వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చ జరుగనున్నట్లు సమాచారం.