సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
సీఎం వైఎస్ జగన్ కామెంట్స్..
►కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలి
►విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలి
►డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలి
►కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలి
►సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు
► పేదవాళ్ల కడుపు కొట్టడానికి అందరూ ఏకం అవుతున్నారు
►పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన
►గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
►దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment