దిశ యాప్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం: హోంమంత్రి సుచరిత | Mekatoti Sucharitha Comments On YS Jagan Review Meeting On Womens Safety | Sakshi
Sakshi News home page

దిశ యాప్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం: హోంమంత్రి సుచరిత

Published Wed, Jun 23 2021 3:01 PM | Last Updated on Wed, Jun 23 2021 5:59 PM

Mekatoti Sucharitha Comments On YS Jagan Review Meeting On Womens Safety - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని... త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో  పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.

చదవండి: మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement