సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. మంత్రి జోగి రమేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును వివరించిన అధికారులు.
ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాలను వివరించిన అధికారులు
2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు
రోజుకు రూ.28 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు
2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం
రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం
హౌసింగ్‌పై ఏపీ చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడెట్ కన్నా అధికమని వివరించిన అధికారులు
ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్న అధికారులు
శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయన్న అధికారులు.
ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయన్న అధికారులు
ఇళ్ల నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష
కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న అధికారులు
జగనన్న కాలనీల్లో డ్రైనేజీ
టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష.. సీఎం జగన్ ఏమన్నారంటే..
టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారం అంతా ఇంత కాదు
వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి
తమ ప్రభుత్వ హాయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించింది.
తమ హయాంలో టీడీపీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయింది
మన ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ... మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం
టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చాం
ఈ వాస్తవాలను ప్రజలముందు ఉంచాలి
Comments
Please login to add a commentAdd a comment