
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కాగా అప్పట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించినా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. అక్టోబర్‌లో అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమితులైనా కరోనా సమయంలో తాను ఎక్కడికీ రాలేనని చంద్రబాబు తేల్చి చెప్పడంతో ఇప్పటికి అచ్చెన్న బాధ్యతలు స్వీకరించారు. (టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు)
Comments
Please login to add a commentAdd a comment