సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.
అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment