korutla
-
ఎస్సై శ్వేత సస్పెన్షన్
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై–2గా పనిచేస్తున్న శ్వేతను సస్పెన్షన్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతాలకు చెందిన బొల్లారపు శివప్రసాద్ తనపై ఎస్సై శ్వేత చేయి చేసుకుందని మనస్తాపానికి గురై అక్టోబర్ 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో ఎస్సై శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం -
ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై దాడి చేయడంతోనే తన అన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బొల్లారపు శివప్రసాద్ సోదరి ప్రశాంతి బుధవారం వీడియో విడుదల చేశారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన శివప్రసాద్ ఈనెల 23న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. ఆయన భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈనెల 22న కోరుట్ల ఎస్సై శివప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వకుండా చేయిచేసుకున్నారని, తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తన అన్నపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘గద్వాల ఎమ్మెల్యేకు ప్రాణ హాని’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రాణహాని ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం కోరుట్లలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరికి ప్రభుత్వ పెద్దలందరూ వెళ్లి బెదిరింపులకు గురి చేశారు. నేను అయితే నా తల తీసివేసినా పార్టీ మారను. అభివృద్ధి కోసం పార్టీ మారవలసిన అవసరం లేదు. కోరుట్ల ప్రజలకు అవసరమైన 100 పడకల హాస్పిటల్ సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కేవలం తన స్వార్థం కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తప్పుడు నివేదికలు చదివి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు’అని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగుతారని వార్తలు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలను కలవటం తీవ్ర చర్చనీయంగా మారింది. ఆయన మనసు మార్చుకొని బీఆర్ఎస్లోనే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అనంతం కాంగ్రెస్ నేతలు రంగంలోకి ఆయన్ను బుజ్జగించిన విషయం తెలిసిందే. -
మాలో తెలంగాణ పౌరుషం ఉంది.. భయపడేది లేదు: సీఎం రేవంత్
సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీ, కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ హయాంలో దళితులు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేసి, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతోందని దుయ్యబట్టారు.కోరుట్లలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్ షా తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కేసులకు రేవంత్ రెడ్డి భయపడడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లను రుద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వరు, నిధులు ఇవ్వని వారు నేడు ఓట్లు ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కార్మికుల త్యాగాలు, పొరాటాల వలనే తెలంగాణ ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతుంది. 400 సీట్లు గెలిచి అదానీ, అంబానీలకు దోచిపెట్టాలని చూస్తున్నారు. కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. నేను బిజెపి ని ప్రశ్నిస్తే ఢిల్లీలో కేసు పెట్టారు.చదవండి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులుపదేళ్లు కేసీఆర్ భయపెట్టాలని చూశాడు.కేసులు పెట్టినోళ్ళను అధికారంలో లేకుండా చేశాం. ఒక ప్రధానిగా నరేంద్ర మోదీ కనబడితే నమస్కరిస్తా. గుజరాత్ వాడిగా తెలంగాణకు వస్తున్నాడు. తెలంగాణకు వచ్చిన వాటిని రద్దు చేసిన వ్యక్తి మోదీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్ రద్దు చేయడమేనా? మెట్రో రైలుకి అనుమతులు ఇవ్వాలని అడిగితే స్పందనలేదు. నీటి కేటాయింపులు అడిగితే స్పందించలేదు. తెలంగాణ ఏర్పాటును అగౌరపరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన తన స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నాడు.దలితులు,గిరిజనులు ఇంకా చితికి పోవాలా. గుజరాత్ నుంిచి వచ్చి తెలంగాణలో పెత్తనం ఏంటి? గుజరాత్ అహాంకారానికి, తెలంగాణ అత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం.మనకి విభేదాలు ఉన్న ఊరుకానొడు వస్తే తరిమికొట్టాలి. రేవంత్ రెడ్డిని జైలులో వెయడానికేనా ప్రధాన మంత్రి ఉద్దేశమా. తెలంగాణ పౌరుషం మాలో ఉంది...భయపడేది లేదు. నిజాం,రజాకార్లకు పట్టిన గతే బిజేపికి పట్టింది.పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. పదవులను అడ్డం పెట్టుకొని జీవన్ రెడ్డి ఎప్పుడూ అక్రమంగా సంపాదించలేదు. నిజామాబాదు ప్రాంతం వారికి అండగా నిలబడడానికే జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటి చేస్తున్నారు. కొడంగల్ ఓటమి నాకు లాభం తెస్తే, జీవన్ రెడ్డికి జగిత్యాల ఓటమి లాభం చేకూర్చుంది’ అని రేవంత్ పేర్కొన్నారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ చేస్తున్న కుట్రను సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు. -
జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం
-
రివేంజ్ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్ గెలుపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్ తీర్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత పగ పూర్తిగా తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయమై కవిత ట్విట్టర్లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. -
వారసుల నియోజకవర్గం.. టఫ్ ఫైట్.. గెలుపెవరిది..?
-
రైతుబంధుతో దుబారా చేస్తున్నారంటూ కాంగ్రెస్ మాట్లాడుతోంది: కేసీఆర్
-
దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు
సాక్షి, జగిత్యాల: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోరుట్ల టెక్కీ దీప్తి మర్డర్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే.. దీప్తిని ఆమె సోదరి చందనే హత్య చేసినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ప్రాథమిక విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుండగా.. సాయంత్రం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. తన ప్రియుడితో వెళ్లిపోయే క్రమంలో.. దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు చందన ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. కోరుట్ల దీప్తి కేసులో.. సోదరి చందన, ఆమె ప్రియుడు, ప్రియుడి తల్లి, అతని తరపు మరో బంధువు, కారు డ్రైవర్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నాలుగు బృందాలుగా విడిపోయి.. కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక దీప్తి ఆగస్టు 29వ తేదీన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రాత్రి ఆమె చెల్లెలు చందన అదృశ్యమైంది. ఓ యువకుడితో కలిసి బస్టాండ్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. ఈలోపు ఇంట్లో మందు బాటిల్స్ దొరకడం, బస్టాండ్ సీసీటీవీ ఫుటేజీలో ఉంది చందన కాదని నిర్ధారణ కావడం, సోదరిని తాను చంపలేదని చందన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపడం.. చందన ఆచూకీ విషయంలో రకరకాల ప్రచారం కేసును మరింత గందరగోళంగా మార్చేశాయి. దీంతో.. చందన దొరికితేనే ఈ కేసు మిస్టరీ వీడుతుందని పోలీసులు భావించారు. అయినప్పటికీ.. పోలీసులు మాత్రం దీప్తి కేసు దర్యాప్తులో ట్రాక్ తప్పలేదు. దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి తన చిన్న కూతురు చందనతో పాటు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో మూడు, నాలుగు బృందాలుగా విడిపోయి దీప్తి సోదరి చందన జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో.. ఒంగోలు వైపు వెళ్తున్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. టంగుటూరులోని టోల్‌గేట్‌ను తప్పించుకుని ఆలకూరపాడు వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. తనిఖీలు చేపట్టగా.. ఒంగోలులోని ఓ లాడ్జిలో వాళ్లను పట్టుకుని జగిత్యాల పోలీసులకు అప్పగించారు. నిందితులను జగిత్యాలకు తీసుకువచ్చి పోలీసులు విచారించారు. ప్రేమకు నిరాకరణ.. దీప్తితో గొడవ చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చేసింది. ఆ సమయంలో ఓ సీనియర్‌తో ఆమె ప్రేమలో పడింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే వాళ్ల ప్రేమ-పెళ్లికి చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఊరికి వెళ్లిన టైంలో.. దీప్తితో చందన గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆపై ముక్కూ, మూతికి ప్లాస్టర్ వేసిందని, ఊపిరి ఆడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో చందన, ఆమెతో ఉన్న ముగ్గురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. ఆపై డీఎస్సీ భాస్కర్ ఈ కేసుకు సంబంధించి నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి.. పూర్తి వివరాలు సాయంత్రం మీడియాకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కోరుట్ల దీప్తి కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో చందన, ఆమె ప్రియుడు
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల దీప్తి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హైదరాబాద్ శివారులో మృతురాలి సోదరి చందన, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్తి కేసులో నిందితురాలిగా భావిస్తున్న చెల్లెలు చందనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు బృందాలుగా మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్.. వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఇంట్లో ఆమె చెల్లెలు చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రాత్రి ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్న మృతురాలు దీప్తి.. అనుమానాస్పదంగా మృతి చెందింది. చదవండి: కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్నర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. చందన బాయ్‌ఫ్రెండ్ హైదరాబాదీగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా బాయ్ ఫ్రెండ్ వివరాలు పోలీసులు సేకరించారు. ఇద్దరి సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. దీప్తి, చందనలకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడా? లేక స్థానికంగా ఉన్న ఎవరైనా కొనుక్కుని తెచ్చారా? అన్న విషయం తేలలేదు -
Korutla Death Mystery: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్
జగిత్యాల: కోరుట్ల సాఫ్ట్వేర్ దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తాము మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి.. నా తప్పేం లేదు.. ప్లీజ్‌రా నమ్మురా మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుత సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తా!.’’ అంటూ వాయిస్ మెసేజ్‌లో ఉంది. దీప్తి ఒంటిపై గాయాలు కోరుట్ల దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో.. ఇదే హత్యేననే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అనే అనుమానాలు వ్యక్తం కాగా.. తాజా ఆడియోక్లిప్‌తో అవి నిర్ధారణ అయ్యాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడేది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్లు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరాలు తీస్తున్నారు. కేసు నేపథ్యం ఇదే.. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
నమ్మించి పిలిచి.. చంపారు! హత్యపై పలు అనుమానాలు!
జగిత్యాల: ఆదివారం రాత్రి సుమారు 11.30గంటల సమయం.. మెట్పల్లి పట్టణ శివారులోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ అది.. దాని చెంతనే నిర్మానుష్య ప్రదేశం.. ఇద్దరు స్నేహితులు కన్నం సతీశ్, నిఖిల్ అక్కడ కూర్చొని ఏదోవిషయంపై మాట్లాడుకుంటున్నారు.. సరిగ్గా అనెంనడు ఇద్దరు అక్కడకు చేరుకున్నారు.. సతీశ్‌ను తమ వద్దకు రావాలని పిలిచారు. వారి వద్దకు వెళ్లిన సతీశ్ భుజంపై చెయ్యి వేసి కొద్దిదూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు.. ఆ వెంటనే ఒక్కసారిగా దాడికి దిగారు.. అప్రమత్తమైన సతీశ్.. వారిబారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు.. నిఖిల్ అడ్డుకునేందుకు యత్నిచంగా.. దుండగులు చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. గాయాలతో పారిపోతున్న సతీశ్‌ను వెంబడించి మరీ పట్టుకొని కట్టెలు, ఇటుకలతో విచక్షణ రహితంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న సతీశ్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. నాలుగు రోజుల క్రితమే కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు రజాక్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సమయంలోనే సతీశ్ హత్యకు గురికావడం అలజడి సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న పట్టణంలో వరుస హత్యలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహంతో కాలనీవాసుల ఆందోళన.. సతీశ్ మరణవార్త తెలుసుకున్న కాలనీవాసులు పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన ఇన్చార్జి డీఎస్పీ వెంకటస్వామి.. కోరుట్ల, మెట్పల్లి సీఐలతోపాటు పలువురు ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యాక అంబులెన్స్‌లో మృతుడి ఇంటికి తరలిస్తున్నారు. అయితే, మార్గమధ్యంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సంఘటనే కారణమా? ► పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన సతీశ్(27)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరి వయసు ఏడాదిన్నర కాగా, మరొకరి వయసు రెండు నెలలు. ► జక్కం రాజేశ్, నవీన్ కలిసి సతీశ్‌పై దాడిచేసి చంపారని ఇన్చార్జి డీఎస్పీ వెంకటస్వామి సోమవారం విలేకరులకు తెలిపారు. ► అయితే.. పాత పగతోనే రాజేశ్ తన మిత్రుడు నవీన్‌తో కలిసి సతీశ్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ► ఐదేళ్ల క్రితం స్థానిక మినీస్టేడియంలో రాజేశ్, సతీశ్ వర్గాల మధ్య ఓ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ► చాలారోజుల తర్వాత రాజేశ్ కోలుకున్నాడు. అప్పటి నుంచి సతీశ్‌పై కక్ష పెంచుకున్నాడు. అదను చూసి హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ► కేవలం ఈ గొడవేనా.. ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. హంతకులను పట్టుకోవడానికి రెండు బృందాలు ► మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు. ► దోషులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ► సతీశ్‌ను కొట్టి చంపిన బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ► వాటిలో ఈ దృశ్యాలు నిక్షిప్తమై ఉంటాయని భావించిన పోలీసులు.. సీసీ ఫుటేజీలు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. -
కోరుట్ల: కీలక హామీలను మరిచిన అధికార పార్టీ..!
కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికలకు ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం నిజాం చక్కెర కర్మాగారం. తెలంగాణ వచ్చిన తర్వాత చక్కర ఫ్యాక్టరీ మూసి వేయడం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఫ్యాక్టరీ తెరిపిస్తారని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికి తెరవకపోవడం కీలక అంశం. గల్ఫ్ కార్మికుల సమస్య తెలంగాణ వచ్చాకా ఎన్.ఆర్.ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పినా తీసుకురాకపోటం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. పసుపు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపేల ఉంది. సామాజిక వర్గాలవారిగా ఓటర్ల సంఖ్య: పద్మాశాలి :67890 మున్నూర్ కాపులు: 35670 గౌడ్స్: 23560 ముదిరాజులు: 10230 కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా.. బిఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అతని కొడుకు కల్వకుంట్ల సంజయ్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు జువ్వాడి నరసింహారావు, అలాగే మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్, వీరితోపాటు కల్వకుంట్ల సుజిత్ రావు టికెట్ ఆశిస్తున్నాడు. బిజెపి నుండి సీనియర్ నాయకుడు సురభి భూమరావు తనయుడు సూరభి నవీన్, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట్ టికెట్ ఆశిస్తున్నారు. బిఆర్ఎస్ ఉంచి పోటీ చేసేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి పోటిలేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట సంజయ్‌కి టికెట్ ఇచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో జువ్వాడి నర్షింగరావు టికెట్ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కొడుకు కొమిరెడ్డి కరమ్ పోటిపడుతున్నాడు. మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో కొమిరెడ్డి రాములు క్యాడర్ ఉండటం వాళ్ల బలంగా చెప్పుకోవచ్చు, ఒకవేళ కొమిరెడ్డి కరంకు టికెట్ రాకపోతే బిఎస్పి పార్టీ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో నాయకుడు సుజిత్ రావుకు క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేకపోవటం బలహీనతగా చెప్పుకోవచ్చు. ఇక బీజేపి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిపోయిన జేఎన్ వెంకట, సురబి నవీన్ టికెట్ ఆశిస్తున్నారు. నవీన్ ముఖ్యంగా యువకులతో ముందుకు వెళ్తూ టికెట్ రేస్‌లో ఉండగా జేఎన్ వెంకట్ అంతగా ప్రభావం చూపకపోవచ్చు. గతంలో బుగ్గారం నియోజకవర్గంలో ఉన్న మల్లాపూర్ మండలంలోని ఏడు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని నాలుగు, కోరుట్ల మండలంలోని ఐదు గ్రామాలు ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నాయి. బుగ్గారం నియోజకవర్గం ఉన్నప్పుడు రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఆంశం కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలించవచ్చు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి: ► మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాలుగు మండలాల్లో అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేపించారు. అలాగే పెన్షన్స్, రోడ్ల, వంతెనలు నిర్మాణాలు చేపట్టారు. రెండు మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, అలాగే వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ► కోరుట్ల నియోజకవర్గంలో ఆసక్తికరమైన అంశాలు అంటే ప్రతి గ్రామంలో 89% గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. ► కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గెలుపోవటములను పద్మశాలి కులస్థులు ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గంలో పద్మశాలి, గౌడ, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది ► కోరుట్ల,మెట్ పల్లి పట్టణాల్లో అధికశాతం ముస్లీంలు ప్రభావితం చెయ్యవచ్చు నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఐదు ఎకరాల మర్రిచెట్టు పర్యాటక కేంద్రంగా ఉంది. కోరుట్ల మండలం నాగులపేట శివారులో సైఫాన్. కోరుట్ల పట్టణంలో రెండవ శిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం ఉంది. -
జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ రాజకీయ చరిత్ర
కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత కె.విద్యాసాగరరావు మరోసారి విజయం సాదించారు. ఆయన 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు గెలిచారు. 2018 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది జె.నర్సింగరావుపై 31220 ఓట్ల మెజార్టీతో విసయం సాదించారు. విద్యాసాగరరావుకు 84605 ఓట్లు రాగా, నరసింగరావుకు 53385ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది డాక్టర్ వెంకట్‌కు పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడోస్థానానికి పరిమితం అయ్యారు. విద్యాసాగరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గం తమ పట్టు నిలబెట్టుకుంటూ వస్తోంది. రెండువేల తొమ్మిది నుంచి కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. కోరుట్ల, అంతకుముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గాలలో కలిపి వెలమ సామాజికవర్గం నేతలు ఏడుసార్లు విజయం సాధిస్తే, రెడ్లు నాలుగు సార్లు, బిసిలు రెండుసార్లు, ఇతరులు రెండుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి రత్నాకరరావు బుగ్గారం నుంచి ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఐదుసార్లు, టిడిపి రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం మరో ప్రత్యేకత. కోరుట్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
విద్యుత్ సిబ్బందిని బంధించిన రైతులు
కోరుట్ల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా ధర్మారం రైతులు మంగళవారం సబ్‌స్టేషన్ సిబ్బందిని కార్యాలయం గదిలో బంధించి తాళం వేశారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ రంగానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో నీళ్లు అందక వరి, మక్క, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కోరుట్ల–మల్లాపూర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. మల్లాపూర్ ఏడీఈ శ్రీనివాసరావు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో సిబ్బందిని విడుదల చేసి ఆందోళన విరమించారు. -
రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర..
కోరుట్ల: ఆర్థిక లావాదేవీలు.. వృత్తిపరమైన పోటీని తట్టుకోలేక ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి సహా నలుగురు సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసి 2 కార్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. బుధవారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ధనకంటి సంపత్(35) ఆర్ఎంపీగా పనిచేసూ్తనే చిట్టీలు, ఫర్నీచర్ షాపు నిర్వహించేవాడు. సంపత్ సొంత బావమరిది, రాయికల్‌కు చెందిన సంకోజి విష్ణువర్ధన్(32) తన బావమరిది అజయ్(28)తో కలిసి చిట్టీలు, ఫర్నీచర్ షాపు నడపడంలో సంపత్‌కు ఆర్థికంగా సాయం చేశాడు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. ఫర్నీచర్ షాపు, చిట్టీల వ్యవహరంలో సంపత్‌కు అతడి బావమరిది విష్ణువర్ధన్, అజయ్‌కు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వీటితోపాటు తన కుటుంబంలో విష్ణువర్ధన్ తరచూ జోక్యం చేసుకోవడం సంపత్‌కు కంటగింపుగా మారిది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌తోపాటు అజయ్‌ను అడ్డుతొలగిస్తే అత్తగారి ఆస్తి మొత్తం తనకు కలిసివస్తుందన్న దురాశ సంపత్లో కలిగింది. రెండేళ్ల క్రితం విష్ణువర్ధన్ అనారోగ్యానికి గురికాగా, సంపత్ వైద్యం అందించి కావాలని ఓవర్‌డోస్ ఇంజక్షన్లు ఇచ్చి హత్యకు యత్నించాడు. ఆ తర్వాత విష్ణువర్ధన్ కోలుకోగా తన ప్రయత్నం ఫలించలేదని భావించిన సంపత్.. నాలుగు నెలల క్రితం ఓ హత్యాయత్నం కేసులో నిందితుడైన పైడిమడుగు గ్రామానికి చెందిన క్యాతం శేఖర్(26)ను కలిసి విష్ణువర్ధన్, అజయ్‌తోపాటు వృత్తిలో పోటీగా ఉన్న పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్‌ను హత్య చేయడానికి తనకు సహకరించాలని కోరాడు. రూ.14లక్షల సుపారీకి ఒప్పందం.. క్యాతం శేఖర్ పైడిమడుగుకు చెందిన మేదిని శ్రీకాంత్(28), కోరుట్లకు చెందిన విత్తనాల నాగరాజు(40), ఆకుల అశోక్‌తో కలిసి విష్ణువర్ధన్, అజయ్, రాజేందర్‌ను చంపడానికి రూ.14 లక్షల సుపారీకి సంపత్తో ఒప్పందం చేసుకున్నాడు. తొలుత రాజేందర్‌ను చంపితే రూ.4లక్షలు, తర్వాత విష్ణువర్ధన్, అజయ్‌ను చంపితే మిగిలిన రూ.10 లక్షలు ఇస్తానని సంపత్తో ఒప్పందం చేసుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన తర్వాత డబ్బులు చెల్లించడంలో సంపత్ జాప్యం చేశాడు. డిసెంబర్ 5వ తేదీన సంపత్తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్న ఆకుల అశోక్, మేదిని శ్రీకాంత్.. హత్య కుట్రలో ఒకరైన పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్ ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి బయటకు పిలిచారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో ఇరుగుపొరు రావడంతో అశోక్, శ్రీకాంత్ అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆర్ఎంపీ రాజేందర్, సంకోజి విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఎస్సైలు చిర్ర సతీశ్, శ్యాంరాజ్, సుధీర్‌రావు, రాంచంద్రం.. సుపారీ ఒప్పందం చేసుకుని హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, మేదిని శ్రీకాంత్, ఆకుల అశోక్, విత్తనాల నాగరాజు, క్యాతం శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ, కోరుట్ల సర్కిల్ పరిధిలో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సొంత బావమరిదితోపాటు మరో ఇద్దరి హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, సుపారీ గ్యాంగ్ సభ్యుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్పోన్లు స్వా«ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించి, ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులకు రివార్డు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ వివరించారు. చదవండి: భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు.. -
రహస్య జీవోలు ఇంకా ఎన్ని ఉన్నాయో: షర్మిల
కోరుట్ల: దొంగలు కాబట్టే సీబీఐ దర్యాప్తు వద్దంటున్నారని టీఆర్ఎస్ తీరును వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చూసిందని ప్రచారం చేసి మునుగోడులో సానుభూతితో ఓట్లు రాబట్టేందుకు టీఆర్ఎస్ తాపత్రయ పడుతోందన్నారు. ‘రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టడానికి వీలు లేదట.. కొత్తగా రహస్య జీవోను ముందుకు తెచ్చారు. అసలు ఈ జీవో ఒకటి ఉందన్న విషయమే తెలియదు. సీక్రెట్‌గా ఉంచారన్న మాట. ఇలాంటి రహస్య జీవోలు ఇంకా ఎన్ని ఉన్నాయో?’అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు సీబీఐ అంటే ఎందుకంత భయమని, నిజాయితీ పరులైతే భుజా లు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ఇన్నిరోజులు ప్రగతి భవన్ లో ఎందుకు దాచి ఉంచారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సీఎంగా ఉన్నారా? లేదా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లకు మాత్రమే సీఎంగా ఉన్నారా? అని ఎద్దేవాచేశారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని షర్మిల మండిపడ్డారు. -
మూడు పట్టణాలకు ‘స్వచ్ఛత’ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు స్వచ్ఛత అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) పోటీల్లో రాష్ట్రంలోని పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు ఈ అవార్డులు సాధించాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. ఈ నెల 17న ఐఎస్ఎల్ పోటీని నిర్వహించగా, దేశంలోని 1,850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణకు మూడు అవార్డులు రాగా, ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వచ్చిన 16 అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కినట్లయింది. ఐఎస్ఎల్ పోటీల్లో భాగంగా అన్ని పట్టణాలు తాము చేపట్టిన ఫ్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు. మూడు కేటగిరీల్లో అవార్డులు జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా జరిగిన పోటీలో 15వేల లోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో అలంపూర్ అవార్డుకు ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈ నెల 30న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డులు పొందిన పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కె.తారకరామారావు అభినందనలు తెలిపారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా... కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ అవార్డులు సాధించిందని మంత్రి అన్నారు. కాగా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, అభివృద్ధి చేస్తున్న సీఎంలకు సహకరిస్తే దేశం బాగుపడుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదని... అధికారం ఉన్నపుడు మంచి చేస్తే చరిత్రలో నిలుస్తారన్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రానికి అవార్డులకు బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
కాళ్లు మొక్కుతం, కనికరించండన్నా.. పట్టించుకోలేదు!
‘సారూ..బిడ్డ పురిటినొప్పులతో బాధపడ్తోంది..ఆ గోస సూడలేకపోతున్నం.. బాంచెన్.. ఆపరేషన్ జేయుండ్రి.. మీ కాళ్లు మొక్కుతం..కనికరం సూపుండ్రి..’అని కాళ్లుపట్టుకుని వేడుకున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. పండంటి బిడ్డ పుట్టబోతుందని ఆశపడ్డ ఆ తల్లికి వైద్యులు సిజేరియన్ చేసి చనిపోయిన శిశువును చేతిలో పెట్టడంతో నిరాశ ఎదురైంది. మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన ఎర్రబోయిన అశోక్ భార్య సుజాత(22)కు ఇటీవలే నెలలు నిండాయి. తొలికాన్పు కావడంతో ఈనెల 19న మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే, సాధారణ ప్రసవం కోసం మరుసటిరోజు సాయంత్రం వరకూ వైద్యసిబ్బంది ప్రయత్నం చేశారు. ప్రసవం కాకపోవడంతో సిజేరియన్ చేయాలని, లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని కుటుంబసభ్యులు వేడుకున్నారు. సిబ్బంది అంగీకరించకపోగా, కుటుంబసభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వరకూ పురిటినొప్పులతో బాధపడ్తున్న సుజాతకు చివరికి వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే.. అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆపరేషన్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజిద్‌ను¯ ఆరాతీయగా..సుజాతకు ఈనెల 21న ప్రసవం చేయాల్సి ఉందన్నారు. అప్పటిదాకా సాధారణ ప్రసవం కోసం యత్నించామని తెలిపారు. వీలుకాకపోవడంతో సిజేరియన్ చేశామని, మృతశిశువు జన్మించిందని, ఇందులో సిబ్బంది పొరపాటు ఏమీలేదని స్పష్టం చేశారు. -
మునావర్‌కు భారీ బందోబస్తు.. మరి నాకు ఎందుకివ్వరు?
కోరుట్ల: ‘మునావర్ షో ప్రోగ్రామ్‌కు ఐదు వందల మంది పోలీసుల బందోబస్తు పెడ్తరు.. నాకేమో ఇస్తలేరు. ఎర్దండి దగ్గర నాకు కావాలనే బందోబస్తు తక్కువ పెట్టారు. దీంతో కొంత మంది నా కారుపై రాళ్లు వేశారు. నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. నేను కోరుట్ల వెళ్లాలంటే శాంతి భద్రతల సమస్య అంటున్నరు. నాకు ప్రొటెక్షన్ ఇవ్వ లేరా? మీరు ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తున్నరు. ఆయన చెబితే వచ్చారా..?’ అంటూ ఎంపీ అర్వింద్ పోలీసులపై మండిపడ్డారు. విశ్వబ్రహ్మణుల సమస్యలపై కోరుట్లలో సమావేశానికి హాజరవ్వడానికి ఎంపీ అర్వింద్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరారు. సరిగ్గా జగిత్యాల జిల్లా సరిహద్దు కమ్మర్పల్లి గండి వద్దకు చేరుకోగానే ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌ను మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి సీఐలు రాజశేఖర్‌రాజు, శ్రీను, ఎస్సైలు అడ్డుకుని తిరిగివెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల సమస్య కారణంగా తమకు సహకరించాలని కోరారు. అయితే, కావాలనే తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పోలీసులపై ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. ప్రతీసారి తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు సిగ్గుచేటని, తీరు మార్చుకోవాలని సూచించారు. -
దొంగచాటుగా మహిళల ఫొటోలు తీసి.. ట్విటర్లో పెట్టి..
సాక్షి, జగిత్యాల జిల్లా: అతడో వాటర్ బబుల్ బాయ్.. మినరల్ వాటర్ సరఫరా చేస్తూ.. అదను చూసి దొంగచాటుగా మహిళల ఫొటోలు చిత్రీకరించాడు.. ఓ మహిళ పేరిట ట్విటర్ ఖాతా తెరిచాడు.. సుమారు 400 ఫొటోలను అందులో అప్లోడ్ చేశాడు.. విషయం తెలిసిన బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి నల్ల రవి(34) మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకీన్పూర్, సంగెం గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వాటర్ బబుల్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల ఫొటోలను మొబైల్ ఫోన్లో దొంగచాటుగా చిత్రీకరించాడు. సుమారు ఏడాదిగా దాదాపు 400 మంది మహిళలను ఫొటోలు తీసినట్లు సమాచారం. ఇలా తీసిన ఫొటోలను మంగళవారం ఉమ పేరిట ట్విటర్ ఖాతా తెరిచి అందులో అప్లోడ్ చేశాడు. వీటిని చూసిన సంగెం గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ వెంటనే కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం ఎస్సై సతీశ్‌కుమార్ ప్రయత్నించగా మొబైల్ ఫోన్‌స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆరా తీయగా ఇంట్లో కూడా లేడని తెలిసింది. అయితే, ట్విటర్లోని ఫొటోలు వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే, ఈ ఫొటోలు అశ్లీలంగా లేవని తెలిసింది. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారనుంది. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాపై బీజేపీ రాష్ట్ర నేతలు గానీ, ఎంపీ అర్వింద్ గానీ దృష్టి సారించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గెలిచినా పార్టీ పటిష్టం కాలేదు. జగిత్యాలకు ప్రత్యేక స్థానం రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల సీటు ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజార్టీతో సాధించుకున్నారు జీవన్‌రెడ్డి. టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు ఎమ్మెల్యే సంజయ్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలకు, నిరసనలకు మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? జగిత్యాల నుంచి పోటీకి ఆ ఇద్దరి ప్రయత్నాలు అయితే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ఎల్. రమణ టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. బీజేపీ సైతం ఉనికి పోరాటాలకే పరిమితం అయ్యిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాల కూడా అందులో ఉండటంతో కొంత జోష్ పెరిగినా వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. కొడుకును రంగంలోకి దింపనున్న విద్యాసాగర్ కోరుట్లకు విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నుంచి విద్యాసాగర్ తన కుమారుడు సంజయ్‌ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ హైదరాబాదులో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల వాతావారణం రావడంతో సంజయ్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్ది రాములు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు నర్సింగరావు పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన జేయన్ వెంకట్ టికెట్టు ఆశిస్తున్నారు. చదవండి: గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం.. టీఆర్ఎస్లో కుమ్ములాటలు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం ధర్మపురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్లో స్థానికంగా కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మీద కొప్పుల ఈశ్వర్వి జయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎలాగైనా ఈసారైనా ఈశ్వర్‌ను ఓడించాలని లక్ష్మణ్ కుమార్పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పి టీఆర్ఎస్లో వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం లింక్ 2 లో భాగంగా పైపులైన్ వేసిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. రోడ్ల వెడల్పులో ఇళ్ళు కోల్పోయినవారికి పరిహారం అందక వారు అధికార పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 15 వార్డుల్లో టీఆఆర్ఎస్ ఎనిమిది, కాంగ్రెస్ ఏడు వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు తరువాత బీజేపీలో చేరిన గడ్డం వివేక్‌కు రెండు పార్టీల కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ధర్మపురిలో బీజేపీ తరపున నిలిచి గెలవాలని ఆయన ఆశిస్తున్నారు. -
Photo Feature : ప్రకృతి గీసిన మల్లాపూర్ అందాలు
పచ్చని పల్లె ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. ఏటా శ్రావణమాసంలో మల్లాపూర్ శివారు సోమేశ్వర కొండపైన కొలువుదీరిన శ్రీకనకసోమేశ్వర స్వామిని దర్శించుకు నేందుకు తరలివచ్చే భక్తులు ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకించిపోతుంటారు. పచ్చని పొలాలు, గుట్టల మధ్యన ప్రకృతి గీసిన మల్లాపూర్ (పల్లె) అందాన్ని సోమవారం భక్తులు సోమేశ్వర కొండపై నుంచి ఆస్వాదిస్తూ ఆనందించారు. -మల్లాపూర్(కోరుట్ల) -
గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డెన్ దారుణం.. విద్యార్థిని తంతూ, కొడుతూ..
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. డార్మేటరీ రూమ్‌కు వెళ్లాడని.. తాను చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో.. విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ కొట్టాడు. రాజును కిందపడేసి కాళ్లతో తంతు పిడిగద్దులు కురిపించాడు. విద్యార్థి ప్రాదేయపడ్డా కూడా కనికరించకుండా మరింతగా రెచ్చిపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. కాలేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో... డిప్యూటీ వార్డెన్ నయీమ్‌పై విచారణ చేపట్టారు. విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను సస్పెండ్ చేశామని రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ సయ్యద్ హమీద్ తెలిపారు. బాధిత విద్యార్థి రాజు స్వస్థలం జమ్మికుంట అని పేర్కొన్నారు. చదవండి👇 లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. హరీష్‌రావు రియాక్షన్ ఇది సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి -
ప్రేమజంట నిర్వాకం: పెద్ద కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుతో రెండో కూతురు
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): ఆ తండ్రికి ముగ్గురు కూతుళ్లు.. పొట్టచేత పట్టుకుని ఎడారి దేశం వెళ్లాడు.. కడుపు కట్టుకుని.. పైసాపైసా కూడబెట్టుకున్నాడు.. ఆ సొమ్ముతో ముందుగా పెద్దకూతురు వివాహం చేయాలని నిశ్చయించాడు.. కానీ, ప్రేమికుడితో కలిసి రెండోకూతురు ఆ సొమ్మును పట్టుకుని ఎటో వెళ్లిపోయింది.. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్నెగూడేనికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి వెతుక్కుంటూ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. తన ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురు వివాహం చేద్దామని భావించాడు. నెలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇన్నాళ్లూ కూడబెట్టిన రూ.6.40లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో నిల్వచేశాడు. బాధితుడికి డబ్బు అందిస్తున్న సీఐ రాజశేఖర్‌రాజు గమనించిన ఆయన రెండో కూతురు.. ఆ సొమ్ము తీసుకుని తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి పదిరోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తండ్రి.. ఈ విషయంపై కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. మేడిపెల్లి ఎస్సై సుధీర్‌రావు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, విజయ్‌తో కలిసి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ బృందం ఖమ్మం జిల్లా కూసుమంచిల ఆ ప్రేమజంటను గుర్తించి చాకచక్యంగా పట్టుకుంది. బుధవారం సీఐ రాజశేఖర్‌రాజు ఎదుట హాజరుపర్చింది. ఆ జంటనుంచి రూ.6లక్షలు రికవరీ చేశారు. పోలీసు బృందాన్ని మెట్పల్లి డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందించారు. ఈ సొమ్మును సీఐ రాజశేఖర్‌రాజు బాధితుడికి అందజేశారు. తన పెద్దకూతురు వివాహం కోసం దాచిన సొమ్ము మళ్లీ తన వద్దకు రావడంతో ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. సీఐ మాట్లాడుతూ, యువత తల్లిదండ్రులను నమ్మించి ప్రేమపేరిట మోసపోవద్దని సూచించారు. ఎస్సైలు సతీశ్, శ్యామ్‌రాజ్ పాల్గొన్నారు. -
సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త
కోరుట్ల: సీక్రెట్ యాప్‌ను రహస్యంగా తన ఫోన్లో ఇన్స్టాల్ చేసి భర్త తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అనుమానంతో వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రాజు వివరాల ప్రకారం.. కోరుట్లకు టి.నర్సింహాచలం (48) తన భార్య అనిత ఫోన్లో ఓ సీక్రెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేశాడు. ఆ యాప్‌తో ఆమె ఫోన్‌ను ట్రేస్ చేయడం మొదలుపెట్టాడు. దీంతోపాటు ఆమె ఫోన్‌ను కూడా భర్తే ఆపరేట్ చేస్తున్నాడు. వీటితోపాటు ఆమె వాట్సాప్ చాటింగ్ చూడటం, ఆడియో రికార్డింగ్ వినడం వంటివి చేస్తున్నాడు. ఈ తనకు తెలియకుండా ఫోన్‌ను అతడు అనుసంధానం చేసి వాటితో వీడియో షూటింగ్ కూడా చేసేవాడు. ఈ విషయం భార్య ఆలస్యంగా గుర్తించి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా భర్త నర్సింహాచలం భార్య ఫోన్లో చేసిన నిర్వాకాన్ని అంగీకరించాడు. కొన్నేళ్ల కిందట ఇంట్లో నుంచి పోయిన బంగారం విషయంలో ఆరా తీయడానికి ఈ సీక్రెట్ యాప్ ఇన్స్టాల్ చేసినట్లు నిందితుడు చెప్పాడని సీఐ తెలిపారు. ఇదే రీతిలో మరో ఇద్దరు బంధువుల ఫోన్లలోనూ సీక్రెట్ యాప్ వారికి తెలియకుండా ఇన్స్టాల్ చేసినట్లు విచారణలో తేలింది. బంధువుల ఫోన్లలో సీక్రెట్ యాప్‌ను ఎందుకు ఇన్స్టాల్ చేశాడన్న విషయంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింహాచలంపై 498, 354 (సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి) చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది
కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్‌లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. -
ఆదుకున్న ‘భృతి’
కోరుట్ల: అసలే అరకొర పనులతో అవస్థలు పడుతున్న బీడీ కార్మికుల ఉపాధికి కరోనా గండికొట్టింది. బీడీలు చేసి కుటుంబాలను పోషించుకోవడం తప్ప ఇతర పనులు చేసుకోలేని కార్మికులకు జీవనభృతి ఆసరాగా నిలిచింది. మినీ సిగరేట్లతో బీడీ కార్మికుల ఉపాధి ఇప్పటికే ప్రశార్థకంగా మారగా..కరోనా లాక్డౌన్ మరింత సమస్యల్లోకి నెట్టింది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. రెండురోజులకోసారి.. గతేడాది సుమారు 9 నెలలపాటు సాగిన కరోనా లాక్డౌన్ ఫలితంగా పూర్తి స్థాయిలో బీడీ కంపెనీలు బంద్ కాగా చాలా మంది కార్మికులు వర్ధి బీడీలు చేసి కంపెనీలు ఇచ్చినంత కూలి తెచ్చుకొని కాలం గడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం మొదట నైట్ కర్ఫ్యూ ప్రక టించింది. మేలో పాజిటివ్ కేసులు మరింత పెరగడంతో 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సమయంలో రెండురోజులకోసారి బీడీ కంపెనీలు కార్మికులకు పనులు కల్పించాయి. నెలకు పదిరోజులకు మించి బీడీ కార్మికులకు పని దొరకలేదు. మే 12 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌తో కంపెనీలు బంద్ చేయడంతో కార్మికులకు పూర్తిగా ఉపాధి కరువై నానాతిప్పలుపడ్డారు. మూడునెలలపాటు.. లాక్డౌన్లో సుమారు 3 నెలలపాటు అరకొర పనులు ఉండడంతో ఇబ్బందులుపడ్డ బీడీ కార్మికులను సర్కార్ అందిస్తున్న జీవన భృతి ఆదుకుంది. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా 84 వేల మందికి పింఛన్ కింద ప్రతీ నెల రూ.2వేల జీవనభృతి అందుతోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీడీ తయారీ కుంటుపడిన కాలంలో కార్మికులు పింఛన్ డబ్బుతో కాలం వెల్లదీశారు. పింఛన్ రాకుంటే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినా బీడీ కంపెనీలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీనెల 26 రోజులపాటు పనులు కల్పించాల్సి ఉంటుంది. బీడీ పింఛనే దిక్కయింది కరోనాతో బీడీ కంపెనీలు రెండునెలలపాటు బంద్ పాటించాయి. రోజు 800 నుంచి వెయ్యి బీడీలు చేసి నెలకు రూ.4 వేల దాకా సంపాదించుకునే మేము రెండునెలలు పనులు లేక తిప్పలు పడ్డాం. అంతో ఇంతో బీడీ పింఛన్ రూ.2వేలు రావడం మాకు ఆసరా అయింది. – పొలాస లక్ష్మి, కోరుట్ల పూర్తి పనులు కల్పించాలి కరోనా లాక్డౌన్ ఎత్తివేసి వారంరోజులు గడుస్తుంది. ఇప్పటికీ బీడీ కంపెనీలు రోజు విడిచి రోజు ఆకు తంబాకు ఇస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేసినట్లే కానీ కంపెనీలు మాత్రం పూర్తిగా పనివ్వడం లేదు. నెలరోజుల్లో కనీసం 20 రోజులైనా పని ఇస్తే బీడీల తయారీపై ఆధారపడిన మాకు కొంత మేలు జరుగుతుంది. – గోనె సరోజ, బీడీ వర్కర్, కోరుట్ల -
మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్‌లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం. మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు.. మల్యాల.. మెరిసేనిలా గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చక్రాపూర్కు చక్కని గుర్తింపు గ్రామం: చక్రాపూర్ జిల్లా: మహబూబ్‌నగర్ మూసాపేట(మహబూబ్‌నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్‌లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిట్టపల్లి.. మిలమిల గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రుయ్యాడి.. ఐక్యత దండి గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్ తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ధర్మారం.. పనితీరులో బంగారం మండలం: ధర్మారం (మండల పరిషత్), జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్‌కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది. సుందిల్ల.. డబుల్ ధమాకా గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది. కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా.. మండలం: కోరుట్ల (మండల పరిషత్) జిల్లా: జగిత్యాల కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్‌కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది. పిల్లల అభివృద్ధి.. వికాసం గ్రామం: మోహినికుంట, జిల్లా: రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ‘సిరి’దాస్‌నగర్ గ్రామం: హరిదాస్‌నగర్ జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్‌నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి. పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్ తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్‌దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది. పాలనలో భేష్.. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్) సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్‌కు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. -
కట్టుకున్నోడే పుస్తేలు తెంపేశాడు!
కోరుట్ల: తాళి కట్టిన భర్త పుస్తెల తాడు లాక్కెళ్లడంతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించి కెనాల్ వద్ద కళ్లు తిరిగిపడిపోయిన ఘటన మహిళా దినోత్సవం రోజు కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన ఎన్నమనేని హర్షిత అలియాస్ నాగరాణి(25)కి ఆరు నెలల క్రితం కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన ఎన్గందుల రాజేందర్(41)తో వివాహమైంది. రాజేందర్‌కు రెండో వివాహం కాగా కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ప్రతీరోజు రాజేందర్ తాగి వచ్చి హర్షితను కొట్టడం, తిట్టడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన హర్షిత కొన్ని రోజుల క్రితం గంభీర్‌పూర్‌కు వచ్చింది. శనివారం రాత్రి గంభీర్‌పూర్‌కు వచ్చిన రాజేందర్ మళ్లీ హర్షితతో గొడవపడి ఆదివారం ఉదయం పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గంభీర్పూర్ నుంచి కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లింది. అక్కడ నీటి ప్రవాహాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోయింది. చుట్టుపక్కల రైతులు ఆమెను గమనించి వివరాలు తెలుసుకుని వెంటనే బంధువులకు సమాచారమిచ్చారు. కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే హర్షిత పెద్దమ్మ కారంగుల శ్యామల కెనాల్ వద్దకు వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. హర్షిత ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తనకు న్యాయం చేయాలని హర్షిత కోరుతోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, ఇందులో భాగంగానే ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధులను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రామాలయం నిర్మాణ నిధి కోసం తాము ఎవరిని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మందిర నిర్మాణానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు కలెక్షన్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. -
రెసిడెన్షియల్ కాలేజీలో 75 మందికి కరోనా
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. పాజిటివ్ వచ్చిన వారిలో 67 మంది విద్యార్థినులు కళాశాలలో కొత్తగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిన వారే కావడం గమనార్హం. పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌లు రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ, సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమ పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. (టీకాకూ ఓ లెక్కుంది..) కళాశాలలో 730 సీట్లు ఉండగా ప్రథమ సంవత్సరం విద్యార్థినులు నెల రోజులుగా ఇక్కడ తరగతులకు హాజరవుతున్నారు. శనివారం ఈ కళాశాలలో వైద్యాధికారులు సుమారు 283 మంది విద్యార్థినులు, 12 మంది అధ్యాపకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 67 మంది విద్యార్థినులు, మరో 8 మంది అధ్యాపకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో శ్రీధర్, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌ల అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. (అందరికీ కరోనా వ్యాక్సిన్) -
పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే..!
సాక్షి, కోరుట్ల : అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు వైద్యుడిగా స్థిరపడితే ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు.. పెళ్లి చేసి, మురిసి పోవాలని ఆశపడితే రోడ్డు ప్రమాదంలో అతని మృతి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. పది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన కుమారుడి మృతదేహాన్ని చూసి, ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన సంఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లాలోని ముష్టిపల్లికి చెందిన గన్నమనేని చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ డ్రైవర్ పని చేసి, రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో ఉండగానే కోరుట్లలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వరూప, ఇద్దరు కుమారులు సంతోష్‌రావు, సవ్యసాత్వి ఉన్నారు. కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు వైద్యుడిగా కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు సవ్యసాత్వి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్‌రావు(29)కు కరీంనగర్‌లోని ఓ వైద్యురాలితో రెండు నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 26ను పెళ్లి పెట్టుకున్నారు. చదవండి: ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా అతని తమ్ముడు సవ్యసాత్వి అన్న పెళ్లి కోసం అమెరికా నుంచి వారం రోజుల కిందటే కోరుట్లకు చేరుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి పెళ్లి పనులు చూస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు సంతోష్‌రావు తన స్నేహితుడితో కలిసి సొంత కారులో శనివారం కోరుట్లకు బయలుదేరాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్‌రావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎదిగిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. సంతోష్‌రావు మృతదేహాన్ని చూసేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అతని మృతదేహానికి, జిల్లెడు చెట్టుకు పెళ్లిచేసి, అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేశారు. -
మారని తీరు, భార్య చేతిలో భర్త ఖతం
సాక్షి, జగిత్యాల: నిత్యం తప్పతాగి వేధిస్తున్న భర్తను ఓ భార్య హతమార్చిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లెలో జరిగింది. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు కథనం ప్రకారం.. రాయికల్ మండల కేంద్రానికి చెందిన అలకుంట లక్ష్మయ్య (38)కు కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కళావతికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసైన లక్ష్మయ్య రోజూ తాగి గొడవం చేయడం ఆనవాయితీగా మారింది. దీంతో కళావతిని ఆమె తల్లిదండ్రులు తిమ్మయ్యపల్లికి తీసుకొచ్చి తమ వద్దే ఉంచుకున్నారు. అయినా లక్ష్మయ్య తన తీరు మార్చుకోకుండా తిమ్మయ్యపల్లికి వచ్చి భార్యాబిడ్డలను వేధించేవాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి లక్ష్మయ్య తాగొచ్చి భార్య కళావతి, అత్త ఎల్లవ్వతో గొడవపడగా ఘర్షణలో ఎల్లవ్వ తలకు తీవరగాయమైంది. దాంతో రాత్రి ఎల్లవ్వ కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లేసరికి లక్ష్మయ్య తప్పతాగి పడిపోవడంతో గ్రామస్తులకు చెప్పి తిరిగొచ్చారు. గ్రామస్తులు లక్ష్మయ్యను పంచాయతీ భవనం వద్ద కట్టి ఉంచారు. కాగా, అర్ధరాత్రి తర్వాత కట్లు విప్పుకున్న లక్ష్మయ్య కత్తి తీసుకుని భార్య కళావతి, అత్త ఎల్లవ్వపై మరోసారి దాడికి ప్రయత్నించాడు. దాంతో గ్రామస్తులు మళ్లీ అతడిని తాళ్లతో కట్టేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి లక్ష్మయ్య దగ్గరికి వెళ్లిన కళావతి కర్రతో అతడి తలపై బాది, కత్తితో గొంతులో పొడిచి చంపింది. లక్ష్మయ్యను తానే చంపేశానని ఆదివారం ఉదయం కళావతి పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. కళావతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
కరోనా: ఆత్మ బంధువులు!
సాక్షి, కరీంనగర్: కష్టకాలం..ఎవరు ఎలా చనిపోయినా కరోనాతోనే కావొచ్చని బంధువులు కనీసం అంతిమకర్మలు నిర్వహించలేని దీనస్థితి. తోబుట్టువులు దగ్గరి బంధువులు ఎవరూ అంత్యక్రియలకు ముందుకు రాని పరిస్థితి. కరోనా మృత్యుకోరల్లో మానవత్వం కనుమరుగవుతున్న తరుణంలో కోరుట్లకు చెందిన కొంత మంది యువకులు అంత్యక్రియలు నిర్వహించడానికి సహాయకులుగా ఉండేందుకు ముందుకు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెరుగుతున్న కేసులు కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రతీరోజు జిల్లాలో 80–120 వర కు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండునెలల్లో సుమారు 8 మంది కరోనాతో మృతిచెందారు. జిల్లాలో సుమారు 230 మంది హోం ఐసోలేషన్, ఇంకొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంత మంది కరీంనగర్, హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. వరుసగా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో జనంలో భయాందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో ఎవరైనా సాధారణంగా చనిపోయినా కరోనాతో చనిపోయారనే అనుమానంతో దహన సంస్కారాలకు బంధువులు కూడా ముందుకు రాని దయనీయ స్థితి నెలకొంది. బృందంగా ఏర్పడ్డ యువకులు రెండు రోజుల క్రితం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ మహిళ కరోనా పరీక్షల కోసం వచ్చి అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఆ రోజు పట్టణానికి చెందిన అబ్దుల్ రబ్, ఇషాక్, నసీర్ అలీ, అన్సార్, సోయబ్, ఇమ్రాన్ అనే యువకులు స్పందించి మహిళ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలకు సహకరించారు. సోమవారం కోరుట్ల పట్టణంలోని జవహర్రోడ్డులో ఓ వ్యక్తి మృతిచెందాడు. అతడు కరోనాతో మృతిచెందాడనే అనుమానంతో బంధువులు ఎవరూ అంత్యక్రియల్లో పాలు పంచుకోలేదు. ఈ క్రమంలో అబ్దుల్ రబ్ బృందం వారి ఇంటికి వెళ్లి సదరు వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది. సహాయకులుగా వ్యవహరిస్తున్న ఈ బృందం సభ్యులు పూర్తిస్థాయి పీపీఈ కిట్లు ధరించడంతోపాటు శానిటైజర్లు, మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయం చేయడం మానవధర్మం కరోనాతో చనిపోయినా, సాధారణ మరణమైనా అంత్యక్రియలకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్నేహితులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డాం. అందరం పూర్తిస్థాయి పీపీఈ కిట్లు వేసుకుని జాగ్రత్తగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. దాతలు పీపీఈ కిట్లు ఇవ్వడానికి సహకరిస్తే మేలు చేసినవారవుతారు. – అబ్దుల్‌రబ్, కోరుట్ల -
మద్యం మత్తులో వీరంగం.. అంతలోనే విషాదం
సాక్షి, జగిత్యాల : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన వీరంగం చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ యువకుడు పుటుగా మద్యం తాగి మత్తులో ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం కావడంతో పూటుగా మద్యం సేవించాడు. అనంతరం సోగుకుంటూ వస్తూ రోడ్డుపై వెళ్లే వారి మీద రాళ్లు రువ్వాడు. పెద్దగా కేకలు పెడుతూ.. కాసేపు వీరంగం సృష్టించాడు. తమపై ఎక్కడ దాడి చేస్తాడనే భయంతో చుట్టపక్కనున్న ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
మావోయిస్టు నేత దేవ్‌జీ భార్య ఎన్కౌంటర్
కాళేశ్వరం/కోరుట్ల/చర్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ భార్య సృజనక్క (48) ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా జారవండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీన్‌బట్టి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే కథనం ప్రకారం.. మావోయిస్టులు రహస్య ప్రదేశంలో సమావేశమైనట్లు సమాచారం రావడంతో శనివారం సాయంత్రం పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టు కసన్సూర్ దళం డివిజన్ ఇన్చార్జి సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారని పేర్కొన్నారు. సృజనక్క ఇరవై ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తోందని, ఆమెపై రూ.16 లక్షల రివార్డు ఉందని, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. సంఘటన స్థలంలో ఏకే 47, ప్రెషర్ కుక్కర్, క్లైమోర్మైన్, విప్లవ సాహిత్యాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవ్‌జీది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల కాగా, సృజనక్క స్వస్థలం గడ్చిరోలి జిల్లా అహేరి. కొన్నేళ్లుగా వీరిద్దరు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. -
పాపం.. పసివాడు
పదకొండు నెలల ఓ పసిబాలుడు సీసం గోలి మింగి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదాన్ని నింపింది. స్థానిక పోచమ్మగల్లీకి చెందిన కోరుట్ల రవిరాజ్ మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో కార్యదర్శిగా పనిచేస్తూ జగిత్యాలలో నివసిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రవిరాజ్ ఆయన భార్య అపర్ణ, కూతురు శాన్వీ (3), బాబు అభియాత్ (11 నెలలు)లతో కలిసి కోరుట్లకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం శాన్వీ, అభియాత్‌తో కలసి సీసం గోలీలతో ఆడుకునే క్రమంలో అభియాత్ గోలిని మింగాడు. శ్వాస తీయడం ఇబ్బందిగా మారడంతో గమనించిన తల్లి, వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించిందని చెప్పి జగిత్యాలకు పంపారు. అక్కడికి తీసుకెళ్లేలోపే శ్వాస ఆడక తుదిశ్వాస విడిచాడు. – కోరుట్ల -
గీళ్లకు టికెట్ ఇస్తరో లేదో..
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): ఉన్నోల్లందరు అధికార పార్టీలకు పోయిరి. అక్కడ గీళ్లకు టికెట్ ఇస్తరో లేదోగాని.. గిరగిర తిరగవట్టిరి. మనకేమో ఒకరు ఇద్దరు కాకపాయే.. ముప్పై మూడు మంది కావాలే. పోటీ చేసే వాడకట్టులో రిజర్వేషన్లకు తగ్గట్టు ఎంతో కొంత పేరున్నోడు.. కొన్ని పైసలున్నోడు కావాల్నాయో.. ఏ మూల ఎక్కడ వెతికినా పార్టీలో ఉన్నోళ్లు కనబడుతలేరు.. మా అంటే నాలుగైదు వార్డుల్లో క్యాండేట్లు రడీ ఉన్నరు.. విుగిలిన చోట్ల మంచోళ్లను వెతకాల్సిందే.. ఇదీ కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో ఓ రెండు జాతీయ పార్టీల కీలక నేతలు లోలోన పడుతున్న అంతర్మథనానికి అక్షరరూపం. పోయిన సారి మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్లలోని ఓ జాతీయ పార్టీకి 13 మంది కౌన్సిలర్లు, మరో జాతీయ పార్టీకి ఇద్దరు కౌన్సిలర్లు గెలిసిండ్రు. ఆ తరువాత ఏమైందో.. తెల్వదు కానీ.. ఓ జాతీయ పార్టీ నుంచి ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా మెల్ల మెల్లగా లోకల్ పార్టీకి జంప్కాగా.. మరో జాతీయ పార్టీ నుంచి ఓ కౌన్సిలర్ లోకల్ పార్టీకి మారిపోయిండు. గిట్ల జాతీయ పార్టీల్లో ఒక్కొక్కరే మిగిలిండ్రు. గిప్పుడు మళ్లీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినయ్. పార్టీ పేరు పెద్దగుండే.. అన్ని వార్డుల్లోకెళ్లి క్యాండెట్లను నిలబెట్టాల్నాయే.. పాత క్యాండెట్లు లోకల్ పార్టీల ఉండిరి. అక్కడ టిక్కెట్ల కోసం తిరగవట్టిరి. మళ్లీ ఎలచ్చన్ల గెలిచేటి ముప్పైమూడు మంది కొత్త క్యాండేట్లను దొరకబుచ్చుకోవాలే. ఇగో..గీ పరేషాన్లో జాతీయ పార్టీ లీడర్లు కిందమీద అవుతుండగా.. లోకల్ పార్టోళ్లు మాత్రం టిక్కెట్ల పోటీ పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నరు. పాతోళ్లు.. కొత్తోళ్లు మాకు టిక్కెట్ అంటే..మాకు టిక్కెట్ అనుకుంట పోటీ పడి లొల్లి పెడుతుండ్రు. ఒక్క వార్డులో ఇద్దరు ముగ్గురికి టిక్కెట్లు ఇయ్యరాదాయే..గీ లొల్లితో రెబెల్స్ తయారై అసలు క్యాండేట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని లోకల్ పార్టోళ్లు పరేషాన్ పడుతున్నరు. -
టిమ్ మరిచిన కండక్టర్..
తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి నేటికి 22రోజులు. రోజుకో రీతిన ఆందోళనలతో రోడ్డెక్కుతున్న డ్రైవర్లు.. కండక్టర్లు.. ఇతర సిబ్బంది జీవితం దుర్భరంగా మారింది. సెప్టెంబర్ మాసం జీతం అందక దసరా పండక్కు దూరమైన కార్మికుల జీవితాల్లో.. వెలుగులు నింపే దీపావళి సైతం చీకటినే మిగిలిస్తుందా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రోజులు గడుస్తున్నా.. ప్రాణత్యాగాలు జరుగుతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. దీంతో సగటు కార్మికుడి బతుకు‘చక్రం’ ఆగిపోయింది. సమ్మెను తిప్పికొట్టేందుకు సర్కారు ‘ప్రత్యామ్నాయ’ వ్యూహం లాభం చేకూర్చడం లేదనే చెప్పుకోవచ్చు. ‘తాత్కాలిక’ ప్రయాణంలో ప్రజలకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వరుస ప్రమాదాలతో బస్సుల్లో ప్రయాణం భద్రతనే ప్రశ్నిస్తోంది. కరీంనగర్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో కార్మికుల ఆవేదనలు.. ప్రయాణికుల ఇబ్బందులు.. సంస్థ పరిస్థితులపై ‘సాక్షి’ ఫోకస్... రీజియన్‌లో రూ.12.6 కోట్ల నష్టం. కరీంనగర్ : ఆర్టీసీ సమ్మె ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తోంది.సమ్మె చేస్తున్న కార్మికులతో పాటు ఆర్టీసీ ప్రయాణాన్నే నమ్ముకున్న ప్రజలకు తిప్పలుతప్పడం లేదు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు పట్టు విడవకపోవడం... ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎటువైపు దారితీస్తుందో తెలియని సందిగ్ధం నెలకొంది. ఇక తాడోపేడో... ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. సమ్మె విరమణకు పరిష్కార మార్గం దొరుకుతుందనుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలతో సమ్మె ముగింపునకు అవకాశాలు లేకుండా పోయాయి. కార్మికులు సెప్టెంబర్, అక్టోబర్ నెల జీతాలను కూడా నోచుకోలేదు.ఆర్టీసీ ఉండే అవకాశం లేదని సీఎం స్పష్టం చేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. భరోసా లేని ప్రయాణం... ప్రస్తుతం ఆర్టీసీలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బస్సులు తిరుగుతున్నా సమయపాలన లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాము పనిచేసే చోటికి సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల యజమానులు సందిట్లో సడేమియాలాగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. బస్సులు ఫుల్... కలెక్షన్ నిల్... ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కరీంనగర్ రీజియన్‌లో భారీ నష్టం వాటిల్లింది. గతంలో ప్రతి రోజు రూ.1.10 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుతం రూ.50 లక్షల పైచిలుకు మాత్రమే ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 90 శాతం బస్సులు నడిస్తే ఇంత అధ్వానంగా కలెక్షన్ ఎలా వస్తుందనేది జవాబు లేని ప్రశ్నగా మారింది. ప్రతి రోజు 60 లక్షల పైగా నష్టం వాటిల్లుతుండడంతో రీజియన్‌లో 9డిపోల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. చదవండి : సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ అదే పని నిలువు దోపిడీ.. సిరిసిల్లటౌన్: సమ్మెకు ముందు సిరిసిల్ల డిపో పరిధిలో 65 బస్సులు ప్రతిరోజు సుమారు 300 ట్రిప్పుల్లో 25వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేవి. సిబ్బంది లేక డిపోలో డీఎం ఒక్కరే పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖ తదితర శాఖల అధికారుల సహకారంతో బస్సులను నడిపిస్తున్నారు. 65 బస్సుల్లో ప్రతిరోజు 90శాతం నడిపిస్తున్నారే కానీ ట్రిప్పులు తగ్గాల్సి వచ్చింది. అందినకాడికి దోపిడీ..? జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్న సిబ్బందికి ఆర్ఎం నుంచి వచ్చిన చార్ట్ ద్వారా టిక్కెట్ ధరలు వసూళ్లు చేయాల్సి ఉంది.అయితే ఇప్పటికీ అద్దె, ప్రైవేటు బస్సుల్లో ఇష్టానుసారంగా వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తో్తంది.కొన్ని రూట్లలో అధికారులు టిమ్ మిషన్లద్వారా టిక్కెట్లు ఇప్పిస్తుండగా..తాత్కాలిక సిబ్బంది చిల్లరలేమి పేరుతో ఎక్కువ తీసుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. కరీంనగర్ నుంచి కామారెడ్డికి ఆర్డీనరీ చార్జీలు రూ.60కి బదులు రూ.100 వసూలు చేస్తున్నారు. ఆదాయం పెంచిన టిమ్ మిషన్లు? వారం రోజుల నుంచి ఎక్కువ రూట్లలో టిమ్మిషన్లను వినియోగించడంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో ఆదాయం పెరుగుతూవస్తోంది. సిరిసిల్ల డిపోలో 70శాతం మేరకు టిమ్ మిషన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.టిమ్ మిషన్ల నిర్వహణలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలు అధికారులకు తలనొప్పిగా మారాయి. పాసులు చెల్లుతలేవు సిరిసిల్ల బస్సుల్లోనే పాసులు చెల్లుతున్నాయి. కామారెడ్డి బస్సులో ఎక్కితే చార్జీలు తీసుకుంటుండ్రు. ఇదేం పద్ధతి. క్యాట్కార్డులది కూడా అదే పరిస్థితి. ఏ డిపో పరిధిలో తీసుకున్న వాటినే చెల్లుబాటు అవుతున్నాయి. ఇక కళాశాలల సమయానికి బస్సుల్లేక మాకు ప్రయాణానికే రోజుకు నాలుగు గంటల సమయం పడుతుంది. చదువుకునేదెప్పుడు. – అంకనగరి జాషువా, నర్మాల, పాలిటెక్నిక్ విద్యార్థి, అగ్రహారం సమయానికి బస్సులు నడపాలి పాసులు చెల్లుబాటు అవతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు సిరిసిల్ల బస్టాండుకు వచ్చినం. నాలుగన్నర వరకు బస్సులు లేవు. బస్సులు చెల్లుబాటు అవుతున్నాయి. ఆటోల్లో పోదామంటే భయం. పైగా డబ్బులు ఎక్కువ తీసుకుంటుండ్రు. సమ్మె ఎప్పుడు అయిపోతుందాని చూస్తున్నాం. విద్యాసంస్థల సమయానికి బస్సులు నడపాలి. – గంగు శృతి విద్యార్థి, చీర్లవంచ మా బతుకులు రోడ్డున పడ్డాయి జగిత్యాల: మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. జీతాలు లేకపోవడంతో పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. ఇటీవలే ఇల్లు కట్టుకున్న కొందరు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం రూ.50 వేల జీతం ఇస్తున్నామని చెబుతున్నారు. మా పే స్లిప్‌లు చూపెడుతున్నాం. రూ.50 వేల జీతం ఇస్తే సమ్మె విరమిస్తాం. ఒక్కో రోజు తినకుండానే నిద్రపోతున్నాం. ఇన్ని సార్లు డీజిల్ ధరలు పెరిగినా.. ప్రభుత్వం ఓట్ల కోసం టికెట్ల రేట్లు పెంచడం లేదు. ప్రజలంతా మాకు మద్దతివ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – ఉమారాణి, ఆర్టీసీ కార్మికురాలు టిమ్ మరిచిన కండక్టర్ మంథని: పక్క చిత్రం చూశారా..! మంథని బస్టాండ్‌లో గోదావరిఖనికి బోర్డుతో ప్లాట్‌ఫాంపై బస్సు ఆగింది. అప్పటికే బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు వెళ్లి బస్సులో కూర్చున్నారు. 30 మందితో బస్సు పట్టణశివారు దాటింది. తాత్కాలిక కండక్టర్ టిమ్ మిషన్ పట్టుకొని ఓ ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి సార్ ఎక్కడికి అన్నాడు. గోదావరిఖని ఒక టికెట్ అనగానే.. కండక్టర్ మిషన్‌లో గోదావరిఖని ఎంటర్ చేసే ప్రయత్నం చేశాడు. టికెట్ బయటకు రాలేదు. ఎందుకంటే తాత్కాలిక కండక్టర్ దగ్గర ఉన్నది భూపాలపల్లి రూట్ టిమ్. ఆగమైన కండక్టర్ వెంటనే డ్రైవర్‌కు చెప్పి బస్సును బస్టాండ్ తీసుకెళ్లాడు. బస్సులోని ప్రయాణికులు దిగి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టిమ్మార్చుకుని బయల్దేరాడు. ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదు గోదావరిఖనిటౌన్: ఇన్నాళ్లుగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్లిన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం సరికాదు. అందరం మానవులమే. వారికి అవసరాలు ఉంటాయని చూడని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందా, మరి ఎవరి కోసం పని చేస్తుందనేది తెలియలేని స్థితి నెలకొంది. – రాజయ్య, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ రూ.20వేల అప్పు.. ఇతను వేల్పుల ప్రభాకర్. 25 ఏళ్లుగా హుజూరాబాద్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అన్ని కటింగ్‌లు పోనూ నెలజీతం రూ. 16వేలు చేతికి వస్తుంది. హార్ట్ సర్జరీ కావడంతో నెలకు రూ.3వేలు మందులకే ఖర్చు అవుతోంది. 21రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వం సెప్టెంబర్ జీతాలు నిలిపివేసింది. ఇల్లుగడిచేందుకు ప్రభాకర్ వడ్డీకి రూ.20వేల అప్పు తీసుకొచ్చాడు. కుటుంబపోషణ కష్టంగా ఉందని.. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ప్రభాకర్ కోరుతున్నాడు. విధులకు ఆలస్యం.. ఇతను కుక్కడపు శ్రీనివాస్. మంథని స్వస్థలం. గోదావరిఖని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం 9.30కి కళాశాలలో బయోమెట్రిక్ వేలిముద్ర వేయాలి.కాలేజీకి వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 7.45కి మంథని బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సురావడంతో ఎక్కాడు. బస్టాండ్ నుంచి ఓ సారి డిపో వరకు తీసుకెళ్లిన డ్రైవర్.. గోదావరిఖని బయల్దేరి.. కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చాడు. దీంతో మంథనిలోనే తొమ్మిది కావొచ్చింది. అరగంటలో ఎలా వెళ్లేదని శ్రీనివాస్ మదనపడగా.. ప్రత్యామ్నాయం లేక అదే బస్సులో ఆలస్యమైనా కళాశాలకు వెళ్లాడు.. రోజుకు ఒక్కపూటే తింటున్నం కోరుట్ల: నా పేరు విజయ.మల్యాల మండల రామన్నపేట. కోరుట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.నెలకు రూ. 16వేలు జీతం వస్తుంది. నా భర్త రాజేశ్వర్ కూలీపని చేసేవాడు. వెన్నపూస ఆపరేషన్ కావడంతో ఇంట్లోనే రెస్టు తీసుకుంటుండు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు 5వ తరగతి, ఇంకొకరు 3వ తరగతి చదువుతున్నారు. నా భర్త తరఫున సంపాదన లేక.. నాకు రెండు నెలలుగా జీతం రాక మస్తు పరేషాన్ ఉంది. ఇన్ని రోజులు మిగుల్చుకున్న డబ్బులు బతుకమ్మ..దసరా పండుగకు అయిపోయినయ్..ఇప్పుడు మా ఇల్లంతా.. రోజుకు ఒక్క పూటే తిని కాలం గడుపుతున్నం. ఇంట్లో సామానులు లేవు. కిరాణంలో ఉద్దెర పెట్టి తెచ్చుకుంటున్నం. ఈ నెలాఖరులో ఇప్పటి వరకు కిరాణ సామానుకు అయిన డబ్బులు చెల్లించకుంటే వచ్చే నెలలో ఉద్దెర ఇవ్వనని కిరాణ షాపు ఓనరు చెపుతుండు. మా ఆయనకు అవసరమైన మందులు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. -
తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌కు దాస్‌నగర్ గ్రామశివారులో ఫిట్స్ రావడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. శుక్రవారం కోరుట్ల డిపోకు చెందిన (టీఎస్ 02 జెడ్ 0283) బస్సు సాయంత్రం 7.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరింది. ఇందులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్దకు రాగానే బస్‌డ్రైవర్ ప్రసాద్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పొలాల్లో బస్సు నిలిచిపోయింది. డ్రైవర్ ప్రసాద్‌కు కొద్దిపాటి గాయాలు అయ్యాయి. బస్సు పొలాల్లోకి వెళ్లగానే ప్రయాణికులు ఆందోళన చెంది కేకలు వేశారు. ఓవైపు చీకటి పడింది. అత్యవసర డోర్ ద్వారా 25 మంది బస్సునుంచి బయటకు వచ్చారు. మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించి వారిని మరో బస్సు కోరుట్లకు తరలించారు. డ్రైవర్‌ను జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌గా ప్రసాద్ కోరుట్ల డిపోలో ఐదు రోజుల చేరాడు. ఆర్టీసీ అధికారులు హడావుడిగా అనుభవం, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా తాత్కాలిక డ్రైవర్లను నియమించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది. -
ముంబయి రైలుకు హాల్టింగ్
సాక్షి, కోరుట్ల(కరీంనగర్) : కోరుట్ల, మెట్పల్లి పట్టణ వాసుల కల నెరవేరింది. తొమ్మిది నెలలుగా చేస్తున్న ఉద్యమాలు ఫలించాయి. కళ్ల ముందు నుంచి వెళ్తున్న రైలులో ఎక్కాలంటే 35 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి తప్పింది. కరీంనగర్– ముంబయి రైలు కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో ఆగాలన్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఉంటున్న ముంబయి వాసుల ఇబ్బందులు తొలగనున్నాయి. కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో కరీంనగర్–ముంబయి రైలు ఆగాలని మంగళవారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది నెలలుగా... గతేడాది అక్టోబర్‌లో కరీంనగర్–ముంబయి రైలు ప్రారంభమైంది. వారానికి రెండు సార్లు నడుస్తున్న ముంబయి–కరీంనగర్ రైలు కేవలం జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న లింగంపల్లి రైల్వే స్టేషన్లో మాత్రమే ఆగడంతో కోరుట్ల, మెట్పల్లి పట్టణాల ప్రజలు ముంబయి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల లేదా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వెళ్లి ముంబయి రైలులో ఎక్కాల్సిన దుస్థితి. తమ ఊళ్లలో ఉన్న రైల్వేస్టేషన్ల నుంచి ముంబయి రైలు వెళ్తున్నా తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి ముంబయి రైలు ఎక్కాల్సిన దుస్థితి. కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో రైలు ఆగాలని కోరుతూ రెండు పట్టణాలకు చెందిన స్థానికులు నిరసన దీక్షలు చేపట్టారు. ముంబయికి చెందిన కోరుట్ల, మెట్పల్లి వాసులు సైతం ముంబయి రైలు ఆగాలని కోరుతూ రైల్‌రోకో ఉద్యమానికి సిద్ధమై ముంబయి రైలులోనే ప్రయాణించి రైలును కోరుట్లలోనే ఆపేందుకు యత్నించారు. ఆ సమయంలో భారీ పోలీసు బందోబస్తు కారణంగా రైలు ఆపడం వీలు కాలేదు. దీంతోపాటు రైల్వే జీఎంకు స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత కోరుట్ల, మెట్పల్లిలో రైలు ఆపాలని కోరుతూ రైల్వే శాఖ ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చారు. ఎట్టకేలకు ఆగనుంది స్థానికుల ఉద్యమాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తోడుగా ఇటీవల పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్న సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ముంబయి రైలు ఆపాలని కోరుతూ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విన్నవించారు. అనంతరం పట్టుదలతో ప్రయత్నించిన క్రమంలో ముంబయి రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా కోరుట్ల, మెట్పల్లి స్టేషన్లలో ఒక్కో నిమిషం ఆగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఇప్పటి నుంచి ముంబయి రైలు కోరుట్ల, మెట్‌పల్లిల్లో ఆగనుంది. ఈ రెండు పట్టణాల నుంచి 60 ఏళ్ల క్రితం ముంబయికి వలస వెళ్లిన వేలాది కుటుంబాలకు స్థానికంగా రైలు ఆగడం ప్రయోజనకరంగా మారనుంది. ప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి.. ముంబయి నుంచి నిజామాబాద్ వరకు నడిచే లోకమాన్య తిలక్ రైలును గతేడాది సెప్టెంబర్ 26న కరీంనగర్‌కు వరకు పొడగించారు. ఆ సమయంలో జిల్లాలో జగిత్యాలకు సమీపంలో ఉన్న ఒక లింగంపల్లి స్టేషన్లో మాత్రమే స్టాప్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల మెట్పల్లి, కోరుట్ల ప్రాంత వాసులు నిరాశ చెందారు. ఆ తర్వాత ఈ రెండు పట్టణాల్లోని స్టేషన్లలో కూడా స్టాప్‌లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. చొరవ తీసుకున్న ఎంపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మొదట ఈ సమస్యపైనే దృష్టి సారించారు. కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల నుంచి నిత్యం ముంబయికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి. ఎందరు ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్తున్నారనే వివరాలతో కూడిన నివేదికను రైల్వేశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ శాఖ మంత్రిని కలిసి రైలును రెండు పట్టణాల్లో ఆపాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంత్రి అంగీకరించడంతో అధికారులు రెండు స్టేషన్లల్లో స్టాప్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారానికి ఒక రోజు సెప్టెంబర్ 1 నుంచి రెండు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రస్తుతం వారానికి ఒక రోజు మాత్రమే ఈ మార్గంలో నడుపుతున్నారు. ప్రతీ ఆదివారం రాత్రి 7:45 గంటలకు కరీంనగర్ నుంచి ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. ప్రతీ శనివారం 4:40 గంటలకు అదే స్టేషన్ నుంచి ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రెండు పట్టణాల్లో స్టాప్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయం తీసుకోవడంతో ముంబాయికి రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. -
ఎందుకిలా చేశావమ్మా..!?
‘అమ్మా.. రోజులు మారిపోతున్నాయ్. అమ్మో.. ఆడపిల్ల అనుకుని మమ్మల్ని కనిపెంచడానికి మీరు ఎందుకు బెదిరిపోతున్నారో.. పురిట్లోనే ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదమ్మా. ఈ కాలంలో ఆడపిల్ల అన్నింట్లో ముందుంటుంది. మహాలక్ష్మీకి మారుపేరుగా మీ ఇంటి ముంగిట్లో సిరులు చిందిస్తోంది. ఇదివరకు ఆడపిల్లను కనడానికి మీలాంటి తల్లులు వెనకంజ వేసిన అనర్థం ఫలితంగా ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల్లో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే సంస్కృతి వచ్చేసింది. కాస్త ఊపిరినిచ్చి.. ఊతమివ్వండి చాలమ్మా.. మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటాం. ఈకాలం ఆడపిల్ల మీకు భారం కాదని నిరూపిస్తాం.. అమ్మా..కాస్త కనికరించండి..కని పెంచండి’.. పదిరోజుల వ్యవధిలో జగిత్యాల జిల్లాలోని రెండు చోట్ల పురిట్లోనే తల్లి పొత్తిళ్ల నుంచి ముళ్ల పొదల పాలైన ఆడశిశువుల ఆక్రందనకు ఇది అక్షరరూపం. కోరుట్ల(కరీంనగర్) : జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఈ నెల 1వ తేదీన వేకువజామున ఆడశిశువును చంపి వదిలేసిన సంఘటను మరవకముందే కోరుట్లలో ఓ ఆడశిశువును పురిట్లోనే ముళ్ల పొదల్లో వదిలేసిన సంఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్‌లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అక్కడ ఉండే స్థానికుల కు శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలేసి వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు కస్తూరి లక్ష్మీనారాయణ అక్కడికి వచ్చి వెంటనే శిశువును స్థానిక పిల్లల ఆసుపత్రికి పంపించారు. డాక్టర్ దిలీప్‌రావు శిశువుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగానే ఉందని నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల ఎస్సై రాజునాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో ఉన్న శిశువును ఐసీడీఎస్ సీడీపీవో తిరుమలదేవి, సూపర్వైజర్ ప్రేమలత కు అప్పగించారు. అక్కడి నుంచి శిశువును కరీంనగర్‌లోని శిశుగృహాకు తరలించారు. కన్నతల్లిని గుర్తించారు.. ఆడశిశువు దొరికిన వైనం కోరుట్లలో కలకలం రేపగా కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు అధ్వర్యంలో ఎస్సై రాజునాయక్ శిశువును తీసుకువచ్చి వదిలేశారన్న విషయాన్ని ఆరా తీశారు. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన తర్వాత ఝాన్సీరోడ్‌లోనే నివాసముండే బాణాల రేఖ అనే మహిళ శిశువును వదిలేసి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఆ వెంటనే పోలీసులు ఆమెను ప్రశ్నించి ఆసుపత్రికి తరలించారు. బాణాల రేఖ భర్త కృష్ణ కొడిమ్యాలలో ట్రాన్స్‌కో లైన్మెన్గా పనిచేస్తున్నారు. రేఖతో పాటు ఆమె అక్కను బాణాల కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ మొదటి భార్యకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. రెండో భార్య రేఖకు ఇద్దరు ఆడశిశువులు ఉన్నారు. ఈ క్రమంలో మరో ఆడశిశువును పెంచడం భారంగా భావించి వదిలేసేందుకు నిశ్చయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కృష్ణకు ఈ మధ్యే కొడిమ్యాలకు బదిలీ అయినట్లు సమాచారం. కోరుట్లలో ఇల్లు ఖాళీ చేసి ఇద్దరు భార్యలతో కలిసి కొడిమ్యాలలో అద్దె ఇల్లు తీసుకుని ఉండేందుకు యత్నిస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి ఆడశిశువును వదిలేసిన సంఘటన కోరుట్లలో కలకలం రేపింది. పోలీసులు ఆడశిశువును వదిలేసిన తల్లి రేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్షేమంగా తిరిగి వచ్చిన జగిత్యాలవాసులు
కోరుట్ల/మెట్పల్లి: శ్రీలంకలోని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి, కోరుట్ల పట్టణాలకు చెందిన పలువురు త్రుటిలో తప్పించుకుని క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మెట్‌పల్లికి చెందిన ఏలేటి నరేందర్‌రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, కోరుట్లకు చెందిన బాశెట్టి కిషన్ దంపతులు సహా మొత్తం 14 మంది వారం క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం వారు ఈనెల 19న కొలంబో నగరానికి చేరుకుని నార్లేమెరీన్ అనే హోటల్లో బసచేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు వీరంతా స్వదేశానికి బయలుదేరగా, 8 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్ పక్కన ఉన్న మరో హోటల్లో ఉగ్రదాడి జరిగింది. దాడి జరగడానికి గంట ముందు అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత దాడి విషయం తెలుసుకున్న వారు ఉద్వేగానికి లోనయ్యారు. పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుతీకోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనంత’వాసులకు గాయాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీలంకలో బాంబుపేలుళ్ల ఘటనలో అనంతపురం వాసులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని అమిలినేని సురేంద్రబాబు, ఆయన స్నేహితుడు భక్తవత్సలం గాయపడగా, సురేంద్ర మరో స్నేహితుడు రాజగోపాల్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ముగ్గురూ వ్యక్తిగత పనిమీద కొలంబో వెళ్లి షాంగ్రీ లా హోట్‌లో బసచేశారు. హోటల్లోని రెస్టారెంట్లో అల్పాహారం తింటుండగా ఒక్కసారిగా పెద్దపేలుడుతో రెస్టారెంట్ అద్దాలు ధ్వంసమై సురేంద్ర ముఖంపై పడడంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే భక్తవత్సలం కాలికి గాయాలయ్యాయి. వీరిని హోటల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వీరు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారు. -
కేసీఆర్ భోళా శంకరుడు: కవిత
సాక్షి, కోరుట్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భోళా శంకరుడని ఏదడిగితే అది వెంటనే అమలు చేస్తారని టీఆర్ఎస్ నిజమాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఉంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంలో మార్పు రావాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లలో గెలవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేసిందని ఆమె తెలిపారు. సబ్బండ వర్ణాలు బాగుపడటమే కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలను నమ్మకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని కోరారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ రెండేళ్లలో ఇళ్లు కట్టించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర రెట్టింపు చేస్తామని చెప్పి.. ఆ హామీని పట్టించుకోలేదని కవిత విమర్శించారు. కాగా, కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ అక్కడ ఈవీఎంలు, వీవీప్యాట్లతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు బరిలో నిలవడంతో ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
నిధులున్నా.. నిర్లక్ష్యం
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థికసంఘం ద్వారా గత డిసెంబర్లో రూ.9.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. జగిత్యాలకు రూ.4.20కోట్లు, మెట్‌పల్లికి రూ.2.25కోట్లు, కోరుట్లకు రూ.2.89కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, మార్కెట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిధులు మంజూరై రెండు నెలలు గడిచినప్పటికీ జగిత్యాల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ఇంకా ఈ పనులను మొదలుపెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. టెండర్ దాటని వైనం రెండు మున్సిపాలిటీల్లో ఈ పనులకు సంబం ధించి ఇంకా టెండర్దశ కూడా పూర్తి కాలేదు. మెట్పల్లిలో పదిరోజుల క్రితం ఆన్లైన్ టెండర్లు పిలిచిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రావడంతో దానిని అక్కడితోనే నిలిపివేశారు. జగిత్యాలలో మాత్రం అక్కడి అధికారులు ఇంకా టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించకపోవడం గమనార్హం. అధికారుల తీరుపై విమర్శలు... వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చిలోనే విడుదలవుతుందనే కచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ అధికారులు పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయకుండా జాప్యం ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో టెండర్ ప్రక్రియతోపాటు కౌన్సిల్ ఆమోదం వంటి వాటిని పూర్తి చేసి ఈ నెలలో కోడ్ రాక ముందే పనులను మొదలుపెట్టారు. కానీ జగిత్యాల, మెట్పల్లిలో అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల కోడ్ మే 27 వరకు ఉంటుంది. ఆ లోపే మండల, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది సాధ్యం కాని పక్షంలో జూన్ నెలలో నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. దీనిని బట్టి చూస్తే మరో మూడు, నాలుగు నెలల పాటు ఈ పనులకు మోక్షం కలిగే అవకాశం లేదు. మొ త్తానికి అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో పనులు కాక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక కారణాలతోనే జాప్యం సాంకేతిక కారణాలతోనే టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయాం. గతంలో ఉన్న కమిషనర్ ఎక్కువ రోజులు సెలవులో ఉండడం..ప్రస్తుతం ఉన్న కమిషనర్ పేరు మీద డిజిటల్ కీ రావడంలో జాప్యం జరిగింది. ‘కీ’ వచ్చిన వెంటనే టెండర్లను పిలిచాం. కాని అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది రాక ముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయ డానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. కోడ్ అనంతరం పనులు మొదలుపెడతాం. – అరుణ్, ఏఈ, మెట్పల్లి -
కల సాకారమవుతోంది..
సాక్షి, కోరుట్ల: పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మద్దుల చెరువు మినీట్యాంక్ బండ్ ఏర్పాటు కల సాకారమవుతోంది. ఇప్పటికే సుమారు రూ. 3.50 కోట్లు కేటాయించి పూడికతీత, పుట్‌పాత్, గేట్లు, బతుకమ్మ ఘాట్లు, బండ్ నిర్మాణం పూర్తి కాగా..ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు కొంత మేర మిగిలిపోయాయి. ఈ పనుల కోసం ఆరు నెలల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన నిధుల రూ. 25 కోట్ల నుంచి రూ. 33 లక్షలు కెటాయించారు. ఈ నిధులతో మినీట్యాంక్ బండ్‌గా మారిన మద్దుల చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త సోయగాలు.. కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న మద్దుల చెరువును దాదాపుగా మినీట్యాంక్ బండ్ రూపం సంతరించుకుంది. నిర్మాణపరమైన పనులు పూర్తి కాగా.. మినీ ట్యాంకు బండ్ సుందరీకరణ పనులు మిగిలిపోయాయి. ఈ పనుల్లో బాగంగా ఫిట్నెస్ ఓపెన్ జిమ్, కట్టపై పార్కులు, అందమైన ఆకృతులతో నిర్మాణాలు, చెట్లు, గడ్డిమొక్కలు పెంపకం, ఫుట్‌పాత్ పక్కన అందంగా ఉండటానికి అవసరమైన బొమ్మలు, బతుకమ్మ ఘాట్ వద్ద చిన్నపాటి గద్దెల నిర్మాణం వంటి వాటి కోసం ఈ నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు చెందిన టెండర్లు త్వరలో పూర్తి కానున్నాయి. మరో రూ. 50లక్షలు మినీట్యాంక్ బండ్లో నీటిని ఎప్పకప్పుడు శుద్ధీకరణ చేయడానికి అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథ పైప్‌లను అనుసంధానం చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉంది. ఈ పనుల కోసం మరో రూ. 50లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నిధులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. త్వరితగతిన ఈ నిధులు మంజూరైతే కోరుట్ల మద్దుల చెరువుకు చెందిన దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్లే. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది కాలం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, కోరుట్ల (జగిత్యాల): పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంగన్వాడీ సెంటర్లలో గ్రామాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహార వివరాలతో పాటు బాలింతలు, గర్భిణుల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వివిధ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయాలి. ఈ విధంగా నమోదు చేయడానికే కార్యకర్తలకు ఎక్కువ సమయం సరిపోతుంది. దీంతో కార్యకర్తల సమయం వృథా కాకుండా ఉండేందుకు వారు చేపట్టే ప్రతి పనిని త్వరగా పూర్తి చేసేందుకు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడానికి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్లో నమోదు చేసేందుకు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలను ఐటి అధికారులు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. మండలంలోని వివరాలు మండలంలో అయిలాపూర్, మోహన్‌రావుపేట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో 41 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 36 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు 1213 మంది పిల్లలు అర్హులు కాగా 1147 మంది పిల్లలు నమోదు చేసుకోగా 1130 మంది పిల్లలు హాజరవుతున్నారు. 3ఏళ్ల నుంచి 6ఏళ్ల లోపు పిల్లలు 644 మందికి 564 మంది హాజరవుతున్నారు. గర్భిణులు 327కు 286, బాలింతలు 324కు 282 మంది హాజరవుతున్నారు. వీరికి సంబందించిన సమాచారం రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో వారికి సమయం వృథా కావడంతో వేరే పనులపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసినట్లయితే ప్రతి రోజు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లోనే వారి వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రికార్డులు తిరగేసే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో పని సులభంగా అయిపోవడం, సమయంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్తో సమస్యలు అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం తగ్గించి వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు ప్రభుత్వం అందించే స్మార్ట్ఫోన్లకు గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు నెట్ వినియోగం అత్యవసరం. కాగా గ్రామాల్లో వివిధ సెల్ఫోన్ల కంపనీల ఇంటర్నెట్ సేవలు ఒక్కోరకంగా ఉంటాయి. సిగ్నల్ లేనిచోట మాత్రం స్మార్ట్ఫోన్ల వినియోగం సమస్యగా మారే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లతో పనులు సులభతరం కానున్నాయి. స్మార్ట్ఫోన్లతో సమయం ఆదా చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలు రికార్డుల్లో రాసే బదులు స్మార్ట్ఫోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకా పని ఒత్తిడి తగ్గి పనులు వేగవంతం అవుతాయి. ఆన్లైన్ సేవలు కొనసాగడం వల్ల ప్రతి అంగన్వాడీ సెంటర్ పనితీరు పరిశీలించే వీలుంది. – సమీమ్ సుల్తానా, సూపర్వైజర్ సద్వినియోగం చేసుకుంటాం చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలను 14 రికార్డుల్లో నమోదు చేయాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం అందించే స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకుంటాం. దీంతో పనులు వేగవంతం కావడమే కాకా సమయం ఆదా అవుతుంది. – ఎన్. భాగ్యలక్ష్మీ, అంగన్వాడీ టీచర్ పనిభారం తగ్గుతుంది ప్రభుత్వం సూచించిన పనులు చేయడానికి కార్యకర్తలకు సమయం దొరకడం లేదు. దీంతో చిన్నారులకు విద్యాబోధన, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం పెరిగింది. ఆన్లైన్ నమోదుతో పనులు వేగవంతం అవుతాయి. – జి. సుజాత,అంగన్వాడీ టీచర్ -
లైన్ క్లియర్..!
కోరుట్ల: ఐదేళ్లుగా ఉధృతంగా సాగిన ఉద్యమం..అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీ దరిమిలా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయింది. గత నెల 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌తో పాటు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అభ్యంతరాలకు నెల రోజుల గడువు..అంటే సరిగ్గా ఈనెల 9 వ తేదీ చివరి రోజుగా నిర్ణయించారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటికీ పెద్దగా అభ్యంతరాలు లేనట్లుగా సమాచారం. ఈక్రమంలో మరో 4 రోజుల్లో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కల సాకారం కానుంది. అప్పుడు..అంచనా తప్పింది కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సుమారు ఐదేళ్లుగా ప్రజలు వివిధ రకాలుగా ఉద్యమం కొనసాగించారు. రెండున్నరేళ్లకు ముందు టీఆర్ఎస్ సర్కార్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైన సమయంలో సుమారు 3 నెలల పాటు కోరుట్ల డివిజన్ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. సుమారు 17 దరఖాస్తులు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సర్కార్‌కు పంపినా ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకు ఊరించి చివరకు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. మెట్పల్లి డివిజన్ పరిధిలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి మండలాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అంచనాలు తలకిందులు కావడంతో ఆ సమయంలో స్థానికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఉద్యమం మరికొన్నాళ్లు సాగినా నిరుత్సాహం వెంటాడింది. ఎన్నికల సాక్షిగా.. రెండున్నరేళ్ల తర్వాత టీఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఈ సమయంలో కోరుట్ల సెగ్మెంట్లో కోరుట్ల పట్టణ ఓటర్లు కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్నాయనగా కోరుట్లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మరోసారి అప్పటి మంత్రి కేటీఆర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖాయమని ప్రకటించారు. ఈ విషయంలో ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవచూపడంతో డివిజన్ ఏర్పాటుపై ఎన్నికల సమయంలో గట్టి హామీ దొరికింది. కీలక నేతల నుంచి హామీ రావడంతో కోరుట్ల స్థానికుల్లో టీఆర్ఎస్పై ఉన్న అసంతృప్తి చాలా మేర సమసిపోయింది. తర్వాత కోరుట్ల ఎమ్మెల్యేగా విద్యాసాగర్‌రావు గెలవడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కోరుట్ల డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు అంతంతే.. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు సూచనలకు 30రోజుల గడువు ఇవ్వగా, ఇప్పటికి 26 రోజులు గడిచాయి. మరో నాలుగురోజుల సమయం ఉంది. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కూడిన కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రానట్లు సమాచారం. చిన్నపాటి మార్పులకు చెందిన సలహాలు ఉన్నా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కాకపోవడం గమనార్హం. ఈక్రమంలో మరో 4రోజులు గడిచిన తర్వాత కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాల గడువు ముగిసిపోనుంది. కార్యాలయాలు ఎక్కడో.. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు చెందిన కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఊరికి దూరంగా ఆదర్శనగర్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించిన తర్వాత ఆ భవనంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్ల పోలీస్ సబ్ డివిజన్ ఉంటుందా లేదా అన్న విషయంలో పూర్తి స్పష్టత లేదు. గతంలో పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం పెద్దగుండు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సబ్ డివిజన్ ఏర్పాటుతో ఇతరత్రా సబ్ డివిజనల్ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. కోరుట్ల కోట బురుజులు -
వెరైటీ ప్రచారం: ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా
సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు. ఒక వేళ మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు. -
మిల్లింగ్.. తిరకాసు!
కోరుట్ల: ధాన్యం మిల్లింగ్‌లో అధికారులు..ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలిపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఏటా స్థానిక మిల్లర్లు అభ్యంతరాలు తెలుపుతున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఎప్పటిలాగే ఈ ఖరీఫ్ సీజన్లో మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంగా మారింది. ఇదీ..తిరకాసు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సివిల్ సప్లయ్ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 60 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్క సీజన్లో జిల్లాలోని అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటే మూడు లక్షల మెట్రిక్ టన్నులపైగానే ఉంటుంది. అయినప్పటికీ జిల్లాలోని రైస్‌మిల్లులకు ఉత్పత్తి అయిన ధాన్యంలో కేవలం 1,35,100 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లింగ్‌కు కేటాయించారు. మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. స్థానికంగా రైస్ మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వెనక ఏదో తిరకాసు ఉందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.17కోట్ల భారం మిల్లర్ల విషయాన్ని పక్కన బెడితే ఒక్కో క్వింటాలుకు రూ.15 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 1,15,250 మెట్రిక్ టన్నుల ధా న్యం జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి పరిసరాల కు తరలించడానికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 17 కోట్లకు మించిన రవాణా భారం పడుతుంది. జిల్లాలోని దాదాపు 100 రైస్మిల్లుల్ల పనిచేసే సు మారు 5వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లింగ్ చేసేం దుకు అనుమతి వచ్చేలా ఒత్తిడి తెస్తే ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో అధికారులు..ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మిల్లింగ్ సామర్థ్యం తక్కువ జిల్లాలోని రైస్ మిల్లుల్లో మన దగ్గర ఉత్పత్తి అయిన ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం లే దు. ఈ కారణంగా పొరుగు జిల్లాల్లోని రైస్ మిల్లులకు పంపాల్సి వస్తోంది. ఇందులో ఏలాంటి సందేహాలకూ తావు లేదు. మిల్లింగ్ సామర్థ్యం పెరిగితే స్థానికంగా మిల్లర్లకు ధాన్యం కేటాయించడానికి ఇబ్బంది లేదు. – చందన్‌కుమార్, ఏఎస్వో, సివిల్ సప్లయిస్ -
ఎవరి తోవ వారిదే..!
కోరుట్ల: కమలంలో ఎవరి తోవ వారిదే.. నేతలంతా కలిసిరావడంలో జరుగుతున్న జాప్యం పార్టీ ప్రచార పర్వంలో ఇబ్బందులకు కారణమవుతోంది. కోరుట్ల సెగ్మెంట్ అభ్యర్థి ఖరారుకు ముందుగానే ఉన్న గ్రూపుల పోరు యథావిధిగా కొనసాగుతోంది. పార్టీలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కొత్తగా పార్టీలో చేరి టికెట్ సాధించిన జేఎన్ వెంకట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలోని అందరు కీలక నేతలను ప్రసన్నం చేసుకోడానికి అభ్యర్థి జేఎన్ వెంకట్ పార్టీ అధిష్టాన నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎవరి గ్రూపు వారిదే.. కోరుట్ల సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుకు ముందే గ్రూపులు ఉండటం గమనార్హం. సెగ్మెంట్లో కీలకమైన కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో కొంత మంది నేతలు ఎవరి తోవ వారిదే అన్న చందంగా వ్యవహరించడం పార్టీకి సమస్యాత్మకంగా మారింది. కోరుట్ల బీజేపీలో నాలుగు గ్రూపులు ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి వీరంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించేవారే కావడం గమనార్హం. మెట్‌పల్లిలోనూ ఆది నుంచి ఇదే తీరుగా గ్రూపులు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు పార్టీ అభ్యర్థి వెంకట్ ప్రచారపర్వంలో పాల్గొంటున్నప్పటికీ లోలోన మాత్రం స్థానిక నేతలతో ఉన్న విజేఎన్ వెంకట్ విభేదాలను గుర్తు తెచ్చుకుని కలిసి పనిచేయడానికి వెనకాముందాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెగ్మెంట్లోని అన్ని గ్రామాల్లో పార్టీకి కార్యకర్తలు..బీజేపీ అనుబంధ విబాగాలు.. ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికి కీలక నేతలు కలసి కష్టపడితే మంచి పలితాలు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సయోధ్యకు యత్నాలు... కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరి టికెట్ సాధించిన జేఎన్ వెంకట్ పార్టీలోని అన్ని గ్రూపులను కలుపుకుని పోయేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ దిశలో వెంకట్ మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారు. కొంత మంది కీలక నేతల వద్దకు తానే వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. మరి కొంత మంది నేతలకు అధిష్టాన నాయకులతో ఫోన్లు చేయించి బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంత మంది పార్టీ నాయకులు మెత్తబడినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో బీజేపీ నుంచి నామినేషన్ వేయనున్న నేపథ్యంలో అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో వెంకట్ యథాశక్తి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకులను కలుపుకు పోయే యత్నాలతో పాటు స్వంతంగా తన సామాజిక వర్గం..అనుచరవర్గం అండతో ఇప్పటికే సెగ్మెంట్లోని అనేక గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ నేతలంతా కలిసి కదిలితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు నష్టం ఖాయం
కోరుట్లటౌన్: రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్కు నష్టం ఖాయమని ఎంఐఎం కోరుట్ల అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీయోద్దీన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షులు అసద్ ఒవైసీ టీఆర్ఎస్కు మద్దతు విషయంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం మద్ధతుందని ప్రచారం చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎంఐఎం పార్టీకి నష్టం కలిగేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. పట్టణంలోని 10, 15 వార్డు కౌన్సిలర్ల భర్తలను మభ్యపెట్టి తన వెంట తిప్పుకుంటూ, వారిని ఎంఐఎం నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రావు, ఎంఐఎం పార్టీకి నష్టం చేస్తే ఆయన సఫలం కాడన్నారు. ఇలా చేస్తే టీఆర్ఎస్కు నష్టం ఖాయమని హెచ్చరించారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సీహెచ్. భూమయ్య, ఎండీ. జహంగీర్ అహ్మద్, అబూబాకర్, నిజాం పాల్గొన్నారు. -
మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట
కథలాపూర్: టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కథలాపూర్ మండలం దుంపేటలో ఒడ్డెర కులసంఘం, గీత కార్మిక సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కులసంఘాలవారిగా పాల్గొని విజయవంతం చేశారని, వారి సేవలను గుర్తించి కులసంఘ భవనాలకు నిధులు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, మాజీ సర్పంచ్ చిలుక రాజేంద్రప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ ఎం.డీ రఫీ, నాయకులు పాల్గొన్నారు. -
విభజనకు పదేళ్లు!
కోరుట్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా పదేళ్లు అవుతోంది. మారిన సెగ్మెంట్ల హద్దులతో నేతల తలరాతలు మారిపోయాయి. కొంత మంది నేతలు కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ నియోజకవర్గాలకు మారిపోవాల్సి వచ్చింది. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. విభజన ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతకుముందున్న 13నియోజకవర్గాల్లో ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. ఆ స్థానంలో మరో ఆరు కొత్తవి అవిర్భవించాయి. ఏడు పాతవే ఉన్నాయి. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది. 2008లో విభజనకు ఆమోదం.. 2001 జనాభా లెక్కల ఆధారంగా అప్పటికి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2002లో రిటైర్డు సుప్రీం కోర్టు జడ్జి కుల్దీప్సింగ్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. 2004–05 సంవత్సరాల్లో ఈ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల మార్పులు.. పరిపాలన సౌలభ్యత.. ప్రజల అనుకూలత వంటి అన్ని అంశాలపై కూలకుశంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 2006లో హైదరాబాద్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన వినతులు..అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ 2007సంవత్సరంలో తాము రూపొందించిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. కమిటీ సిపార్సులకు 2008 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రతిభా భారతి ఆమోద ముద్ర వేశారు. ఆ తరువాత వచ్చిన 2009అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహించారు. ఆరు నియోజకర్గాలు కనుమరుగు.. నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులు మారడంతో ఆయా సెగ్మెంట్లలో చేరిన కొత్త మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా పాత్రిపదికన రిజర్వేషన్లు మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కేవలం ఒక ఎస్సీ(మేడారం), ఒక ఎస్టీ(నేరెళ్ల)అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండగా ఆ తరువాత కొత్తగా మూడు ఎస్సీ నియోజకవర్గాలు చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు ఏర్పాటయ్యాయి. విభజనలో మెట్పల్లి, మేడారం, నేరెళ్ల, కమలాపూర్, బుగ్గారం, ఇందుర్తి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో కోరుట్ల, రామగుండం, వేములవాడ, ధర్మపురి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. మారిన నే‘తలరాతలు’.. నియోజకవర్గాల పునర్విజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరి నేతల రాతలు తారుమారయ్యాయి. సెగ్మెంట్ల మార్పుతో పాటు గతంలో ఉన్న మండలాల్లోనూ మార్పులు జరగడంతో కొంత మంది నాయకులు తమ పట్టును కోల్పోగా.. మరికొంత మందికి కలిసొచ్చింది. బుగ్గారం, మెట్పల్లి నియోజకవర్గాలు కలిసిపోయి కోరుట్ల ఏర్పాటు కావడం మెట్పల్లి ప్రాంత నేతలకు కలిసొచ్చింది. బుగ్గారంకు చెందిన నాయకులు ఉనికి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమలాపూర్, ఇందుర్తి, నేరెళ్ల ప్రాంతాలకు చెందిన నేతలు కొంతమంది పట్టు ఉన్న ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గతంలో మెట్పల్లి నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి, కథలాపూర్ మండలాలు వేములవాడలో కలియడంతో ఆ ప్రాంతంలోని నేతలకు ఇప్పటికీ ఇక్కడ పూర్తిస్థాయిలో పట్టు దొరకడం లేదు. పెద్దపల్లి, మేడారం నియోజవర్గం పరిధిలోనూ కొంతమంది నేతలకు వలసల ఇబ్బంది తప్పలేదు. పాత మేడారం నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కొంత మంది ధర్మపురి, చొప్పదండి సెగ్మెంట్లలో పాగా వేశారు. ఇలా సెగ్మెంట్ల పునర్విభజన ఉమ్మడి జిల్లాలోని నేతలపైన ప్రభావం చూపడమే కాకుండా రాజకీయ సమీకరణాల్లో ఎన్నో మార్పులకు తావిచ్చింది. -
ఎన్నికల బరి నుంచి ఎల్.రమణ ఔట్ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరి నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తప్పుకున్నా రు. కరీంనగర్ జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున టి.జీవన్‌రెడ్డి పోటీ చేయనుండటంతో ఆయన్ను కోరుట్ల నుంచి పోటీ చేయాలని మహాకూటమి ముఖ్య నేతలు కోరారు. కోరుట్ల నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో ఏపీ ప్రజల ప్రాబల్యమున్న చోట్లలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆయన విరమించుకున్నట్లు తెలిసింది. కోరుట్ల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని రమణ కోరినట్లు సమాచారం. -
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
-
పదిళ్లకో బెల్టు షాపు..
ఈయన పేరు మల్లేశం. భార్య పేరు సాయమ్మ. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. రోజువారీ కూలీనే వీరి జీవనాధారం. వీరి ఇంటి పక్కనే బెల్ట్‌షాప్ ఉంది. మల్లేశం ప్రతిరోజూ తాగుడుకు రూ.250 నుంచి రూ.300 దాకా ఖర్చు చేయడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా కూలీకి వెళ్లడమే మానేశాడు. సాయమ్మ ఒక్కతే కూలీకి వెళ్లి భర్త, పిల్లలను సాకాల్సిన దుస్థితి. తాగుడు మానేయాలని భర్తతో సాయమ్మ తరచూ గొడవపడేది. పది రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టపగలే తాగిన మత్తులో ఉన్న మల్లేశం.. సాయమ్మను కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తాను పొడుచుకుని ఆసుపత్రి పాలయ్యాడు! కోరుట్ల : ఇలాంటి అఘాయిత్యాలు ఒకట్రెండు కాదు.. పది రోజులకో నేరం.. నెలకో ఘోరం అక్కడ కామన్‌గా మారిపోయాయి. మద్యం ఏరులై పారుతుండటంతో ఆ మత్తులో చిక్కి కూలీలు చిత్తయిపోతున్నారు. ఇదెక్కడో అడవుల్లోని తండాలోనో, మారుమూల ఊరిలోనో జరుగుతున్న తంతు కాదు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని అల్లమయ్యగుట్టలో లిక్కర్ సృష్టిస్తున్న బీభత్సం! పది ఇళ్లకో బెల్ట్ షాపు: అల్లమయ్యగుట్ట కాలనీలో సుమారు 300 ఇళ్లు ఉండగా.. బెల్టు షాపులు 30 ఉన్నాయి. జనాభా 1,200 నుంచి 1,500 వరకు ఉంటుంది. కాలనీలో ఉన్నవారంతా రోజువారీ కూలీలే. ఉదయం లేచింది.. మొదలు సాయంత్రం వరకు అంతా పనిచేసి రాత్రి వేళ ఇంటికి చేరుకుంటారు. కాయకష్టం మరిచిపోవడానికి కూలీలు మద్యానికి అలవాటు పడ్డారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా తెరిచారు. గల్లీకో బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. చిన్నచిన్న కిరాణా షాపుల్లో.. టేలల్లో.. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ 24 గంటలు మద్యం(చీప్ లిక్కర్) అందుబాటులో ఉంటుంది. అది తాగి కూలీలు మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. తాగి గొడవలు పడటం.. పొద్దంతా కష్టించి సంపాదించిన డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తుండటంతో కాలనీవాసుల బతుకులు చితికిపోతున్నాయి. మూడొంతుల కూలి మద్యానికే.. అల్లమయ్యగుట్ట కాలనీవాసులు రోజువారీ సంపాదించే కూలి డబ్బులో మూడొంతులు మద్యం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకు మద్యం అమ్మకాలతో రోజుకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం ఉంటోంది. ఈ లెక్కన 30 బెల్ట్ షాపులకు కాలనీ వాసులు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బుల్లోంచి ప్రతీరోజు రూ.60 వేల దాకా చేరుతోంది. ఇలా కాలనీవాసులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. అనేక నేరాలు జరుగుతున్నాయి. ‘మామూళ్ల’.. మత్తు! అల్లమయ్యగుట్ట కాలనీలో సగానికిపైగా జనం మద్యం మత్తులో మునిగి తేలుతుండగా.. అడ్డగోలుగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో జోగుతోంది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న వేములవాడ ప్రధాన రహదారి వెంట దాదాపు నాలుగు బెల్ట్‌షాపులు ఉన్నాయి. కాలనీలో సుమారు 14 వీధులు ఉండగా వీధికి రెండు చొప్పున బెల్ట్‌షాపులు వెలిశాయి. వీటన్నింటికీ కోరుట్లలోని వైన్ షాపుల నుంచి మద్యం సరాఫరా అవుతోంది. ఈ విషయం తెలిసినా వైన్ షాపుల నుంచి నెలవారీ మాముళ్లు అందుతుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీకి చెందిన యువకులే అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. ఆడోళ్లకు భద్రత లేదు మా కాలనీలో ఎక్కడపడితే అక్కడ మందు దొరుకుతంది. మొగోళ్లు పనులు బంద్ చేసి చీప్ లిక్కర్ తాగుతున్నరు. పొద్దస్తమానం తాగడంతో ఆడోళ్లు పరేషాన్ అవుతున్నరు. ఎప్పుడు ఆడోళ్ల మీద ఏం ఘోరం జరుగుతుందోనని భయపడుతున్నం. – ఎల్లవ్వ, అల్లమయ్యగుట్ట కాలనీ 24 గంటలు మందు.. కాలనీలో అంతా కూలీనాలి చేసుకునేటోళ్లమే. పెళ్లాం.. మెగుడు కలిసి పనిచేస్తే వచ్చేది రూ.500. అందులో తాగుడుకే సగం డబ్బులు పోతున్నయ్. కాలనీలో ఎక్కడపడితే అక్కడ లిక్కర్ అమ్ముతున్నరు. - వీరభద్ర నగేశ్, అల్లమయ్యగుట్ట కాలనీ -
అన్నం పెట్టలేదని అంతం చేశాడు
మెట్పల్లి(కోరుట్ల) : కుటుంబ కలహాలు ఓ వివాహిత ప్రాణాలను బలి తీసుకున్నాయి. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన కట్టుకున్నడే అన్నంపెట్టలేదని ఆలిని కొట్టిఅర్ధంతరంగా కడతేర్చాడు. కన్నబిడ్డలకు తల్లి ప్రేమను అందకుండా చేశాడు. పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శంకర్రావు కథనం ప్రకార.. నిర్మల్ జిల్లా బోథ్‌కు చెందిన కోసగంటి శ్రీనివాస్(40)కు అదే గ్రామానికి చెందిన మంజుల(35)తో ఇరవై ఏళ్లక్రితం వివాహం జరిగింది. వండ్రంగి పని చేసే శ్రీనివాస్ ఆ తర్వాత ఏడాదికి భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం మెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. వీరికి కుమార్తె శ్రావణి(19), కుమారుడు విఘ్నేష్(17) ఉన్నారు. కాగా దుబ్బవాడలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న శ్రీనివాస్ దంపతులకు గత కొన్ని నెలల నుంచి తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంటికి మద్యం సేవించి వచ్చిన శ్రీనివాస్ భార్యను అన్నం పెట్టమని అడిగాడు. దీనికి అమె నిరాకరించడంతో అగ్రహం చెంది ఇంట్లో ఉన్న సుత్తెతో తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రంగా గాయం కావడంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుమార్తె, కుమారుడితో పాటు బంధువులు ఇంటికి వచ్చి మంజుల మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శంకర్రావు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిందితుడు భార్యను చంపిన తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
భార్యను చంపి.. ఆత్మహత్యాయత్నం
కోరుట్ల : జులాయిగా తిరుగుతూ అప్పులు పెరిగి.. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను పొడిచి చంపాడు. తాను పొడుచుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. కోరుట్ల సతీష్ చందర్రావు కథ నం ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని అల్లమయ్యగుట్ట కాల నీలో పేర్ల మల్లేశం(42)- సాయమ్మ(38) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఈ కుటుంబం కూలీనాలీతో పొట్ట పోసుకు ని జీవనం గడుపుతున్నారు. కొంతకాలంగా మల్లే శం ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. సాయ మ్మ కుటుంబభారాన్ని చూసుకుంటోంది. ఈ క్రమంలో మల్లేశం మద్యానికి బానిసయ్యాడు. కు టుంబపోషణ.. మద్యం కోసం చేసిన అప్పులు సుమారు రూ.లక్షకు మించిపోయాయి. దీంతో తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మల్లేశం భార్య సాయమ్మతో గొడవకు దిగాడు. వివాదం పెరగడంతో కత్తితో సాయమ్మ డొక్కలో పొడిచాడు. సాయమ్మ అక్కడిక్కడే చనిపోయింది. అన ంతరం మల్లేశం అదే కత్తితో ఛాతీతో పొడుచు కోగా స్వల్పగాయాలు అయ్యాయి. మల్లేశంను ఆ సుపత్రికి తరలించి చికిత్స అందించిన తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని సీఐ సతీష్ చందర్రావు, ఎస్సై రవికుమార్ పరిశీలిచి.కేసు నమోదు చేశారు. -
మూగబోయిన..‘తుపాకి రాముడు’
కోరుట్ల: ‘మాకేం తక్కువ లేదు..సార్. రేపు పొద్దుగాల నిజాం రాజుకు అపాయింట్మెంట్ ఇచ్చిన. మా సిపాయిలు మధ్యాహ్నం అమెరికాకు విమానం బుక్ చేసిండ్రు. అట్నుంచి అటే ఎళ్లిపోవాలా. రాత్రి అక్కడే డిన్నర్ చేసి, మళ్లీ లండన్‌కు బిజినెస్ పని మాట్లాడుకుని వచ్చేస్తా. ఏదో మీరు కనపడ్డరని అడగకపోతే ఏమన్న అనుకుంటరని కొన్ని డబ్బులు అడుగుతున్న. కానీ.. మాకే మస్తు మాన్యాలు ఉన్నయి..’ అంటూ కడుపుబ్బ నవ్వించే తుపాకి రాముని మాటల గారడీ మూగబోయింది. సుమారు యాభై ఏళ్ల పాటు కోరుట్ల, మెటపల్లి, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో తుపాకి రామునిగా పేరుపొందిన కళాకారుడు కోదండం మల్లయ్య(73) సోమవారం మృతిచెందాడు. కోరుట్లలోని అల్లమయ్యగుట్టకాలనీలో నివసించే మల్లయ్య తరతరాలుగా వస్తున్న తుపాకి రాముని కళను నమ్ముకుని జీవించాడు. ఖాకీ డ్రస్సు, టోపీ, కట్టె తుపాకీతో విచిత్ర వేషధారణలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మల్లయ్య మృతిచెందాని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, టీఆర్ఎస్ నాయకులు జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు ఇందూరి సత్యం, గజెల్లి రాజేంద్రప్రసాద్‌లు సంతాపం తెలిపారు. -
ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దని, రాజ్యాంగపరంగా వచ్చిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ స్వచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని మెట్పల్లి జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ తెలిపారు. మెట్పల్లి అర్బన్‌కాలనీలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కులమతాలకు అతీతంగా అందరు సమైక్యం గా ఉండాలని, తద్వారా సమస్యల పరి ష్కారం సులువు అవుతుందని పేర్కొన్నారు. అర్హుందరికీ ఉచిత న్యాయ సహాయం కోర్టుల్లో తప్పకుండా అందుతుందన్నారు. మండల లీగల్ సెల్ ఎళ్లవేళలా తోడుంటుందన్నారు. అధికారులు ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కరించకుంటే కేసు వేయొచ్చన్నారు. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. ఎలాంటి విషయంలోనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని న్యాయమూర్తి సూచించారు. చట్టాలను చేతిలోకి తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్పులుఇస్తే తప్పకుండా పత్రాలు రాయించుకోవాలని సూచించారు. సదస్సులో వెంకట్రావుపేట సర్పంచ్, న్యాయవాది కొమిరెడ్డి లింగరెడ్డి, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం శంకర్‌రెడ్డి, ఏజీపీ ఎల్లాల మధుసూదన్‌రెడ్డి, ఎస్సై శంకర్రావు, ఆర్ఐ కృష్ణ, న్యాయవాదులు కోటగిరి వెంకటస్వామి, మగ్గిడి వెంకటనర్సయ్య,ఓగులపు శేఖర్, తెడ్డు ఆనంద్, సురక్ష పాల్గొన్నారు. -
‘మాయ’గాడు..!
కోరుట్ల: పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఆడబిడ్డ కేసుల పేరిట ఠాణాల వెంట తిరిగితే తమ పరువు పోతుందని అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులకు íఫిర్యాదు చేయకపోవడం ఓ నయవంచకుడికి ఆసరాగా మారింది. పెళ్లి కాకముందు ఓ అమ్మాయిని ప్రేమపేరిట వంచించి ఆత్మహత్య కు కారకుడైన సదరు యువకుడు పెళ్లి చేసుకున్న తరువాత ఇద్దరు అమ్మాయిలకు వల వేసి వంచిం చి భార్యను దూరం చేసుకున్న ఘనుడు. నెల రో జుల క్రితం ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి మోసగించి మరోసారి తప్పించుకునే యత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. మాయమాటలతో.. మేడిపల్లి మండలం ఒడ్డెడు గ్రామానికి చెందిన సబ్బనవేని మహిపాల్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. 2013 సంవత్సరంలో మహిపాల్ అదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరిట వలలో వేశాడు. పెళ్లి చే సుకుంటానని చెప్పి నమ్మించి లోబర్చుకున్నాడు. తరువాత కొన్నాళ్లకు మాటమార్చాడు. పెళ్లి చేసుకుంటా నని చెప్పిన ప్రియుడు మాటమార్చడం భరించలేని ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కొన్నాళ్లకు ఈ సంఘటన మరుగునపడిపోగా 2014లో మహిపాల్ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత సంవత్సరం అదే గ్రామానికి చెందిన మరో 19 సంవత్సరాల యువతికి వల వేసి ప్రేమ పేరిట లోబర్చుకున్నాడు. ఆ సమయంలో పెద్దలకు తెలిసి పంచా యితీ జరిగింది. ఆ తరువాత కొన్నాళ్లకు గొడవ సద్దుమణిగింది. ఇద్దరు అమ్మాయిలను మహిపాల్ వంచించిన విషయం తెలియడంతో భార్య అతనికి దూరం అయింది. మరో అమ్మాయికి వల..కేసు నమోదు ఇద్దరు అమ్మాయిలను వంచించి భార్యకు దూరమైన మహిపాల్ మూడు నెలల క్రితం గ్రామానికి చెందిన మరో యువతికి వల వేశాడు. నెల రోజుల క్రితం సదరు యువతిని ఊరి నుంచి తీసుకెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు మేడిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కొన్నాళ్లు మహిపాల్ కోసం గాలించి చివరికి ఆ యువతితో పాటు పట్టుకున్నారు. ఈ విషయం కోరుట్ల సీఐ సతీష్ చందర్ దృష్టికి వచ్చింది. మహిపాల్ అమ్మాయిలను వంచించి మోసగిస్తున్న వైనాన్ని తీవ్రంగా పరిగణించి అతనిపై చీటింగ్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి..
కోరుట్ల: మహిళలపై వివక్ష ఇంటి నుంచే పోవాలి. ఆడపిల్ల అనే చిన్నచూపు చూడొద్దు. అప్పుడే వారు ఉన్నత చదువులతో సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. స్త్రీలు చేస్తున్న వివక్షపై పోరాటానికి మద్దతుగా నిలిస్తే సమాజాభివృద్ధి కూడా సాధ్యమంటున్నారు కోరుట్లకు చెందిన న్యాయవాది మామిడిపల్లి విజయలక్ష్మి. మహిళలపై వివక్ష ఎలా కొనసాగుతుంది..ఎలా దూరం చేయాలనే అంశాలను ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్న సమస్యలే.. మూడేళ్ల క్రితం న్యాయవాది కోర్సు పూర్తి చేశా. ఏడాదిన్నరగా ప్రాక్టిస్ చేస్తున్నా. ఇంత తక్కువ వ్యవధిలోనే మహిళలకు సంబంధించిన వివక్ష కేసులు ఎన్నో నా దృష్టికి వచ్చాయి. అన్నీ చిన్నచిన్న సమస్యలే. ఓ భర్త భార్య అందంగా ఉందని తరచూ గుండు కొట్టిస్తూ ఆమెను అనాకారిగా ఉంచే ప్రయత్నం చేసిన కేసును పరిశీలించా. పెళ్లి చేసుకునే సమయంలో అందంగా ఉండాలంటారు. తర్వాత ఇలా ఇబ్బంది పెడతారు. రంగు..రూపు..సంతానం..ఎక్కువ చదువు వంటి ఎన్నో చిన్నపాటి సమస్యలతో మహిళలను భర్తలు ఇబ్బందులు పెడుతున్న కేసులు అనేకం చూశాను. ఈ వివక్ష రూపుమాపడానికి సమాజంలో అన్ని వర్గాలు కలిసి రావాలి. వివక్ష అంతానికి మహిళలు చేసే పోరాటానికి మద్దతుగా నిలవాలి. ఆర్థికంగా బలోపేతం కావాలి మహిళలు సైతం ఒకరిపై ఆధారపడి బతికే పరిస్థితి నుంచి వాళ్ల కాళ్లపై వారు నిలబడాలి. ఆడపిల్లలు చిన్ననాటి నుంచి సమాజంలో ఎదురవుతున్న అవరోధాలు అధిగమించడం కష్టమే. కానీ వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఇల్లు.. పరిసరాలు.. సమాజం ఎక్కడిక్కడే ఆడపిల్లల చుట్టూ గిరిగీసి చిన్నచూపుతో వ్యవహరిస్తున్న ఫలితంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళలపై వివక్ష.. రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో మార్పు రావడం కీలకం. తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో వివక్ష చూపకపోతే వారి కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. ఇంటిలో నుంచి మొదలయ్యే వివక్షను తల్లిదండ్రులు దూరం చేస్తే చాలు.. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు. -
‘మహా’ జాతర.. ఆరుసార్లు బ్రేక్‌తో అవస్థలు
వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 3లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకుని తరించారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. జాతర సందర్భంగా ఆర్జీత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్థరాత్రి వరకు ఆలయాన్ని తెరచే ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజీత్, ఈవో దూస రాజేశ్వర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ అధికారులు పర్యవేక్షించారు. ఆరుసార్లు బ్రేక్‌తో అవస్థలు మహాశివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అవస్థలు తప్పలేదు. మంగళవారం ఐదుసార్లు విధించిన బ్రేక్ వల్ల భక్తులు అసహనం కోల్పోయారు. దీనికితోడుగా అర్థరాత్రి నుంచి స్థానికుల దర్శనాలు, కౌన్సిలర్ల దర్శనాలు, టీడీపీ పట్టువస్త్రాల సమర్పణ, ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాల సమర్పణ, శివస్వాముల దర్శనాలు, స్థానిక బ్రాహ్మణోత్సముల మహాలింగార్చన, లింగోద్భవ సమయంలో ఇలా ఆరుసార్లు బ్రేక్ ఇవ్వడం వల్ల భక్తులంతా క్యూలైన్లలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. పోలీసులు జారీ చేసిన పాస్‌లపై వివాదం నెలకొంది. పాస్‌లు జారీ చేసిన పోలీసులు వాటిని అనుమతించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు సోమవారం రాత్రి 12 గంటల నుంచి 3.30 గంటల వరకు స్థానికుల దర్శనాల అనంతరం గర్భగుడి దర్శనాలు నిలిపివేశారు. స్వామివారి దర్శనానికి ఆరుగంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో నిలబడిన ముగ్గురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆరోగ్య సిబ్బంది అక్కడి కి చేరుకుని చికిత్స చేశారు. భక్తులు ధర్మగుండంలో స్నా నా లు చేసి కోడె మొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు. పట్టువస్త్రాల సమర్పణ... స్వామి వారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవ స్థానం పక్షాన జేఈవో శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో టీటీడీ అర్చకుల బృందం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి సుమారు రూ. కోటిన్నర ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. వైభవంగా సామూహిక ‘మహాలింగార్చన’ వేములవాడ: మహాశివరాత్రి సందర్భంగా సామూహిక మహాలింగార్చన కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది.స్వామి వారి కల్యాణ మండపంలో స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య నేతృత్వంలో అర్చక బృందం మహాలింగార్చనను రెండు గంటల పాటు నిర్వహించారు. మట్టితో చేసిన 366 మృత్తికలు, పిండితో చేసిన 366 జ్యోతులను లింగాకారంలో పేర్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనువంశిక అర్చక కుటుంబాలు పాల్గొన్నాయి. -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందడుగు..
కోరుట్ల టౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపాల్టీ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. దేశంలో 40 41 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీపడుతూ పరిసరాల పరిశుభ్రత, 100 శాతం సానిటేషన్, పారిశుధ్యం పనులు, తడి, పొడి చెత్త సేకరణ, ఉదయం, రాత్రి వేళల్లో జాతీయ రహదారితోపాటు, ప్రధాన రహదారులు పరిశుభ్రం చే స్తూ, చెత్త రహిత మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఫీడ్‌బ్యాక్‌లో దేశ ంలో 44వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలకు తమ సమస్యలు పరిష్కారానికి, పన్నులు ఆన్లైన్లో చెల్లించడానికి కోరుట్ల బడ్డీ యాప్ రూపొందించి, ప్రచారం చేశారు. ప్రధాన చౌరస్తాల్లో ప్రచారబోర్డులపై అవగాహన కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు 31వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తూ, ప్రధాన కూడళ్ళు, కళాశాలల్లో, దుకాణా ల వద్ద బడ్డీ యాప్ ప్రచారం చేశారు. వాల్ పోస్టర్, గోడ రాతలతో బొమ్మలు వేయించారు. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన లభించింది. జనవరి 8, 9 రెండు రోజులు స్వచ్ఛ సర్వేక్షణ్ పనితీరుపై పర్యవేక్షకులు కోరుట్లకు చేరుకుని వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. 2 నెలల్లో 2500 మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 700 మంది తమ సమస్యల పరిష్కారానికి బడ్డీ యాప్‌ను వినియోగించుకోగా 654 సమస్యలు వెంటనే పరిష్కరమయ్యాయి. 46 సమస్యలు ఆర్థిక వనరులతో చేపట్టాల్సిన అవసరం ఉండడంతో నిధులు రాగానే పనులు పూర్తి చేయనున్నట్లు పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఎ.మహిపాల్ పేర్కొన్నారు. షీ టాయిలెట్స్ నిర్మాణం మున్సిపల్ నిధులతో రూ. 2లక్షలు వెచ్చించి, గురుజు మార్కెట్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా షీ టాయిలెట్స్ నిర్మాణం చేశారు. మహిళలకు టాయిలెట్స్ ఇబ్బందులు తీర్చారు. ప్రత్యేకంగా మహిళ సిబ్బందిని ఏర్పాటు చేసి, టాయిలెట్స్ నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రహదారులు పరిశుభ్రం పట్టణంలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులు, బిజినెస్ కూడళ్ళ దారులు టీచర్స్క్లబ్ రోడ్, ఇందిరారోడ్, ఐబీరోడ్లను రాత్రివేళల్లో ఊడ్చివేయిస్తున్నారు. మిగతా రహాదారులు ఉదయం వేళ పరిశుభ్రం చేయిస్తూ, చెత్త రహిత రహదారులుగా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సానిటేషన్పై ప్రత్యేకశ్రద్ధ పెట్టి, అవసరమైన చోట మురికి కాలువలు నిర్మాణం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రథమస్థానం దేశంలో మంచి స్థానం పదిలం చేసేం దుకు ప్రతీ రోజు పనులతీరును పర్యవేక్షిస్తున్నాం. రహదారులు పరిశుభ్రంగా ఉండేందుకు ఉదయం, రాత్రి వేళల్లో క్లీన్ చేయిస్తున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకొని, అందంగా ఉంచుతున్నాం. – అల్లూరి వాణిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
చేనేత ఆత్మగౌరవం నిలబెడదాం
కోరుట్ల: చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశలో పోరాటం ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కోరుట్ల పద్మశాలీ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు బహుళ ప్రాచుర్యం కల్పించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వర్తక, వాణిజ్య రంగాల్లో మార్గదర్శకులుగా ఉన్న పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కోరుట్ల పద్మశాలీ సంఘం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యక్తిగత వైషమ్యాలకు తావివ్వకుండా పద్మశాలీల సంక్షేమానికి పూర్తి సమయం ఇవ్వాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణకు అలుపెరగకుండా ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతకు ప్రతీ ఒక్కరు నిరంతరం పాటుపడాలన్నారు. ఐక్యంగా ముందుకు సాగితేనే సామాజికంగా, రాజకీయంగా తగిన గుర్తింపు వస్తుందన్నారు. నూతన అధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలీల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. వారి శ్రేయస్సుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొసికె యాదగిరి, ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మార్త రమేశ్, నాయకులు వాసం భూమానందం, సదుబత్తుల హరిప్రసాద్, చెన్న విశ్వనాథం, గుంటుక ప్రసాద్, జక్కుల ప్రసాద్, అల్లె సంగయ్య, జిల్లా ధనుంజయ్, వాసాల గణేష్‌లు పాల్గొన్నారు. కొత్త పాలకవర్గ ప్రమాణస్వీకారం పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షుడిగా గుంటుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రుద్ర సుధాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ రమేష్, సహాయ కార్యదర్శిగా జిందం లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆడెపు నరేష్కుమార్, యువత అధ్యక్షుడిగా అందె రమేష్, ఉపాధ్యక్షుడిగా కటుకం వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల ప్రవీన్‌కుమార్, సహాయ కార్యదర్శిగా బండి సురేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ్‌కుమార్‌తో ఎన్నికల అధికారులు కాచర్ల శంకరయ్య, మార్గం రాజేంద్రప్రసాద్, కడకుంట్ల సదాశివ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్ ఆవిష్కరించారు. -
అనంతపురంలో శ్రావణి.. కోరుట్లలో గణేశ్..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక కొందరు, ఇతర కారణాలతో మరికొందరు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. కారణాలు ఏమైనా నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే చేజేతులా చిదిమేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు విషాదం నింపుతున్నాయి. అనంతపురం పట్టణంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శ్రావణి(16) ఆత్మహత్య చేసుకుంది. సీవీ రామన్ కాలేజీలో చదువుతున్న శ్రావణి.. కాలేజీ హాస్టల్లోనే ఉరివేసుకుని తనువు చాలించింది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య కోరుట్ల: కరీంనగర్ జిల్లా కోరుట్లలో పాలిటెక్నిక్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మిపల్లి తండాకు చెందిన గణేష్ హాస్టల్ గదిలో పురుగులమందు తాగి తనువు చాలించాడు. గణేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని స్థానికులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదు. -
కంచ ఐలయ్యపై దాడికి యత్నం
సాక్షి, జగిత్యాల: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టుకు హాజరయ్యారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తక రచనపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు కోరుట్ల వచ్చారు. అంతకు ముందు జగిత్యాలలో ఆయన బస చేసిన లాడ్జి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హోటల్‌పై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం ఐలయ్య పోలీసుల రక్షణలో కోరుట్ల వెళ్లారు. -
పాపం..జాఫర్..!
కోరుట్ల: ఎడారి దేశాల్లో ఎంతో కొంత సంపాదించుకొచ్చి తమను సంతోషంగా ఉంచుతాడని ఆశించిన ఆ కుటుంబానికి వలసజీవి మృతివార్త అశనిపాతంగా మారింది. ఏడాది కాలంగా ఒకే ఒక్కసారి భర్తతో మాట్లాడిన భార్య, పిల్లలు చివరకు ఆయన ఇక లేరనే సమాచారం అందడంతో హతాశులయ్యారు. ఫోన్ రాకున్నా.. డబ్బులు పంపకున్నా ఎక్కడో ఓ చోట పని చేసుకుని బాగానే ఉంటాడని అనుకున్న ఆ కుటుంబం మరణవార్తతో విషాదంలో మునిగిపోయింది. ఏడాది క్రితం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్ఫత్‌పురాకు చెందిన మహ్మద్ జాఫర్(43) ఏడాది క్రితం లేబర్ పనిమీద సౌదీకి వెళ్లాడు. ఆ తర్వాత నెలరోజులకు కుటుంబ సభ్యులతో ఓ సారి మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పాడు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత జాఫర్ నుంచి ఫోన్‌రాలేదు. జాఫర్ సౌదీలో మారుమూల ప్రాంతంలో ఉద్యోగం కావడంతో ఫోన్ చేయలేకపోతున్నాడని కుటుంబసభ్యులు భావించారు. చివరకు శుక్రవారం సౌదీలో ఉన్న నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌వాసి కోరుట్లకు సమాచారం ఇవ్వడంతో జాఫర్ వార్త సమాచారం తెలిసింది. అనుమానాస్పదంగా.. ఆలస్యంగా సౌదీలోని ఖర్జూ పట్టణానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే హాయల్ అనే ప్రాంతంలో మహ్మద్ జాఫర్ మృతదేహాన్ని అక్కడి పోలీసులు కనుగొన్నట్లుగా కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ నెల 2వ తేదీన జాఫర్ మృతి చెందాడని, అతడి మృతదేహాన్ని అల్‌జోఫ్ పట్టణంలోని సతారా ఆసుపత్రి మార్చురీలో ఉంచారని తెలిసింది. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సహజ మరణంగా భావించి ఆసుపత్రిలో ఉంచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. జాఫర్ అటవీ ప్రాంతంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 25రోజుల వరకు తమకు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాఫర్ సౌదీలో ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలియని కారణంగానే అతడిని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని సౌదీలో ఉంటున్న పెర్కిట్ వాసి చెబుతున్నా.. అతడి మృతిపై అనుమానాలు వీడటం లేదు. మృతదేహం తెప్పించుకోలేని దీనస్థితి.. సౌదీలో మృతిచెందిన మహ్మద్ జాఫర్‌కు భార్య రిజ్వానా, ముగ్గురు మగ పిల్లలు జుబేర్(17), జమీర్(15), సమీర్(10) ఉన్నారు. భార్య రిజ్వానా బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. భర్త గల్ఫ్‌లో కాస్తోకూస్తో సంపాదిస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన రిజ్వానా, పిల్లలు కుటంబ పెద్ద మృతితో దయనీయ స్థితిలో పడ్డారు. సౌదీ నుంచి జాఫర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడం ఖర్చులతో కూడిన పని కావడం డబ్బులు లేక అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయడానికి అంగీకరించే పరిస్థితిలో ఉన్నారు. జాఫర్ మృతదేహాన్ని తెప్పించడంతోపాటు కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు సాయం చేయాలని అర్థిస్తున్నారు. -
ఇద్దరు గల్ఫ్ ఏజెంట్ల అరెస్ట్
కోరుట్ల: పని పేరిట గల్ఫ్‌కు మహిళలను పంపుతున్న ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతం నుంచి మహిళలను ఈ ఏజెంట్లు పని పేరిట గల్ఫ్‌కు పంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లిన వారు హింసకు గురవుతున్నారు. ఈ విధంగా అవస్థలు పడ్డ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గల్ఫ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న బాబు, గంగాధర్‌లను అరెస్టు చేశారు. -
ఈ నెల గడిచేనా..?
► కోరుట్లకు మంచినీటి గండం ► నిండని పాలమాకుల చెరువు ► ఖాళీ అవుతున్న తాళ్ల చెరువు.. ► భూగర్భజలాలకూ దెబ్బ కోరుట్ల: వర్షాలు జాడలేవు.. అరకొరగా వచ్చిన ఎస్సారెస్పీ నీరు..నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోరుట్లకు మంచినీటి ముప్పు పొంచి ఉంది. వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే.. ఈ నెలాఖరులో నీటి గండం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. పెరిగిన అవసరాలు... ఈ మధ్యకాలంలో కోరుట్ల జనాభా సుమారు లక్షకు మించిపోయింది. పట్టణంలోని 31వ వార్డుల్లో కలిపి మొత్తం 22 వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 13 వేలకుపైగా ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో మంచినీటి పైప్లైన్లు లేని ఏరియాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతీరోజు పట్టణ జనాభా అవసరాలకు నల్లా కనెక్షన్ల ద్వారా సరాఫరా చేయడానికి సుమారు 4.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పట్టణ శివారులోని తాళ్ల చెరువు నుంచి నీటిని వాగులో ఉన్న బావుల్లో నింపి వాటర్ ట్యాంకుల ద్వారా పట్టణానికి సరాఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నల్లాల నుంచి నీటిని సరాఫరా చేస్తున్నారు. ఇదంతా మంచినీటి పైప్‌లైన్ ఉన్న చోట మాత్రమే జరుగుతోంది. మంచినీటి పైప్లైన్లు పూర్తిస్థాయిలో లేని భీమునిదుబ్బ, రథాల పంపు, హాజీపురా, ఆనంద్‌నగర్, ఆల్లమయ్యగుట్ట ఏరియాల్లో మంచినీటికి తిప్పలు తప్పడం లేదు. భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడంతో నల్లానీటిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నీటి అవసరాలు మరింత పెరిగాయి. అవసరాలు పెరిగినా నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారడంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నెల గడిచేనా..? పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం వాడుతున్న తాళ్ల చెరువులో నీటి మట్టం దాదాపుగా డెడ్‌స్టోరేజీకి చేరింది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ముందుచూపుతో ఎస్సారెస్పీ నీటిని వదిలిన సమయంలో మరో నీటి వనరుగా ఉన్న పాలమాకుల చెరువును నింపే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఫలితంగా తాళ్ల చెరువు, పాలమాకుల చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులు మరో 20–25 రోజులకు మించి సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు లేని క్రమంలో భూగర్భ జలమట్టం సుమారు 900 ఫీట్లుకు పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటు మున్సిపల్ నల్లా నీరు లేక..అటు బోర్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది క్రితంలా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయాల్సిన దుస్థితి మళ్లీ వస్తుందా..? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. -
కోరుట్లలో భారీ దొంగతనం
కోరుట్ల(జగిత్యాల): పట్టణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక ప్రకాశం రోడ్డులో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్ సోమవారం కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్ వెళ్లారు. తిరిగి మంగళవారం వేకువజామున ఇంటికి చేరుకున్నారు. వారు వెళ్లేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో చూడగా బీరువాలోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు తన ఇంట్లో రూ.6.50 లక్షల విలువైన అభరణాలను ఎత్తుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కోరుట్ల(కరీంనగర్ జిల్లా) కరీంనగర్ జిల్లా కోరుట్లకి చెందిన మాధురి(23) అనే వివాహిత భర్త వేధింపులు తాళలేక ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త శ్రీధర్ ప్లాస్టిక్ దుకాణం నిర్వహించేవాడు. వీరికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. వ్యసనాలకు బానిసైన భర్త తరుచూ వేధిస్తుండడంతో జీవితంపై విరక్తి చెంది మాధురి ఆత్మహత్య చేసుకుందని, తమ కుమార్తె మరణానికి అల్లుడే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త చేతిలో భార్య హతం
కోరుట్ల(కరీంనగర్ జిల్లా): కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుర్రం వనిత, శంకర్ భార్యాభర్తలు. శుక్రవారం శంకర్ తన భార్య తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్త స్రావమై వనిత అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం భర్త శంకర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోరుట్ల ఊసేది..?
రెవెన్యూ డివిజన్‌పై వీడని ఉత్కంఠ కోరుట్ల: జిల్లాల పునర్విభజన విషయంలో కోరుట్ల ప్రజలు రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను వెలిబుచ్చుతూ పెద్ద మొత్తంలో వినతులు పంపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 17,612 అభ్యంతరాలు వచ్చాయి. ఈ విషయంలో సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని స్థానికులు ఆశించారు. అభ్యంతరాలు గడువు ముగిసి పదిహేను రోజులైనా కోరుట్ల రెవెన్యూ డివిజన్ గురించి పట్టించుకోకపోవడం స్థానికంగా చర్చనీయమైంది. పరిశీలన జరిగిందా..? కోరుట్ల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు సరైనవి కావనుకుంటే ఈ విషయంపై ఏ ప్రకటన చేయకపోవడం చర్చనీయమైంది. తప్పుడు పద్ధతిలో అభ్యంతరాలు పంపారని గద్వాల జిల్లాను మొదట పక్కన పెట్టిన ప్రభుత్వం తరువాత వచ్చిన రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు నిర్ణయం తీసుకుంది. కోరుట్ల రెవెన్యూ డివిజన్ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడంతోనే సర్కార్ ఎలాంటి ప్రకటన చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకే ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అభ్యంతరాల స్వీకరణ ఎందుకు చేశారన్న అంశం ప్రస్తావనలోకి వస్తోంది. వీడని ఉత్కంఠ.. కోరుట్ల డివిజన్ ఏర్పాటు అంశంపై ప్రజలు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్పల్లి, కోరుట్ల రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, కొత్తగా ఏర్పాటయ్యే రుద్రంగి, కోరుట్ల అర్బన్ మండలాలను కలుపుకుని కోరుట్ల రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనలు రూపొందించారు. వారం క్రితం ఈ ప్రతిపాదనలను సీఎం పేషికి అందించినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సహకారంతో మెట్‌పల్లితో పాటు కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్‌గా రూపుదిద్దుకుంటుందన్న అశలు ప్రజల్లో చిగురించాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రగతి కనబడలేదు. ఎమ్మెల్యే ప్రతిపాదనలు, పెద్ద ఎత్తున ప్రజల నుంచి కోరుట్ల డివిజన్ కోసం వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి రాకపోవడంతో డివిజన్ ఏర్పాటు అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
కోరుట్లలో ఉద్రిక్తత
చైర్మన్ రాజీనామా చేయాలని మున్సిపల్ ముట్టడికి యత్నం సమావేశం వాయిదా చైర్మన్ దిష్టిబొమ్మ దహనం గుండు గీయించుకుని నిరసన తెలిపిన కౌన్సిలర్ కోరుట్ల: రెవెన్యూ డివిజన్ అంశం చర్చ కోసం ఏర్పాటుచేసిన మున్సిపల్ అత్యవసర సమావేశం ఉద్రిక్త పరిస్థితుల్లో వాయిదా పడింది. చైర్మన్ రాజీనామా చేయాలని కోరుతూ మున్సిపల్ ముట్టడికి కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై మున్సిపల్ చైర్మన్ శీలం వేణు దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశం వాయిదా.. రెవెన్యూ డివిజన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల తరువాత సాధన సమితి ప్రతినిధులు కోరుట్ల డివిజన్ ఉద్యమానికి మద్దతుగా మున్సిపల్ కౌన్సిల్ రాజీనామా చేయాలని కోరారు. దీంతో 16 మంది కౌన్సిలర్లు పదవులకు రాజీనామా ప్రకటించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు. చైర్మన్ వేణు, కొందరు కౌన్సిలర్లు రాజీనామా ప్రకటన చేయకపోవడంతో సాధన సమితి ప్రతినిధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ సమావేశం ఏర్పాటుచేశారు. అప్పటికే మున్సిపల్ చైర్మన్ శీలం వేణు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సమావేశం వాయిదా వేయాలని కోరుతూ కమిషనర్ వాణిరెడ్డికి లేఖ ఇవ్వగా.. వాయిదా వేసినట్లు ప్రకటించారు. సమావేశానికి బీజేపీ కౌన్సిలర్ ఇందూరి సత్యం, టీఆర్ఎస్ జువ్వాడి వర్గం కౌన్సిలర్లు గండ్ర రాజనర్సింగరావు, తిరుమల గంగాధర్, రియాజ్, లోకిని రంజిత్ హాజరయ్యారు. గుండు గీయించుకున్న కౌన్సిలర్ రెవెన్యూ డివిజన్ అంశంపై ఏర్పాటు చేసిన కీలక సమావేశాన్ని ఎలా వాయిదా వేశారని కౌన్సిలర్లు ఇందూరి సత్యం, గండ్ర రాజు అధికారులను నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్ సమావేశానికి రావాలని డిమాండ్ చేశారు. చైర్మన్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఇందూరి సత్యం గుండు గీయించుకున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ శీలం వేణు రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని కోరారు. చైర్మన్ దిష్టిబొమ్మ దహనం మున్సిపల్ సమావేశం వాయిదా పడటం.. ముట్టడి జరగకుండా పోలీసులు బందోబస్తుతో అడ్డుపడడంతో డివిజన్ సాధన సమితి ప్రతినిధులు జాతీయ రహదారిపై చైర్మన్ దిష్టిబొమ్మను దహనంచేశారు. అనంతరం మళ్లీ నల్లజెండాలతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ముట్టడికి యత్నించారు. సాయంత్రం 4గంటల సమయంలో నల్లజెండాలతో మున్సిపల్‌కు చేరుకున్న సాధన సమితి ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల బారికేడ్లు దాటి సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం ఒక్కడే మున్సిపల్ ఆవరణలోకి చేరుకోగా జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆయనను బయటకు పంపించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉన్న డీఎస్పీ పరిస్థితులను నియంత్రించారు. -
సీఎంతో చర్చకు ఎంపీ హామీ
కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం వినతి కోరుట్ల: కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పినట్టు మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, వైస్ చైర్మన్ రఫీయోద్దీన్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనూప్‌రావుతో కలిసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు. కోరుట్లకు ఉన్న అన్ని అనుకూల అంశాలను ఎంపీకి వివరించామని తెలిపారు. ఎమ్మెల్యే కల్వకుంట్లతో సీఎం కేసీఆర్‌ను కలిసిlకోరుట్ల–మెట్పల్లి మధ్యలో రెవెన్యూ డివిజన్ ఉండేలా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనతో పాటు ఎంఐఎం కౌన్సిలర్ చిట్యాల భూమయ్య, టీఆర్ఎస్ నాయకులు జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, సదుల వెంకటస్వామి, మోల్లా మసూద్ ఉన్నారు. ఎంపీ కాళ్లు పట్టుకున్న కౌన్సిలర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ ఎంఐఎం కౌన్సిలర్ చిట్యాల భూమయ్య ఎంపీ కవిత కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. మొదట రెవెన్యూ డివిజన్‌గా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ మార్పులు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల అర్హతలు ఉన్న కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఆయన కోరారు. -
కోరుట్ల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి
ర్యాలీలు, రాస్తారోకోలు పట్టణంలో 144 సెక్షన్ కోరుట్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని చేపట్టిన పోరు ఊపందుకుంది. రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ 144 సెక్షన్ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుకోవాలని సూచించారు. కోరుట్ల మినీవ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదాం రోడ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీసి రాస్తారోకో చేశారు. ముస్లిం మైనార్టీలు తెలంగాణతల్లి విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ మధుకు వినతిపత్రం ఇచ్చారు. దీక్షలో చెట్పల్లి లక్ష్మణ్, వడ్లకొండ తుక్కారాం, బాపురావు పాల్గొన్నారు. డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్ మాట్లాడుతూ కోరుట్ల డివిజన్ సాధించే వరకు ఉద్యమిస్తామన్నారు. -
భగ్గుమన్న కోరుట్ల!
రాస్తారోకోలు..నిరసన ర్యాలీలు ఆమరణ దీక్ష 48 గంటల బంద్‌కు పిలుపు మున్సిపల్ వైస్ చైర్మన్, బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజీనామా కోరుట్ల : మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడంతో కోరుట్లలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. సోమవారం ఉదయం నుంచే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు జరుగుతున్నాయని మెట్పల్లి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం 2 గంటల సమయంలో మెట్పల్లి రెవెన్యూ డివిజన్‌గా మారినట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో కోరుట్ల డివిజన్ సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, వాసాల గణేష్, సనావొద్దీన్ తదితరులు ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ వద్ద రాస్తరోకో చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరి నిముషంలో ఎమ్మెల్యే, ఎంపీ కోరుట్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. అఖిలపక్షం మద్దతు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కోరుట్ల టీడీపీ అధ్యక్షుడు మానుక ప్రవీణ్, కార్యదర్శులు జిల్లా ధనుంజయ్, తోట నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. కోరుట్లకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. వైస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు నేతి శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాలు కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు అడ్డుతగిలాయన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు వెగ్యారపు మురళి, నాయకులు అక్బర్, కలాల భూంసాయిలు మాట్లాడుతూ, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై నాయకుల వివక్ష తగదన్నారు. కోరుట్ల–మెట్‌పల్లిని కలిపి జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణాధ్యక్షులు సదుబత్తుల వేణు, ఇందూరి తిరుమలవాసు మాట్లాడుతూ కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు ఆందోళన నిర్వహిస్తామన్నారు. 48 గంటలు బంద్ మెట్పల్లి రెవెన్యూ డివిజన్‌గా మార్చడాన్ని నిరసిస్తూ 48 గంటల కోరుట్ల బంద్‌కు సాధన సమితి పిలుపునిచ్చింది. కోరుట్ల పట్టణంలోని కిరాణ వర్తక సంఘం, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల సంఘం ప్రతినిధులు బంద్‌కు సహకరించనున్నట్లు ప్రకటించారు. అమరణ దీక్ష.. తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం నాయకులు వాసం భూమానందం డివిజన్ ఏర్పాటులో కోరుట్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అమరణ దీక్షకు దిగారు. ఈ దీక్షను డివిజన్ సాధన సమితి ప్రతినిధులు చెన్న విశ్వనాథం , పేట భాస్కర్, వాసాల గణేశ్, మున్సిపల్ వైస్ ౖచెర్మన్ రఫీయోద్దీన్, బీజేపీ మున్సిపల్ ప్లోర్ లీడర్ ఇందూరి సత్యం ప్రారంభించి మద్దతు ప్రకటించారు. వైస్ చైర్మన్..బీజేపి ఫ్లోర్‌లీడర్ల రాజీనామా కోరుట్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీయోద్దీన్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇందూరి సత్యం తమ పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా సాధన సమితి ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఓ దశలో సంఘీబావం తెలిపేందుకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ శీలం వేణు కారును అడ్డుకున్నారు.