santhabommali
-
సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రేపు(బుధవారం) సీఎం జిల్లాకు రానున్నారు. ● బుధవారం ఉదయం 8 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. ● ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ● 9:30 గంటలకు విశాఖపట్టణంలో బయల్దేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు. ● 10.20 గంటలకు హెలీప్యాడ్ వద్ద నాయకులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ● 10.25 గంటలకు హెలీప్యాడ్ నుంచి పోర్టు శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణకు బయల్దేరుతారు. ● 10:30 నుంచి 10:47 వరకు పోర్టు శంకుస్థాపన, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● 11 గంటలకు మళ్లీ హెలీకాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు నౌపడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ● 11.10 నుంచి 11.20 వరకు హెలీప్యాడ్ వద్ద నాయకులంతా సీఎంకు స్వాగతం పలుకుతారు. ●11.25 గంటల నుంచి 11.35 వరకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ● 11.45 నుంచి 12 గంటల వరకు సభా వేదికపై ఇతర నాయకులు ప్రసంగిస్తారు. ● మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సభా వేదికపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం చేస్తారు. ● 12.35 గంటలకు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ● 12.40 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ● 12.45 నుంచి 1.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. ● మధ్యాహ్నం 1.10 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖపట్టణం నుంచి గన్నవరం చేరుకుంటారు. ● మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ -
పది రోజుల్లో పెళ్లి.. మెసేజ్‌లు, వాయిస్ రికార్డులు చూపించి..
సంతబొమ్మాళి (శ్రీకాకుళం): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. ఆర్మీ జవాన్ ఇంటి ముందు బైఠాయించింది. ఈమెకు గ్రామస్తులంతా మద్దతు పలకడంతో సదరు వ్యక్తి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సంతబొమ్మా ళి మండలం యామలపేటకు చెందిన మురాల తులసీరావు, పార్వతిల కుమార్తె మీనాకు గాజువాకకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం కావాల్సి ఉంది. పది రోజుల క్రితం కుమార్తె తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇవ్వడానికి గాజువాక వెళ్లగా వరుడు పెళ్లికి నిరాకరించడంతో నిర్ఘాంతపోయారు. ఎందుకని ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పరపటి జగదీష్.. మీనాతో అతనికి ఉన్న స్నేహాన్ని తనకు చెప్పాడని, సెల్‌ఫోన్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డులను చూపించాడని అన్నాడు. అందుకనే తనకు ఈ సంబంధం వద్దని తెగేసి చెప్పాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆర్మీ జవాన్ జగదీష్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలతో పంచాయతీ పెట్టారు. మీనాను పెళ్లి చేసుకోవాలని జగదీష్‌ను కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో గురువారం జగదీష్ ఇంటిముందు నిరసన చేపట్టారు. దీంతో యువకుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న నౌపడ ఏఎస్ఐ నర్సింగరావు సిబ్బందితో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. మీనా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) -
‘పచ్చ’కుట్రపై పెదవి విప్పవేం బాబూ!
సాక్షి, అమరావతి: విగ్రహ రాజకీయాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గుడిలో నందీశ్వరుడి విగ్రహన్ని రోడ్డుపైకి తెచ్చి న ఘటన వెనుక టీడీపీ హస్తముందని తేలిందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు నోరువిప్పడం లేదని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంతబొమ్మాళిలో గుడిలో ఉన్న నందీశ్వరుడిని రోడ్డుపైన దిమ్మమీదకు తెచ్చిన ఉదంతం సీసీ కెమెరాలో రికార్డయిందని, అందులో ఉన్నవాళ్లంతా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మనుషులేనని చెప్పారు. ఈ ఘటనలో ఓ ఎల్లో మీడియా పాత్రికేయుడూ ఉండటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నుంచి వీళ్లకు ఆదేశాలు వెళ్లాయని అర్థమవుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి 22 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. నిత్యావరసర వస్తువులను ప్రతి పేదవాడి ఇంటికే చేరవేసే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చేయించడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. -
అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/విశాఖపట్నం: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో మత విద్వేషాలు సృష్టించేందుకు యత్నించిన టీడీపీ నాయకులు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్కడి పాలేశ్వరస్వామి ఆలయంలో శిథిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు జీర్ణావస్థకు చేరిన పాత నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా పాలేశ్వరస్వామి జంక్షన్ వద్ద గల సిమెంట్ దిమ్మెపై ఈ నెల 14న గుట్టుచప్పుడు కాకుండా ప్రతిష్ఠించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ఇక్కడ దిమ్మె నిర్మించగా.. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బ్యాచ్ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పింది. ఆ తరువాత పాలేశ్వరం జంక్షన్లో ఉన్న నంది విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం జరగబోతోందంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని భావించింది. ఆలయం నుంచి పాత నంది విగ్రహాన్ని తరలించడం.. దానిని పాలేశ్వరస్వామి జంక్షన్‌లోని దిమ్మెపై ఏర్పాటు చేయడం తదితర దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవడంతో టీడీపీ నాయకుల ప్లాన్ బెడిసికొట్టింది. ఈ కుట్రలో అచ్చెన్నాయుడు అనుచరులతో పాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే టెక్కలి ఈనాడు విలేకరి వట్టికూళ్ల కీర్తికుమార్ కూడా ఉన్నారు. 22 మందిపై కేసు నమోదు : డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి జంక్షన్లో శిథిలమైన నంది విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు ఉందని విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు తెలిపారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ గ్రామ వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే ఒక రాజకీయ పార్టీకి చెందిన నలుగురు, ఇద్దరు ఆలయ కమిటీ సభ్యులు సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. రామతీర్థం ఘటనలో నిందితుల్ని పట్టుకునేందుకు 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించా. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ గ్రామంలో పురాతనమైన, శిథిలమైన విగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాన్నారు. ఆలయాలపై ప్రత్యేక నిఘా విశాఖ రేంజి పరిధిలో 7,700 ఆలయాల్లో సెక్యూరిటీ గార్డులను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని డీఐజీ చెప్పారు. ఇప్పటికే 3 వేల ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను నియమించామని, మరో 1500 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
కెమెరా కంటికి చిక్కిన టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి, శ్రీకాకుళం: రాజకీయ ఉనికి కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోందన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలిగిస్తూ అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ తమ్ముళ్లు. తొలగించిన విగ్రహాన్ని సమీపంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న సిమెంట్ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వారి బండారం బయటపడింది. ఈనెల 14న సంతబొమ్మాళిలోని అతి పురాతన పాళేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారడంతో గ్రామస్తుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా విషయం వెలుగు చూసింది. ఈ విషయంపై విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు మాట్లాడుతూ.. సంతబొమ్మాళి మండలం పాళేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ తరలింపు చట్ట విరుద్ధమని, విగ్రహం తరలింపు వెనుక దురుద్దేశం కనిపించిందని పేర్కొన్నారు. ముందురోజు పోలీసులు వివరాలు అడిగినా చెప్పని ఆలయ వర్గాలు.. గుట్టుగా రోడ్డు మధ్యలో విగ్రహాన్ని పెట్టాలని యత్నించారని తెలిపారు. ఈ కేసులో వీఆర్వో 22 మంది పై ఫిర్యాదు చేయగా, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పేర్కొన్నారు. వీరిలో ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు నలుగురు ఉన్నారని ఆయన తెలిపారు. -
సంతబొమ్మాళిలో టీడీపీకి ఎదురు దెబ్బ
నరసన్నపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మబగాం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కృష్ణదాస్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సంతబొమ్మాళి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాంప్రసాద్, మర్రిపాడు, వడ్డివాడ నీటి సంఘం అధ్యక్షుడు బుడ్డ భీమారావు, బూడాన వసంతరావు, మాజీ ఎంపీటీసీలు బుచ్చల సావిత్రమ్మలతోపాటు అట్టాడ జగన్నాథరావు, సోమేశ్వరరావు, సోమ భారతి, కృష్ణవేణి, తదితరులు, నౌపడ నుంచి పారిశ్రామికవేత్తలు చెన్నూరు గౌరీప్రసాద్, రామపాత్రుని నారాయణరావులతోపాటు వందలాది మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ దేశంలోనే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. 80 శాతం మంది రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఆకర్షితులై పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, ఆయా గ్రామాల్లో తమ కార్యకర్తలతో కలసి పనిచేయాలని సూచించారు. -
టీడీపీ నేత దా‘రుణం’
సాక్షి, సంతబొమ్మాళి: అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు అవినీతిలో తమ నైజాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించి అందినంత దోచుకున్నారు. అధికారం తమ చేతుల్లో ఉంది... అడిగేవారెవరన్నట్టు బరితెగించి స్వాహా చేశారు. ఆనాటి అన్యాయాలు ఇప్పటికీ ప్రజలను పీడించుకు తింటున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త, జన్మభూమి కమిటీ సభ్యుడైన ఓ టీడీపీ నేత మరొకరి పేరిట బీసీ కార్పొరేషన్ రుణాన్ని తీసుకొని అనుభవించిన వైనం బయట పడింది. వివరాల్లోకి వెళితే... సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన గిన్ని కోటేష్ అనే నిరుద్యోగి ఈ నెల 12న బీసీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేయడానికి మీ–సేవా కేంద్రానికి వెళ్లాడు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రయత్నించగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయలు మంజూరైనట్లు చూపడంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని తన తండ్రి నూకరాజుకు చెప్పగా... ‘నీవు విదేశాల్లో ఉన్న సమయంలో టీడీపీ నేతకు చెందిన బంధువు ఒకరు వచ్చి నీ కుమారుడి పేరున బీసీ కార్పొరేషన్ రుణం మంజూరు చేయిస్తానని 7 వేల రూపాయల నగదు, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకున్నారని, ఇంత వరకు రుణానికి సంబంధించిన నగదు ఇవ్వలేద’ని తండ్రి నూకరాజు చెప్పారు. దీంతో కోటేష్ సదరు టీడీపీ నేతను బీసీ కార్పొరేషన్ రుణం కోసం అడుగగా.. కొంత సమయం కావాలని చెప్పి వాయిదాలు వేయడంతో బాధితుడు విసుగుచెందాడు. దీంతో నేరుగా కోటబొమ్మాళి కో ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజర్‌తో జరిగిన విషయాన్ని కోటేష్ వివరించాడు. దానికి సంబంధించిన ఫైలు తెప్పించి పరిశీలించగా, 2018 డిసెంబర్ 4న బీసీ కార్పొరేషన్ రుణం కింద లక్ష రూపాయల రుణంలో 50 వేల రూపాయల సబ్సిడీ ఉందని.. రుణం ఖాతా నంబరు 010453680000970 అని తెలిపా రు. ‘ఫైలు, చెక్కు పై నీ సంతకాలు ఉన్నాయ’ని బ్యాంకు మేనేజర్ చెప్పగా ఆ సమయంలో తాను సౌతాఫ్రికాలో (విదేశం) పని చేస్తున్నానని, తన సంతకాలు ఫోర్జరీ చేసి రుణం మొత్తం కాజేశారని కోటేష్ సమాధా నం ఇచ్చాడు. బ్యాంకు రుణం పుస్తకాలు సైతం తన వద్ద లేవని ఎవరి వద్ద ఉన్నాయో అంతు చిక్కడం లేదని బదులిచ్చాడు. ఇదిలా ఉంటే ఈ విషయం బయటకు చెబితే మరోలా ఉంటుందని సదరు టీడీపీ నేత బెదిరించడం కొసమెరుపు. ‘సాక్షి’ ఆనాడే చెప్పింది... సంతబొమ్మాళి మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ పత్రికలో గతంలో కథనాలు వచ్చాయి. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో అధికారులు సైతం నోరుమెదపలేని పరిస్థితి చోటు చేసుకుంది. సదరు టీడీపీ నేత బీసీ కార్పొరేషన్ రుణాలను భారీగా దోచుకున్నారని సొంత పార్టీ నేతలే అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో అడ్డుకట్ట వేయకపోవడంతో అవినీతికి అంతు లేకుండా పోయింది. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయట పడతాయని స్థానికులు అంటున్నారు. విదేశాల్లో ఉంటే రుణం ఎలా ఇచ్చారు? నేను సౌతాఫ్రికాలో 2018 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి 2 వరకు ఆరు నెలల పాటు పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు అధికారులు రుణం ఏ విధంగా మంజూరు చేసి ఇచ్చారో వారే సమాధానం చెప్పాలి. ఫైలు, చెక్కులపై నా సంతకాలు ఫోర్జరీ చేసి దోచుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. –గిన్ని కోటేష్, బాధితుడు, నౌపడ, సంతబొమ్మాళి మండలం బాధ్యులపై చర్యలు తప్పవు ఈ విషయం నా దృష్టికి ఇంతవరకు రాలేదు. సోమవారం డీసీసీబీ బ్యాంకుకు సిబ్బందిని పంపి వివరాలు సేకరించి విచారణ చేపడతాం. తప్పని తేలితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు. –రాజారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ, శ్రీకాకుళం -
మండల పరిషత్‌లో టీడీపీ నేతల మకాం
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): వారంతా మాజీలుగా మారిపోయినా అధికార మత్తులోనే జోగుతున్నారు. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మకాం వేసి తమ సొంతానికి వినియోగిస్తున్నారు. సభలు, సమావేశాలు అక్కడే నిర్వహిస్తూ అటు ప్రజలను ఇటు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరికి కొంతమంది అధికారులు సైతం రాచ మర్యాదలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో కొంతకాలంగా సాగుతున్న తంతు ఇది. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఒక వైపు వలంటీర్ల ఇంటర్వ్యూలు, మరో వైపు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండల ప్రత్యేకాధికారి గదిలో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. వీరికి సరిపడా కుర్చీలు సైతం వేయించి మండల అధికారులు సకల మర్యాదలు చేశారు. మండల ప్రత్యేకాధికారి కుర్చీలో మాజీ జెడ్పీటీసీ భర్త ఎల్ఎల్ నాయుడు అశీనుడయ్యారు. తనకి ఇరువైపులా మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తి, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ భీమారావు, పార్టీ మండలాధ్యక్షుడు జీరు భీమారావు తదితరులు కూర్చొన్నారు. మాజీలైన వీరందరికీ అధికార మత్తు ఇంకా వదలలేదని, కార్యాలయాల్లో కూర్చుని ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజూ కార్యాలయంలో ఓ టీడీపీ నేత కూర్చోని తమ పనులను చక్కబెడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మండల పరిషత్ అధికారులు కూడా టీడీపీ నేతలకు ఎర్ర తివాచీ పరచడంతో వారు ఆడిందే ఆటగా... పాడిందే పాటగా సాగుతోంది. ఈ విషయమై మండల ప్రత్యేకాధికారి వీవీ కృష్ణమూర్తి వివరణ కోరగా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించినట్లు తనకు తెలియదని, ఇక నుంచి తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతానన్నారు. -
బడి ముందు గుడి నిర్మాణం
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): మండలంలోని ఆర్‌హెచ్ పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ముందు గుడి నిర్మాణం చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్మాణం వల్ల విద్యార్థులకు ఆటస్థలం కొరత ఏర్పడింది. తరగతి గదుల్లోకి గాలి వెలుతురు రాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. గుడి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, గ్రామంలో ఖాళీ స్థలాలు చాలా చోట్ల ఉన్నా.. పాఠశాల ముందు నిర్మాణం చేయడంతో అంతర్యమేంటో అర్థం కావడం లేదని చెబుతున్నారు. ఈ నిర్మాణాలపై ఎంఈఓ, డీఈఓకి ఫిర్యాదు చేసినా నిర్మాణదారులు పట్టించు కోవడం లేదని మాజీ సర్పంచ్ ఎన్ని మన్మథరావు వాపోతున్నారు. పాఠశాల స్థలంలో అక్రమనిర్మాణం చేపట్టవద్దని వీఆర్వో చిరంజీవి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వీఆర్వో సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధులకు అటంకం కలిగించి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామానికి చెందిన బాడాన నాగభూషణరావు, ఎన్ని ఢిల్లీశ్వర్రావు, ఎన్ని పోలినాయుడు, ఎన్ని రాము, ఎన్ని గౌరునాయుడుపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఐ కామేశ్వర్రావు ఆదివారం తెలిపారు. -
ఫీడర్ బేకర్‌లో తాచుపాము
సంతబొమ్మాళి: నౌపడ విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని నౌపడ రూరల్ ఫీడర్ బేకర్‌లో తాచుపాము కలకలం రేపింది. రీడింగ్ తీసుకునేందుకు వెళ్లిన షిఫ్ట్ ఆపరేటర్ గోవిందరావు సాయంత్రం 5 గంటలకు స్పీడర్ బ్రేకర్ వద్దకు వెళ్లారు. తలుపు తీయగానే బ్రేకర్‌కు తాచుపాము చుట్టి ఉండడంతో కంగారుపడి వెంటనే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత గోవిందరావు రాయితో కొట్టడంతో తాచుపాము కిందికి దిగడంతో పక్కనే ఉన్న కర్రతో దానిని కొట్టి చంపేశాడు. సుమారు ఆరడుగులు ఉందని, గతంలో కూడా నాగుపాము, కొండచిలువలు ఇలాగే కనిపించాయని సిబ్బంది తెలిపారు. -
డెంగీతో ఇంటర్ విద్యార్థిని మృతి
సంతబొమ్మాళి : భావనపాడుకు చెందిన బయ్యూ జానకి(17) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని డెంగీ వ్యాధితో మంగళవారం రాత్రి మృతి చెందింది. జానకి నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ గ్రూపులో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. జానకికి ఆరు రోజుల కిందట జ్వరం రావడంతో పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్టు తల్లిదండ్రులు బయ్యూ సన్యాసిరావు, ఆదిలక్ష్మి తెలిపారు. నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో అక్కడ నుంచి పలాసలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడ వైద్యం పొందుతూనే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జానకి మృతి చెందింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన గొరకల అప్పలనర్సమ్మ, ఎర్రన్న, బై.గురువులు, గొరకల అచ్చెమ్మ తదితరులు పలు వ్యాధులతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు తెలిపారు. మిత్రమా వెళ్లిపోయావా... తమతో కలిసి చదివిన జానకి ఇప్పుడు తమతో లేకపోవడంతో తోటి విద్యార్థులు, స్నేహితులు కన్నీరు పెట్టారు. చదువులో చురుకుదనంగా అందరితో కలివిడిగా స్నేహంతో మెలిగే జానకి తమను వదిలి వెళ్లిపోయిందంటూ తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యూరు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన విద్యార్థిని మృతి చెందడంతో మత్స్యకారులందరూ ఆ రోజుకు వేటకు వెళ్లకుండా తమ సంతాపాన్ని తెలియజేశారు. మృతిపై అధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కడలి కల్లోలం
సంతబొమ్మాళి, మందస:ఎం.సున్నాపల్లి.. తీరంలో లంగరేసిన ఐదు బోట్లను రాకాసి అలలు లాక్కుపోయి ముక్కలు చెక్కలు చేశాయి. వాటిలో ఉన్న వలలను సైతం ఖండఖండాలు చేశాయి. లక్షల రూపాయల నష్టం మిగిల్చింది.గెడ్డవూరు.. ఎగసిపడిన అలల తాకిడికి తీరంలో లంగరేసిన బోట్లకు కట్టిన ఇనుప గొలుసులు తెగిపోయాయి. బోట్లు సముద్రంలో కొట్టుకుపోయాయి. వాటిని తెచ్చేందుకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రయాణిస్తున్న తెప్ప తిరిగబడి నీళ్లలో పడిపోయారు. తీరంలో ఉన్న సహచర మత్స్యకారులు గమనించి వారిని రక్షించి తీరానికి తీసుకొచ్చారు.బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అల్లకల్లోలంగా మారిన సముద్రం జిల్లాలోని రెండు గ్రామాల గంగపుత్రుల జీవితాల్లో విషాదం నింపింది. తననే నమ్ముకున్న వారిని కష్టాల్లోకి నెట్టింది. అప్పు చేసి కొన్నవి సముద్రార్పణం సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామ తీరంలో మత్స్యకారులు అల్పపీడనం హెచ్చరికలతో వేటకు వెళ్లకుండా పది బోట్లను లంగరు వేశారు. బుధవారం ఉదయం ఈదురుగాలులకు తోడు సముద్రపు అలలు ఉద్ధృతంగా ఎగసిపడటంతో ఐదు బోట్లు, వాటిలో ఉన్న వలలు కొట్టుకుపోయాయి. కొమర కృష్ణారావు, బుడగట్ల అప్పలస్వామిలకు చెందిన రెండు బోట్లు ముక్కల ముక్కలై పాతమేఘవరం తీరానికి చేరాయి. వలలు కూడా తెగిపోయాయి. గొండుపల్లి కనకరాజు, అర్జాల రాజారావు, ఎస్.అప్పయ్యలకు చెందిన బోట్లు, వలలు ఆచూకీ లేకుండా పోయాయి. ఒక్కో బోటు, వల విలువ రూ.13 లక్షలు ఉంటుందని, మొత్తం రూ.65 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు విలపిస్తూ చెప్పారు. ఏడాది క్రితమే అప్పులు చేసి బోట్లు కొన్నామని, ఆ అప్పు తీరకుండానే బోట్లు ధ్వంసమయ్యాయని ఆందోళనగా చెప్పారు. సముద్రంలో లంగరు వేసి ఉన్న ఐదు బోట్లు కూడా ఏ క్షణాన కొట్టుకుపోతాయోనని భయపడుతున్నారు. వీటిని తీరానికి తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినా అలల ఉద్ధృతి కారణంగా సాధ్యపడలేదని చెప్పారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే బోట్లను రక్షించుకోలేకపోయామని వాపోయారు. పట్టించుకోని మెరైన్ పోలీసులు భావనపాడు మెరైన్ పోలీసులకు సమాచారమిస్తే తమ బోట్లే మరమ్మతులకు గురయ్యాయని చేతులెత్తేశారని, విశాఖపట్నం మెరైన్‌కు ఫోన్ చేస్తే అంత దూరం రాలేమన్నారని స్థానిక సర్పంచ్ ప్రకాశరావు ఆరోపించారు. ఈ తీరంలో జెట్టీ లేకపోవడం వల్ల విపత్తుల సమయంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సమాచారం తెలిసిన వెంటనే తహశీల్దార్ బి.రామారావు, ఎఫ్‌డీవో రామచంద్రరావు తీరప్రాంతాన్ని సందర్శించి నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. బోట్లను రక్షించడానికి వెళ్లి.. కాగా మందస మండలం గెడ్డవూరు తీరంలో కొట్టుకుపోయిన రెండు బోట్లను రక్షించడానికి వెళ్లిన నలుగురు మత్స్యకారులు నీళ్లపడి సహచరుల సాయంతో బతుకుజీవుడా అంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన వంక ధర్మరాజు, కొమర వెంకటరావులకు చెందిన మూడు బోట్లలో మంగళవారం గ్రామానికి చెందిన కొంత మంది మత్స్యకారులు చేపల వేట అనంతరం బోట్లకు లంగరు వేసి వెళ్లిపోయారు. అయితే అల్పపీడన ప్రభావంతో రాత్రి వేల అలల ఉద్ధృతి పెరిగింది. బుధవారం ఉదయం రెండు బోట్లకు కట్టిన గొలుసులు తెగిపోయి అవి సముద్రంలోకి కొట్టుకుపోయాయి. మిగిలిన మూడో బోటును తీసుకొచ్చేందుకు వంక ధర్మరాజు, పిచ్చుక మోహనరావు, వంక వీరాస్వామి, కొమర వెంకటరావులు తెప్పపై సముద్రంలోకి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక అది బోల్తాపడటంతో వారంతా సముద్రంలో పడిపోయారు. తీరంలో ఉన్న తోటి మత్స్యకారులు గమనించి వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకొచ్చారు. రెండుబోట్లు పూర్తిగా పాడైపోయి, వలలు సముద్రంలో కొట్టుకుపోయాయని బాధితులు చెప్పారు. సుమారు రూ.5 లక్షల నష్టం జరిగిందని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దారు వి.శివబ్రహ్మానందం, ఎంపీపీ కొర్ల కవితాకన్నారావులు గ్రామానికి వెళ్లి పాడైన బోట్లను పరిశీలించారు. -
సౌదీలో జిల్లా యువకుడి మృతి
సంతబొమ్మాళి : పొట్ట కూటికి సౌది అరేబియా వెళ్లిన యువకుడు విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే... మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన మోడి కామరాజు, కేశవమ్మ ప్రథమ పుత్రుడు మోడి మహేష్(25) అనే యువకుడు ఆరు నెలల క్రితం సౌది అరేబియాలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేసేందుకు వెళ్లాడు. ఆదివారం(గత నెల 30న) డ్యూటీలో ఉండగా పక్కనే ఉన్న సిమెంట్ గోడకూలి మీద పడింది. సిమెంట్ ఇటుకలు తల, కాలుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త మంగళవారం తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. మృతి వార్తను మం త్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని, మరికొద్ది రోజుల్లో మహేష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మోడి రామచంద్రరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎంపీపీ కర్రి కృష్ణవేణి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు కర్రి విష్ణుమూర్తి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
భార్య ఉండగానే మరో రెండు వివాహాలు
సంతబొమ్మాళి: భార్య, ముగ్గురు పిల్లలు ఉండగానే మరో ఇద్దరు యువతులను రహస్యంగా వివాహాలు చేసుకుని దర్జా వలగ బోస్తున్నాడో ప్రబుద్ధుడు. సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేట (పలికిలివానిపేట) గ్రామానికి చెందినన అతడి పేరు పలికిలి కర్రెన్న. అతడి మొదటి భార్య భగవతమ్మ శనివారం విలేకరులకు భర్త నిర్వా కాన్ని వివరించింది. టెక్కలి మండలం భగీరథపేటకు చెందిన పిన్నింటి రాజారావు కుమార్తె భగవతమ్మకు సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేటకు చెందిన కర్రెన్నతో 1994లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రూ.40 నగదు, తులంన్నర బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు. ఈ దంపతులకు 1996లో రాణి అనే ఆడ బిడ్డ పుట్టింది. అప్పటి నుంచి కర్రెన్న భార్య భగవతమ్మకు శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దీంతో ఆమె 1999లో భగీరథపేటలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. భార్యకు తెలియకుండా 2002లో బెంగళూరు వలస వెళ్లి మూడేళ్లు అక్కడే ఉన్న కర్రెన్న అక్కడ వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి 2005లో స్వగ్రామమైన పెద్దకేశనాయుడుపేట వ చ్చాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య భగవతమ్మ భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంలో ఒక అంగీకారానికి వచ్చిన కర్రెన్న ఇరువురితో కాపురం చేస్తానని అంగీకరించాడు. ఎనిమిది నెలలు గడచిన తర్వాత బెంగళూరు నుంచి రెండో భార్య తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెను తీసుకు వెళ్లిపోయారు. దీంతో అతడి కాపురం మొదటి భార్యతో కొంతకాలం సాఫీగా సాగింది. ఆ దంపతులకు 2007లో మోహిని అనే కుమార్తె, 2010లో మణి అనే కుమారుడు పుట్టారు. ఆ తర్వాత తరచూ కర్రెన్న భార్యను కొట్టేవాడు. పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపేవారు. ఇలా పలుమార్లు జరగడంతో పుట్టింటి వద్దే పిల్లలతో భగవతమ్మ ఉండిపోయింది. దీంతో కర్రెన్న ఈ ఏడాది మేలో తిప్పానబొడ్డపాడుకు చెందిన నీలాపు జ్యోతిని రహస్యంగా వివాహం చేసుకుని వేరొక చోట కాపురం పెట్టాడు. ఇటీవల మూడో భార్య జ్యోతిని స్వగ్రామం పెద్దకేశనాయుడుపేటకు తీసుకు రావడంతో మొదటి భార్య భగవతమ్మ ఇదేం పద్ధతని భర్తను నిలదీసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె నౌపడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు జూన్‌లో సిద్ధపడింది. పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇంత వరకు న్యాయం జరగకపోవడంతో శనివారం నౌపడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని తన భర్తపైన, అత్తపైన,మూడో వివాహానికి సహకరించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయండి సారూ... నౌపడ పోలీస్‌స్టేషన్ పరిశీలనకు వచ్చిన ఎస్పీ ఎ.కె.ఖాన్‌కు న్యాయం చేయాలని బాధితురాలు భగవతమ్మ వేడుకుంది. వెంటనే ఎస్పీ స్పందించి భారాభర్తలను రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని ఎస్సైకు సూచించారు.