atchannaidu kinjarapu
-
లోకేశ్ సీఎం కావాలని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే అతిథి
-
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో మరోసారి కలకలం
-
నారా లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతల నారా లోకేష్( Nara Lokesh) భజన తారాస్థాయికి చేరింది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలంటూ పచ్చ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించాడు.కాగా, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్.. అంతా తుస్మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. -
మంత్రి అచ్చెన్నాయుడి అన్నకి విశాఖలో కీలకమైన పోస్ట్
-
అచ్చెన్న అన్నకు కీలకమైన పోస్టు
సాక్షి, అమరావతి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు రెడ్ బుక్ రాజ్యాంగం కీలకమైన పోస్టింగ్ ఇచ్చింది. అదీ నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోనే పోస్టింగ్ వచ్చేసింది. వడ్డించేవాడు మనవాడే కాబట్టి నిబంధనలు అంగీకరించకపోయినా పోస్టింగు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో డీఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న కింజరాపు ప్రభాకర్‌కు ఆయన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించింది. అంటే డీఎస్పీకంటే పెద్ద స్థాయిలో మరునాడే రిటైరయ్యారు. రిటైరైన తరువాత ఆయనకు ప్రభుత్వం విజిలెన్స్ – ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా ఇటీవల పోస్టింగు ఇచ్చింది. ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో అసలు కుట్ర బయటపడింది. అచ్చెన్నాయుడు అన్నకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టు కట్టబెట్టింది. సాధారణంగా ఓఎస్డీ అంటే ప్రధాన కార్యాలయంలో శాఖాధిపతి వద్ద పోస్టింగు ఇస్తారు. శాఖాధిపతి పనుల ఒత్తిడిని తగ్గించేందుకు ఇలా ఎవర్నైనా ప్రత్యేకంగా నియమిస్తారు. కానీ కింజరాపు ప్రభాకర్‌కు మాత్రం విజయవాడలోని విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేంద్ర కార్యాలయంలో పోస్టింగు ఇవ్వలేదు. ఏకంగా విశాఖపట్నం ప్రాంతీయ విజిలెన్స్ – ఎన్పోర్స్మెంట్ అధికారి (ఆర్వీఈవో)గా పోస్టింగు ఇచ్చింది. విశాఖపట్నం ఆర్వీఈవోగా ఉన్న జి.శ్రీనివాసరావును ఒంగోలు ఆర్‌ఈవీవోగా బదిలీ చేసింది. ఒంగోలు ఆర్వీఈవోగా ఉన్న జె. కులశేఖర్‌ను ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆర్వీఈవో పోస్టుల్లో సర్వీసులో ఉన్న అదనపు ఎస్పీ స్థాయి అధికారులనే నియమిస్తూ వచ్చారు. అందుకు విరుద్ధంగా రిటైరైన అధికారిని టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించడం గమనార్హం. కేవలం చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపు చర్యలను వేగవంతం చేసేందుకు కింజరాపు ప్రభాకర్‌ను విశాఖపట్నం ఆర్వీఈవోగా నియమించినట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో అధికార పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ శాఖ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ప్రభుత్వ ఉద్దేశమని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకోసమే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన ప్రభాకర్‌కు ప్రత్యేకంగా పోస్టింగు ఇచ్చినట్టు ఆ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
అచ్చెన్నాయుడు తమ్ముడికి బంపర్ ఆఫర్
సాక్షి, విజయవాడ: అచ్చెన్నాయుడు తమ్ముడికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఉద్యోగం ఇచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ కొద్ది రోజుల కిందటే పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.అయితే, కింజరాపు ప్రభాకర్‌ను ఓఎస్డీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంంట్లో ఓఎస్డీగా నియామకం చేసింది. విజిలెన్స్ కేసులతో కక్ష సాధింపు కోసమే కింజరాపు ప్రభాకర్‌ని సర్కార్ నియమించిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ -
మీ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ ఇవ్వరా..?
-
అచ్చెన్నాయుడుకి దువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్
-
స్టీల్ ప్లాంట్ రన్ చేసే విషయంలో లోపాలున్నాయి : పవన్ కల్యాణ్
-
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
అసెంబ్లీలో మళ్లీ కూన వర్సెస్ అచ్చెన్న!
అమరావతి, సాక్షి: ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్‌లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1 కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు... గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్ వేసే ప్రయత్నం చేశారు. -
Botsa Satya Narayana: కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు
-
వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!
అమరావతి, సాక్షి: వ్యవసాయ బడ్జెట్లో రైతన్నలకు కూటమి ప్రభుత్వం పెద్ద షాకేచ్చింది. రైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం అంతరిక్ష పల్టీలు కొట్టింది. ఇవాళ్టి బడ్జెట్ ప్రసంగ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలు ఈ విషయాన్ని తెలియజేశాయి. తన మేనిఫెస్టోలో రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది కూటమి. అయితే.. తీరా ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6 వేలుతో కలిపి అన్నదాత సుఖీభ కింద ఇస్తామంటూ చెబుతోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అన్నదాత సుఖీభవకి కేవలం రూ. 4,500 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. వాస్తవానికి.. ఏపీలో వాళ్లు ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడి సహాయం కింద.. 52 లక్షల మంది రూ. 10 వేల కోట్లకు పైగా అవసరం. కానీ, సగం కంటే తక్కువ కేటాయింపులతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టబోతున్న సంకేతాలను పంపించింది. 👉 ఏపీ వ్యవసాయ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
అచ్చెన్నాయుడుకి దువ్వాడ మాస్ వార్నింగ్
-
మన్యం టీడీపీలో ‘అచ్చెన్న’ బాంబు!
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమిలో వర్గ పోరుకు ఇన్చార్జి మంత్రి కేటాయింపు మరింత ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ చీలికలుగా మారింది. ఎవరికి వారే.. యమునా తేరే అన్నట్లుగా వ్యవహారం ఉంది. ఇప్పుడు జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నియమించడంతో ఇక్కడి నాయకులు ఒక్కొక్కరూ తారాజువ్వలు, బాంబుల్లా మండిపోతున్నారు.జిల్లాలో అచ్చెన్న హవా!అచ్చెన్నాయుడుకు జిల్లా టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాలకొండ ఉన్నప్పుడు.. ఆ నియోజకవర్గ రాజకీయాలు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. దీనికి తోడు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగానూ ఆయన పని చేయడం వల్ల చాలామంది నాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే సందర్భంలో పాలకొండ నియోజకవర్గంలో కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు వర్గాల మధ్య ఆది నుంచి ఆదిపత్య పోరు నడిచేది. అప్పట్లో ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీలో ఉంటూ, కళా వెంకటరావు శిష్యునిగా పేరుపొందారు. ప్రస్తుత పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవితోపాటు, మరి కొంతమంది నియోజకవర్గ ముఖ్యనేతలు అచ్చెన్న వర్గంలో ఉండేవారు. గత ఎన్నికల సమయంలోనూ జయకృష్ణకు టికెట్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలే జరిగాయి. చివరి నిమిషంలో ఆయన జనసేనలోకి మారి, టికెట్ సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికీ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. జనసేన, టీడీపీలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. టీడీపీలోనూ కొంతమంది పడాల భూదేవి వర్గంతో ఉండిపోగా, మరి కొందరు ఎమ్మెల్యే వెంట నడుస్తున్నారు. సభ్యత్వ నమోదు కూడా ఇదే కోవలో సాగుతోంది.నివురుగప్పిన నిప్పుఒక్క పాలకొండ నియోజకవర్గంలోనే కాక.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ కూటమిలో వర్గ పోరు తీవ్రంగా ఉంది. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ శాసన మండలి సభ్యుడు జగదీష్‌లతో ఆయనకు మొదటి నుంచి పొసగడం లేదు. బీజేపీ, జనసేన కూడా వేరుగానే ఉన్నాయి. కురుపాం నియోజక వర్గంలో ఎమ్మెల్యే జగదీశ్వరి, టీడీపీ నేత వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాలూరు నియోజక వర్గంలో మంత్రి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ల మధ్య నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది.అచ్చెన్న నియామకంతో కుదుపు...ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలంతా తమ కనుసన్నల్లోనే అంతా ఉండాలని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు జిల్లా ఇన్చార్జి మంత్రిగా అచ్చెన్నాయుడును నియమించడంతో అంతా తలకిందులు అయ్యింది. పాలకొండ కాక, మరో నియోజక వర్గానికి చెందిన నేతకు గత ఎన్నికల ముందు టికెట్ రాకుండా అచ్చెన్నాయుడు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో జోరుగా వినిపించింది. ఆ నేత వ్యతిరేక వర్గానికి అచ్చెన్న నుంచి పూర్తి మద్దతు ఉంది. చినబాబు ఆశీస్సులు ఉండడంతో అచ్చెన్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అప్పటి నుంచి ఆ నేత అచ్చెన్నాయుడు మీద గుర్రుగా ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో అచ్చెన్న వేలు పెడితే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని, తన హవాకు బ్రేక్ పడుతుందని భావించిన ఆ నేత.. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి, ఇన్చార్జి మంత్రిని మార్పు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. వారి విన్నపాన్ని చంద్రబాబు తిరస్కరించినట్లు భోగట్టా.ఎమ్మెల్యేల దూకుడుకు చెక్ పెట్టేందుకేనా?మన్యం జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తన.. పార్టీలో వర్గ పోరుపై చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అచ్చెన్న వంటి సీనియర్ నేత ఉంటే.. వారి దూకుడుకు చెక్ పెట్టవచ్చని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆయనను నియమించినట్లు తెలిసింది. మొత్తంగా ఇప్పటికే వర్గపోరుతో రగిలిపోతున్న జిల్లా కూటమిలో.. ఇన్చార్జి నియామక రగడ మరింత చిచ్చురేపినట్లే కనిపిస్తోంది. -
ఆశించిన స్థాయిలో రుణాలిచ్చాం
సాక్షి, అమరావతి: 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేశామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏ మణిమేఖలై స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో 228వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. పలువురు బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న ఈ సమావేశంలో మణిమేఖలై మాట్లాడుతూ.. 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద ప్రాధాన్యతా రంగాలకు రూ.3.75 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా, తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రూ.1.36లక్షల కోట్లు (36శాతం) రుణాలు అందించామన్నారు. అలాగే వ్యవసాయరంగానికి రూ.2.64లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.89,438 కోట్లు (34శాతం) ఇచ్చామని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగానికి 87వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.44వేల కోట్లు (51 శాతం) అందించామన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.1.65లక్షల కోట్లు అందించాల్సి ఉండగా, 87,731 కోట్లు (53 శాతం) అందించినట్లు వివరించారు. నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావత్ మాట్లాడుతూ..ఏపీలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఆర్బీఐ ఏపీ రీజీయన్ రీజనల్ డైరెక్టర్ ఏవో బషీర్ మాట్లాడుతూ డిజిటల్ టాన్స్ఫర్మేషన్లో క్యూఆర్ కోడ్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించి కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టుగా ఆర్బీఐ ప్రారంభించిందని తెలిపారు. వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐదేళ్లలో 50లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు.తొలుత ఫైనాన్షియల్ లిటరసీపై రిజర్వు బ్యాంక్ ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కేంద్ర ఫైనాన్షియల్ సర్విసెస్ శాఖ కార్యదర్శి నాగరాజు మద్దిరాల, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వినర్ సీవీఎన్ భాస్కరరావు, సిడ్బీ సీఎండీ మనోజ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీసిన టీడీపీ శ్రేణులు
-
అచ్చం నాయుడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి
-
అచ్చెన్నాయుడు.. ఈ జన్మకి నీ కోరిక తీరదు: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అంటూ ప్రశ్నించారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. అచ్చంనాయుడూ! దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి.. కచ్చి.. అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా?.అచ్చెన్నా.. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా!. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో.. ఆన్.. నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా’ అంటూ కామెంట్స్ చేశారు. అచ్చంనాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు… pic.twitter.com/G0UoqnGsQJ— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2024ఇది కూడా చదవండి: చంద్రబాబు కుట్రకు పోలీసు వత్తాసు -
అచ్చెన్నకు ఎమోషన్.. అన్నయ్యకు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ‘‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగాలు ఆలపిస్తుంటే.. ఆ ఎమోషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ అన్నయ్యకు ప్రమోషన్ ఇచ్చేందుకు ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు. అచ్చెన్న అన్నయ్య కింజరాపు ప్రభాకర్ నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) డీఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అంతలోగానే ఆయనకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ మంత్రిగారి అన్నయ్యకు ‘రిటైర్మెంట్ గిఫ్ట్’ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అదనపు ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల కోసం పాటించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మొత్తం పోలీసు శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 30 మందికి పదోన్నతులు కల్పించడానికి అనుమతించలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం అవసరం లేకున్నా సరే పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కూడా పేర్కొంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు.. అటు పోలీసు శాఖ ఇటు ఆర్థిక శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రిటైరయ్యేలోగా తన అన్నయ్యకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి0దేనని పట్టుబట్టారు. దాంతో అదనపు ఎస్పీల పద్నోనతుల జాబితాను 22 మందికి పరిమితం చేస్తూ మరో జాబితాను రూపొందించారు. కొత్త జాబితాలో 22వ పేరు కింజరాపు ప్రభాకర్‌దే కావడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆమోదం తరువాత చూసుకుందాం.. ముందు ఆ జాబితాలోని వారికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా కూడా ఊపారు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే కింజరాపు ప్రభాకర్‌తో సహా ఆ జాబితాలోని 22 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
మంత్రి అచ్చెన్నాయుడు - ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య వార్
-
అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్
సాక్షి, విశాఖపట్నం: అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే..పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. -
అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకుంటారా?
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు. తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. అసలు వారిని వదిలేసి డ్రైవర్‌పై కేసుఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారులపై పచ్చ మూక బహిరంగంగా బెదిరింపులకు దిగినా.. వారిపై చర్యలకు ఆదేశించడంలో విశాఖ పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా నమోదు మినహా విశాఖ పోలీసులు పచ్చమూకపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇటీవలే త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన విశాఖ ప్రజలు మరువకముందే.. ట్రాఫిక్ పోలీసులపై తెలుగు తమ్ముళ్లు పూటుగా తాగి మద్దిలపాలెంలో బరితెగించిన ఘటన చోటుచేసుకోవడం విశాఖ వాసులతో పాటు పోలీసు వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారాన్ని వీడియోలతో సహా ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులకు పంపినట్టు తెలుస్తోంది. అయినా ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలకు ఆదేశించకపోవడం చర్చకు దారితీసింది. తెలుగు తమ్ముళ్ల బరితెగింపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం రాత్రి కారు డ్రైవింగ్ చేస్తున్న టెక్కలికి చెందిన బొమ్మిలి మురళీపై కేసు నమోదు చేసి మమా.. అనిపించారు. ఈ గొడవకు కారకులైన ఢిల్లీశ్వరరావు తదితరులను పక్కన పెట్టి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశమైంది. -
కౌలుదారులందరికీ కార్డులివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూటికి 80 శాతం కౌలుదారులున్నారని, వాందరినీ గుర్తిస్తూ ప్రభుత్వం కౌలు కార్డులివ్వాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. పంటల నమోదులో కౌలురైతుల పేర్లతోనే నమోదు చేయాలన్నారు. భూమి లేని ఓసీ రైతులతో సహా కౌలుదారులందరికీ రూ.20వేల పెట్టుబడి సాయం అందించాలని కోరారు. కౌలురైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అయితే 2019లో తీసుకొచ్చిన పంట సాగుదారుల హక్కు చట్టంలో భూ యజమాని విధిగా కౌలు ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని లేదా వీఆర్వోకు ఫోన్ చేసి తన అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుందన్నారు. మెజార్టీ భూ యజమానులు అంగీకార పత్రంపై సంతకాలు చేయకపోవడం వలన కౌలుదారులు కౌలుకార్డులు పొందలేక, పంట రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన 2011లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ అ«దీకృత రైతుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ చట్టం ప్రకారం భూ యజమానుల అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలురైతులను గుర్తించి, గ్రామసభల్లో కౌలుకార్డులు ఇచ్చేదని గుర్తు చేశారు. భూ యజమానులు ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని అధికారులే పరిష్కరించేవారన్నారు. గ్రామాల వారీగా కౌలు రైతుల జాబితాలను బ్యాంకులకు పంపి పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందించేవారని గుర్తు చేశారు. -
కప్పం కడతారా.. కంపెనీ మూసేస్తారా
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తాం అని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో తడాఖా చూపిస్తోంది. కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తరువాత.. ముందు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాలంటే కప్పం కట్టాల్సిందేనని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పెద్దలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎన్నికై నెల రోజులు కూడా కాకుండానే స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగిపోయారు.కంపెనీలకు కళ్లు బైర్లు కమ్మేలా కప్పం రేట్లు నిర్ణయిస్తున్నారు. అందుకు కాదంటే ఫ్యాక్టరీలపై దాడులకు తెగబడతామని, అక్రమ కేసులతో వేధిస్తామని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు రూ.1.50 కోట్లు మామూళ్లివ్వాలని జారీ చేసిన అల్టిమేటం.., అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మూకలు విధ్వంసానికి పాల్పడటం ద్వారా వారి ఉద్దేశాన్ని తేటతెల్లం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీ కూడా గత్యంతరం లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణుజొ చ్చి , కప్పం కట్టేందుకు సమ్మతించడం రాష్ట్రంలో ఇకముందు జరగబోయే అరాచకాలకు సూచికగా నిలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ముందున్నది ముసళ్ల పండుగేనన్నది సుస్పష్టమవుతోంది. ప్రతి లారీకీ డబ్బు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్‌ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బంటుపల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూళ్లు వసూలు చేసి హడలెత్తించేవి. ఇటీవల ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ఇప్పుడు మామూళ్ల వసూలుకు రంగంలోకి దిగారు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకుని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజూ లోడింగ్, అన్లోడింగ్ వచ్చే లారీకి రూ.వేయి చొప్పున మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు సగటున 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకు రూ.5 లక్షలు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.1.50 కోటి.. ఏడాదికి రూ.18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ల కింద సమర్పించుకోవాలి. లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరించారు. కాదన్నందుకు కంపెనీపై దాడి ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూళ్ల లెక్కలకు యూబీ కంపెనీ ప్రతినిధులకు కళ్లు బైర్లు కమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంతే.. ఈ నెల 15న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ముఠా యూబీ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన కంపెనీ ప్రతినిధులను బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్, పర్చేజ్ మేనేజర్, అడ్మిని్రస్టేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. ఢిల్లీ నుంచి ఒత్తిడితో కేసు నమోదు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాషీ్టకంపై యూబీ కంపెనీ ప్రతినిధులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే వర్గీయులపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూబీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. దాంతో తప్పనిసరై జేఆర్ పురం పోలీసులు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులపై ఈ నెల 16వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు.తమ వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్రంగా పరిగణించారు. యూబీ కంపెనీ ప్రతినిధులపై ఆయన వర్గీయులతో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయించారు. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి యూబీ కంపెనీ ప్రతినిధులపై కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. డీల్ సెట్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడుఈ వ్యవహారంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. ఆయన కంపెనీ ప్రతినిధులు, ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడారు. కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే ‘ఏం చేయాలో ’ చెప్పారు. అచ్చెన్న ‘మంత్రం’ పని చేసింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు వెనుక మంత్రి అచ్చెన్న ఉన్నారన్నది యూబీ కంపెనీ ప్రతినిధులకు అర్థమైంది. టీడీపీ, బీజేపీ కూటమి నేతలు డిమాండ్ చేసిన మామూళ్లు సమర్పించుకుంటే తప్ప ఉత్పత్తి ప్రారంభించలేమని స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో అనివార్యంగా యూబీ కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావు నివాసానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. వారిపై ఎమ్మెల్యే ఈశ్వరరావు తీవ్ర ఆగ్రహావేశాలతో చిందులు తొక్కారు. తమను కాదని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఎలా నడుపుతారంటూ మండిపడినట్టు సమాచారం. ఢిల్లీ నుంచైనా, ఎక్కడి నుంచి చెప్పించినా సరే.. ఇక్కడ తాము పచ్చజెండా ఊపితేనే ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకుంటాయని, లేకపోతే లేదని కూడా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో యూబీ కంపెనీ ప్రతినిధులు బంటుపల్లి ముఠా డిమాండ్ చేసిన మేరకు మామూళ్లు ఇచ్చేందుకు సమ్మతించి తిరిగి వచ్చినట్లు ఆ కంపెనీ వర్గాలే చెబుతున్నాయి. కప్పం కడితేనే కంపెనీలు యూబీ కంపెనీ వ్యవహారం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమకు కప్పం కడితేనే కంపెనీలు కార్యకలాపాలు చేపడతాయని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కంపెనీలపై దాడులు, దండయాత్రలు తప్పవని తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీకే అటువంటి దుస్థితి ఏర్పడితే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. -
ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు
శ్రీకాకుళం, సాక్షి, అనకాపల్లి, సింహాచలం: కొత్త అసెంబ్లీ ఇంకా కొలువుదీరలేదు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తి కాలేదు. కొందరు టీడీపీ ప్రజా ప్రతినిధులు నిజ స్వరూపాలు అప్పుడే బయ టపడుతున్నాయి. బూతు భాష, బెదిరింపుల్లో పోటాపోటీగా దూసుకెళుతున్నారు. ఉన్నత పద వుల్లో ఉన్నప్పుడు హుందాగా నడుచుకోవాలనే విషయాన్ని విస్మరించి తమ అధినేత ప్రశంసల కోసం తహతహలాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. టీడీపీ కార్యకర్తలంతా పసుపు బిళ్లలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటూ ఉపదేశించారు. వారికి కుర్చీలేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి పనులు చేయాని అధికార యంత్రాంగాన్ని బెదిరించారు. పోలీసుల్లో గత ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించిన వారు స్వయంగా తప్పుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరికలు జారీ చేశారు. నర్సీపట్నంలో నాసిరకంగా రోడ్లు నిర్మించారంటూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మునిసిపల్ అధికారులపై నడిరోడ్డులో పచ్చి బూతులతో రెచ్చిపోయారు. త్వరలో తాను స్పీకర్ అవుతున్నానని, ఇలాంటి రోడ్లు వేసినందుకు మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్దీ నిలబెడతానని హెచ్చరించారు. అయ్యన్న తిట్ల దండకానికి నిశ్చేష్టులైన అధికారులు చుట్టూ ప్రజలంతా చూస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.లైన్లో పెడతా: మంత్రి అచ్చెన్న ‘నేను మాటిస్తున్నా. అధికారులకు సమావేశం పెట్టి చెబుతా. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరకు వెళ్లినా.. ఎమ్మార్వో, ఎండీఓ వద్దకు వెళ్లినా.. ఏ ఆఫీసుకు వెళ్లినా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పనేమిటి? అని అడిగి అందరికీ పనులు చేసే విధంగా అధికారులను లైన్లో పెడతా. ఎవరైనా నా మాట జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పాల్సిన అవసరం లేదు’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం రాత్రి ఓ సభలో వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలసి శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి, టీ ఇచ్చి గౌరవించాలని ఆదేశించారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ క్యాడర్ ఎన్నో అవమానాలకు గురైందన్నారు. ఏ పనిమీద వెళ్లినా అధికారులు, ఉద్యోగులు పట్టించుకోలేదని చెప్పారు. ఎంపీగా రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలుగా తనతో పాటు బెందాళం అశోక్ బాబు ఉన్నా తమను పట్టించుకోకుండా అవమానించారన్నారు. ఇకపై అలా జరగకుండా ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అప్పట్లో అవమానించి పనులు చేయని వారి వద్దే గౌరవం పొందాలని, పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంలో అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఏ అధికారి, ఉద్యోగి ఎలా పని చేశారో తమ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. కాగా, వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వారిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి, తమను కలవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. తమకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ మంగళవారం తనను కలసిన కొందరు వలంటీర్లనుద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.తమాషాలు చేస్తున్నారా..‘తమాషాలు ...(బూతు)? ఇష్టం లేకపోతే ...(బూతు)’ అంటూ మున్సిపల్ అధికారులపై నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నడిరోడ్డు మీద బూతులతో రెచ్చిపోయారు. ‘నేను అసెంబ్లీ స్పీకర్‌ను అవుతున్నా.. మిమ్మల్ని గంటల కొద్దీ నిలబెడతా..’ అంటూ పరుష పదజాలంతో దుర్భాషలాడారు. ‘కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడకల్లారా!’ అంటూ నోరు పారేసుకున్నారు. ‘నర్సీపట్నంలో దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఒకడున్నాడు. వాడి సంగతి తేలుస్తా’ అంటూ చిందులు తొక్కారు. మంగళవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని అబిద్ సెంటర్లో ఇటీవల నిర్మించిన వంద అడుగుల మెయిన్ రోడ్డు, ఆరిలోవ అటవీ ప్రాంతం వద్ద నర్సీపట్నం–కేడీపేట రోడ్డును పరిశీలించిన క్రమంలో అయ్యన్న బూతు పురాణానికి అధికారులు నిశ్చేష్టులయ్యారు.నా కొడకల్లారా.. కళ్లు మూసుకున్నారా? నాణ్యత లేకుండా రోడ్డు ఎలా వేస్తారంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమాషాలు చేస్తున్నారా..? కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారా.. నా కొడకల్లారా..’ అంటూ బూతులతో విరుచుకుపడ్డారు. పని చేయడానికి ఇష్టం లేకపోతే.. పోండి అంటూ గద్దించారు. ఆర్అండ్బీ రోడ్డుకు మున్సిపాలిటీ నిధులను వినియోగించటంపై అధికారులను ప్రశ్నించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేదని.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయడం తథ్యమన్నారు. అప్పటి ఎమ్మెల్యే ఒత్తిడితో ఎన్నికల కోసం ఈ రోడ్డు వేశారని మండిపడ్డారు.గత ప్రభుత్వ తొత్తులు తప్పుకోండి..కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ తొత్తులుగా పని చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఖాకీ చొక్కా వదిలిపెట్టి వైఎస్సార్సీపీ కండువా వేసుకునేందుకు కూడా కొంత మంది పోలీసులు సిద్ధమయ్యారన్నారు. అలాంటి పోలీసులకు తాను హెచ్చరికలు జారీ చేస్తున్నానని చెప్పారు. వైఎస్సార్సీపీ రక్తం ఇంకా మీలో ప్రవహిస్తోందన్న ఫీలింగ్ ఉంటే మీ అంతట మీరే తప్పుకోవాలని పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటనపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. -
పసుపు బిళ్ల .. అచ్చెన్న తొలి జెల్ల!
‘ నేను మాటిస్తున్నాను.రేపు అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను.రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరకు వెళ్లినా..ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా.. ఎండీఓ దగ్గరకు వెళ్లినా..ఏ ఆఫీసుకు వెళ్లినా..మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి.. మీ పనేంటి అని అడిగి మీ అందరికీ పనిచేయించే విధంగా అధికారులను లైనులో పెడతాను.ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా’..కార్యకర్తల ఆత్మీయ సభ, ఉద్యోగుల తొలి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.ఇప్పుడీ వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియానూ కుదిపేస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు రాష్ట్రంలో సంచలనంతో పాటు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకొచ్చాక చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను కుదిపేశాయి. టీడీపీ శ్రేణులను ప్రభుత్వ కార్యాలయాలకు దూకుడుగా వెళ్లేలా ప్రోత్సహించేలా ఉన్నాయి.అచ్చెన్నాయుడుకు మంత్రిగా పనిచేయడం కొత్తేమీ కాదు. 2014–19లో కూడా పనిచేశారు. అప్పట్లో కూడా కాస్త కటువుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఈ సారి అలా ఉండబోరని, ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చిన తొలి పర్యటనలోనే ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయా వర్గాలు స్వీకరించలేకపోతున్నాయి. జాగ్రత్తగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రండి, ప్రజల్ని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి, ఏదైనా పనుల కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే చూసి చేయండి, ప్రభుత్వ లైన్లో పనిచేయండి అనే విధంగా ఎవరైనా మాట్లాడుతారని.. కానీ అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు హెచ్చరిస్తూ మాట్లాడటాన్ని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.‘టీడీపీ కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ల వేసుకుని వెళ్లండి. అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు. ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు’ అని కార్యకర్తల ముందు చెప్పడం సరికాదని ఉద్యోగులు బాధపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బెదిరింపు ధోరణిగానే ఉన్నాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సంచలనమయ్యాయి. సోషల్ మీడియాలోనైతే హల్చల్ చేశాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి. -
పసుపు బిల్లా.. మరోసారి రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు
-
కేంద్ర మంత్రివర్గంలో అబ్బాయి, రాష్ట్ర మంత్రివర్గంలో బాబాయి..
-
పచ్చ బిళ్ల వేసుకుని వెళ్లండి: అచ్చెన్నాయుడు
గంగ చంద్రముఖిగా మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోపే టీడీపీ నేతలు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంశ్రీకాకుళం, సాక్షి: ‘‘టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..’’ అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.‘‘.. ఏ ఆఫీస్ అయినా సరే. పసుపు బిళ్ళతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరో ఆ మాట జవ దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా’’ అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. AP Animal Husbandry and Fisheries Minister Atchannaidu’s open warning to officials and brazen abuse of power. Honorary Minister tells govt officials to salute TDP workers and give them royal treatment in govt offices. #Atchannaidu #TDP #AP #AndhraPradesh pic.twitter.com/NSPY9FGFfQ— Sakshi Post (@SakshiPost) June 18, 2024 VIDEO CREDITS: Sakshi Post -
కింజరాపు ఫ్యామిలీకి డబుల్ బొనాంజా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు. వారి ఆశలపై నీళ్లు.. వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్యాట్రిక్ విజయాలు.. టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. -
చంద్రబాబు కేబినెట్లో ట్విస్ట్..
-
చంద్రబాబు కేబినెట్.. తెరపైకి కొత్త ఈక్వేషన్లు!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్‌కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్‌ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది. ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్‌తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠమరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది. -
మంత్రి పదవులపై మొదలైన చర్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 80 రోజుల ప్రహసనం పూర్తయ్యి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడంతా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కొలువు దీరడమే మిగిలి ఉంది. దీంతో అందరి దృష్టి జిల్లాలో ఎవరెవరికీ మంత్రి యోగం దక్కుతుందో అన్నదానిపైనే పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ కోసం ఎవరికి వారే ఆశలు పెట్టుకుంటున్నారు. వారిలో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్లే చర్చకు వస్తున్నాయి. ఇక, ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల కేంద్ర క్యాబినెట్లో కూడా టీడీపీలో కొందరికీ మంత్రి పదవులు దక్కుతాయి. ఆ అవకాశం హ్యాట్రిక్ విక్టరీ సాధించిన కింజరాపు రామ్మోహన్నాయుడికి వస్తుందన్న ఆశలు భారీగానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చింది. మే 13న పోలింగ్ జరిగింది. ఈ నెల 4వ తేదీన లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో కూట మి విజయబావుటా ఎగురవేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం, దాని విధి వి«ధానాల మేరకు పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి మంత్రులెవరు అవుతారన్న దానిపైనే పడింది. జిల్లాలో హ్యాట్రిక్ విక్టరీతో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు, వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాళం అశోక్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు. కాళింగ కోటాలో కూనకు దక్కే అవకాశం జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా? కాళింగ సామాజిక వర్గానికా? అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండు సార్లు గెలిచి, గతంలో పార్టీ విప్‌గా పనిచేసి, ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మూడు సార్లు గెలిచారని పరిగణనలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ, టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్‌కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు. వెలమ సామాజిక వర్గానికిస్తే కాళింగులకు అనాయ్యం చేశారని, కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియరైన కింజరాపు అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని, అన్యాయం చేశారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుంది. లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్ ఇచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. ఈ సమయంలో అటు కాపుల నుంచి, ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి గాని మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు. జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. ఇక, గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ’అచ్చెన్నకే పెద్దపీట.. సామాజిక వర్గాల వారీగా చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కాళింగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే స్థాయిలో జిల్లాలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక, సీనియర్ల కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె శిరీషను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన తొలుత వెలమ సామాజిక వర్గాన్నే తీసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కింజరాపు అచ్చెన్నాయుడిది. గతంలో మంత్రిగా పనిచేయగా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక, రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన బగ్గు రమణమూర్తికి మంత్రి పదవి ఇచ్చేంత ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్‌కు అదే గొప్ప పదవిగా భావించాలే తప్ప మంత్రి పదవి ఆశించేంత పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడికే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటే తప్ప ఆయనకు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ రామ్మోహన్ తెరపైకి వస్తే...ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడం, ఆ పార్టీ నుంచి గెలిచిన హ్యాట్రిక్ ఎంపీగా కింజరాపు రామ్మోహన్నాయుడు నిలవడం, చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో కేంద్ర కేబినెట్లో చోటు కలి్పస్తారేమోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. దివంగత కింజరాపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రామ్మోహన్నాయుడు వరుసగా విజయం సాధించడమే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే అప్పుడు జిల్లా సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. ఇటు రాష్ట్రమంత్రిగా బాబాయ్ అచ్చెన్నాయుడికి, అటు కేంద్రమంత్రిగా అబ్బాయ్ రామ్మోహన్నాయుడికి చోటు కల్పిస్తే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ అగ్రతాంబూలం ఇస్తారా? అన్న సామాజిక వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికే ఇవ్వాలనుకుంటే రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. కాదనుకుంటే కేంద్ర కేబినెట్లో రామ్మోహన్‌కు చోటు కలి్పంచాలి. ఈ సమయంలో బాబాయ్, అబ్బాయ్లో ఒకరికి మొండి చేయి తప్పదు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏమవుతుందో, ఎవరికి యోగం దక్కుతుందో చూడాలి. -
అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
-
టీడీపీ గుండాలు ప్రాణం తీశారు!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఓటమిని ఊహించి.. ఎన్నికల పోలింగ్ రిగ్గింగ్‌కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హింసకు తెర లేపింది. వైఎస్సార్సీపీ నేతలను, పోలింగ్ ఏజెంట్లను, కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరుల్ని.. ఆఖరికి ఓటేసిన వాళ్లను సైతం వదలకుండా దాడులకు తెగబడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో టీడీపీ గుండాల చేతిలో ఓ నిండు ప్రాణం బలైంది. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ తండ్రి ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితుల్ని తోట మల్లేశ్వరరావుగా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడింది టీడీపీ నేత అచ్చెన్నాయుడి అనుచరగణమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయితీ బూత్-228లో మాధవరావు అనే వ్యక్తి వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించారు. అయితే మాధవరావు కుటుంబాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. గురువారం గుడిలో పూజ చేస్తుండగా మాధవరావు తండ్రి మల్లేష్‌పై అచ్చెన్నాయుడి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రావును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మల్లేష్ కన్నుమూశారు. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని మాధవరావు డిమాండ్ చేస్తున్నారు. -
అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి
-
నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపు
టెక్కలి: కింజరాపు కుటుంబం ఆనవాయితీగా చేస్తున్న రిగ్గింగ్ల పర్వానికి మరోసారి తెరతీసింది. పోలింగ్ ప్రక్రియలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలోని పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్ కింజరాపు అప్పన్నను బెదిరించిమరీ.. కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు రిగ్గింగ్ చేశారు. తులసీపేట, భగీరథపురం తదితర గ్రామాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్లేకుండా టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలోని 287, 289, 290 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌లు జరిగినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నిమ్మాడతో పాటు 16 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌లు చేసినట్టు దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఎదుటే టీడీపీ, బీజేపీ కార్య కర్తలు, నాయకులు వైఎస్సార్సీపీ నాయకు లతో బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. -
అచ్చెన్న అడ్డాలో.. రక్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: 👉 నిమ్మాడలో కింజరాపు కుటుంబానికి కాదని సర్పంచ్‌గా నామినేషన్ వేసిన కింజరాపు సూరయ్య... ఆయన ఇంటిలోనే హత్యకు గురయ్యారు. 👉 కింజరాపు కుటుంబీకులకు వ్యతిరేకంగా నిలిచిన ఎచ్చెర్ల సూర్యనారాయణను చిట్టయ్యవలస తోటలో హత్యకు గురయ్యారు. 👉 కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు ఎమ్మెల్యేగా పోటీకి అడ్డుపడిన కింజరాపు భుజంగరావు (బుజ్జి) కత్తులతో హత్యకు గురయ్యారు. 👉 నిమ్మాడ రాజకీయంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తి శవమయ్యాడు. 👉 పిన్నింటిపేటలో రిగ్గింగ్‌కు అడ్డుపడిన కూన రామారావుని 1994లో డిసెంబర్ 3న కత్తితో పొడిచి చంపేశారు. 👉 కింజరాపు గణపతి కుమార్తె మేనకమ్మను మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా అక్కడే వివస్త్రను చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది హత్యలకు గురయ్యారు. వాటి వెనక ఎవరున్నారో చనిపోయిన వారి శత్రువులకు తెలియాలి. నిమ్మాడ రాజకీయమంటే అలాగే ఉంటుందనేది అందరి నోట మాట. తొలుత బెదిరింపులు..ఆ తర్వాత దౌర్జన్యాలు..అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం నిమ్మాడలో పరిపాటిగా మారిపోయింది. ఏళ్ల క్రితం నుంచి 18 ఎకరాల రైతు మెండ రామ్మూర్తిని ఇబ్బంది పెడుతున్న విషయం ఇప్పటికీ కొనసాగుతోంది. అన్న కుమారుడిపైనా దౌర్జన్యం.. కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు వరసకు అన్న కుమారుడైన కింజరాపు అప్పన్న టార్గెట్ అయ్యారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అప్పన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అప్పన్న భార్య చంద్రకళ మెళియాపుట్టి కేజీబీవీలో హిందీ పండిట్‌గా పనిచేసేవారు. 2014లో మంత్రి అయ్యాక ఆమెను తొలగించారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ వద్ద 15 ఏళ్ల క్రితం రూ. 2లక్షలను అప్పన్న అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తమంతా చెల్లించినప్పటికీ ముందుగా రాసుకున్న నోటు పత్రం ఈ రోజుకూ ఇవ్వలేదని అప్పన్న మొరపెట్టుకునే వస్తున్నారు. అదే అప్పన్న నిమ్మాడ సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తే అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ తదితరులు దాడి కూడా చేశారు. అచ్చెన్నపై నమోదైన కేసులు, ఫిర్యాదులు👉 కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సర్పంచ్ కింజరాపు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు కింజరాపు హరిప్రసాద్, కింజరాపు కృష్ణ, కింజరాపు అచ్చెన్న, కింజరాపు దాముమోహన్, మెండ సత్యం తదితరులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో సర్పంచ్ గణేశ్వరరావు కుమార్తె మేనకపై కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు అనుచరులు దాడి చేసి అవమానపరచినట్లు ఆమె తండ్రి గణేశ్వరరావు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. 👉 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన అచ్చెన్నాయుడును అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ ప్రయత్నాలు చేశారు. 👉పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసిన సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేశారు. 👉 1995లో కాంగ్రెస్ మద్దతుదారులుపై అచ్చెన్న వీరంగం చేసి నిమ్మాడలో తన పినతండ్రి వరుసైన బుజ్జి అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 👉 కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసి, ఆ ఘటనను కప్పి పుచ్చేందుకు అధికారులను బెదిరించారు. ఈ కేసును కొట్టివేశారు. 👉 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ తో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశాడు. -
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా నాయకులు జనం కోసం పనిచేయాలి. నమ్ముకున్న వారి క్షేమం కోసం పాటు పడాలి. కానీ టీడీపీ నేతలు ఆపత్కాలంలో ఆప్తులను వదిలేశారు. కోవిడ్ మహమ్మారి ఊళ్లకు ఊళ్లను వణికిస్తుంటే.. తమ దారి తాము చూసుకున్నారు. విశాఖలో ఒకరు, ఢిల్లీలో ఇంకొకరు, జనాలకు దూరంగా చాలామంది దాక్కున్నారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముమ్మరంగా సాయం చేస్తూ జనాలకు ధైర్యమిస్తూ ఉంటే.. టీడీపీ నాయకులు మాత్రం కనీసం తమ కార్యకర్తల కోసమైనా పనిచేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు నిరంతరం జనాల్లోనే ఉంటూ వారి బాగోగులు చూసుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఇసుక, నీరుచెట్టు, ప్రాజెక్టులు, మద్యం, అభివృద్ధి పనుల ముసుగులో కోట్లు వెనకేసుకున్న టీడీపీ నాయకులు జనాలకు ఓ కష్టం వచ్చిన వేళ అండగా నిలవలేకపోయారు. కనీసం సొంత పార్టీ క్యాడర్‌ను కూడా కరోనా కాలంలో వారు పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్టకాలంలో టీడీపీ నేతలు జాడే కానరాలేదు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.జిల్లాను కరోనా సెకెండ్ వేవ్ ఎంతగా కబళించిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. యువత సైతం మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇంత కష్టకాలంలో టీడీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీని పరిస్థితి ఉండేది. ఒక్కో నేత ఒక్కో చోట దాక్కుని ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు తమ నాయకుడు ఆదుకుంటారని సాధారణంగా నియోజక వర్గ ప్రజలు, కేడర్ అనుకుంటారు. తమ నాయకుడు ఏదో ఒక ఆస్పత్రికి చెప్పి, బాగా చూడాలని, మెరుగైన వైద్యం అందించాలంటూ చెబుతారని ఆశిస్తారు. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నం. టీడీపీ నేతలు ఎక్కడా ఆ రకంగా స్పందించిన దాఖలాల్లేవు. ఏ ఒక్క నేత కూడా కనీసం పట్టించుకోలేదు. దాక్కున్న టీడీపీ నేతలు..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్థానికంగా లేరు. కరోనా సమయంలో విశాఖలో తలదాచుకున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఎక్కడున్నారో నాయకులకు కూడా తెలియని పరిస్థితి. నాయకులు ఎవరు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేశారు. తానొక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చారు.ఆయనేదో వ్యక్తిగతంగా సాయమందిస్తారేమో అనుకుని చాలా మంది ఫోన్లు చేశారు. కానీ ఆయన చేసిందేమీ లేదు. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వచ్చిన విన్నపాలను అధికారులకు మళ్లించారు. అప్పటికే అధికారులు కంట్రోల్ రూమ్ నడుపుతున్నారు. వారికి నేరుగా వచ్చే ఫోన్లకు స్పందిస్తున్నారు. ఈయన వల్ల మరింత జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ రోగులకు బెడ్లు ఎక్కడున్నాయని అడిగితే అధికారులను అడిగి చెబుతామంటూ దాట వేస్తూ చేతులు దులుపుకున్నారు.మాజీ మంత్రి కళా వెంకటరావు ఎక్కడున్నారో తెలియనట్టుగా ఇంటికి తాళాలు వేసుకుని లోపలే ఉన్నారు. కనీసం కేడర్ ఫోన్ ఎత్త లేదని ఆ పార్టీ కార్యకర్తలే వాపోయారు. జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పరిస్థితి దాదాపు ఇంతే. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, కావలి ప్రతిభా భారతి తదితరులు కరోనా కాలంలో జనాలకు కనిపించనే లేదు.అందుబాటులో వైఎస్సార్సీపీ నేతలు..కష్టకాలంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లగా, మరికొందరు తన పీఏ నంబర్లను ప్రజల వద్ద ఉంచి, ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు సేవలు పొందారు. తమకు అవకాశం ఉన్న మేరకు స్పందించారు. ఆస్పత్రిలో బెడ్ కావాలన్నా, రోగులకు మెరుగైన వైద్యం కోసం, మందులు, ఇతరత్రా అవసరాల కోసం ఎప్పటికప్పుడు స్పందించారు.తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నారు.డిప్యూటీ సీఎం హోదాలో ధర్మాన కృష్ణదాస్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడమే కాకుండా కోవిడ్ ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా స్పందించారు.మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అదే రకంగా స్పందించారు. కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, సేవలందించడంలో తనదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయితే నిరంతరం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ ధైర్యంగా ప్రజలకు అందుబాటులోనే ఉండి సాయపడ్డారు.శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సాయం చేయడంలో తమదైన పాత్ర పోషించారు.ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కరోనా బారిన పడినప్పటికీ తన అనుచరుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నారు.ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అయితే కరోనా కష్టకాలంలో రిస్క్ తీసుకుని పనిచేశారు. జిల్లా యంత్రాంగానికి రెండు ఆక్సిజన్ అంబులెన్స్‌లు అందించారు. రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం..కరోనా సమయంలో నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీ నాయకులు వ్యక్తిగతంగా తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశారు. ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకుని తోచినంత సాయం చేశారు.ఇక ప్రభుత్వం ప్రతీ ఇంటికి సాయం చేసింది. ఒకవైపు కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోగులకు పౌష్టికాహారం అందజేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు ఇంటింటికీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటికి మెడికల్ కిట్ అందజేసింది. అంతటితో ఆగకుండా ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేసింది.జిల్లాలో 6,70,438 మందికి రూ.707.61కోట్లు మేర సచివాలయంలోనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లోనూ చిక్కుకున్న వారిని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని వలస కూలీలు, వలస మత్స్యకారులను ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకొచ్చి, ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు చేసి, ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంది.ఇవి చదవండి: ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు -
అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
‘ఒరే.. ఏరా..’ ఉద్యోగులను అచ్చెన్నాయుడు పిలిచే విధానమిది. ‘బట్టలూడదీసి కొడితే నీకు దిక్కెవరే..’ ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్న మాట ఇది. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ పోలీసులను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలివి. ఒంటి నిండా మదం, గొంతు నిండా విషం నింపుకున్న అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను చాలాకాలంగా చులకనగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయన తీరు మారలేదు. ఎన్నికల నేపథ్యంలో అచ్చెన్న వ్యవహార శైలిని ఉద్యోగులు విశ్లేషించుకుంటున్నారు.👉ఆర్ అండ్ బీ ఉద్యోగి కళ్యాణి అనే మహిళపై అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారు. ఆమైపె దౌర్జన్యం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.👉 గతంలో కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసి, నీకు బట్టలు ఊడదీసి కొడితే దిక్కెవరే అంటూ బెదిరించాడు. ఆ సంఘటనను కప్పి పుచ్చేందుకు అప్పట్లో పోలీస్ అధికారులను బెదిరించి కంప్లైంట్ నమోదు కాకుండా చేశారు.👉 గతంలో పోలాకి మండలం రహీమానుపురంలో జన్మభూమి కమిటీ సభ్యుడు బాలక గోపి తండ్రి డెత్ సర్టిఫికెట్ విషయంలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు త్రివేణి అక్కడ నిబంధనల మేరకు వ్యవహరించిందని నిమ్మాడ పిలిపించి ఆగ్రహించడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.👉గతంలో టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి అప్పటి ఎంపీడీఓగా పనిచేసిన లోకనాథంను బెదిరించారు. చెప్పినట్టు చేయలేదన్న ఆగ్రహంతో తలుపులేసి తంతే నీకు దిక్కెవరు అని భయపెట్టారు.👉గతంలో పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సూర్యారావు అనే కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేశారు. ‘నిన్ను తుపాకీ తిరగేసి కొడితే నీకు దిక్కెవరం’టూ అచ్చెన్నాయుడు బెదిరించారు. సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు.👉‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్లెస్ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికి కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయారు.👉ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరైస్టెనప్పుడు కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద వైద్య పరీక్షలు నిర్వహణ కోసం పోలీసులు తీసుకురాగా...అక్కడున్న సీఐ నీలయ్యను బెదిరించారు. ‘హోం మినిష్టర్‌ను అవుతాను. నీ లెక్క తేలుస్తాను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కింజరాపు అచ్చెన్నాయుడికి ఉన్న గౌరవిమిది. ఒరే..ఏరా అన్న పిలుపే తప్ప ఆయనలో అంతకుమించి సంస్కారం లేదని పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. మంత్రి హోదాలోనే కాదు ప్రతిపక్ష నేతగా కూడా అచ్చెన్నాయుడు వ్యవహార శైలి వివాదాస్పదమే. ప్రభుత్వ ఉద్యోగులు అన్నా, అధికారులన్నా చిన్నచూపే. ప్రతి దానికి అధికారులపై మండిపడటం, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం చేయడం, పరుష పదజాలంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం, బెదిరించడం ఆయన రాజకీయ జీవితంలో సర్వసాధారణమైపోయింది. అచ్చెన్నాయుడు వస్తే చాలు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక, ఫోన్ బెదిరింపులైతే చెప్పనక్కర్లేదు. తన అనుయాయులకు పనిచేయకపోగా, చెప్పినట్టుగా అధికారులు నడుచుకోకపోయినా ఫోన్ చేసి తిట్టడం, దూషణలకు దిగడం అచ్చెన్నకు పరిపాటిగా మారిపోయింది.ఉద్యోగులపై నిత్యం జులుంటీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శించారు. ఎవరైనా జీ హుజూర్ అన్నట్టుగానే ఉండాలి. లేదంటే వారందరికీ శంకర గిరి మాన్యాలు పట్టిస్తానంటూ బెదిరింపులు చేసేవారు. చేయి చూపించి వార్నింగ్‌లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. టీడీపీ ఓడిపోయాక కూడా ఆయన మదం తగ్గలేదు. నోటికొచ్చినట్టు దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులనే కాకుండా పోలీసు అధికారులను బెదిరించారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లను చూసుకుని మిగతా టీడీపీ నాయకులు కూడా ఉద్యోగులపైన, అధికారులపైన విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.బేరీజు వేసుకుంటున్న ఉద్యోగులు ఇటు కింజరాపు అచ్చెన్నాయుడు, అటు కూన రవికుమార్ వ్యవహార శైలిపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికారులకు గానీ, ఉద్యోగులకు గానీ గౌరవం లేకుండా పోయిందని, అదే సంస్కృతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొనసాగించారని ప్రభుత్వ ఉద్యోగులు విశ్లేíÙంచుకుంటున్నారు. అధికారులపైన, ఉద్యోగులపైన జులుం ప్రదర్శించడంతో పాటు దూషణలు, బెదిరింపులకు దిగే టీడీపీ నాయకులెక్కడ, ఉద్యోగులను గౌరవించే ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలకులెక్కడ అని బేరీజు వేసుకుంటున్నారు. ఎవరి హయాంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకున్నామన్నదానిపై ఎన్నికల నేపథ్యంలో తేడాలు గమనించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసుకునే తరుణంలో ఎవరు బెస్ట్ అనే దానిపై పోల్చి చూసుకుంటున్నారు. -
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్ అంటూ దోచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు. అచ్చెన్న అవినీతి మార్క్ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్ అవినీతిని చూపించారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్ హెడ్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు. అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. 👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. 👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమే‹Ùకుమార్ రూ. 9.50కోట్లు చెల్లించారు. 👉 ఒక్కో బయోమెట్రిక్ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు. 👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్‌లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి. 👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు. 👉టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్ సోర్సింగ్ దందా సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. 👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరీ్నచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. 👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. మొదటి నుంచీ అదే బాగోతం రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు. -
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు కి ఈసీ నోటీసులు
-
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్‌టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్‌టెక్‌ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్‌టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్‌టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్‌లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్‌బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్‌ను అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్‌ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్‌ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్‌ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్‌తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్‌కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్‌కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్‌కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్‌కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్‌కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్‌గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్‌ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
శ్రీలంక పారిపోతునంటున్న రాజేశ్
-
ఎందుకీ దురహంకారం..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఢిల్లీ సెంటర్లో దించి నువ్వు ఎక్కడికై నా వెళ్లు అంటే దారి తెలియనటువంటి వ్యక్తి. ఇంగ్లిష్, హిందీ రాని వ్యక్తికి పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారు. అటువంటి వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై పోటీ అట. ఆయనతో పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు’ శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త పేరాడ తిలక్‌పై ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. అచ్చెన్న దురహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనాలు. పట్టభద్రుడైన పేరాడ తిలక్‌ను పట్టుకుని హేళనగా, చులకనగా మాట్లాడటంపై జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు మండి పడుతున్నారు. అచ్చెన్నాయుడు దొరల అహంకారాన్ని చూపిస్తూ అవతలి వ్యక్తులను చిన్నతనంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారని దుయ్యబడుతున్నారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని అవమాన పరిచేలా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం జిల్లా అంతటా చర్చ జరుగుతోంది. అచ్చెన్నా.. ఇది తగునా..! ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పిల్లల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడితే కోర్టులకెళ్లి అడుగడుగునా అచ్చెన్న అడ్డు తగిలారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు ఎందుకు, ఇంగ్లిష్ నేర్చుకుంటే ఏమొస్తుంది, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియమేంటి, పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోకూడదు, పైస్థాయికి వెళ్లకూడదన్నట్టుగా అచ్చెన్న వ్యవహరించారు. ఇప్పుడదే నోటితో ఇంగ్లిష్ రాని వ్యక్తికి పార్లమెంట్ టిక్కెటా.. అని అనడం అచ్చెన్న దిగజారుడు రాజకీయాన్ని సూచిస్తోంది. ‘చదువుకున్న వ్యక్తికి ఇంగ్లిష్ పెద్ద కష్టమేమి కాదు. అలాగైతే మీ సోదరుడు, దివంగత నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడుకు ఎంపీ గా వెళ్లినప్పుడు ఆయనకు వచ్చా? ఆ తర్వాత నేర్చుకున్నదే కదా?’ అని వైఎస్సార్సీపీ శ్రేణులు, కాళింగ సామాజిక వర్గ మేధావులు అచ్చెన్నను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ఆగ్రహజ్వాల.. ఇప్పటికే మండలాల వారీగా అచ్చెన్నపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలక్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. రాజకీయాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్న పేరా డ తిలక్‌ను అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. రాజకీ యంగా ఎదుగుతున్న తమ నాయకుడిపై అవాకు లు చవాకులు మాట్లాడితే బుద్ధి చెబుతామని ప్రెస్మీట్లు పెట్టి అచ్చెన్నను హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు.. మాకు ఎవరూ సాటి రా రు అనే అహంకారంతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని గొడవ పెట్టిన నువ్వు ఇంగ్లిష్ రాదని మా పార్లమెంట్ సమన్వయకర్త గురించి మాట్లాడుతావా. ప్రభు త్వ స్కూల్లో చదువుకున్న వారు రాజకీయాల కు పనికిరారా...అచ్చెన్నాయుడికి పోయే కాలం ఎక్కువైంది. ఇలాంటి దౌర్భాగ్యులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. – సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మత్స్య శాఖామంత్రి. బహిరంగ చర్చకు సిద్ధమా... ఎంపీగా పోటీ చేయాలంటే ఇంగ్లిష్, హిందీ భాషలు తెలిసి ఉండాలంటూ తెలుగు భాష సక్రమంగా రాని అచ్చెన్నాయుడు ఇటీవల వైఎస్సార్సీపీ నాయకు లపై ఎద్దేవా చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో ఏ చర్చకై నా సిద్ధంగా ఉన్నాను. –దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఓటమి తప్పదు.. అచ్చెన్నాయుడు ముందు తమ పార్టీ పరిస్థితి చూసుకోవాలి. రాష్ట్రమంతటా అభ్యర్థులను ప్రకటించి అప్పుడు మాట్లాడాలి. టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్‌ల చేతిలో నువ్వు, నీ అన్నకొడుకు ఓడిపోవడం ఖాయం. –ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే -
అచ్చెంనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఏం చేస్తున్నారు? ఎన్నికల తరుణంలో బిజీగా కనిపించాల్సిన అచ్చెంనాయుడు అసలు కనిపించడంలేదు ఎందుకని? ఆయనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? లేక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అచ్చెన్నను పక్కన పెట్టేశారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో టికెట్ కావలసిన వాళ్లు బాబు, లోకేష్ ల వెంటపడుతున్నారేగాని అచ్చెన్న దగ్గరకు ఎందుకు వెళ్లడం ళ్లేదు? పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడిపై చంద్రబాబు నాయుడికి చాలా మంటగా ఉందంటున్నారు. బాబు కే కాదు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అచ్చెన్నపై పీకలదాకా కోపంతో ఉన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా ఏడాదిగా అచ్చెన్నపై ఆగ్రహంతోనే ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. సరియైన సమయం కోసమే బాబు ఇంతకాలం ఓపిగ్గా ఉండిపోయారని వారంటున్నారు. ఇపుడు ఎన్నికలు తరుముకు వస్తోన్న తరుణంలో దీన్ని మించిన అదను మళ్లీ దొరకదనుకుంటోన్న బాబు, లోకేష్ ఇద్దరూ కూడా అచ్చెన్నను సైడ్ లైన్ చేశారని అంటున్నారు. మును ముందు అచ్చెన్న పరిస్థితి మరింత దారుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అచ్చెన్నాయుడిపై పార్టీ అధినేతకు కోపం రావడానికి కారణం లేకపోలేదు.2019 లో టీడీపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నాక కొంత గ్యాప్ తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెంనాయుణ్ని ఏపీ అధ్యక్షునిగా నియమించారు. అయితే స్థానిక సంస్థలఎన్నికల్లో టీడీపీ వరుస పరాజయాలు మూటకట్టుకోవడంతో పార్టీలో నిస్తేజం ఆవరించింది. ఆ తరుణంలోనే తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు వచ్చిన అచ్చెంనాయుడు ఓ హోటల్ లో పార్టీ నేత ఒకరితో మాట్లాడుతూ టీడీపీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. పార్టీ లేదు బొక్కా లేదన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ సర్వనాశనం కావడం ఖాయమన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ రహస్యంగా రికార్డు అయిపోయాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలను పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ.. దాని అనుకూల మీడియా బాగా వాడేశాయి. దీంతో లోకేష్ పరువు కాస్తా పోయింది. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడిపై లోకేష్ కు మండుకొచ్చింది. అటు చంద్రబాబు నాయుడు సైతం తన కుమారుడి గాలి తీసేలా..పార్టీ పరువు పోయేలా అచ్చెన్నాయుడు మాట్లాడ్డాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పుడు అచ్చెన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకున్నా అది సరియైన సమయం కాదనుకున్నారు బాబు. అసలే పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడిపై వేటు వేస్తే ప్రజల్లోకి ..పార్టీ కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయంతోనే బాబు పంటి బిగువున కోపాన్ని అణచి పెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కూడా అచ్చెంనాయుడి వైఖరి బాబుకు నచ్చలేదని అంటున్నారు. లోకేష్ యువగళం యాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లాలో జనం ఎక్కువగా రావడం లేదని స్థానిక నేతలకు ఫోన్ చేసిన అచ్చెంనాయుడు లోకేష్ సభలకు జనం రావడం లేదని బాబు బాధ పడుతున్నారని ..తక్షణమే లోకేష్ యాత్రకు జనాన్ని తరలించాలని ఫోనులో ఆదేశించారు. అయితే ఈ ఫోను సంభాషణ కూడా లీక్ అయ్యింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాంతో లోకేష్ యాత్ర అట్టర్ ఫ్లాప్ అన్న ప్రచారం పెరిగింది. ఆ తర్వాత స్కిల్ స్కాంలో బాబు అరెస్ట్ అయిన సందర్భంలోనూ బాబుతో నేను కర్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనాలన్న అచ్చెన్న.. పార్టీలో నేతలెవ్వరూ స్పందించడం లేదంటూ లేఖ రాశారు. ఆ లేఖ కూడా బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడి వైఖరిపై బాబుకు అనుమానాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడు 2014లో విభజిత ఏపీకి సిఎం అయిన తర్వాత కేబినెట్ లో అచ్చెన్నాయుడికి కీలక పదవే ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి కావడం..వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సమీకరణలు మారాయి. ప్రత్యేకించి అచ్చెన్నాయుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఈ.ఎస్.ఐ. స్కాం లో కేసు నమోదయ్యింది. అందులో అచ్చెన్న అవినీతికి ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అంటోంది. అయితే ఈ కేసుల భయానికే అచ్చెన్నాయుడు పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారేమోనని బాబు అనుమానిస్తున్నారట. అసలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో అచ్చెన్న చేరతారన్న ప్రచారమూ జరిగింది. అయితే పార్టీలో చేర్చుకోవలసి వస్తే అచ్చెన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకోకూడదన్నది జగన్ మోహన్ రెడ్డి ఫిలాసఫీ. అందుకే ఆయన టీడీపీలోనే ఉంటూ వైసీపీకి అనుకూలంగా పావులు కదుపుతున్నారేమో అన్న అనుమానాలూ పెరుగుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు చాలా కాలంగా అచ్చెన్నపై నిఘా పెట్టారని అంటున్నారు. అచ్చెంనాయుడు ఉద్దేశ పూర్వకంగానే పార్టీ పరిస్థితి బలహీనంగా ఉందని ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు భావించారు. అచ్చెన్నాయుడి వ్యవహారాలు పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారాయి. పార్టీ పరువుతో పాటు లోకేష్ ప్రతిష్ఠనూ మంటగలుపుతున్నారని అనిపించగానే చంద్రబాబు అచ్చెంనాయుణ్ని హిట్ లిస్ట్ లో పెట్టేశారు. అయితే సమయం కోసం వేచి ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడగానే అచ్చెంనాయుడి ప్రాధాన్యత తగ్గించేశారు. ఉత్తరాంధ్రలోనూ పార్టీ నేతలు అచ్చెన్నాయుణ్ని పట్టించుకోవడం మానేశారు. ఎన్నికల తర్వాత అచ్చెంనాయుడి చాప్టర్ క్లోజ్ అయినట్లే అన్న గుస గుసలు వినిపిస్తున్నాయి. -
ఘోర అవమానాలతో రగిలిపోతున్న అచ్చెన్న!
చంద్రబాబుదో చిత్రమైన రాజకీయం. నేరుగా పోట్లాడడం ఆయన నిఘంటువులో ఉండదు. మిత్రపక్షంతోనైనా.. స్వపక్షంతోనైనా ఆయన తీరదే. వాడుకుని ముఖం మీద వేడినీళ్లు పోసే రకం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్సవ విగ్రహంలా మారారనే చర్చ నడుస్తోంది. పేరుకు అధ్యక్షుడైనా ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడంలేదు.. సరికదా అవమానాలూ తప్పడంలేదు. ఇటీవల చంద్రబాబు తన నివాసంలో పవన్ కళ్యాణ్‌తో విందు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మాట వరసకైనా అచ్చెన్నాయుడిని పిలవలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే చంద్రబాబు, లోకేశ్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అచ్చెన్నకు తెలియకుండానే ఆయన పేరుతో పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తనకు కనీస విలువ కూడా ఇవ్వడంలేదని అచ్చెన్న సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఆది నుంచి ఉత్సవ విగ్రహమే అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని బహిరంగంగా పెట్టి, భారీగా నిర్వహించాలని భావించారు. కానీ చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. వెళ్లి కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పడంతో చాలా నిరుత్సాహంగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయనది ఉత్సవ విగ్రహ పాత్రే. కనీసం మీడియా సమావేశాలు కూడా ఇష్ట ప్రకారం నిర్వహించేందుకు అనుమతి లేదు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నా ఆయన కళ్లెదుటే ఇతర నేతలకు అన్ని పనులు అప్పగిస్తున్నారు. అచ్చెన్నాయుడి కంటే వర్ల రామయ్యకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ అంశాలపై మీడియా ప్రకటనలు వర్ల రామయ్య పేరుతోనే విడుదల చేస్తున్నారు. పలు అంశాలపై వర్ల రామయ్యనే పార్టీ ప్రతినిధిగా పంపుతున్నారు. గవర్నర్, ఎన్నికల కమిషన్ అధికారులను కలిసేందుకు వర్ల రామయ్య, బొండా ఉమా వంటి నేతలను పంపుతున్నారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పట్టించుకోవడంలేదు. పలు సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు రాసే లేఖలు సైతం వర్ల రామయ్య, లోకేశ్ తదితరుల పేర్లతో వెళుతున్నాయి. వ్యతిరేకులకు ప్రోత్సాహం తనను కావాలని పక్కన పెడుతున్నారని, అవమానిస్తున్నారని తెలిసినా అచ్చెన్నాయుడు అన్ని సమావేశాలకు హాజరవుతున్నారు. ఆ సమావేశాల్లో కింది స్థాయి నాయకుడిలా ఒక పక్కన కూర్చోవడం, నాలుగైదు సార్లు అడిగిన తర్వాత అవకాశం ఇస్తే మాట్లాడడం తప్ప ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. నారా లోకేశ్ అచ్చెన్నను అసలు పట్టించుకోవడంలేదు. అచ్చెన్నాయుడు పేరు చెబితేనే మండిపడుతున్నట్లు సమాచారం. అసలు అధ్యక్ష పదవి కూడా అచ్చెన్నకు తీసివేసి తాను సూచించిన మరొకరికి ఇవ్వాలని లోకేశ్ చాలాకాలం పట్టుబట్టినట్లు తెలిసింది. కానీ సామాజిక సమీకరణలతో ఆయన్ను ఉంచాలని చంద్రబాబు చెప్పడంతో పేరుకే ఆయన్ను కొనసాగిస్తున్నారు. అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా లోకేశ్ తనకు అనుకూలమైన కళా వెంకట్రావును ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అచ్చెన్న స్థానంలో ఆయన సోదరుడి కుమారుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా జరుగుతున్న సమావేశాల్లోనూ ఆయన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టారనే చర్చ నడుస్తోంది. ఇదంతా చంద్రబాబుకు తెలియకుండా జరుగుతుందని అనుకోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాలతో అచ్చెన్నాయడు లోలోన తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు. -
లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడుపై వేటు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిస్థితే అందుకు ఉదాహరణ. పార్టీ లేదు.. బొక్కా లేదు అని, ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి అని ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు రాష్ట్ర అధ్యక్షుడే అయినా జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న వారు కనీసం ఆయనను సంప్రదించడం లేదు. పైగా అచ్చెన్న పేరు చెప్పుకుని అధిష్టానం వద్దకు వెళ్తే సీటు గల్లంతే అన్న నిర్ణయానికి వచ్చేశారు. మరీ ముఖ్యంగా లోకేష్ ‘అచ్చెన్న అనుచరుడు’ అని ముద్ర ఉన్న వారిని ప్రత్యేకంగా గమనిస్తున్నారని, దీనిపై ఆరా తీసే బాధ్యతను కూడా కళా వెంకటరావు తదితర నేతలకు అప్పగించారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు అచ్చెన్న ప్రమేయం లేకుండా లోకేష్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నారు. చేటు తెచ్చిన మాట.. లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదంటూ ఫోన్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు...తనకు సమకాలీనులైన నాయకుల వద్ద లోకేష్‌పై మాట్లాడిన తీరు.. అన్నీ కలిపి ఇప్పుడు ఆయనపై గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీని, తనను బదనాం చేసిన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు అచ్చెన్నాయుడుపై వేటేస్తే పార్టీకి ఇబ్బంది అని వేచి చూస్తూనే.. వ్యక్తిగతంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీలో అచ్చెన్నాయుడు మాటకు విలువ లేకుండా చేయడంతో పాటు ఆయన అనుచరులుగా పార్టీ టిక్కెట్ ఆశించే వారికి మొండి చేయి చూపే విధంగా లోకేష్ పావులు కదుపుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో అచ్చెన్న పేరు చెప్పుకుని టిక్కెట్ అడిగేందుకు ఆశావహులు సాహసించలేకపోతున్నారు. వాస్తవంగా ఈ సారి ఎన్నికల్లో పాతపట్నం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకున్న అంతర్గత విభేదాల కారణంగా సీట్ల కేటాయింపు విషయంలో నిర్ణయా లు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షు డి హోదాలో అచ్చెన్నాయుడును వెంటబెట్టుకుని అధిష్టానం వద్ద ప్రయత్నాలు సాగించాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టిక్కెట్ కోసం అచ్చెన్నాయుడు వ్యతిరేక వర్గంగా నిలిచిన లోకేష్ అనుచరులతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కళా వెంకటరావుతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత కూన రవికుమార్ ద్వారా యత్నాలు సాగిస్తున్నారు.. వీరిద్దరూ లోకేష్ తో బాగా టచ్‌లో ఉన్నారు. చెప్పాలంటే అచ్చెన్నకు పోటీగా లోకేషే వీరిని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో ఏం జరిగినా లోకేష్‌కు ఇట్టే సమాచారం ఇస్తున్నారు. అచ్చెన్నతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న నేతలెవరో చెప్పే బాధ్యతను తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికంతటికీ తిరుపతి లోకసభ ఉప ఎన్నికల సమయంలో లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే కారణమని చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చెప్పిన మనషులకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని, కాస్తో కూస్తో ఎంపీ రామ్మోహన్నాయుడు చెప్పినోళ్లకై నా ప్రాధాన్యత ఇస్తారేమో గాని అచ్చెన్నాయుడు సిఫా ర్సు చేసే వ్యక్తులకు ఛాన్సే లేదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీంతో అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లడానికి, ఆయన సిఫార్సులతో టిక్కెట్ కోసం ప్రయత్నించడానికి జిల్లాలోనే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల తర్వాత అచ్చెన్నను పూర్తిగా అణగదొక్కడానికి లోకేష్ ప్రణాళిక సిద్ధం చేశారని పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది. -
బాబు అమలు చేయని హామీలు...అచ్చోసిన అబద్ధాలు..
-
మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?: జోగి రమేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్మోహన్రెడ్డి అని చెప్పిన జోగి రమేష్.. దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్సార్సీపీ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా?అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నామన్నారు. చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని నెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదని మండిపడ్డారు. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ‘అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?. ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?. ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?. ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది. 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?. ‘చంద్రబాబు దిక్కుమాలిన మేనిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు. మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో. అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?. ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు’ అని జోగి రమేష్ విమర్శించారు. చదవండి: అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని -
గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. నమ్ముకుంటే అంతేనా?
తెలంగాణ ఎన్నికల పర్వం ముగియడంతో ఇక ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం చరిష్మా చెదిరిపోవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ళుగా జిల్లాలో టీడీపీ ప్రాభవం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇక కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే లాభం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎప్పుడూ కింజరాపు కుటుంబం చుట్టూనే తిరుగుతాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు కుమార్తె భవాని తెలుగుదేశం పార్టీలో కీలక కుటుంబంగా వ్యవహరిస్తున్నారు. యర్రంనాయుడు మరణం తరువాత ఆయన వారసులుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు టీడీపీలో పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కింజరాపు కుటుంబానికి వైభవం గతంగా మిగిలిపోయింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య పొసగడం లేదు. అచ్చెన్నాయుడు ఎంత రాసుకుపూసుకు తిరుగుతున్నా లోకేష్ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హాదాలో ఉన్న అచ్చెన్నాయుడు లోకేష్ వల్లే తెలుగుదేశంకు నష్టం జరుగుతోందంటూ చేసిన కామెంట్.. పార్టీ లేదూ బొక్కా లేదు అని పలు సందర్బాల్లో అన్న వ్యాఖ్యలు లోకేష్ టీంలో నాటుకుపోయాయి. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కూడా చులకన భావం ఏర్పడింది. అచ్చెన్నాయుడుని రాష్ట్ర నాయుకుడుగా గుర్తించడం లేదు. మరో పక్క శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఒక ఫెయిల్యూర్ ఎంపీ అని జిల్లా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో ఫోటోలు దిగడం, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మినహా ఆయన జిల్లాలో కనిపించింది చాలా అరుదు అని పార్టీ కేడరే పెదవి విరుస్తున్నారు. శ్రీకాకుళంలో ఇల్లు ఉన్నా, ఎప్పుడు ఇంట్లో ఉండరని కార్యకర్తలు బహిరంగ వేదికల మీదే ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు స్థానికంగా ఉంటున్నప్పటికీ ఇంట్లో లైట్లు వేసి ఉంటే కార్యకర్తలు ఇంటికి వచ్చేస్తారని, లైట్లు ఆర్పేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా ప్రజల కంటే చంద్రబాబు, లోకేష్ ల చుట్టూ తిరగడానికి, ఢిల్లీలో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఈయన మీద అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. ఒకవైపు అచ్చెన్నాయుడుకి అధిష్టానం వద్ద విలువలేకపోవడం, మరోవైపు రామ్మోహన్ నాయుడు తీరుపై జిల్లా ప్రజలు, పార్టీలో నమ్మకం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అనే భయం జిల్లా నాయకులను వెంటాడుతోంది. వీరిద్దరి గ్రాఫ్ తగ్గిందని చంద్రబాబు సర్వే రిపోర్ట్లు కూడా తేల్చడంతో ఈ ప్రభావం అసెంబ్లీ నియోజవర్గాలపై కూడా ఉందని టికెట్ ఆశిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. వి సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు నిర్మాణం, ఉద్దానం తాగునీటి ప్రోజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాల వలన టెక్కలిలో ఈసారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ కు బ్రహ్మరధం పడుతున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న పనులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే చేసింది. దీంతో టెక్కలిలో ఈసారి అచ్చెన్నాయుడు గెలుపు ప్రశ్నార్దకం అయింది. మొత్తం మీద కింజారపు కుటుంబం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల గ్రాఫ్ పడిపోవడంతో.. వీరివల్ల జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా తయారైందనే చర్చ సాగుతోంది. ఇదీ చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
పార్టీ లేదు బొక్క లేదు అని..నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు
-
చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే... టీడీపీ నేతలు సిగ్గు లేకుండా..!
-
కింజరాపు అచ్చెన్నాయుడుని ఏకిపారేసిన మంత్రి
-
అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ సంచలన కామెంట్స్
-
ఇంతకీ అవి ఏ నిధులు బాస్..టీడీపీకి నో క్లారిటీ
తెలుగుదేశం పార్టీకి అక్రమంగా నిధులు వచ్చాయన్నది ఏపీ సీఐడీ ఆరోపణ. స్కిల్ కార్పొరేషన్ స్కామ్ నిదులే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాలోకి జమ అయ్యాయని సీఐడీ అభియోగం మోపింది. ఆ రకంగా 27 కోట్ల రూపాయలు టీడీపీ అకౌంట్లోకి వచ్చాయని సీఐడీ తరపున అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి కోర్టువారి దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. దీనిపై అక్కడ టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది డూబే స్పందిస్తూ టీడీపీ ఖాతాలో డబ్బు జమ అయితే చంద్రబాబుకు ఏమి సంబంధం అని అన్నారట. అదే లాయర్ కనుక అప్పటికప్పుడు ఆ నిధులు ఎలొక్టరల్ బాండ్లకు సంబందించిన నిధులు అని ఆధారసహితంగా చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేవారట. ఆయన ఆ వాదనవైపు వెళ్లకపోవడం విశేషంగానే కనిపిస్తుంది. కాని ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆ 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల డబ్బు అని సంక్షిప్తంగా చెప్పి, సవివరంగా ప్రకటన ఇస్తామని చెప్పి వెళ్లిపోయారట. కాని ఆ తర్వాత దాని ప్రస్తావన లేదు. తదుపరి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ నిధులు పార్టీ సభ్యత్వ నిధులని చెప్పారు. ✍️ఇంతకీ అవి ఎలక్టోరల్ బాండ్ల డబ్బా! లేక సభ్యత్వ నిధులా అన్నదానిపై టీడీపీలోనే స్పష్టత కొరవడిందన్నమాట. తదుపరి తెలుగుదేశం నేతలు నిమ్మల రామానాయుడు, పట్టాభిలు చేసిన ప్రకటన మరింత ఆసక్తికరంగా ఉంది. వారు అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిదుల వివరాలు వెల్లడించారే కాని, టీడీపీకి ఎంత మేర వచ్చాయన్నది చెప్పినట్లు కనిపించలేదు. మరికొన్ని వివరాలు ఇస్తూ 2015-16 సంవత్సరంలో పార్టీ సభ్యత్వం కింద 15.97 కోట్ల రూపాయల డబ్బు జమ అయిందని , ఆ ఏడాది సభ్యత్వాలు పెద్దగా నమోదు కాలేదని చెప్పారు. కాని 2016-17 లో మాత్రం 72.92 కోట్ల రూపాయల మొత్తం వసూలు అయితే ,అందులో సభ్యత్వ రుసుమే 60.75 కోట్లు అని వెల్లడించారు. అంటే ఒక ఏడాదిలో నాలుగు రెట్ల మేర సభ్యత్వం , తద్వారా ఆదాయం పెరిగిందని చెప్పారు. సహజంగానే దీనిపై సందేహాలు వస్తాయి. పోనీ ఈ మాట అయినా చంద్రబాబు తరపు లాయర్ ఎందుకు కోర్టుకు వివరించలేదో తెలియదు. ✍️కోర్టులో చేయవలసిన వాదన టీడీపీ నేతలు బయట చేస్తున్నారని కొందరు వ్యంగ్యంగా విశ్లేషిస్తున్నారు. అది నిజంగా పూర్తిగా సభ్యత్వం డబ్బే అయితే, అధికారికంగా ఆయా జిల్లాల నుంచి ఆ సంవత్సరం బ్యాంకు ఖాతాల వివరాలను తెచ్చి కోర్టుకు ఇచ్చి ఉండవచ్చు కదా! కాని ఆ పని కూడా ఎందుకు చేయలేదో తెలియదు.ముందుగా అచ్చెన్నాయుడు అవి ఎలక్టోరల్ బాండ్ల డబ్బు అని ఎందుకు చెప్పారు? తదుపరి లోకేష్ కాని, ఇతర నేతలు కాని అది పార్టీ సభ్యత్వ సొమ్ము అని ఎందుకు చెబుతున్నారు.సీఐడీ చెబుతున్న వాదన చూస్తే, అది షెల్ కంపెనీల నుంచి వచ్చిన సొమ్ము అని ,నగదు రూపంలో అధిక మొత్తం జమ అయిందని తేలుతోంది. నిజంగా సీఐడీ వద్ద తగు ఆధారాలు లేకుండా కోర్టుకు తెలియచేస్తే వారు ఇబ్బంది పడతారు. ✍️దాని ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుంది. ఈ విషయంలో సీఐడీ వాదన పూర్తి క్లారిటీతో, ఒకే మాటపై ఉంటే, తెలుగుదేశం వాదన ఎప్పటికప్పుడు మారుతోంది.అది సందేహాలకు తావిస్తోంది. పైగా తమకు ఎవరెవరు ఎంత ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లేదా, విరాళాల ద్వారా డబ్బు ఇచ్చారో చెప్పవలసిన తెలుగుదేశం నేతలు ఆ పని చేయకుండా వైసికి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల గురించి ఎదురు దాడి చేశారు. అక్కడే వారు డిఫెన్స్ లో పడుతున్నారు.దేశంలో ఈ బాండ్ల విధానం గత కొన్నేళ్లుగా అమలు అవుతోంది. బిజెపికి ప్రతి ఏడాది వెయ్యి కోట్లకు పైగానే ఈ బాండ్ల ద్వారా సొమ్ము జమ అవుతోంది.కాంగ్రెస్ పార్టీకి 400 కోట్లకు పైగా వస్తోంది. అదేమీ రహస్యం కాదు.తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపి, కాంగ్రెస్ ల బాండ్ల డబ్బు గురించి మాట్లాడకుండా వైసీపీపైనే విమర్శలు చేశారు.దానికి క్విడ్ ప్రోకో అని ఆరోపించి తమకు వచ్చిన అవినీతి సొమ్ము అభియోగాలను దారి మళ్లించాలని ప్రయత్నించారు. ✍️వైసీపీకి అధికారికంగా వచ్చిన నిధులు అవి. అందులో తప్పు లేదు. మెఘ కంపెనీ బాండ్ల ద్వారా 22 కోట్లు ఇచ్చింది కాబట్టి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారా అంటూ బోడిగుండుకు, మోకాలికి లింక్ పెట్టి మాట్లాడారు. నిజానికి గతంలో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేసి నామినేషన్ పద్దతిపై నవయుగ కంపెనీకి ఇచ్చేశారు. కాని వైసీపీ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి రివర్స్ టెండర్ ద్వారా సుమారు 800 కోట్లు ఆదా చేశారు. అలా కాంట్రాక్టును టెండర్ ద్వారా ఇస్తే అది ఎలా క్విడ్ ప్రోకో అవుతుంది. పైగా కాంట్రాక్ట్ వ్యయాన్ని 800 కోట్లు తగ్గించినందుకు విరాళం ఇస్తారా? ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేయడమే తప్ప, తమకు వచ్చిన విరాళాలు, బాండ్లు గురించి ఎందుకు టీడీపీనేతలు ఓపెన్ చేయడం లేదు. ✍️ఏ ఏ కంపెనీల ద్వారా టీడీపీకి డబ్బు వచ్చిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం మీడియా సీఐడీ తరపు న్యాయవాది చేసిన 27 కోట్ల ఆరోపణకు ప్రాధాన్యం ఇవ్వకుండా, టీడీపీ నేతలు చేస్తున్న పిచ్చి ఆరోపణలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి,వాటికి విశ్వసనీయత కల్పించడానికి పడుతున్న పాట్లను గమనిస్తేనే ,ఇందులో అవినీతి ఉందన్న భావన కలుగుతుంది.సీఐడీ చెబుతున్నట్లు నగదును కోట్ల రూపాయలలో జమ చేసి ఉంటే సంబంధిత బ్యాంకులు కూడా బాద్యత వహించవలసి ఉంటుందని చెబుతున్నారు. ఇరవై రోజుల తర్వాత డిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన లోకేష్ కూడా యధాప్రకారం తన తండ్రిపై అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు.ఆ విషయాన్ని కోర్టులో రుజువు చేసి ఉంటే ఈపాటికి చంద్రబాబు విడుదల అయ్యేవారు కదా అన్నది సామాన్యుడికి వచ్చే ప్రశ్న.మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా జైలులో ఉంచుతున్నారని ఆయన అంటున్నారు. ✍️బహుశా గతంలో టీడీపీ వారు చేసిన మేనేజ్ మెంట్ వ్యవహారాలు గుర్తుకు వచ్చి ఉండాలి.నిజానికి జగన్ కు కాని, వైసీపీ నేతలకు కాని అంత శక్తే ఉంటే టీడీపీ వారు నిత్యం హైకోర్టులో వేసిన అనేక వ్యాజ్యాలలో ఎదురు దెబ్బ ఎందుకు తినేవారు! ప్రజా ప్రయోజనాల విషయాలలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాకుండా చేయగలిగారే. ఆ ధైర్యంతోనే కదా.. టీడీపీ కార్యకర్తలు ,నేతలు ఎవరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తానని లోకేష్ చెబుతూ వచ్చారు. జైలుకు వెళ్లే టీడీపీ వారిని గంటల వ్యవధిలోనే బయటకు తీసుకు వస్తామని చంద్రబాబు, లోకేష్ లు ఎలా భరోసా ఇస్తుండేవారు.చాలా కాలం అలా చేయగలిగారు కూడా.చంద్రబాబుకు ఆయా వ్యవస్థలలో ఉన్న పరపతి గురించి అంతా బహిరంగంగానే మాట్లాడుకుంటారు కదా! అలాంటిది ఇప్పుడు జగన్ పై లోకేష్ ఆరోపణ చేయడం విడ్డూరమే అని చెప్పాలి. ఇంతకీ ఆ 27 కోట్లు ఎక్కడనుంచి వచ్చాయో నిర్దిష్ట ఆధారాలతో సహా కోర్టుకు, అలాగే ప్రజాకోర్టుకు చూపిస్తే తెలుగుదేశంకు నైతిక స్థైర్యం వచ్చేది. అలా చేయకుండా ప్రత్యారోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే వారు ఇందులో గట్టిగానే ఇరుక్కున్నారనిపిస్తుంది. కేవలం తమ పార్టీవారినైనా మభ్య పెట్టడం కోసం ఇలా ప్రతి విమర్శలు, నిరసనలు అంటూ కాలం గడుపుతున్నట్లుగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే 27కోట్ల వ్యవహారం తెలుగుదేశం పార్టీపై పడిన పెద్ద బాంబు వంటిదని చెప్పాలి. అది పూర్తి స్థాయిలో విస్పోటనం అయితే ఆ పార్టీ పెను సంక్షోభంలో పడే అవకాశం కూడా ఉంటుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాలయ్యను పీకి పక్కన పెట్టిన చంద్రబాబు..
-
నారా లోకేష్, అచ్చెన్నాయుడిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్స్ చేశారు. కాగా, కేఏ పాల్ బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. చంద్రబాబు అవినీతిలో ఆయన కుమారుడు నారా లోకేష్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించాల్సిందే. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలు పెయిడ్ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబుకు నిజంగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయాలన్నారు. కేవలం 25 సీట్ల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడని తీవ్ర విమర్శలు చేశారు. ప్యాకేజీ కోసమే కాపులను పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు.. -
బాబును మానసిక క్షోభకు గురిచేస్తున్నారు
సాక్షి, రాజమహేంద్రవరం: తప్పుడు కేసులతో జైల్లో పెట్టి తన భర్త చంద్రబాబును ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని నారా భువనేశ్వరి ఆరోపించారు. బాబు భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా ఇవ్వడం లేదని, ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్న అనంతరం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో బాబును ఎవరూ బెదరించలేరన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జైలు నిబంధనల మేరకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు బయటే ఉండిపోయారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘బాబు ధైర్యంగా, ఆత్మస్థయిర్యంతో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు. పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లు. వాళ్లే లేకుంటే పార్టీలేదు. పోలీసులు ఏం చేసినా వారు బెదరరు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. సీఐడీవి పనికిమాలిన ప్రశ్నలు: అచ్చెన్నాయుడు కస్టడీలో చంద్రబాబును సీఐడీ అడిగినవన్నీ పనికిమాలిన ప్రశ్నలేనని అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఆధారం లేని కేసుల్లో ఇరికించారన్నారు. రెండు రోజుల విచారణలో ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే సమాధానం చెప్పడం లేదన్నారు. కస్టడీలో 33 ప్రశ్నలు పనికిమాలిన, స్కామ్‌కు సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్నారు. ఆ ప్రశ్నలను తీసుకున్నామని, న్యాయ నిపుణుల సలహా సైతం తీసుకున్నామని, ప్రతి ప్రశ్నకు జవాబును విపులంగా ప్రజల ముందు ఉంచుతామన్నారు. చంద్రబాబు జైల్లో ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆయన భద్రతపై భయంగా ఉందన్నారు. దోమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బాబుకు జైల్లో ఏమైనా జరిగితే అందుకు కర్త, కర్మ, క్రియ జగనేనన్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని, త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. 16వ రోజుకు చేరిన చంద్రబాబు జైలు జీవితం కాగా, సోమవారానికి చంద్రబాబు జైలు జీవితం 16వ రోజుకు చేరింది. మరో 10 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండనున్నారు. -
బాబు సీటుపై అచ్చెన్నాయుడు నజర్..
-
కోరిక నెరవేరింది!.. ఎంజాయ్ చేస్తున్న అచ్చెన్నాయుడు
-
బాలకృష్ణ విజిల్స్, అచ్చెన్నాయుడు వీడియోలకు స్ట్రాంగ్ కాంటర్ ఇచ్చిన మంత్రి చెల్లుబోయిన
-
అచ్చెన్న అరణ్య రోదన
-
అంతా అయిపోయింది అధ్యక్షా
-
చంద్రబాబు అరెస్ట్.. మొహం చాటేసిన టీడీపీ నేతలు.. అచ్చెన్నాయుడు ఆగమాగం..
-
బాబ్బాబు.. రోడ్డెక్కండని వేడుకుంటున్న అచ్చెం
-
ప్రజల సంగతి సరే.. పార్టీ నేతలు కూడా మొహం చాటేశారా?
-
బాబుతో నేను కార్యక్రమం అట్టర్ ప్లాఫ్
-
పార్టీ క్యాడర్‌కు అనుబంధ సంఘాలకు అచ్చెన్నాయుడు లేఖ
-
అచ్చెన్నాయుడు ఫోన్ కాల్ ఎంత పని చేసింది..
-
టీడీపీని స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి అచ్చెన్నాయుడు
-
పవన్ కళ్యాణ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..!
-
‘స్కిల్’ స్కామ్ సమయంలో నేను ఆ శాఖ మంత్రి కాదు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్కిల్ స్కామ్ సమయంలో తాను సంబంధిత శాఖ మంత్రిని కాదని, తొలుత విద్యా శాఖ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ ఉండేదని, ఆ తర్వాత కార్మిక శాఖతో అనుసంధానం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఈ ప్రాజెక్టు వల్ల ఒక్క రూపాయి వచ్చిందని నిరూపిస్తే పీక కోసుకుంటానని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి మంత్రివర్గంలో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నారని, తాను.. చంద్రబాబు కలిసి ఏదో మాయ చేశామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ‘రెండేళ్ల క్రితం కేసు పెట్టారు. అప్పడు నా పేరు గాని, చంద్రబాబు పేరుగాని లేదు. మరి చంద్రబాబును ఎలా అరెస్టు చేశారు? తెలుగుదేశం హయాంలో కేబినెట్లో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది యువకులకు లబ్ధి చేకూరింది. సీఐడీ చెబుతున్నట్టుగా రూ.371 కోట్ల అవినీతి అనేది ఒక ఊహ. ఆ రోజు ఈ ప్రాజెక్టును అమలు చేసిన అజేయ కల్లం, ప్రేమ చంద్రారెడ్డి పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు. 409 సెక్షన్ ఎందుకు పెట్టారో తెలియదు. ఇది రాజకీయ కక్ష’ అని అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించే హక్కు పవన్ కళ్యాణ్‌కు లేదా?’ అని ప్రశ్నించారు. -
దయచేసి రావాలి..!!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది. ‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్‌టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్‌కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు. రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా.. తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు. సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడు మాట్లాడిన టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్
-
బాబు అరెస్టయినా జనాలు పట్టించుకోవడం లేదు.. అచ్చెన్నాయుడు ఆడియో లీక్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ బలవంతపు జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అచ్చెన్న టీడీపీ నేతలతో మాట్లాడిన టెలీ కాన్ఫరెన్స్ ఆడియో లీకైంది. ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని అచ్చెన్నాయుడు నిట్టూర్పులు విడుస్తున్నారు. చదవండి: చంద్రబాబు ‘స్కిల్’ స్కాం: కోర్టులో ఎవరి వాదన ఏంటీ? -
నా టిక్కెట్ ఎవడికో ఇవ్వడమేంటి ?