
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరి నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తప్పుకున్నా రు. కరీంనగర్ జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున టి.జీవన్‌రెడ్డి పోటీ చేయనుండటంతో ఆయన్ను కోరుట్ల నుంచి పోటీ చేయాలని మహాకూటమి ముఖ్య నేతలు కోరారు. కోరుట్ల నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో ఏపీ ప్రజల ప్రాబల్యమున్న చోట్లలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆయన విరమించుకున్నట్లు తెలిసింది. కోరుట్ల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని రమణ కోరినట్లు సమాచారం.