సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి పంచాయితీ ఎట్టకేలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. విదేశీ పర‍్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుతో శుక్రవారం రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ టీడీపీ నేతలతో పాటు రేవంత్ రెడ్డి రేపు (శనివారం) అమరావతిలో చంద్రబాబుతో మరోసారి సమావేశం కానున్నారు. రేపు ఉదయం పది గంటలకు అందరూ హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబుతో జరిగిన తెలంగాణ టీడీపీ నేతల సమావేశానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో పార్టీలోని ప్రతి ఒక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు. అయితే సమయం లేనందున రేపు అమరావతిలో మరోసారి భేటీ కావాలని అధినేత ఆదేశించినట్లు పార్టీ నేత రావుల చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించామని, రేపటి సమావేశంలో అన్ని అంశాలను చర‍్చకు వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment