L.ramana
-
తెలంగాణలో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తొలుత ఎన్నికల బరిలో నిలబడాలని భావించినా... సీనియర్ నేతలు పార్టీని వీడటం, మరోవైపు ఉన్నవాళ్లు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మిత్రపక్షం కాంగ్రెస్ ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలను ప్రకటించేంది. దీంతో ఒంటరిగా బరిలోకి నిలిచే ధైర్యం చేయలేకపోతోంది తెలంగాణ టీడీపీ. మరోవైపు నామా నాగేశ్వరరావు కోసం ఖమ్మం నుంచి పోటీలో నిలుద్దామని టీడీపీ ముందుగా భావించినా... ఆయన పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం, మిగిలిన స్థానాలకు కనీసం అభ్యర్థులు దొరకని వైనం నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఫలితాలతో సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓడిపోయేదానికి అంత ఖర్చు అవసరమా అనే భావనతో ఉన్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల పోటీ ఆలోచనను విరమించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా...తెలంగాణ టీడీపీ నేతలతో ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న టీడీపీ నేతలతో భేటీ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలంగాణలో తాజా పరిణామాలపై చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్‌పై మద్దతు ఇచ్చే అంశంపై చర్చించేందుకు టీడీపీ నేతలు ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. -
ఎన్నికల బరి నుంచి ఎల్.రమణ ఔట్ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరి నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తప్పుకున్నా రు. కరీంనగర్ జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున టి.జీవన్‌రెడ్డి పోటీ చేయనుండటంతో ఆయన్ను కోరుట్ల నుంచి పోటీ చేయాలని మహాకూటమి ముఖ్య నేతలు కోరారు. కోరుట్ల నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో ఏపీ ప్రజల ప్రాబల్యమున్న చోట్లలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆయన విరమించుకున్నట్లు తెలిసింది. కోరుట్ల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని రమణ కోరినట్లు సమాచారం. -
మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు
-
టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం మహానాడులో ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, తమ నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అయితే పట్టపగలే అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించిన విషయం విదితమే. పార్టీ ధిక్కారానికి పాల్పడిన మోత్కుపల్లిను టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎల్.రమణ తెలిపారు. ‘మోత్కుపల్లి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఆయనకు గవర్నర్ పదవి రాదని తెలిసి గొడవ మొదలుపెట్టారు. కేసీఆర్...ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని నరసింహులు ఎలా చెపుతారు. నేరెళ్ల బాధితుల విషయంలో మోత్కుపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెబుతారు. ఆయన ద్రోహానికి క్షమాపణ లేదు. అందుకే మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబును కలిసిన ఎల్.రమణ
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ బుధవారం కలిశారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో రేపటి నుంచి (గురువారం) నుంచి తెలంగాణలో తలపెట్టే పల్లె పల్లెకు తెలుగుదేశంపై చర్చించారు. అలాగే ఈ నెల 18న ఎన్టీఆర్ వర్థంతి ఏర్పాట్లు, రక్తదాన శిబిరాల నిర్వహణ, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఎల్.రమణకు దిశానిర్దేశం చేశారు. -
రాజకీయంగా నా ఎత్తుగడ నాకుంది: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీని వీడినా రేవంత్ రెడ్డి... ఎల్. రమణల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎల్.రమణపై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. తనతో పాటు పార్టీ మారమని ఏ ఒక్కరినీ కోరలేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తాను చెప్పాలనుకున్నది చంద్రబాబు నాయుడుకు చెప్పే వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ...‘ రాజకీయంగా నా ఎత్తుగడ నాకుంది. డిసెంబర్ 9న మీట్ ది ప్రెస్‌లో పాల్గొంటా. ఆ తర్వాత కేసీఆర్ ఆలోచనలు అన్నీ నా చుట్టే తిరుగుతాయి. టీడీపీలో ఉంటూ కేసీఆర్‌కు ఉపాధి కూలీ పని చేస్తున్నవారికి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరితే ఎల్. రమణ ఎందుకు మాట్లాడలేదు. కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఎల్ రమణ నాపై విమర్శలు చేస్తున్నారు. కొడంగల్‌లో సమావేశం పెడతా అంటున్న రమణ...గజ్వేల్, సిద్ధిపేట్‌లో సమావేశం పెడతా అని ఎందుకు చెప్పడం లేదు. చేరాలనుకుంటే ముసుగు తీసి నేరుగా టీఆర్ఎస్లో ఎల్.రమణ చేరొచ్చు కదా. టీడీపీలో ఉన్న నేతలందరిని టీఆర్ఎస్లో చేర్చేవరకూ ఆయన టీఆర్ఎస్లో చేరడు. నాకు రమణ సర్టిఫికేట్ అవసరం లేదు. చేతనైతే సొంత నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని గెలవాలి. నా యుద్ధం కేసీఆర్ కూలీలపై కాదు... కేసీఆర్‌పైనే.’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. -
ఆయనతో కలిసి రేవంత్ కుట్ర పన్నాడు..
సాక్షి, హైదరాబాద్ : పార్టీని వీడిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ టీడీపీని విచ్ఛిన్నం చేయడానికి రేవంత్ కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్.రమణ ఆదివారమిక్కడ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్‌రావు తరహాలో రేవంత్ కూడా పార్టీని దెబ్బతీయాలని చూశారు. నాడు ఇందిరా గాంధీతో కలిసి నాదెండ్ల టీడీపీని విచ్ఛిన్నం చేయాలని చూశారో, నేడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో కలిసి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న సమయంలో చేసే ఆరోపణలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా భావాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు ఉంటుంది. రేవంత్‌కు పార్టీ సముచిత స్థానం ఇచ్చింది. అయితే ఆయన అది నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి పార్టీని వీడుతూ పెట్టుకున్నది కన్నీళ్లు కాదు..మొసలి కన్నీరు. ఇక నేను రేవంత్‌రెడ్డిని సోదరుడిలా భావించి ప్రోత్సహించాను. అవకాశవాద రాజకీయాలకు రేవంత్ రెడ్డి పరాకాష్టగా నిలిచాడు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీకి నిలబెడతాం. మా భావాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు ఉంటుంది.’ అని అన్నారు. రేవంత్‌పై ఎల్.రమణ సంచలన ఆరోపణలు -
చంద్రబాబుతో రేవంత్ ఏకాంత భేటీ
-
చంద్రబాబుతో రేవంత్ ఏకాంత భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి పంచాయితీ ఎట్టకేలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుతో శుక్రవారం రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ టీడీపీ నేతలతో పాటు రేవంత్ రెడ్డి రేపు (శనివారం) అమరావతిలో చంద్రబాబుతో మరోసారి సమావేశం కానున్నారు. రేపు ఉదయం పది గంటలకు అందరూ హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబుతో జరిగిన తెలంగాణ టీడీపీ నేతల సమావేశానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో పార్టీలోని ప్రతి ఒక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు. అయితే సమయం లేనందున రేపు అమరావతిలో మరోసారి భేటీ కావాలని అధినేత ఆదేశించినట్లు పార్టీ నేత రావుల చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించామని, రేపటి సమావేశంలో అన్ని అంశాలను చర్చకు వస్తాయని తెలిపారు. -
అందరి బాగోతం బయటపెడతా: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు వివరిస్తానని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడే అందరి బాగోతం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత పదవి నుంచి తప్పుకోవాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పంపిన ఎస్ఎంఎస్పై రేవంత్ రెడ్డి ...పార్టీ నేతల వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన టీడీఎల్పీ నేత కుర్చీలో కూడా పక్క సీట్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..టీడీపీలో కొంతమంది అంతర్గత గొడవలు సృస్టిస్తున్నారని, తన పోరాటం తెలంగాణ సీఎం కేసీఆర్ మీదనే అని అన్నారు. తాజా పరిణామాలు కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయన్నారు. కొంతమంది టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ వచ్చేలోపే పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు కూడా సరిదిద్దుకోలేని విధంగా పార్టీని డ్యామేజీ చేసేలా కొందరు తాపత్రయపడుతున్నారని రేవంత్ అన్నారు. టీడీపీ క్యాడర్‌ను చూస్తే బాధగా ఉందని, క్యాడర్ మనోభావాలకు విరుద్ధంగా నేతలు నడవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తనను ఎంత పరుషజాలంలో దూషించినా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా రమణ నోరు మెదపకపోవడం దారుణమని రేవంత్ పేర్కొన్నారు. -
వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి పార్టీ పదవులకు కోత పడింది. రేవంత్‌రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ అంశంపై తనతో ఫోన్లో మాట్లాడారని ఆయన వెల్లడించారు. రేవంత్‌కు పదవులు ఏవీ ఉండవని, ఆయనను కేవలం ఎమ్మెల్యేగానే చూడాలని చంద్రబాబు సూచించినట్లు ఎల్.రమణ తెలిపారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రేవంత్‌కు తాము సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రేవంత్‌రెడ్డిని అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించలేదని, ఏ నిర్ణయాన్ని అయినా పార్టీ అధ్యక్షుడు తననే తీసుకోమన్నారని ఎల్.రమణ పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని వివరించినట్లు నిన్న రమణ ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ గోల్కొండ హోటల్లో టీడీపీ, బీజేపీ నేతల సమావేశం కానున్నారు. తెలంగాణ టీడీఎల్పీ సమావేశం రద్దు టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు? అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా వెనక్కి తగ్గారు. తెలంగాణ టీడీఎల్పీ సమావేశాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. -
రమణ వర్సెస్ రేవంత్ రెడ్డి
-
‘రమణ తన పని తాను చూసుకుంటే మంచిది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది. టీడీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఓవైపు సన్నాహాలు చేస్తుంటే...మరోవైపు ఎల్.రమణ మాత్రం పార్టీతో పాటు టీడీపీఎల్పీ కార్యక్రమాలేవీ నిర్వహించవద్దని రేవంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ’ టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎల్. రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది.’ అని హితవు పలికారు. అయితే రేవంత్ టీడీఎల్పీ సమావేశం ఉంటుందని ప్రకటన చేస్తే...ఎల్.రమణ అదే సమయంలో గోల్కొండ హోటల్లో టీడీపీ-బీజేపీ నేతల సమావేశం ఉంటుందని పోటీగా ప్రకటన చేయడం విశేషం. మరోవైపు ఎల్.రమణ ...పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
రేవంత్ వర్సెస్ రమణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లూ కలసి పని చేసిన ఇద్దరు నేతల మధ్య విభేదాలు చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు ఒక్కసారిగా ఆ పార్టీని ఓ కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ కావడంతో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశంలో రేవంత్‌ను మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ నిలదీయడంతో.. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వచ్చాక అన్ని విషయాలు వివరిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన ఏపీ టీడీపీ నేతల వ్యవహారంపై చేసిన ప్రకటనలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్‌కు ఏపీ మంత్రులు, కొందరు నాయకులు వంగి సలాములు కొడుతున్నారంటూ రేవంత్ చేసిన విమర్శకు అటు నుంచి జవాబు లేకపోగా పొలిట్‌బ్యూరోలో తెలంగాణ నేతలతోనే చర్చకు పెట్టారు. కాంగ్రెస్ నేతలతో కలసినట్లు వస్తున్న వార్తలపై రేవంత్ వివరణ ఇవ్వాలని రమణ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్పీ నేత పదవుల్లో రేవంత్ కొనసాగితే పార్టీ కి నష్టమని చంద్రబాబుకు నివేదిక పంపా రు. చివరకు రేవంత్ పదవులు ఏవీ ఉండవని, కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతారని బుధవారం ప్రకటన విడుదల చేశారు. రేవంత్ ఎమ్మెల్యే మాత్రమే..: ఎల్.రమణ బుధవారం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు హాట్‌హాట్‌గా మారాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ వ్యూహంపై చర్చించేందుకు టీడీఎల్పీ సమావేశం జరగాల్సి ఉంది. టీడీఎల్పీ నేతగా రేవంత్ ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు, ఎల్పీ నేత పోస్టుకు దూరంగా ఉండాలని కోరామని, ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతారని, ఈ మేరకు చంద్రబాబు తనకు ఫోన్లో సమాచారం ఇచ్చారని రమణ ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో ఎల్పీ సమావేశం నిర్వహించాలని రేవంత్ నిర్ణయించగా, గోల్కొండ హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశానికి రమణ ప్లాన్ చేశారు. రేవంత్ సమావేశానికి ఎవరూ వెళ్లకూడదని పార్టీ నేతలను ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేగా గోల్కొండ హోటల్లో నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా రేవంత్‌కు ఆహ్వానం పంపామని రమణ చెప్పారు. తన పని చూసుకుంటే మంచిది: రేవంత్ మరోవైపు గోల్కొండ హోటల్లో జరిగే భేటీ గురించి తనకు తెలియదని, ఎలాంటి ఆహ్వా నం అందలేదని రేవంత్ స్పష్టం చేశారు. ‘టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది’ అని రేవంత్ హితవు పలికారు. చంద్రబాబు తిరిగి వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తి లేదని రేవంత్ నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గం చెబుతోంది. -
రేవంత్ వల్లే టీడీపీ-బీజేపీ దోస్తీ చెడింది!
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. రేవంత్ కోసం తాను ఎంతో చేశానని, కష్టసమయంలో అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో చిచ్టాచ్ చేసిన రమణ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు చెప్పకుండా ఢిల్లీకి ఎందుకెళ్లారు? : ‘‘రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైనప్పుడు అతనికి మద్దతుగా అన్ని పార్టీలనూ కూడగట్టింది నేనే. కష్టసమయాల్లో అతనికి అండగా నిలిచాను. అసలు రేవంత్ వైఖరి వల్లే టీడీపీకి బీజేపీ దూరమైంది. పార్టీ అధ్యక్షుడినైన నాతో చెప్పకుండా రేవంత్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఒకవేళ కోర్టు పనులే అయిఉంటే అందులో దాచడానికి ఏముంటుంది?’’ అని రమణ వాపోయారు. బాబు రాగానే చర్యలు : అటు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను, ఇటు పాలమూరులో ఎమ్మెల్యే డీకే అరుణను కలవడంపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిందేనని, అప్పటిదాకా ఆయనను పార్టీ సమావేశాలకు రానిచ్చేదిలేదని రమణ స్పష్టం చేశారు. క్రమశిక్షణను ధిక్కరిస్తే ఎవ్వరినైనా ఉపేక్షించబోమని, విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగి రాగానే రేవంత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి? : ఏపీ టీడీపీ మంత్రులు, నాయకులకు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తూ, ఫ్యాక్టరీల ఏర్పాటులో సహకరిస్తోందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైనా ఎల్.రమణ స్పందించారు. ‘‘అసలు ఏపీ టీడీపీ నేతలు తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించారు. కాగా, రేవంత్ నిష్క్రమణకు మూల కారణంగా భావిస్తోన్న ‘టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు’ అంశంపై రమణ ఆచితూచి స్పందించారు. పొత్తుల గురించి ఇప్పుడు అనవసరమని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని అన్నారు. -
రేవంత్ వల్లే టీడీపీ-బీజేపీ దోస్తీ చెడింది!
-
రేవంత్‌రెడ్డికి టీటీడీపీ ఝలక్
సాక్షి, హైదరాబాద్ : పార్టీ విధానాలపై అసమ్మతి గళం విప్పిన కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడుకు తెలంగాణ తెలుగుదేశం కళ్లెం వేసే ప్రయత్నం చేసింది. ‘ఆయనతో పాటు ఇంకొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారు’ అన్నది కేవలం ప్రచారమేనని, అలాంటి వార్తలు చూసి కింది స్థాయి నేతలెవ్వరూ గందరగోళానికి గురికావద్దని పిలుపునిచ్చింది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి శనివారం మీడియా సమావేశంలో ఉమ్మడి ప్రకటన చేశారు. ఆధినాయకుడు చెప్పిందే వేదం : క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో తప్పిదాలకు పాల్పడే ఎంతటి నాయకుడినైనా సహించబోమని టీటీడీపీ చీఫ్ రమణ అన్నారు. ‘‘రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారని, తనతోపాటు పార్టీని వీడే నాయకుల జాబితా ఇచ్చారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలి. అసలు ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న విషయాన్ని టీడీపీ శ్రేణులే ప్రజలకు తెలియజెప్పాలి. అక్టోబర్ 8న పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యనాయకులంతా కట్టుబడి ఉండాలి’’ అని రమణ తెలిపారు. పొత్తులపై ఏమన్నారంటే.. : టీటీడీపీలో తాజా వివాదానికి అసలు కారణమైన పొత్తుల వ్యవహారంపై నేతలు ఆచితూచి స్పందించారు. 2019 ఎన్నికల్లో.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, టీడీపీతో భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారని రమణ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే దిశగా టీడీపీ ఏనాడూ ఆలోచన చేయలేదని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. -
ప్రజల జీవితంతో కేసీఆర్ చెలగాటం: రమణ
హైదరాబాద్: జిల్లాలు, మండలాల విభజన పేరిట కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ఆడుతున్న కపట నాటకం ఇదన్నారు. నల్లగొండ జిల్లా గట్టుప్పలను మండలంగా ప్రకటించాలంటూ ఆత్మహత్యాయత్నం చేసి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏర్పుల యాదయ్యను ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నూతన జిల్లాలు, మండలాల విభజన సహేతుకంగా లేదని.. టీడీపీ ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టం చేసిందని రమణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకుల్లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే జిల్లాలు, మండలాల విభజనలో సామాన్య ప్రజలు బలిపశువులు అవుతున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. -
రైతుల సమస్యలను పట్టించుకోవాలి
వరంగల్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫాంహౌజ్‌ను వీడి రైతుల సమస్యలను పట్టించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పినట్లుగా ఏ రైతుకూ రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం విడతల వారీగా ఇస్తున్న రుణమాఫీ బ్యాంకుల వడ్డీలకే సరిపోతుందన్నారు. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలి : రేవంత్‌రెడ్డి ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ చెబుతున్నారని.. ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు ధర్నాలు చేస్తుంటే పాలకులకు కనపడడం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. నకిలీ విత్తనాలపై విచారణ జరిపి నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చిన వ్యవసాయశాఖ కార్యదర్శి ప్రియదర్శిని ఆ కంపెనీకి నోటీసులు ఇస్తే సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకు దీర్ఘకాలపు సెలవుపై వెళ్లారన్నారు. -
టీటీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయి. ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని అతలాకుతలం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వీరిద్దరిలో ఎవరిని సమర్థించాలో, ఎవరితో పాటు కలసి ముందుకు సాగాలో తెలియక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పార్టీ సాగుతున్న తీరు, మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటి పట్ల పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించకపోవడం పట్ల సీనియర్ నేతల్లో నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ తీరుపై సీనియర్ల కినుక... పార్టీలో రేవంత్‌రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యం పట్ల రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు, జిల్లాస్థాయిల్లోని నాయకులు సైతం కినుక వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డి దుందుడుకు వైఖరి, ఆయా సమస్యలు, అంశాలపై స్పందిస్తున్న తీరును కూడా పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యనేతలు పీకల్లోతు కూరుకుపోయి తెలంగాణలో పార్టీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యాన్ని సైతం పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు సైతం తమ రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు టీఆర్ఎస్లో చేరేందుకు అవకాశం లేక.. ఇటు కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో చేరలేక మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మా రడంతో రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే కోణంలో ముఖ్యనాయకుల్లో తీవ్రమైన అంతర్మథనం సాగుతోంది. జిల్లాస్థాయిల్లోనూ లుకలుకలు కష్టకాలంలో పార్టీ వెంట ఉండి నడుస్తున్నా, క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా జిల్లాస్థాయిల్లో ఎదగకుండా పార్టీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ నియంత్రించడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెలుగు యువతతో పాటు వివిధ అనుబంధ రాష్ట్ర కమిటీల ఏర్పాటు, ఆయా పదవుల నియామకాల్లో సీనియర్లకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం పట్ల పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. పెద్ద సంఖ్యలో కార్యవర్గంతో ఏర్పాటు చేసిన ఈ ‘జంబో కమిటీ’ల్లోనూ పార్టీని నమ్ముకున్న వారికి తగిన గౌరవం లభించక అంతర్గతంగా పార్టీలో నిరసన పెల్లుబుకుతోంది. -
ప్రజాసమస్యలపై పోరాటాలు సాగించాలి
టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి * రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా విభాగం పోరాటాలను సాగించాలని తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం మెడలు వంచాలని, గతంలో మహిళా విభాగం చేసిన పోరాటాలు ఫలప్రదం అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతవరకు మహిళలకు ప్రాతినిధ్యమే కల్పించకపోవడం దారుణమన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళా నేతలు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ మహిళా విభాగాన్ని బలోపే తం చేసి, సమస్యలపై సమరాన్ని సాగించడానికి సమాయత్తమవుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. కాగా, శాసనసభ్యులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాల చెల్లింపు నిలిపివేయడం సిగ్గుచేటని టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. -
నేడు గవర్నర్‌తో టీటీడీపీ నేతల భేటీ
రాయికల్ : భూసేకరణ చట్టం 2013 అమలు చేయాలని, ఎంసెట్ లీకేజీ కారకులైన మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీటీడీపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గవర్నర్‌తో భేటి కానున్నట్లు ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి తన కుటుంబ ప్రయోజనాల కోసం గత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పదహారుసార్లు హైకోర్టు ప్రభుత్వానికి పలు జీవోలపై మొట్టికాయ వేసిందని గుర్తుచేశారు. ఎంసెట్ లీకేజీ నైతిక బాధ్యత వహిస్తూ విద్య, వైద్యశాఖ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో గవర్నర్‌తో కలిసివినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. -
ప్రజలను మభ్యపెడుతున్న సర్కారు
ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాల అర్బన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు వాపును బలుపని భ్రమపడుతున్నారన్నారు. బుధవారం జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రమణ మాట్లాడుతూ... దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లతోపాటు ఎన్నో హామీలిచ్చి ఓట్లు దండుకున్న టీఆర్ఎస్... అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల బతుకులతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పొట్టకొట్టేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు 123 జీవో తీసుకొచ్చారన్నారు. ఇక మామ అల్లుళ్ల ఆటలు సాగవని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామని అన్నారు. రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ నిధులు అందలేదని, వారి సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కనీసం ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర విడుదల చేసిన కరువు సహాయక నిధులను రైతులకు నయా పైసా ఇవ్వలేదన్నారు. తనను అవినీతిపరుడని ఆరోపించడం హరీష్‌రావుకు తగదన్నారు. ప్రజల కోసమే టీడీపీ పనిచేస్తోందని, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బడుగు బలహీనవర్గాల ప్రజలు తమ వెంటే ఉంటారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.విజయరమణారావు మాట్లాడుతూ... జిల్లాలో రూ.2700 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు రైతులకు రూ.270 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. దీంతో రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చుకుని పంటలు వేసుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు రూపొందిస్తామన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బాలె శంకర్, కౌన్సిలర్లు వొల్లం మల్లేశం, లక్ష్మి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జయశ్రీ, నాయకులు శివకేసరి బాబు, దయాల మల్లారెడ్డి, నవ్వోతు రవీందర్, సారంగాపూర్, రాయికల్ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గ్రేటర్ ఎన్నికల్లోనూ టీటీడీపీకి తిప్పలు
-
చంద్రబాబు మిత్రధర్మం పాటించమన్నారు
- వరంగల్ ఉప ఎన్నిక బరిలో ఎన్డీఏ అబ్యర్థే - స్పష్టం చేసిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ విజయవాడ: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నకలో టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలపడం లేదని, ఎన్డీఏ అబ్యర్థి మాత్రమే పోటీ చేస్తారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో టీటీడీపీ నేతల కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'వరంగల్ లో టీడీపీ అభ్యర్థినే నిలపాలని కార్యకర్తలు కోరారు. వారి అభ్యర్థనను అధినేత ముందుంచాం. అయితే మిత్రధర్మం పాటించాలని చంద్రబాబు చెప్పారు. అందుకే పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే ఆలోచనను ఇంతటితో వదిలేస్తున్నాం. ఎడ్జీఏ అభ్యర్థే పోటీచేస్తారు' అని రమణ పేర్కొన్నారు. అయితే అభ్యర్థి ఎవరనే విషయం టీటీడీపీ అధ్యక్షుడ, టీ బీజేపీ అధ్యక్షుడు సంయుక్తంగా నిర్ణయిస్తారని, ఈ మేరకు చర్చలు జరపాల్సిందిగా చంద్రబాబు సూచించారని రమణ చెప్పారు. పొత్తులో బాగంగా 2014 ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగటం, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామాచేసి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ దఫా టీడీపీ అభ్యర్థినే పోటీకి దింపాలని స్థానిక నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటికే అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిసింది. ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను ఢిల్లీకి పంపింది. -
ప్రభుత్వ కుట్రలో భాగంగానే అరెస్టులు
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను శనివారం ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, అరెకపూడి గాంధీ, సాయన్నలతో కలసి రమణ ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చర్లపల్లి జైలు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతున్న కక్షసాధింపు చర్యలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అక్రమ కేసుల నుంచి తమ నేతలు త్వరలోనే నిర్దోషులుగా బయటకొస్తారన్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు అడ్డంకి కాదని, రాజకీయ దురుద్దేశంతోనే అసత్య ప్రచారం సాగిస్తున్నారని చెప్పారు. -
'ఏడాదైనా పాలన గాడిలో పడలేదు'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే వివేక్ బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా పాలన గాడిలో పడలేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెలు, ఉద్యమాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఉపాధి హామీ, మున్సిపల్, రెవిన్యూతోపాటు అన్ని శాఖ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. ఉద్యమ న్యాయకుడిగా అధికారులు, పాలకుల ఇళ్ల ముందు చెత్తవేయాలని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటలను ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు మళ్లీ ఆయనకే అప్పచెబుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చాలని ఎల్.రమణ, వివేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేష్ కుమార్ అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎల్ రమణ, వివేక్ ఆరోపించారు. -
'కొత్త ప్రాజెక్టులంటూ టీఆర్ఎస్ పబ్బం'
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రాజెక్టులంటూ పబ్బం గడుపుతోందని టీటీడీపీ నేతలు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బాబ్లీ ప్రాజెక్టు ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులపై టీఆర్ఎస్ శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 75 శాతం పూర్తి అయని ప్రాజెక్టులకు ముందుగా నిధులు కేటాయిస్తే.. ఏడాదిలో పూర్తయి లక్ష ఎకరాలకు నీరందే అవకాశం ఉందని వారు సూచించారు. వాటన్నింటిని గాలికి వదిలేసి కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. ఆ నెపంతోనే టీఆర్ఎస్ కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా తెచ్చి ఐదేళ్లలో పూర్తి చేస్తామని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటర్ గ్రిడ్, ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్సీ ప్రాజెక్టు ఎడారి అయ్యేందుకు సీఎం కేసీఆరే కారణమని వారు ఆరోపించారు. ప్రాజెక్టుల పని ఆగితే వాటిని టీడీపీ అడ్డుకుంటోందని మాట్లాడటం సమంజసం కాదన్నారు. -
'రేవంత్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు'
-
రైతు ఆత్మహత్యలపై రాహుల్‌వి మొసలి కన్నీళ్లు
ప్రాణహిత డిజైన్ మార్చొద్దు: టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ విమర్శించింది. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో విదర్భ రైతుల ఆత్మహత్యలపై పార్లమెంటులో కన్నీళ్లు పెట్టుకున్న రాహుల్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏ ప్రయత్నం చే యలేదని ఆ పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడిరాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 11 నెలల టీఆర్ఎస్ పాలనలో వెయ్యిమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కనీసం కాంగ్రెస్‌వారికి కూడా భరోసా ఇవ్వలేదు రాహుల్‌గాంధీ పర్యటనపై కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్: రైతుభరోసా యాత్ర పేరిట తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీసం కాంగ్రె స్ కార్యకర్తలకు కూడా భ రోసా కల్పించలేకపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు సాంబమూర్తి, వి.దినేష్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాగూరావు నామోజీలతో కలసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ప్రజాసమస్యలపై పోరాడుతానంటున్నా రాహుల్‌గాంధీ గత పదేళ్లు ఎక్కడ తొంగున్నారని ప్రశ్నించారు. మోదీ సూట్ గురించి అపరిపక్వతతో మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇక్కడకు వచ్చి భూమి బంగారం అని మాట్లాడుతున్న రాహుల్ మరి తన బావ వాద్రాకు ఇచ్చిన భూమి, గతంలో యూపీఏ ప్రభుత్వం సేకరించిన భూమి ఇనుమా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గజం కూడా సేకరించలేదన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ది.. పాపాల చరిత్ర : గట్టు హైదరాబాద్: కాంగ్రెస్‌ది పూర్తిగా పాపాల చరిత్ర అని, చేసిన పాపాలను కడిగేసుకునేందుకు చేపడుతున్న ఈ యాత్రకు ‘పశ్చాత్తాప యాత్ర’ అని పేరు పెట్టుకుంటే సరిపోయేదని టీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఇది, రైతు భరోసా యాత్ర కాదని, ఫక్తు రాజకీయ, కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇవ్వాళే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ మాదిరిగా యాత్ర చేపడుతుంటే, రాహుల్ గాంధీ మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇవ్వలేదు, తాగడానికి నీరివ్వలేదు, ఎవరికీ ఏ సాయం చేయలేదు, కాబట్టే క్షమాపణ చెప్పడానికి వచ్చానని రాహుల్ అంటే కరెక్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. పరిహారం ఇచ్చి.. పాపాలను కడి గేసుకోలేరు రాహుల్ పర్యటనపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ : పదేళ్ల తమ పదవీ కాలంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి, వారి దుస్థితికి, ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించి తన పాపాలను కడిగేసుకోలేదని టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ నివారించలేకపోయిన రైతు ఆత్మహత్యలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం పదినెల్ల కాలంలో చేయలేక పోయిందంటూ విమర్శించడం విడ్డూరమన్నారు. రాహుల్‌ది కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నమన్నారు. -
ప్రశ్నించినందుకే సస్పెన్షన్
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణలో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులకు భరోసా కల్పించాలని తాము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే టీటీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎన్టీఆర్ సంక్షేమ నిధి నుంచి రూ.50వేల చొప్పున 74మందికి ఆర్థికసాయం చెక్కులు అందజేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తరఫున ఒక్క అధికారి గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించలేదని అన్నారు. జిల్లాలో 74మంది ఆత్మహత్య చేసుకుంటే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కూడా పరామర్శించకపోవడం బాధాకరమని తెలిపారు. 25 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికారుల వద్ద రిపోర్టులు ఉన్నాయని తెలిపారు. రైతు కుటుంబాలకు భరోసా, మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పత్తి పంటకు క్వింటాల్‌కు కనీసం రూ.5వేల మద్ధతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సీసీఐ చైర్మన్‌ను రప్పించి వారికి మద్దతు ధర దక్కేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ జగన్మోహన్ను కలిసివినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పశ్చిమ, తూర్పు జిల్లా అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, అరిగెల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు గోపినాథ్, ప్రకాష్‌గౌడ్, ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావ్, యూనుస్ అక్బానీ, రాజేశ్వర్, నైతం వినోద్, బీజేపీ నేత పాయల్ శంకర్ పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనపై వ్యతిరేకత..
మహేశ్వరం: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యాబ్సీటి, హార్డ్‌వేర్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, పలు కంపెనీలను తీసుకొచ్చింది టీడీపీనే అని పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇమాంగూడ శ్రీశైలం రహదారిపైన సామ సంజీవరెడ్డి గార్డెన్లో టీడీపీ నియోజకవర్గ విసృ్తత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రథమంగా లేఖ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని అభివర్ణించారు. సమగ్ర సర్వే పేరుతో స్థానికేతరులను భయపేట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు జీ 4 పరిపాలన ఇస్తానని హామీ ఇచ్చి గెలుపొందాక కే 4 (కేసీఆర్ కుటుంబం... కేసీఆర్, కేటీఆర్, కవిత, హరిష్‌రావు) పాలన అందిస్తున్నాడని ఆరోపించారు. మూడు నెలల పాలనలో పలువురు రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా సీఎం కేసీఆర్ స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా టీ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ త్వరలో జరిగే జీఎచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కేసీఆర్ ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ..కేసీఆర్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఆకర్ష్‌లకు ఎవరు లొంగరన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి తప్పారని అన్నారు. 2019లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వ రం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బతికున్నంత కాలం టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు కన్నతల్లిలాంటి టీడీపీని వీడొద్దని సూచించారు. అంతకుముందు ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలు, నగర పంచాయతీ వార్డు సభ్యు లు, సర్పంచ్‌లకు ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు లేక వెలవెల ఇమాంగూడలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలు లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. మహేశ్వరం , కందుకూరు నుండి నాయకులు, కార్యకర్తలు అశించినంతగా హజరుకాలేదు. సరూర్‌నగర్ డివి జన్, ఆర్కేపురం నుండి జనాలను తీసుకొచ్చారు. టీఆర్ఎస్లో చేరే టీడీపీ నాయకులు, కార్యర్తలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ముఖ్యనేతలు ప్రసంగిస్తున్నప్పుడు కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో నేతలు ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మాల్కజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, సరూర్‌నగర్ జెడ్పీటీసీ జె. నరేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధానకార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, సర్పంచ్ లు జె.లక్ష్మయ్య, డి. సుధాకర్, ఆనందం, మంద కవిత, ముత్యం, పోచయ్య, సాలీ, యాదమ్మ , పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, కృష్ణ, యాదగిరి, కందుకూరు, సరూర్‌నగర్ మండలాల అధ్యక్షులు పి. ఆనంద్, తీగల అమర్నాథ్రెడ్డి, నాయకులు జయేందర్, లక్ష్మినర్సింహ్మరెడ్డి, సత్యనారాయణ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర తెలంగాణలో ఉత్తిదే
ఐదు జిల్లాల్లో కానరాని టీడీపీ ... 72చోట్ల పోటీ.. 15సీట్లతో సరి * పనిచేయని బీసీ సీఎం నినాదం * నల్లగొండలో జీరో..ఖమ్మంలో గెలిచింది ఒక్కటే * తెలంగాణ వ్యతిరేక పార్టీగా తిరస్కరించిన జనం * టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు మూడో స్థానం * ఓడిన తుమ్మల, మోత్కుపల్లి, రేవూరి, రావుల తదితరులు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజానీకం తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్నారన్న కోపంతో చంద్రబాబునాయుడు పార్టీని ఇక్కడి ఓటర్లు ఓడించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది తామేనని టీడీపీ అభ్యర్థులు చెప్పుకున్నా, వారి మాటలను ఓటర్లు నమ్మలేదు. బీజేపీ పొత్తుతో తెలంగాణలోని 72 సీట్లలో పోటీచే సిన టీడీపీ కేవలం 15 సీట్లలోనే గెలుపొందింది. 9 లోక్‌సభ సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ కేవలం మల్కాజిగిరిలోనే పోటీ ఇవ్వగలిగింది. గత లోక్‌సభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహించిన రమేష్ రాథోడ్ (ఆదిలాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం)పరాజయం పాలయ్యారు. రమేష్ రాథోడ్ మూడో స్థానంలో నిలవగా, నామా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చినా, చివరికి ఓడిపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు, మోడీ ప్రభావంతో 10అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మిగతా జిల్లాలన్నీ కలిపి ఐదు సీట్లకే పరిమితమైంది. తెలంగాణలోని సగం జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రెండేసి సీట్ల చొప్పున గెలుచుకున్న టీడీపీ.. ఖమ్మంలో సత్తుపల్లిలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ ఐదు సీట్లు కూడా అభ్యర్థుల వ్యక్తిగత బలంతోనే విజయం సాధించడం గమనార్హం. గత శాసనసభలో టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), రేవంత్‌రెడ్డి (కొడంగ ల్), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్) తెలంగాణ వాదాన్ని తట్టుకొని సొంతబలంతో మళ్లీ విజయం సాధించగలిగారు. నారాయణపేటలో ఓట్ల చీలిక టీడీపీకి అనుకూలించి విజయాన్ని అందించగా, పరకాలలో ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ధర్మారెడ్డి సానుభూతితో ఈసారి విజయాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి విజయం సాధించి ఈసారి ఖమ్మం జిల్లా మధిరకు వలస పోయిన టీటీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులుకు అక్కడ నిరాశే ఎదురైంది. ఆయన కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ జగిత్యాలలో మూడోస్థానానికి పరిమిత మయ్యారు. టీడీపీ సీనియర్లు, గత శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (నర్సంపేట), రావుల చంద్రశేఖర్ రెడ్డి (వనపర్తి), కొత్తకోట దయాకర్ రెడ్డి (మక్తల్), సీతాదయాకర్ రెడ్డి (దేవరకద్ర), సీతక్క (ములుగు), విజయ రమణారావు ( పెద్దపల్లి), ఉమా మాధవరెడ్డి (భువనగిరి) తదితరులు ఓటమి పాలయ్యారు. ఉత్తర తెలంగాణలో రెండే సీట్లు ఉత్తర తెలంగాణ ప్రాంతమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని 50కి పైగా ఉన్న సీట్లలో టీడీపీ గెలిచిన సీట్లు రెండు మాత్రమే. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాలలో ధర్మారెడ్డి తమకున్న వ్యక్తిగత బలంతోనే విజయం సాధించగలిగారు. వారు కూడా నెగ్గకుంటే ఉత్తర తెలంగాణలో ఆపార్టీ ప్రాతి నిధ్యమే సున్నా అయ్యేది. అలాగే జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిన నల్లగొండ జిల్లాలో టీడీపీకి చోటు లభించలేదు. ఇక సీమాంధ్ర ప్రభావం ఉంటుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి కళ్లు బైర్లు గొలిపేలా తీర్పునిచ్చింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావులిద్దరు పట్టుపట్టి సీట్లిప్పించుకున్న అభ్యర్థులను జనం ఓడగొట్టారు. ఒక్క సత్తుపల్లిలో మాత్రమే సండ్ర వెంకటవీరయ్య తన పలుకుబడితో విజయం సాధించారు. సీమాంధ్రుల ఓట్లతోనే గ్రేటర్లో పది సీట్లు సీమాంధ్రలో అధికారం కోసం చంద్రబాబు చేసిన ప్రచారంతో ఆ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 10సీట్లను టీడీపీ గెలుచుకుంది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగానే టీడీపీని భావించిన సెటిలర్లు రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాల్లోని ఏడింటిని గెలిపించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించి గెలిపించడం కూడా అందులో భాగమేనని చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా గ్రామప్రాంతాల్లో వికారాబాద్, మేడ్చల్, తాండూరు, చేవెళ్ల, పరిగి వంటి తెలంగాణ ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది. -
‘టీ’డీపీ కమిటీల పై ఎటూ తేల్చని బాబు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ శాఖ బాధ్యతలను ఆశిస్తున్న నాయకులకు వాటిని అప్పగించేందుకు ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మనసొప్పడం లేదు. తెలంగాణ శాఖకు అధ్యక్షునిగా జగిత్యాల ఎమ్మెల్యే ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావులను నియమించాలని ఇప్పటికే నిర్ణయించిన అధినేత ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. శనివారం రాత్రి 11 గంటలకు అందుబాటులో ఉన్న టీ-టీడీపీ నాయకులను తన నివాసానికి పిలిచి అర్థరాత్రి 1.30 గంటల వరకు చర్చించినప్పటికీ, అధికారికంగా ప్రకటించలేకపోయారు. పార్టీ కమిటీలపై పలువురి అభిప్రాయాలు సేకరించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినందున టీడీపీ కూడా ఆ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించినట్టు తెలిసింది. తెలంగాణ కమిటీతో పాటు, వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ, బీసీ నేత ఆర్. కృష్ణయ్య సారథ్యంలో ప్రచార కమిటీ, మండవ, తలసాని, తుమ్మల, నామా నాగేశ్వర్రావు వంటి నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చే స్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. మార్పులు చేర్పులు చేసి ఒకటిరెండు రోజుల్లో కమిటీలను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో,టీ కమిటీ అధ ్యక్ష బాధ్యతలను ఎస్సీ, ఎస్టీలకు అప్పగించడం మేలని మోత్కుపల్లి నర్సింహులు సూచించినట్టు సమాచారం. బీసీల పార్టీగా ప్రచారం పొందేటప్పుడు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం కలగకుండా చూడాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆరా! తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండడం, నాయకులంతా కాంగ్రెస్, టీఆర్ఎస్ల బాట పడుతుండడంపై ఆయన నాయకులతో చర్చించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి దారుణంగా మారిన సంగతిని అక్కడి నేతలు చెప్పేందుకు ప్రయత్నించగా, బాబు తన ధోరణిలోనే వ్యవహరించినట్టు ఓ నాయకుడు తెలిపారు. ఏయే జిల్లాల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని నాయకుల ద్వారానే చెప్పించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల వెంట ద్వితీయ శ్రేణి నాయకులు ఇతరపార్టీల్లోకి పోకుండా జిల్లా నాయకత్వం కృషి చేయాలని కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తుండడం, బీజేపీ, లోక్‌సత్తా, పవన్ కల్యాణ్ పార్టీలతో కూటమిగా ఏర్పడుతుండడం వల్ల టీడీపీకి సానుకూల ఫలితాలే వస్తాయని నాయకులకు భరోసా ఇచ్చినట్టు ఓ నేత ‘సాక్షి’కి చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు ప్రచార సారథ్యం అప్పగించి తెలంగాణలో పర్యటనకు పంపించడం వల్ల బీసీలు టీడీపీకి అనుకూలంగా మారుతారని చంద్రబాబు చెప్పిన ట్టు తెలిసింది. కాగా, కృష్ణయ్యకు ప్రచార సారథ్యం అప్పగించడం పట్ల సమావేశానికి హాజరైన కొందరు నేతలు బయటకు రాగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.