సాక్షి, అమరావతి: విగ్రహ రాజకీయాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గుడిలో నందీశ్వరుడి విగ్రహన్ని రోడ్డుపైకి తెచ్చి న ఘటన వెనుక టీడీపీ హస్తముందని తేలిందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు నోరువిప్పడం లేదని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంతబొమ్మాళిలో గుడిలో ఉన్న నందీశ్వరుడిని రోడ్డుపైన దిమ్మమీదకు తెచ్చిన ఉదంతం సీసీ కెమెరాలో రికార్డయిందని, అందులో ఉన్నవాళ్లంతా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మనుషులేనని చెప్పారు.
ఈ ఘటనలో ఓ ఎల్లో మీడియా పాత్రికేయుడూ ఉండటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నుంచి వీళ్లకు ఆదేశాలు వెళ్లాయని అర్థమవుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి 22 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. నిత్యావరసర వస్తువులను ప్రతి పేదవాడి ఇంటికే చేరవేసే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చేయించడం చంద్రబాబుకు అలవాటైందన్నారు.
‘పచ్చ’కుట్రపై పెదవి విప్పవేం బాబూ!
Published Thu, Jan 21 2021 5:05 AM | Last Updated on Thu, Jan 21 2021 6:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment