appalaraju
-
17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్
-
హోం మంత్రి కాదు మైకుల మంత్రి: సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్ఆర్డర్ కంట్రోల్లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారు.చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు -
చంద్రబాబు సీఎంగా వేస్ట్..
-
ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. .. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది... పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం? -
మీకు ఓట్లు వేసిన వారికే విత్తనాలు ఇస్తారా..?
-
సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ
-
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు
-
ఉద్దానం కిడ్నీ రోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి
-
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్
-
కింజరాపు అచ్చెన్నాయుడుని ఏకిపారేసిన మంత్రి
-
మనసున్న ప్రభుత్వం మనది
సాక్షి, విశాఖపట్నం: మనసున్న ప్రభుత్వం మనదని, బాధితులను తక్షణమే ఆదుకునే స్వభావం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నెల 19 అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 49 బోట్ల యజమానులకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 కోట్ల 11 లక్షల 76 వేల నష్ట పరిహారాన్ని గురువారం జిల్లా పరిషత్ హాల్లో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే నష్టంలో 80 శాతం సొమ్మును పరిహారంగా అందజేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ప్రమాదంలో కాలిపోయిన బోట్లలో పనిచేస్తున్న సుమారు 400 కలాసీ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిపారు. బాధిత మత్స్యకారుల్లో సీఎం జగన్ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారని, ఇలాంటి నేత దేశంలోనే లేరని ప్రశంసించారు. రూ.80 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అయ్యే లాంగ్‌లైనర్(పెద్ద) బోటు కొనుగోలుకు ఇప్పుడున్న 60 శాతం సబ్సిడీని 75కి పెంచుతూ త్వరలో జీవో జారీ చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు ఈ పరిహారం సొమ్మును లాంగ్‌లైనర్ బోట్ల పెట్టుబడి సొమ్ముగా వినియోగించాలని సూచించారు. ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమన్నారు. గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపానులకు దెబ్బతిన్న బోట్లకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, దీంతో ఆయన హామీలన్నీ నీటిమీద రాతలేనన్న భావనలో మత్స్యకారులున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పాత డీజిల్ సబ్సిడీ బకాయి సుమారు రూ.5.50 కోట్లను రెండు వారాల్లో చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోరిక మేరకు బయో డీగ్రేడబుల్ ఆయిల్‌కు కూడా సబ్సిడీ ఇస్తామని, సంబంధిత బంకుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సీఎం జగన్ చలించిపోయారు: వైవీ సుబ్బారెడ్డి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై సీఎం జగన్ చలించిపోయారని, దగ్ధమైన బోట్లకు బీమా ఉందా లేదా అన్నది చూడకుండా మత్స్యకారులు నిలదొక్కుకునేలా ఆదుకోవడం మన బాధ్యత అని, అందుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని చెప్పారని తెలిపారు. ఈ సాయంతో వారు కొత్త బోట్లు కొనుగోలుకు వీలవుతుందన్నారు. చిన్న బోట్లతో పాటు పెద్ద బోట్ల యజమానులు బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ తన దృష్టికి తెచ్చారని, ఆ మేరకు తాను కృషి చేస్తానని, బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గత తుపాన్లకు దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.6 లక్షలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని, వారికీ న్యాయం జరిగేలా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2019 మే నుంచి సెప్టెంబర్ వరకు డీజిల్ సబ్సిడీ చెల్లించేలా చూస్తామని చెప్పారు. ఇంతలా స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరు..: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బాధిత మత్స్యకారులు ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఇంతలా పెద్ద మనసుతో స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న 34 బోట్లకు పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు చుట్టూ తాను ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజు, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిలు బోట్ల యజమానులకు చెక్కులను అందజేశారు. సభలో మత్స్యకారులు జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచందర్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
రామోజీ నీకు రోజులు దగ్గరపడ్డాయి: సీదిరి అప్పలరాజు
-
చంద్రబాబుకి అసలు సర్జరీ ఎలా చేశారు?
సాక్షి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వైద్య నివేదికలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అంత తీవ్రమైన రోగాలు ఉంటే.. ఏ వైద్యపరీక్షలు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? అనేది నమ్మబుద్ధి కావడంలేదు. ఈ దశలో నిజంగానే ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? జైలుకు పోకుండా ఉండడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక రాజకీయ నేత మాత్రమే కాదు.. ఒక వైద్యుడు కూడా. చంద్రబాబు వైద్య నివేదిక విషయంలో ఒక వైద్యుడిగా ఆయన తన అనుమానాల్ని బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు(73).. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్(ఛాతీలో బరువు.. నొప్పి), గిడ్డినెస్(తల తిప్పడం), నిద్రలేమి, ఇతరతత్రా ఇబ్బందికర పరిస్థితులతో పాటు తన శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధుల సమస్యలతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ రెండు ప్రధానమైన అంశాలను ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒకటి.. కరోనరీ ఆర్టరీ వ్యాధి(హృదయ సంబంధ వ్యాధులలో సర్వసాధారణమైంది), రెండోది..హైపర్ ట్రోపిక్ కార్డియోమియోపతి(హృదయ కండర పెరుగుదల వ్యాధి). హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి(గుండె కండర పెరుగుదల వ్యాధి)తో పాటు ఎల్వీ (Left Ventricular గుండెలో ఎడమ జఠరిక) గడ్డ కట్టింది. అలాగే.. డయాబెటిస్ ఉంది. చర్మ సంబంధిత వ్యాధి ఉంది. వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి. వ్యాయామాలు, శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా టూర్ షెడ్యూల్లో ఉండాలి.. వైద్య నివేదికలో రిఫర్ చేశారు. మరోవైపు కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉందని, విటిలిగో(బొల్లి)కి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఎరిట్రియా ప్రోన్ అంటే.. గుండె కొట్టుకోవడంలో హఠాత్తుగా వైవిధ్యమైన పరిస్థితులు చంద్రబాబులో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇటువంటి ఆరోగ్య పరిస్థితిల్లో ఉన్న వారికి సర్జరీ కోసం మత్తుమందు(ఆనస్తీషియా) ఇవ్వటం ప్రాణాంతకం. పైగా ఏ వైద్యుడు కూడా అంత సాహసానికి దిగడు. ఒకవేళ అలా మత్తు మందు ఇవ్వాలి అంటే గనుక.. ముందస్తు పరీక్షలన్నీ చేసుకున్నాకే నిర్ధారించుకుంటారు. కానీ.. చంద్రబాబు విషయంలో రెండో తేదీన అడ్మిట్ అయితే.. ఆ మరుసటి రోజే సర్జరీ చేసి డిశ్చార్జి కూడా చేశారు. ఏ వైద్యుడైనా సరే చంద్రబాబు హెల్త్ రిపోర్టులు చూపించాక.. సర్జరీ చేయడానికి కచ్చితంగా ఆలోచిస్తారు అనేది డాక్టర్ సీదిరి అప్పలరాజు చెబుతున్న మాట. చంద్రబాబు గుండె సైజు పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా బాబుకు కంటి ఆపరేషన్ చేయరు. బెయిల్ పొడగించుకోవడానికే ఈ మెడికల్ రిపోర్టు స్టోరీ అల్లుతున్నారు. అయినా బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు… pic.twitter.com/3AtDBI2rQl — YSR Congress Party (@YSRCParty) November 17, 2023 ఇక్కడ.. చంద్రబాబు కేసులో కంటి చూపు తగ్గిపోయింది అనే విషయానికి ఎవరూ అభ్యంతరం చేయరు. అయితే సీపీ కాల్షియం స్కోర్ 2019 రిపోర్టు ప్రకారం 916 ఉంది. ఇప్పుడు ఏకంగా 1,611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వైద్యులు అన్నారు. కాల్షియం ఇంతలా పెరిగితే.. ఏ కార్డియాలజిస్ట్ అయనా సరే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కచ్చితంగా చేస్తారు. పైగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్థరీస్ ఎలాగ ఉన్నాయో తెలుస్తవి. అలా తెలిసినప్పుడు ఆయనకి కచ్చితమైన చికిత్స అందిచడానికి అవకాశం ఉంటుంది. మరి.. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ముందస్తు పరీక్షలు చేయకుండా.. కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఏ వైద్యుడు ముందుకు వెళ్లడు కదా. కాబట్టి.. బెయిల్ పొడిగింపు కోసం ఇది వడ్డివారుస్తున్న కథ కూడా అనుకోవచ్చు అని మంత్రి సీదిరి అభిప్రాయపడుతున్నారు. సీదిరి మాట్లలోనే.. ‘‘చంద్రబాబుకు గుండె కండర పెరుగుదల వ్యాధి ఉందన్న విషయం మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్న టైంలోనే నాకు తెలుసు. గతంలో ఆయన ఓసారి ఉపవాస కార్యక్రమం చేపట్టినప్పుడు.. నిమ్స్ వైద్యులు ఆయన్నీ పరీక్షించారు. అప్పుడు నిమ్స్‌లో పని చేస్తున్న మా సీనియర్లు ఆ విషయం నాకు చెప్పారు. చంద్రబాబుకు ఇంతగా తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు.. కచ్చితంగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయాలి. ఇటువంటి జబ్బుల గురించి టెక్నికల్‌గా మాట్లాడితే.. మాయక్టిమి అంటారు. ఈ స్థితిలో.. గుండె ఎనలార్జ్ అయిన భాగాన్ని శుభ్రంగా తొలగిస్తారు. తద్వారా గుండె కొట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఇంకా చంద్రబాబుకు ఉన్న కరోనరీ ఆర్టరీ వ్యాధికి బైపాస్ తప్పనిసరి. ఇంకా ఏవేవో ఉన్నాయని రాసిచ్చారు. అయోగ్టిక్ స్టినోసిస్ ఉందన్నారు. డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు. నిజంగా అవన్నీ ఉంటే.. అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి. కచ్చితమైన పరీక్షలు.. కచ్చితమైన ట్రీట్మెంట్ ఏమీ అందించకుండానే ఆపరేషన్ చేస్తారా?.. ఒక ప్రెస్టేజ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారేమో. కనీసం ఉన్న సమస్యలకు మందులు వాడడమో.. ఆ మందుల గురించి ప్రిస్క్రిప్షన్లు ఏవీ లేవు. చదవండి: బోగస్ ఇన్వాయిస్లతో ‘స్కిల్’ నిధులు స్వాహా -
చంద్రముఖిగా మారిన పురందేశ్వరి: సీదిరి అప్పలరాజు
-
సామాజిక న్యాయానికి ప్రతీక సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్‌కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్‌ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. -
ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర
కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే సామాజిక సాధికారత సాధ్యమైందని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా వైఎస్ జగన్ పాలిస్తున్నారని.. అందుకే తమ పథకాలను చంద్రబాబు కూడా కాపీ కొట్టడానికి తయారైపోయారని వారు ఎద్దేవా చేశారు. పేదల పక్షాన నిల్చుని పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వీరు ప్రసంగించారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్ పదవుల్లో సీఎం జగన్ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు. అవినీతి మరక లేకుండా ‘సంక్షేమం’ : ధర్మాన అనంతరం.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిని గుర్తుచేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెడితే మూడు నాలుగు ప్రభుత్వాలు మారితే గానీ అది కార్యరూపం దాల్చేది కాదని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనుల్లో వేగం కనిపిస్తోందని.. పాలనలో ఆయన కొత్త ఒరవడి సృష్టించారని తెలిపారు. ఉద్యమాలు జరిగితేగానీ జరగని పనులు ప్రస్తుత ప్రభుత్వం సులభంగా చేస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాల కింద రూ.రెండు లక్షల ముప్పై వేల కోట్లను ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా జమచేశారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుకు ఇది మచ్చుతునక అని ధర్మాన అన్నారు. చంద్రబాబు కూడా ఈ సంక్షేమ పథకాలపై ఎలాంటి అవినీతి ఆరోపణ చేయలేకపోయారన్నారు. బాబు పాలనకు, జగన్ పాలనకు మధ్యనున్న తేడాను ప్రజలే బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. బాబు జీవితమంతా తన వారికి దోచి పెట్టడానికి, దోచుకున్నది దాచుకోవడానికే సరిపోయిందని ధర్మాన ఎద్దేవా చేశారు. పేదలు తలెత్తుకుని బతికేలా.. ఇక మేనిఫెస్టోలో ఇచి్చన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో పేదలు తలెత్తుకుని బతికేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన మనవళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదలకు మాత్రం ఆంగ్ల మాధ్యమం వద్దంటూ కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటివి పేద విద్యార్థులకు వరమని ఆయన తెలిపారు. తన దృష్టిలో ఇద్దరే ఇద్దరు మామలని.. ఒకరు చందమామ అయితే మరొకరు జగన్ మామ అని కొనియాడారు. మరోవైపు.. జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే సాధ్యమన్నారు. ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర అని తమ్మినేని అభివరి్ణంచారు. జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకే వెళ్తుందని, మధ్యవర్తిత్వం లేని పాలన అందిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఎన్ని బటన్లు నొక్కారో అందుకున్న వారికే తెలుసునన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస శ్రీకాంత్, ఎమ్మెల్యేలు కంభాల జోగులు, రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఇక ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. పల్లె ప్రాంతాల నుంచి వెల్లువలా బహిరంగ సభకు తరలివచ్చారు. సభ నిర్వహించిన ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ కేటీ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగింది. నేడు విశాఖ, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో యాత్ర.. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం విశాఖపట్నం జిల్లా గాజువాక, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
"మత్స్యకారుల తోలు తీస్తా అంటావా..”: మంత్రి సీదిరి
-
బాబు ప్రాజెక్టుల సందర్శన విడ్డూరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూలేరని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా చంద్రబాబు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాల్లేవన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాలు అందించి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్–2, స్టేజ్–2ని, ఆఫ్‌షోర్ వంటి పనులను ప్రారంభించింది వైఎస్సార్ అని, వాటిని పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ నిధులు కేటాయించారు. హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల నీరు చేరేలా లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతులిచ్చారు. అలాగే, నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు జగనన్నే స్వయంగా వెళ్లారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని పనులు చేస్తున్నాం. జిల్లాలోని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్‌లు ఏనాడైనా జిల్లాలో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారా? నిర్వాసితుల పరిహారాలను తెలుగు తమ్ముళ్లు మింగేయలేదా? ఇక వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు శరవేగంగా చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైఎస్సార్ హయాంలో ప్రారంభిస్తే ఇద్దరు సీఎంలు మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా గాలికొదిలేశారు. బాబు, పవన్‌లకు ఎందుకంత కోపం.. విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తున్నామనే అక్కసుతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌లు రాద్ధాంతం చేస్తున్న తీరుచూస్తే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. విశాఖలో పవన్, శ్రీకాకుళం జిల్లాలో బాబు ఒకేరోజు సందర్శించి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం జగన్ అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రం విభజనకు చంద్రబాబే సహకరించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక విద్యుత్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్నాయా ఒక్క ఏపీలోనే ఉన్నాయా అనేది ప్రజలందరూ గమనించాలి. -
పవన్ కళ్యాణ్ కు మంత్రి సీదిరి అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్
-
ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది. విజయవాడలో తొలిసారిగా.. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది. ఈ ఔట్లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది. కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. -
ఉత్తరాంధ్రకు వెలుగు రేఖ.. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్æ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకం కానుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు భావనపాడుకే ఉన్నాయని మారిటైమ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు.. థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి ఈ పోర్టు కేంద్రం కానుంది. ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్.. ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి కీలకమైన భావనపాడు పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయడం ద్వారా ప్రారంభించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు తొలి దశలో భావనపాడు పోర్టును నిరి్మంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361.91 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనులను రూ.2,949.70 కోట్లతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనతో తొలి దశ ఉంటుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా, తొలి దశలో నాలుగు బెర్తులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ రూపంలో సమకీరించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు సిటీగా శ్రీకాకుళం భావనపాడుతో శ్రీకాకుళం జిల్లా పోర్టు సిటీగా మారుతుంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో మచిలీపట్నం పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే స్ఫూర్తితో భావనపాడు పోర్టు పనులు కూడా లక్ష్యంలోగా పూర్తి చేస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి రూ.35 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ భావనపాడు పోర్టు నిర్వాసితులు 594 మంది కోసం రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నౌపడలో అధునాతన వసతులతో అర్అండ్ఆర్ కాలనీ నిరి్మంచనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఈ నెల 19న భావనపాడు పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూలపేట, విష్ణుచక్రంలో రైతుల నుంచి 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. రైతులకు 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. దీంతో పాటు మొదటి ఫేజ్‌లో సీఆర్‌జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు.. మొత్తం 1000 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండో ఫేజ్‌లో బృహత్తర పోర్టు డెవలప్మెంట్కు మరికొన్ని భూములు రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఆర్అండ్ ఆర్ కాలనీకి ఈ నెల 11న ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ వచి్చందన్నారు. జిల్లా ప్రజల పోర్టు కల నెరవేరుతుండడం శుభ పరిణామమన్నారు. వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రూ.365 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం తీరంలో నిరి్మంచనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచి్చన ప్రతి హామీని సీఎం నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, హార్బర్లు లేక మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితిని సీఎం పూర్తిగా మార్చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు సమానంగా భవిష్యత్‌లో ఇక్కడ తీరం అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరులో హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉందని, బాపట్ల, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి వద్ద మరో హార్బర్ నిర్మాణంతో పాటు మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను హార్బర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మే 3న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌లో పూర్తి స్థాయి ప్రగతి సాధిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారు అప్పుడప్పుడూ కనిపిస్తూ మత్స్యకారుల కోసం మాట్లాడుతుంటారని, అలాంటి పార్ట్‌టైమ్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు. -
చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు: సీదిరి అప్పల రాజు
సాక్షి, శ్రీకాకుళం/విశాఖపట్నం: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే పుస్తకం విడుదల చేయడంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైజాగ్‌లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు బుక్‌లెట్స్‌తో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'సత్యం రామలింగ రాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్‌ను వేదించామంటున్నారు. వారికి మాకు సంబంధం ఏంటి? చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించింది. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉంది. అదానీ లాంటి వ్యక్తి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారు. రిలయన్స్ని వెనక్కి పంపామంటున్నారు. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్‌ని రిలయన్స్‌కి కేటాయించారు. కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లింది. ఇది మీ తప్పిదం కాదా..? జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు. చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. ప్రాంక్లిన్ టెంపుల్ టేన్ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా..? విస్తరణలో బాగంగానే తెలంగాణకు వెళ్లారు. అమరాజా కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్ ఇస్తే.. మేం ఇబ్బందులు కు గురి చేసారంటారా? అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వారి క్యాంపస్.. మొదలుపెడుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఏడు నెలల్లో 40 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం స్వయంగా చెప్పింది. ఎక్స్ పోర్ట్స్ లో 4వ ర్యాంక్ లో ఉన్నాం. చంద్రబాబు హయాంలోని పారిశ్రామిక బకాయిలు రూ.3,675 కోట్లు సైతం మేం చెల్లించాం , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చాం. విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ సీఎం జగన్ పరిపాలనతో సాధ్యం అయ్యింది. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చాయి చంద్రబాబుకి సిగ్గు లజ్జాలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే .. ఇలా రాసుకునే బాధ ఉండేది కాదు. డబ్బులు కోసం ఒప్పుకుని వచ్చి నంగవాచి వేషాలు వేశారు. అందుకే ప్రజలు గూబమిద కొట్టి పక్కకు తోశారు. సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా? చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని ప్రజలు అనుకుంటున్నారు. 4 వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారు. భావన పాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దిశ దశ మారనుంది. మెడలు వంచించుకునే స్థితిలో బీజేపీ లేదు. మేం మాటతప్పాం అనే నైతిక బాధ్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా హోదాా గురించి అడగలేదు. ఐపాక్ మాకు సలహాదారు అని ఓపెన్ గా చెప్పాం. ఐప్యాక్ మా పార్టీలో భాగం. పవన్ చెప్పగలరా తన స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో. వారికి కూడా సలహాదారులు ఉన్నారు కదా? రోడ్లు ఏవి వేయాలో ఐపాక్ టీం ఏలా డిసైడ్ చేస్తుంది. ఇది అసత్య ప్రచారం' అని సీదిరి అప్పలరాజు టీడీపీపై ఫైర్ అయ్యారు. స్టాల్స్‌ను పరిశీలించిన విడదల రజిని.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు. టిీడీపీ హయాంలో జరిగిన సదస్సులో పెట్టుబడులు కాగితాల పైనే జరిగాయాని ఎద్దేవా చేశారు. ఈ సదస్సు ఏపీ లో భారీ పెట్టుబడులకు అనువైన సమయమన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ వన్ కాబోతోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు -
అమూల్‌పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
చిత్తూరు డెయిరీ మూయించింది చంద్రబాబే : మంత్రి సిదిరి అప్పలరాజు
-
చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు : మంత్రి అప్పలరాజు
-
పాడి పరిశ్రమ, పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
చీపురుపల్లి(గరివిడి): పశు సంపద పుష్కలంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యపడుతుందన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పశు సంపద, పాడి పరిశ్రమ, పశు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు తెలిపారు. గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పశువైద్య కళాశాలలో రూ.81.25 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన పశువైద్య చికిత్స సముదాయం, పశుగణ క్షేత్ర సముదాయం, బాలుర, బాలికల వసతిగృహాల భవనాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో సీదిరి మాట్లాడారు. ఏపీలో ఆర్బీకేలలో అందిస్తున్న సేవలు దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతీ వెయ్యి మూగజీవాల వైద్య సేవలకు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనుషుల వలే త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనికి సీఎం ఇప్పటికే ఆమోద ముద్రవేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మూగజీవాలకు కష్టంవస్తే మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఊరిలోనే వైద్యసేవలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పటిష్ట్రపణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పశు వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి భవిష్యత్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కళాశాలను అభివృద్ధి చేస్తోందన్నారు. గరివిడిలోని కళాశాలను వర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి అని, వారి చదువుల కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చుచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టర్, వైస్‌చాన్సలర్ సూచనల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో జిల్లా స్థాయి ఆడిటోరియంను గరివిడి పశువైద్య కళాశాలలో నిర్మించనున్నట్టు వెల్లడించారు. గరివిడిలో పశువైద్య కళాశాలకు 2016లోనే జీఓలు ఇచ్చినప్పటికీ పనులపై అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పశువైద్య కళాశాల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పశువైద్య వృత్తికి భారీ డిమాండ్ పెరుగుతోందన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నది సీఎం అభిమతంగా పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పశువైద్య కళాశాలకు జీఓలు ఇచ్చినప్పటికీ కేంద్రం అనుమతులు తీసుకురాలేదన్నారు. ఎంపీ అయ్యాక కేంద్ర అధికారులతో మాట్లాడి, బృందాలను రప్పించి పరిశీలన జరిపించి అనుమతులు తెప్పించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ పద్మనాభరెడ్డి, బోర్డు మెంబర్లు జీఎస్.రెడ్డి, జానకీరామ్, విజయ్‌కుమార్, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, అసోసియేట్ డీన్ సీవీ రాయులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, సర్పంచ్ గేదెల కృష్ణవేణి, ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దనరావు, నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, ఎస్వీ రమణరాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, పొట్నూరు సన్యాసినాయుడు, తహసీల్దార్ టి. గోవింద, ఎంపీడీఓ జి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువి శవ రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ సిగ్గులేని మాటలు చెబుతున్న చంద్రబాబునాయుడు ‘శవాల వద్దకే చంద్రబాబు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి డా.సీదిరి అప్పలరాజు విమర్శించారు. విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలలో కొత్తగా నిర్మించిన చికిత్స సముదాయాలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంగ్లిష్ మీడియంపై సిగ్గులేని మాటలు అడుతున్నారని విమర్శించారు. ఇంగ్లిష్ మీడియం చదివితే మొద్దు అవుతారన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఆయన కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారు... మనవడుకు తెలుగు అక్షరాలు వచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలే తప్ప రాష్ట్రంలోని పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవకూడదన్నది ఆయన నైజమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంక్షదబాబు చేయలేని పనులు రెండేళ్లలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. ప్రజల్లో మంచి పేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మాతృభాష అయిన తెలుగును గౌరవిస్తూనే... మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేలా ఆంగ్లమాధ్యమ చదువులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ఆంగ్లమాధ్యమ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి తెచ్చారన్నారు. చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడు కదా... అక్కడ ఆంగ్లమాధ్యమం అమలుపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జై జగన్ అంటూ జనం నినదిస్తున్న తీరుచూస్తే ‘బాబుకు బాదుడే బాదుడు’ తప్పదన్నారు. 2024 నాటికి తెలుగు దొంగల పార్టీ అంతరించిపోవడం ఖాయమన్నారు. ఎన్ని శవ యాత్రలు చేసినా, లోకేష్ ఎన్ని శవాలు వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. 2024లో మరోసారీ భారీ మెజారిటీతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మానుకుని హుందాగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. -
ఓడిపోతామని ముందే తెలిసే ఇలా....
-
పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి అప్పల్రాజు
-
ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ డ్రగ్స్ రాద్ధాంతం చేస్తోందన్నారు. మహిళాభివృద్ధి, సంక్షేమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని మంత్రి ధ్వజమెత్తారు. కోర్టులకెళ్లి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. (చదవండి: వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం) ‘‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘వైఎస్సార్ ఆసరా’ ఉత్సవాలు జరుగుతున్నాయి. మహిళల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రజలకి ఫలితాలు దక్కకుండా ప్రతిపక్షం విశ్వప్రయత్నాలు చేస్తోంది. డ్రగ్ మాఫియా ఏపీ నుంచే జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎన్ఐఏ.. ఏపీకి సంబంధం లేదని తేల్చింది. ఇప్పుడు పేదలకు ఇళ్ల పథకంపై కోర్టుకెక్కి ఆపించారని’’ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. చదవండి: తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ -
పెచ్చు మీరుతున్న ఒడిశా ఆగడాలు
మందస: ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన భూభాగంలో ఒడిశా అధికారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రైతుల జిరాయితీ భూముల్లో దౌర్జన్యాలు చేస్తున్న ఒడిశా అధికారులు మరో అడుగు ముందుకు వేసి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంస్థలను కూడా బెదిరిస్తున్నారు. పోలీసు కేసులు పెడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సాబకోట పంచాయతీలోని సరిహద్దు ప్రాంతానికి ఆనించి ఒడిశా భూభాగం ఉంది. ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలతో ఆంధ్రా గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఒడిశా అధికారులు, పోలీసులు గిరిజనులను బంధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒడిశా అధికారులతో పాటు పోలీసుల నుంచి వేధింపులకు గురవుతున్న గిరిజనులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో హత్య సాబకోట పంచాయతీ మాణిక్యపట్నంలో సుమారు 65 కుటుంబాలున్నాయి. వీరికి మినీ అంగన్వాడీ కేంద్రం ఉంది. భవనం లేకపోవడంతో 2012వ సంవత్సరంలో గిరిజనులు రేకులషెడ్‌ను ఆంధ్రా భూభాగంలో నిర్మించారు. ప్రస్తుతం మాణిక్యపట్నం మినీ అంగన్వాడీ భవనాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిశా తహసీల్దార్ బుధవారం సిబ్బందితో వచ్చి అంగన్వాడీ కార్యకర్త సవర లక్ష్మిని బెదిరించి, పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె హుటాహుటిన సమస్యను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశా అధికారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మంత్రి సీదిరి సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒడిశా అధికారులు, పోలీసుల నుంచి తరచూ బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు స్పందించి రక్షించాలని సర్పంచ్ సవర సంధ్యారాము కోరారు. చదవండి: ఒడిశా దుశ్చర్యపై రాజన్నదొర అసహనం -
‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్: కేక్ కట్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ): సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ ప్రజలు ఆదరించి భారీ కలెక్షన్లు పంపేవారన్నారు. ఇప్పుడు పలాస ప్రాంతానికి చెందినవారే సినిమాలు తీయడం సంతోషకరమన్నారు. శుక్రవారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విడుదల సందర్భంగా పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలాస మండలంలో మారుముల కంట్రగడ గ్రామంలో పుట్టిపెరిగిన కరుణ కుమార్ ‘పలాస–1978’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై రికార్డు సృష్టించారన్నారు. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులు ఈ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో పలాసకు కళ వచ్చిందన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలియజేశారు. చిత్రంలో నటించిన నటులు మంత్రి అప్పలరాజును సత్కరించారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి ఉన్నారు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
మానవత్వం చాటుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి ఏపీ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మానవత్వాన్ని చాటుకున్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మలి మండలంలో వివాహ వేడుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో నౌపడా గ్రామం వద్ద వాహనం బోల్తా పడడాన్ని మంత్రి గమనించారు. వెంటనే కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తిని తన కాన్వాయ్ లోని ప్రోటోకాల్ వాహనంలో టెక్కలి ఏరియా ఆస్పత్రికి మంత్రి సీదిరి అప్పలరాజు తరలించారు. -
గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితం..
శ్రీకాకుళం: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందినవారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఏపీ నుంచి నేవీ హెలికాప్టర్, తమిళనాడు నుంచి డోర్నియర్ విమానాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను సీదిరి అప్పలరాజు పర్యవేక్షించారు. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు. సురక్షితంగా బయట పడ్డ మత్స్యకారులు వీరే 1. కోడ సోమేష్ బోట్ డ్రైవర్ 2. కోడ జగన్నాధం 3. మోస సూర్యనారాయణ 4. అంబటి నీలకంఠం 5. నిట్ట జోగారావు 6. కామేష్ 7. రాజు 8. శివాజి 9. బావయ్య 10. రవి 11. అప్పారావు 12. బాబు -
చంద్రబాబుకు అన్నీ ఉగ్రవాది లక్షణాలే: మంత్రి
సాక్షి, శ్రీకాకుళం: కోవిడ్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితంగా ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేందుకు ప్రతిపక్షాలు, పచ్చ మీడియా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. N440 వైరస్ లేదని శాస్త్రవేత్తలు చెప్పినా భయం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో అబద్ధాలతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తారా? అని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. అసలు సీసీఎంబీ డేటాను చంద్రబాబు ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఉండే లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని, ఆయనొక రాజకీయ ఉగ్రవాది అని విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్‌ను కేంద్రం.. రాష్ట్రాలకు వాటాగా ఇస్తోందని, ఇప్పటికైనా వ్యాక్సిన్‌పై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ప్లూ వైరస్ బతకదు -
‘పచ్చ’కుట్రపై పెదవి విప్పవేం బాబూ!
సాక్షి, అమరావతి: విగ్రహ రాజకీయాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గుడిలో నందీశ్వరుడి విగ్రహన్ని రోడ్డుపైకి తెచ్చి న ఘటన వెనుక టీడీపీ హస్తముందని తేలిందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు నోరువిప్పడం లేదని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంతబొమ్మాళిలో గుడిలో ఉన్న నందీశ్వరుడిని రోడ్డుపైన దిమ్మమీదకు తెచ్చిన ఉదంతం సీసీ కెమెరాలో రికార్డయిందని, అందులో ఉన్నవాళ్లంతా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మనుషులేనని చెప్పారు. ఈ ఘటనలో ఓ ఎల్లో మీడియా పాత్రికేయుడూ ఉండటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నుంచి వీళ్లకు ఆదేశాలు వెళ్లాయని అర్థమవుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి 22 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. నిత్యావరసర వస్తువులను ప్రతి పేదవాడి ఇంటికే చేరవేసే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చేయించడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. -
కోళ్లు మరణిస్తే సమాచారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల మరణాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కోళ్లలో మరణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పక్షి నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. పుకార్లను నమ్మొద్దని, కోడి గుడ్లు, కోడి మాంసంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపారు. -
అచ్చెన్నాయుడి విషయంలో టీడీపీది దుష్ప్రచారం
-
నిష్పక్షపాత దర్యాప్తుకు ఆదేశించిన సీఎం జగన్
ఉద్దానం భగ్గుమంది.. అత్యాచారం చేసి బాలికను హతమార్చిన మృగాళ్లను రెండు రోజులవుతున్నా పట్టుకోలేనందుకు కోపోద్రిక్తమైంది. పోలీసులు అలసత్వం వహించారని ఆరోపిస్తూ పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం భారీ ఆందోళన చేపట్టాయి. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బాలిక అర్ధరాత్రి మాయమై పట్టాలపై శవమై తేలిన విషయం విదితమే. నిందితులను శిక్షించి తక్షణమే న్యాయం చేయాలని పోస్టుమార్టం చేస్తున్న ఆసుపత్రి ముందు జనం బైఠాయించారు. తల్లిదండ్రుల ఇంటికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు యత్నించగా వీరు అడ్డుకున్నారు. చదవండి: రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై..! దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి వచ్చి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, ఆందోళనకారులను వారించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఇదిలావుండగా నిష్పక్షపాత దర్యాప్తునకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బాలిక హత్య గురించి పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా తీవ్రంగా స్పందించిన సీఎం... పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించి నిజనిజాలు పరిగణనలోకి తీసుకుని ఎటువంటి ప్రలోభాలకు, ఎవరి ప్రమేయానికి తావులేకుండా నిష్పక్షపాత నిర్ధారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద బైఠాయించిన ఆందోళనకారులు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఉద్దానం ఒక్కసారిగా భగ్గుమంది. హత్యాచారానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఘటనలో నిందితులను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్న పోలీసుల తీరుపై ప్రజా సంఘాల నిరసనలు మిన్నంటాయి. ఈ మేరకు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలను ఆందోళనకారులు అష్ట దిగ్బంధనం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తరలించొద్దని పలాస సామాజిక ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసుల రక్షణ వలయంలో మృతురాలి స్వగ్రామానికి తరలించారు. సాక్షి, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు రూరల్: వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురంలో నివాసముంటున్న ఇంటర్ విద్యార్థిని శనివారం అర్ధరాత్రి పలాస రైలు పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రైల్వే పోలీసులు తరలించారు. సోమవారం అక్కడ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో కాశీబుగ్గ పోలీసుల రక్షణ వలయంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ఎందుకు తాత్సార్యం చేస్తున్నారని పోలీసులను నిలదీస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం... ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ప్రతీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఇప్పటికే పోలీసులకు చిక్కిన అనుమానిత వ్యక్తి గురించి, కేసులో పురోగతి గురించి బయటకు వెళ్లడించకపోవడంపై కారణం ఏమిటని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం తరపున వచ్చి అధికారులు సమాధానం చెప్పందే కదలబోమని కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద భైఠాయించారు. ఈ క్రమంలో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు. మరో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్ల సహా నలభై మంది స్పెషల్ పోలీసులు చుట్టు ముట్టారు. కాశీబుగ్గ కేటీరోడ్డులో భారీ ర్యాలీ ఈ ఆందోళన సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగింది. ఇదేక్రమంలో పోలీసుల రక్షణ వలయంలో అంబులెన్స్‌లో మృతదేహాన్ని బాతుపురం గ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకుండా మృతదేహాన్ని తరలించడంపై ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు, స్పెషల్ బెటాలియన్ సిబ్బంది చెదరగొట్టారు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ వైద్యుల సమక్షంలో ఆస్పత్రి మార్చురీలో విద్యార్థిని మృతదేహాన్ని ఎస్పీ అమ్మిరెడ్డి, ప్రత్యేక క్రైం టీంతో పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులు, ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను పట్టుకుంటామని వారిని వారించారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే లేఖ పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దిశ యాక్టు ప్రకారం దర్యాప్తు చేపట్టి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దీనిపై సీఎం వెంటనే స్పందించి తన స్వహస్తాలతో రాసిన లేఖలో విద్యార్థిని హత్య కేసులో పోస్టుమార్టం పరిశీలించి నిజనిజాలు పరిగణలోకి తీసుకుని ఎటువంటి ప్రలోభాలకు అధికారులు గురికాకుండా, ఎవరి ప్రమేయానికి తావులేకుండా నిష్పక్షపాత నిర్ధారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై..!
రాత్రికి రాత్రే బాలిక మాయమైంది.. తెల్లారేక రైలు పట్టాలపై శవమై కనిపించింది.. కూలీనాలి చేసుకొని బతుకుతున్నా పిల్లలకు పెద్ద చదువులు చెప్పించాలని తాపత్రయపడిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది.. ఆ చీకటి వేళ అసలేం జరిగిందన్న విషయం అంతుచిక్కకుండా ఉంది.. మృతురాలి శరీరంపై గాయాలను బట్టి, అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ బాలికకు చివరిగా వచ్చిన సంక్షిప్త సందేశాన్ని బట్టి సహ విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. మరికొందరి పాత్ర కూడా ఉండే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంలో ఈ దుర్ఘటన జరిగింది. సాక్షి, వజ్రపుకొత్తూరు/ కాశీబుగ్గ: అమ్మా, నాన్నా, తమ్ముడు.. వారి చెంతనే ఉంది. వారితో రాత్రి వరకు కబుర్లాడి నిద్రపోయింది. శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి పక్కనున్న బాత్రూమ్కు వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాత్రి వేళే చుట్టుపక్కల వెతికారు. తెల్లవారేసరికి మున్సిపాలిటీ పరిధిలో పెట్టిభద్ర వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి లబోదిబోమన్నారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు ఈశ్వరరావు, పార్వతి దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె (16), పదో తరగతి చదువుతున్న కుమారుడితో కలిసి ధర్మవరంలో నివసిస్తున్నారు. వీరి కుమార్తె శనివారం రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై కనిపించింది. మృతురాలి తలపై, కాళ్లు చేతులపై గాయాలున్నాయి. సమీపంలోని తుప్పల్లో చేతి గాజుముక్కలు, చెప్పులు లభ్యమయ్యాయి. సంఘటన స్థలం వద్ద గుమిగూడిన పరిసర ప్రాంతాల ప్రజలు సహ విద్యార్థి హస్తం? బాలిక ఫోన్ పరిశీలించగా శనివారం రాత్రి మణికంఠ అనే యువకుడి నుంచి ‘హాయ్.. బాగున్నావా.. గుడ్ నైట్’ అని మెసేజి వచ్చినట్టు తెలిసింది. అతనే కారణమై ఉంటాడని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మణికంఠ మృతురాలు కాశీబుగ్గలో చదువుతున్న కాలేజీలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. తల వెనుకభాగం, కాళ్లు, చేతులు రక్తసిక్తంగా ఉన్నాయి. రైలు పట్టాల పక్కన చెప్పులు, సమీపంలోని తుప్పల వద్ద పెనుగులాడిన ఛాయలు, ముక్కలైన చేతిగాజులు కనిపించాయి. ఈ ఆధారాలతో అత్యాచారం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. శవపంచనామా చేసి పోలీసులు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం, హత్య అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 363, 376, 302, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పలాస రైల్వేస్టేషన్ జిఆర్పి ఎస్ఐ కె రవికుమార్ తెలిపారు. కేసు విచారణ అధికారిగా జిఆర్పి సీఐ బాలసూర్యారావు బాధ్యతలు తీసుకున్నారు. పలాస ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అప్పలరాజు అనుమానాస్పద మృతి కాదు.. హత్యే తమ కుమార్తెది అనుమానస్పద మృతి కాదని.. హత్యేనని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అభం హుభం తెలియని తమ కుమార్తెను హత్య చేసి చంపారని, ఈ సంఘటనకు కారణమైన దోషులను పట్టుకొని శిక్షించాలన్నారు. వారి రోదనలతో సంఘటన ప్రాంతం మార్మోగింది. గ్రామమంతా కన్నీరు పెట్టింది. దోషులను పట్టుకొని వెంటనే శిక్షించాలని మృతురాలి మేనత్త ఇరోతు సుందరమ్మ కోరారు. బాలికను అత్యాచారం చేసి హత్య చేసారని, ఆడపిల్లకు సమాజంలో భద్రత కరువైందని, దోషులకు శిక్షలు పడాలన్నారు. తక్షణ సాయం యాభై వేలు పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి వద్ద ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిపి కుటుంబాన్ని ఆదుకోవాలని వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటువంటి పనులకు ఒడిగట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారంతా కోరారు. -
ఉత్తరాంధ్ర బాగుపడుతుంది : అప్పలరాజు
-
ఉత్తరాంధ్ర బాగుపడుతుంది : ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి : విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అప్పలరాజు తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్న బీసీలను అమరావతిలో భాగస్వామ్యం చేయలేదని, చంద్రబాబు పాలనలో ఆ ప్రాంతం నిర్లక్షానికి గురైందని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధానిని అభివృద్ధి చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉండాలన్న ప్రతిపాదన, అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకుంటారని స్పష్టం చేశారు. -
చంద్రబాబు మీ సేవలు చాలు.. రెస్టు తీసుకోండి
-
టీడీపీ నేత కూమార్తెకు జగన్ సాయం
సాక్షి, శ్రీకాకుళం : డబ్బులు లేక ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు తెలిపారు. కేన్సర్‌తో బాధపడుతున్న పలాస టీడీపీ నేత పీరుకట్ల విశ్వేశ్వరరావు కుమార్తె సాయి శిరీషకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన పది లక్షల రూపాయలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న రాజ్యంలో రాజకీయాలకు అతీతంగా సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్న వయస్సులోనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇది గొప్ప విషయమని, ఈ చట్టం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కేటాయించడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. మనస్సాక్షి లేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తన హయాంలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని విమర్శించారు. ఈ బిల్లులోని నిబంధనలు ఉల్లంఘించినవారిపై పెనాల్టీ విధించేలా చట్టంలో చేర్చాలని కోరారు. ఈ బిల్లు అమలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశముండాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు సబ్సిడీ అందించాలని కోరారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలతో నిరుద్యోగ యువత వలసలు ఇకపై ఉండబోవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. పేదలపై సీఎం వైఎస్ జగన్‌కసు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. లక్షలాది ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, చంద్రబాబు చేసిన తప్పులు యువతకు శాపంగా మారాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం మంచి నిర్ణయమని కొనియాడారు. ప్రజలకు మేలు చేసే మంచి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నా.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. -
ఫలించిన ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): వారంరోజులుగా మూతవేసిన జీడి పరిశ్రమలను తెరవాలని, తక్షణమే పనులకు హాజరుకావాలని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. 12 శాతం కార్మికులకు పెంచాల్సిన వేతన ఒప్పందం అమలు చేయకుండా పరిశ్రమ యజమానులు కాలయాపన చేస్తుండడంతో పరిశ్రమలు మూతబడిన విషయం తెలిసిందే. మంగళవారం పరిశ్రమల యజమానులకు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి తన స్వగృహామంలో మాట్లాడారు. రెండేళ్లకు ఒక్కసారి కుదుర్చుకునే వేతన ఒప్పందం ప్రకారం యజమానులు అమలు చేయకపోవడంతో మూకుమ్మడిగా బంద్ పాటించామని కార్మికులు ఎమ్మెల్యేకు వివరించారు. యాజమాన్యం మొండి వైఖిరి తగదని ఒప్పందం ప్రకారం 12 శాతం వేతనాలు పెంచాలని విన్నవించారు. పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తిత్లీ తుపాను సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో తగిన గడువు కావాలని కోరారు. కార్మికులకు, పరిశ్రమ యజమానులకు ఎమ్మెల్యే నచ్చజెప్పి ప్రస్తుతం పరిశ్రమలు తెరవాలని, ప్రొససింగ్‌కు ఆటంకం కలగకుండా కార్మికులు సైతం పనులకు హాజరుకావాలని ఆదేశించారు. వారం రోజులపాటు ఆలోచించి కార్మికుల డిమాండ్ ప్రకారం యాజమాన్యంతో ఆ ఒప్పందానికి సంతకాలు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, శాశనాపురి శ్రీనివాస్, యరుకోలు సుధాకర్, కాష్యూ లేబర్ ఆసోసియేషన్(కార్మికులు) అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సభ్యులు కోనారి రాము, పెంట అసిరినాయుడు, గోరుశెట్టి అమ్మన్న, వంకల రామయ్య, బొమ్మాళి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు పాటించిన యజమానులు, కార్మికులు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో, పరిసర ప్రాంత పల్లెల్లో ఉన్న 300లకు పైగా జీడి పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల యజమానులు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చల అనంతరం పరిశ్రమలు తెరుచుకున్నాయి. వేతన ఒప్పందానికి వారం రోజులు గడువు ఇచ్చినప్పటికీ.. ముందుగానే పరిశ్రమలు తెరవాలని యజమానులకు, పనుల్లోకి హాజరుకావాలని కార్మికులకు ఎమ్మెల్యే చెప్పడంతో అందరూ వారి పనుల్లోకి హాజరయ్యారు. బుధవారం ఉదయం నుంచి కటింగ్ మిషన్ కార్మికులు హాజరుకానున్నారు. -
అభివృద్ధి పథంలో నడిపిస్తా
సాక్షి, పలాస (శ్రీకాకుళం): నియోజకవర్గానికి భౌగోళికంగా విశిష్టత ఉంది. జీడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి జీడి పప్పు ప్రపంచ నలుమూలలకు ఎగుమతి అవుతోంది. తీర ప్రాంతంతో పాటు సువిశాల అటవీ ప్రాంతం ఉంది. వాణజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్తోంది. అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. అయినా వెనుకబడి ఉంది. తాగు, సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లుగా ఒకే కుటుంబ పాలనలో ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని యువ వైద్యుడు ముందుకు వచ్చాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. సాక్షితో ఆయన మనోగతాన్ని పంచుకున్నారు. సాక్షి: నియోజకవర్గం ప్రజలతో ఎలా మమేకమయ్యారు? అప్పలరాజు: నేను ఈ నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం దేవునల్లాడలో జన్మించాను. ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశాను. వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత పలాసలోనే ప్రాక్టీసు పెట్టాను. పదేళ్లగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. వైద్యునిగా ప్రజల కష్టాను అతి దగ్గర నుంచి చూసిన వాడిని. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే వాడిని. ప్రజలతో మమేకమయ్యాను. సాక్షి: నియోజకవర్గంలోని మీరు గుర్తించిన సమస్యలేమిటి? అప్పలరాజు: నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి గత పాలకులు చర్యలు తీసుకోలేదు. పలాసలో ప్రజలకు ప్రభుత్వ విద్య, వైద్యం అందడం లేదు. కనీసం ప్రభుత్వం డిగ్రీ కళాశాల లేదు. రైతులకు సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఉద్దానంలో ఎక్కువగా ఉద్యాన పంటలు పండుతాయి. వారికి రైతు బజారు అవసరం ఉంది. కాశీబుగ్గలో ప్లైఓవరు బ్రిడ్జి పెండింగ్‌లో ఉంది. జీడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది. మత్స్యకారలకు జెట్టీలు, ఫిషింగ్ హార్బరు నిర్మాణం, పరిశ్రమల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి. గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలి. అప్పుడే వారికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. సాక్షి: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? అప్పలరాజు: మనస్సు ఉంటే మార్గం లేకుండా ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాగైనా వీటిని సాధించి పెడతాను. ఇక్కడి సమస్యలన్నింటినీ జగన్మోహన్రెడ్డికి నివేదించాను. తన పాదయాత్రంలో కూడా ఆయన స్వయంగా తెలుసుకున్నారు. పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తాం. సాక్షి: టీడీపీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు మీరు ఎలా న్యాయం చేస్తారు? అప్పలరాజు: రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాము. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఇప్పటికే జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహాలు ఏమిటి? అప్పలరాజు: కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. మాటమార్చని, మడం తిప్పని వైఎస్.రాజశేఖరరెడ్డి వలె ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిని కూడా ప్రజలు అదే స్థాయిలో ఆదరిస్తున్నారు. ఇవే మా విజయానికి సోపానాలు. అంతేకాకుండా గౌతు కుటుంబ పాలనపై ప్రజలు విసిగు చెందిఉన్నారు. అది మాకు ప్లస్ అవుతుంది. ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారు. వైఎస్సార్ స్వర్ణపాలన రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. -
టీడీపీ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదు
-
టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ది లేదు : డాక్టర్ అప్పలరాజు
-
వీడిన మిస్టరీ
విజయనగరం టౌన్: జిల్లా కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు బొత్స మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పోలీసులు స్వల్ప కాలంలోనే కేసును ఛేదించారు. ఈ సంఘటనలో మోహన్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉపయోగించిన గన్ను తగరపువలస వద్దనున్న గోస్తనీ నదిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ జి. పాలరాజు సోమవారం విలేకరుల ముందుకు తీసుకువచ్చి వివరాలు వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ కార్యాలయంలో నమ్మి పైడిరాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిందితుడు బొత్స మోహన్ గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారై గన్ను గోస్తనీ నదిలో పడేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు మోహన్‌ను పట్టుకుంది. ఆయనతో పాటు తుపాకీ కొనుగోలుకు సహకరించిన కర్రోతు వెంకటరమణమూర్తి అలియాస్ రమేష్‌ను, సంఘటనా స్థలంలో కాల్పులు జరిపినప్పుడు కాపలాదారుగా వ్యవహరించడంతో పాటు కాల్పుల తర్వాత మోహన్‌ను నేరస్థలం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశాన వెంకటరమణను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి రంగు సురేష్‌తో పాటు ఒడిశాకు చెందిన మరొకరు పరారీలో ఉన్నారు. కాల్పులకు కారణాలివే.. రియల్టర్ నమ్మి అప్పలరాజు, అతని మామయ్య ఉల్లంకుల శ్రీనివాసరావు కొన్నేళ్లుగా పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా నిందితుడు మోహన్ నుంచి రూ.16 లక్షలను 2014లో అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అందుకు ప్రతిగా మండలంలోని వీటీ అగ్రహారంలో 55 చదరపు గజాల స్థలాన్ని గాని.. లేనిపక్షంలో ఏడాదిలో మోహన్ ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము (రూ.32 లక్షలు) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అప్పలరాజు ఏడాదిలో అటు సొమ్ము ఇవ్వడంలో గాని, ఇటు స్థలం రిజిస్ట్రేషన్ చేయడంలో గాని విఫలమవ్వడంతో అప్పలరాజు, మోహన్ మధ్య అంతరం ఏర్పడింది. దీంతో ఇరువురి మధ్య ఎప్పటికప్పుడు వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మోహన్ ఈ విషయాన్ని కొంతమంది పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లడంతో గుండాలపేటలో ఉన్న 650 చదరపు గజాల స్థలాన్ని మోహన్ పేరుమీద అప్పలరాజు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే హైవే రోడ్డు విస్తరణలో భాగంగా వంద గజాల స్థలం పోనుండడంతో మోహన్ నిరాశకు గురయ్యాడు. ఇందులో భాగంగా అప్పలరాజుపై అక్కసు పెంచుకున్నాడు. తనకు జరిగిన నష్టానికి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో కర్రోతు రమణమూర్తి అలియాస్ రమేష్ సహకారంతో రంగు రమేష్ ద్వారా తుపా కీ కొనుగోలు చేసే ప్రాం తాన్ని తెలుసుకుని ఒడిశా వాసి నుంచి తుపా కి, ఐదు రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేశా డు. పథకం ప్రకారం ఆశాన వెంకటరమణ సాయంతో బాధితుడు అప్పలరాజు ఆఫీస్‌కు వెళ్లి మోహ న్ ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. తుపాకీనీ తగరపు వలస గోస్తనీనదీలో పడేశాడు. గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలు, సెల్‌ఫోన్ వినియోగంపై పోలీసులు దృష్టి సారించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని తగరపువలస పరిసర ప్రాంతా ల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది లా ఉంటే బాధితుడు నమ్మి అప్పలరాజు విశాఖలో కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సమావేశంలో ఏఎస్పీ వెంకటరమణ, ఓఎస్డీ విక్రాంత్‌పాటిల్, సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి, పట్టణ డీఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు రివార్డులు కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా పనిచేసిన వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్సైఐలు జీఏవీ రమణ, ఎ.నరేష్, కానిస్టేబుల్ డి.శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సైలు సింహాచలంనాయుడు, రాజారావు, హెచ్‌సీ శంకరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుల్ నాయుడు, ప్రసాద్, రూరల్ ఎస్సై రామకృష్ణ, టూటౌన్ ఎస్సై వి.అశోక్ కుమార్, నెల్లిమర్ల ఎస్సై హెచ్. ఉపేం ద్ర, బొబ్బిలి ఎస్సై అమ్మినాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, ఐటి కోర్ కానిస్టేబుల్ రవికుమార్, కానిస్టేబుల్ రమేష్, పూసపాటిరేగ మండలం బర్రిపేటకు చెందిన గజ ఈతగాళ్లు బర్రి దారయ్య, పైడిరాజు, గుంటి ఎరకయ్య, మరుపల్లి పారయ్య, సూరాడ చయ్య, ఆకుల రామాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రోత్సాహక, నగదు రివార్డులను అందజేశారు. -
యువకుని ఆత్మహత్య
కొత్తవలస రూరల్ (శృంగవరపుకోట): కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఉరిటి అప్పలరాజు(24) అనే యువకుడు అనారోగ్యంతో నొప్పులు తాళలేక ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తవలస పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...అప్పలరాజు విశాఖపట్నంలో రైల్వే కలాసీగా పనిచేస్తున్నాడు. 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి తీసుకువచ్చారని తెలిపారు. మంగళవారం ఇంట్లోఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పలరాజు అన్నయ్య చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికందొచ్చిన కొడుకు తమకు దూరం కావటంతో తలిదండ్రులు అప్పారావు, సింహాచలం కన్నీరుమున్నీరయ్యారు. -
ఆ ఉద్యోగి నోరు విప్పితేనే..
చింతపల్లి: విశాఖ మన్యంలో వైద్య ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు అంతు లేకుండా పోయింది. కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ. కోట్లు కాజేసిన వైనం ఒకొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ట్రెజరీ ఉద్యోగులతో కుమ్మక్కయి 2010 నుంచి 2014 వరకు సుమారు రూ.10 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఖజానాశాఖ ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఉద్యోగి ఒకరు ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజుతో కలిపి ఈ అక్రమాలకు పాల్పడినట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి విశాఖపట్నంలో ఉన్నట్టు భోగట్టా. అప్పలరాజుతోపాటు ఆ ఉద్యోగి నోరువిప్పితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమంది అధికారుల పాత్ర ఉందనేది వెలుగులోకి వస్తుంది. ట్రెజరీ ఉద్యోగి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి రికార్డులు అప్పగించకపోవడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆడిట్ అధికారుల విచారణ అనంతరం రికార్డులను పోలీసులకు అప్పగిస్తే దీనిపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని 13 పీహెచ్సీలలో అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిల్లో మొత్తం 43 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఏటా వీరి వేతనాలకు రూ.కోటి వరకు నిధులు అవసరం. ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు బడ్జెట్ నివేదికలను ఏడీఎంహెచ్‌ఓకు అందజేస్తారు. అక్కడి నుంచి ఆశాఖ డెరైక్టర్‌కు నివేదిక చేరాక బడ్జెట్ విడుదల అవుతుంది. కానీ అవసరానికి మించి లేని కాంట్రాక్టు ఉద్యోగులను సృష్టించి 2010 నుంచి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అప్పటి ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారి ఈ అవినీతి వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా ఖజానా శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు అందాయి. మొత్తం 280 మంది నకిలీ ఉద్యోగులను సృష్టించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2013-14 ఒక్క ఏడాదికే బోగస్ ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్లు పక్కదారి పట్టించిన విషయం వెలుగులోకి రావడంతో పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ యువరాజ్ ప్రత్యేక ఆడిట్బృందాన్ని నియమించారు. 2010 నుంచి చెల్లింపులపై కూడా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా పీహెచ్‌సీల రికార్డులను ట్రెజరీ అధికారులు స్వాధీనం చేసుకుని లేని కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజుకు సన్నిహితురాలైన చంద్రకళ, ట్రెజరీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకునిగా పని చేస్తున్న ఎస్.దారబాబుల పేరిట రూ.11 లక్షలు డీడీల రూపంలో చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దారబాబు పేరిట రూ.4.99 లక్షలు డీడీ నంబరు 18279969తో, చంద్రకళ పేరిట రూ.6.27 లక్షలు డీడీ నంబరు 18279934తో అకౌంట్లో జమ చేశారు. వీరిద్దరు అప్పలరాజకు సన్నిహితులు కాగా పీహెచ్సీలలో ఎటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు లేరని నిర్ధారణకు వచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా నమోదు చేసిన పేర్లు, వారి పేరిట చెల్లించిన డీడీల వివరాలను సేకరిస్తున్నారు. -
పోలీసుల వేధింపులతోనే జవాను ఆత్మహత్య: భార్య
-
పోలీసుల వేధింపులతోనే జవాను ఆత్మహత్య: భార్య
పోలీసులు వేధించడం వల్లే తన భర్త అప్పలరాజు మరణించినట్లు ఆయన భార్య అనసూయ ఆరోపించారు. మెహిదీపట్నంలోని ఆర్మీ ప్రాంతంలో ముస్తఫా అనే బాలుడి అనుమానాస్పద స్థితి కేసులో పోలీసులు విచారించారన్న మనస్తాపంతో అప్పలరాజు సర్వీసు రైఫిల్‌తో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన భార్య అనసూయ స్పందించారు. తన భర్త దేశసేవ కోసమే ఆర్మీలో చేరారని, ఆయన మరణంతో ఇద్దరు పిల్లలు, తాను అనాథలుగా మారామని ఆమె వాపోయారు. తన భర్త మరణానికి కారణమైన పోలీసులపై కేసు నమోదు చేయాలని అప్పలరాజు భార్య అనసూయ డిమాండ్ చేశారు.