
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై దాడి చేయడంతోనే తన అన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బొల్లారపు శివప్రసాద్ సోదరి ప్రశాంతి బుధవారం వీడియో విడుదల చేశారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన శివప్రసాద్ ఈనెల 23న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే.
ఆయన భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈనెల 22న కోరుట్ల ఎస్సై శివప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వకుండా చేయిచేసుకున్నారని, తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తన అన్నపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment