అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే! | - | Sakshi
Sakshi News home page

అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!

Published Sat, May 4 2024 6:35 AM | Last Updated on Sat, May 4 2024 12:01 PM

-

 ప్రభుత్వ ఉద్యోగులపై కింజరాపు అచ్చెన్నాయుడు దురుసు ప్రవర్తన

 అధికారంలో ఉన్నంత కాలం అదే పంథా

 ప్రతిపక్షంలోనూ మారని తీరు

 ఎన్నికల నేపథ్యంలో విశ్లేషించుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు బేరీజు వేసుకుంటున్నఉద్యోగులు

‘ఒరే.. ఏరా..’ ఉద్యోగులను అచ్చెన్నాయుడు పిలిచే విధానమిది. ‘బట్టలూడదీసి కొడితే నీకు దిక్కెవరే..’ ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్న మాట ఇది. ‘ఏయ్‌ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్‌ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ పోలీసులను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలివి. ఒంటి నిండా మదం, గొంతు నిండా విషం నింపుకున్న అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను చాలాకాలంగా చులకనగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయన తీరు మారలేదు. ఎన్నికల నేపథ్యంలో అచ్చెన్న వ్యవహార శైలిని ఉద్యోగులు విశ్లేషించుకుంటున్నారు.

👉ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగి కళ్యాణి అనే మహిళపై అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారు. ఆమైపె దౌర్జన్యం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.

👉 గతంలో కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసి, నీకు బట్టలు ఊడదీసి కొడితే దిక్కెవరే అంటూ బెదిరించాడు. ఆ సంఘటనను కప్పి పుచ్చేందుకు అప్పట్లో పోలీస్‌ అధికారులను బెదిరించి కంప్లైంట్‌ నమోదు కాకుండా చేశారు.

👉 గతంలో పోలాకి మండలం రహీమానుపురంలో జన్మభూమి కమిటీ సభ్యుడు బాలక గోపి తండ్రి డెత్‌ సర్టిఫికెట్‌ విషయంలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు త్రివేణి అక్కడ నిబంధనల మేరకు వ్యవహరించిందని నిమ్మాడ పిలిపించి ఆగ్రహించడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.

👉గతంలో టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి అప్పటి ఎంపీడీఓగా పనిచేసిన లోకనాథంను బెదిరించారు. చెప్పినట్టు చేయలేదన్న ఆగ్రహంతో తలుపులేసి తంతే నీకు దిక్కెవరు అని భయపెట్టారు.

👉గతంలో పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సూర్యారావు అనే కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేశారు. ‘నిన్ను తుపాకీ తిరగేసి కొడితే నీకు దిక్కెవరం’టూ అచ్చెన్నాయుడు బెదిరించారు. సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు.

👉‘ఏయ్‌ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్‌ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్‌లెస్‌ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికి కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయారు.

👉ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరైస్టెనప్పుడు కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద వైద్య పరీక్షలు నిర్వహణ కోసం పోలీసులు తీసుకురాగా...అక్కడున్న సీఐ నీలయ్యను బెదిరించారు. ‘హోం మినిష్టర్‌ను అవుతాను. నీ లెక్క తేలుస్తాను’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కింజరాపు అచ్చెన్నాయుడికి ఉన్న గౌరవిమిది. ఒరే..ఏరా అన్న పిలుపే తప్ప ఆయనలో అంతకుమించి సంస్కారం లేదని పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. మంత్రి హోదాలోనే కాదు ప్రతిపక్ష నేతగా కూడా అచ్చెన్నాయుడు వ్యవహార శైలి వివాదాస్పదమే. ప్రభుత్వ ఉద్యోగులు అన్నా, అధికారులన్నా చిన్నచూపే. ప్రతి దానికి అధికారులపై మండిపడటం, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం చేయడం, పరుష పదజాలంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం, బెదిరించడం ఆయన రాజకీయ జీవితంలో సర్వసాధారణమైపోయింది. అచ్చెన్నాయుడు వస్తే చాలు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక, ఫోన్‌ బెదిరింపులైతే చెప్పనక్కర్లేదు. తన అనుయాయులకు పనిచేయకపోగా, చెప్పినట్టుగా అధికారులు నడుచుకోకపోయినా ఫోన్‌ చేసి తిట్టడం, దూషణలకు దిగడం అచ్చెన్నకు పరిపాటిగా మారిపోయింది.

ఉద్యోగులపై నిత్యం జులుం
టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శించారు. ఎవరైనా జీ హుజూర్‌ అన్నట్టుగానే ఉండాలి. లేదంటే వారందరికీ శంకర గిరి మాన్యాలు పట్టిస్తానంటూ బెదిరింపులు చేసేవారు. చేయి చూపించి వార్నింగ్‌లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. టీడీపీ ఓడిపోయాక కూడా ఆయన మదం తగ్గలేదు. నోటికొచ్చినట్టు దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులనే కాకుండా పోలీసు అధికారులను బెదిరించారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లను చూసుకుని మిగతా టీడీపీ నాయకులు కూడా ఉద్యోగులపైన, అధికారులపైన విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.

బేరీజు వేసుకుంటున్న ఉద్యోగులు 
ఇటు కింజరాపు అచ్చెన్నాయుడు, అటు కూన రవికుమార్‌ వ్యవహార శైలిపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికారులకు గానీ, ఉద్యోగులకు గానీ గౌరవం లేకుండా పోయిందని, అదే సంస్కృతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొనసాగించారని ప్రభుత్వ ఉద్యోగులు విశ్లేíÙంచుకుంటున్నారు.  అధికారులపైన, ఉద్యోగులపైన జులుం ప్రదర్శించడంతో పాటు దూషణలు, బెదిరింపులకు దిగే టీడీపీ నాయకులెక్కడ, ఉద్యోగులను గౌరవించే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ పాలకులెక్కడ అని బేరీజు వేసుకుంటున్నారు. ఎవరి హయాంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకున్నామన్నదానిపై ఎన్నికల నేపథ్యంలో తేడాలు గమనించుకుంటున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసుకునే తరుణంలో ఎవరు బెస్ట్‌ అనే దానిపై పోల్చి చూసుకుంటున్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement