thadepalli
-
ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్ఆర్సీపీ
-
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
-
Adudam Andhra: విశాఖలో ముగింపు వేడుకలు.. పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహా క్రీడా సంబరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. కాగా సీఎం జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. చివరి రోజు తలపడనున్న జట్లు ఇవే.. మహిళా క్రికెట్: తొలి సెమీస్‌లో పల్నాడు జట్టుపై ఎన్టీఆర్ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. మూడో స్థానం కోసం సోమవారం జరిగే పోటీలో పల్నాడు జట్టు ఆడనుంది. టోర్నీ 19వ మ్యాచ్‌గా రెండో సెమీస్ తూర్పుగోదావరి, తిరుపతి జట్ల మధ్య సోమవారం జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా జట్టుతో ఆడనుంది. ఓడిన జట్టు మూడోస్థానం కోసం పల్నాడు జిల్లా జట్టుతో తలపడుతుంది. పురుష క్రికెట్: ఏలూరు, తూర్పుగోదావరి జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. క్వార్టర్ ఫైనల్స్‌లో గుంటూరుతో వైఎస్సార్ కడప, అనంతపురంతో ఎన్టీఆర్ జట్టు తలపడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. మహిళా బ్యాడ్మింటన్: సెమీస్‌లో కర్నూలుతో బాపట్ల జట్టు తలపడనుండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జట్టు సెమీస్‌కు చేరుకుంది. పురుష బ్యాడ్మింటన్: సెమీస్‌లో తిరుపతితో వైఎస్సార్ కడప జట్టు, ఏలూరుతో పల్నాడు జట్టు తలపడనున్నాయి. గెలిచిన జట్లు ఫైనల్స్ ఆడనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీపడనున్నాయి. మహిళా వాలీబాల్: సెమీస్‌కు అన్నమయ్య జట్టుతోపాటు విశాఖ జట్టు చేరుకున్నాయి. క్వార్టర్‌ఫైనల్స్ చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. పురుష వాలీబాల్: క్వార్టర్ ఫైనల్స్‌లో విజయంతో అనకాపల్లి, పార్వతీపురం మన్యం జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా వీటితో తలపడేందుకు క్వార్టర్ ఫైనల్స్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్లు సిద్ధపడనున్నాయి. మహిళా కబడ్డీ: సెమీస్‌లో అనకాపల్లి జట్టుతో ప్రకాశం జట్టు, అనంతపురం జట్టుతో విశాఖ జట్టు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీ పడనున్నాయి. పురుష కబడ్డీ: క్వార్టర్ఫైనల్లో విశాఖ జట్టుతో కర్నూలు జట్టు తలపడనుంది. మహిళా ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో అనకాపల్లితో కృష్ణా, ప్రకాశంతో ఏలూరు, కాకినాడతో నెల్లూరు, విజయనగరంతో అనంతపురం జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. పురుష ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో కాకినాడతో ప్రకాశం, కర్నూలుతో కృష్ణా, అనంతపురంతో బాపట్ల. శ్రీకాకుళంతో అనకాపల్లి జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు చేరుకోనున్నాయి. -
ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ఈ భేటీలో సజ్జల రామాకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, గురుమూర్తి కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు. 'ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించాం. రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే జగన్‌ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించాం.' అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పార్టీల తీరు మారాలి: సజ్జల సజ్జల మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీల తీరు మారాలన్నారు. మన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని -
సీఎం జగన్‌ను కలిసిన ఎన్సీసీ డీజీ గుర్బీర్పాల్ సింగ్
-
అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తున్నారు
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కుప్పం అభివృద్ధికి అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘ కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్‌ను గనుక గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది కూడా. ఈ వేళ కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్.. దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారు వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను ఆ రోజు భరత్ నాకు పరిచయం అయ్యాడు నేను భరత్‌ను ప్రోత్సహిస్తానని ఆ రోజే చెప్పాను ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం మీరు కూడా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించారు దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్‌ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది భరత్‌ను గెలుపించుకు రండి..భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కూడా అమల్లోకి వస్తుంది ఇదీ చదవండి: నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా! -
చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి
-
సీఎం జగన్‌ను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి కలిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. ఎమ్మెల్యే వెంట మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. చదవండి: జగన్ మావయ్యా.. మీరు మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారని.. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించిందని.. అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
-
చంద్రబాబు నీ పిచ్చి మాటలు ఆపు: మంత్రి బొత్స సత్యనారాయణ
-
విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సమ్మక్క– సారలమ్మలను తూలనాడలేదు
తాడేపల్లిరూరల్: ‘‘సమ్మక్క–సారలమ్మ గ్రామ దేవతలేనని అన్నాం. వారిని చిన్నచూపు చూసినట్టు, తూలనాడినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది పొరపాటు. నేను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించిన సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లం. వారిని చిన్నచూపు చూసే ఆలోచన చేయబోం. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాలతో నా వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదు..’’అని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో ఉన్నవారు వివాదాలకు తావు ఇవ్వరని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారి జ్ఞానానికే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో ఉన్న సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ మధ్య నాపై కొన్ని వివాదాలు వచ్చాయి. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా విన్నప్పుడు ఆ మాటల పూర్వాపరాలు చూడాలి. చిన్న వీడియో చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీ జనాలను ఏదో అన్నట్టుగా, కామెంట్ చేస్తున్నట్టుగా వినపడుతుంది. మేం అటువంటి కామెంట్ చేయం. సమాజ హితంపై కాంక్ష ఉన్నవారైతే.. వచ్చి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలి, సరైన పద్ధతిలో స్పందించాలి. 20 ఏళ్లకు ముందు మాట్లాడిన వీడియో నుంచి దానిని తీశారు. ఆ రోజున మాట్లాడినప్పుడు సమ్మక్క–సారలమ్మ స్వర్గం నుంచి దిగివచ్చిన వారు కాదు, గ్రామ దేవతలేనని అన్నాం. వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కొని భక్తులచేత పూజలందుకుంటున్నారని చెప్పాం. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా వివాదం ఇప్పుడే తగ్గుతోంది. దీంతో ప్రచారం కోసం దీన్ని చర్చకు తీసుకువస్తున్నట్లు కనపడుతోంది. మాకు ఆస్తులేమీ ఉండవు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాకు వ్యక్తిగతఆస్తులేమీ ఉండవు. సేవా కార్యక్రమాలు చేసేప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మాంసం తినవద్దని చెప్పిన మాట వాస్తవమే. కొందరు దానిని వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. సమాజానికి మంచి చేసేవారితో కలిసేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగిణి సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం.. మా జీయర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలు మంత్రోచ్ఛారణ చేయకూడదని చాలామంది అభిప్రాయం. కానీ మేం మహిళలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం. జీయర్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించి.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాం. ఇందులో అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలు ఉన్నారు. మేం మెడికల్ క్యాంప్ పెట్టినపుడు సేవ చేయడానికి వచ్చే వైద్యులు కూడా అనేక వర్గాలకు చెందినవారు ఉంటారు. ఆదివాసులను విమర్శించాల్సిన అవసరం మాకు లేదు’’అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల స్వామి, మాజీ ఎంపీ, జీయర్ ట్రస్ట్ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మా దగ్గర అందరూ సమానమే.. మేం రాజకీయాలకు దూరం. మా దగ్గర అందరూ సమానమే. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక మాకు ఉండదు. ఎవరితోనూ గ్యాప్ అనేది ఉండదు. వివాదాలు ఉండవు. మేమెప్పుడూ దక్షతతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎవరినీ మోసం చేయకుండా ఉంటాం. రాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. వారికి వీరికి దడుస్తూ ఏదో మూలన నక్కి మాట్లాడటం మా చర్రితలో ఎప్పుడూ లేదు. మేం సన్యాసులం.. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మేం ఎవరికీ భయపడబోం.. అలాగే ఎవరి వెంటా పడబోం. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో అహోబిలస్వామి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు -
న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
New Year 2022: సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుక
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం–2022 సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం వేడుక నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు వైఎస్ జగన్‌తో కేక్ కట్ చేయించారు. చదవండి: Rewind 2021: పడిలేచిన కెరటంలా.. పుష్ప గుచ్ఛాలు అందజేసి సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోక్య రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గవర్నర్ తరఫున ఆయన స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం -
ఏపీలో రూ.1,750 కోట్లతో.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ యూనిట్
-
పచ్చ మీడియా రాతలపై విరుచుకుపడ్డ జగన్ !
-
ZPTC MPTC: ఎన్నికల గ్రాండ్ విక్టరీపై సిఎం వైఎస్ జగన్ స్పందన
-
సీఎం జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు
సాక్షి, తాడేపల్లి: కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. అలాగే కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తాడేపల్లి నివాసంలో తనను మర్యాద పూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జ్ఞాపికను బహూకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నేటి మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణికి నూతన వస్త్రాలు బహూకరిస్తున్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి -
జీవో 19 అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: మంగళగిరి మునిసిపాలిటీ, తాడేపల్లి మునిసిపాలిటీలను విలీనం చేసి మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 19 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 19పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లకు నోటీసులిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జీవో 19ని సవాలు చేస్తూ తాడేపల్లి మండలం, చిర్రావూరుకు చెందిన సీర్ల లాల్‌చంద్, మరో ముగ్గురు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి, పిటిషనర్ల తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు. -
పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలు
మంగళగిరి: పైనాపిల్ పండ్ల మాటున లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం రాత్రి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కాజ టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ వి.భూషణం సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలను దాచి తరలిస్తున్న లారీ పట్టుబడిందన్నారు. మొత్తం 23 బస్తాల్లోని 1,020 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్ వంగలపూడి శ్రీనివాసరావును, ఎత్తుల నూకరాజు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. విచారణలో వీరిద్దరూ తమకు గంజాయి విక్రయించేవారితో కానీ, కొనుగోలు చేసే వారితో కానీ సంబంధం లేదని వెల్లడించారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండలు, విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీతానగరం ఘటనలో మృగాళ్ల గుర్తింపు
తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్ కృష్ణ, వెంకటేష్‌లను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి. ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కీలక ఆధారాల సేకరణ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించారు. వారిలో ఒక యువకుడు ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి వచ్చి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం. మరో యువకుడి స్వస్థలం తాడేపల్లి. బోసు బొమ్మ సెంటర్ సమీపంలోనే అతడు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ను అడ్డాగా చేసుకుని వారిద్దరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ల వెంబడి తిరుగుతూ సీతానగరం బ్రిడ్జి వద్ద రైలు ఆగి.. తిరిగి బయలుదేరే సమయంలో ఆ యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలోని గొలుసుల్ని లాఘవంగా తస్కరించి ఉడాయిస్తుంటారు. వాటిని తాకట్టు పెట్టగా.. లేదా విక్రయించగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని సమాచారం. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించరని స్థానికులు చెబుతున్నారు. కేసులో అనుమానితులు షేర్ కృష్ణ, వెంకటేశ్ విక్రయించిన సెల్‌ఫోన్ ఆధారంగా... అత్యాచారానికి పాల్పడిన తరువాత నిందితులిద్దరూ పడవలో కృష్ణా నది మీదుగా విజయవాడ వైపు చేరి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ కోర్టు వేలంలో ఉన్న ఓ భవనంలో తలదాచుకున్నట్టు సమాచారం. అనంతరం బకింగ్‌హామ్ కెనాల్‌పై గల రైల్వే బ్రిడ్జిపై మీదుగా చెన్నై రూట్లోని ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వే పోలీసులు వీరువురినీ వెంబడించడంతో పరారాయ్యరు. తాడేపల్లిలోని బోసుబొమ్మ సెంటర్లో టైలరింగ్ చేసే ఓ మహిళ వద్ద వారు ఓ ఫోన్ తాకట్టు పెట్టినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఆమె ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానీ ఆ ఫోన్ అత్యాచారానికి గురైన యువతిది కాదని తేలింది. కాగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తాపీమేస్త్రి కుటుంబానికి నిందితులు రెండు ఫోన్లు విక్రయించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ ఫోన్లేనని అత్యాచారానికి గురైన యువతి, ఆమె ప్రియుడు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు యువకులే ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిలో ఓ యువకుడు ఈ నెల 17న రోడ్డుపై మద్యం సేవిస్తూ గొడవ చేయగా.. తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో బుద్ధిచెప్పి విడిచిపెట్టినట్టు కూడా తెలిసింది. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిందితులిద్దరి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ నిందితుడి స్వస్థలం చినగంజాం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితులు హైదరాబాద్‌కు పరారయ్యాయనే సమాచారంతో ఓ బృందాన్ని అక్కడికి పంపారు. కృష్ణా, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే గోడౌన్లు, రైల్వే ట్రాక్ వెంబడి నిర్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : హోం మంత్రి నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి మంగళవారం మరోసారి పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్ని ఇప్పటివరకు పట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. అసలైన నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి వెంట కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. -
కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం
తాడేపల్లి రూరల్: అమరావతి, ఉండవల్లి కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వలస కూలీల కుటుంబాన్ని అతి వేగంగా వస్తున్న కారు ఆదివారం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోట మరియదాసు (35), భార్య యేసుకుమారి, ఇద్దరు కుమారులు తేజ, ప్రవీణ్ (10) అమరావతి మండలం మునుగోడుకు చెందినవారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబం గడవడం కష్టం కావడంతో అత్తగారి ఊరైన మైలవరం వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. లాక్డౌన్ సడలించడంతో తిరిగి ద్విచక్ర వాహనంపై సొంత ఊరు వస్తుండగా అమరావతి కరకట్టమీద మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద మందడం నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఈ నలుగురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న మరియదాసు కుటుంబం పది అడుగుల పైకి లేచి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. బైక్‌ను ఈడ్చుకుంటూ కారు 15 అడుగుల దూరం వెళ్లింది. మరియదాసు, చిన్న కుమారుడు ప్రవీణ్‌లకు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు ఫోన్ చేశారు. తీవ్ర గాయాలైన తేజ, యేసుకుమారిలకు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యేసుకుమారి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్‌లో కన్నుమూసింది. తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఉమా మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా: మిథున్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్‌రెడ్డి.. కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టీడీపీ స్క్రిప్టు ప్రకారమే: శ్రీకృష్ణ దేవరాయలు రఘురామకృష్ణరాజు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. టీడీపీ స్క్రిప్ట్‌ను రఘురామకృష్ణరాజుతో చదివిస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిందే రఘురామకృష్ణరాజు చేస్తున్నారన్న ఎంపీ.. . ట్రీట్మెంట్ కోసం రమేష్ ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. చదవండి: రఘురామకృష్ణంరాజు ఒంటిపై గాయాలేవీ లేవు -
ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని చెప్పారు. స్టీల్, సిమెంట్..ఇతర మెటీరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయన్నారు. బుధవారం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు ఆగకూడదు: జగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి లేఅవుట్లో మోడల్ హౌజ్ తప్పని సరి : ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌజ్ నిర్మించాలి. ఆ తర్వాత దానిపై సమగ్ర నివేదిక కూడా తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయొచ్చు.. వంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గుతుంది. దాని వల్ల రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిలో భాగంగానే, ఆక్సీజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. కాబట్టి స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే అస్సలు కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వసతులు ఉండాలి : కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు, అక్కడ తగిన మౌలిక వసతులు కల్పించాలి. అలాగే లేఅవుట్ కూడా పక్కాగా ఉండాలి. సీసీ రోడ్డు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జెజెఎం), విద్యుద్దీకరణ, ఇంటర్నెట్.. మౌలిక వసతుల్లో ముఖ్య కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు, రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. ఆర్థిక వృద్ధి కాబట్టి..: కోవిడ్ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుంది. ఎందుకంటే కార్మికులకు పని దొరుకుతుంది. అలాగే స్టీల్, సిమెంట్, ఇతర మెటేరియల్ కొనుగోలు వల్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. కాబట్టి దీనికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్ అన్నది చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థదే : భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థదే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైప్లైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. అయితే ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. అన్ని పనులు ఒకే ఏజెన్సీకి: జగనన్న కాలనీ లేఅవుట్లలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, భూగర్భ ఇంటర్నెట్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పనులు. అయితే ఇవన్నీ వేర్వేరు శాఖల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఒకే ఏజెన్సీకి అన్ని పనులు అప్పగించాలి. ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించండి. పనుల్లో డూప్లికేషన్ ఉండకూడదు, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించండి అదనపు ఫండింగ్ కోసం..: ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి, కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరుదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తుంది కాబట్టి, అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. ఇంకా, టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. -
ప్రచారంలో వారు అసభ్యపదజాలం వాడుతున్నారు
సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు నాలుకలకు నరాలు లేవని, తిరుపతి ప్రచారంలో వారు అసభ్యపదజాలం వాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు.. లోకేష్‌కు నాలుగు మంచిమాటలు కూడా నేర్పించలేకపోయారని అన్నారు. సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీజేపీ, టీడీపీలకు అజెండా లేదు. బీజేపీ, టీడీపీ విష ప్రచారంపైనే ఆధారపడ్డాయి. ఇచ్చిన ప్రతి హామీని మేం నెరవేర్చాం. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రచారానికి రావడం లేదని సీఎం జగన్ చెప్పారు. సమాజహితం కోసమే తిరుపతి ప్రచార సభను సీఎం రద్దు చేసుకున్నారు. కరోనాకు భయపడి హైదరాబాద్ ఇంట్లో దాక్కుంది చంద్రబాబే. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో బీజేపీ నేతలున్నార’’ని అన్నారు. -
తిరుపతి ఎన్నికల్లో ఏం చెప్పాలో ఆ పార్టీలకు తోచడం లేదు
-
ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదే విధంగా, వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశు సంవవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్బీకేల్లో కియోస్క్ ద్వారా పశు దాణా, మందులు కూడా ఇవ్వండి. సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నాసిరకం వాడకూడదు, కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి’’అని మార్గనిర్దేశనం చేశారు. ఇందుకు స్పందనగా.. ఫీడ్, సీడ్ కియోస్క్ ద్వారా ఇప్పటికే మందులు సరఫరా చేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.ఈ క్రమంలో.. ‘‘రైతులకు ఏది అవసరమో తెలియజెప్పండి, అవే తిరిగి వాళ్లకు అందించే ప్రయత్నం జరగాలి. నకిలీలకు అడ్డుకట్ట వేయాలి. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్ ట్యాగ్ చేయించాలి. వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం ఆర్బీకేల్లో డిస్ప్లే చేయాలి’’ అని సీఎం జగన్ సూచించారు. అదే విధంగా, ప్రతి మూడు నెలలకొకసారి బీమా పరిహారం క్లెయిమ్స్ క్లియర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి, రూ.98 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో, సీఎంఓ అధికారులు కూడా దీనిపై కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, వారికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఇక సమీక్ష సందర్భంగా, ఆర్బీకేల్లోని ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ నంబర్ 155251 పనిచేస్తుందా లేదా ? అని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ఈ నంబరు పనితీరుపై క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. ‘‘గ్యారంటీ, టెస్టెడ్, క్వాలిటీ అని ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నాం. వీటి నాణ్యతలో ఎలాంటి తేడా రావడానికి వీల్లేదు. ఆర్బీకేల ద్వారా ఇచ్చే ఇన్‌పుట్స్‌లో నాణ్యత లేకపోతే కచ్చితంగా అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఏహెచ్ఏ ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ 6099 ఏనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సమీక్ష సందర్భంగా, పశుసంరక్షక్ యాప్ పనితీరుని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యానిమల్ ఫీడ్ యాక్ట్ రావడంతో క్వాలిటీ సీడ్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో.. ‘‘బయో ఫెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక వైఎస్సార్ చేయూత కింద జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని మరింత విస్తతంగా చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా బ్యాంకులతో మరింత సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ లాబ్స్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ ఏర్పాటు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇందుకు సంబంధించి కూడా జూన్ 1, 2021 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, కొత్తగా 21 లాబ్ టెక్నిషియన్స్, 21 లాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వీటన్నింటికీ ఒకే కాల్ సెంటర్, ఒకే నంబర్ ఉండాలని పేర్కొన్నారు. వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు నాడు నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల్లో అన్ని పశువైద్యశాలలు ఆధునీకరణ నాడు–నేడు ( పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొబైల్ యాంబులేటరీ(వెటర్నరీ) సర్వీసెస్ 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు మొబైల్ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్ ఏర్పాటుపై సమీక్షలో చర్చ జరిగింది. నియోజకవర్గానికి ఒక వాహనం మంజూరుకు సీఎం ఆమోదం తెలిపారు. తమిళనాడు తరహాలో మొబైల్ యాంబులేటరీ సర్వీసెస్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలుచేశారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం జబ్బుపడిన పశువులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా వైఎస్సార్ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫాంను పునురుద్ధరించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. కడక్‌నాథ్ చికెన్‌కు ఉన్న మార్కెట్ డిమాండ్‌ను వివరించారు. ఈ క్రమంలో ఉటుకూరు పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. -
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువ: మేకపాటి
-
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువ: మేకపాటి
సాక్షి, తాడేపల్లి: 2023 డిసెంబర్ నాటికి రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన మారిటైమ్ ఇండియా-2021 సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను10 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని వెల్లడించారు. తూర్పు తీరంలో రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి అదనపు అవకాశాలు కల్పిస్తుందన్నారు. గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి విస్తరణకు అవకాశం తక్కువని వివరించారు. కేంద్రం కొత్తగా మారిటైమ్ పాలసీ-2030ను తీసుకుని వచ్చిందని, మారిటైమ్ నావిగేషన్, మానిటరింగ్ యాప్‌ను కేంద్రం ఆవిష్కరించిందని పేర్కొన్నారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రావాణ సామర్థ్యం పెంచనున్నామని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని, లైట్ హౌసుల చుట్టూ పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారని మంత్రి మేకపాటి వివరించారు. చదవండి: ‘మారిటైమ్ ఇండియా’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ -
మీ అందరికీ ఆల్ ది బెస్ట్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 అంశాల్లో 2030 నాటికి స్ధిరమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్ జరుపుకొంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ సదస్సు ముగిసేనాటికి ఆయా రంగాల్లో ప్రస్తుతం మనమేం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చెయ్యాలన్నదానిపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న 69వ జాతీయ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్‌కు సీఎం జగన్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి హాజరైన టౌన్ ప్లానింగ్ అధికార్లు, డైరెక్టర్లు, అకడమిస్టులు, పరిశోధకులు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల నుంచి వచ్చిన నిపుణులకు అభినందనలు తెలిపారు. అదే విధంగా ఐటీపీఐ అధ్యక్షుడు శ్రీ ఎన్ కె పటేల్, వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి రాములు, సెక్రటరీ జనరల్ శ్రీ ఎస్ బి కుదాంకర్‌తో పాటు ఏపీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వై శ్రీలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక కరోనా కారణంగా చోటుచేసుకున్న మార్పుల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. యునైటెడ్ నేషన్స్ నిర్దేశిత లక్ష్యాల దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. అదే విధంగా.. ‘‘కోవిడ్ కంటే ముందు కోవిడ్ తర్వాత ఏర్పడ్డ పరిస్ధితులు అందరికీ తెలిసినవే. వర్క్ ఫ్రమ్ హోం విధానం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ విధానం ఇంకా ఎన్ని రోజులుంటుందో, నెలలుంటుందో తెలియని పరిస్ధితి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే దీనికోసం భవిష్యత్తులో ఇంకా ఏ విధమైన మౌలికసదుపాయాలు కల్పించాల్సి వస్తుందనేది ఆసక్తికరమైన అంశం. ఈ ఆంశంలో మీ సూచనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ గురించి సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘రెండో అంశం పర్యావరణం గురించి. వాతావరణ మార్పుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. అడ్డూ, అదుపూ లేని మానవ చర్యల వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్, కర్బన ఉద్గారాలు ప్రమాదకర స్ధాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ‘‘మూడో అంశం పేద, మద్యతరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడాల్సి వస్తే... నగరాల్లో భూములు ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ వర్గాల ప్రజలు భరించలేని స్ధాయిలో అద్దెలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన ధరలు వల్ల అత్యధిక రేట్లతో భూములు సేకరించడం ప్రభుత్వానికి కూడా భారం అవుతుంది. ప్రభుత్వానికి భారం లేకుండా చేసేందుకు ఈ సమస్య పరిష్కారానికి మీ నుంచి వచ్చే ఏ సూచన అయినా తీసుకోవడానికి సిద్ధం.అదే సమయంలో పేద, మద్యతరగతి ప్రజలకు ఇళ్లు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఈ విషయం మీ సూచనల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. నీటి నిర్వహణ- సమగ్ర ప్రణాళిక అదే విధంగా... ‘‘ఈ సందర్భంగా నీటి నిర్వహణపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. మనం ఒక రకంగా ప్లాన్ చేస్తే... మరోవైపు గణనీయంగా పెరిగిపోతున్న నగరాలు వల్ల ఆయా ప్రాంతాలకు నీటిసరఫరా పథకాలను పొడిగించాల్సిన అవసరం వస్తోంది. పట్టణాల్లో జనావాసాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వారికి కూడా తగిన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఒక ప్రణాళిక అవసరం’’ అని పేర్కొన్నారు. సమగ్ర తీర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక ‘‘సమగ్ర తీర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక అనేది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం మనది. ఈ సదస్సు జరుగుతున్న విశాఖపట్నం ఏదైతే ఉందో... అది కూడా మీ సూచనల వల్ల గణనీయంగా లబ్ధి పొందనుంది. ఈ మూడు రోజుల సదస్సులో కచ్చితంగా విస్తృత ప్రయోజనం కలిగే అనేక అంశాలపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ సదస్సులో సమగ్రంగా మీరు చర్చించిన అంశాలను, సూచనలను నేను కచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాను. మీ సలహాలు, సూచనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘ఐ విష్ యు ఆల్ ద వెరీ సక్సెస్, ఆల్ ద వెరీ బెస్ట్’’ అంటూ విషెస్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అమ్మో పాము.. యువతి వాహనంపై వెళ్తుండగా..
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఒక్కసారిగా బండిలో నుంచి తాచుపాము బయటికొచ్చి పడగ విప్పి పైకి లేస్తే.! అమ్మో.. ఇంకేమైనా ఉందా? అంటారా? పైగా ఓ యువతి వాహనం నడుపుతుండగా.. సరిగ్గా అదే జరిగింది గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిలోని కొత్తూరుకు చెందిన ఝాన్సీ ఇంటి దగ్గర నుంచి ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణమైంది. ఉండవల్లి సెంటర్లోని తాడేపల్లి రోడ్డులోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం ఎదుటి డోమ్‌లో నుంచి తాచుపాము ఒక్కసారిగా పడగ విప్పి పైకి లేచింది. భయంతో బిత్తరపోయిన ఝాన్సీ బండిని వదిలేసింది. దీంతో కంగారు పడ్డ పాము మళ్లీ ద్విచక్రవాహనం లైట్ డోమ్‌లోకి వెళ్లింది. ఈ లోగా స్థానికులు అక్కడికి చేరుకోగా, వాహనంలో పాము ఉన్న విషయాన్ని యువతి వారికి తెలిపింది. దీంతో వారు మెకానిక్ సాయంతో ద్విచక్రవాహనం డోమ్ విప్పదీసి, పామును బయటకు తీసి చంపేశారు. రెండు గంటల పాటు పాము బండిలోనే అటూఇటూ తిరగడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి: దారుణం: పాము మెడకు కండోమ్.. ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో.. -
ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు..
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులు అఖండ విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి నృత్యాలు చేశారు. ‘వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్’ నినాదాలు మిన్నంటగా తాడేపల్లి ప్రాంతమంతా మార్మోగింది. ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ ‘వైఎస్సార్సీపీ’ జిందాబాద్ అంటూ నినదించారు. సంతోషంతో పూలు జల్లుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా మోతలతో తాడేపల్లి ప్రాంతం దద్ధరిల్లింది. పురపాలక ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం: మంత్రి బొత్స మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తిన విజయ ప్రభంజనమే త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం స్థానాల్లో విజయ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మూడో విడత ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడం ఆనంద దాయకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఈ ఫలితాలు ఇస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఎక్కువ స్థానాలొచ్చాయో చంద్రబాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు. ముందే ఊహించాం: కన్నబాబు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కుప్పంలో వచ్చిన ఫలితాలు తమకేమీ ఆశ్చర్యం అనిపించలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ముందే ఊహించామని చెప్పారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, ఏపీలో కాకపోయినా.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పోటీచేసే అవకాశం చంద్రబాబుకు ఉంటుందన్నారు. చంద్రబాబు ఇక పక్క రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పోటీ చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
చెవిటి, మూగ, వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీ
సాక్షి, తాడేపల్లి : చెవిటి, మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని సూచించారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలన్నారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో కనీసం 100 మంది పిల్లలు తన వద్దకు వచ్చారని, వారందరికీ ఆపరేషన్లు చేయించామని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి వైకల్యంతో బాధపడేవారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చెవిటి, మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు. ఏపీకే ఆ ఘనత అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా శబ్ధగ్రహణ పరీక్షలపై సీఎం చర్చించారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందని సీఎం భావించారు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను తొలిసారి ప్రారంభించిన ఘనత ఏపీకి దక్కుతుందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను మరింత ఆధునికంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. ఎంఆర్ఐ కంపాటిబిలిటీతో ఆధునిక పరిజ్ఞానం సహాయంతో ఆపరేషన్లు చేయడంపై కూడా సమీక్షించారు. స్క్రీనింగ్ లో గుర్తించిన వారికి పూర్తిస్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయంచడంపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. సమగ్ర కార్యాచరణ తయారు చేయాలి.. అప్పుడే పుట్టిన శిశువులతో పాటు, చిన్నారులకు, స్కూలు విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. వీటికి అవసరమైన పరికరాలు, వాటి నిర్వహణా విధానం, అలాగే వినికిడి, మూగ లాంటి లోపాలు గుర్తించిన వారికి కంటి వెలుగు తరహాలోనే సర్జరీలు చేయించాలని ఆదేశాలు జారీచేశారు. సర్జరీలు చేయాల్సిన అవసరంలేని వారికి అందించాల్సిన పరికరాలపైనా ఆలోచన చేసి, వీటన్నింటిపై సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు, విలేజ్ క్లినిక్స్‌లో చిన్నారులకు, కంటివెలుగు తరహాలో పాఠశాలల్లో చిన్నారులకు, వినికిడి సమస్య ఉందా? లేదా? అన్నదానిపై పరీక్షలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శిశువులకు 1వ నెల, 3వనెల, 6వ నెలల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత లోపాలు లేకపోతే ఆ పిల్లలను సర్టిఫై చేయాలని సీఎం తెలిపారు. చెవిటి, మూగ లోపాలను ముందుగానే గుర్తించడానికి నిర్వహించే పరీక్షలపై సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసే పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో ఉండాలన్నారు. ప్రతి బోధనాసుపత్రిలో అలాంటి సర్జరీలు చేసే సదుపాయాలు ఉండాలని సూచించారు. అవ్వాతాతలు కూడా వినికిడి సమస్యతో బాధపడుతున్నారని, వారికికూడా పరికరాలు అందించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇలా ప్రతిదశలోనూ కూడా ఎస్ఓపీలను తయారుచేయాలని ఆదేశించారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన కంటివెలుగు ఆపరేషన్లను పూర్తిచేయాలి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ (సాహి) సెక్రటరీ డాక్టర్ ఈ సి వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు -
వైఎస్సార్సీపీలో చేరిన సుందరరామ శర్మ
సాక్షి, తాడేపల్లి : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుందరరామ శర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో సుందరరామశర్మ వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సుందరరామ శర్మ గతంలో ఏపీ పీసీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఫేక్ వెబ్‌సైట్‌తో ప్రజల్ని మోసం చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెబ్‌సైట్‌కు ఫేక్‌గా టీడీపీ మరో వెబ్‌సైట్‌ను సృష్టించిందని, చంద్రబాబునాయుడు ఫేక్ వెబ్‌సైట్‌తో ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఫేక్ వెబ్‌సైట్‌పై సీఐడీకి పార్టీ తరఫున ఫిర్యాదు చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రజల తీర్పును చాలా నీచంగా వక్రీకరిస్తున్నారని, అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ పాలనలో అందరకీ సంక్షేమ ఫలాలు అందాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ. రెండో విడత ఎన్నికల్లో కూడా 80 శాతం విజయం సాధించాం. 2649 మంది వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీ 538, బీజేపీ 5, జనసేన 35, ఇతరులు 98 మంది గెలిచారు. పార్టీ వెబ్సైట్లో పార్టీ మద్దతుదారుల ఫోటోలు కూడా ఉంచుతున్నాం. రెండో దశ ఎన్నికల ఫలితాలపై కూడా ..చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మీడియా ద్వారా చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ( ఓటమి జీర్ణించుకోలేక.. రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ) ఈ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. టీడీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోకూడదని.. టీడీపీలోని నేతలను భ్రమలో పెట్టాలనే చంద్రబాబు ఉద్దేశం. అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తూ చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్ఈసీనే ..ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఖూనీ అయిందో చంద్రబాబు చెప్పాలి. ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకున్న నేత కూడా చంద్రబాబు ఒక్కరే. మరో 30 ఏళ్లు సీఎం జగన్మోహన్రెడ్డి పాలన కావాలని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే రెండు దశల ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులదే గెలుపు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీదే విజయం’’ అని అన్నారు. -
అయ్యో బిడ్డా; కన్న కూతురినే వద్దనుకుంది
తాడేపల్లి రూరల్: పేగు బంధం చిన్నబోయింది. ఓ కన్నతల్లి తన కుమార్తెను వద్దనుకోగా.. మరోచోట ఓ కుమార్తె వృద్ధురాలైన తల్లిని ఇంటినుంచి గెంటేసింది. తాడేపల్లి మండలంలో బుధవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి పట్టణానికి చెందిన ఓ యువతి సుమారు మూడేళ్ల క్రితం ప్రాతూరుకు చెందిన ఓ యువకుణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. కొంతకాలానికి వారికి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఆ దంపతులు విడిపోయి వేర్వేరుగా ఉంటుండగా.. కుమార్తె తల్లి దగ్గరే పెరిగింది. ఇటీవల సదరు యువతి తనను భర్త వేధిస్తున్నాడంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్దల రంగప్రవేశంతో కేసు వాపసు తీసుకుంది. ఈ క్రమంలో కుమార్తె తనకు వద్దంటూ.. తండ్రికి అప్పగించి వెళ్లిపోయింది. తల్లి కావాలంటూ ఆ బాలిక గుక్కపెట్టి ఏడుస్తున్నా వెనుదిరిగి చూడకుండానే ఆ తల్లి వెళ్లిపోయింది.(చదవండి: ప్రేమ పెళ్లి, పోలీస్ స్టేషన్‌కు వధూవరులు) పెనుమాకలో వృద్ధురాలి గెంటివేత మరోవైపు పెనుమాక గ్రామంలో ఓ వృద్ధురాలిని కన్న కూతురే ఇంటినుంచి గెంటేసి.. ఇంటికి తాళాలు వేసుకుంది. గ్రామానికి చెందిన రావూరి చిన్నమ్మాయి అనే వృద్ధురాలు 2010లో ఇందిరమ్మ పథకం కింద రెండు పోర్షన్ల ఇల్లు నిర్మించుకుంది. ఒక పోర్షన్లో కొడుకు కోటేశ్వరరావు, రెండో పోర్షన్లో కుమార్తె నాగమణి నివాసం ఉంటున్నారు. అయితే, ఇటీవల తన అన్నయ్య, తల్లి కలిసి తన ఇల్లు ఆక్రమించుకున్నారంటూ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి చిన్నమ్మాయి ఇల్లు తనకు మంజూరైందని, తానే కట్టించుకున్నానని చెప్పడంతో.. పోలీసులు చనిపోయేంత వరకు తల్లి ఆ ఇంట్లోనే ఉండేవిధంగా చెప్పి పంపించారు. అయితే బుధవారం కుమార్తె నాగమణి తల్లి చిన్నమ్మాయిని ఇంటినుంచి బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసింది. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు రోడ్డు పాలైంది. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
సాక్షి, తాడేపల్లి: నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో వేటుకు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా డ్రోన్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం) ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. -
విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్ యాప్‌పై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ( నిర్విఘ్నంగా పట్టాల పంపిణీ ) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ టాయిలెట్ల నిర్వహణ అనేది ప్రాధాన్యతా అంశం. టాయిలెట్లు లేకపోవటం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల.. చాలావరకు స్కూళ్లకు పిల్లలు పోలేని పరిస్థితి నెలకొంది. ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎప్పుడు మరమ్మతు వచ్చినా వెంటనే బాగుచేసేలా చర్యలుండాలి. టాయిలెట్ల క్లీనింగ్‌పై కేర్టేకర్లకు అవగాహన కల్పించాలి. విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంగ్లీష్ మీడియం ద్వారా అందుబాటులోకి నాణ్యమైన విద్య. విద్యార్థులకు పోషకాహారం కోసం గోరుముద్ద అమలు చేశాం’’ అని అన్నారు. -
సాయి ప్రసాద్‌ని డిస్మిస్ చేయడం దుర్మార్గం
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. లీవ్ దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎప్పుడూ చూడలేదని, నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో అందరికి తెలుసునని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉద్యోగుల మనోభావాలను ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరపాలి...ఎప్పుడు జరుపుతున్నారు?. ఆయనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే ఎన్నికలు అవసరం లేదా. ( నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం ) ఇంతటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. మేము కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడలేదు. 9 నెలల నుంచి ఉద్యోగులు కరోనాపై పోరాటం చేస్తుంటే ఎందుకిలా చేస్తున్నారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు మొండి పట్టుదల పడుతున్నారు ఈ రోజు హై కోర్ట్‌కు వెళ్లాము...ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఎస్ఈసీ ఇప్పటికైనా మొండి పట్టుదల వదిలేసి కోవిడ్ వాక్సినేషన్ అయ్యాక ఎన్నికలు పెట్టాల’’న్నారు. -
కొత్త సంవత్సర శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కలలు, ఆశయాలు నెరవేరేలా వారికి శక్తిని అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.(చదవండి: ఇదే నినాదం ఆర్బీకే విధానం కావాలి ) As we begin this new chapter, wishing you all a joyous and healthy 2021. May this year bring peace and immense prosperity to our state and our people. I pray that you get the strength to fulfill all your dreams and aspirations. #HappyNewYear2021 — YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2021 కేక్ కట్ చేసిన సీఎం జగన్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. -
నేను దర్గాకు వెళితే ప్రశ్నించడానికి మీరెవరు?
సాక్షి, తాడేపల్లి : గత 2,3 రోజుల నుంచి తిరుపతి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ పగటి కలలు కంటోందని, రాజకీయ వ్యభిచారానికి దిగుతోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చాలా మంది నాయకులు ప్రభుత్వంపై, తనపై విమర్శలకు దిగుతున్నారన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు మీరు ధర్నా చేసిన దేవాలయాలు కూల్చినప్పుడు ఎవరు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు మీరు టీడీపీతో అంటకాగి.. పుష్కరాల పేరుతో దేవాలయాలను కూల్చిన దుర్మార్గం మీది కాదా?. ఆ రోజు దేవాలయాల కూల్చివేతను అడ్డుకునేందుకు బంద్‌కి పిలుపునిస్తే మీరు ముఖం చాటేశారు. ఆ దేవాలయాలను నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ రోజు ధర్నా చేశారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అంటున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఏ ఒక్క ఎకరం అయినా అన్యాక్రాంతం అయ్యిందా?. మీరు టీడీపీతో అంటకాగుతున్నపుడు దుర్గ గుడి భూములను సిద్ధార్థ కాలేజీ వారికి కట్టబెట్టలేదా?. మంత్రాలయంలో 200 ఎకరాలు అమ్ముకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చింది ఆనాటి మంత్రి మాణిక్యాలరావు కాదా?. సదావర్తి భూములు 83 ఎకరాలు అమ్మకానికి పెట్టింది వాస్తవం కాదా?. అమరావతి అమరేశ్వరుని భూములను అమ్ముకోవాలని చూసింది మీరు కాదా?. జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాలకు దేవాదాయ భూములు కట్టబెట్టింది మీరు కాదా?. ఇన్ని చేసి ఈ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని చూపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. చర్చికి, మసీదుకు డబ్బులిచ్చారు అంటున్నారు. ( వీడియోలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!) దుర్గ గుడి అభివృద్ధికి ఇచ్చిన 70 కోట్ల రూపాయల నిధులు మీకు కనిపించడం లేదా?. జై శ్రీరాం అనేది మీ ఒక్కరిదేనా ఏమిటి?. ఆ రోజు నేను ధర్నా చేస్తే ఏ ఒక్కరూ సపోర్ట్ చేయలేదు. మీరు టీడీపీతో కలిసి నాతో రాకపోతేనే కదా నేను బీజేపీని వీడింది. గోశాలను 70 లక్షలతో మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ చేస్తున్నందుకు నేను రాజీనామా చేయాలా?. మీరెప్పుడన్నా ప్రజా క్షేత్రంలో గెలిచారా?. నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను.. ఇతర మతాలను గౌరవిస్తా.. మీరెవరు నేను దర్గాకు వెళితే ప్రశ్నించడానికి? ఈ రోజు దేవాలయాలపై దాడులు కేవలం ప్రతిపక్షం పనే. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, టీడీపీ, జనసేనలకు లేద’’ని అన్నారు. -
బాబు అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
సాక్షి, తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మానసిక రుగ్మతను అధిగమించేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్నినాని అన్నారు. ఐదేళ్లపాటు భ్రమల్లో ఉన్న ఆయన ఇప్పటికీ భ్రమల్లో ఉంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తిరుపతి ఎన్నిక చారిత్రక అవసరమని చంద్రబాబు అంటున్నారు. 5 శాతం ఓట్లు వస్తే చాలు అని భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలన దౌర్జన్యాల మయంగా ఉండేది. సీఎం జగన్ పాలన సంక్షేమమయంగా ఉంది. 90 శాతం హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రజలు ఎందుకు వదులుకుంటారు?. కులాలు,మతాలు,రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో పథకాల లబ్ది పొందని కుటుంబం అంటూ ఎక్కడా ఉండదు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు ఏమీ చేయకపోతే సీఎం జగన్ న్యాయం చేశారు. ( అధికారంలోకి వస్తామని కల కంటున్నారా? ) ఎన్ని కుట్రలు చేసినా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున 30 లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు పంపిణీ చేస్తాం. పోలీసులపై, వైఎస్సార్ సీపీ నేతలపై ప్రైవేటు కేసులు వేయాలని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. అధికారంలో ఉండగా ప్రజలు పంటలు పోయి ఏడుస్తుంటే.. హెలికాప్టర్లో తిరిగారు తప్పిస్తే చంద్రబాబు ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత ఉందని చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. డిసెంబర్ 31న నివార్ తుపాను పంట నష్టాన్ని రైతులకు అందిస్తాం. చంద్రబాబును ఆయన కుమారుడే ఆదర్శంగా తీసుకోవట్లేదు’’అని అన్నారు. -
అధికారంలోకి వస్తామని కల కంటున్నారా?
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు దేవినేని ఉమ, పరిటాల సునీత, శ్రీరామ్‌లు మూడు రిజర్వాయర్ల శంకుస్థాపనకు రాజకీయ రంగు పులుముతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీ నీవా పనులు ప్రారంభించారని, జీడిపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో చేపట్టారని చెప్పారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకి నీళ్లు ఇవ్వాలని తాను, అనేక మంది రైతులు కోరామని, అప్పటి సీఎం వైఎస్సార్‌ను కలిసి నివేదించామని తెలిపారు. ఆ వెంటనే స్పందించిన వైఎస్సార్ 2009 ఎన్నికల సభలో పేరూరు డ్యాంకు నీరిస్తామని ప్రకటించారన్నారు. ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. శుక్రవారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికలకి ముందు ఏడాది 2018లో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎన్నికలకు ఒక నెల ముందు పనులు ప్రారంభించారు. పేరూరు డ్యాంకి పైసా ఖర్చు లేకుండా నీరివ్వవచ్చని చెప్పినా పట్టించుకోలేదు. ఆనాడు అంచనాలు పెంచుకుని దోచుకునే ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక విచారణ చేయించాము. 200 కోట్ల రూపాయల మిగులు కనిపించింది. ఆ నిధులతో మరొక రిజర్వాయర్ చేపట్టాము. వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. దేవినేని ఉమా చిత్తశుద్ధితో మాట్లాడాలి. అంచనాలు పెంచుకున్నప్పుడు మీరెక్కడికి వెళ్లారు. దోపిడీకి అంచనాలు పెంచుకున్నారా..?. సీఎం జగన్ నిధులు దుర్వినియోగం కాకుండా కరువు ప్రాంతానికి నీరిస్తున్నారు. ఆయన లక్ష ఎకరాలకు నీళ్లిస్తున్నారు. మీరు శంకుస్థాపనలు చేసిన వాటిని మా వైఎస్సార్ ముందుకు నడిపించారు. రాయలసీమకు సాగు నీరు అందించే దిశగా మేము ముందుకి వెళ్తున్నాం. పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైంది. అది ఏ విధంగా పరిటాల రవి కల అవుతుంది?’’ అని ప్రశ్నించారు. -
సీఎం జగన్‌తో అమూల్ సంస్థ ప్రతినిధులు భేటీ
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమూల్ సంస్థ ప్రతినిధులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌తో గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ ఆర్ఎస్ పోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ భేటీ అయ్యారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు సంక్రమించిన అనేక హక్కులు రాజ్యాంగ ఫలితమే అని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్ అండ్ బి మంత్రి శంకర నారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, జెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: గురుపూరబ్ ఉత్సవాలకు రండి) ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చిత్తశుద్ధితో బాధ్యతలు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వాలు రాజ్యాంగానికి ఎలా తూట్లు పొడిచాయో మనం చూశాం. చివరికి ప్రతిపక్ష పార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లారు. కొన్ని వ్యవస్థలు, కొంత మంది వ్యక్తులు రాజ్యాంగాన్ని వేరే విధంగా వినియోగించుకుంటున్నాయి’’ అని గత టీడీపీ ప్రభుత్వ తీరును వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం: ఆదిమూలపు అంబేడ్కర్ భావజాలంతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అమరావతిలో జరిగిన అవకతవకలు చూశాం.. ఇప్పుడు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదు.- ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: హోం మంత్రి అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో అంటరానితనం పెద్ద రుగ్మత. దాన్ని నిర్మూలించడానికి అంబేడ్కర్ కృషి చేశారు. ఆయన కృషివ ల్లే నేడు మనకు మంచి రాజ్యాంగం అందుబాటులో ఉంది. రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం జగన్ ముందుడుగు వేసి, అన్ని వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళకు స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని అనేక సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇతర రాష్ట్రాలకు మన ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.- హోం మంత్రి మేకతోటి సుచరిత అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి శంకర నారాయణ సమ సమాజ స్థాపన కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పాలన: వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసింది. దళితులకు, అణగారిన వర్గాలకు అందించాల్సిన పథకాలు గతంలో అందించలేదు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. -
పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు చెల్లిస్తాం : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శంకర్‌నారాయణ, ఆదిమూలపు సురేష్ సహా ఇతరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ‘‘పాదయాత్రలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నవారిని దగ్గరగా గమనించాను. టిఫిన్ అమ్మకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు తెల్లవారుజామున 4 గంటలకే సేవలు అందిస్తారు. ఎండకు, వానకు, చలికి తట్టుకుని కూరగాయలు, పూలు అమ్మేవాళ్లు... ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తన్నవారికి ఈ స్కీం. మోపెడ్లపై దుస్తులు, సామాన్లు అమ్ముకునేవారు గానీ, బండ్లపై టిఫిన్లు అమ్ముకునేవారి సేవలు లేకపోతే అనేకమందికి గ్రామాల్లో, పట్టణాల్లో కడుపునిండని పరిస్థితి ఉంటుంది. ఇంటిముందుకే వస్తువులు, సరుకులు వచ్చే పరిస్థితి ఉండదు. వారి బతుకు బండే కాదు, మన ఆర్థిక వ్యవస్థకూడా నడవదు. అందుకే వీరిని మహనీయులుగా చూడాలి. పోటీ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాపారాలకు లోన్లు దొరక్క పెద్ద పెద్ద వడ్డీలకు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. వీరంతా స్వయం ఉపాధి పొందేవాళ్లే. అంతేకాదు వీలైతే ఒకరికో, ఇద్దరికో ఉపాధి కల్పిస్తారు. వస్తువులు, సరుకులు తెచ్చుకునే క్రమంలో ఆటోలు లాంటి వాటికి, కూలీలకు పని కల్పిస్తారు. పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి చూపిస్తున్నారు. అసంఘటిత రంగంలో వీరు పనిచేస్తున్నారు కాబట్టి, బ్యాంకులనుంచి కూడా రుణాలు అందే పరిస్థితి లేదు. పెట్టుబడికి డబ్బులు కావాలి అంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తక్కువ వడ్డీకి పెట్టుబడి దొరికే పరిస్థితి కూడా లేదు. పెట్టుబడికి 3,4,5, కొన్ని సందర్భాల్లో 10 రూపాయల వడ్డీకి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇలాంటి వారందరి జీవితాల్లో మార్పులు రావాలని పాదయాత్రలో వారిని చూసినప్పుడు అనుకున్నా. వీరికి అన్నగా, తమ్ముడిగా... చేయూత నివ్వాలని అనుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. గతంలో వీరి చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. వార్డుల్లో , గ్రామాల సచివాలయాల్లో వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వీరికి తోడుగా నిలబడుతున్నారు. లబ్ధిదారులను గుర్తించండం దగ్గర నుంచి, వీరి దరఖాస్తులు తీసుకోవడం దగ్గరనుంచి, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో మాట్లాడ్డం, వారిని ఒప్పించడం, పారదర్శక విధానంలో లబ్ధిదారులను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ... నమ్మకం కలిగింది. బ్యాంకులు దాదాపుగా 10 లక్షలమందికి రూ.1000 కోట్లు ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 100 కోట్ల రూపాయలు వడ్డీ కింద ఏడాదికి చెల్లిస్తుంది. పదేళ్లలో 1000 కోట్లు చెల్లిస్తుంది. అప్పులు పాలవుతారు, ఇబ్బందుల పాలు అవుతారని చిరు వ్యాపారులను అదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి వారికి తోడుగా నిలిచే కార్యక్రమం చేసింది. 10 లక్షల మందికి దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలను వడ్డీలేని రుణాలకింద బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నాం. 7 నుంచి 10 రోజుల్లోనే దాదాపు 10లక్షలమంది బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జమ అవుతుంది. కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బలి వీణ, బుడి ఇత్తడి, కళంకారీ, ఇతర హస్త కళలల్లో ఉన్నవారికి కూడా రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తుంది. గడువులోగా తిరిగి చెల్లిస్తే.. బ్యాంకులకు, చిన్న వ్యాపారాలకు, హస్తకళాకారులకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కసారి చెల్లించిన వారు తిరిగి వడ్డీలేని రుణాలు పొందడానిక అర్హులు. ఏడాదిలోగా కట్టేసిన వారికి తిరిగి వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది: అర్హత ఉన్నవాళ్లందరికీ ‘‘లబ్ధిదారుల జాబితాను ఇదివరకే ప్రకటించాం. ఈ పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మీపేరు ఉందో, లేదో చూసుకోండి. లేకపోతే దరఖాస్తు చేసుకోండి, పరిశీలన చేసి నెలా, 2 నెలల్లోపే వీరందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నెలరోజుల వరకూ ఈస్కీం పొడిగించబడుతుంది. ఎవ్వరికీ కూడా ఎగరగొట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే ఆలోచన’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో డిసెంబరు 25న డి-ఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెడతామని పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకుంటే అర్హులకూ 90 రోజుల్లో అవకాశం ఇస్తామన్నామని, ఈ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు. తన క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న తోడు పథకం, ఉపాధి హామీ పనులు, నాడు- నేడు, కోవిడ్-19 నివారణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వాటి మార్కెట్ విలువ రూ. 23 వేల కోట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘తొలుత మార్చి 25న ఉగాది రోజు ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 14, అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైయస్సార్ జయంతి రోజు అయిన జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్నీ వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది’’అని పేర్కొన్నారు. ‘‘గతంలో పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు ఇప్పుడు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు పంచబోతున్నాం’’అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఇక కొత్త దరఖాస్తుల నేపథ్యంలో 80 వేల మందికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. కాబట్టి వేగంగా ఆ పని చేయండి. డిసెంబరు 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలి. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్తవారి జాబితాలో చేర్చాలి. వచ్చే నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్దిదారుల జియో ట్యాగింగ్ పూర్తి కావాలి. పథకాన్ని అమలు చేసేందుకు ఆరోజు నాటికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. కోర్టు స్టేలు ఉన్నచోట ఆ స్టేలను వెకేట్ చేయించుకునేలా కలెక్టర్లు గట్టి ప్రయత్నం చేయాలి’’ అని సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. (చదవండి: తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్) సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్- ముఖ్యాంశాలు 1). ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు. పక్కా ఇళ్ల నిర్మాణం: పథకంలో ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను గుర్తించాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. గిట్టని వాళ్లు కోర్టులకు వెళ్లారు, పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు–ఇళ్ల నిర్మాణం: టిడ్కో ద్వారా రాష్ట్రంలో 2,62,216 ఇళ్ల నిర్మాణం. వాటిలో ఇప్పటికే 1,43,600 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని 300 చదురపు అడుగుల్లో నిర్మిస్తున్నాం ఇంకా 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గత ప్రభుత్వ బకాయిలు: టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3200 కోట్లు బకాయి పెట్టి పోయింది. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1200 కోట్లు ఇచ్చాం. ఈ వారంలో మరో రూ.400 కోట్లు, ఇంకో రూ.600 కోట్లు 15 రోజుల్లో ఇస్తాం. మూడేళ్ల పాటు ప్రాజెక్టు: రూ.2500 కోట్లు టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం ఖర్చు, ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నాం. డిసెంబరు 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చేయబోయే వ్యయం రూ.9550 కోట్లు. అందుకే ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. బాబు ముద్దా? జగన్ ముద్దా?: వలంటీర్లు వచ్చే సోమవారం (23వ తేదీ) నుంచి ఈనెల 30వ తేదీ వరకు టిడ్కో లబ్ధిదారుల్లో 300 చదరపు అడుగుల ఇల్లు పొందుతున్న వారి దగ్గరకు ప్రభుత్వ లెటర్ తీసుకుని పోతారు. మీకు బాబు ముద్దా? జగన్ ముద్దా? అని అడుగుతారు. మీకు బాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని కూడా అడుగుతారు. అందులో బాబు స్కీమ్‌లో ఏముంటుంది? జగన్ స్కీమ్‌లో ఏముంటుంది? అన్నది స్పష్టంగా రాయండి. బాబు స్కీమ్: లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు వారి చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా వారికందుతుంది. జగన్ స్కీమ్: కేవలం ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు. తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్. ఈ వివరాలు చెప్పి, వారికి ఏ స్కీమ్ కావాలన్నది తెలుసుకోండి. 1 రూపాయికే అగ్రిమెంట్ ఆఫ్ సేల్: డిసెంబరు 25న, 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తాం. పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎందుకు? చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు కూడా అర్ధం కావడం లేదు. జగన్ స్కీమ్ కావాలనుకున్న వారికి కూడా డిసెంబరు 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్. ఆ ఇళ్లకూ చంద్రబాబు బకాయిలు: గ్రామీణ ఇళ్లకు సంబంధించి చంద్రబాబు వదిలి పెట్టి పోయిన బకాయిలు రూ.1432 కోట్లు. అందులో ఈ వారంలో సుమారు రూ.470 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఆ తర్వాత మిగిలిన రూ.962 కోట్లు వచ్చే డిసెంబరు 25న బటన్ నొక్కి విడుదల చేస్తాం. కొత్త ఇళ్ల నిర్మాణం: నవరత్నాలులో చెప్పిన మరో కార్యక్రమం అమలు చేయబోతున్నాం తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం. ఒక్కో ఇంటిని రూ.1.80 లక్షల వ్యయంతో, అన్నీ ఒకే మాదిరిగా నిర్మిస్తారు. ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదు. ఇంటి నిర్మాణానికి అవసరమైన పూర్తి సామాగ్రి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం. క్వాలిటీ అనేది ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్. బ్రాండ్ ఇమేజ్.కాబట్టి ఎక్కడా రాజీ పడొద్దు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం వల్ల 21 కోట్ల పని దినాలు లభించనున్నాయి. ఆ విధంగా దగ్గరుండి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటేరియల్ ఇస్తాం. లేబర్ కాంపొనెంట్ వారికే ఇస్తాం. సచివాలయాల పాత్ర: ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిప్తాయి. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు, వలంటీర్లు కూడా పని చేస్తారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం మొదలు, వారికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆ బా«ధ్యత చూస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్వాలిఫైడ్. వారి సేవలు ఉపయోగించుకోండి. అందుకు తగిన ఎస్ఓపీ ఖరారు చేయండి. ఎప్పటిలోగా ఆ ఇళ్లు?: తొలి దశలో నిర్మించనున్న ఇళ్లను 18 నెలల్లో (2022 జూన్ నాటికి) పూర్తి చేయాలని లక్ష్యం, రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది, 2021 డిసెంబరులో వాటి నిర్మాణం ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. వచ్చే ఏడాది ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ అతి పెద్ద కార్యక్రమం. తొలి దశలో 167 నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణాలు మొదలు కానున్నాయి. 2). జగనన్న తోడు. నవంబరు 25న పథకం ప్రారంభం. వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు, వారికి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం. వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు కడుతుంది. పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయి. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలి. ఈ నెల 24వ తేదీలోగా బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కలెక్టర్లు పూర్తి చేయాలి. 3). జాతీయ ఉపాథి హామీ పనులు: పనులు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొన్నింటిపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి. అదే సమయంలో కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ఈనాడు పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది. గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది. అవి సకాలంలో పూర్తి కావాలి: గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీలల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలి. బీఎంసీయూల నిర్మాణానికి సంబంధించి ఆర్బీకేల పక్కనే భూములు ఇచ్చేలా చూడండి. ఈనెల 30 నాటికి స్థలం ఇవ్వడంతో పాటు, అన్నీ మంజూరు చేయాలి. వచ్చే నెల 15 నాటికి తప్పనిసరిగా పనులు మొదలు కావాలి. ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు. అన్ని పనుల్లో గ్రామ, సచివాలయాల్లో ఉన్న గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. 4). నాడు–నేడు స్కూళ్లు: తొలిదశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తి. డిసెంబరు 31 టార్గెట్‌గా పనులు పూర్తి చేయాలి. దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. ఇంకా బాత్రూమ్ల శ్లాబ్ వంటి పనులు జరగాల్సిన262 చోట్ల అవసరమైన ఇసుక, సిమెంటు సరఫరా చేయాలి. పేరెంట్ కమిటీలపైనే పూర్తి భారం వేయకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి. జగనన్న విద్యా కానుక: పిల్లలకు కిట్ ఇచ్చాం. అందులో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని సవరించండి. నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టాలి. పిల్లలు ఎవరికైనా షూ సైజ్ సరిపోకపోయినా, లేక పెద్దగా అయినా తెలుసుకోండి. ఆ మేరకు ప్రతి స్కూల్లో నోటీసులు పెట్టి, పూర్తి వివరాలు సేకరించండి. పిల్లలను వాటిని స్కూల్‌కు స్వయంగా తీసుకురమ్మని చెప్పి, అక్కడే పరిష్కారం చూపాలి. బ్యాగ్ ఎలా ఉందో చూడండి. ఒకవేళ చినిగిపోతే క్వాలిటీ పెంచాలి. పిల్లలకు అది ఒక ప్యాషన్. వారు బాగా చదువుకోవాలి. కాబట్టి కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మగ పిల్లలకు మూడు జతల యూనిఫామ్ కుట్టుకూలీ రూ.40 చొప్పున మొత్తం రూ.120 తల్లుల ఖాతాలో పడుతుందా? లేదా? అన్నది కూడా చూడాలి. వచ్చే సోమవారం నుంచి ఈ కార్యక్రమం జరగాలి. అంగన్వాడీ కేంద్రాలు (వైఎస్సార్ ప్రిప్రైమరీ స్కూళ్లు): రాష్ట్రంలో 27,543 అంగన్వాడీలు అద్దె భవనాల్లో ఉన్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం 22,630 స్థలాలు గుర్తించారు. ఆహ్లాదకర వాతావరణం: ఊరిలోకి రాగానే సచివాలయం, వైయస్సార్ విలేజ్ క్లినిక్, ఆర్బీకే, ప్రిప్రైమరీ స్కూల్.. ఇలా అన్నీ కనిపిస్తాయి. అంత చక్కటి పరిస్థితి మీరు చేశారంటే, మీ హయాంలో జరిగిందని అందరూ చెప్పుకుంటారు. అలా మీరు గుర్తుండిపోతారు. కాబట్టి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు భవిష్యత్తులో అవి గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. వాటిలో హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు, ఆశా వర్కర్లు కూడా ఉంటారు. ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 5). కోవిడ్–19 రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాము. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 91,54,263 పరీక్షలు అందులో 8.54 లక్షల పాజిటివిటీ కేసులు. 9.33 శాతం ప్రతి 10 లక్షల మందిలో 1,71,428 పరీక్షలు. పాజిటివ్ కేసులు కూడా గత నెలలో తగ్గాయి. కోవిడ్ నివారణ చర్యల్లో జిల్లాల కలెక్టర్లును అభినందించాలి. కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోంది: మొత్తం యూరప్ కోవిడ్‌తో వణుకుతోంది. ఢిల్లీలో మరో లాక్‌డౌన్‌కు రెడీ. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వస్తోంది. అక్కడ మొదలు కాగానే, ఇక్కడా వస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి, కలెక్టర్లు శ్రద్ద తీసుకోవాలి. ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 104 నెంబరు: 104 నెంబర్‌ను సింగిల్ పాయింట్ కాంటాక్ట్‌గా అభివృద్ది చేయాలి. 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఆ నెంబరుకు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలి. హెల్ప్ డెస్క్‌లు– సేవలు: ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌లు ఉండేలా చూడాలి. అన్ని ప్రభుత్వ, ప్రై వేటు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్కులు ఉండాలి. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో డిసెంబరు 10 నాటికి ఆరోగ్యమిత్రలతో హెల్ప్ డెస్క్‌లు, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఆరోగ్యమిత్రలకు శిక్షణ కార్యక్రమం కూడా ముగించాలి. ఆ హెల్ప్ డెస్కులలో కేవలం కూర్చోవడమే కాకుండా, ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్ఓపీ ఖరారు చేయండి. తను ఎందుకు కూర్చున్నాడు? తాను ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి? అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అదే విధంగా వారు ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోంది? అన్నది జేసీలు చూడాలి. అస్పత్రులలో 9800 పోస్టులు మంజూరు చేశాం. _ వాటిలో జిల్లా స్ధాయిలో కలెక్టర్లు ఆధ్వర్యంలో7700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5797 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం. 6). ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ. రబీ సాగుకు సన్నద్దం. ఏ పంట అయినా కూడా అమ్ముడుపోకుండా ఉంటే, దానిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. రైతులకు కనీస మద్దతు ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు. ఆర్బీకేల స్థాయిలో 5812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు. వాటిలో వివిధ పంటలకు సంబంధించి 4,29,481 మంది రైతులు ఆర్బీకేల వద్ద నమోదు చేసుకున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, రాగి తదితర పంటలకు సంబంధించి రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆర్బీకేల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలి. అంత కంటే ఆలస్యం చేయొద్దు. అదే విధంగా రైతుల వివరాలు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి. ధాన్యం సేకరించిన 15 రోజుల్లో తప్పనిసరిగా పేమెంట్లు జరగాలి. కాబట్టి రైతుల పట్ల అందరూ మానవతా దృక్పథంతో ఉండాలి. ధాన్యం సేకరణలో ఈ–ప్రొక్యూర్మెంట్ తప్పనిసరి. ఎక్కడా మన రైతులకు నష్టం జరగకూడదు. ఎఫ్ఏక్యూ రిలాక్స్: వేరుశనగ రైతుల కష్టాలు తీర్చేందుకు కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్ఏక్యూ) లేని పంటకు కూడా గ్రేడెడ్ ఎమ్మెస్పీ రూ.4500 ప్రకటించాం. ఆ మేరకు ఎఫ్ఏక్యూలో మినహాయింపులు ఇచ్చాం. దీన్ని అన్ని ఆర్బీకేల వద్ద బాగా ప్రచారం చేయాలి. రబీ సాగు – సన్నద్ధత: ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిలలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అవసరం ఎంత అన్నది చూసి, వాటి లోటు లేకుండా చూడాలి. అన్నింటిలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం. కలెక్టర్లు, జేసీలు స్వయంగా మానిటర్ చేస్తే తప్ప, తిరిగితే తప్ప సమస్యలు తెలియవు. వాటిని పరిష్కరించలేరు. ఇంకా వ్యవసాయ సలహా మండళ్లు కూడా ఉన్నాయి. అవి ప్రతి శుక్రవారం సమావేశమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అవి నివేదికలు ఇస్తున్నాయి. వాటిని జేసీలు మండల వ్యవసాయ అధికారి ద్వారా చూడాలి. ఆ మేరకు అన్నీ స్వయంగా పర్యవేక్షించాలి. సీఎం–యాప్, ఈ–క్రాప్ డేటా ఎలా నమోదు, వినియోగం అన్నది చూడాలి. కాబట్టి జేసీలు, కలెక్టర్లు తప్పనిసరిగా సచివాలయాలు, ఆర్బీకేలు సందర్శించాలి. ఈ–క్రాప్ డేటా ఆధారంగా, గ్రామంలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయా? లేవా? అన్నవి చూడాలి. ఉభయ గోదావరి జిల్లాలు: ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గుర్రపు డెక్కతో కాలువలు పూడుకు పోయాయి, వాటిని తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్ డ్యామ్ పనులు జరుగుతాయి కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ 1 తర్వాత నీటి సరఫరా ఆగిపోతుంది. అందువల్ల డిసెంబరు 31 లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ, ధ్యాస పెట్టాలి. అందుకోసం రైతులతో మాట్లాడాలి. ఆ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు కూడా చొరవ చూపాలి. -
స్థానిక ఎన్నికలు: రమేష్‌కు తొందరెందుకు?
సాక్షి, తాడేపల్లి : ఒక ప్రభుత్వంగా ప్రజలందరి బాధ్యత తమపై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దంటున్నామని.. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అన్నది అందరికీ తెలిసిందేనని, 90 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒకటీ రెండు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, వేల కేసులు ఉన్నపుడు ఎన్నికలు ఎలా పెడతారు?. అసలు ఎన్నికల నిర్వహణకు ప్రాతిపదిక ఏమిటి?. ఒక పక్క చీఫ్ సెక్రటరీ ఎన్నికలు నిర్వహించలేము అని అంటుంటే.. రమేష్ కుమార్ గారికి తొందరెందుకు?. (నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని) కోవిడ్ అంతా తగ్గిన తర్వాత ఎన్నికలు జరగాలని మేము ప్రభుత్వం తరపున భావిస్తున్నాం. ఆ రోజే ఎన్నికలు పూర్తి చేసి ఉంటే సరిపోయేది. వాయిదా వెనుక ఉద్దేశాలు, నిమ్మగడ్డ వ్యవహార శైలీ ఆ తర్వాత మాకు అవగతం అయ్యింది. ఒక ప్రభుత్వంగా ప్రజలు, ఉద్యోగుల బాధ్యత మాపై ఉంది. ఒక రాజకీయ పార్టీని ఫ్యాక్షనిస్టు పార్టీ అని మాట్లాడిన వ్యక్తి నిష్పక్షపాతంగా ఉంటాడని మేము భావించడం లేద’’ని పేర్కొన్నారు. (తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్) -
మే నాటికి పనులు పూర్తవ్వాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి అంశంపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మే నాటికి పనులు పూర్తవ్వాలి సమీక్షా సమావేశంలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. అంతేగాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు. అదే విధంగా, ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్ (అప్లెక్స్ లెవల్)తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్ అదేశించారు. (చదవండి: మోదీ, షాలకు సీఎం జగన్ కృతజ్ఞతలు) పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్‌లో నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ వారిని ఆదేశించారు. అవుకు టన్నెల్-2 అవుకు టన్నెల్-2 పనుల్లో ఫాల్ట్ జోన్లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అదే విధంగా, అవుకు మూడో టన్నెల్‌కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించగా... సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఉద్దేశించిన ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) రిజిస్ట్రేషన్ పూర్తైందని తెలిపిన అధికారులు అందుకు సంబంధించిన లోగోను చూపారు. ఇందుకు అంగీకారం తెలిపిన సీఎం జగన్... ఈ మేరకు ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరులో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసిన విషయాన్ని తెలపగా... ఇప్పటికైనా పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు నింపగలిగామని అన్నారు. అదే విధంగా గండికోటలో కూడా ప్రస్తుత నీటి నిల్వ 18 టీఎంసీలు.. గతంలో కంటే అధిక స్ధాయిలో నిల్వచేయగలిగామని అధికారులు తెలపగా... 20 టీఎంసీల వరకు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. -
చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మతాలు, కులాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హితవు పలికారు. ప్రభుత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ కులాలను, మతాలను అడ్డుపెట్టుకోరని, చంద్రబాబులా అధికారం కోసం మనుషుల మధ్య చిచ్చుపెట్టాలని చూడలేదంటూ చురకలు అంటించారు. నంద్యాల షేక్ అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తుకువస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ఇక నంద్యాల ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్, సామూహిక ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, టీడీపీకి చెందిన రామచంద్రరావు మాత్రం నిందితులకు బెయిలు ఇప్పించారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకోని బాబు ఇప్పుడు ఈ ఘటనపై ముసలి కన్నీరు కారుస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు, జూమ్ యాప్ ద్వారా సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.(చదవండి: నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్) ఆ సబ్సిడీని కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి మోకాలడ్డుతున్న చంద్రబాబు తీరుపై కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కోలో 13 లక్షల ఇల్లు ఎక్కడ కట్టించారో చంద్రబాబు చూపించాలని డిమాండ్ చేశారు. డెబ్బై ఏళ్లు వచ్చినా అబద్ధాలు చెప్పే అలవాటు మానుకోవడం లేదంటూ ఆయనపై మండిపడ్డారు. ‘‘ఇళ్ల కోసం కేంద్రం నుంచి తెచ్చిన సబ్సిడీని కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన ఘనత బాబుకే చెల్లుతుంది. ఇక కట్టిన 2లక్షల ఇళ్లకు కనీసం వసతులు కల్పించలేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే వాటిని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడు. సంక్రాంతికి టిడ్కో ఇళ్లను ప్రజలకు ఎలా అప్పగిస్తారు. పేదల అవసరాలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటారా’’ అని చంద్రబాబు, టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. కోర్టుల్లో వేసిన స్టేను చంద్రబాబు వెకేట్ చేస్తే డిసెంబర్ 21 సీఎం జగన్ పుట్టిన రోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. 25 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల మంది ఇళ్ల స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకోవద్దు. ఇప్పటికైనా కేసులను ఉపసంహరణ చేసుకోవాల్సిందిగా చంద్రబాబును కోరుతున్నాం. ఇళ్ల పట్టాల కేసుల విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకోక పోతే టిడ్కో ఇళ్ల ముందే నేను ఆందోళన చేపడతా’’అని కొడాలి నాని హెచ్చరించారు. -
ప్రభుత్వ లక్ష్యం అదే: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కాలేయ మార్పిడి, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అత్యాధునిక, ఖరీదైన వైద్యం కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రులను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రదర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.35 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డులు (క్యూఆర్ కోడ్‌తో సహా) జారీ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను గుర్తించామని, వాటిలో 716 చికిత్సలు అందుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రూ.1000 ఖర్చు దాటిన ప్రతి వైద్యం తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో భాగంగా ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు, ఎన్ఏబీహెచ్ గుర్తింపు, ఏఎన్ఎంల పాత్ర, టెలిమెడిసిన్ కాల్ సెంటర్ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.(చదవండి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్) ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఆరోగ్యశ్రీ ప్యానెల్లో ఉన్న ప్రతి ఆస్పత్రి పూర్తి ప్రమాణాలు పాటించాలి. అదే విధంగా ఎన్ఏబిహెచ్ (నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్) గుర్తింపు పొందాలి. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఆ గుర్తింపు పొంది ఉండాలి. ఏఎన్ఎంల పాత్ర ఆరోగ్యశ్రీకి గ్రామాల్లో ఏఎన్ఎంలు రెఫరల్ పాయింట్, అందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలి, వ్యాధులపై అవగాహన కల్పించాలి. ట్యాబ్‌ల వినియోగంపై ఏఎన్ఎంలకు మరింత అవగాహన కల్పించాలి. అవసరమైతే రోగి దగ్గర వివరాలు తీసుకుని, టెలి మెడిసిన్ ద్వారా వైద్య నిపుణులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పొందాలి. కోవిడ్‌కు సంబంధించి టెలి మెడిసిన్ కొనసాగుతోంది. అదే విధంగా ఇతర వ్యాధులకు సంబంధించి కూడా ఆ సదుపాయాన్ని విస్తరించాలి. టెలి మెడిసిన్ కాల్ సెంటర్ టెలి మెడిసిన్ కాల్ సెంటర్‌ను మరింత బలోపేతం చేయాలి. అక్కడ రోజంతా వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి. రోగులు, ఏఎన్ఎంలు ఫోన్ చేస్తే వెంటనే అటెండ్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ వ్యవస్థలో మిస్డ్ కాల్ ఇస్తే, కాల్ సెంటర్ వాళ్లు ఫోన్ చేస్తున్నారు కాబట్టి, రోగి నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ వెంటనే కాల్ సెంటర్ కాల్ బ్యాక్ చేయాలి. 5 నిమిషాల్లోపు కచ్చితంగా ఆ ఫోన్ వెళ్లాలి. లేకపోతే దాని వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. అన్ని చోట్ల ‘టు వే’ ఇంటరాక్షన్ సదుపాయం ఉండాలి. అందుకు అవసరమైన నెట్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఉంటే రోగిని టెలి మెడిసిన్ సెంటర్లో ఉండే వైద్యుడికి నేరుగా చూపించవచ్చు. తద్వారా వెంటనే వైద్య సహాయం చేయొచ్చు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు మంచి ఆహారం, డిశ్చార్జ్ తర్వాత రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా.. ఈ మూడు ఆరోగ్యశ్రీ పథకం ప్యానెల్లో ఉన్న ఆస్పత్రులలో (ప్రభుత్వ ఆస్పత్రులు సహా) పక్కాగా అమలు కావాలి. అదే విధంగా ఆరోగ్యమిత్ర (హెల్ప్ డెస్క్)లు రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలి. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: తైవాన్ ప్రతినిధి బృందం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానించినందుకు తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్(టీఈసీసీ) డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ పర్యటనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తైవాన్‌కు చెందిన వివిధ కంపెనీలతో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌తో పాటు ఆ దేశానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. (చదవండి: తప్పుడు ప్రచారంపై టీడీపీ నేతలు ఇప్పుడేం చెప్తారు..?) ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇక సీఎం జగన్ హామీపై హర్షం వ్యక్తం చేసిన బెన్ వాంగ్, తైవాన్ ప్రతినిధులు... రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ రంగాలు, పరిశ్రమల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మాథ్యూ చిన్, ఇండియా ఫాక్స్‌లింక్ డైరెక్టర్ ఎరిక్ ని, అపాచీ పుట్‌వేర్‌కు చెందిన గవిన్ ఛాంగ్, పీఎస్ఏ వాల్సిన్ ప్రాజెక్టు మేనేజర్ నిరంజన్ ప్రకాష్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఆ శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఏడేళ్ల బిందును అక్కున చేర్చుకున్న డీజీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన ఏడేళ్ల బిందును డీజీపీ గౌతమ్ సవాంగ్ అక్కున చేర్చుకున్నారు. నూతన వస్త్రాలు, టెడ్డీబేర్ ఇచ్చి చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. తన యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయి వచ్చేంత వరకు బిందును అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా గుర్తించిన పిల్లలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం కాసేపు ముచ్చటించారు. అదే విధంగా రెస్క్యూ చేసిన బాల బాలికలతో పాటు తాడేపల్లి గుడ్ షప్పర్డ్ కరుణామయి హోమ్‌లోని పిల్లలకు స్టడీ కిట్ అందజేశారు. (చదవండి: ఉత్తరాంధ్ర, సీమ వాసుల అభ్యర్థన తిరస్కృతి ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వేల మంది బాల బాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ చేసిన వీధి బాలలు, బాల కార్మికులను చైల్డ్ వెల్ఫేర్ హోమ్ లకు తరలించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పజెపుతామని అన్నారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు పెట్టిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్.. వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను బడులకు పంపాలని విజ్ఞప్తి చేశారు. -
గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: గత పాలకుల వల్లే ఆరేళ్లుగా విభజన అన్యాయం జరిగిందని, రాష్ట్రం వెనుకబాటుతో కున్నారిళ్లిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్రాన్ని సీఎం జగన్ గాడినపెట్టారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్.. దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం గుర్తుంచుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. ‘‘తెలుగువారందరి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సీఎం జగన్ నేతృత్వంలో సఫలం చేస్తాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ప్రజల్లో మమేకం అయ్యి, అభివృద్ధి దిశగా కర్తవ్య దీక్షకు పునరంకితం అవ్వాలి. సీఎం జగన్ వెంట మడమ తిప్పని సైనికులు గా పని చేయాలని’’ ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1) -
మీ బిడ్డగా.. గర్వంగా చెబుతున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అక్టోబరులో జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని, ఇందుకు సంబంధించి నవంబర్‌లోపే రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేసేందుకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం.. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరులో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే.. రబీలోగా పరిహారం ఇవ్వగలిగితే.. రైతుకు మేలు కలుగుతుందనే ఆలోచనతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత చెల్లింపుల కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, హోం మంత్రి మేకతోటి సుచరిత, వేణుగోపాల కృష్ణ, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ రైతు భరోసా సాయం) గతానికి ఇప్పటికీ తేడా చూడండి... ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘2014లో పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకూ ఇవ్వలేదు. 2015లో ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2016 నవంబరులో ఇచ్చారు. 2016 ఖరీఫ్ లో నష్టం జరిగితే 2017 జూన్‌లో ఇచ్చారు. 2017 రబీలో నష్టం జరిగితే.. 2018 ఆగస్టులో ఇచ్చారు. 2018 ఖరీఫ్‌లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో పంట నష్టపరిహారం చెల్లించామని మీ బిడ్డగా, గర్వంగా చెప్తున్నా. రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తీరుకు ఇప్పటికి తేడా గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు తోడుగా నిలబడుతూ.. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిసి, ఈ విషయంపై దృష్టి మరల్చే విధంగా, టీడీపీ నేతలు ట్రాక్టర్లు పట్టుకుని, తామేదో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్మే వరకూ రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 10,641 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. వైఎస్సార్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు ఉచితంగా వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం రైతన్నలకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్‌కు సంబంధించిన దాదాపు రూ.8,655 కోట్లు 14 నెలల బకాయిలు పెడితే.. రైతన్నల కోసం చిరునవ్వుతో చెల్లించాం. ధాన్యం సేకరణ కింద రూ. 960 కోట్లు మహానుభావుడు చంద్రబాబుగారు బకాయిపెడితే.. వాటినికూడా చెల్లించాం. విత్తనాల సబ్సిడీకింద దాదాపు రూ.384 కోట్లు బకాయి పెడితే వాటిని కూడా రైతుల కోసం కట్టాం రైతులకు వడ్డీలేని రుణాల కింద 2014 నుంచి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన రూ. 1046 కోట్లు కూడా రైతుల మీద ప్రేమతో ఇచ్చాం. 9 గంటలపాటు రైతులకు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి రూ.1700 కోట్లు వెచ్చించి ఫీడర్ల కెపాసిటీ పనులు 90శాతం పూర్తిచేశాం. మిగిలిన వాటిలో కూడా పనులు త్వరలో పూర్తి. వైఎస్సార్ సున్నావడ్డీకింద రూ.1లక్ష వరకూ రుణం తీసుకున్నవారికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. అలాగే పంట బీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. కేవలం రైతు రూ.1 మాత్రమే చెల్లిస్తే చాలు. రూ. 1030 కోట్ల రూపాయలను ప్రభుత్వమే ప్రీమియం కింద చెల్లిస్తోంది. 13 జిల్లాస్థాయి అగ్రి ల్యాబులతోపాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబులు ఏర్పాటుచేసి ముందుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షిస్తున్నాం. కోవిడ్ సమయంలో పంటలను కొనుగోలు చేశాం. దాదాపు రూ.3వేల కోట్ల రూపాయలను పంటలకొనుగోలు కోసం ఖర్చు చేశాం. అధిక వర్షాలు కారణంగా ఈ ఏడాది పంట నష్టం జరగడం కాస్త బాధ కలిగినప్పటికీ, మంచి వర్షాలు పడ్డాయి. డ్యాంలు, చెరువులు బాగా నిండాయి. రబీలో గొప్పగా పంటలు పండాలని ఆశిస్తున్నాం. -
‘బాధితులందరికీ త్వరలోనే సాయం’
సాక్షి, తాడేపల్లి: వరద బాధితులందరికీ త్వరలోనే సాయం అందుతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, ఇప్పటికే ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సోమవారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు.‘‘సీఎం వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. నష్టపోయిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. భారీగా పంటలు నీటమునిగాయి. కొన్నిచోట్ల ఇళ్లు కూడా మునిగిపోయాయి. వరద నీరు తగ్గగానే ఆయా ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తాం’’అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్లకు పైగానే నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అందరికీ పరిహారం: మంత్రి కన్నబాబు వరి, అపరాలు, పత్తి, చిరుధాన్యాలు, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పంట నష్టాలపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోందని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టంపై పూర్తి అంచనా వేయడం వీలవుతుందన్నారు. ‘‘భారీ వరదలతో కాల్వలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల పంట పొలాలు, కాలనీలు నీట మునిగాయి. ముంపు బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు బాధితులకు ఆహారం, తాగునీటి సదుపాయం కల్పించాం. నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, ఆయిల్ పంపిణీ చేస్తాం. వరదల ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాం’’అని కన్నబాబు తెలిపారు. -
సజ్జల క్లారిటీ ఇచ్చారు: అంబటి
సాక్షి, తాడేపల్లి: పోలీసు భద్రత నడుమ ఆలయాలను ధ్వంసం చేయించిన చంద్రబాబు నాయుడుకు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వ హయాంలో విజయవాడలో గుళ్లను నాశనం చేసి, దేవుడి విగ్రహాలను మున్సిపాలిటీ చెత్తబండిలో వేసిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతర్వేదిలో రథం దగ్దమవడం, మరోచోట దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావడం దురదృష్టకరమన్న అంబటి, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కానీ మతం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వంపై బురదజల్లి లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: అధికారంలో లేమనే బాధతోనే ఇదంతా..) సజ్జల క్లారిటీ ఇచ్చారు.. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించటం పూర్వజన్మ సుకృతమని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు. కానీ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోందని, అసమర్థ ప్రతిపక్షం సీఎం జగన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తూ హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక గతంలో ఇద్దరు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినపుడు లేని డిక్లరేషన్‌ను, ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకు వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు పోయేకాలం వచ్చిందని, ప్రతిపక్షం మాటలు ఎవరూ నమ్మవద్దని అంబటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ప్రధాని గురించి ఎవరు ఇలా మాట్లాడినా తప్పేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. అదే విధంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా తీరుపై కూడా అంబటి మండిపడ్డారు. చంద్రబాబు తాబేదార్ల పత్రికలు పిచ్చి రాతలు రాస్తూ, ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విషాదం: కొడుకు వీడియో తీస్తుండగానే..
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): తాడేపల్లి కనకదుర్గవారధి మీద ఓ వృద్ధుడు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తానంటూ చెప్పి అమాంతం కృష్ణానదిలో దూకి గల్లంతైన ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గల్లంతైన యం.దుర్గాప్రసాద్ తమ్ముడి కొడుకు సుదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అయిన దుర్గాప్రసాద్, ఆయన స్నేహితులు ముగ్గురు, కొడుకు వరసైన సుదీప్ తాడిగడప నుంచి కనకదుర్గవారధిపైకి వచ్చి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు కుంకుమ, పసుపు, పూలు చల్లుదామని మొదట అందరూ కలిసి కృష్ణానదిలో చేతిలో పట్టుకున్న పూజా సామగ్రిని వదిలిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం పెదనాన్న అయిన దుర్గాప్రసాద్ నేను ఒక్కణ్ణే పూజ చేస్తాను, వీడియో తియ్యి అంటూ చెప్పి తన జేబులో ఉన్న సూసైడ్ లెటర్‌ను, మిగతా వస్తువులను, సెల్‌ఫోన్‌ను కొడుక్కు ఇచ్చి పూలు చల్లుతూ వీడియో తీస్తుండగానే అమాంతం కృష్ణానదిలోకి దూకినట్లు తెలియజేశాడు. సూసైడ్‌నోట్‌లో “నా చావుకు ఎవరి ప్రమేయం లేదు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చనిపోతున్నాను. నా తమ్ముడు అడ్రస్ మన్నె జనార్ధనరావు, తాడిగడప, విజయవాడ’అని రెండు ఫోన్ నంబర్లు రాసి, సంతకం పెట్టి ఉంది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రేపు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఖారారైంది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న ఆయన, బుధవారం వరకు అక్కడే ఉండనున్నారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేసి, ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.(చదవండి: ఈనెల 23న తిరుమలకు సీఎం వైఎస్ జగన్) ఇదిలా ఉండగా.. ఈ నెల 23న సీఎం జగన్ తిరుమలను సందర్శించనున్నారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళతారు. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదే విధంగా 24న ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంచామని, సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు ఉండాలని, ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు. అదే విధంగా.. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్ కోడ్ కార్డులు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ తన క్యాంపు ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, కోవిడ నిర్ధారణ పరీక్షలు, వైద్య సదుపాయాలు తదితర అంశాల గురించి సమావేశంలో తెలిపారు. (చదవండి: కొత్త జిల్లాలతో సూక్ష్మ స్థాయికి చేరనున్న ‘రాజ్యం’) ఈ క్రమంలో అన్ని ఆస్పత్రులలో ప్రమాణాలు పెరిగి, మంచి గ్రేడింగ్ వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్లో అడిగే ప్రశ్నలు మరింత స్సష్టంగా ఉండాలని, ముఖ్యంగా వైద్య సేవలు, శానిటేషన్‌పై పూర్తి వివరాలు ఆరా తీయాలని, ఆ మేరకు ప్రశ్నలు మార్చాలని సూచించారు. ఇక హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కిట్లు ఇవ్వాలన్న సీఎం, ఆ మేరకు అధికారులు పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని కోవిడ్ ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీ నిర్వహించాలని, దాతలను ప్రోత్సహించే విధంగా రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యమిత్రలు–6 బాధ్యతలు రాష్ట్రంలోని 540 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు కాగా, మిగిలిన 27 ఆస్పత్రుల్లో కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయని సమీక్షా సమావేశంలో ఆరోగ్యశ్రీ అధికారులు వివరించారు. ఇందుకు స్పందనగా.. రాష్ట్రంలోని అన్నిఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో వెంటనే ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేయాలన్నసీఎం జగన్ వారిని ఆదేశించారు. ఆరోగ్య మిత్రలు ప్రధానంగా 6 బాధ్యతలు నిర్వర్తించాలని నిర్దేశించారు. ఆస్పత్రిలో వైద్య మౌలిక సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారంలో నాణ్యత, శానిటేషన్, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందేలా చూడడం, పేషెంట్ కేరింగ్.. ఈ 6 అంశాలను ఆరోగ్యమిత్ర (హెల్ప్ డెస్క్)లు చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో విలేజ్ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా ఉంటాయని, ఆ తర్వాత కోవలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు రెఫరల్‌గా ఉంటాయని తెలిపారు. ఆరోగ్యమిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్పత్రి బయట, లోపల తప్పనిసరిగా ప్రదర్శించాలని, రెండు వారాల్లోగా అన్ని ఆస్పత్రులలో వారి నియామకాలు పూర్తి కావాలని నిర్దేశించారు. ఆస్పత్రుల గ్రేడింగ్ ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి గ్రేడింగ్ తప్పనిసరి అన్న సీఎం జగన్, అక్కడ సదుపాయాలు, సేవల ఆధారంగా వాటి నిర్ధారణ జరుగుతుందని, అన్ని ఆస్పత్రులు ఏ–కేటగిరీలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు 6 నెలల సమయం ఇవ్వాలని, ఆలోగా అవి ప్రమాణాలు పెంచుకోకపోతే జాబితా నుంచి తొలగించే అంశం పరిశీలించాలని సూచించారు. అదే విధంగా అన్ని ఏ–కేటగిరీ ఆస్పత్రులు ఏడాదిలోగా ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందాలని నిర్దేశించారు. జిల్లా స్థాయిలో ఆరోగ్యశీ పథకం సమన్వయ బాధ్యతలను ఇక నుంచి ఒక జేసీకి అప్పగించాలని సీఎం ఆదేశించారు. మెగా వైద్య శిబిరాలు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో్ ఆరోగ్య ఆసరా కింద సాధారణ కాన్పుకు ఇక నుంచి రూ.5 వేలు, అదే విధంగా సిజేరియన్ కాన్పుకు రూ.3 వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా గతంలో మాదిరిగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఆ శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆ తర్వాత వైద్య సదుపాయాల కల్పనపై ఎస్ఓపీ రూపొందించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడున్న 11 టీచింగ్ ఆస్పత్రులతో పాటు, కొత్తగా ఏర్పాటు కానున్న 16 ఆస్పత్రులు, ఇంకా ఐటీడీఏల పరిధిలో ఏర్పాటవుతున్న అని ఆస్పత్రులలో తప్పనిసరిగా ప్రమాణాలు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారం, శానిటేషన్తో పాటు, యాంబియెన్స్ (ఆస్పత్రి చూడగానే చక్కగా ఉండేలా) బాగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అవే ప్రమాణాలు ఉండాలని ఆయన నిర్దేశించారు. తగ్గుతున్న కేసులు రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,84,371 కోవిడ్ పరీక్షలు చేయగా, ఇప్పుడు 94,453 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు తెలిపారు. ఇక పాజిటివిటీ రేటు 12.31 శాతం కాగా, రికవరీ రేటు 84.48 శాతంగా ఉందని, మరణాల రేటు కూడా కేవలం 0.86 శాతం మాత్రమే నమోదవుతోందని చెప్పారు. బెడ్లు–రోగులు రాష్ట్రంలో ఆక్సీజన్ బెడ్లు 18609 ఉండగా, వాటిలో 5723 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఆక్సీజన్ సదుపాయం లేని బెడ్లు 15060 ఉండగా, వాటిలో 9777 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఐసీయూ బెడ్లు 4469 ఉండగా, వాటిలో 2246 మంది చికిత్స పొందుతున్నారని, 2,522 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా, 178 రోగులు వాటిపై చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోవిడ్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నాటికి 11,01,625 శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా, 1,56,323 కేసులు పాజిటివ్‌గా తేలాయన్న అధికారులు, 17వ తేదీన ఒక్క రోజే 75 వేల పరీక్షలు చేశామని చెప్పారు. కోవిడ్ చికిత్స కోసం అన్ని జిల్లాలలో పూర్తి సదుపాయాలు ఉన్నాయని, ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రులు–బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్స కోసం 268 ఆస్పత్రులను సిద్ధం చేయగా, వాటిలో 230 ఆస్పత్రులను ఇప్పటి వరకు వినియోగించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక అన్ని ఆస్పత్రులలో 4469 ఐసీయూ బెడ్లు, ఆక్సీజన్ సదుపాయం ఉన్న నాన్ ఐసీయూ బెడ్లు 18,609, నాన్ ఐసీయూల్లో ఆక్సీజన్ సదుపాయం లేని బెడ్లు 15,060 ఉన్నాయని, ఆ విధంగా అన్ని కోవిడ్ ఆస్పత్రులలో 38,025 బెడ్లు అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 36,232 బెడ్ల వినియోగం జరిగిందని తెలిపారు. కాగా, ఇప్పుడు కోవిడ్ ఆస్పత్రులలో 17,924 మంది రోగులు, కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)లో 15,625 మంది రోగులు చికిత్స పొందుతుండగా, హోం ఐసొలేషన్‌లో 60,905 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. సిబ్బంది–నియామకాలు అన్ని ఆస్పత్రులలో మంజూరు చేసిన పోస్టులన్నీ వెంటనే భర్తీ అయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. నర్సింగ్ ఆర్డర్లీస్ (మేల్, ఫిమేల్), శానిటేషన్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శిక్షణ నర్సులకు సంబంధించి అని జిల్లాలలో 20,415 పోస్టులకు అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు 12,014 మంది నియామకం జరిగిందని అధికారులు చెప్పారు. సర్వీసుల ఇంటిగ్రేషన్–గ్రేడింగ్ ప్రజలకు అత్యంత మెరుగైన సేవలందించేలా 104, 108, 14410 కాల్ సెంటర్ల ఇంటిగ్రేషన్ చేయడం జరిగిందన్న వారు, ఆస్పత్రులు రేటింగ్ కోసం ప్రత్యేక మెథడాలజీ కూడా అనుసరిస్తున్నామని వెల్లడించారు. ఐసీయూ బెడ్లు మొదలు, వైద్యం, ఆహారం, శానిటేషన్ వంటి అన్ని అంశాల్లో ప్రమాణాలతో ఆ మెథడాలజీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. మాస్కులు-పీపీఈ కిట్లు ఎన్-95 మాస్కులు 5,21,350. పీపీఈ కిట్లు 7,61,097 రాష్ట్రంలో అందుబాటులో (స్టాక్) ఉన్నాయని అధికారులు తెలిపారు. అదే విధంగా ప్లాస్మా థెరపీకి సంబంధించి, 9 జిల్లాలలోని ప్రధాన ఆస్పత్రులలో మొత్తం 308 కాన్వలసెంట్ ప్లాస్మా సేకరించగా, వాటిలో థెరపీ కోసం ఇప్పటి వరకు 265 వినియోగించినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఆరోగ్యశ్రీ క్యూఆర్ కోడ్ కార్డులతో పాటు, యాప్‌పై సమావేశంలో అధికారులు వివరించారు. ఆ కార్డులో రోగి బ్లడ్ గ్రూప్ సమాచారం కూడా ఉండాలన్న సీఎం జగన్, ఆ కార్డుల పంపిణీలో గ్రామ సచివాలయాల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలని, చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలని ఆదేశాలు జారీ చేశారు. సజావుగా భూసేకరణ చేపట్టి, సహాయ, పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.(చదవండి: బెస్ట్ సీఎం వైఎస్ జగన్: నటుడు అలీ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలి. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలి’’అని సూచించారు. ‘‘చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. ఈ విషయం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. వారికి నచ్చచెప్పాలి. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలి’’అని అధికారులకు సూచించారు. (చదవండి: విద్యలో విప్లవం) ప్రాజెక్టుల పురోగతి సమీక్షా సమావేశంలో భాగంగా.. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని, అదే విధంగా... వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు–2వ సొరంగం పనులు కూడా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే మధ్యలో సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరిందని పేర్కొనడంతో, నిపుణుల కమిటీ సలహా ప్రకారం అవసరమైన పనులు చేపట్టి పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఇక ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్లో నల్లమల అడవుల్లో కొండలపై నుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార–నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని సమీక్షలో పేర్కొన్నారు. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇక బీఆర్ఆర్ వంశధార స్టేజ్–2 ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని వెల్లడించారు. మహేంద్ర తనయ రిజర్వాయర్ శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని కూడా ప్రాధాన్యత కింద పరిగణించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ మేరకు పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రాజెక్టులోభాగమైన గజపతినగరం బ్రాంచ్ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సమీక్షా సమావేశంలో వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఏ మార్పు లేదని, ఆ దిశలోనే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ ఇప్పటికే పూర్తైందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కోవిడ్ రావడం వల్ల స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని వివరించారు. ఉద్యోగుల సర్దుబాటు జల వనరుల శాఖలో పనులు కొనసాగుతున్న చోట్ల అవసరాలను బట్టి, అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని, డ్యామ్‌లు, కాల్వలు, వాటర్ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవాలని నేటి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతి ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు. కాగా ఉయ్యూరు నుంచి గన్నవరం వైపు బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషా రామ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. బాధితుడిని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.(చదవండి: మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు) చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం -
జనవరి 1 నుంచి ఏపీలో సమగ్ర భూ సర్వే
సాక్షి, తాడేపల్లి: భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టి 2023, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ప్రజెంటేషన్ సమర్పించారు.(చదవండి: సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన) చదవండి: ఏపీ: రాష్ట్రమంతా భూముల రీసర్వే -
‘చేయూత’ డబ్బుపై బ్యాంకులకు హక్కు లేదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. రూ.22వేల కోట్ల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా టీడీపీ నాయకుల తీరు కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.(చదవండి: కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లు.. సీఎం జగన్ సీరియస్) పనులు వేగంగా జరగాలి: సీఎం జగన్ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రతి జిల్లాలో ప్రతి వారం రూ.10 కోట్ల మెటీరియల్ కాంపౌనెంట్ పనులు జరగాలి. పనులు వేగంగా జరగాలి’’అని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. అదే విధంగా పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీ పాఠశాలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 55వేల అంగన్వాడీల్లో నాడు-నేడు కింద పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలనే ఆలోచన ఉన్నందున.. అంతకంటే ముందే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.(చదవండి: అవినీతిపై బ్రహ్మాస్త్రం) వైఎస్సార్ చేయూత, స్వయం సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సహాయం అందించామని.. బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి.. హిందూస్థాన్, యూనిలీవర్, ఐటీసీ, పీ&జి, రిలయన్స్, అమూల్.. అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుందని తెలిపారు. మహిళలు ఎంపిక చేసుకున్న జీవనోపాధి మార్గాల్లో చేయూతనివ్వాలని.. వారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి:‘ చేయూత’తో స్వయం సమృద్ధి) ఎరువులు పంపిణీ చేయండి: సీఎం జగన్ మండలాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎరువులు పంపిణీ చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా నూటికి నూరు శాతం ఇ-క్రాపింగ్ పూర్తి చేసి.. వ్యవసాయ యాంత్రీకరణపై కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘రైతుల గ్రూపులను ఏర్పాటు చేసి యంత్రాలను డెలివరీ చేయాలి. మండల స్థాయిలో కూడా రైతులతో గ్రూపులను ఏర్పాటు చేయాలి. వర్షాలు బాగా పడినందున ఎరువుల డిమాండ్ పెరుగుతుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేయాలి. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి’’అని ఆదేశించారు. ‘‘మల్టీపర్పస్ ఫెసిలిటీస్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా గోడౌన్లు, పంట ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. పశువుల శాఖ, కలెక్షన్ సెంటర్ కార్యకలాపాల కోసం వసతులు ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు. -
మోడల్ గృహాన్ని పరిశీలించిన సీఎం
సాక్షి, అమరావతి: పేదల సొంత ఇంటి కల నెరవేర్చడంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం బోటు యార్డు వద్ద గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన మోడల్ గృహాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం పరిశీలించారు. హాలు, బాత్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్, ఫ్లోరింగ్, బయట వరండాను, మెటీరియల్ నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి వినియోగించిన మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. – అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటిని నాణ్యతతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. – 17,000 వైఎస్సార్ జగనన్న కాలనీలలో పక్కా ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతలో 15 లక్షలు, రెండో విడతలో మరో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఇళ్లు మోడల్ హౌస్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి మోడల్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారని, రాష్ట్రంలో ఇదే తరహాలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి ఉన్నట్లేనని అన్నారు. -
‘సంక్షేమ యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షషులు’
సాక్షి, తాడేపల్లి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ చేయూత’ పధకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళలు తమ కష్టాలను సీఎం జగన్‌కు చెప్పుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా మహిళలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల మహిళకు ‘వైస్సార్ చేయూత’ ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. 23లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. ఓట్లు కొనడం కోసం ఎన్నికలు ముందు ‘పసుపు కుంకుమ’ పథకాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారని మండిపడ్డారు. కానీ, ఆ పథకాన్ని ప్రవేశ పెట్టిన బాబుకు 23 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సంక్షోభంలో సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని బాబు తన కొడుకు క్షేమం కోసం పాటుపడ్డాడని దుయ్యబట్టారు. ఇష్టానుసారంగా రాసే మీడియా బాబు చేతిలో ఉండడంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ చేయూతపై విమర్శలు చేస్తే బాబుకు మళ్లీ మహిళలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారని విమర్శించారు. మహిళల ఇంటికి బంగారం పంపిస్తామని చెప్పి బాబు బ్యాంక్‌ల నుంచి నోటీసులు పంపించారని విరుచుకుపడ్డారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలు జగనన్న తమకు తోడుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బీసీలను అనేక రకాలుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పురాణాల్లో రాక్షషులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. బీసీ సంక్షేమంపై టీడీపీ నేతలతో చర్చకు తాము సిద్ధమని తెలిపారు. బీసీల వెన్ను చంద్రబాబు నాయుడు విరిచారని మండిపడ్డారు. -
తమ్ముడూ బాగున్నారా.. అన్నా ధన్యవాదాలు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారికతకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల లబ్ధిదారులతో మాట్లాడారు. ('వైఎస్సార్ చేయూత' పథకం ప్రారంభం) ఎన్నో పథకాలు.. ధన్యవాదాలు అన్నా సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గతంలో లబ్ది పొందిన ఒంగోలుకు చెందిన పద్మావతి తాజాగా వైఎస్సార్ చేయూత ద్వారా మరోసారి ఆర్థిక సాయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ‘‘ కరోనా కష్టకాలంలో ఏ ఇంట్లో ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్ ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఇచ్చారు. పుట్టింటి వాళ్లు కూడా చేయని సహాయాన్ని దేవుడిచ్చిన అన్నగా మీరు మాకు చేస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది రాష్ట్రమంతటా లబ్దిపొందుతున్నారు, వాళ్లలో నేను ఒక లబ్ధిదారునైనందుకు ఎంతో సంతోషపడుతున్నాను. కేవలం ఇవే కాదు.. స్వతంత్రంగా జీవనోపాధి ఏర్పాటు చేసుకుని పెద్ద, పెద్ద సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కరోనా కష్టకాలంలో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి గడపకూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రూ.1000 పంపిణీ చేశారు. అవే మాకు పదివేలుగా ఆ రోజుల్లో ఉపయోగపడ్డాయి. ఇవే గాకుండా ఏ ఇంట్లో ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్ ప్రతి ఒక్కరికీ రెండు సార్లు ఇచ్చారు. వసతి దీవెన కింద మా బిడ్డలకు రూ.10 వేలు ఇచ్చారు. కరోనా కష్టకాలంలో మా వారు సెలూన్ షాపులో పనిచేసే అవకాశం లేదు, ఆ సమయంలో ‘జగనన్న చేదోడు పథకం’ కింద రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. గ్రూపుల్లో సున్నావడ్డీ కింద లబ్ధిపొందాం. వైస్సార్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు వచ్చే నెల 1 లక్షా 77 వేలు 400 రూపాయలతో పొందబోతున్నాం. నాకు సొంతంగా రూ.17 వేలు రానున్నాయి. అన్నా.. మాకు ఇళ్లు లేదు, చిన్న రేకుల షెడ్డు, వర్షమొస్తే తడిసిపోవడమే, ఎన్నోసార్లు ఇంటికి దరఖాస్తు పెట్టినా రాలేదు. ఇప్పుడు నా పేరు మీద ఇళ్లు వచ్చింది. చాలా ధన్యవాదాలు. గతంలో పింఛన్ కోసం లైన్లో నిలబడేవారు, ఇప్పుడు ఒకటో తేదీనే మా అత్తయ్య గారికి ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మా బాబు ఫీజు రీయింబర్స్మెంట్ కింద బీటెక్ చేశాడు, లేదంటే చదివించగలిగే స్ధోమత నాకు లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా లబ్ధి పొందాం. ఇవన్నీ మన ప్రభుత్వంలో నేను లబ్ధి పొందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. మరలా మరలా మీరే మాకు సీఎంగా రావాలని , మా జగనన్నే మా మహిళలందరికీ తోడూ, నీడగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నా’’అని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నోటంటా ఒకటే మాట: విజయమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా) మీ లాంటి అన్నదమ్ములు ఉంటే మాకు ఏ లోటూ ఉండదు. అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు, ముసలమ్మలు ప్రతి నోటంటా ఒకటే మాట జగనన్నా, జగనన్నా.. మీరు చేసే మంచి కార్యక్రమాలు వల్లే. మరలా మరలా మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా మిమ్మల్నే గెలిపించుకుంటాం. వైఎస్సార్ చేయూత పథకంలో నేను లబ్ధిదారును. చాలా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పటి నుంచో మేం వెనుకబడి ఉన్నాం. మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. రూ.18750 రూపాయలు మీరు మాకు ఇచ్చారు. నాలుగేళ్లకు రూ.75 వేలు ఇస్తున్నారు. నేను లోన్ తీసుకుని జెరాక్స్ మిషన్ తీసుకున్నాను. దాని మీద నెలకు రూ.3వేలు ఆదాయం వస్తుంది. పిండిమిల్లు పెట్టుకోవాలని చాలా కాలం నుంచి నా కోరిక, అయితే ఆర్ధిక స్ధోమత లేక అది అలాగే ఉండిపోయింది. ఇవాళ ఈ చేయూత పథకం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు ఎల్లవేలలా రుణపడి ఉంటానన్నా. పేదవాడికి ఒకటో తారీఖు వచ్చేసరికి జీతాలిస్తున్నట్లు పింఛన్ ఇంటికే ఇస్తున్నారు. అమ్మఒడి పథకం కింద వేసిన డబ్బులతో పిల్లలను చదివించుకుంటున్నాం. పేదవాళ్లకి ఇంగ్లిషు మీడియం పెట్టినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. కరోనా కాలంలో పనికి వెళ్లడానికి అవకాశం లేని పరిస్ధితుల్లో మీరు ఇచ్చిన వేయి రూపాయలు, ఉచిత రేషన్‌తో మా పిల్లలకు సంతృప్తిగా భోజనం పెట్టుకోగలిగాం. రేషన్ కార్డు కోసం, మరే అవసరాల కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లం, ఇప్పుడు సచివాలయంతో ఊర్లోనే అన్నీ అందుతున్నాయి. ఇళ్ల పట్టాల్లో నా పేరు కూడా ఉంది. ధన్యవాదాలు. మీరు సీఎం అయిన తర్వాతే ఇవన్నీ: లక్ష్మీ దేవి (సిద్దరాంపురం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం) అక్కాచెల్లెమ్మలకు నేను ఉన్నాను, నేను చేయూతనిస్తాను అని మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అంత మంది మహిళలు మనసుల్లో అన్నగా నిల్చిపోయినందుకు మేమంతా మీకు కృతజ్ఞతగా ఉంటాం. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నాకు వితంతు ఫించన్ రూ.2250 వస్తోంది. విజయలక్ష్మీ మహిళా సంఘంలో నేను సున్నా వడ్డీ కింద రూ.3700 తీసుకున్నాను. వచ్చే నెల 11న వైఎస్సార్ ఆసరా కింది నేను రూ.39900 తీసుకోబొతున్నాను. మా కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా కష్టాలు తెలుసుకుని మా కళ్లల్లో కాంతి నింపిన ఘనత మీకే దక్కుతుంది అన్నా. మీరిచ్చిన డబ్బులతో పాటు లోన్ తీసుకుని ఒక షెడ్డు వేసుకుని జెరాక్స్ మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంత మంచి పథకాలను తీసుకొచ్చిన మీకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. నువ్వు ముఖ్యమంత్రి అయినాక పంటలు పుష్కలంగా పండుతున్నాయి. మీ కన్నా దేవుడు మాకు లేడు సార్, మీకు వేలకోట్ల వందనాలు. తమ్ముడూ బాగున్నారా: రత్నం (యూ.కొత్తపల్లి, తూర్పుగోదావరి) తమ్ముడూ బాగున్నారా. మీరు బాగోవాలి, మీరు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. నేను చేయూతకు ఎంపికయ్యాను. నా తమ్ముడు ఉన్నాడు అనే ధైర్యంతో బతకాలనుకుంటున్నా. ఇవాళ మీ అక్కలందరం, మేం చరిత్రలో రాసుకుంటున్న రోజు. మా కోసం, ముందు తరాలకు కూడా మీరే సీఎంగా ఉండాలి. మీరిచ్చిన చేయూతతో డిటిపి సెంటర్, కిరాణ షాపు పెట్టుకుని సాధికారిత సాధిస్తాను. కచ్చితంగా నేను నిలబడతాను, ఆదర్శంగా ఉంటాను. మీరు 3వేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అక్కచెల్లమ్మలు చెప్పిన కష్టాలన్నీ మీరు మనసుతో విన్నారు. మాకు ఏం చేయాలి అని ఆలోచించి, కుటుంబ భారాన్ని మోస్తున్న మా కోసం ఈ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని విధాలుగా అడ్డంకులు ఎదురవుతున్నా మా సంక్షేమం కోసం పాటుపడుతున్న మీరు చేస్తున్న సాయాన్ని దుర్వినియోగం కానియ్యము. మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రంగ్ కంట్రోల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ అండ్ కాపీరైట్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. (చదవండి : ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు) రాష్ట్రంలో 285కిపైగా యూనిట్లు,34వేలకు పైగా జౌషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పరిమితమైన మానవవనరులు, ల్యాబ్ కెపాసిటీ స్వల్పంగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రగ్ కంట్రోల్ కార్యకలపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ జౌషధాలను అరికట్టాల్సిందేని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. (చదవండి : ‘చంద్రబాబూ నమ్మకం ఉంటే.. మా సవాల్ స్వీకరించు’) విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్ధ్యం పెంపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలని సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. థర్ట్ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు. మందు దుకాణాల వద్దే కంప్లైంట్ ఎవరికి చేయాలి? ఏ నంబర్‌కు చేయాలన్న సమాచారాన్ని ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులపైనా కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు.నకిలీ మందుల తయారీ, విక్రయం, నాణ్యతలేని మందుల తయారీ విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు అందించాలని సీఎం జగన్ సూచించారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు డిజిటిల్ పద్ధతిలో నిక్షిప్తం, వీటిపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నివేదన అదించాలన్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు సిబ్బంది పూర్తిస్థాయి పరిజ్ఞానంపై శిక్షణ, కొత్త ప్రొసీజర్స్‌పైన పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు నెలరోజుల్లో పై అంశాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్
-
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. (4 నుంచి ‘సైబర్ సేఫ్’పై ఆన్లైన్ ద్వారా అవగాహన.. ) అదే విధంగా అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం మహిళా సాధికారికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించిన సీఎం జగన్.. అన్ని రంగాల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షలమంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులు పర్మిట్ రూంలను పూర్తిగా తొలగించామని, 33శాతం వైన్‌షాపులను తగ్గించామని తెలిపారు. కాగా ఈ- రక్షాబంధన్ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.(అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
అటవీశాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 3727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు దేశంలోనే అతిపెద్దదని, ప్రస్తుతం అక్కడ 60 పులులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా.. రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పులులు సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. (ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు) అదే విధంగా పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో నాగార్జునసాగర్–శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగలు గొప్ప పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫారెస్టు రిజర్వు నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్ధవంతమైన మానవ వనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఎక్సెలెన్స్ అవార్డును ప్రదానం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషిని సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశంలో నీరబ్‌కుమార్ ప్రసాద్, (అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ సిఎస్) ఎన్. ప్రతీప్ కుమార్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్), అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం
సాక్షి, తాడేపల్లి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రతీ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (పేదలకు ఇళ్ల స్థలాలు రెడీ ) ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు. ‘‘ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉంటాయి. తన వద్ద పలానా పంట ఉందని రైతు ఆర్బీకేకు సమాచారం ఇస్తాడు..ఆ సమాచారం ఆధారంగా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరాలి. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ రూపొందించాలి’’ అని అధికారులను ఆదేశించారు. -
మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి సీతానగరం వద్ద హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని జిల్లాలో కూడా మోడల్ హౌస్‌లు నిర్మించి.. ఇదే తరహాలో పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన ముడిసరుకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని గృహాలకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని.. సిమెంట్ వంటి సరుకులకు తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఇల్లు 2.5 లక్షలు ఖర్చు కావాల్సి ఉంటే సబ్సిడీలతో 1.80 లక్షలకు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు. (అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే: సీఎం జగన్) అదే విధంగా అర్బన్‌లో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణమే జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ మోడల్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పరిశీలిస్తారని వెల్లడించారు. ‘‘పేదలకు తొలుత 25 లక్షల ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. అయితే రాష్ట్రంలో సర్వే నిర్వహించిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఒక బెడ్ రూమ్, హాలు, బాత్ రూమ్, కిచెన్, వరండా ఉండే విధంగా పేదలకు ఇళ్లు నిర్మించనున్నాం’’అని శ్రీరంగనాథరాజు తెలిపారు. -
ప్రజల మనిషి.. ప్రజలు మెచ్చిన మనిషి
సాక్షి, తాడేపల్లి: మహానేత వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను దాదాపు ఏడాదిలో పాలనలోనే అమలు చేసిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ సీఎంగా ఉండడం మన అదృష్టమని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. (వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి) ఈ కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజల మనిషి, ప్రజలు మెచ్చిన మనిషి. చరిత్రలో మర్చిపోలేని నాయకుడు. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకొనే వ్యక్తి. రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకుడు. తన పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను రైతాంగానికి స్వర్ణసీమగా మార్చారు’’ అని రాజన్న పాలనను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, జంగా కృష్ణమూర్తి, రత్నాకర్, లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, నారుమళ్ల పద్మజ, కనకరావు మాదిగ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.(అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు!) -
అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తూ టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని.. కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజే పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అదే విధంగా డీ- పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈ రోజైనా ఇవ్వొచ్చని, అయితే డీ- పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్కాచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి ఆలోచనతో పని చేస్తున్నామని.. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.(దీన్ని బ్లాక్ డేగా చెప్పుకోవాలి: వాసిరెడ్డి పద్మ) ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు, ఇసుక, ఉపాధి హామీ పనులు, కోవిడ్-19 నియంత్రణ చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. ‘‘ఏపీలో 20 శాతం మంది జనాభాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నాం. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పటికైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించాం. పేదల ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశాం. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు.(నిర్లక్ష్యమే కారణం) గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. అందులోనూ రూ. 1300 కోట్లు బకాయిలు పెట్టారు. అర్బన్ హౌసింగ్‌లో 7 లక్షల ఇళ్లు కట్టాలనుకున్నారంట. కేవలం 3లక్షల ఇళ్లు మాత్రమే కట్టడం మొదలుపెట్టారు. అవి కూడా సగంలో ఆపేశారు. ఇందుకు సంబంధించిన బకాయిలు రూ.3వేల కోట్ల రూపాయలు. పేదలకు ఇళ్లను కట్టించాల్సిన ప్రభుత్వం.. ఇంత దారుణంగా వ్యవహరించింది. కానీ, ఇవాళ 30లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేయించి 15 లక్షల ఇళ్లు కట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నాం. ఇవన్నీకూడా ఇళ్లపట్టాలు ఇచ్చిన నెలరోజులకే ప్రారంభిస్తాం. గతానికి ఇప్పటికీ తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. వారికి 90 రోజుల్లోనే పట్టా ఇవ్వాలి.. కలెక్టర్లు ఈ పురోగతిని, కార్యక్రమంలో ముందడుగు వేసే తీరును వదిలిపెట్టవద్దు. కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో మరింత మెరుగ్గా పని చేయాలని.. ఈ పథకంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్లను కోరుతున్నా. లే అవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలు చేపట్టాలి. పట్టా డాక్యుమెంట్లలో ఫొటోలు పెట్టడం, ఫ్లాట్ నంబర్ , హద్దులు పేర్కొనడం చేయాలి. ఈ టైం గ్యాప్‌ను సద్వినియోగంచేసుకోవాలి. చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్ చేయించడం దీనివల్ల వీలవుతుంది. ఇళ్లపట్టాల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేయండి. ఇంకా ఎవరైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోతే.. దరఖాస్తు చేస్తే, ఎంక్వైరీ చేసిన తర్వాత 90 రోజుల్లోనే పట్టా వారికి ఇవ్వాలి. జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే వారిచేత దరఖాస్తు చేయించాలి. నాణ్యమైన ఇసుక సరఫరా చేయాలి.. ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయి. రీచ్‌ల్లోకి నీరు చేరుతోంది. వచ్చే వారం పది రోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్ చేయాలి. ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్ కలెక్టర్లు ప్రభుత్వ కార్యక్రమాల మీద దృష్టిపెట్టాలి. మనకు పనులు చేసుకునే సమయం చాలా స్వల్పంగా ఉంది. హౌసింగ్ గాని, ఆర్బీకేలు కాని, స్కూలు భవనాలకు సంబంధించి నాడు–నేడు పనులు కాని.. వీటన్నింటిపైనా జాయింట్ కలెక్టర్లు ధ్యాసపెట్టాలి. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇసుక డిమాండ్ బ్యాక్‌లాగ్‌ను వెంటనే క్లియర్ చేయాలి. వచ్చే 10 రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో పెద్ద ఎత్తున నిల్వచేయాలి. నాణ్యమైన ఇసుకను కూడా సరఫరా చేయాలి. నాణ్యమైన ఇసుకను పంపిణీ చేయలేకపోతే కలెక్టర్లు, జేసీలకు చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వం వద్ద కూడా మీకు చెడ్డపేరు వస్తుంది. లెక్టర్లు చర్యలు తీసుకుని బ్యాక్లాగ్ తీర్చడంతోపాటు, స్టాక్ యార్డుల్లో పూర్తిగా నిల్వచేయాలి. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపించకూడదు. రోజుకు దాదాపు 22-25 వేల కోవిడ్ టెస్టులు ‘‘రెండు మూడు టెస్టులు కూడా చేయడానికే ఇబ్బంది పడే పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఏకంగా రోజుకు సగటున 22–25వేల టెస్టులు చేయగలుగుతున్నాం. ఇప్పటివరకూ 10లక్షలకు పైగా టెస్టులు చేయగలిగాం. అధికారులకు, కలెక్టర్లకు అభినందనలు. హోం ఐసోలేషన్ చాలా ముఖ్యమైన అంశం. 85శాతం కేసులకు ఇంట్లోనే నయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. హోం ఐసోలేషన్‌కు రిఫర్ చేసే వారికి బాగా చూసుకుంటున్నామా? లేదా? మందులు సరిగ్గా అందుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించాలి. గ్రామ సచివాలయంలో ఉన్న హెల్త్‌అసిస్టెంట్, ఆశావర్కర్, ఏఎన్ఎం, అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కోవిడ్ కంట్రోల్ రూం బాగా పనిచేయాలి ఈ యంత్రాంగం మెరుగ్గా పనిచేయాలి. హోం ఐసోలేషన్ మీద కలెక్టర్లు దృష్టిపెట్టాలి. హోం ఐసోలేషన్‌కోసం ఇండివిడ్యువల్‌గా ఇంట్లో ప్రత్యేక గది లేని వారికోసం కోవిడ్‌కేర్ సెంటర్లు పెట్టాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవలమీద దృష్టిపెట్టాలి. వారికిచ్చే ఆహారం, బాత్రూం, బెడ్ల నిర్వహణ మీద దృష్టిపెట్టాలి. వైద్యులు పర్యవేక్షణ బాగుందా లేదా? అలాగే మందులు ఇస్తున్నారా? లేదా? ఆ మందులను కూడా జీఎంపీ ప్రమాణాలు ఉన్నవి ఇస్తున్నారా? లేదా? అన్న దాని మీద కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అలాగే రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు, జిల్లాల్లోని కోవిడ్‌ఆస్పత్రుల్లో క్వాలిటీ మీద దృష్టిపెట్టాలి. ప్రజల్లో చైతన్యం రావాలి బెడ్లు, బాత్రూమ్స్, మెడికేషన్, ఆహారం ఈ నాలుగు అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలి. కోవిడ్ సెంటర్లలో నాణ్యతమీద దృష్టిసారించాలి. కోవిడ్‌తో కలిసిబతకాల్సిన సమయం. వ్యాక్సిన్ కనుగొనేంత వరకూ... మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనుమానితులకోసం కూడా ఇస్తున్న క్వారంటైన్ సదుపాయాలు కూడా బాగుండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల సరిహద్దులు తెరిచారు. అలాగే కొన్నిచోట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా నడుస్తున్నాయి. దీని వల్ల సహజంగానే కేసులు పెరుగుతాయి. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ, కేసులు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగిపోయి వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.కోవిడ్ సోకినా , కోవిడ్ లక్షణాలు కనిపించినా.. ఒక వ్యక్తి ఎవరికి కాల్ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? అన్నదానిపై తెలియాలి. ప్రజలందరికీ కూడా ఈ మూడు విషయాలు తెలియజేయాలి. దీనివల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది. ప్రజల్లో చైతన్యం కలిగించడం మీద దృష్టిపెట్టాలి. మనం సహాయం కోసం ఇచ్చే కాల్ సెంటర్ నంబర్లు , టెలిమెడిసిన్, 108 లాంటి నంబర్లు.. సమర్థవంతంగా పనిచేయాలి. డమ్మీ చెకప్స్ కూడా చేయండి. మన పనితీరును కూడా మనం సమీక్ష చేసుకుని. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. -
రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి గత సర్కారు బకాయి పడిన రూ.122.61 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో 5.94 లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునురుద్ఘాటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్ కలిసి ఇ– క్రాపింగ్ రిజిస్టర్ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు రూపాయి కడితే చాలు.. వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా పంటల బీమాను ఇ–క్రాప్‌తో అనుసంధానించడం ద్వారా ఖరీఫ్ 2019లో 25.73 లక్షలు.. 2019–20 రబీలో 33.03 లక్షల మందికి మొత్తంగా 58.76లక్షలమందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుంది.(పనులను పరుగెత్తించాలి) సమూల మార్పులు తీసుకువచ్చాం.. ‘‘గత ప్రభుత్వ హయాంలో బీమా పరిస్థితి ఎలా ఉండేదో.. ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. రైతులు ప్రీమియం చెల్లించిన తర్వాత, మిగిలిన వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం చెల్లించాలి. సీజన్ ప్రారంభం కాగానే ప్రీమియం చెల్లింపు జరగాలి. అప్పుడే రైతుకు పరిహారం సక్రమంగా అందుతుంది. అయితే గత ప్రభుత్వం బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాని పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మనం అధికారంలోకి వచ్చాక బీమా కంపెనీలతో చర్చలు జరిపి, అవ్వాళ్టి ప్రీమియంను చెల్లించి, దాదాపు 5.95 లక్షల మంది రైతులకు ఇవాళ బీమా చెల్లించడం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో మాదిరి రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని సమూలంగా మార్పులు తీసుకువచ్చాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు కారణంగా ఇదంతా చేయగలుగుతున్నాం. ఈ డబ్బును పాత అప్పులకు జమచేసుకోకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో ఈ బీమా డబ్బును జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు.(‘సీఎం జగన్ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం’) మీకు రుణపడి ఉంటాం: రైతులు పంటల బీమా సొమ్ము విడుదల చేసే క్రమంలో సీఎం జగన్ వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ క్రమంలో రైతు సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై రైతులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎప్పుడు పంట నష్టం జరిగినా బీమా అందలేదని.. ఇంత పెద్ద మొత్తంలో బీమా సొమ్ము పొందడం ఇదే తొలిసారి అని హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. అదే విధంగా రైతు భరోసా వల్ల పెట్టుబడికి ఇబ్బందులు తొలిగాయని.. పెట్టుబడి కోసం రైతులెవరూ ఇప్పుడు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం లేదంటూ హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద తప్పిందని కృతజ్ఞతలు తెలిపారు. -
కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అవినీతిపై చర్చ పెట్టమని అడగాలని పురపాలకశాఖా మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారే తప్ప.. అవినీతి జరగలేదని చంద్రబాబు గానీ టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని.. పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. తనపై చంద్రబాబు గతంలో లేనిపోని ఆరోపణలు చేశారని ఆ సమయంలో తాను సీబీఐ విచారణను స్వాగతించానని గుర్తు చేశారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నా. అయినా.. నాపై మీ పత్రికల్లో ఇష్టానుసారంగా వార్తలు రాయించలేదా. నేను కూడా వెనుకబడిన కులానికి చెందిన వాడినే. నేను బీసీ అని అప్పుడు మీకు గుర్తురాలేదా’’అని చంద్రబాబును ప్రశ్నించారు. అవినీతికి కులాలు అపాదించడం తగదని హితవు పలికారు. (విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు) ‘‘ఈఎస్ఐలో రూ. 150 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు తేల్చారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. టెండర్లు పిలవకుండా ఆయన ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి కట్టబెట్టారు. నామినేషన్ మీద పనులు ఇవ్వాలని లేఖ రాశారు. 134 శాతం అధిక ధరలకు మందులు ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ అంటే ఎవరికి తెలియకుండా ఎత్తుకు పోవడం. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు. (‘చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బ’) టీడీపీ నేతలే మా అవినీతిపై విచారణ జరపాలని సవాల్ చేశారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో చంద్రబాబు అవినీతిపై విచారణ జరువుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. మేము అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం. వాళ్లు మాకు అవకాశం ఇచ్చారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాంలు రోజుకొకటి బయటకు వస్తాయి. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు కేటాయింపు వ్యవహారంపై సమీక్ష చేసి 500 ఎకరాల భూమి వెనక్కి తీసుకున్నాము. తద్వారా ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదా అయింది’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘స్పందన’పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్నవాళ్లు.. ఎడ్లబండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుక తెచ్చుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయంలో ఇందుకు సంబంధించి అనుమతులు తీసుకోవచ్చని వెల్లడించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇసుక రీచ్‌లను తెరవాలని అధికారులను ఆదేశించారు. జూన్ చివరి నాటికి రోజుకు 3లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అదే విధంగా వర్షాలు కురిసే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త వనరులను గుర్తించి మరిన్ని ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి’’అని సీఎం జగన్ పేర్కొన్నారు.(పది రోజుల్లోనే పింఛన్ కార్డు: సీఎం జగన్) నాడు- నేడు కార్యక్రమంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చేవారన్న సీఎం జగన్.. ఇప్పుడు ఆ సంఖ్య 54.5 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి 60లక్షల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా... 55వేల అంగన్వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగ్లు కట్టాలని.. అంగన్వాడీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. పట్టణ, నగరాల్లో వైఎస్సార్ క్లీనిక్స్‌పై మ్యాపింగ్ చేయబోతున్నారు.. వీటి స్థలాలు గుర్తించే పనిని యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. నాడు-నేడు కార్యక్రమంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. కోవిడ్: ఐసోలేషన్ సదుపాయాలపై దృష్టి పెట్టండి ‘‘కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు బాగా పనిచేశారు. కరోనా నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించాలి. అనుమానం రాగానే పరీక్షలు చేయించుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. 85శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడంతో తగ్గిపోతుంది. కేవలం 2శాతం మాత్రమే మరణాలు రేటు ఉంది. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్ సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు.(పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు) 15 కొత్త మెడికల్ కాలేజీలు స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలి. 15 కొత్త మెడికల్ కాలేజీలను కట్టబోతున్నాం. ఒక్కో మెడికల్ కాలేజీకి 50 ఎకరాల స్థలం కావాలి. కొత్త మెడికల్ కాలేజీలకు అవసరమైన స్థలాలను గుర్తించాలి మద్యం దుకాణాలు తగ్గించాం లిక్కర్ వినియోగం తగ్గించడానికి అన్నిరకాల చర్యలూ తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశామని.. 33శాతం మద్యం దుకాణాలు తగ్గించామని తెలిపారు. మద్యం విక్రయించే వేళలను బాగా తగ్గించామని.. షాక్ కొట్టే రీతిలో రేట్లు పెంచామన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు.. మద్యం అక్రమ రవాణా, తయారీ జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నారు. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టం చేశారు.