ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర | Minister Seediri Appalaraju Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర

Published Tue, Oct 12 2021 2:57 PM | Last Updated on Tue, Oct 12 2021 3:49 PM

Minister Seediri Appalaraju Comments On Chandrababu - Sakshi

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు

సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ డ్రగ్స్‌ రాద్ధాంతం చేస్తోందన్నారు. మహిళాభివృద్ధి, సంక్షేమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని మంత్రి ధ్వజమెత్తారు. కోర్టులకెళ్లి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. (చదవండి: వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం)

‘‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘వైఎస్సార్ ఆసరా’ ఉత్సవాలు జరుగుతున్నాయి.‌ మహిళల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రజలకి ఫలితాలు దక్కకుండా ప్రతిపక్షం విశ్వప్రయత్నాలు చేస్తోంది. డ్రగ్ మాఫియా ఏపీ నుంచే జరుగుతుందని అసత్య  ప్రచారం చేస్తున్నారు. ఎన్ఐఏ.. ఏపీకి సంబంధం లేదని తేల్చింది. ఇప్పుడు పేదలకు ఇళ్ల పథకంపై కోర్టుకెక్కి ఆపించారని’’ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.
చదవండి:
తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement