Mekatoti Sucharita
-
తప్పుడు ప్రచారం చేశారు: మేకతోటి సుచరిత
సాక్షి, తాడేపల్లి: తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా -
పాదయాత్ర చేస్తూనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
రాజకీయ లబ్ధి కోసం భయానక వాతావరణం సృష్టించారు
-
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్య తల్లిదండ్రులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏపీ హోం మంత్రి సుచరిత రమ్య తల్లిదండ్రులను సీఎం వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో రమ్య సంఘటనను ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్‌కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం తమకు 10 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. రమ్య కుటుంబానికి పూర్తిగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. (చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య) అనంతరం హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘‘గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ నేడు పరామర్శించారు. దారుణం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి.. 7 రోజుల్లో ఛార్జ్ షీట్ వేశాం. రమ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాం. అంతేకాక రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని సీఎం జగన్ నేడు ఆదేశించారు. దానితో పాటు వారి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పంట భూమి అందించాలని తెలిపారు. మరో 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్‌తో వాళ్ళు తనతో టీ తాగాలని సీఎం జగన్ అన్నారు’ అని సుచరిత తెలిపారు. ‘‘అనేక మందికి దిశా యాప్ ద్వారా భద్రత కలుగుతోంది. ఇంకా ప్రతి ఒక్కరికి యాప్, చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. గ్రామంలో ఒకరిద్దరు దీన్ని వినియోగించుకున్నా సఫలం అయినట్లే’’ అన్నారు సుచరిత. చదవండి: హాస్టల్ పైనుంచి దూకి బీటెక్ స్టూడెంట్ మృతి, వీడియో వైరల్ -
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని, అలా దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు ఇప్పటికే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు. గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదని, మరి ఇప్పడు అదే టీడీపీ శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం ద్వారా ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారని, ఇప్పటికీ ఆ విధంగా 1500 కేసుల్లో 7రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. చదవండి: Child Marriages: ప్రతి 100 మంది ఆడపిల్లల్లో 30 మందికి ఈ వయస్సులోపే పెళ్లిళ్లు -
రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచి వేస్తోంది: సుచరిత
-
తప్పు చెయ్యనివారికి ఈ ప్రభుత్వంలో శిక్ష పడదు : సుచరిత
-
దిశ యాప్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, తాడేపల్లి: మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని... త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. చదవండి: మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
నాడు అపహాస్యం.. నేడు జరుగుతుంది అదే..
సాక్షి, గుంటూరు: ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినప్పుడు అపహాస్యం చేశారని.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అపోహలను ప్రక్కన పెట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి సుచరిత అన్నారు. చదవండి: ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు... ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు -
రేపు ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ సోమవారం ప్రారంభం కానుంది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ఈ నెల 4 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు ఈ మీట్ జరగనుంది. 13 జిల్లాల పోలీసు సిబ్బంది ఈ మీట్‌కు హాజరుకానున్నారు. క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగంలో ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.. ఈ డ్యూటీ మీట్ సందర్భంగా అధునాతన టెక్నాలజీ కోసం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఆరో తేదీన మహిళలకు రక్షణ కార్యక్రమాలను రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించనున్నారు. 35 కంపెనీలు.. పోలీస్ డ్యూటీ మీట్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజల సందర్శనకు అనుమతిస్తున్నాం. పోలీస్ టెక్నాలజీ ఇండస్ట్రీస్‌కు చెందిన 35 కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. అవి రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాలను ప్రదర్శనకు ఉంచుతాయి. దిశ, ఏపీ పోలీస్ సేవా యాప్ వంటి ఏపీ పోలీస్ శాఖకు చెందిన వాటి కోసం మరో 16 ప్రదర్శన (డెమో) స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. 51 స్టాల్స్‌ను ప్రజలు స్వయంగా వచ్చి పరిశీలించేందుకు అనుమతిస్తాం. ఆయా స్టాల్స్‌లో సందర్శకులకు అవగాహన కల్పించేలా పోలీస్ సిబ్బంది ఉంటారు. –డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆరేళ్ల తర్వాత.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ డ్యూటీ మీట్‌ను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పోలీస్ డ్యూటీ మీట్ ఏటా నిర్వహించాల్సి ఉన్నా.. టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం విశేషం. 200 మంది పోలీస్ ప్రతినిధులు డ్యూటీ మీట్‌తో పాటు నిర్వహించే సింపోజియం తదితర కార్యక్రమాలకు రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల నుంచి ప్రతినిధులను ఎంపిక చేశారు. ఎస్సై నుంచి ఐపీఎస్ కేడర్ వరకు 200 మంది ఈ కార్యక్రమాలకు హాజరౌతారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సింపోజియంలు, ఒప్పందాలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్వాట్స్ బృందాలు ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. -
'చదవడం మాకిష్టం' అద్భుత కార్యక్రమం: మంత్రి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటుచేసిన 'చదవడం మాకిష్టం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించారు. విద్యార్థుల్లో చదివే అభిరుచిని అలవాటు చేయడం, చదవులోని ఆనందాన్ని పరిచయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి స్కూల్లో గ్రంధాలయాలు ఏర్పాటు ద్వారా వి లవ్ రీడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పుస్తక పఠనం ద్వారా మనోవికాసం పెంచడం, జ్ఞానాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. 'చదవడం మాకిష్టం' అద్భుత కార్యక్రమమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియంతో విద్యార్ధుల భవిష్యత్తు బాగుంటుందని సీఎం ఆలోచించారని, 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం విద్యా నామ సంవత్సరమేనని కొనియాడారు. చదవండి: పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అణుగుణంగా పాలన నడుస్తుందన్నారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, దీనిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్శిటీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత ఒకటి నుంచి అయిదో తరగతిలో ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు కేవలం క్లాసు పుస్తకాలనే కాకుండా అన్ని రకాల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అన్ని రకాల పుస్తకాలు చదివినప్పుడే విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వాటిని వారే పరిష్కరించుకో గలిగే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. ఎంత విజ్ఞానం సంపాదిస్తే అంత గొప్ప వారు అవుతారని, విద్యకు పునాది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికల్లో విద్యా శాఖ ఒకటి అని తెలిపారు. చదవండి: అంబేద్కర్‌కి నివాళులర్పించిన సీఎం జగన్ -
మోదీ, షాలకు సీఎం జగన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు భారీగా నష్టం జరిగినందువల్ల, అక్కడ పర్యటించాలన్న సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం ఆ జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్‌రాయ్ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని బృందం పేర్కొంది. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. (చదవండి: ‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’) కేంద్ర బృందంతో భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగిందని, మొత్తం రూ. 8084 కోట్ల నష్టం జరిగిందని సీఎం బృందానికి వివరించారు. అందులో రూ.5 వేల కోట్ల మేర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిందని, వ్యవసాయం, అనుబంధ ప్రైమరీ రంగంలో రూ. 3 వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. భారీ నష్టం జరిగినందువల్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వీలైనంత వరకు ఎక్కువ సహాయం అందేలా సహకరించాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. రైతులను ఆదుకోవడంలో సహాయపడాలని, ‘ఎఫ్ఏక్యూ’ రిలాక్సేషన్ అందేలా చూడాలన్నారు. వర్షాలు, వరదలతో దెబ్బ తిన్న పంటలు కూడా కొనుగోలు చేసేలా, ఆ మేరకు ధాన్యం, వేరుశనగ కొనుగోలులో ‘కనీస నాణ్యతా ప్రమాణాలు’ సడలించాలని, లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని) ఇన్పుట్ సబ్సిడీ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని, అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని చెప్పారు. ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా సహాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అనంతరం గత నెలలో సంభవించిన భారీ వర్షాల వల్ల ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, ఆ తర్వాత రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాల్వలకు గండ్లు పడి కూడా భారీ నష్టం సంభవించిందని సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని వివరించారు. కాగా ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ముఖ్య కార్యదర్శి ఉషారాణి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది: బొత్స) -
మానవత్వం చాటుకున్న మంత్రులు..
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ఆటో ఢీకొని గాయాలపాలై రోడ్డుపక్కన పడి ఉన్న ఓ రైతును..అదే మార్గంలో వెళ్తున్న మంత్రులు పరామర్శించి ఆస్పత్రికి తరలించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకెళితే.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కేబినెట్ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా, గుంటూరు జిల్లా ఉండవల్లి–అమరావతి కరకట్టపై ఇస్కాన్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన గాయాలపాలైన ఓ రైతు కనిపించాడు. అది గమనించిన మంత్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. తాను మోపెడ్‌పై తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటో అతను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడని బాధితుడు సమాధానమిచ్చాడు. దీంతో హోంమంత్రి సుచరిత తన కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని కేటాయించి ఆ రైతును తాడేపల్లి పట్టణ పరిధిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి వెంటనే అతనికి చికిత్స అందించాలని సూచించారు. -
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాదానికి బలైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. ‘ఈ హత్యలో నిందితునికి ఇతరులు సహకరించరన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాం. టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రవర్తనపైనే కాదు, అబ్బాయిల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే 10 లక్షల సహాయం అందించామ’ని హోంమంత్రి తెలిపారు. నిందితుడు అఖిల్‌కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్‌కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు. (చదవండి: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్) -
దివ్యతేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల సహాయం
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దివ్యతేజస్విని కుటుంబసభ్యులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వారిని ఓదార్చారు. చలించిపోయిన సీఎం దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారని, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్ ముఖ్య మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దివ్యతేజస్విని తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రి సుచరిత సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రేమోన్మాది నాగేంద్రబాబు కోలు కోగానే అదుపులోకి తీసుకుని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగేంద్రబాబు పూర్వ పరిచయాన్ని అడు ్డపెట్టుకుని దివ్యతేజస్వినిని వేధించాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులపై మహిళలు, యువతులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దివ్యతేజస్విని కుటుంబసభ్యులు కోలుకునే వరకు పార్టీపరంగా కూడా అండగా ఉండాలని సీఎం జగన్ తమకు సూచించారని చెప్పారు. దివ్యతేజస్వినిని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ మాట్లాడుతూ నాగేంద్రబాబుకు ఉరిశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. నిందితుడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని చెప్పారు. -
సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
సాక్షి, విజయవాడ : బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాశ్‌లు దివ్య తల్లిదండ్రులైన జోసెఫ్, కుసుమ, దివ్య సోదరుడు దినేష్‌లను స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.కాగా సీఎం జగన్ దివ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని హోంమంత్రికి సూచించారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి మాకు న్యాయం చేయాలని కోరామన్నారు. తమ మాటలకు చలించిపోయిన సీఎం తప్పకుండా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆడపిల్లల ఎదుగుదలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని.. తమ కూతురు లాంటి వారు ఎందరో ఆ పథకాలతో ఎంతో ఉన్నతికి వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ ఆ కిరాతకుడు మా కూతురుని పొట్టన పెట్టుకున్నాడని దివ్య కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.(చదవండి : బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. సీఎం జగన్ చాలా బాగా స్పందించారు. దివ్య తేజస్విని విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి దివ్య కుటుంబసభ్యుల బాధను పూర్తిగా విన్నారని.. వెంటనే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కూడా చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని.. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని సుచరిత వెల్లడించారు. దివ్య తేజస్విని కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం జగన్ పేర్కొన్నారని దేవినేని అవినాశ్ తెలిపారు. ఇలాంటి సంఘటనల్లో పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని.. తమ పార్టీ, ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉంటుందని అవినాశ్ తెలిపారు.కాగా మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి : దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్) -
వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. (చదవండి: అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్) అదే విధంగా, భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం, మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కొడాలి నాని సీఎం జగన్ వెంట ఉన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ప్రభుత్వం, వరద బాధితులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. -
‘బాధితులందరికీ త్వరలోనే సాయం’
సాక్షి, తాడేపల్లి: వరద బాధితులందరికీ త్వరలోనే సాయం అందుతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, ఇప్పటికే ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సోమవారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు.‘‘సీఎం వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. నష్టపోయిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. భారీగా పంటలు నీటమునిగాయి. కొన్నిచోట్ల ఇళ్లు కూడా మునిగిపోయాయి. వరద నీరు తగ్గగానే ఆయా ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తాం’’అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్లకు పైగానే నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అందరికీ పరిహారం: మంత్రి కన్నబాబు వరి, అపరాలు, పత్తి, చిరుధాన్యాలు, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పంట నష్టాలపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోందని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టంపై పూర్తి అంచనా వేయడం వీలవుతుందన్నారు. ‘‘భారీ వరదలతో కాల్వలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల పంట పొలాలు, కాలనీలు నీట మునిగాయి. ముంపు బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు బాధితులకు ఆహారం, తాగునీటి సదుపాయం కల్పించాం. నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, ఆయిల్ పంపిణీ చేస్తాం. వరదల ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాం’’అని కన్నబాబు తెలిపారు. -
గుంటూరులో సీఎం జగన్‌కు పాలభిషేకం
సాక్షి, గుంటూరు: 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం పాలకమండలి సభ్యులను నియమించినందకు ఆ కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు నగరం పాలెంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రంగనాథ రాజు పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, విడుదల రజిని ,ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివ కుమార్, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకమండలి నియమించడం గొప్ప శుభపరిణామం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలు రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బీసీ వర్గాలకు మేలు చేశారు కాబట్టే సీఎం జగన్ గెలుపులో బీసీలు భాగస్వాములయ్యారు. సీఎం జగన్ క్యాబినెట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 60 శాతం పైగానే ఉన్నారు’ అని అన్నారు. అదేవిధంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్‌గా నిలబెట్టారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడికుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరుకు 4 కార్పొరేషన్ చైర్మన్లు రావడం ఆనందకరం. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ, ‘ సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో జ్యోతిరావు పూలే కనిపించారు. దేశ రాజకీయాల్లో సీఎం జగన్‌కు ముందు ఆ తరువాత అన్న కోణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు మాట్లాడుతూ, ‘ దేశంలో ఎక్కడా లేని లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎవరికి తెలియని కులాలను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం ఆనందంగా ఉంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లోని సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో బీసీలు.. బ్యాక్ బోన్ క్లాస్ -
ఆ దాడులు కుట్రలో భాగమే: సుచరిత
సాక్షి, అనంతపురం: మహిళల భద్రతకు పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ‘ఏపీ పోలీస్ సేవా యాప్’ ద్వారా ప్రజల చెంతకే పోలీసు సేవలు తీసుకువచ్చామని తెలిపారు. ‘దిశ’ యాప్‌ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ ఈ-ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..) పోలీసు శాఖలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీసు కార్యదర్శులు నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 37 జాతీయ పురస్కారాలు దక్కాయని తెలిపారు. అత్యంత పకడ్బందీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలు, హోంగార్డులకు రూ.30 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఏపీలో ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సుచరిత మండిపడ్డారు. దళితులపై దాడులు తగ్గాయని.. ఆలయాలపై దాడులు కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలనూ ఉపేక్షించొద్దని సీఎం జగన్ ఆదేశించారని సుచరిత పేర్కొన్నారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం: సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరులో ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత.. డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలు స్వయంగా చూశారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..) వైఎస్సార్ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్.. మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ నిజం చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను త్వరలోనే మహిళల పేరు మీద పంపిణీ చేయనున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు. (చదవండి: ‘కుట్రలోనే భాగంగానే చంద్రబాబు లేఖ’) -
ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘‘ఏపీ పోలీస్ సేవా యాప్’’ను రూపకల్పన చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండానే సేవలు పొందే విధంగా యాప్ రూపకల్పన చేశామని చెప్పారు. దిశ వంటి చట్టాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీ పోలీస్ పలు ప్రశంసలు పొందిందని తెలిపారు. మరోమారు ప్రజలకు చేరువలో ఏపీ పోలీస్ పనిచేయనుందన్నారు. మహిళా భద్రత విషయంలో ‘దిశ’ యాప్‌తో పాటు ఈ యాప్ కూడా పనిచేస్తుందని సుచరిత వెల్లడించారు. (చదవండి: పోలీసులంటే భయం వద్దు: సీఎం జగన్) అందుబాటులోకి 87 సేవలు:డీఐజీ పాల్ రాజ్ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో 87 సేవలను తీసుకువచ్చామని డీఐజీ పాల్ రాజ్ చెప్పారు. ఫిర్యాదు నుంచి కేసు ట్రయిల్ స్టేటస్ వరకూ యాప్ ద్వారా అప్డేట్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు రసీదు కూడా ఈ యాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.మహిళ రక్షణ, చోరీలు, రోడ్డు భద్రత వంటి అనేక అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అవసరం లేకుండా యాప్ ఉపయోగపడుతుందని పాల్ రాజ్ వెల్లడించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) -
‘కుట్రలోనే భాగంగానే చంద్రబాబు లేఖ’
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే వ్యక్తిత్వమని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. సోమవారం హోంమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కుట్ర పూరితంగానే ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాయించారని, ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయడం కూడా కుట్రలో భాగమన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలుంటే చూపించాలని మంత్రి సవాలు విసిరారు. (చదవండి: రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింది: సుచరిత) రాజకీయ భవిష్యత్తు లేదనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నేరవేర్చారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలే తిప్పికొడతారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని సుచరిత పేర్కొన్నారు. -
‘సత్వర న్యాయం కోసమే దిశ చట్టం’
సాక్షి, తాడేపల్లి: మహిళలకు సత్వర న్యాయం అందించడానికే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో, ఎమ్మెల్యేపై దాడి చేస్తే కనీస చర్యలు లేవు. కానీ నేడు మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. దిశ చట్టాన్ని వక్రీకరించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.80కోట్లు కేటాయించారని.. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాక స్పెషల్ ఆఫీసర్లను నియమించామని... సిబ్బంది నియమాకాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు సుచరిత. (‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్‌ముఖ్) ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.80 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని సుచరిత తెలిపారు. దిశ చట్టానికి 71,700 ఫిర్యాదులు వచ్చాయని.. 53 వేలకు పైగా మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టం చేశామన్నారు. దిశ చట్టం తెచ్చాక గతంతో పోల్చితే మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుది రాక్షస గుణం.. ఆయన కులాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బాబు అడ్డుకుంటున్నాడని ఆమె తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా దళితుడిని నియమిస్తే అడ్డుకున్నారన్నారు సుచరిత. (ఏపీ.. ట్రెండ్ సెట్టర్!) విజయవాడలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తుంటే.. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. దళితులుగా ఏవరైనా పుడతారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 82.5 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించామన్నారు. మొదటి బడ్జేట్‌లోనే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తెచ్చామని తెలిపారు. భారత దేశంలోనే ఓ దళిత మహిళను హోంమంత్రి చేయాలని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ సీఎం జగన్ ఓ దళిత మహిళను హోంమంత్రిని చేశారని సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను అమలు చేయలేదు.. కానీ సీఎం జగన్ ముందుగా డేట్ ప్రకటించి మరీ సంక్షమ పథకాలు అమలు చేస్తున్నారని సుచరిత ప్రశంసించారు. ముఖ్యమంత్రి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నయన్నారు సుచరిత. -
విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత
సాక్షి, కాకినాడ: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి రూ.28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు. (చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్) కష్టకాలంలో కూడా నవరత్న పథకాలు అమలు.. నవరత్న పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కరోనా కష్టకాలంలో కూడా నెరవేరుస్తున్నారని సుచరిత తెలిపారు. ఈ విపత్తు సమయంలో సున్నా వడ్డీ కింద మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి సుచరిత వివరించారు. (దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..)