందిన లిమ్మక గిరి, శ్రావణిలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అక్షిత జూలై 24న జరిగి న రెండో విడత కౌన్సిలింగ్లో నందిగాం బాలికల గురుకులంలో ఇంటర్మీడియెట్‌లో చేరింది. 26వ తేదీన హోమ్ సిక్ అంటూ ఇంటికి వెళ్లి మరలా 29న గురుకులానికి వచ్చింది. యథావిధిగా తరగతులకు హాజరైంది. మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు స్టడీ అవర్‌లో చదివి అందరితో పాటు నిద్రపోయింది. బుధవారం వేకువజామున సెక్యూరిటీ గార్డులు వచ్చి విద్యార్థులను నిద్రలేపుతుండగా 6వ తరగతికి చెందిన వనగాల్ల పల్లవి టాయ్‌లెట్‌కు వెళ్లగా పక్కనే ఉన్న కిటికీకి అక్షిత వేలాడుతూ కనిపించింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో వారు ప్రిన్సిపాల్‌కు సమాచారమిచ్చారు. పక్కనే క్వార్టర్స్‌లో ఉన్న ప్రిన్సిపాల్ వచ్చి చూసి విషయా న్ని ఉన్నతాధికారులకు, నందిగాం ఎస్సైకు, తహసీల్దారు, విద్యార్థిని తల్లికి తెలియజేశారు. నందిగాం ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.న్యాయం చేయాలి..అనంతరం గురుకులానికి చేరుకున్న విద్యార్థిని తల్లి దండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాము వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచకుండా ఆస్పత్రికి తరలించడంపై అభ్యంతం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్, ఎస్సైలను నిలదీశారు. అక్షిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని తల్లి శ్రావణి, మేనమామ బాడ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. అనంతరం దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి అక్కురాడ లోకనాధం, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగాన తిరుపతిరావు, కులనిర్మూలన పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకరరావు, స్థానిక నాయకులు జడ్యాడ జయరాంలు మాట్లాడుతూ బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థినులు అధైర్యపడవద్దుశ్రీకాకుళం పాతబస్టాండ్: నందిగాంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వైనంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు అధైర్య పడవద్దని, సమస్యలు ఉంటే హెచ్ఎంకు తెలియజేయాలన్నారు. కాగా, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి మనోధైర్యం కల్పించారు.శ్రీకాకుళం అర్బన్: విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంపై జిల్లా అధికారులు, గురుకులం జిల్లా కో–ఆర్డినేటర్లు పూర్తి నివేదిక అందించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. -
భార్య మృతదేహాన్ని ఛీ కొట్టిన ఐఏఎస్ ఆఫీసర్!
ఆయనో ఐఏఎస్ అధికారి. తన కళ్లెదుటే భార్య విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆయన ఏమాత్రం కనికరం చూపించలేదు. ఆమె మృతదేహాన్ని సైతం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ అధికారి నిరాకరించారు. ఛీ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే..గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీలో కమిషన్‌లో పని చేసే ఉన్నతాధికారి రంజిత్ కుమార్(తమిళనాడు). ఆయన భార్య సూర్య జై. తొమ్మిది నెలల నుంచి ఆమె కనిపించకుండా పోయారు. అయితే భార్య మిస్సింగ్‌పై ఆయన పోలీసులను ఆశ్రయించలేదు. పైగా విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. తాజాగా.. ఆమె ఓ కిడ్నాప్ కేసులో నిందితురాలు అని తేలింది. ఇంకో భారమైన విషయం ఏంటంటే.. ఓ గ్యాంగ్‌స్టర్ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయారని తేలింది.మహారాజ హైకోర్టు అనే గ్యాంగ్‌స్టర్‌తో రిలేషన్షిప్లో ఉన్న సూర్య జై.. తొమ్మిది నెలల కిందట ఓరోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అయితే ఈ నెల 11వ తేదీన తమిళనాడు మధురై పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో సూర్య జైని నిందితురాలిగా చేర్చారు. మహారాజ, అతని అనుచరుడు సెంథిల్ కుమార్‌తో కలిసి మధురైకి చెందిన ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేసిందామె. పోలీసులు ఆ కుర్రాడిని రక్షించినా.. నిందితులు మాత్రం తప్పించుకున్నారు.పరారీలో ఉన్న సూర్య జై సడన్‌గా గత శనివారం గాంధీనగర్‌లోని రంజిత్ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. తన తప్పు తెలుసుకున్నానని, విడాకులు వద్దంటూ, తనను రక్షించమని, కలిసి జీవిద్దామని భర్తను బతిమాలుకుంది. అయితే తన పరువు పోయిందంటూ ఆమె దూషిస్తూ.. ఇంట్లోకి అనుమతించలేదాయన. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అక్కడే విషం తాగి కుప్పకూలింది.స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆదివారం ఆమె కన్నుమూసింది. విషయం తెలిసిన ఆయన ఆస్పత్రికి వెళ్లారే తప్ప.. భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. పని మనుషులతో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి వెళ్లిపోయారట. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె రాసిన సూసైడ్ లెటర్ సారాంశాన్ని వివరించేందుకు మాత్రం నిరాకరించారు.సీఎంకు సూర్య లేఖ!అయితే మధురై బాలుడి కిడ్నాప్ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె రాసిన లేఖ సోమవారం మధురై పోలీసులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. అందులో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన మదురైలో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆ బాలుడి తల్లి మైథిలీ రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో మదురై పోలీసులు రంగంలోకి దిగారు. తిరునల్వేలికి చెందిన మహారాజ్‌తో పాటు మరికొందరి ద్వారా ఈ కిడ్నాప్‌ను గుజరాత్లో ఉన్న ఐఏఎస్ అధికారి రంజిత్ సతీమణి సూర్య ప్రమేయం కిడ్నాప్‌లో ఉన్నట్టుగా బాలుడి తల్లి ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన మదురై పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐఏఎస్ అధికారి సతీమని సూర్య, ఆ బాలుడి తల్లి మైథిలీ మధ్య నగదు లావాదేవీల వివాదం ఉన్నట్లుగా వారు వాగ్మూలం ఇచ్చినట్టు వెలుగు చూసింది. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, మైథిలీ రాజలక్ష్మి ఆరోపణల కారణంగా తన భర్తకు తీవ్ర తలవంపులు వచ్చినట్టు, ఈ వ్యవహారంలో సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ ఆమె రాసిన లేఖ సోమవారం మదురై పోలీసులకు చేరడం చర్చకు దారి తీసింది. -
ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం
-
మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీ నేతల దౌర్జన్యం
వజ్రకరూరు: అధికారం అండగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంతా తాము చెప్పినట్టే జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నేతలు దౌర్జ్యనం చేశారు. దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని బోయ సుంకమ్మ నిర్వహిస్తున్నారు. ఆమెకు సహాయకురాళ్లుగా ఆమె కుమార్తెలు రాధ, లక్ష్మి ఉన్నారు. ఇన్నేళ్లలో వారిపై చిన్న ఫిర్యాదు కూడా అందలేదు. కానీ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఏజెన్సీ కోసం బోయ సుంకమ్మను బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కూడా తమ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అందువల్ల స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ అధికారికంగా తనకు ఎవరూ ఏజెన్సీ నిర్వహించవద్దని చెప్పకపోవడంతో బోయ సుంకమ్మ ఎప్పటిలాగే చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతోంది. ఈ క్రమంలో గురువారం పాఠశాల వద్దకు వెళ్లిన కొందరు టీడీపీ నాయకులు సుంకమ్మపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. చెబితే వినవా... ‘ఒక్కసారి చెబితే నువ్వు వినవా.. ఏజెన్సీ నుంచి తప్పుకోకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించారు. దీంతో సుంకమ్మ అది చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు వంట గదిలోని సామగ్రి, కూరగాయలు తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. అడ్డుకోబోయిన సుంకమ్మ కూతురు రాధ, మనుమడు దొరబాబు, మనుమరాలిని పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన సుంకమ్మ వంటగదిలోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను 108లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఎస్ఐ నరేష్ ఆస్పత్రికి వెళ్లి సుంకమ్మ నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే మండల విద్యాధికారి తిమ్మప్ప కూడా ఆమెను పరామర్శించి వివరాలు సేకరించారు. కాగా అదే పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ మహేశ్వరిని కూడా టీడీపీ నేతలు బెదిరించారు. ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు స్వీపర్ మాముడూరు మహేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం వదిలేస్తే తన కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కుటుంబ కలహాలతో.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన షేక్ ఫిర్దోజ్(27), కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఫిర్దాజ్కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. షేక్ ఫిర్దోజ్ కథలాపూర్‌లోని అత్తగారింట్లో ఉంటూ బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.15 రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో అతను రాయికల్ వెళ్లిపోయాడు. భార్యను కూడా రావాలని కోరగా.. ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఫిర్దాజ్ ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇరుకుటుంబాల మధ్య వివాదం సద్దుమణగలేదు. సోమవారం కథలాపూర్‌లో ఫిర్దోజ్తో అతని భార్యతోపాటు మామ షేక్ అమీర్ గొడవ పడ్డారు. తర్వాత ఫిర్దోజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మంగళవారం కథలాపూర్ మండలం సిరికొండ శివారులోని మామిడితోట వద్ద చెట్టుకు ఉరేసుకొని కనిపించినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ సురేశ్‌బాబు పరిశీలించి, వివరాలు సేకరించారు. తన కుమారుడి ఆత్మహత్యకు భార్య ఫిర్దాజ్, మామ అమీర్లే కారణమని మృతుడి తండ్రి షేక్ బాషుమీయా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
క్షణికావేశం.. నర్సింగ్ విద్యార్థిని విషాదం!
కరీంనగర్: కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో నర్సింగ్ విద్యార్థిని బానోత్ అక్షయ(19) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. స్థానిక సంతోష్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణిలో ప్రైవేట్ ఓల్వో డ్రైవర్‌గా పనిచేస్తున్న బానోత్ రాజేశం– అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే, సెలవులు ముగిశాయయని, కాలేజీకి వెళ్తానని తన తండ్రికి చెప్పింది. తనకు వేతనం ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కాలేజీ ఫీజు చెల్లించి పంపిస్తానని తండ్రి చెప్పాడు. తనను కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న అక్షయ.. గంట సమయం గడిచినా బయటకు రాలేదు.కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు బోరున విలపించారు. చిన్నవిషయాలకే అలిగిన తమ కుమార్తె చనిపోతుందని తాము ఉహించలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి సోదరి అనిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
సూసైడ్ స్పాట్స్‌గా మెట్రో రైల్వే స్టేషన్లు !
సాక్షి బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్లు సూసైడ్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో మెట్రో రైల్వే స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పదేపదే మెట్రో ట్రాక్‌లపైకి దిగే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయినప్పటికీ మెట్రో అధికారులు మాత్రం అవసరమైన భద్రత వ్యవస్థ కలి్పంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజిస్టిక్ మెట్రో స్టేషన్లో మాత్రమే బీఎంఆర్సీఎల్ సెక్యురిటీలు అలర్ట్ అవుతున్నారు. మిగిలిన చోట్ల భద్రత సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైల్వే పట్టాలపై ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, చెన్నై మెట్రోలల్లో పీఎస్డీ (ప్లాట్ఫారం స్క్రీన్ డోర్లు) అమర్చడం వల్ల అక్కడ అలాంటి ఘటనలకు తావులేకుండా ఉంది. అయితే నమ్మ మెట్రోలో అలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడం దురదృష్టకరం. దీంతో ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరులో నమ్మ మెట్రో సేవలు ప్రారంభమై సుమారు 13 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పట్టాలపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రయాణికుల రక్షణకు భద్రత కరువైంది. కొంతమంది ఉదాసీనంగా పట్టాలపై పడిపోతుండడం, మరికొంత మంది ఉద్ధేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకునేందుకు నమ్మ మెట్రో పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో ఆరుగురు మెట్రో రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. -
జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్‌తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు. తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్‌కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్‌రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు. అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భార్య కళ్ల ముందే భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: భార్య కాపురానికి రావడం లేదనే బాధతో ఓ యువకుడు ఆమె కళ్ల ముందే మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... కడప ఎర్రముఖపల్లి సర్కిల్లో నివసించే పసుపులేటి మణికంఠ (33) 2018 మే 10వ తేదీన బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడాది పాటు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–14లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేశారు. మణికంఠ పద్ధతులతో విసిగిపోయిన యువతి ఇబ్రహీంనగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మణికంఠ తీవ్ర నిరాశా నిస్పృహలతో గడపసాగాడు. భార్యను తనతో పాటు రమ్మని పిలవడానికి ఆదివారం రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో పాటు రావాలని కోరాడు. నీ పద్ధతులు నచ్చకనే వేరుగా ఉంటున్నానని, నీవు మారవని రాలేనని భార్య తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన భార్య ఎప్పటికీ ఇక రాదని, ఈ జీవితం వృథా.. బతికి వేస్ట్ అనుకుంటూ భార్య చూస్తుండగా మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికక్కడే మణికంఠ మృతి చెందగా ఈ విషయాన్ని బాధిత యువతి మణికంఠ బాబాయి వెంకటరమణకు తెలియజేసింది. వెంకటరమణ ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
సాక్షి, హసన్‌పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ సూసైడ్ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్‌ఫోన్, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తిహన్మకొండ - పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని అదృశ్యమైన వ్యక్తి.తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపణ. తన… pic.twitter.com/WFHGs1Qkea— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024 Video Credit: Telugu Scribeఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యూఎస్ ప్రెసిడెంట్
న్యూయార్క్: ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి... ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నని తెలిపారు. 1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్... తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.ఆ బాధలో తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ, తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అదే విధంగా మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్‌తో డిబేట్ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్ సైతం ప్రతిస్పందించారు. ‘ నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఇక.. అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి. -
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్‌సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతి చెందారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్‌పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
ఎంత మానసిక క్షోభ అనుభవించావో అమ్మా..!
తణుకు అర్బన్: తన ఇద్దరు కుమార్తెలను వదిలి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటే.. ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు అంజలి ఘటిస్తూ తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన తెలిపింది. ఈ కార్యక్రమానికి మంత్రి కారుమూరి సంఘీభావం తెలిపి మాట్లాడారు. తనకు సొంతిల్లు వచ్చిందని.. జగనన్న తన కల నెరవేర్చాడని తెనాలికి చెందిన గీతాంజలి ఒక యూట్యూబ్ చానల్‌కు ఎంతో భావోద్వేగంతో తెలిపిన తీరును ప్రజలంతా స్వాగతించారని, అది ఓర్వలేని టీడీపీ పచ్చ దొంగలు ఆమైపె సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మటమే కాకుండా అసభ్యకరంగా పెట్టిన పోస్టులకు చలించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గీతాంజలి విషయంలో స్పందించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయంతోపాటు అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఐటీడీపీ పేరుతో పెడుతున్న పోస్టులు ఎంతోమంది జీవితాలను చిదిమేస్తున్నాయని గీతాంజలి ఒక్క విషయమే బయటపడిందని చెప్పారు. ఒక మహిళ ప్రభుత్వం వలన తనకు జరిగిన మంచిని చెప్పుకోవడం వలన ఇలా జరిగిందంటే ప్రతిపక్షాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముందుగా గీతాంజలి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మనన్ నత్తా కృష్ణవేణి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి రాము, తణుకు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, ఉండ్రాజవరపు గీత, ఎం.లలిత, ఫహీమా, కొఠారు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేనవి నీచ రాజకీయాలు బుట్టాయగూడెం: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ, జనసేన పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన నాలుగో విడత చేయూత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్స్‌ను తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల భర్త, పిల్లలు అన్యాయమైపోతారని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గీతాంజలి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు. నడిపల్లిలో రాస్తారోకో పెదవేగి : గీతాంజలిది ఆత్మహత్య కాదని టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్యగా పరిగణించి కారకులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టేటి స్టాలిన్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం నడిపల్లిలో గీతాంజలి మృతికి నిరసనగా రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ఉక్కుర్తి నాగేశ్వరరావు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడు ఎం. గోపాలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవాపురంలో ర్యాలీ చింతలపూడి: గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ గిరి భోగారావు డిమాండ్ చేశారు. బుధవారం చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ పడమటి ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి గీతాంజలి మృతికి శ్రధ్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో చుండూరి కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన వల్లే గీతాంజలి చనిపోయింది తణుకు అర్బన్: టీడీపీ, జనసేన సామాజిక మాధ్యమాల్లో వేధించడం వల్లే తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని తణుకు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పొడుగు రామాచారి (రాము) అన్నారు. గీతాంజలి మృతికి బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రభుత్వం తనకు దస్తావేజులతో కూడిన ఇంటిపత్రాలు ఇచ్చారని సంతోషంగా చెప్పిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన గీతాంజలిని ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించడం దారుణమని అన్నారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా తనకు అందిన సౌకర్యాన్ని చెప్పుకున్నందుకు ఆమె చనిపోయేంతగా వేధిస్తారా అని నిలదీశారు. వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గొల్తి హరికృష్ణప్రసాద్, కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, ఉపాధ్యక్షులు టేకు రాజు, ధవళేశ్వరపు సుబ్బారావు, కోరుమిల్లి సుబ్బారావు, నాగమల్లి సాయి, తమిరి శివకుమార్, ఉప్పరాపల్లి బాలు పాల్గొన్నారు. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. కాబోయే భర్త మాట్లాడి వెళ్లి కొద్ది సేపటికే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం సాయంత్రం హస్టల్లోని బాత్ రూమ్‌కు వెళ్లిన ఆమె బయటికు రాకపోవడంతో రూమ్మేట్స్ తలుపులు తెరిచి చూడగా. టవల్‌తో షవర్ రాడ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు ఆమె సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్ పూర్తి చేసింది. బుధవారం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హస్టల్ వద్దకు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాషింగ్టన్ ఇజ్రాయెల్ ఎంబసీ.. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
వాషింగ్టన్: అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఒకరు వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు తాను మంటలంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. మంటలంటించుకునే మందు అతడు మాట్లాడుతూ ‘గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఇక ఏ మాత్రం నేను భాగం కాను. ఇందుకే నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’అని చెప్పాడు. ఈ వీడియో ట్విట్చ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది. వెంటనే అధికారులు వీడియోను డిలీట్ చేయించారు. ఘటన అనంతరం మంటలార్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. యూనిఫాం వేసుకుని తనను తాను కాల్చుకున్న వ్యక్తి అమెరికాలోని టెక్సాక్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అని అధికారులు నిర్ధారించారు. Hazmat crews arrive at Israeli Embassy for a suspicious vehicle after a man lit himself on fire pic.twitter.com/YDIrc9o5gp — Andrew Leyden (@PenguinSix) February 25, 2024 ఇదీ చదవండి.. దుస్తులపై వివాదం.. మహిళపై మూకదాడికి యత్నం -
జీవితంపై విరక్తితో తల్లీకూతురు ఆత్మహత్య
యశవంతపుర: ఎంత కష్టం వచ్చిందోగానీ తల్లీకూతురు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగి జిల్లా శహబాద్ దగ్గర కాగిణా నదిలో జరిగింది. కలబురగి నగరంలోని ఎంబీ నగరలో నివసించే తల్లి సుమలత (45), కూతురు వర్ష (22) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. రాత్రి కాగిణా నదిలో దూకారు. మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శహబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారింట్లో కుటుంబ కలహాలు ఉన్నట్లు ఇరుగుపొరుగు చెప్పారు. -
ఇద్దరు ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి, భువనగిరి క్రైం: భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైరంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పట్టికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం హృదయవిధారకంగా ఉందని చెప్పారు. వారి సూసైడ్ లెటర్ పలు అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు. హాస్టల్ పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలన్నారు. హాస్టల్‌కు తరచూ బయటి వ్యక్తులు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం… హాస్టల్ వార్డెన్ , వాచ్మాన్ ,ఆటో డ్రైవర్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో హ్యాండ్ రైటింగ్ తమ పిల్లలది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ విషయంలో చిన్న ఘటన జరగగా తమ దృష్టికి వచ్చిందని, ఇది పక్కా హత్యే అని వారు మండిపడ్డారు. హాస్టల్లో ఇంతా జరగుతున్న వార్డెన్, యాజమాన్యం ఏం చేస్తున్నారని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వాచ్ మ్యాన్,ఆటో డ్రైవర్, వార్డెన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
యువకుడు ఆత్మహత్య.. కొన్నాళ్లుగా మహిళతో చనువు...
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అశోక్‌రోడ్‌కు చెందిన మహ్మద్ ఖాసీం కుమారుడు సల్మాన్ (30) స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అశోక్‌రోడ్ రోడ్లోనే ఉంటున్న ఓ మహిళతో కొంతకాలం చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత సదరు మహిళ కాదనడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 22న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో పురుగుల మందు తాగాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా బంధువులకు సమాచారం అందించాడు. గమనించిన స్థానికులు 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఎండీ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై స్వామి తెలిపారు. -
తల్లి మందలించడంతో ఇంటర్ యువతి తీవ్ర విషాదం..
నల్గొండ: తల్లి మందలించిందనే కారణంతో గడ్డిమందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల యాదయ్య, సైదమ్మల నాలుగో కుమార్తె పూజిత(17) సూర్యాపేటలోని సాయిగౌతమి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో పూజిత శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుంచి ఇంటికి వచ్చింది. చదువు విషయమై తల్లి సైదమ్మ కూతురు పూజితను మందలించింది. ఈ కారణంతో పూజిత వెంటనే వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న గడ్డి మందు సేవించింది. చుట్టుపక్కల వారు చూసి సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి.అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మానసికంగా కృంగిపోయి..
కరీంనగర్: ఆరోగ్యం సహకరించడం లేదని, ఆ స్పత్రుల్లో చూపించుకున్నా నయం కావడంలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని గోధూర్‌లో చోటుచేసుకుంది. మౌస్మి(17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తరచూ అనారోగ్యం బారిన పడుతున్న ఆమె చదువులో వెనుకబడుతున్నానని మానసికంగా కృంగిపోయింది. గత నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఉమాసాగర్ బుధవారం తెలిపారు. మృతురాలి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఊయలే.. ఉరితాడై -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
విజయవాడరూరల్: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీసు స్టేషన్ పరిధి శాంతినగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పాయకాపురం శాంతినగర్‌కు చెందిన అంబటి ప్రతాప్‌కుమార్ ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య అంబటి సాయికన్య(32) చీటీల వ్యాపారం చేస్తుంటుంది. వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరిగిపోవడంతో, అవి తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి బెడ్రూమ్లో పడిపోయారు. వారి పిల్లలు చూసి పక్కింటివారికి చెప్పగా వారు వచ్చి దంపతులిద్దరినీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారిని పరిశీలించి సాయికన్య చనిపోయిందని నిర్ధారించారు. మృత్యువుతో పోరాడుతున్న ప్రతాప్కుమార్కు చికిత్స అందిస్తున్నారు. ప్రతాప్‌కుమార్ అన్న ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. నేనేం పాపం చేశాను!
అయిజ: భార్యపై అనుమానంతో రెండేళ్ల కుమా రుడిని పొట్టనపెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. వివరా లిలా.. అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో 2019లో వివాహమైంది. వీరికి కుమార్తె నయనిక, కుమారుడు నందకిశోర్(2) ఉన్నారు. కొంతకాలంగా భార్యను అనుమా నిస్తూ భార్గవ తరుచూ గొడవ పడుతున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పదిరోజుల క్రితం కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లేందుకు శ్రావణి ప్రయత్నించగా.. అడ్డు కున్న భార్గవ.. కుమారుడు నందకిషోర్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె కూతురు నయనికను తీసుకొని వెళ్లిపోయింది. నందకిషోర్ ప్రతిరోజూ అమ్మ కావాలని ఏడుస్తుండడంతో.. భరించలేక పసివాడికి నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టాడు. పదిరోజులుగా భార్య లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్గవ వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన అతని తల్లి వడ్లకుమారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. దీంతో కోలుకున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భార్గవ రెండేళ్ల తన కుమా రుడు నందకిషోర్‌కు ఎలుకల మందు తాగించి, తానూ తాగాడు. గురువారం ఉదయం తల్లి కుమారి నిద్ర లేచేసరికే కొడుకు, మనవడు అపస్మారక స్థితిలో ఉండడం గమనించి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భార్గవ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నా.. పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. శాంతినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్‌లో
సంగారెడ్డి: జులాయిగా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోలు మండలం ఎల్కల్‌లో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కల్‌కు చెందిన ఎల్లొల్ల చంద్రం కుమారుడు వినయ్ (16) చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. స్నేహితులతో జులాయిగా తిరగొద్దని, ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ డిసెంబర్ 29న గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గడ్డిమందు తాగాడు. విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. గమనించి స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం!
కరీంనగర్: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందుకు ఆ ముగ్గురే కారణం..’ అంటూ ఓ యువకుడి సూసైడ్‌నోట్ సిరిసిల్లలో సోమవారం కలకలం సృష్టించింది. బాధితుడు మీడియా ప్రతినిధులకు నేరుగా వాట్సాప్‌లో పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన ఓ ప్రముఖుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. ఎన్నికల్లో అతని విజయం కోసం ఆ యువకుడితోపాటు అతని స్నేహితులు పనిచేసేందుకు రూ.లక్ష పారితోషికం మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో అతను.. లేదంటే ఓ జాతీయ పార్టీ ప్రతినిధి గెలుస్తారని.. మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపైనే కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయాడు. చేసిన పనికి డబ్బులు రాక తనతోపాటు స్నేహితులు కూడా ఇబ్బందుల పడుతున్నారని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేగా పోటీచేసిన సదరు అభ్యర్థి, అతని సడ్డకుడు, పద్మశాలి వర్గానికి చెందిన మరో నాయకుడు కలిసి మోసం చేశారని, తన ఆత్మహత్యకు వారే కారణం అంటూ ఆ నోట్ రాసుకొచ్చాడు. ఈ విషయంపై సిరిసిల్ల పోలీసులు విచారణ చేపడుతున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం! -
ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి..
సంగారెడ్డి: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో మహిళ మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ.నరేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మళి మహాదేవి(35), భర్త శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రతి రోజూ తాగేవాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ రెండు నెలల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మహాదేవి డిప్రెషన్లోకి వెళ్లింది. మనోవేదనకు గురై నిత్యం బాధపడుతున్న ఆమె ఆదివారం గ్రామ శివారులోని ఎల్లమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని బావిలో నుంచి తీసి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి అత్త మామ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాగుడుకు బానిసై.. ఇదే గ్రామానికి చెందిన ఆలిగే నర్సింలు(44) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేవాడు. వారం రోజుల నుంచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని సత్వార్ వ్యవసాయ బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నాడని భావించి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నరేశ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెతికినా దొరకలేదు. బావిలో నిండుగా నీరు ఉండడంతో రెండు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇవి చదవండి: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం! -
అన్నీ సంచలనాలే.. ‘టీఎస్పీఎస్సీ’ కేసుతో కరీంనగర్‌కు లింకు!
కరీంనగర్: 'ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ ఏడాది పలు సంచలన సంఘటనలకు వేదికైంది. హత్య, ఆత్మహత్య, మిస్సింగ్, చోరీలు, కాల్పులు, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ, అవినీతి, అరెస్టు, టీచర్ల బయోమెట్రిక్ డుమ్మా, తిరుపతికి ప్రయాణికుల ఇక్కట్లు.. ఇలా ఏ రకమైన వార్త తీసుకున్నా అది రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. వీటన్నింటిపై 'సాక్షి' దినపత్రిక స్పాట్ వార్తలతో పాటు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం వెంటవెంటనే చర్యలు తీసుకుంది. పలుశాఖల అధికారుల అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. బాధ్యులను విధుల నుంచి తప్పించారు.' - సాక్షిప్రతినిధి, కరీంనగర్ జనవరి 1–2023: ఆత్మహత్యలు కావు హత్యలే.. గతేడాది కొత్త సంవత్సరం రోజున గంగాధరలో ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు, తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణాల గుట్టు నూతన సంవత్సరం రోజునే వీడింది. తండ్రే తన పిల్లలకు, భార్యకు ఎన్‌ఏఓహెచ్ అనే రసాయనం కలిపి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తొలుత ఈ విషయాన్ని ‘సాక్షి’ వెల్లడించింది. ఆ తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మూసివేశారు. జనవరి 05: సరసమైన ధరలకే విరాసత్.. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయంలో వారసత్వ భూములు విరాసత్ చేసే విషయంలో ఫోన్ పే ద్వారా రూ.లక్షల లంచాలు తీసుకున్నారు. అయినా పని చేయకపోవడంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడంతో విచారణ జరిపిన కలెక్టర్ కార్యాలయం తహసీల్దార్‌ను బదిలీ చేసి, వీఆర్ఏ, వీఆర్వోలను సస్పెండ్ చేసింది. జనవరి 21: పల్లెల్లో సహారా కలకలం.. అధిక వడ్డీ రేట్ల ఆశచూపి, డిపాజిట్లు సేకరించిన సహారా సంస్థ కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. ఈ విషయం గోప్యంగా ఉంచి వారిని మభ్యపెడుతూ వస్తున్నారు. ఈ కుంభకోణం ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనంతో వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు చేసి, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 03–2023: తల్లీపిల్లలను కలిపిన సాక్షి.. కరీంనగర్ మంకమ్మతోట నుంచి ఓ మహిళ ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి, మహారాష్ట్ర తీసుకెళ్లింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో పోలీసులు ఆ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి, నిందితురాలిపై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 24: కొండగట్టు ఆలయంలో బీదర్ దొంగల చోరీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయంలో బీదర్ నుంచి వచ్చిన దొంగలు చోరీ చేశారు. పలు వెండి ఆభరణాలు, తాపడాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ‘సాక్షి’ ముందుగానే ఎక్స్‌క్లూజివ్‌గా పాఠకులకు అందించింది. మార్చి 15: ‘కట్టా’ను పట్టుకున్న సాక్షి.. నకిలీ అర్హతలతో 34 ఏళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో కొలువు చేస్తున్న కట్టా విష్ణువర్దన్ అనే ఉద్యోగి నిర్వాకంపై ‘సాక్షి’ వరుస పరిశోధన కథనాలు వెలువరించింది. వీటికి ఉన్నతాధికారులు స్పందించి, ఆయన అక్రమాలు నిజమేనని తేల్చారు. అనంతరం సస్పెన్షన్ వేటు వేశారు. మార్చి 16: టీచకుడు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తోటి మహిళా టీచర్లను వేధిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. పకడ్బందీగా ఆయన వికృత చేష్టలను లోకానికి చూపించడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సస్పెన్షన్ వేటు వేశారు. మార్చి 18: టీఎస్పీఎస్సీ కలకలం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలలీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌రెడ్డిది జగిత్యాల జిల్లానే. దీంతో సిట్ బృందం పలు మార్లు జిల్లాకు వచ్చి విచారణ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్‌లోనూ లీకేజీకి లింకుందని గుర్తించారు. ఆ తర్వాత ఓ ప్రముఖ కాలేజీలో పనిచేసే సిబ్బందిని కూడా అరెస్టు చేశారు. ఏప్రిల్ 1: పోలీసులకు శాశ్వత ఫోన్ నంబర్.. పోలీసులందరికీ ఒకే శాశ్వత నంబర్‌ను కేటాయిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని కరీంనగర్ నుంచే అమలుకు నిర్ణయించింది. డిపార్ట్మెంట్లో చేరిన వ్యక్తి రిటైరయ్యే వరకు ఒకే నంబర్ ఉంటుంది. దాన్నే పీఎఫ్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానిస్తారు. ఏప్రిల్ 4: బండి సంజయ్ అరెస్టు.. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఎంపీ బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి, హనుమకొండకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎంపీ సెల్‌ఫోన్ పోయింది. ఇంతవరకూ దొరకలేదు. ఏప్రిల్ 20: మానకొండూర్‌లో కాల్పుల కలకలం.. మానకొండూర్ మండల కేంద్రంలో కాల్పులు జరిగాయన్న వార్త కలకలం రేపింది. అరుణ్ అనే యువకుడిపై గోదావరిఖనికి చెందిన సాయితేజ్, అతని మిత్రులు కలిసి హత్యాయత్నం చేశారు. నాటు తుపాకీతో కాల్చగా అది పేలలేదు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మే 24: నా కోడిని చంపేశారు.. తన టర్కీ కోడిని పొరుగింటి వ్యక్తి చంపాడంటూ ఓ వ్యక్తి కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, ఈ వార్త ‘సాక్షి’లో ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. జూన్ 27: ఉగ్రకేసులో తండ్రీకూతుళ్ల అరెస్టు.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో రామగుండంలో తలదాచుకున్న ఓ తండ్రీకూతుళ్ల ను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్‌కి చెందిన ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులతో చాటింగ్ చేసినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నా రు. తండ్రి గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ పే లుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడని సమాచారం. జూలై 03: దళితబంధులో మామూళ్ల పర్వం.. దళితబంధు పథకంలో మామూళ్ల పర్వంపై ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరో ఉద్యోగి సస్పెన్షన్ భయంతో లీవు మీద వెళ్లారు. జూలై 04: డుమ్మా మాస్టార్లు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు బయోమెట్రిక్ ఉన్నా డుమ్మా కొడుతున్న వైనాన్ని ‘సాక్షి’ డుమ్మా మాస్టార్లు పేరిట కథనం ప్రచురించింది. దీనికి కరీంనగర్ డీఈవో స్పందించి, ఆలస్యమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జూలై19: పోలింగ్ కేంద్రాల సమస్యలపై జూలైలో ‘సాక్షి’ వరస కథనాలు ప్రచురించింది. స్పందించిన ఉన్నతాధికారులు తప్పులను సరిదిద్దారు. డిసెంబర్లో కొత్తపోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 14: బాలిక మృతి కేసులో కొత్త ట్విస్ట్.. పెద్దపల్లి శివారులో నివసించే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గాయపడి, అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఆమైపె సామూహిక లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా.. దర్యాప్తులో ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో కేసు మిస్టరీ వీడింది. సెప్టెంబర్ 08: రైతుబీమా ఐడీలలో జాప్యం.. రైతు బీమా, ఎల్ఐసీ ప్రీమియం పొందాలంటే ఐడీలు తప్పనిసరి. కానీ, ఈ–జెనరేట్ కాక పలువురు మరణించిన రైతుల కుటుంబాలకు బీమా జాప్యమైంది. విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు. సెప్టెంబరు 20: స్పౌజ్ కోటా దుర్వినియోగం.. దంపతులిద్దరూ ప్రభుత్వ టీచర్లయితే ఒకేచోట పని చేసేందుకు ఉద్దేశించిన స్పౌజ్ కోటాను పలువురు టీచర్లు కేవలం హెచ్ఆర్ఏ కోసం దుర్వినియోగం చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన విద్యాశాఖ వారిపై చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 29: తప్పుడు ర్యాంకులతో పదోన్నతులు.. పదోన్నతులు, బదిలీల్లో టీచర్లు ర్యాంకులను తప్పుగా చూపించారు. 317 జీవో సమయంలో ఒకలా, ఇప్పుడు మరోలా చూపించిన వైనాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. దీంతో స్పందించిన విద్యాశాఖ తప్పుడు ర్యాంకులతో పదోన్నతులు, బదిలీ చేయించుకున్న వారిపై చర్యలు చేపట్టింది. అక్టోబర్ 31: కలెక్టర్ నివాపంలో చోరీ.. అక్టోబర్ 30న రాత్రి కరీంనగర్ కలెక్టర్ బి.గోపి నివాసంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన పగిడిపల్లి ప్రసాద్ చొరబడ్డాడు. కలెక్టర్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్, చార్జర్, బ్యాగు, పెన్‌డ్రైవ్‌ను ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నవంబర్ 7న అతన్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. డిసెంబర్ 22: తిరుపతికి ఇక వారానికి నాలుగు రైళ్లు.. కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండుసార్లు ఉన్న బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై నాలుగుసార్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయాణికుల ఇక్కట్లపై ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన ఎంపీ బండి సంజయ్ సర్వీసుల సంఖ్య పెంచుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. డిసెంబర్ 27: ఎల్పీసీ సమర్పించాలి.. లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ (ఎల్పీసీ) సమర్పించకుండానే పలువురు ఇంజినీర్లు కరీంనగర్లో ఉద్యోగం చేస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నగరపాలక కమిషనర్ స్పందించారు. అధికారులందరూ వెంటనే ఎల్పీసీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి చదవండి: అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు.. -
చేతిలో డబ్బు లేక తీవ్ర మనస్తాపానికి గురై.. యువతి తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: మండల కేంద్రానికి చెందిన మేకల ఆర్థిక(17) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇంటర్ వరకు చదివింది. సునీత–పర్శరాములు దంపతులకు మూడో కూతురు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా శిక్షణ పొందుతోంది. తన తండ్రి పర్శరాములుకు పక్షవాతం, క్యాన్సర్ వ్యాధితో సంవత్సర కాలంగా మంచానికే పరిమితమయ్యాడు. వ్యాధిని నయం చేయించేందుకు చేతిలో డబ్బు లేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్థిక.. గురువారం సాయంత్రం సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040- 66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా..
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని పటేల్‌గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి? -
పెళ్లైన ఐదు రోజులకే.. గోదావరిలోకి దూకిన నవదంపతులు
పెనుగొండ, పశ్చిమ గోదావరి: ఏ కష్టం వచ్చిందో తెలియదు. నవ దంపతులు గోదావరిలో దూకారు.. వరుడు ప్రాణాలతో బయట పడగా.. వధువు కోరాడ సత్యవతి మృతి చెందింది.. అయితే వరుడుపై వధువు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి(19)ని తండ్రి లేకపోవడంతో తాతే పెంచి ఈ నెల 15న ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే శివరామకృష్ణతో వివాహం జరిపించాడు. వీరు మంగళవారం రావులపాలెం సినిమాకు అని చెప్పి వెళ్లారు. శివరామకృష్ణ కథనం ప్రకారం ఇద్దరూ సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రిడ్జి నుంచి ఆర కిలో మీటరు దూరంలో ఉన్న శివరామకృష్ణ కేదారీఘాట్ సమీపంలో రక్షించమని అరవడంతో మత్స్యకారులు కాపాడారు. విషయాన్ని వధువు బంధువులకు చెప్పి తణుకు ప్రభుత్వాసుపత్రికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లిపోయాడు. వధువు గల్లంతు కావడంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శివరామకృష్ణను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వధువు కోరాడ సత్యవతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. శివరామకృష్ణ హత్య చేశాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వడలి గ్రామస్తులు భారీగా పెనుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సత్యవతి హత్య చేసి గోదావరిలో పడేయడమో చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌లు గ్రామస్తులకు సర్ధి చెప్పి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాలు పెట్టుకోవద్దంటూ భరోసా ఇచ్చారు. -
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్‌ల్లో, యాప్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
అటవీశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వేధింపులు భరించలేక ఓ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బీట్ ఆఫీసర్ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత ఇటీవల సెక్షన్ ఆఫీసర్ రాందాస్‌తో కలిసి వెంచవెల్లి బీట్‌లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇందుకుగాను సెక్షన్ ఆఫీసర్ రాందాస్ రూ.2 లక్షలు కూలీల వేతనాలు, ప్లాంటేషన్ నిర్వహణకు ఇచ్చారు. అయితే ఇవికాకుండా అదనంగా రూ.1.50 లక్షలను కూలీలకు చెల్లించాల్సి ఉందని, బిల్లు ఇవ్వాలని ఎఫ్ఆర్వో రవిని లత కోరగా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె శుక్రవారంరాత్రి మంచిర్యాలలోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లత భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డీఎఫ్‌వోకు ఒడిశా కూలీల ఫిర్యాదు ప్లాంటేషన్ పనులు చేసిన ఒడి శా కూలీలు కూలి డబ్బులు ఇవ్వాలని ఎఫ్ఆర్వోను కోరగా ‘కూలి లేదు, డబ్బులు లేవు, దిక్కున్నకాడ చెప్పుకోండి’అని బెదిరించారు. దీంతో వారంతా జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీశ్ సింగ్‌కు ఫిర్యాదు చేయగా ఎఫ్ఆర్వోను మందలించారు. ఈ విషయా న్ని మనసులో పెట్టుకొన్న రవి శుక్రవారం తనను కా ర్యాలయానికి పిలిపించి దుర్భాషలాడారని లత ఆ రోపించారు. కాగా, వేధింపుల విషయమై ఎఫ్ఆర్వో రవిని సంప్రదించగా, తాను బీట్ ఆఫీసర్ లతను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు. -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: క్షణికావేశంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముత్నూర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్సై దు బ్బాక సునీల్ తెలిపిన వివరాల ప్రకారం బోథ్ మండలంలోని వజ్జర గ్రామానికి చెందిన కవిత (26)కు ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన గేడం జ్యోతిరాంతో 2021 లో వివాహమైంది. గురువారం ఉదయం జ్యోతిరాం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కవిత ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త రలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు తండ్రి సిడాం లక్ష్మణ్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తండ్రి మందలించడంతో కూతురు తీవ్ర నిర్ణయం!
సాక్షి, కుమరం భీం: పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో యాదవ్ వివరాల ప్రకారం... చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన ఊర్మిళ మండల్(21) 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 2న తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తండ్రి కేనార్ మండల్ కూతుర్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈస్గాం తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు. ఇవి చదవండి: బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ.. నవ దంపతులు దుర్మరణం -
దుబాయ్‌లో భర్త.. మరో యువకుడి కారణంగా.. వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పార్పెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మూడేళ్లుగా అతడి భార్య నాగమణి(35) ఇద్దరు కుమారులతో కలిసి తల్లిగారింటి వద్ద నిర్మల్‌లోని బెస్తవార్పేట్లో నివాసం ఉంటోంది. పార్పెల్లి గ్రామానికి చిలుక వంశీ అనే వ్యక్తి నాగమణిని కొద్ది రోజులుగా చరవాణిలో లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో నాగమణి రెండు రోజుల కిందట పార్పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ తనను ఫోనులో వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లితో చెప్పింది. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇంటికి వచ్చిన తల్లి కళావతికి కుమార్తె ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్టౌన్లో కేసు నమోదు చేశారు. పార్‌పెల్లిలో ఆందోళన.. నాగమణి మృతదేహాన్ని పార్పెల్లికి అంత్యక్రియల కోసం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వంశీ అనే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోనే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్, సోన్ సీఐ నవీన్ కుమార్ చేరుకుని పార్‌పెల్లిలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య మృతితో ఇంటికి వచ్చిన భర్త.. నాగమణి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని విషయం తెలవడంతో భర్త చిన్న భోజన్న దుబాయ్ నుంచి గురువారం ఉదయం స్వగ్రామం చేరుకొన్నాడు. దీంతో తన ఇద్దరు కుమారులు శ్రీచరణ్(12), శ్రీవర్ధన్(10)తో కలిసి భార్య మృతదేహం వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కట్నం తేవాలంటూ భార్యకు వేధింపులు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో డోలాస్‌నగర్‌లో నివాసముండే ఓ ఆటోడ్రైవర్ తన భార్య చనిపోవడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహమై భర్త వదిలేసిన ఓ మహిళను చర్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం కట్నం కావాలని మొదటిభార్య సంతానంతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 5 రోజుల క్రితం సదరు మహిళ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో మంగళవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసింది. బాధిత మహిళ వివరాల ప్రకారం.. మ్యారేజ్‌బ్యూరో ద్వారా డోలాస్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ బుచ్చిబాబును అనురాధ 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునేముందు తన భార్య చనిపోయిందని, తన ఇద్దరు పిల్లలు తన దగ్గర ఉండరని, సొంత ఇంట్లో నివాసముంటామని, మొదటి భర్తతో పుట్టిన నీ కొడుకును సైతం హాస్టల్లో ఉంచాలని బుచ్చిబాబు అనురాధతో చెప్పాడు. బుచ్చిబాబు కుమార్తెకు వివాహమైనా భర్తకు దూరంగా ఉండడంతో ఆమె కూడా అదే ఇంట్లో నివాసముంటోంది. వివాహమైనప్పటి నుంచి ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగితే నువ్వు నాకు కట్నం ఇవ్వలేదు, ముందు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశారని బాధితురాలు అనురాధ వాపోయింది. ఈవిషయమై నిలదీయడంతో తనపై పలుసార్లు దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఐదు రోజుల క్రితం బుచ్చిబాబు, అతని కుమార్తె, కుమారుడు, తల్లి తన నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని హింసించగా, వారినుంచి తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చానని, ఇక్కడ పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. చివరకు సీఐ మల్లిఖార్జునరావును కలవగా, మ్యారేజ్ సర్టిఫికేట్ తేవాలని సూచించారన్నారు. తన మొదటి భర్త వదిలేసి ఎటో వెళ్లిపోతే అతనితో విడాకులు అయినట్లు పత్రాలు, మరల బుచ్చిబాబును ద్వితీయ వివాహం చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అంటున్నారని, వివాహం జరిగిన చర్చిలో పాస్టర్‌ను మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే మేము అలాంటివి ఇవ్వమని చెబుతున్నారని బాధిత మహిళ వాపోయింది. ఈక్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నం చేయగా స్థానిక మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ అడుగగా అనూరాధ రెండవ భర్త బుచ్చిబాబు అందుబాటులో లేడని, అతడ్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారి కుటుంబ సభ్యులకు హెచ్చరించామని, అనూరాధ, బుచ్చిబాబుల మధ్య సఖ్యత కుదరపోతే కేసు నమోదు చేసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొంగులేటి అనుచరుడు ఉపేందర్ ఆయన ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఉదయం 5 గంటల నుండి పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటికి మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పొంగులేటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయంటూ నిరసన తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇవాళ నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనుసైగల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని ప్రకటించాను. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రుల 30 మంది ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేస్తున్నారు. నారాయణపురంలోని మా తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. నా దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారు. నా భార్యను, కుమారుడిని వాళ్ల ఆఫీస్‌కి తీసుకెళ్లారు. నన్ను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపై సోదాలు ఎందుకు జరగట్లేదు?. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆర్ఎస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్‌రాజ్..బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్ కోసం బాల్‌రాజ్ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి సీటు ఖరారు చేసింది. దీంతో బాల్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం బాన్సు వాడలో తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పా టు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2014 నుంచి పార్టీని నమ్ముకుని కార్యకర్తలను కా పాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చివరకు తనను కాదని, వేరే ప్రాంతం వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమరణ దీక్షకు దిగి ఇంతలోనే.. కాంగ్రెస్ అధిష్టానం మరోమారు టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరుతూ బుధవారం ఉదయం బాల్‌రాజ్ తన ఇంటి ముందు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. మధ్యాహ్నం సమయంలో తనతో పాటు దీక్షలో కుర్చున్న కార్యకర్తలను భోజనం చేయండంటూ ఇంట్లోకి పంపించారు. తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చారు. వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభించడంతో కార్యకర్తలు కంగారు పడిపోయారు. కొందరు బాత్రూం లోపలకి వెళ్లి చూశారు. మోనో–65 పురుగుల మందు డబ్బా కనిపించడంతో బాల్‌రాజ్‌ను హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీజేపీ బాన్సువాడ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆస్పత్రికి చేరుకుని బాల్‌రాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా.. -
టికెట్ నో అన్న పార్టీ.. పురుగుల మందు తాగిన ఇంఛార్జ్
సాక్షి,బాన్సువాడ ః ఎన్నికల పక్రియ తొలి అంకం టికెట్ల పంపిణీలోనే కొందరికి నిరాశ ఎదురవడం సహజమే. అయితే పార్టీ కోసం పనిచేసిన తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెటివ్వడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రాలేదన్న బాధతో ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో బాలరాజును నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ కాంగగ్రెస్ టికెట్‌ను బీజేపీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి అధిష్టానం ఇచ్చింది. పార్టీలో చేరీ చేరగానే ఏనుగుకు టికెట్ దక్కింది. ఇది తట్టుకోలేకపోయిన ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన బాలరాజు పురుగుల మందు తాగాడు. బాలరాజును బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు. నిజానికి ఏనుగు రవీందర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి బీజేపీలో చేరి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
Vemulawada: వికాస్ రావుకు కాకుండా తుల ఉమాకు టికెట్ ఎలా ఇస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ యువ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేములవాడ టికెట్ కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు కాకుండా, తుల ఉమకు ఎలా ఇస్తారని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కచ్చితంగా బీజేపి టికెట్ వికాస్ రావుకి ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తమై యువకుడిని అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో యువకుడికి స్వల్ప గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. అయితే వేములవాడ బీజేపీ టికెట్ వికాస్‌కు ఇచ్చే వరకు వెళ్ళేది లేదని వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, ఎంపీ ప్రకాష్ జవదేకర్ రంగంలోకి దిగారు. వికాస్‌రావు మద్దతుదారులతో మాట్లాడి వారికి సర్దిచెప్పారు. కాగా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగో విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను బీజేపీ విడుదల చేసింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను బుధవారం ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్ బుక్‌లో రాసి..
సాక్షి, మెదక్/తూప్రాన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మున్సిపల్ పరిధిలోని బ్రహ్మణపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మణపల్లికి చెందిన శివసాయికి ఆరేళ్ల కిందట మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన సంధ్య(25)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని నెలల కిందట శివసాయికి రోడ్డుప్రమాదం జరగడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలోనే సంధ్య అనారోగ్యానికి గురై తీవ్ర మనస్థాపానికి లోనైంది. సోమవారం తన ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నా’ అని నోట్ బుక్‌లో రాసి చనిపోయిందని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. తల్లి మృతిచెందడంతో ఇద్దరు కుమారులను చూసి ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
లవ్ బ్రేకప్ చెప్పడంతో ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్: లవ్ బ్రేకప్ చెప్పడంతో ఓ ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వన్ష్ (21) మౌలాలి ఎంజే కాలనీలో నివసించే యువతి (21) ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఒకే స్కూల్లో చదువుకున్న వారు చిన్ననాటి నుంచే స్నేహంగా ఉంటూ వస్తున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారి ప్రేమికులయ్యారు. ప్రస్తుతం వారు కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అమ్మాయి లవ్ బ్రెకప్ చెప్పింది. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న వన్ష్ ప్రియురాలిని చంపి తాను కూడా చనిపోవాలని పథకం వేసుకున్నాడు. శనివారం తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఒక్కసారి మాట్లాడుకుందా అంటూ నమ్మించి పిలిపించాడు. అలా ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు పార్కు చేసి కారు అద్దాలు వేసుకొని మాట్లాడుకున్నారు. ఎందుకు బ్రేకప్ చెబుతున్నావంటూ కొద్దిసేపు వాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కత్తి తీసి ప్రియురాలి, పొట్ట, మెడపై విచక్షణ రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వన్ష్ కూడా పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగులగొట్టి కారు డోర్ తెరిచారు. వారిని స్థానిక ఎన్ఎఫ్సీ సంజీవని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హాని లేదన్నారు. -
బాధను భరించలేక.. యువతి విషాద నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: సారంగపూర్ మండలంలోని పొట్య గ్రామానికి చెందిన అలుగొండ వైష్ణవి(17) తలనొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని సారంగాపూర్ ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. కొన్నేళ్లుగా సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడం, ఖరీదైన చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి తండ్రి దత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎవరూలేని సమయంలో.. 'డెత్‌నోట్' రాసి.. విషాద నిర్ణయం!
సాక్షి, కర్ణాటక: వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మహిళా టెక్కీ కేసులో శుక్రవారం గోవిందరాజనగర పోలీసులు ఐదుమందిని అరెస్ట్‌చేశారు. భర్త రాజేశ్, మామ గిరియప్ప, అత్త సీతా, విజయ్, తస్మితాను కటకటాల వెనక్కు పంపారు. అమెరికాలో ఎంబీఏ చదివిన ఐశ్వర్య(26)కు డైరీరీచ్ ఐస్‌క్రీమ్ కంపెనీ యజమాని రాజేశ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఐశ్వర్య తండ్రి సుబ్రమణి చెల్లెలి భర్త రవీంద్ర.. రాజేశ్ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇతనే రాజేశ్‌కు పెళ్లి సంబంధం చూశాడు. మూడునాలుగేళ్లు ఇరుకుటుంబాలు సంతోషంతో అన్యోన్యంగా ఉన్నాయి. ఆస్తి విషయంలో రవీంద్ర, సుబ్రమణి కుటుంబాల్లో గొడవలు ఏర్పడ్డాయి. ఐశ్వర్య తండ్రిపై కోపంతో రవీంద్ర ఐశ్వర్య సంసారంలో నిప్పులు పోశారు. ఐశ్వర్యపై రాజేశ్‌కు లేనిపోని అబద్దాలు చెప్పి దంపతుల మధ్య గొడవలు పెట్టాడు. దీంతో రాజేశ్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యను వేధించారు. అయినప్పటికీ ఐశ్వర్య సహనం కోల్పోలేదు. ఉద్యోగం చేసిన సంపాదనలో భర్తకు విలాసవంతమైన బైకు, బంగారు ఆభరణాలు అందించింది. కానీ కుటుంబ సభ్యులు మాటలు విని రాజేశ్ దూషణలకు పాల్పడటంతో ఐశ్వర్య 20 రోజుల క్రితం విజయనగరలోని పుట్టింటికి చేరుకుంది. గతనెల 26 తేదీన ఇంట్లో ఎవరూలేని సమయంలో డెత్‌నోట్‌రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి అల్లుడు, కుటుంబసభ్యులే కారణమని పలువురు పేర్లతో గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఐశ్వర్య తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య భర్తతో పాటు కుటుంబసభ్యులను అరెస్ట్‌చేసి విచారణ చేపడుతున్నారు. ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం భర్త రాజేశ్, తల్లిదండ్రులు గిరియప్ప, సీతా, విజయ్, తస్మిన్ గోవా, ముంబైలో పార్టీ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా.. -
'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమాకాంత్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం భోరజ్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించి 108కు ఫోన్ చేశారు. అప్పటికే అతడు మృతి చెందడంతో 108 తిరిగి వెళ్లిపోయింది. మృతదేహాన్ని ఆటోలో రిమ్స్‌కి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్లో దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు నర్సింగ్, చంద్రభాగ వేడుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా.. -
సినిమాల్లో అవకాశాలు రాలేదని..
సాక్షి, వరంగల్: సినిమాల్లో సరైన పాత్రలు లభించడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు.. వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. కాజీపేట సీఐ సార్ల రాజు కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మార్తాండ నగర్ గ్రామానికి చెందిన పిల్లి సాయి ప్రకాశ్(26) పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకూ సరైన అవకాశాలు దక్కలేదు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం భద్రాచలం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే భద్రాచలం వెళ్లకుండా హనుమకొండ జిల్లా కేంద్రానికి చేరుకుని హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవితంలో స్థిరపడే అవకాశం రాలేదనే మనస్తపంతో ఈ నెల 28న వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ రాజు వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: కలెక్టరేట్ ఉద్యోగి.. అలా అవ్వడానికి అసలు కారణాలేంటి? -
'అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని..' సూసైడ్ నోట్ రాసి యువకుడు..
సాక్షి, నిజామాబాద్: ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ (23) తాగుడికి బానిసై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై భాస్కరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి రాజు బాయి దత్తత కుమారుడు సాయికుమార్ తాగుడికి బానిసై అనారోగ్యం పాలయ్యాడు. తరచూ తల్లితో గొడవ పడుతూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తల్లిని కొట్టాడు. దీంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లి లేని సమయంలో శనివారం రాత్రి నా చావుకు ఎవరూ కారణం కాదని, అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని, మరో జన్మలో నీ కడుపునే పుట్టాలని ఉందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యను కడతేర్చి.. ఐదేళ్ల కూతురితో..