చంద్రబాబును కలిసిన ఎల్‌.రమణ | L.ramana met chandrababu naidu in amaravathi | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన ఎల్‌.రమణ

Published Wed, Jan 17 2018 12:44 PM | Last Updated on Wed, Jan 17 2018 12:44 PM

L.ramana met chandrababu naidu in amaravathi - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ టీడీపీ నేత ఎల్‌.రమణ బుధవారం కలిశారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో రేపటి నుంచి (గురువారం) నుంచి తెలంగాణలో తలపెట్టే పల్లె పల్లెకు తెలుగుదేశంపై చర్చించారు. అలాగే ఈ నెల 18న ఎన్టీఆర్‌ వర్థంతి ఏర్పాట్లు, రక్తదాన శిబిరాల నిర్వహణ, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఎల్‌.రమణకు దిశానిర్దేశం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement