అచ్చెన్న అడ్డాలో.. రక్త చరిత్ర | AP Elections 2024: Kinjarapu Atchannaidu Death Politics In Srikakulam, More Details Inside | Sakshi
Sakshi News home page

AP Elections: అచ్చెన్న అడ్డాలో.. రక్త చరిత్ర

Published Sun, May 12 2024 8:46 AM | Last Updated on Sun, May 12 2024 2:34 PM

Kinjarapu Atchannaidu Death politics  in srikakulam

కింజరాపు కుటుంబీకులకు వ్యతిరేకంగా పనిచేసినవారంతా కనుమరుగు 

అనేక మంది హత్యలకు గురైన వైనం 

కొందరికి సామాజిక, గ్రామ బహిష్కరణ 

మరికొందరిపై దౌర్జన్యాలు, దాడులు

  • సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: 
    👉 నిమ్మాడలో కింజరాపు కుటుంబానికి కాదని సర్పంచ్‌గా నామినేషన్‌ వేసిన కింజరాపు సూరయ్య... ఆయన ఇంటిలోనే హత్యకు గురయ్యారు.     
    👉 కింజరాపు కుటుంబీకులకు వ్యతిరేకంగా నిలిచిన ఎచ్చెర్ల సూర్యనారాయణను చిట్టయ్యవలస తోటలో హత్యకు గురయ్యారు.    
    👉 కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు ఎమ్మెల్యేగా పోటీకి అడ్డుపడిన కింజరాపు భుజంగరావు (బుజ్జి) కత్తులతో హత్యకు గురయ్యారు.    
    👉  నిమ్మాడ రాజకీయంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తి శవమయ్యాడు.   
    👉  పిన్నింటిపేటలో రిగ్గింగ్‌కు అడ్డుపడిన కూన రామారావుని 1994లో డిసెంబర్‌ 3న కత్తితో పొడిచి చంపేశారు.  
    👉 కింజరాపు గణపతి కుమార్తె మేనకమ్మను మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా అక్కడే వివస్త్రను చేశారు. 
     
    ఇలా చెప్పుకుంటూ పోతే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది హత్యలకు గురయ్యారు. వాటి వెనక ఎవరున్నారో చనిపోయిన వారి శత్రువులకు తెలియాలి. నిమ్మాడ రాజకీయమంటే అలాగే ఉంటుందనేది అందరి నోట మాట. తొలుత బెదిరింపులు..ఆ తర్వాత దౌర్జన్యాలు..అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం నిమ్మాడలో పరిపాటిగా మారిపోయింది. ఏళ్ల క్రితం నుంచి 18 ఎకరాల రైతు మెండ రామ్మూర్తిని ఇబ్బంది పెడుతున్న విషయం ఇప్పటికీ కొనసాగుతోంది.  

    అన్న కుమారుడిపైనా దౌర్జన్యం.. 
    కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు వరసకు అన్న కుమారుడైన కింజరాపు అప్పన్న టార్గెట్‌ అయ్యారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అప్పన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.  అప్పన్న భార్య చంద్రకళ మెళియాపుట్టి కేజీబీవీలో హిందీ పండిట్‌గా పనిచేసేవారు. 2014లో మంత్రి అయ్యాక ఆమెను తొలగించారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్‌ వద్ద 15 ఏళ్ల క్రితం రూ. 2లక్షలను అప్పన్న అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తమంతా చెల్లించినప్పటికీ ముందుగా రాసుకున్న నోటు పత్రం ఈ రోజుకూ ఇవ్వలేదని అప్పన్న మొరపెట్టుకునే వస్తున్నారు. అదే అప్పన్న నిమ్మాడ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేస్తే అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్‌ తదితరులు దాడి కూడా చేశారు.  

అచ్చెన్నపై నమోదైన కేసులు, ఫిర్యాదులు
👉 కోటబొమ్మాళి  మండలం నిమ్మాడలో సర్పంచ్‌ కింజరాపు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు కింజరాపు హరిప్రసాద్, కింజరాపు కృష్ణ, కింజరాపు అచ్చెన్న, కింజరాపు దాముమోహన్, మెండ సత్యం తదితరులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో సర్పంచ్‌ గణేశ్వరరావు కుమార్తె మేనకపై కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు అనుచరులు దాడి చేసి అవమానపరచినట్లు ఆమె తండ్రి గణేశ్వరరావు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు.  

👉 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన అచ్చెన్నాయుడును అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ ప్రయత్నాలు చేశారు. 

👉పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసిన సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేశారు.  

👉 1995లో కాంగ్రెస్‌ మద్దతుదారులుపై అచ్చెన్న వీరంగం చేసి నిమ్మాడలో తన పినతండ్రి వరుసైన  బుజ్జి అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  

👉 కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసి, ఆ  ఘటనను కప్పి పుచ్చేందుకు అధికారులను బెదిరించారు. ఈ కేసును  కొట్టివేశారు. 

👉 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ తో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశాడు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement