
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్‌రెడ్డి షాకిచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. యూటర్న్ తీసుకున్నారు. తిరిగి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఉదయం అసెంబ్లీ ఎల్‌వోపీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కృష్ణమోహన్‌రెడ్డి. ఇది ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
గద్వాల బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల.. ఈ నెల మొదట్లో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే.

Comments
Please login to add a commentAdd a comment