
సాక్షి, కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రాణహాని ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్‌ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం కోరుట్లలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘బీఆర్ఎస్‌లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరికి ప్రభుత్వ పెద్దలందరూ వెళ్లి బెదిరింపులకు గురి చేశారు. నేను అయితే నా తల తీసివేసినా పార్టీ మారను. అభివృద్ధి కోసం పార్టీ మారవలసిన అవసరం లేదు. కోరుట్ల ప్రజలకు అవసరమైన 100 పడకల హాస్పిటల్ సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కేవలం తన స్వార్థం కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తప్పుడు నివేదికలు చదివి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు’అని అన్నారు.
ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతారని వార్తలు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలను కలవటం తీవ్ర చర్చనీయంగా మారింది. ఆయన మనసు మార్చుకొని బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అనంతం కాంగ్రెస్ నేతలు రంగంలోకి ఆయన్ను బుజ్జగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment