విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అప్పలరాజు తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని పేర్కొన్నారు.