గత మంగళవారం రూ.2000 కోట్లు అప్పు చేసిన సర్కారు
సెక్యురిటీల వేలం ద్వారా రుణాన్ని ప్రభుత్వానికి సమీకరించనున్న ఆర్‌బీఐ
సాక్షి, అమరావతి : సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.4,237 కోట్లు అప్పు చేయనుంది. పదేళ్ల వ్యవధిలో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు అప్పు చేయనుంది.
ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. వచ్చే మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత మంగళవారమే 7.18 శాతం వడ్డీకి రూ.2000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే.. దీంతో చంద్రబాబు ప్రబుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.67,237 కోట్లకు చేరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment