సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్ సరఫరా తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. (లాక్‌డౌన్ వేళ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా)
అలాగే కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. ఇక లాక్‌డౌన్ వెలుసుబాటు సమయాన్ని తగ్గించిన నేపథ్యంలో అమలు అవుతున్న తీరుపై సీఎం జగన్ సమీక్షించారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (ఏపీ బాటలో కేరళ )
చదవండి: సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇవ్వండి
Comments
Please login to add a commentAdd a comment