సంతబొమ్మాళి: నౌపడ విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని నౌపడ రూరల్ ఫీడర్ బేకర్‌లో తాచుపాము కలకలం రేపింది. రీడింగ్ తీసుకునేందుకు వెళ్లిన షిఫ్ట్ ఆపరేటర్ గోవిందరావు సాయంత్రం 5 గంటలకు స్పీడర్ బ్రేకర్ వద్దకు వెళ్లారు. తలుపు తీయగానే బ్రేకర్‌కు తాచుపాము చుట్టి ఉండడంతో కంగారుపడి వెంటనే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత గోవిందరావు రాయితో కొట్టడంతో తాచుపాము కిందికి దిగడంతో పక్కనే ఉన్న కర్రతో దానిని కొట్టి చంపేశాడు. సుమారు ఆరడుగులు ఉందని, గతంలో కూడా నాగుపాము, కొండచిలువలు ఇలాగే కనిపించాయని సిబ్బంది తెలిపారు.
ఫీడర్ బేకర్‌లో తాచుపాము
Published Tue, May 8 2018 7:25 AM | Last Updated on Tue, May 8 2018 7:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment