పోర్టుకు షిప్పులొస్తాయి.. ఉద్యోగాలు రావు | Minister Atchannaidu in Santhabommali: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పోర్టుకు షిప్పులొస్తాయి.. ఉద్యోగాలు రావు

Apr 1 2025 4:48 AM | Updated on Apr 1 2025 4:48 AM

Minister Atchannaidu in Santhabommali: Andhra Pradesh

నేను చెప్పింది చేయాలి

అలా అయితేనే.. గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా

సంతబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులు

సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు షిప్పులొస్తాయి గానీ.. ఉద్యోగాలు రావని మంత్రి అచ్చె­న్నా­యుడు వ్యాఖ్యానించారు. సంతబొమ్మాళి ప్రజలు తాను చెప్పింది చేయాలన్నారు. అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తానని బెదిరించారు.

సోమవారం సంతబొమ్మాళి సూర్యనారాయ­ణ­స్వామి ఆలయ నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తీసుకు­రావడానికి కృషి చేస్తున్నామన్నారు. మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. వేట నిషేధ పరిహా­రాన్ని ఈనెల 15న మత్స్యకారుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement