
సాక్షి, తాడేపల్లి : ఒక ప్రభుత్వంగా ప్రజలందరి బాధ్యత తమపై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దంటున్నామని.. రాజకీయ పార్టీగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి అన్నది అందరికీ తెలిసిందేనని, 90 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒకటీ రెండు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, వేల కేసులు ఉన్నపుడు ఎన్నికలు ఎలా పెడతారు?. అసలు ఎన్నికల నిర్వహణకు ప్రాతిపదిక ఏమిటి?. ఒక పక్క చీఫ్ సెక్రటరీ ఎన్నికలు నిర్వహించలేము అని అంటుంటే.. రమేష్ కుమార్ గారికి తొందరెందుకు?. (నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని)
కోవిడ్ అంతా తగ్గిన తర్వాత ఎన్నికలు జరగాలని మేము ప్రభుత్వం తరపున భావిస్తున్నాం. ఆ రోజే ఎన్నికలు పూర్తి చేసి ఉంటే సరిపోయేది. వాయిదా వెనుక ఉద్దేశాలు, నిమ్మగడ్డ వ్యవహార శైలీ ఆ తర్వాత మాకు అవగతం అయ్యింది. ఒక ప్రభుత్వంగా ప్రజలు, ఉద్యోగుల బాధ్యత మాపై ఉంది. ఒక రాజకీయ పార్టీని ఫ్యాక్షనిస్టు పార్టీ అని మాట్లాడిన వ్యక్తి నిష్పక్షపాతంగా ఉంటాడని మేము భావించడం లేద’’ని పేర్కొన్నారు. (తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment