review meeting
-
గాంధీభవన్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్ష
-
ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా YSRCP నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
కష్టాలు చెబితే కస్సు బస్సు..
-
ప్రారంభమైన ఆర్బీఐ పాలసీ సమీక్ష
ముంబై: గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తలు అంచనా. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. అక్టోబర్‌లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెపె్టంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. -
యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట: సీఎం రేవంత్
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం.. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న సీఎం.. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు.కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. అవసరమైన నిధులను మంజూరు చేయాలి’’ అని అధికారులకు రేవంత్‌రెడ్డి సూచించారు.‘‘ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలన్నారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు.ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్ -
తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్నచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలని సీఎం తెలిపారు. వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలని వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలని పేర్కొన్నారు.సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తక్షణమే కేంద్ర సాయం కోరుతూ సీఎం రేవంత్ లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోదీని కోరారు. మరోవైపు వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం రూ. 5 కోట్లు విడుదల చేశారు.వర్షాల సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు.ఖమ్మం బయల్దేరిన సీఎం..ఈ మేరకు సీఎం రేవంత్ ఖమ్మం బయల్దేరారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో ఖమ్మం టౌన్ ఎఫెక్ట్ అవ్వగా.. వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్నారు. రాత్రికి ఖమ్మంలోనే బసచేయనున్నారు. రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు. -
సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ, పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం.. వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.గోషామహల్లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. -
చంద్రబాబూ అండ్ కో.. ఇదేం లాజిక్?
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత తెలుగుదేశపు కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖకు సంబంధించి చేసిన సమీక్షలను, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్షను పోల్చి చూడండి. అప్పట్లో జగన్ విద్యకు అత్యధిక ప్రాదాన్యత ఇచ్చారు. పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యేనని చెప్పేవారు. విద్యార్ధులకు తన పార్టీ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు గురించి ప్రోగ్రెస్ అడిగేవారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేసిన అభివృద్ది పనుల గురించి మాట్లాడేవారు. ఆంగ్ల మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్‌ను, టోఫెల్ వంటి వాటిని విద్యార్దులకు అందుబాటులోకి తేవడం ద్వారా వారిని ఎలా పైకి తేవాలా? అనే ఆలోచన చేసేవారు. స్కూళ్లలో పిల్లలకు టాయిలెట్ సదుపాయంతో సహా అన్ని వసతులు, వాటి పర్యవేక్షణ మొదలైనవాటి గురించి జగన్ తన సమీక్షలో చర్చించేవారు. పిల్లలకు గోరుముద్ద కింద పెట్టే ఆహార పదార్దాల నాణ్యత, వారికి డ్రెస్ లు సకాలంలో అందాయా?లేదా?బూట్లు సరిగా ఉన్నాయా?లేదా?టీచర్లకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి?వారికి ఇవ్వవలసిన శిక్షణ గురించి మాట్లాడేవారు. పిల్లలు చదువులు మానకుండా ఉండడానికి తల్లులకు ఇచ్చిన అమ్మ ఒడి పథకం డబ్బులు అందరికి చేరాయా?లేదా? అని పరిశీలించేవారు. అలా జగన్ విద్యారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తే.. చంద్రబాబు నాయుడు తన సమీక్షలో గత ప్రభుత్వంపై విమర్శలు కురిపించడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ స్కూళ్లలోవిద్యా ప్రమాణాలు పడిపోయాయని అన్యాయమైన ఆరోపణ చేశారు. తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో విద్యార్ధులకు, వారి తల్లులకు ఇచ్చిన హామీలేమిటి?. వాటి అమలు పరిస్తితిపై సమీక్ష జరిపినట్లు కనిపించదు. ఈ విషయాల గురించి టీడీపీ అధికార మీడియా ఈనాడు పత్రికలో కనీస ప్రస్తావన చేయదు. గతంలో జగన్ పై దారుణమైన అబద్దాలను వండి వార్చిన ఈ మీడియాకు టీడీపీ అధికారంలోకి రాగానే అంతా బ్రహ్మాండం అయిపోయినట్లు బాజా వాయించడమే సరిపోతోంది. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ పత్రిక హెడింగ్ పెట్టింది. మంచిదే. చంద్రబాబు ఆ మాట అనడం సరైనదే. కానీ ఎవరూ చదువులు మానకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకుంటున్నది మాత్రం మాట్లాడినట్లు కనిపించలేదు. జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద తల్లులకు పదిహేనువేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే.. చంద్రబాబు, పవన్,లోకేష్ లు తమ ప్రచారంలో తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఇలా ఇస్తామని, ఆ తర్వాత నెలకు రూ.1,500 స్కీమ్ అమలు చేస్తామని ఊదరగొట్టారు. అమాయక ప్రజలు కూడా దీనిని నమ్మారనే అనుకోవాలి. పైగా ఇంకా పిల్లలను కనండి అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఒక బిడ్డ ఉంటే పదిహేనువేలు, ఇద్దరు ఉంటే ముప్పైవేలు, ముగ్గురు ఉంటే నలభై ఐదువేలు అంటూ ఊరించారు.కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకు పదిహేనువేలు ఇచ్చి సరిపెడదామని ఆలోచన చేశారు. అయితే ప్రజలలో వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ స్కీమ్ ను వాయిదా వేశామని విద్యా మంత్రి లోకేష్ ప్రకటించారు.అవసరమైన డేటా సేకరణకు టైమ్ కావాలని ప్రభుత్వం తెలిపింది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. అసలు మొత్తం పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినప్పుడు వేరే డేటాతో అవసరం ఏమిటో తెలియదు. చంద్రబాబు తన సమీక్షలో దీని గురించి ప్రస్తావించాలి కదా!. ఎప్పటి నుంచి ఏ రకంగా ఈ స్కీమ్ అమలు చేసేది చెప్పాలి కదా!. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీలు లేదని చంద్రబాబు అంటున్నారు. జగన్ ఆ ఉద్దేశంతోనే కదా అమ్మ ఒడిని అమలు చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆర్ధిక సాయం చేసింది. జగన్ టైమ్ లో బడి మానేసినవారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పడం అసత్యమో కాదో అందరికి తెలుసు. బడి మానేసినవారందరిని స్కూల్ కు తీసుకకు రావడానికి అమ్మ ఒడి కింద 15వేల డబ్బు ఇస్తామని చెప్పారు కదా?. హామీ ప్రకారం అమ్మ ఒడి అమలు చేస్తే పిల్లలు స్కూళ్లు మానారా?. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేయకపోయినా పిల్లలంతా స్కూళ్లకు ఎగబడుతున్నారా?. ఏమి లాజిక్ అండి. చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటివి ప్రచారం చేయగలరు.కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన జాతీయ విద్యా విధానాన్ని జగన్ అమలు చేస్తే, నానా రకాలుగా విమర్శలు చేసిన టీడీపీ ,జనసేనలు ఇప్పుడు అదే విధానాన్ని పాలో అవుతాయా? లేక వ్యతిరేకిస్తాయా?ఈ ఏడాది సకాలంలో డ్రెస్ లు,పుస్తకాలు అందలేదని అంటున్నారు. అది నిజమా?కాదా?అన్నదానిపై అదికారులను చంద్రబాబు ప్రశ్నించాలి కదా!. ఆంగ్ల మీడియం కు వ్యతిరేకం కాదని ఒకసారి, ఇంగ్లీష్ చదివితేనే పైకి వెళతారా అని ఇంకోసారి ప్రశ్నించిన వీరు ఇప్పుడు స్పష్టమైన ఆలోచన వెల్లడిస్తారా?. జగన్ తెలుగును ఒక పాఠ్యాంశం చేసి, మిగిలిన సబ్జెక్టులను ఆంగ్లంలో బోదించడానికి,ఎవరైనా తెలుగులో చదువుతామని కోరితే వారికోసం ద్విభాష పుస్తకాలను తయారు చేయించారు. ఇప్పుడు అదే పద్దతి అనుసరిస్తారా? లేక ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు పెట్టి, మిగిలినవాటిని తెలుగులో బోధించాలన్నది చంద్రబాబు ఉద్దేశమా?. తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే వివరంగా చెప్పాలి కదా!. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లల టాయిలెట్ల పరిశుభ్రతకు విశేష ప్రాధాన్యం ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోవడం మానివేశారని వార్తలు వస్తున్నాయి. టీచర్లు సకాలంలో వస్తున్నారా?లేదా? అనేదానిని చెక్ చేయడానికి ఉన్న యాప్ లను ఎత్తివేస్తామని అంటున్నారు. అది మంచిదేనా?కాదా?. ఇవేవి చర్చించకుండా ప్రభుత్వ స్కూళ్లకు రేటింగ్ ఇస్తామని, ప్రతి విద్యార్ధికి శాశ్వత నెంబర్ ఇవ్వాలని,ఇలాంటి ఏవేవో ఉబుసుపోక విషయాల గురించి ఆదేశాలు ఇస్తే ఏమి ఫలితం ఉంటుంది. గతంలో వివిధ యాప్ ల ద్వారా పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని తీసివేశారట. అంటే కేవలం టీచర్ల సంఘాలను సంతృప్తిపరచడానికే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందా?ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఉందా?మరి పేదవారి పరిస్థితి ఏమిటి?గతంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు అనేవారు. ఇప్పటికీ అదే ఆయన ఉద్దేశమా?. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లపై జగన్ పూర్తి స్థాయి దృష్టి పెడితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ సీరియస్ నెస్ తో వ్యవహరించడం లేదని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమరావతిలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చించారు.ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్న సీఎం.. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని సీఎం రేవంత్ చెప్పారు. -
వరంగల్ అభివృద్ధిపై సమీక్ష.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, వరంగల్: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలన్నారు.ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్న సీఎం. స్మార్ట్ సిటీ మిషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20 రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన సీఎం.. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్‌లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కౌంటింగ్ పై సమీక్ష: ఏపీలో ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష
-
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులతో మాట్లాడిన సీఎం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.బంజారాహిల్స్‌లోని ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి దెబ్బతిన్న నాలా ప్రాంతాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్, గచ్చిబౌలి, చార్మినార్, మలక్‌పేట్, నాగోల్ కుండపోత వర్షం కురిసింది.భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్ పాస్ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్
-
ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్.. రేడియల్ రోడ్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. -
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పట్నంబజారు: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రీజినల్ కో –ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలతో సమీక్షాసమావేశం జరిగింది. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, లోక్‌సభ స్థానం గెలుపే లక్ష్యంగా దృష్టి సారించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఏడు సీట్లలో విజయం తధ్యమని, మంగళగిరిని సైతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సీట్ల మార్పు అంశంలో ఎవరైతే గెలుస్తారో, వారిని మార్పు చేశామని, మిగతా వారు అలాగే అభ్యర్థులుగా కొనసాగుతారని తెలిపారు. ఈ సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా, సమన్వయకర్తలు బలసాని కిరణ్‌కుమార్, షేక్ నూరిఫాతిమా, గంజి చిరంజీవి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నేత రావెల కిషోర్‌బాబు, విడదల గోపి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ఎస్ఐపీబీ మీటింగ్ విజువల్స్
-
విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
-
ఫైనాన్షియల్ లిటరసీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది శిక్షణ పొందనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా బోధన ఒకటో తరగతితో ప్రారంభం కానుంది. ఐబీ.. జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఫ్యూచర్ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష జరిపారు. ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.. ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుర్తించామని వెల్లడించారు. వారికి గౌరవవేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్యూచర్ స్కిల్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్నీ త్వరగా పూర్తిచేయాలన్న సీఎం.. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని.. దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని సీఎం అన్నారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్ స్కిల్స్ బోధించేందుకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్ రూపొందించామని అధికారులు వెల్లడించారు. -
ఆరోగ్యశ్రీపై సందేహాలు ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్-2పై చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంప్‌ల ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం సూచించారు. ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యమని, గ్రామంలో ప్రతి ఇల్లూ మ్యాపింగ్ జరగాలి.. ప్రతి ఆరు నెలలకోసారి డేటా అప్డేట్ చేయాలన్న సీఎం.. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదని.. వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ♦ఆరోగ్యశ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలి, ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి ♦ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. ♦మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టేటస్ వివరించిన అధికారులు ♦నిర్ణీత టార్గెట్‌లోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ♦ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ స్టేటస్ వివరించిన అధికారులు ♦ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు ♦ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదు ♦ఈ సమాచారం తెలియని వారు ఉండకూడదు ♦నెట్ వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి ♦అవేర్నెస్ అనేది పెంచాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అనేది బాగా అవేర్నెస్ పెరగాలి ♦జగనన్న ఆరోగ్య సురక్ష అమలు, పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు ♦జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం ♦ప్రివెంటివ్ కేర్ అనేది ముఖ్యం, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందాలి ♦గ్రామాన్ని జల్లెడ పట్టాలి, ప్రతి ఆరునెలలకోసారి ఇది జరగాలి ♦విలేజ్ శాచురేషన్ మోడ్ లో జరగాలి ప్రతి ఇల్లు కవర్ అవ్వాలి ఇదే మన ప్రధాన ధ్యేయంగా ఉండాలి ♦ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్ ఉన్నాయి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందే వైద్యసేవలు తదితర డేటా మ్యాపింగ్ అనేది జరగాలి ♦బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రివెంటివ్ కేర్ లో భాగంగా చికిత్సలు అందించడం, మందులు ఇవ్వడం, మంచానికి పరిమితమైన వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మ్యాప్ చేయాలి, ♦ప్రతి 6 నెలలకోసారి మీ రికార్డులు అప్డేట్ చేయాలి ♦శాచురేషన్ కాన్సెప్ట్ ఉండాలి, గ్రామంలో 100 శాతం జరగాలి, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా వారికి కూడా వైద్యం అందాలి ♦ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేసిన వారికి రీకన్ఫర్మేషన్ టెస్ట్‌లు చేయండి ♦సెకండ్ క్యాంప్ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి, టెస్ట్‌లు అవసరముంటే మళ్ళీ తప్పకుండా చేయాలి ♦క్యాంప్‌లపై సీరియస్ గా దృష్టిపెట్టాలి ♦ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్ చేయాలి ♦స్టెమీ కార్యక్రమం విలేజ్ క్లీనిక్ దగ్గర నుంచి మొదలవ్వాలి, అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలి, పబ్లిక్ అవేర్నెస్పై మరింత ఫోకస్ పెట్టాలి, ♦నూతన మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్ వివరించిన అధికారులు ♦వాటికి అవసరమైన ఎక్విప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం ♦జిల్లాల వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 స్టేటస్ వివరించిన అధికారులు, మొత్తం 1338 క్యాంప్‌లు నిర్వహించగా, క్యాంప్‌లలో స్పాట్ టెస్టింగ్ 98,210 మందికి నిర్వహించినట్లు, 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందారన్న అధికారులు ♦జేఏఎస్ 1 కంటివెలుగు కళ్ళద్దాల పంపిణీ స్టేటస్ రిపోర్ట్ వివరించిన అధికారులు♦మొత్తం 5,76,493 మందికి కళ్ళద్దాలు అవసరం కాగా, 67 శాతం పంపిణీ జరిగిందని, మిగిలిన కళ్ళద్దాల పంపిణీ కూడా త్వరితగతిన పూర్తిచేయనున్నామన్న అధికారులు ♦వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అధికారుల వెల్లడి, అతి త్వరలో ప్రారంభించనున్న సీఎం ♦విశాఖలో మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బర్న్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్సి›్టట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్ ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న అధికారులు ఇదీ చదవండి: చంద్రబాబుకు షాక్ మీద షాకులు -
TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు
హైదరాబాద్, సాక్షి: విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారాయన. అలాగే.. ఎన్నికల హామీ అయిన గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అమలుకు సిద్ధంగా కావాలని అధికారుల్ని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిచింది. అయితే ఆ పాలసీ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికప్పుడు అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విద్యుత్ విధానంపైనా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నుంచి విద్యుత్ విధానంపై విస్తృతంగా చర్చిస్తామని అధికారులతో చెప్పిన సీఎం రేవంత్.. బహిరంగ మార్కెట్‌తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వివిధ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు పేరిట ఒప్పందాలు(పీపీఏ).. ఈఆర్సీ ఇచ్చిన అనుమతుల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారారయన. -
ఏపీలో ఎన్నికలపై ఈసీఐ సమీక్షా సమావేశం (ఫొటోలు)
-
ప్రజాపాలనపై నేడు సీఎం సమావేశం
-
తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమంపై నేడు సమీక్ష..ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం...ఇంకా ఇతర అప్డేట్స్
-
రాజకీయాలు వేరు.. పారిశ్రామిక విధానం వేరు: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలని సూచించారు. తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమని.. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నారు రేవంత్. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం అందిస్తామన్నారు. తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు. అర్బన్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్, రూరల్ క్లస్టర్లుగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రాంతమంతా రూరల్ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, పారిశ్రామిక విధానం వేరని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సమీక్ష హైదరాబాద్‌కు నలువైపులా జనావాసాలకు దూరంగా నాలుగు డంప్ యార్డులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ నగరం మొత్తానికి జవహర్‌నగర్ డంప్ యార్డు ఒక్కటే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం జరుగుతోందని అన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. గచ్చిబౌలి టూ ఏయిర్‌పోర్టుకు మెట్రో అంత ఉపయోగకరంగా ఉండదని తెలిపారు. గౌలిగూడ, ఫలక్నామ, ఏయిర్పోర్టు రూట్లో మెట్రో వేస్తామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల మేరా మెట్రో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చార్మినార్, గోల్కొండ, తారామతి బారామతి వంటి వాటిని కలుపుకుని టూరిజం సర్క్యూట్ యూనిట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) మోడల్లో పెట్టుబడులు పెడతామని తెలిపారు. మూసీ నదిపై చెక్ డ్యాంలు నిర్మించి, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. సీఎం ఆఫీసు మార్పు! తెలంగాణ డా.అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 9వ అంతస్తుకు మార్చుకునే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9వ అంతస్తును సీఎం రేవంత్ పరిశీలించారు. 9వ అంతస్తులో ఆఫీసుకు జీఏడీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో 9వ అంతస్తుకు తన ఆఫీసును మార్చుకుంటుంన్నారంటన్నాయి సచివాలయ వర్గాలు. చదవండి: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ -
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణపై కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు సెక్టార్లలో మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో మెట్రో రైలు పొడిగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై త్వరగా డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ పూర్తి చేయాలని ఆదేశించారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు(14 కి.మీ), రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (12 కి. మీ), ఎంజీబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టు (23 కి.మీ), ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్( 8 కి.మీ) మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని స్పష్టం చేశారు. చదవండి: HYD Traffic Jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్ నగరం పాతబస్తీలోని దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్‌నుమ వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవాలని తెలిపారు. ఈ మార్గంలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు, హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-IIIలో భాగంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట వరకు విస్తరించాలని సీఎం తెలిపారు. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచికందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తారామతిపేట నుంచి నాగోల్, ఎంజీబీఎస్(40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు రూపొందించాలని తెలిపారు. -
త్వరలో మెగా డీఎస్సీ
-
ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీల ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అలాగే దరఖాస్తు విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఓ స్పష్టత ఇచ్చారాయన. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే.. ప్రజా పాలన ఫామ్‌లు బయట అమ్ముతుండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక.. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు. -
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
-
కరోనా కొత్త వేరియంట్ విషయంలో ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
కోవిడ్ అప్రమత్తతపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు.. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ‘‘పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నాం. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధంచేస్తున్నాం. పీఎస్ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధంచేశాం. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి’’ అని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ♦ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారు ♦ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలి ♦అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్ చేయాలి ♦కొత్తవేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలి ♦ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం -
ఏపీ ఎన్నికలకు కసరత్తు.. ఈసీ సమీక్ష
కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం.. అధికార యంత్రాంగంతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. ఓటర్ల జాబితా అంశంతో పాటు ఎన్నికల సన్నాహాకాలపైనా ఇందులో చర్చించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ఈసీ బృందం గురువారం రాత్రి రాష్ట్రానికి చేరుకుంది. విజయవాడ నోవాటెల్ హోటల్ ఇవాళ, రేపు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమీక్ష నిర్వహించనుంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సమీక్ష కొనసాగనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024తో పాటు, రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అవుతుంది. ఈ క్రమంలో.. ఈసీ బృందానికి ఇవాళ ఎన్నికల సన్నద్దతపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఎన్నికల సన్నద్దతపై 15 నిమిషాల పాటు ఈసీ బృందానికి వివరించనున్నారు. ఆపై జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై నివేదికలు సమర్పించనున్నారు. ఇవాళ 18 జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది. మిగిలిన ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రేపు(శనివారం) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి ముకేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదో తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. రెండురోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగే సమీక్ష సమావేశాలకు విజయవాడ నోవోటెల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాతో కలిసి గురువారం ఆయన నోవోటెల్ హోటల్‌ను పరిశీలించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది. -
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబరు 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని.. దీనికోసం సీఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం ఏపీ రాష్ట్రంలో జరగలేదన్న సీఎం జగన్.. అలాంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాన్ని అయినా ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తూ చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ చేయని కార్యక్రమాలు మనం చేపట్టామన్నారు. ‘నాడు నేడు కార్యక్రమం ద్వారా 45వేల స్కూళ్లను సమూలంగా మార్పు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు చేయగలుగుతామా ? అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. అలాగే 15వేల సచివాలయాలను స్థాపించగలుగుతామా అన్నది మరోక క్వశ్చన్ మార్కు? ప్రతి సచివాలయం పరిధిలో విలేజ్ క్లినిక్ పెట్టగలుగుతామా అన్నది ఇంకోక క్వశ్చన్ మార్కు? 1.30 లక్షల మందిని అతితక్కువ కాలంలో సచివాలయాల్లో నియమించగలుగతామా? అన్నది కూడా మరో క్వశ్చన్ మార్కు? ఇవన్నీ విజయవంతంగా చేయగలిగాం. అక్కడ నుంచి మొదలుపెడితే ఆరోగ్యసురక్ష వరకు ప్రతి కార్యక్రమాన్నీ ఒక ఛాలెంజ్‌గానే చేపట్టాం. దేవుడి దయతో ప్రతి అడుగులోనూ అంచనాలను మించి పనిచేయగలిగాం. అందులో భాగమే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కూడా. 15వేల సచివాలయాలను ఒక కార్యక్రమంలో భాగం చేయడంతో పాటు, సచివాలయ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తున్నాం. గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ప్రమోట్ చేయాలి దీనికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి మనం ఆరోగ్యసురక్ష, ఆరోగ్యశ్రీ మీద పెడుతున్న శ్రద్ధ, విలేజ్ క్లినిక్స్ ఇవన్నీ ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడగులు మనం రాష్ట్రంలో వేస్తున్నాం. ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే అందులో ముఖ్యమైనది వ్యాయామం. గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ఈ రెండింటిని ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధాన కారణం అయితే.. రెండోది గ్రామస్థాయిలో మన దగ్గరున్న క్రీడా ప్రతిభను, మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారికి సరైన గుర్తింపు ఇవ్వగలిగితే మరింత మంది ప్రతిభావంతులు బయటపడతారు. గ్రామస్థాయి నుంచి మన పిల్లలు పెద్ద సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. ఈ రెండు కారణాలను దృష్టిలో ఉంచుకుని.. వీటిని ప్రమోట్ చేయడం కోసం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలో ఇప్పటికే సీఎస్, ఇతర అధికారులు పలుదఫాలుగా సమావేశమయ్యారు. విధివిధానాలు రూపొందించారు. ప్రధానంగా 5 క్రీడలకు ప్రోత్సహిస్తూ.. ఇందులో 5 క్రీడలను ప్రోత్సహించాలి. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో లను ప్రమోట్ చేయాలి. గ్రామస్థాయి నుంచి వీటిని ప్రమోట్ చేయాలన్నదే మన లక్ష్యం.గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించి.. వీటిని ముగించడంతో పాటు మనం ఐడెంటిపై చేసిన ప్రతిభగల క్రీడాకారులను మరలా ప్రోత్సహించే వరకు కూడా అడుగులు పడాలి. పోటీలను ప్రారంభించే ముందు సన్నహాకంగా...జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు పండగలా అవగాహన కార్యక్రమం మొదలుపెట్టాలి. అందులో భాగంగా 3 కిలోమీటర్ల మారథాన్ వంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. దీనిద్వారా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఒక ఉత్సాహాన్ని తీసుకుని రాగలుగుతాం. చదవండి: విజయవాడ: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ 47 రోజుల పాటు ఆటల పండగ... డిసెంబరు 26 నుంచి కార్యక్రమం మొదలై.. 47 రోజులపాటు ఫిబ్రవరి 10 వరకు సచివాలయం, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎస్ఓపీని సమగ్రంగా మరోక్కసారి పరిశీలించాలి. అదే విధంగా దీనికోసం 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 క్రీడా మైదానాలను గుర్తించారు. క్రీడల నిర్వహణ కోసం మైదానాలన్నీ సిద్ధంగా ఉన్నాయా ? లేదా? పనులు ఎంతవరకు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలి. వీలైనంతవరకు అన్ని సచివాలయాల పరిధిలో వీటిని నిర్వహించేలా చూడాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం డిసెంబరులో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలి. ప్రతి సంవత్సరం గ్రామస్థాయి నుంచి మనం క్రీడల్లో మట్టిలో రత్నాలు వంటి ప్రతిభావంతులను వెదికిపట్టుకోగలిగితే.. పీవీ సింధు, జ్యోతిసురేఖ, రాయుడు, శ్రీకాంత్, సాకేత్ వంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతాం. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు మన ప్రతిభను చూపించగలుగుతాం. బాలికలను ప్రోత్సహించాలి ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు అన్నింటినీ క్రోడీకరించి వినియోగంలోకి తీసుకురాగలిగాలి. 26 డిసెంబరు కన్నా ముందే సచివాలయం పరిధిలో పోస్టర్లు డిస్ప్లే చేయాలి. వాలంటీర్లు కూడా అవేర్నెస్ చేసేలా చూడాలి. 15 సంవత్సరాలు పైబడిన వారిని, ప్రధానంగా బాలికలను ఎక్కువగా ప్రోత్సహించాలి. గ్రామాల్లో బాలికలు తక్కువగా వస్తారు. వారిని ఎక్కువగా ప్రోత్సహించాలి. ఆడుదాం ఆంధ్ర కోసం 1.23 కోట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయని అధికారులు చెప్పారు. 34.19 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. అదే విధంగా 88.66 లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోటీలకు అవసరమైన ప్రతి కిట్‌ను నాణ్యత పరీక్షించి అప్పుడే గ్రామస్థాయికి పంపించాలి. కిట్‌లో ఉండాల్సినవన్నీ ఉన్నాయా? లేదా? అన్నది కూడా చూసుకోవాలి. దీనిపై కూడా ఒక ఎస్ఓపీ రూపొందించి.. పర్యవేక్షించాలి. నియోజకవర్గస్థాయిలో ప్రొఫెషనల్స్ గుర్తింపు.. నియోజకవర్గస్థాయి నుంచి ప్రొఫెషనల్స్‌కు చేయూతనిచ్చే కార్యక్రమం మొదలవుతుంది. క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ టాలెంట్ హంట్‌లో భాగస్వామ్యులవుతారు. బ్యాడ్మింటన్‌కు సంబంధించి సింధు, శ్రీకాంత్ కూడా టాలెంట్ హంట్‌లో భాగస్వామ్యులవడానికి ముందుకు వచ్చారు. వీరికి కృతజ్ఞతలు. అలాగే వాలీబాల్‌కి సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రొకబడ్డీ ఆర్గనైజర్స్ ముందుకు వచ్చారు. నైపుణ్యం ఉన్నవాళ్లను ఎంపికచేస్తారు. ఖోఖోకు సంబంధించి ఏపీ స్టేట్ అసోసియేషన్ సర్వీసెస్‌ను తీసుకుంటున్నాం. అంతే కాకుండా వీటిని ప్రమోట్ చేసేందుకు 21 మంది రాష్ట్రస్థాయి అంబాసిడర్లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు కూడా ముందుకు వచ్చి అంబాసిడర్లుగా కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. ఇవన్నీ మంచి పరిణామాలు. ఇవన్నీ క్రోఢీకరించి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రొఫెషనల్స్ గేమ్స్ మొదలవుతాయి. ప్రతి స్థాయిలో ప్రైజ్‌మనీ... ప్రతిచోటా ప్రైజ్‌మనీ కూడా నిర్ణయించాం. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ గేమ్స్‌లో రాష్ట్రస్థాయిలో విజేతలకు ఫస్ట్ ప్రైజ్ రూ.5లక్షలు, జిల్లా స్థాయిలో రూ.60వేలు, నియోజవర్గ స్థాయిలో రూ.35వేలు నగదు బహుమతి ఇస్తున్నాం. ద్వితీయ బహుమతి కింద రాష్ట్ర స్థాయిలో రూ.3 లక్షలు, జిల్లా స్థాయిలో రూ.30 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.15వేలు, అదే విధంగా తృతీయ బహుమతి కింద రాష్ట్రస్థాయిలో రూ.2లక్షలు, జిల్లా స్దాయిలో రూ.10వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.5వేలు ఇస్తారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విజేతలకు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ప్రైజ్ కింద రూ.2లక్షలు, జిల్లాస్థాయిలో రూ.35వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.25వేలు నగదు బహుమతి ఉంటుంది. ద్వితీయ బహుమతి రాష్ట్ర స్థాయిలో రూ.1లక్ష, జిల్లా స్థాయిలో రూ. 20వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, తృతీయ బహుమతి కింద రాష్ట్రస్థాయిలో రూ.50వేలు, జిల్లా స్థాయిలో రూ. 10వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.5వేలు నగదు బహుమతి ఇస్తున్నాం. సుదూర ప్రయోజనాలే లక్ష్యంగా... వీటన్నింటిపై విస్తృతంగా అవగాహన కలిగించాలి. ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తుంది.. వీటి వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటన్నది తెలియజేయాలి. వాలంటీర్లు, సచివాలయం స్థాయి నుంచి ఇది జరగాలి. ప్రతి అడుగులో సక్రమైన పర్యవేక్షణ, ఎస్‌ఓపీతో మందుకు తీసుకుని వెళ్లాలి. డిసెంబరు 26న ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా సుదూర ప్రయోజనాలు నెరవేరుతాయి. కచ్చితమైన ఫోకస్‌తో అడుగులు వేయండి. ఇది కేవలం క్రీడలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు...వీటని ప్రోత్సహించి, భవిష్యత్ తరాలను ఆ దిశగా మోటివేట్ చేయగలిగితే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఆరోగ్యసురక్షాలో డయాబెటిక్, బీపీ కేసులు బయటపడ్డాయి. ప్రివెంటివ్ కేర్‌లో భాగంగా ప్రతి ఇంటిలో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ పెరిగితే.. భవిష్యత్తులో ఇవన్నీ తగ్గుతాయి. అందుకే ఇది కూడా ప్రాముఖ్యత ఉన్న అంశం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని సీఎం స్పష్టం చేశారు. -
అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్(ఉపరకం) జేఎన్.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు. आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की। बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023 పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది. -
నళినిపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్, వైద్య..ఆరోగ్య శాఖలపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ పోలీస్ అధికారిణి నళిని అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించిన ఆయన.. ఆమెకు తిరిగి అదే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయాక.. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం న్యాయమే. ఆమెకు అదే పొజిషన్ అప్పజెప్పండి. ఒకవేళ పోలీస్ శాఖలో తీసుకునేందుకు రూల్స్ అడ్డువస్తే.. మరేయితర డిపార్ట్మెంట్లోకి అయినా తీసుకోండి’’ అని సీఎం రేవంత్, సీఎస్.. డీజీపీలను ఆదేశించారు. పన్నెండేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె అనుకూలంగా పని చేశారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారామె. పారదర్శకంగా నియామకాలు చేపట్టండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. టైం టు టైం ఆలోచన చేయండి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు. -
TS: ధరణిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూ సమగ్ర సర్వే చేయడంపై అధికారులను అడిగిన సీఎం.. భూ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి సమస్యలు.. వాటి పరిష్కారంపై చర్చించారు. గ్రామ సదస్సులు, రికార్డ్స్ సవరణ ఎందుకు చేయడం లేదని సీఎం ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి ఫోన్ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం -
రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ. దీంట్లో భాగంగానే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలి. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోంది. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది’’ అని సీఎం చెప్పారు. ‘‘ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు(ఫాలో అప్ కన్సల్టేషన్) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలి. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి. 19నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలి. దీంతో పాటు వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలి. భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు. ఫేజ్–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభించాలి. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలి. అర్బన్ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండాలి. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలను నిర్వహించాలి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలి. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి. డయాలసిస్ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలి’’ అని సీఎం జగన్ సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చిల్లర రాజకీయాలు మానుకో చంద్రబాబూ..: సజ్జల -
విద్యుత్ లెక్కలు తేల్చండి !
-
పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడి
-
తుఫాను వల్ల నష్టపోయిన బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష
-
మిచాంగ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
కీలక వడ్డీ రేటు యథాతథమే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. పాలసీ వివరాలను 8వ తేదీన గవర్నర్ వెల్లడిస్తారు. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఎకానమీ వృద్ధే లక్ష్యంగా ప్రస్తుత యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం)నే కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. యథాతథ రేటు కొనసాగిస్తే ఈ తరహా నిర్ణయం ఇది వరుసగా ఐదవసారి అవుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోనికి వచి్చనట్లు కనబడుతున్నప్పటికీ, దీని కట్టడికి కఠిన రేటు విధానాన్నే అవలంభించాలని ఆర్బీఐ కమిటీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. -
AP : డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు. ‘‘ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. అలాగే.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు.. ఖాళీలు ఉండకూడదు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అనే దానిపై పరిశీలన చేయాలి. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలి’’.. అని అధికారులకు ఆదేశించారాయన. అలాగే.. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న H9N2 వైరస్ దృష్ట్యా ఇక్కడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం. -
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ నేర్పించాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
‘నాడు-నేడు రెండో దశ పనులు గడువులోగా పూర్తి చేయండి’
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు సీఎం జగన్. ఈ మేరకు నాడు-నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు-నేడు తొలి దశలో పూర్తైన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన యాక్టివిటీస్ చేపట్టాలన్నారు. డిసెంబర్ మూడోవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ఏర్పాటు చేయాలని, మిగిలిన వారికి కూడా చేయూతనిచ్చి వారు కూడా ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్షలు రాసేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. -
గడువులోగా అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనది ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇది ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుంది నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలి స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి పూర్తయ్యే విధంగా... పనులు చేపడుతున్నామన్న సీఎంకు తెలిపిన అధికారులు. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న అధికారులు కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి కావాలన్న సీఎం కన్వెన్షన్ సెంటర్లో మౌలిక సదుపాయాలును పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశం నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్ స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలన్న సీఎం నడక దారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలని ఆదేశం పనులు నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం ఆ మేరకు నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలన్న సీఎం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు. అంబేద్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు... విగ్రహం ఎత్తు 125 అడుగులు. కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల సుందీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు. పార్క్, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు. పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు -
ఏపీ రాష్ట్ర విభజన నష్టంపై.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
-
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు.
-
మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడవద్దు: సీఎం జగన్
-
సీఎం జగన్ ఆదేశాలు.. గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు..
-
ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను విస్తృతం చేయాలి: సీఎస్
-
ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల వద్ద ప్రస్తావించారు. సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారాయన. జగనన్న ఆరోగ్య సురక్షలో ఇప్పటిదాకా పురోగతిని వివరిస్తూనే.. రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నదానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారాయన. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తైంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూతనివ్వడం చాలా ముఖ్యం. ఇవి సాధారణమైన సాధారణ వైద్య శిబిరాలు కావు. శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అనేదే అత్యంత ముఖ్యమైంది’’ అని ఆయన అన్నారు. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు పూర్తిగా నయం అయ్యేంతవరకూ చేదోడుగా నిలవడమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారాయన. ‘‘ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం. ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోంది. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మనం జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నాం. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నాం. వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై మన దగ్గర డేటా ఉంది’’ అన్నారాయన. .. ‘జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్ 5 కల్లా 85వేల మంది పేషెంట్లను తదుపరి చికిత్సలకోసం నెట్వర్క్ ఆస్పత్రి/ టీచింగ్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరికి చేయూత నివ్వడం ఒక కార్యక్రమం. మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత విలేజ్ క్లినిక్‌కు, ఫ్యామిలీడాక్టర్‌కు, గ్రామ సచివాలయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించాలి. వారి ద్వారా వీరికి నయం అయ్యేంతవరకూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. 13,850 కేసులను ఇప్పటివరకూ చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్సలకోసం ఆస్పత్రులకు పంపించడం జరిగింది. మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. వారికి కావాల్సిన మందులు ఇచ్చి.. వారిని నయం అయ్యేంత వరకూ కూడా తగిన విధంగా చేయూత నివ్వాలి’ అని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. .. ‘‘మిగిలిన ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి గుర్తించిన మొత్తం రిఫరెల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమం డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలి. వీరు చికిత్సలు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి కావాల్సిన మందులు అందించడంతోపాటు, వారు వేసుకునేలా తగిన విధంగా చేయూత నివ్వాలి. రిఫరల్ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఈ పేషెంట్లకు రూ.500లు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ఒకవేళ ఆరోగ్య శ్రీ ప్రొసీజర్‌లో కవర్ కాని కేసులు అక్కడక్కడా ఉండొచ్చు. ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్య శ్రీకింద ఉచితంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు సీఎం జగన్. జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలన్న సీఎం జగన్.. ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే.. ఆరోగ్య శ్రీ కింద నమోదుకాని రోగాలు ఏమైనా కనిపించినా.. ప్రత్యేక కేసుల కింద పరిగణించి వారికి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందచేయాలన్నరు. అలాంటి పేషెంట్ల చికిత్సకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అధికారులతో అన్నారాయన. ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై దృష్టిపెట్టడం అనేది మరొక విషయం. చికిత్సలు చేయించుకున్న తర్వాత వీరికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు కనుక్కోవాలి. ఎలాంటి లంచాలకు తావులేకుండా ఉచితంగా వైద్యం అందిందా? లేదా? అనేది తెలుసుకోవాలి. వాళ్లు మందులు తీసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలి. ఆరోగ్య శ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నాం. అయితే వాళ్లు క్రమం తప్పకుండా తిరిగి వీళ్లు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. పేషెంట్లకు తెలియక, సరైన అవగాహన లేక తదితర కారణాల వల్ల చికిత్సలు చేయించుకున్న రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకోని సందర్బాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి పేషెంట్లు వెళ్లి.. మందులు తీసుకునేలా చూడాలి. ఈమేరకు యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం. అలాగే.. ఆ బాధ్యత విలేజ్ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు కూడా ఉంటుంది అని సీఎం జగన్ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల కింద గుర్తించిన పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పటిదాకా 8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే 73 వేలమందికిపైగా కంటి సర్జరీలు చేయాలని వైద్యులు చెప్పారు. ఆ సర్జరీలు కూడా వెంటనే పూర్తి కావాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీకూడా పూర్తికావాలి అని సీఎం జగన్, అధికారులకు ఆదేశించారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్టుగా గుర్తించిన వారికి తదుపరి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. అందులోకూడా నిర్ధారణ అయిన తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్ కేర్‌లో ఇది కీలక అంశం. అలాగే 9,969 మందికి లెప్రసీ అనుమానాస్పద కేసులు ఉన్నాయి. వీరికి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. అలాగే 442 మందికి టీబీ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. సుమారు 1, 239 మంది చిన్నారులు 4-D సమస్యలతో బాధపడుతున్నట్టుగా తేలింది: వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందించడం వల్ల ఆ పిల్లలు ఈ సమస్యలనుంచి బయటపడతారు. ఇప్పటికే తీవ్రరోగాలతో బాధపడుతున్న వారికి తగిన రీతిలో చేయూత నందించాలి. ఈ మందులు ఖరీదైనవి కాబట్టి, వాళ్లు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి కూడా మందులు అందించాలి. మందులు ఎంత ఖరీదైనా సరే, పేషెంట్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రామ వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌తో అనుసంధానం చేయాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నాయి. పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ప్రతి జిల్లాలోకూడా అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఉన్న మెడికల్ కాలేజీలను కూడా పునరుద్ధరిస్తున్నాం. రిక్రూట్మెంట్ పాలసీమీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఎక్కడైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే 53 వేలమందిని ఆరోగ్య రంగంలో ఖాళీలను మనం భర్తీచేశాం. ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, మెడికల్ రిక్రూట్ బోర్డును సృష్టించడం జరిగింది. ప్రివెంటివ్ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్‌లు అత్యంత కీలకం కానున్నాయి. పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందుతుందా? వారికి మందులు అందుతున్నాయా? అనే విషయాల్ని విలేజ్ క్లినిక్ ద్వారా పరిశీలన చేయించాలి. లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఏ రాష్ట్రాంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెస్ట్, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థ ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. జనవరి 1 నుంచి క్రమంత తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ ఉండాలి. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలి. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలి. ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుంది. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయి. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత. అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలి: మంచి ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలి. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్.. ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్ చేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం.. 2,295 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. అయినా వైద్యంకోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాల్సిన అవసరం ఏముంది?. అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మన అందరి బాధ్యత. ఆ దిశగా అడుగులు వేసే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం అని సీఎం జగన్ అన్నారు. -
విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: గత నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించడంతో పాటు అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వాళ్ల విషయంలో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నవంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ‘వై ఏపీ నీడ్స్ జగన్’పై అధికారులతో సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారాయన. ఈ సమీక్షలో ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రధానంగా ప్రచారం చేయాలని అధికారుల్ని, సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అనే దానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలి. గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలి. ఒకవేళ అర్హులకు ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి’’.. ..స్కూళ్లలో నాడు– నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలి. ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలి. పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో వివరించాలి. సోషల్ ఆడిట్ ద్వారా నాణ్యంగా అందుతున్న సేవల్ని వివరించాలి. దిశ యాప్ ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలన్నింటిపైనా చెప్పాలి. మొత్తంగా గత నాలుగున్నరేళ్లలో ఈ పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వారికి తెలియజేయాలి’’ అని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడు ఎలా ఉన్నాం? అనే అంశాలపై మరీ ప్రజలకు వివరాలను తెలియజేయండి. డీబీటీ, నాన్‌డీబీటీ, గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించండి. జరిగిన మంచిపై ఆధారాలు చూపించండి. మరీ ముఖ్యంగా.. ఈ ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్ని వివరించండి. సంక్షేమ పథకాల అవగాహన కల్పించడంతో పాటు ఆ పథకాలను ఏరకంగా వాడుకోవాలనేది తెలియజేయండి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బోర్డులు పెట్టి.. ఏయే పథకంద్వారా ఎంతమందికి లబ్ధి పొందిదన్నదీ ఆ బోర్డుల ద్వారా వివరించండి. డీబీటీ ఎంత? నాన్ డీబీటీ ఎంతో వివరాల్ని పొందుపరచండి. నాడు – నేడు ద్వారా చేసిన ఖర్చు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కోసం ఎంత ఖర్చు చేశామో తెలియజేయండి. అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా గుర్తించిన ప్రాధాన్యతా కార్యక్రమాలకోసం చేసిన ఖర్చును వివరించండి. ఇక అర్బన్ ఏరియాలో కూడా సచివాలయం ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులతో సీఎం జగన్ అన్నారు. ‘‘గతానికి భిన్నంగా పరిస్థితులు ఎలా మెరుగుపడ్డాయి?. ఎంత మంచి జరిగింది? అనేదాన్ని ప్రతి ఇంటికీ తీసుకుని పోవాలి. ఏది ఏమైనా నవంబర్ 9న ఈ కార్యక్రమం మొదలు కావాలి’’ అని అధికారులతో సీఎం జగన్ స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లలో ప్రజలకు జరిగిన మంచిని, రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తూ మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రచారంతో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం తెరపైకి వచ్చింది. -
విశాఖ రాజధానిపై నేడు సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ, ఆయనకు సమర్పించనుంది. -
ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై(ఎస్ఐపీబీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల ఉత్పాదకతలో విప్లవాత్మక మార్పు పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహణ చేసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలని, ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శకత విధానాల ద్వారా అత్యంత సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగామని అన్నారు. ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని, ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు,. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ‘పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం. అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వర్గాలనుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరుచేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాలి. ఎంఎస్ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ముందుకు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలి. గత ప్రభుత్వంలో కన్నా పరిశ్రమలకు పోత్సాహకాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం. ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం. ఇన్సెంటివ్‌లు ఇస్తూ వారికి చేదోడుగా నిలిచాం. ఎంఎస్ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎక్కువమంది వీటిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వంమీదున్న బాధ్యత’ అని సీఎం తెలిపారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. 1. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు. 2. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. రూ.531 కోట్లు పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 3. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. రూ.1750 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 4. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్‌స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్)కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్. రూ.166 కోట్ల పెట్టుబడి, దాదాపు 5 వేలమందికి ఉద్యోగాలు. 5. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్ధానంలో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎస్ఐపీబీ ఆమోదం. రూ.6,174 కోట్ల పెట్టుబడి, 600 మందికి ప్రత్యక్షంగానూ, 2000 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 6. ఇవికాక మరో మూడు కంపెనీల విస్తరణకూ ఎస్ఐపీబీ ఆమోదం, ఆమేరకు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్రాపేపర్ లిమిటెడ్ విస్తరణ. రూ.4వేల కోట్ల పెట్టుబడి, 3 వేలమందికి ఉద్యోగాలు. 7. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ. రూ.679 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు. 8. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ. రూ.933 కోట్ల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు. 9. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్. 310 మందికి ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. 10. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ పుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు. -
విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం వేగంగా పూర్తి చేయాలి
-
నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అర్భన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. సీఎం ఆదేశాలు ఇవే.. ►వర్షాకాలం ముగిసి పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి. ►త్వరగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ►నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ►సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి వినియోగించేలా చూడాలి. ►విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►ముడసర్లోవ పార్క్ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. ►విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలి. ►కన్వెన్షన్ సెంటర్, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలి. ►విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ►కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ చేపట్టాలి. ►జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి. ►ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం తెస్తున్న అత్యాధునిక యంత్రాలను సద్వినియోగం చేయాలన్నారు. -
తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు..
-
సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రై రేషన్ పంపిణీపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని చెప్పారు. అందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ బుధవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలని పేర్కొన్నారు. వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని.. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని, జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులపై క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: చంద్రబాబు ప్లాన్ రివర్స్.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్! -
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనది: సీఎం జగన్
-
ప్రజల సంతృప్తే ప్రామాణికంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం సమీక్షలు చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న ఆరోగ్య సురక్ష సహా పలు అంశాలపై సంబంధిత అధికారులతో వైఎస్ జగన్ చర్చించారు ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసినట్టు అధికారులు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని తెలిపారు. పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాలన్నారు. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: చంద్రబాబు ఇంటి భోజనంపై అనుమానాలు?: మంత్రి అమర్నాథ్ సీఎం జగన్ ఇంకేం మాట్లాడారో ఆయన మాటాల్లోనే.. ► ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది. ►అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి. ►నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేయాలి. ►తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ►ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. -
రైతులకు మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయం, పౌరసరఫరాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీదిరి అప్పరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీ నాగిరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి ►ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి ►ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలి ►పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలి ►మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలి ►ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలి ►ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి ►చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలి ►బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలి చదవండి: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ దేశానికే ఆదర్శం -
విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, ప్రగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధపైనా సీఎం ఆరా తీశారు. వారంలో మూడు రోజులపాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం మన బడి నాడు–నేడు పనులపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నామన్నారు. ‘‘మెనూను మార్చి పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రాగిజావను కూడా ప్రవేశపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ కూడా పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలి’’ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: Pawan : ‘విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్సీపీని ఆపలేం’ -
ఇంటింటికీ ఆరోగ్య రక్షణ కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య సురక్ష: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యసురక్షపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని విడుదల చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష తర్వాత.. సీఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారుల సమీక్షలో సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలి. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలి. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్ రోజు నాడు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలా జల్లెడ పట్టిన ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరకి ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో సూచిస్తాం. ఒకవైపు తనిఖీలు చేస్తూనే.. మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలి’’ అని సీఎం చెప్పారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పనిచేయడంతో పాటు వారిని చేయిపట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలతో పాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం -
ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది. ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి కేసీఆర్ ప్రారంభించనున్నారు. వెట్ రన్లో భాగంగా రెండు కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనుంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వెట్‌రన్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరవ్వనున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు. ఈ మేరకు సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రోజెక్ట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. చదవండి: పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్! పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణకు పండుగ రోజని పేర్కొన్నారు. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదని చెప్పారు. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. -
ఈ-క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, సీఎస్ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎం జగన్‌కు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో జూన్ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా 314.6 మి.మీ. వర్షం కురిసిందని తెలిపారు. 25శాతం తక్కువగా వర్షాలు కురిసినట్టు చెప్పారు. కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఎస్పీఎస్ నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాల కొరత ఉన్నట్టు తెలిపారు. ఇందులో కొన్ని ప్రాంతాలకు ఇరిగేషన్ సదుపాయం ఉన్నందున అక్కడ వర్షాల కొరత ప్రభావం తక్కువగానే ఉందన్నారు. రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 1174.58 టీఎంసీలు కాగా, 507.88 టీఎంసీల నీరు ఉందని తెలిపిన స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీటిని విడిచిపెడుతోందని అధికారులు చెప్పారు. ముందస్తుగా సాగునీటిని విడుదలచేయడం వల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని అందించగలిగామన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. ► ఈ–క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ► రైతుల్ని ఆదుకునే చర్యలకు ఈ డేటా చాలా కీలకం. ► పశువులకు అవసరమైన దాణా, గ్రాసాన్ని సిద్ధంచేసుకోవాలి. ► వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలి. ► వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలి. ► రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు. కరెంటు డిమాండు, పంపిణీలపై సీఎం జగన్ సమీక్ష.. గత ఏడాదితో పోలిస్తే గ్రిడ్ నుంచి డిమాండ్ కనీసంగా 18 శాతం వరకూ పెరిగిందని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3.3 లక్షల కనెక్షన్లు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. గాలి లేనందున విండ్ పవర్ గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే బొగ్గుకూడా తడి బొగ్గు రావడంతో సామర్థ్యం మేరకు థర్మల్ కేంద్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పొడివాతావరణం, వేసవిని తలపించేలా పరిస్థితులు ఉండడం వల్ల అనుకోకుండా అనూహ్యంగా ఈ డిమాండ్ వచ్చిందని తెలిపారు. ప్రతిరోజూ కూడా కనీసంగా 44.25 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలు చేస్తున్నామన్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకూ సుమారు రూ.2935 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. దేశవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. అయినా ఎక్కడా కూడా రైతులకు, ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అధిక రేట్లు ఉన్నా సరే.. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్క ఆగస్టు-2023లోనే రూ.966.09కోట్లు విద్యుత్ కొనుగోలు చేశాం. యూనిట్ ధర రూ.7.52 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నాం. ఇంత ఖర్చు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: భూమి లేని పేదలకు అండగా ఉంటాం.. కౌలురైతుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ -
ఆ ప్రజా ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ‘రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాలి. సమగ్ర భూసర్వే వలన ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై సమాచారాన్ని ప్రజల్లోకి పంపాలి. ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక… వక్రీకరిస్తోంది. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తోంది. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నాం. ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుంటే దానిపై తప్పుడు రాతలు, వక్రీకరణలు చేస్తున్నారు. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు. -
సెప్టెంబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన
సాక్షి, గుంటూరు: ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణపైనా సమీక్షించారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామని అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్, మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు. చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు! -
పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష
-
ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై ఫోకస్ పెట్టాలన్న సీఎం.. ఇతర దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించగలగాలని సీఎం పేర్కొన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయన్న అధికారులు.. సెప్టెంబరు కల్లా డ్రెడ్జింగ్, రెక్లిమేషన్ పనులు పూర్తవుతాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను అధికారులు వివరించారు. చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు.. సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా సీఎంకు అధికారులు వివరించారు. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష తొలి దశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి కాగా, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు. -
విద్యాశాఖపై కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
విద్యారంగంలో AI విస్తృత వినియోగం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: విద్యాసంస్థల్లో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, అందుకోసం అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ (Artificial intelligence)ని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖను ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ సమీక్ష జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో ప్రముఖంగా చర్చ సాగింది. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే..‘‘అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ(AI)లో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ అకడమిక్ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. పైలట్ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలి. ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశం. అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలి. ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలి. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలి. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుంది. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి. విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలి. ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైందిగా ఉండాలన్నదే లక్ష్యం అని సీఎం జగన్ విద్యాశాఖకు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఏపీలో బడికొస్తున్న మేధావి! ‘ఏఐ’ టెక్నాలజీ ఇలా.. -
మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష
-
సహకారశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం
-
CM Jagan: వరద బాధితులకు అండగా నిలవండి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వరదలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారాయన. ఇలాంటి సమయాల్లోనే క్షేత్రస్థాయిలో నిలబడాలి. వరద ప్రాంతాల్లో పర్యటించండి. ముంపునకు గురైన ప్రాంతాలు, పంటపొలాలను సందర్శించండి. బాధితులకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోందీ. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ మరోవైపు భారీ వర్షాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష కొనసాగుతోంది. మధ్యాహ్నం.. కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. వరదలు, పునరావాస చర్యలపై సమీక్ష జరుపుతున్నారు. ఇదీ చదవండి: గోదావరి జిల్లాలకు తక్షణ నిధుల విడుదల -
వర్షాలు, వరదలపై సీఎం వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
వర్షాలు, వరదలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమావేశం చేపట్టారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతోపాటు, భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా ముఖ్యమంత్రి ఆరాతీశారు. 42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. సహాయచర్యల్లో 3 NDRF, 4 SDRF బృందాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని, ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధంచేశామని అధికారులు తెలియ జేశారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని చెప్పారు. చదవండి: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని అధికారులు సీఎంకు వివరించారు. కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామన్న అధికారులు.. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని అన్నారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆ మేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు -
పాఠశాలల్లో ఫ్యూచర్ టెక్నాలజీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ఏపీ విద్యార్థులను వెస్టర్న్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం: సీఎం జగన్
వెస్టర్న్ వరల్డ్‌లో ఉన్న బోధనా స్థాయిలను అలవర్చుకుంటేనే ఏపీ విద్యార్థులు కూడా ఆ స్థాయికి చేరి పోటీ పడగలుగుతారు. దీనికోసం ప్రశ్నా విధానం మారాలి. పిల్లలకు బోధించే విధానంలో కూడా మార్పు రావాలి. కరిక్యులమ్‌లో కూడా మనం వాళ్లకంటే ఏ మేరకు మెరుగు పరుచుకోవాలన్న విషయాన్ని పరిశీలించాలి. ఇందుకు పాఠశాల స్థాయిలో కూడా బోధన, బోధనా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నది ఆలోచించాలి. స్టేట్ సిలబస్, నేషనల్ సిలబస్, సీబీఎస్ఈ వంటి అంశాలకే పరిమితం కాకుండా ఇంకా ముందుకు అడుగులు వేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధిని అందించాల్సి ఉందని, ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికకు రూపకల్పన చేయాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా బోధనలో, శిక్షణలో ఫ్యూచర్ టెక్నాలజీ వినియోగంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సమావేశం అయ్యారు. విద్యా శాఖ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్)తో కలిసి ఒక కొత్త సిలబస్‌ను రూపొందించబోతున్నామని, అది దేశానికే బెంచ్ మార్క్ కాబోతుందని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐబీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్‌తో కలిసి టీచింగ్ మెథడాలజీని, పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నామని.. దీనికి మీ లాంటి వారి సహకారం అవసరమని కోరారు. తద్వారా ఈ కల సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో మెరుగైన సంస్కరణలు మనం రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాం. ఒకటి పాఠశాల విద్య, రెండోది ఉన్నత విద్య. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటినీ అనుసంధానం చేయాలి. పాఠ్యప్రణాళిక కూడా సమ్మిళితం చేయాలి. ఇది ప్రధాన లక్ష్యం. ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరం. ఇండియాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి వర్టికల్స్ అభివృద్ధి చాలా తక్కువ. వాటిని బోధించే సిబ్బంది కొరత కూడా ఎక్కువ. వీటిని పాఠ్య ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఫైనాన్స్ సబ్జెక్ట్‌నే తీసుకుంటే.. బీకామ్‌లో ఫైనాన్స్‌కు సంబంధించిన ఇతర వర్టికల్స్ ఏవీ అందుబాటులో లేవు. అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి. రిస్క్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ వంటి అంశాలను కరిక్యులమ్‌లో భాగం చేయాలి. కంటెంట్ ఉన్నా, ఈ వర్టికల్స్‌ను బోధించే సిబ్బంది అందుబాటులో లేనందునే కరిక్యులమ్‌లో భాగంగా వీటిని తీసుకురాలేకపోతున్నాం. వెస్టర్న్ వరల్డ్‌లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉంది. ఇవన్నీ అక్కడ కరిక్యులమ్‌లో భాగంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అంశాలు కరిక్యులమ్‌లో చేర్చాలి. ఈ కరిక్యులమ్ కేవలం ఒక సంస్థకే పరిమితం కాకుండా.. పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో అందుబాటులోకి తీసుకురావాలి. ఒక తరంలో వీటిని మనం నేర్పించగలిగితే... ఆయా వర్టికల్స్‌లో మనం నిపుణులను తయారు చేయగలుగుతాం. ఈ అంశాలను మన కరిక్యులమ్‌లో భాగంగా చేర్చకపోతే.. మన పాఠ్య ప్రణాళిక బలపడదు. వెస్టర్న్ వరల్డ్‌తో పోటీ పడలేం. అందువల్ల ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. దీన్ని పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలన్న కసరత్తు జరగాలి. స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఎలా సమ్మిళితం చేయాలన్నది మూడో అంశం. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్రంలో ఇప్పటికే 6వ తరగతి నుంచి తరగతి గదుల డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 63 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్ ఆఖరుకు ఇది పూర్తవుతుంది. ఇప్పటికే 32 వేల తరగతి గదుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు కూడా ఇస్తున్నాం. ఈ మార్పులన్నీ ఏపీలోని స్కూళ్లలో చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులను ఇప్పుడు ఉన్నత విద్యతో సమ్మిళితం చేస్తూ మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నదే మన ముందున్న సవాలు. ఐబీ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనం ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) యుగంలో ఉన్నాం. మనం వాటిని అవలంబించలేకపోతే, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే.. వెస్టర్న్ కంట్రీస్‌లో పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. ఐబీలో వారి ప్రశ్నల స్థాయికి, మనకు మధ్య చాలా తేడా ఉంది. మనం 3వ తరగతి నుంచే టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, ప్లస్1, ప్లస్ 2 లెవల్లో సీనియర్ పరీక్షలను కరిక్యులమ్‌లో భాగం చేయబోతున్నాం. ఈ మార్పులన్నీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందించగలిగితే అది గొప్ప మార్పు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే చేస్తున్నాం. స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఈ మార్పులు తీసుకుని వెళ్లి, సమ్మిళితం చేయడం ద్వారా ప్రధామైన పోటీదార్లుగా నిలబెట్టి.. మా పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. అత్యుత్తమ ఐటీ నిపుణులు, కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా ఆశయం. ఈ నేపథ్యంలో ఈ మార్పుల కోసం మీ అందరి సహకారం కోరుతున్నాను. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన మార్పులను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీ ఏర్పాటు చేశాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిగదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు భరోసా అందించాలన్నదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా తల్లులు తమ పిల్లలను స్కూల్‌కు పంపించేలా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. రూ.20 వేల వరకు పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతోంది. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. సమావేశంలో పాల్గొన్న వారు.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ లీడ్ డాక్టర్ విన్నీ జౌహరి, ఇంటెల్ సీనియర్ డైరెక్టర్ (ఆసియా పసిఫిక్ అండ్ జపాన్) శ్వేత ఖురానా, నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంధ్య చింతాల, ప్రైమస్ పార్ట్నర్స్ ఇండియా కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ చారు మల్హోత్ర, ప్రైమస్ పార్ట్నర్స్ ఇండియా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పూజ క్వాత్రా, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ జైజిత్ భట్టాచార్య, అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ స్కిల్స్ టు జాబ్స్ (ఇండియా అండ్ సౌత్ ఆసియా) డిపి సింగ్, గూగుల్ లీడ్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ గరిమెళ్ల, మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ మేనేజర్ కిషోర్ గార్గ్, డేటావివ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ వేదాంత్ అహ్లువాలియా, డేటావివ్ బోర్డు మెంబర్ అతుల్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సమగ్రశిక్షా అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి ఎన్ దీవాన్ రెడ్డి, పలువురు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్చువల్‌గా విదేశీ కోర్సులు ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌ను పాఠశాల స్థాయికే పరిమితం చేయకుండా ఉన్నత విద్యలో కూడా ప్రవేశపెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను చేర్చగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్ని కోర్సుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే సబ్జెక్ట్‌లను వర్చువల్‌గా బోధించడం ద్వారా మన దేశంలో అందుబాటులోకి తీసుకురావాలి. వర్చువల్ టీచింగ్, వర్చువల్ కంటెంట్ అందుబాటులోకి తేవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్‌లోని సంప్రదాయ విధానాల్లో కూడా మార్పులు రావాలి. వాటిని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. రోబోటిక్స్ ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉంది. వీటిమీద దృష్టి పెట్టాలి. ఈ మార్పులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే సమావేశం నాటికి స్కూల్ ఎడ్యుకేషన్‌తో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. సీఎంతో సమావేశమైన ప్రముఖులు.. డాక్టర్ విన్నీ జౌహరి మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ లీడ్ మైక్రోసాఫ్ట్‌లో డైరెక్టర్, ఎడ్యుకేషన్ అడ్వొకసీగా విన్నీ జౌహరి పని చేస్తున్నారు. దీనికి ముందు గుర్గావ్లోని ఐఐఎంటీలో డైరెక్టర్, స్ట్రాటజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. హెచ్‌పీ ల్యాబ్స్ ఓపెన్ ఇన్నోవేషన్ ఆఫీస్‌కు రీజియన్ లీడ్‌గా సేవందించారు. హెచ్‌పీ ల్యాబ్స్‌లో పనికి, విద్యా విషయాల్లో విజయాలకు అవార్డులు అందుకున్నారు. జౌహరి జర్నల్ ఆఫ్ సరీ్వసెస్ రీసెర్చ్, జర్నల్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ గ్రోయింగ్ ఎకానమీస్‌కు వ్యవస్థాపక సంపాదకురాలుగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పొందారు. శ్వేత ఖురానా ఇంటెల్ సీనియర్ డైరెక్టర్ (ఆసియా పసిఫిక్ అండ్ జపాన్) ఆసియా పసిఫిక్, జపాన్ ప్రభుత్వాలతో వ్యూహాత్మక కార్యక్రమాలు నడిపించే బాధ్యత శ్వేత ఖురానా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, డెవలప్మెంట్ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీలతో సంబంధాలు కొనసాగించడంలో 23 ఏళ్ల అనుభవం ఉంది. 2010లో ఇంటెల్‌లో చేరారు. ఇండోనేసియాలో ఇంటెల్ కోసం కార్పొరేట్ అఫైర్స్, టెక్–ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడం, ఇండియాలో కే12 ఎడ్యుకేషన్‌ను నిర్వహించడం వంటి అంశాల్లో నాయకత్వం వహించారు. చారు మల్హోత్ర ఎండీ, కో ఫౌండర్, ప్రైమస్ పార్టనర్స్ ఇండియా విద్యావేత్త, లెరి్నంగ్, డెవలప్మెంట్ ప్రొఫెషనల్, పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌లో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం చారు మల్హోత్రకు ఉంది. విద్య, సాంకేతికత, సీఎస్ఆర్ కార్యక్రమాలలో ప్రాజెక్టులపై 15 కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేశారు. భారతదేశంలోని ప్రభుత్వాల్లో ముఖ్యమైన ప్యానెళ్లు, కమిటీల్లో పనిచేశారు. శ్రీనివాస్ గరిమెళ్ల, గూగుల్ లీడ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటర్ప్రైజ్, ప్రభుత్వ, విద్యాపరమైన పాత్రలను కలిగి ఉన్న బహుముఖ విధుల్లో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం శ్రీనివాస్‌కు ఉంది. కార్పొరేట్, ప్రభుత్వ, విద్యాసంస్థల పనితీరులో సమర్థత, ప్రభావాన్ని తీసుకురావడానికి ఐసీటీ జోక్యాలపై దృష్టి సారించి అనేక ఇ–గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లకు నాయకత్వం వహించారు. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కోసం స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రాక్టీస్‌ను నిర్మించడానికి బాధ్యత వహిస్తున్నారు. జైజిత్ భట్టాచార్య సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్ పార్క్ డైరెక్టర్ల బోర్డులో జైజిత్ భట్టాచార్య ఉన్నారు. డిజిటల్ విజన్ 2035 రూపొందిస్తున్నారు. షేకత్కర్ కమిటీ నివేదిక ఆధారంగా భారత వైమానిక దళ పునరి్నర్మాణం వంటి జాతీయ కార్యక్రమాలకు సహకరించారు. ఓపెన్ స్టాండర్డ్స్‌పై జాతీయ విధానానికి సహకరించారు. పెట్టుబడిదారుల దృక్కోణం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను సంకలనం చేసిన ‘ఇండియా సోర్స్ హై‘ నివేదిక ముఖ్య రచయిత ఆయన. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం లాంచ్‌లో భాగంగా ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. ఇ–గవర్నెన్స్ వ్యూహాలపై ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు. -
జీహెచ్ ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
-
మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను మత పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ‘‘ఉమ్మడి పౌరస్మృతి అంశం మీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. వాటిని చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారు. కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోంది. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రైనా, ఏతల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మన అంతా స్పష్టం చేద్దాం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. ‘‘భారతదేశం చాలా విభిన్నమైనది. ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లాబోర్డులు ఉన్నాయి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. Misinterpretationకు తావు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్ లాబోర్డ్స్‌తో మమేకమై, వారి పర్సనల్ లా బోర్డ్స్ ద్వారా జరగాలి’’ సీఎం జగన్ తెలిపారు. -
వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధశాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ–క్రాపింగ్‌లో జియో ఫెన్సింగ్ ఫీచర్ కూడా కొత్తగా ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. ఖరీఫ్ పంటల ఈ– క్రాపింగ్ మొదలైందని, ఈసారి ముందస్తుగానే మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు డేటాను అప్లోడ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికే పురుగుమందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలని తెలిపారు. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. భూసార పరీక్షలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే.. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయానికి, రైతులకు మరింత మేలు డ్రోన్ల ద్వారా డేటా కూడా కచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. దీంతోపాటు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వరి దిగుబడులపై డ్రోన్ల ద్వారా అంచనాలు పొందేలా డ్రోన్ టెక్నాలజీని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పగా.. మిగతా పంటల విషయంలో కూడా ఈ తరహా ప్రయోజనాలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం పేర్కొన్నారు. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించుకోవడంవల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్‌లు ద్వారా 2.2 లక్షల శాంపిళ్లను సేకరించి రైతులకు ఫలితాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. అయితే కౌలు రైతులకుకి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ. 7802.5 కోట్లు 54.48 లక్షల మందికి పరిహారంగా అందించామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి పంట బీమా పరిహారాన్ని అక్టోబరులో ఇచ్చేందుకు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నామన్నారు అధికారులు. ►10వేల ఆర్బీకేల్లో 10వేల డ్రోన్లు తీసుకు వచ్చి వాటితో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలి: సీఎం ►ముందస్తుగా 2వేల డ్రోన్లు తీసుకు వస్తున్నామన్న అధికారులు. ►డ్రోన్ టెక్నాలజీలో 222 రైతులకు శిక్షణ ఇచ్చి.. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్న అధికారులు. ►డ్రోన్ల విషయలో భద్రత, సమర్థవంతమైన నిర్వహణ, సర్వీసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న అధికారులు. ►డ్రోన్ ఖరీదైనది కాబట్టి భద్రత, రక్షణ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►డీజీసీఏ సర్టిఫికేషన్‌ను పాటిస్తున్నామన్న అధికారులు. ►అన్నిరకాల భధ్రతా ప్రమాణాలు పాటించేలా, ఎదురుగా వచ్చే వస్తువును ఢీకొట్టకుండా నిలువరించే వ్యవస్థ ఉండేలా, నిర్దేశించిన మార్గంలోనే ఎగరవేసేలా, ఒకవేళ ఇంధన సమస్య వస్తే వెంటనే ఆటో పద్ధతిలో ల్యాంచింగ్ ఫ్యాడ్‌కు చేరుకునేలా ఈ డ్రోన్లు ఉంటాయన్న అధికారులు. ► సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలన్న సీఎం. ►రైతుల పంటలకు ఎంఎస్పీ ధీమా, సీఎం ఆదేశాలతో చట్టానికి రూపకల్పన. ► ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు రైతుల దగ్గరనుంచి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఎంఎస్పీ ధరలు ఇవ్వాల్సిందే. ► సీఎం ఆదేశాలమేరకు దీనికి సంబంధించి ఏపీ ఎంఎస్పీ యాక్ట్– 2023ని తీసుకురానున్న ప్రభుత్వం. ► ఆక్వా రైతులకు, డెయిరీ రైతులకు ఈ చట్టం ద్వారా వారి ఉత్పత్తులకు రక్షణ కల్పించే అవకాశం. ► దీనికి సంబంధించి చట్ట రూపకల్పన జరుగుతోందని తెలిపిన అధికారులు. ►గడచిన నాలుగేళ్లలో వ్యవసాయ పంటల నుంచి 4.34 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలవైపు మళ్లింపు. ► రెగ్యులర్ మార్కెట్‌కే కాకుండా ఫుడ్‌ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలని అధికారులకు సీఎం ఆదేశం. ► గోడౌన్లు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. ► దీనివల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుందని, రైతులకు మంచి ధరలు వస్తాయన్న అధికారులు. ► ముఖ్యంగా ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు చాలా అవసరమని తెలిపిన అధికారులు. ► ఫుడ్‌ప్రాసెసింగ్ విషయంలో మరింత ముందుకు వెళ్లాలి: సీఎం ► వివిధ జిల్లాల్లో పండుతున్న పంటల ఆధారంగా ఇప్పటికే ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు మొదలుపెట్టాం. ► త్వరలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ► నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలి. ►ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యే టమోటా, ఉల్లిలాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ► ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి ► అంతేకాకుండా మహిళలతో నడిచే సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నంచేయాలి. ► మహిళల్లో స్వయం ఉపాధికి ఇది ఉపయోగపడుతుంది. ► ఆరువేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ► చేయూత లాంటి పథకాన్ని వినియోగించుకుని.. ఈ యూనిట్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధికి ఊతమివ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. ►పంటల సాగులో, బీమా కల్పనలో, ధాన్యం కొనుగోలులో రైతుభరోసా కేంద్రాలు ఇప్పటికే రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. ►ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం. ►కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లులో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది. ►మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలి. ►ఏ రకమైన కొనుగోళ్లుకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలి. ►విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వేటిలోనూ నకిలీలు, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ►ఇప్పుడు మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేలు ప్రమేయం ఉండాలి. ►ప్రభుత్వం వ్యవసాయ ఉపకరణాలు, డ్రయ్యింగ్ ప్లాట్‌ఫాంలతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ►ఇతర పంటలకు కూడా మార్కెట్‌తో సమన్వయం చేసి.. మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించాలి. ►ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. -
గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ►కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలి ►విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలి ►డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలి ►కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలి ►సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు ► పేదవాళ్ల కడుపు కొట్టడానికి అందరూ ఏకం అవుతున్నారు ►పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన ►గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి ►దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలి -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
పర్యాటక శాఖపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
-
క్రిడా సంబరాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్ష
-
పోలవరం ప్రధానాంశంగా.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ సమావేశం చేపట్టారు. సకాలంలో సాగునీరు: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని వెల్లడించారు. చక చకా పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాగా ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని, నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని తెలిపారు.దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఆ మేరకు పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని వెల్లడించారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. చదవండి: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ప్రాధాన్యత ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ: సీఎం జగన్ ► ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ►ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలన్నారు. ►ఈ మేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలన్నారు. ► వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు. ►ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. ► అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ► అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు ►వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ►ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండోటన్నెల్ పనులుకూడా కొలిక్కివస్తున్నాయని తెలిపారు. ►పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేస్తామన్నారు. ► టన్నెల్ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేశామన్న అధికారులు. ►నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ►వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు వంశధార పనులపైనా సీఎం సమీక్ష. ► ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. ► గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ►తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై సీఎం సమీక్ష. ►ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని అధికారుల వెల్లడి. ►వీటి తర్వాత ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష. ►కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మినీ పోర్టులా ఉప్పాడ -
AP: ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడా సంబురాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. పోటీల కోసం ప్రతీ మండలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తారు. బాలురు, బాలికలకు పోటీలతో పాటుగానే, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం 46 రోజులపాటు ఆటలు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరుగనున్నాయి. సీఎం జగన్ ఏమన్నారంటే.. – ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి: – క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కే మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారు. – భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటాం. – ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తాం. – భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకుసాగాలి. – దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది. – అంబటిరాయుడు, కేఎస్ భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులు. – వీరి సేవలను మనం వినియోగించుకోవాలి. – మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలి. – ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. – ఈ పోటీల్లో మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలి. – గ్రామస్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలి. – ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలి. – భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలి. – ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలి. – హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు చేయాలి. – ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులుశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎస్‌ఎఎపీ) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండీ కె.హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ -
వంద శాతం జనన, మరణాల వివరాల నమోదు జరగాలి: ఏపీ సీఎస్
-
జూన్ 23 నుంచి జగనన్న సురక్షా కార్యక్రమం
సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్చువల్‌గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. జగనన్నకు చెబుదాంతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు & భూ రక్ష కార్యక్రమాలపైనా ఆయన సమీక్ష చేపట్టారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాం. ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలి. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే.. 24 గంట్లోగా వాటిని పరిష్కరించాలి అని సీఎం జగన్ అధికారులతో అన్నారు. నెలపాటు జగనన్న సురక్షా జూన్ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు. 👉 ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్‌క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి అని సీఎం జగన్ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. 👉 రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.. వాటి వేగాన్ని పెంచేలా చూడగలరు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లు ఇచ్చాం. 👉 సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలి. 👉 ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండి. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తాను. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోండి: 👉 మొదటి ఫేజ్‌లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యింది. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. రెండో దశ కింద మరో 2వేల గ్రామాల్లో - సెప్టెంబర్ 30కల్లా భూపత్రాలు అందాలి. అక్టోబరు 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. 👉 జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోండి.\ పాఠశాల ప్రదానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోండి. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై పబడ్డ క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వండి అని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇదీ చదవండి: వాళ్లు వదిలేసినా.. జగనన్న పూర్తి చేస్తున్నాడు! -
బడిఈడు పిల్లలు స్కూల్లో ఉండాల్సిందే
సాక్షి, అమరావతి : విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100 శాతం జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. డ్రాప్ అవుట్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు కోరితే తిరిగి ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖపై గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. మొదటి దశ నాడు–నేడు పూర్తి చేసుకున్న హైస్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు హైస్కూళ్ల చొప్పున అప్‌గ్రేడ్ చేయండి ఇంటర్ విద్యను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు చొప్పున.. ఒకటి బాలికలకు, రెండోది కో ఎడ్యుకేషన్ కోసం ఉండాలన్నారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైసూ్కళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రావాలన్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బైజూస్ కంటెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, తర్వాత దశలో ట్యాబుల పంపిణీకి కూడా సన్నద్ధం కావాలన్నారు. ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని, విద్యార్థులకు అందించే వస్తువుల్లో నాణ్యతా లోపం లేకుండా చూడాలన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ విద్యా కానుక నాణ్యత పరిశీలనకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం దృష్టికి తెచ్చారు. నాణ్యత కోసం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 93 శాతం విద్యా కానుక వస్తువులను, పుస్తకాలను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. రెండో సెమిస్టర్ పుస్తకాలు కూడా ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్లపై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ అంశంలో థర్డ్ పార్టీ పరిశీలన ఉండాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. స్కూళ్లల్లో డ్రాపౌట్స్ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ బోధన ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు వాటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరి ద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామని వివరించారు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20 వేల మంది బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారని, వీరు ప్రతినెలా ఆయా స్కూళ్లకు వెళ్లి టీచర్లకు ఐఎఫ్‌పీ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపారు. ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్ యాప్ పైనా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. రోజువారీగా, పాఠ్యాంశాల వారీగా బోధనపై స్కూళ్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు అందిస్తామని, అన్ని స్కూళ్లలో ఒకేలా బోధన చేపట్టేలా ఇది ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. ఏపీఎస్ఎఫ్ఎల్, బీఎస్ఎన్ఎల్ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిదశ నాడు–నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని, మిగతా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబుల నిర్వహణ, వినియోగంపై నిరంతరం సమీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారని వివరించారు. రెండో దశ నాడు–నేడులో 22,224 స్కూళ్లు మన బడి నాడు–నేడు రెండో దశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని, 22,224 స్కూళ్లలో పనులు జరుగుతున్నట్టు అధికారులు వివరించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. నాడు–నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబుల పంపిణీతో పాటు, ఐఎఫ్బీ ప్యానెల్స్నూ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా శాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, వాటి పురోగతిని వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో 64 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించారన్నారు. స్కూళ్లలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తూ బదిలీలు చేపడుతున్నామని, యూనిట్ టెస్టుల్లో వెనకబడినవారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ కాలేజీల్లో 27 మంది టాప్ 10 ర్యాంకులు సాధించారని సీఎంకు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ 2023–24 విడుదల 12న విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2023–24 అకడమిక్ క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఇందులో విద్యా సంవత్సరంలో చేపట్టే ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, హెచ్ఎంలు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలు ఉన్నాయి. ప్రతిభా అవార్డుల పరిశీలన 2023లో పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలతో సత్కరించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇవ్వనున్న మెడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను మూడు దశల్లో సత్కరించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను జూన్ 15న, జిల్లా స్థాయిలో జూన్ 17న, రాష్ట్ర స్థాయిలో జూన్ 20న అవార్డులు అందజేయనున్నారు. స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2023ను విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు అందించనున్నారు. -
‘ఏపీలో ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు’
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్-10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని అధికారులు తెలిపారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామని, యూనిట్ టెస్టుట్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్-10 ర్యాంకులను 27 మంది విద్యార్థులు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.... ►ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలి ►ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్ ఉండాలి ►జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. ►వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలి ►నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి ►సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలి ►వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం. ►సీఎం ఆదేశాల మేరకు విద్యాకానుక నాణ్యత విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామన్న అధికారులు. ►నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు. ►ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంచేశారు. ►సీఎం ఆదేశాలమేరకు పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధంచేశామన్న అధికారులు. ►రెండో సెమిస్టర్ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధం చేశామన్న అధికారులు. ►మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటుపై సీఎం సమీక్ష. ►ప్యానెల్స్ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై సీఎం ఆరా. ►ప్యానెల్స్‌ను ఎలా వినియోగించాలన్నదానిపై వీడియో కంటెంట్ టీచర్లకు పంపించాలన్న సీఎం. ►కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరిద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామన్న అధికారులు. ►మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20వేల మంది బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారని వెల్లడించిన అధికారులు. ►వీరు ప్రతినెలా వెళ్లి.. టీచర్లకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపిన అధికారులు. ►ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్ యాప్‌పైనా టీచర్లకు శిక్షణ అందిస్తామన్న అధికారులు. ►రోజువారీగా, పాఠ్యాంశాలవారీగా బోధనపై స్కూళ్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు. ►అన్ని స్కూళ్లలో ఒకేలా బోధనకోసం ఇది ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్న అధికారులు. ట్యాబ్‌ల వినియోగంపై సమీక్షించిన సీఎం. ►ట్యాబ్‌ల నిర్వహణ, వినియోగంపై సీఎం ఆదేశాలమేరకు నిరంతరం సమీక్షలు చేస్తున్నామన్న అధికారులు. ►గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారన్న అధికారులు. ►అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయంపై సీఎం సమీక్ష. ►సుమారు 45వేల స్కూళ్లలో ఇంటర్న్నెట్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం. ►ఏపీఎస్ఎఫ్ఎల్, బీఎస్ఎన్ఎల్ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►తొలిదశ నాడు నేడు పూర్తి చే సుకున్న స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం అందించే కార్యక్రమం పూర్తయిందన్న అధికారులు. ►సెప్టెంబరు నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►నాడు – నేడు రెండోదశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం. ►నాడు – నేడు రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన అధికారులు. ►22,224 స్కూళ్లలో రెండోదశ నాడు – నేడు పనులు. ►డిసెంబరు నాటికి పనులు పూర్తవుతాయన్న అధికారులు. ►నాడు–నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబులు పంపిణీతో పాటు, ఐఎఫ్బీ ప్యానెల్స్ ఏర్పాటు పూర్తికావాలన్న సీఎం. ►ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం ఆదేశాలు. ►డ్రాప్‌అవుట్స్ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ►డ్రాపౌట్స్ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారం తీసుకోనున్నట్టు తెలిపిన అధికారులు. ►పదోతరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు తిరిగి అడ్మిషన్ ఇచ్చి వారిని ముందుకు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►గోరుముద్ద, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌ల పై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవాలన్న సీఎం. ►ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►థర్డ్‌పార్టీ వెరిఫికేషన్ ఉండాలన్న సీఎం ►ఇంటర్మీడియట్లో కూడా బైజూస్ కంటెంట్ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►తర్వాత దశలో ట్యాబులు పంపిణీకి కూడా సన్నద్ధంగా ఉండాలన్న సీఎం. ►దీనికోసం ఇప్పటినుంచే సరైన ప్రణాళికతో ముందుకు పోవాలన్న సీఎం. ►కేజీబీవీల్లో కూడా ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం. ►అకడమిక్ స్ట్రెంగ్త్ కోసం పనిచేయాలన్న సీఎం. అకడమిక్ క్యాలెండర్ 2023–24 ను విడుదల చేసిన సీఎం ►జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు. ►ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించిన అధికారులు. ►2023లో టెన్త్, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు. ►జగనన్న ఆణిముత్యాలు పేరుతో విద్యార్ధులకు ఇవ్వనున్న మెడల్స్ పరిశీలించిన సీఎం. ►స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023 లను అందించనున్న ప్రభుత్వం. ►మూడు దశలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సత్కారం. ►నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను జూన్ 15న, జిల్లా స్ధాయిలో జూన్ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్ 20న అవార్డులు ►అందజేయనున్న ప్రభుత్వం. ►రాష్ట్ర స్ధాయి అవార్డులు అందించనున్న ముఖ్యమంత్రి. -
పోలవరం సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కాగా, రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించాడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిషా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరం. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి మనస్థైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2023 కోరమండల్ రైలులో పలువురు ఏపీ రాష్ట్రవాసులు.. - విజయవాడ రీజియన్‌లో దిగేందుకు మొత్తం 48 మంది రిజర్వేషన్ - కోరమండల్ నుంచి విజయవాడకు 35 మంది రిజర్వేషన్ - ఏలూరుకు రిజర్వేషన్ చేసుకున్న ఇద్దరు ప్రయాణీకులు - తాడేపల్లిగూడెంకు ఒకరు రిజర్వేషన్ - రాజమండ్రి స్టేషన్లో దిగేందుకు 12 మంది రిజర్వేషన్. ఇక, ఈ రైలులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 124 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి స్టేషన్లో 24 మంది దిగాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఒడిషాలో ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడం, పట్టాలు తప్పిన కోరమండల్ బోగీలను యశ్వంతపూర్ రైలు ఢీకొట్టడంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో అధికారికంగా ఇప్పటి వరకు 233 మంది ప్రయాణీకులు మృతి చెందగా, వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ -
కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఘన కీర్తిని చాటి చెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలి దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. హరితహారం, గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలకు పరిష్కారం, వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, వానాకాలం పంటలకు ఇన్పుట్ సబ్సిడీగా రైతుబంధు పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్ -
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వికాస్ భారత్ @ 2047, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నీతిఆయోగ్ పాలక మండలి చర్చించనుంది. ఈ సందర్భంగా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని రాష్ట్రం కోరనుంది. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనుంది. ఇక సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనుంది. 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్ల్ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఇదే సమయంలో అధికారులకు సీఎం.. కీలక అదేశాలు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్ చేయడం అన్నది చాలా ముఖ్యమని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్ ల్యాబ్స్ తప్పనిసరిగా పెట్టాలన్న సీఎం.. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య–ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్న సీఎం.. తల్లి గర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్ చేయడానికి సులభతరం అవుతుందని, పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్ చేయడం కూడా సులభతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను, బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏ రకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో, మహిళా సాధికారిత దిశలో చేయతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను రాష్ట ప్రభుత్వం వివరించనుంది. దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరించడంతో పాటు, దాదాపు 30వేలకుపైగా ఇంటర్వెన్షన్స్ జరిగిన విషయాన్ని హైలెట్ చేయనుంది. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం.. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్ సెంటర్లు ఉపయోగపడతాయన్న సీఎం.. నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలని సీఎం సూచించారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి.. ప్రభుత్వం సొమ్మ రూ.371 కోట్లను దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.’’ అని సీఎం అన్నారు. చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే.. ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్ సమావేశంలో ప్రభుత్వం వివరించనుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్ రంగంలో సాధించిన ప్రగతిని ప్రభుత్వం వివరించనుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనుంది. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని రాష్ట్రం వివరించనుంది. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని ప్రభుత్వం వివరించనుంది. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాన్నీ కేంద్రం ప్రస్తావించనుంది. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగాలన్న సీఎం.. పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు.. వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం.. బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి -
పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి. రూఫ్ లెవల్.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లు. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించిన అధికారులు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. బేస్మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు. సీఎం ఆదేశాలమేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని వెల్లడించిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు. సీఎం ఆదేశాలమేరకే ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం. ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రుణాలు. రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... సీఆర్డీయే ప్రాంతంలో పేదల ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వేగంగా నిర్మాణ పనులును ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్న సీఎం. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయన్న సీఎం. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామన్న అధికారులు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం ఆదేశం. 5024 టిడ్కో ఇళ్లను అందించనున్న ప్రభుత్వం. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్, ఏపి టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! -
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లావాసులకు నెరవేరనున్న సొంతింటి కల..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పురపాలక పట్టణావృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. 21 లేఅవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు.. – ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. – 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. – మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు. – గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు. – ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. – జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిశాయని వెల్లడించిన అధికారులు. – దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నామని తెలిపారు. – ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని వెల్లడించిన అధికారులు. – 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని వెల్లడించిన అధికారులు. – సీఐటీఐఐఎస్ కార్యక్రమం కింద చేపడుతున్న పనులనూ వివరించిన అధికారులు. – దాదాపు 12 అర్భన్ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్ సమీక్ష.. – టిడ్కో ఇళ్లలో ఫేజ్ –1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తి. – 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని వెల్లడించిన అధికారులు. – జూన్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపిన అధికారులు. – రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని అధికారులు వెల్లడించారు. – గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. – జూన్ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్న అధికారులు. – ఈ సందర్బంగా విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. – దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. – వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలన్నారు. – పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్న ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. – విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. – రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. – విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి బసంత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక -
హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: హోంశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు. సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు రోడ్లపై కిక్కిరిసేలా చేస్తున్నారు.. చంద్రబాబు రెండు సభలలో అమాయకులు చనిపోయారని సీఎం జగన్ అన్నారు. కాగా, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన -
హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. ‘‘దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలి. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి. రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలి. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్‌స్టేషన్ ఉండాలి’’ సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలీ కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: అకాల వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, తదనంతర పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన సీఎంఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా.. వర్షాల బారి నుంచి వాటిని కాపాడ్డానికి చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
పాలమూరు ఎత్తిపోతల పథకలపై అధికారులతో రివ్యూ
-
పేదలందరికీ ఇళ్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడుపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని, 2022-23 సంవత్సరంలో 10,200 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయనున్నాం.. ఎక్కడా కూడా బకాయిలు లేవు.. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. ‘‘పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి. కొన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. వేయికిపైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలి. ఇప్పటికే 10.03 లక్షల లబ్ధిదారులకు రూ.3,534 కోట్లకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి. కలెక్టర్లు బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలి’’ అని సీఎం ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►హౌసింగ్ కార్యక్రమంలో నిమగ్నమైన అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలి ►దీనివల్ల అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి, నిర్మాణాల్లో నాణ్యత కూడా ఉంటుంది ►ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు ఏసీ సీఆర్డీయే ప్రాంతంలో మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలి ►దేశంలో ఎక్కడా కూడా సమగ్ర సర్వే జరగలేదు ►100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేస్తున్నాం ►దేశానికి అంతటికీ ఆదర్శప్రాయమైన కార్యక్రమం ►జాతీయ స్థాయిలో ఈకార్యక్రమం ద్వారా మనకు సముచిత స్థానం లభిస్తుంది ►భూ హక్కు పత్రాల పంపిణీ, సరిహద్దు రాళ్లు పాతడం, గ్రామాల్లో భూముల రికార్డుల్లో తుది వివరాలు నమోదు, గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రార్ సేవలు లభ్యం కావడం… ఇదీ… ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ►మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోంది ►దీన్ని త్వరగా పూర్తిచేయాలి ►కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టి రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీతోపాటు తర్వాత దశల్లో సర్వే చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలి ►పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలి ►మే 25 నుంచి రెండో దశ గ్రామాల్లో సర్వే ప్రారంభం అవుతుంది పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం ►నాడు – నేడుకు సరిపడా నిధులు ఉన్నాయి ►తల్లిదండ్రులు కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లుఉన్నాయి ►పనులను వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ►తదుపరి ఖర్చులకోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ►నాడు – నేడుకు నిధుల కొరత లేదు ►ఐఎఫ్‌పీ పానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15వేల కు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు – నేడు పనులు పూర్తయినట్టు అవుతుంది ►ఈ పాఠశాలల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుంది ►జూన్ 12 లోగా ఈ ఐఎఫ్‌ఎప్ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి ►మూడు విడతల్లో దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు -నేడు పనులు పూర్తవుతాయి ►వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాల ఉంటాయి ►ఈ సమయాన్ని పనులకోసం బాగా వినియోగించుకోవాలి ►కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి ►మొదటి విడతలో నాడు- నేడు కింద పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలి ►ఎక్కడైనా లోపాలు ఉంటే.. వెంటనే వాటిని సరిదిద్దాలి ►ఇంత పెద్ద మొత్తంలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం ►పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ►గ్రామ, వార్డు సచివాలయాలను సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి ►ఇసుక, సిమ్మెంటు, స్టీలు లాంటివి కొరతలేకుండా వాటి పంపిణీపై దృష్టిపెట్టాలి ►8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5.18 లక్షల ట్యాబులు ఇచ్చాం ►వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చూడాలి ►అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి ►సమస్యలుంటే..ఏం చేయాలన్నదానిపై దానిపై ఎస్ఓపీ రూపొందించాం ►ఏమైనా సమస్యలు ఉంటే… హెడ్మాస్టర్కు గాని, స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లోగాని ఇస్తే.. 3 రోజుల్లోగా రిపేరు చేసి తిరిగి ఇస్తారు ►ఈ ఎస్ఓపీ అమలు జరుగుతుందా? లేదా? అన్నది కలెక్టర్లు చూడాలి ►గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు.. స్కూలుకు వెళ్లి.. అక్కడున్న ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు ►నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డే పాటిస్తూ.. వారు స్కూళ్లకు వెళ్తారు ►ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై వీరు శిక్షణ ఇస్తారు ►స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ►ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదు ►దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది ►పంపిణీపై మంచి ప్రోటోకాల్‌ను పాటించాలి ►అలాగే జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువుల క్వాలిటీపైన కూడా బెస్ట్ ప్రోటోకాల్ పాటించాలి ►జగనన్న విద్యాకానుకపై ఏ స్కూలు నుంచైనా, ఏ విద్యార్థినుంచైనా నాకు ఫిర్యాదులు రాకూడదు ►స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలని ►గతంలో ఎప్పుడూ పుస్తకాలు టైముకు ఇచ్చేవారు కాదు: ►అక్టోబరు, నవంబరు వచ్చినా.. అవి పిల్లలకు అందేవి కావు: ►మనం వచ్చాక పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం: ►మొత్తం వ్యవస్థలోనే మార్పులు తీసుకు వచ్చాం: ►స్కూళ్లలో పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి: ►అలాగే పాఠశాల్లో నైట్ వాచ్‌మెన్లును నియమించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి: ►మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి ►ప్రతి కాలేజీలోకూడా ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్ప్లే చేయాలి ►వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి ►జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేయాలి ►మాదక ద్రవ్యాల నివారణే వీటి ఉద్దేశం కావాలి ►కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి చదవండి: బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్ ►వారి నుంచి నిరంతరం సమాచారం తీసుకోవాలి ►పిల్లలు వీటి బారిన పడకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలి ►మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నవారు. రవాణా చేస్తున్నారు, పంపిణీచేస్తున్నవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి ►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు అవగాహన కల్పించాలి ►15వేలమందికిపైగా మహిళా పోలీసులు ఉన్నారు ►వారు సమర్థవంతంగా పనిచేసేలా, వారి నుంచి మంచి సేవలు పొందేలా చూడాలి -
సవాళ్లపై భారత్ అప్రమత్తత అవసరం
న్యూఢిల్లీ: సవాళ్లకు సంబంధించి దేశం అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ సమీక్ష స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, ధరల పెరుగుదలకు అవకాశం, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆర్థికశాఖ ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందన్న కేంద్ర అంచనాలను ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నివేదికలు బలపరుస్తున్నప్పటికీ వృద్ధి ధోరణిపై సవాళ్లూ ఉన్నాయని సూచించింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఆర్థికశాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎల్ నినో పరిస్థితులు కరువు పరిణామాలకు దారితీయడం, వ్యవసాయోత్పత్తి తగ్గే అవకాశాలు, ధరలు పెరగడం, భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్ల వంటి అంశాల్లో భారత్ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని విశ్లేషించింది. సమీక్షలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 2022–23లో సవాళ్లను తట్టుకున్నాం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, మహమ్మారి సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా 7 శాతం వృద్ధి అంచనా ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక అంశాల విషయంలో భారత్ స్థిరత్వంతో కూడిన పురోగతిని నమోదుచేసుకుంది. బ్యాం‘కింగ్’ వడ్డీరేట్లను పెంచినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా నిలద్రొక్కుకుంది. వృద్ధి స్థిరత్వానికి ఇది సంకేతం. బ్యాంకులపై వేర్వేరుగా ‘స్ట్రస్ టెస్ట్’ల నిర్వహణ కూడా జరుగుతోంది. ముఖ్యంగా డిపాజిట్ల విభాగమూ పటిష్టంగా ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితం అని డిపాజిటర్లు భావిస్తున్నందున, డిపాజిట్లలో 63 శాతం వేగంగా విత్‌డ్రా (ఉపసంహరణ) అవడానికి అవకాశాలు లేవు. ఇది బ్యాంకింగ్ పట్ల డిపాజిట్లకు ఉన్న విశ్వాసంతో పాటు, ఎకానమీ స్థిరత్వానికి దోహదపడే అంశం. ఈ కారకాలన్నీ భారతీయ బ్యాంకులను అమెరికా, యూరోపియన్ యూనియర్ బ్యాంకుల కన్నా భిన్నంగా ఉంచుతున్నాయి. ఆయా దేశాల్లోని బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానం ఉపసంహరణ నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులో.. ధరల పరిస్థితిని పరిశీలిస్తే.. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. గత 10 నెలల నుంచి తగ్గుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు 2022 గరిష్టాల నుంచి దిగివస్తుండటం, దేశీయంగా సానుకూల బేస్ ఎఫెక్ట్‌ల ప్రభావంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో మరింత తగ్గొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల కనిష్ట స్థాయి 5.66 శాతానికి దిగివచ్చింది. నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగింది. 2021–22లో సగటున వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంది. 2022–23లో 6.7 శాతానికి పెరిగింది. అయితే గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలూ చూస్తే, సగటు ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉండడం గమనార్హం. మొదటి ఆరు నెలల్లో ఈ రేటు ఏకంగా 7.2 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడం, సరఫరాల చైన్ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆర్బీఐ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం (2022 మే తర్వాత బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి ఎగసిన సంగతి తెలిసిందే) వంటి అంశాలు ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడానికి దోహదపడింది. ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరి ఆర్బీఐ పాలసీ అంచనా వేస్తే, ఏప్రిల్ మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ప్రస్తుత నిల్వలు భారత్ ఎకానమీకి భరోసాను ఇస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే అటు తర్వాత తిరిగి కొంత స్థిరంగా కోలుకుంటున్నాయి. ఈ పరిమాణం ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో 586.412 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారిన్ ఫోర్టిఫోలియో ఇన్వెస్ట్మెంట్ల (ఎఫ్‌పీఐ) ఫారెక్స్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి. దీనితో గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) కట్టడిలో ఉంది. -
CM Jagan: వ్యవసాయం, ఇతర శాఖలపై సమీక్ష
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రబీలో ఇ– క్రాప్ బుకింగ్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు.48.02 లక్షల ఎకరాల్లో ఇ–క్రాప్ బుకింగ్ పూర్తయిందని వెల్లడించారు. 97.5 శాతం ఇ – క్రాపింగ్ పూర్తి చేశామన్నారు.ఇ– క్రాపింగ్ చేసుకున్న రైతులందరికీ కూడా డిజిటల్ రశీదులు, భౌతికంగా రశీదులు ఇచ్చామని తెలిపారు. ఈ డేటాను సివిల్ సఫ్లైస్ డిపార్ట్మెంటుకు, మార్కెటింగ్ డిపార్ట్మెంటుకు పంపించామని అధికారులు పేర్కొన్నారు. 3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ)లకూ, 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్‌సీలకూ మే 20లోగా వైఎస్సార్ యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే గతంలో సుమారు 6,500 ఆర్బీకేల పరిధిలోని సీహెచ్‌సీలకు వ్యవసాయ ఉపకరణాలను అందించామని, ఆర్బీకే స్ధాయి సీహెచ్‌సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్ స్ధాయి సీహెచ్‌సీలకు రూ. 25 లక్షల విలువైన యంత్రాలు ఉంచుతున్నట్టు వెల్లడించారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద కిసాన్ డ్రోన్లు ►జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ. ►డిసెంబర్ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు. ►ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు. ►తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్శిటీ చర్యలు. ►గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు ఉత్తరాంధ్రలోని విజయనగరంలో శిక్షణకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారుల వెల్లడి. ►ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశం. ►వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమచేసేందుకు సిద్ధం కావాలని ఆదేశం. ►అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలి.. ►మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపిన అధికారులు. ►సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన అధికారులు. ►467 వీఏఏ, 1644 వీహెచ్ఏ, 23 వీఎస్ఏ, 64 వీఎఫ్ఏ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ►4656 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►ఖరీఫ్ సీజనల్లో రైతుల దగ్గరనుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తి. ►రూ.7233 కోట్లకు గానూ రూ.7200 కోట్లు చెల్లించిన అధికారులు. ►ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్న అధికారులు. ►ఈ డబ్బునుకూడా వెంటనే చెల్లించాలన్న సీఎం. ►అలాగే తొలిసారిగా రైతులకు ఇస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల పేమెంట్లు కూడా దాదాపుగా పూర్తిచేశామన్న అధికారులు. ►రబీ ప్రొక్యూర్‌మెంట్‌కు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని తెలిపిన అధికారులు. ►ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలి. ►ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ వెల్లడి. ►నాణ్యతా ప్రమాణాలను కూడా అందులో పేర్కొనాలని సీఎం సూచన. ►రైతులనుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, లేదా ధాన్యం కొనుగోలుకు అక్కడకు ఇక్కడకు వెళ్లమని ఎవరైనా చెప్తే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబరు 1967 కూడా తప్పనిసరిగా పొందుపరచాలని సీఎం ఆదేశం. ►ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలి. ►విదేశాల్లో డిమాండ్‌ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ►దీనివల్ల ఎగుమతులు పెరిగి వారికి మంచి ధర వస్తుంది. ►రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలి. ►ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఉండాలన్న కార్యాచరణ దిశగా ముందుకు సాగాలి. ►దీన్ని పరిగణలోకి తీసుకునే మ్యాపింగ్ చేశామన్న అధికారులు. ► దీంట్లో భాగంగా 1005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టామని, 206కుపైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయని మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ►జులై కల్లా వీటిని పూర్తి చేసి.. సీఎం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామని వెల్లడి. ►నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న ప్రక్రియ మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని వైఎస్ జగన్ ఆదేశం ►ప్రతిఏటా ఈ పంపిణీ మొత్తం పెరగాలని సూచన. ►గత ఏడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువులు అందించామని, ఈ ఏడాది మరింతగా పెంచుతామన్న అధికారులు. ►పంటల ధరలపై సీఎం యాప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నామని తెలిపిన అధికారులు. ►సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాలనుంచి, వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్న సీఎం. ►నిరంతరం మాక్ డ్రిల్ చేస్తూ... ఈ విధానం పనితీరును పర్యవేక్షించాలన్న సీఎం. ►ఎక్కడైనా లోపాలు ఉంటేం వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►సీఎంయాప్ ఎలా పనిచేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్ఓపీని నిరంతరం పర్యవేక్షించాలన్న సీఎం. ►ఎక్కడైనా రైతులకు కనీస మద్దతు ధర లభించలేని పక్షంలో వెంటనే జోక్యంచేసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అండ్ వీసీ జి శేఖర్ బాబు, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదీ చదవండి: నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ -
మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
ఖాళీగా ఉన్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో జరిగిన ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీలలో నాడు – నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు మిగిలిన సుమారు 45వేల అంగన్వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలన్న సీఎం అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలన్న సీఎం పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్వాడీల్లో ఉంచుకోవాలన్న సీఎం గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలన్న సీఎం ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశం. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలన్న సీఎం. సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్న సీఎం. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్న సీఎం. క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలన్న సీఎం. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్న సీఎం. -
విజయవాడలో ముమ్మరంగా అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు
-
టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ. 21 వేల కోట్లు లబ్ధి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. మంత్రి జోగి రమేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును వివరించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాలను వివరించిన అధికారులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు రోజుకు రూ.28 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయం హౌసింగ్‌పై ఏపీ చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడెట్ కన్నా అధికమని వివరించిన అధికారులు ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయన్న అధికారులు శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయన్న అధికారులు. ఇవి కొన్నిరోజుల్లో పూర్తవుతాయన్న అధికారులు ఇళ్ల నిర్మాణం జరుగుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న అధికారులు జగనన్న కాలనీల్లో డ్రైనేజీ టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష.. సీఎం జగన్ ఏమన్నారంటే.. టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారం అంతా ఇంత కాదు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి తమ ప్రభుత్వ హాయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించింది. తమ హయాంలో టీడీపీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయింది మన ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ... మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చాం ఈ వాస్తవాలను ప్రజలముందు ఉంచాలి -
విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
స్కూళ్లకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుంది ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నాం –అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్న సీఎం గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న సీఎం పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్న సీఎం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం సమీక్ష ►సీఎం ఆదేశాల మేరకు జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడి ►స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సీఎం సమీక్ష ►3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు ►ఉత్తీర్ణులైన వారికి టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ ►6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్ టోఫెల్ పరీక్షలు ►వీరికి జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ పరీక్షలు ►మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్ పరీక్ష ►ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్ష ►జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పరీక్ష ►ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్ రూపొందించాలని సీఎం ఆదేశం. ►విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ►ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఓపీ తయారుచేశామన్న అధికారులు. ►ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం. ►ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామన్న అధికారులు. ►సీఎం ఆదేశాల మేరకు పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్న అధికారులు ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►నో మొబైల్ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్ అనుమతిలేదని తేల్చిచెప్పిన అధికారులు. ►ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్ కోడ్ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామన్న అధికారులు. ►దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ►ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్న అధికారులు. ►ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామన్న అధికారులు. ►ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామన్న అధికారులు. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశం. ►ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్న సీఎం. ►ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద పనులపైనా సమీక్షించిన సీఎం. ►ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న అధికారులు. చదవండి: తిరుపతి-హైదరాబాద్ ‘వందేభారత్’ హౌస్‌ఫుల్.. రైలులో ప్రయాణించిన సీఎస్ -
రెపో రేటు పెరగనుందా? .. నేటి నుంచి ఆర్బీఐ పాలసీ భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు (3,5,6 తేదీల్లో... మహవీర్ జయంతి సందర్భంగా 4న సెలవు) జరగనున్న ఈ సమవేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష
-
కరోనాపై రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం
ఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే హైఅలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో.. నేడు(సోమవారం, మార్చి 27న) రాష్ట్రాలతో కోవిడ్‌పై సమీక్షా సమావేశం నిర్వహింనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమీక్షలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనుంది. కరోనా మరోసారి విజృంభణ దిశగా సంకేతాలు ఇస్తోంది. కొత్త కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొత్త కేసులు.. రెండు వేల మార్క్ చేరికకు దగ్గరయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పది వేల దాకా చేరుకుంది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో క్రియాశీలక కేసులు ఎక్కువగా కనిపిస్తుండడంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. యూపీలోనూ తాజాగా ఒక్కసారిగా కేసుల్లోపెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించింది. కరోనా కేసులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లు అప్రమత్తం అయ్యాయి కూడా. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనల ప్రకారం చూసుకుంటే వైరస్ విజృంభణ చాలా తక్కువగా ఉందని కేంద్రం అంటోంది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో వైరస్ విజృంభణను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలకు సూచించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఏప్రిల్ 10,11వ తేదీల్లో కరోనాపై నిర్వహించాల్సిన మాక్ డ్రిల్ గురించీ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ హాట్స్పాట్లను గుర్తించి, వైరస్‌ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది కూడా. ఇక కొవిడ్,ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడం కూడా ప్రజల్లో గందరగోళానికి, లక్షణాలు ఒకేలా ఉండడంతో అయోమయానికి దారి తీస్తోంది. అయితే.. వైరస్‌ను ఎదుర్కొనేందుకు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తోంది. వీడియో: ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి సార్! -
కోవిడ్‌పై మోదీ సమీక్ష.. మాస్క్ ధరించాల్సిందే..
ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారలు, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా కేసులు, ఇన్ఫ్లూ పరిస్ధితిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధాని మోదీకి వివరించారు. మార్చి 22తో ముగిసిన వారంలో దేశంలో సగటున 888 రోజువారీ కేసులు నమోదు కాగా, పాజిటివ్ రేటు 0.98 శాతంగా పెరిగిందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానమైన 20 కోవిడ్ డ్రగ్స్, ఇతర డ్రగ్స్ 12, బఫర్ డ్రగ్స్ 8, ఇన్‌ఫ్లూయెంజా డ్రగ్ లభ్యత , ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించారు. దేశంలోని ఇన్‌ఫ్లూయెంజా పరిస్ధితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ల్యాబ్స్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. దీని వల్ల కొత్త వేరియంట్లు ఏమైనా ఉంటే వాటి ట్రాకింగ్‌కు, సకాలంలో ప్రతిస్పందనకు మద్ధతుగా ఉంటుందని తెలిపారు. టెస్ట్ , ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రోగులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఆసుపత్రి ప్రాంగణంలో మాస్క్‌లు ధరించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రధాని కోరారు. అలాగే, ఐఆర్ఐ/ ఎస్ఏఆర్ఐ కేసులపై పర్యవేక్షణ ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19, అడెనోవైరస్‌లకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19 కోసం అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్, ఆసుపత్రుల్లో బెడ్స్, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉండాలన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ఇంకా ముగిసిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) కేసుల ల్యాబ్ నిఘా , పరీక్షలను మెరుగుపరచాలని ఆదేశించారు. దేశంలోని ఆసుపత్రులు అత్యవసర పరిస్ధితులకు సిద్ధంగా వున్నాయని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలన్నారు. కాగా.. గత నాలుగు రోజులుగా మాత్రం యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇక, దేశంలో గత నాలుగు రోజులుగా వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరినట్టు స్పష్టం చేసింది. ఇక, దేశంలో ప్రస్తుతం.. 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పెను భూకంపం -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై కేసీఆర్ సీరియస్.. ఉన్నతస్థాయి సమీక్ష..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ ఘటన రోజురోజుకు ముదురుతోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. దీనిపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, మంత్రి హరీష్ రావు, కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్‌లీక్‌పై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు -
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వుల ప్రకారం అన్ని శాఖాధిపతుల, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013" అమలు తీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల భద్రతకు, సంక్షేమానికి, సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు బడ్జెట్లో కూడా భారీ మొత్తంలో నిధులను మహిళల సంక్షేమం, అభివృద్దికే కేటాయిస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఆరోగ్య పరంగా అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఫిర్యాదులు చాలా తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయని, ఇందుకు జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే పని చేసే ప్రదేశంలో మహిళా ఉద్యోగినులపై ఎటు వంటి లైంగిక వేధింపులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు, మహిళలు వారి సమస్యలను నిర్బయంగా వెల్లడించడానికి ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలు ప్రధాన వేదికలుగా పని చేస్తాయన్నారు. ఇంటర్నల్ కంఫ్లైంట్స్ కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేయని శాఖాధిపతులు వెంటనే తమ కార్యాలయాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ పనిచేసే మహిళా ఉద్యోగినుల్లో ఈ కమిటీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్, శిశువులకు పాలిచ్చే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. మహిళా సాధికారత సాధనలో దేశానికే ఏపీ ఆదర్శం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత సాధనలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి చూపుతున్న ప్రత్యేక శ్రద్దే ఇందుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు గత ఏడాది మార్చి 8న సీఎం జగన్ “సబల” కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ గత ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున అమలు చేస్తూ గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం జోన్లలో పలు అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుల్లో గుర్తించిన మహిళల సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించడం కూడా జరిగిందన్నారు. కుటుంబ సలహాలు ఇచ్చేందుకు ప్రతి నెలా ప్రత్యేక డ్రైవ్‌లను కూడా మహిళా కమిషన్ నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. అయితే ఉద్యోగినులు వారు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల -
గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్ స్మృతివనం
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను అధికారులు.. సీఎంకు వివరించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అన్నారు. ‘‘విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలి. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్‌కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి’’ అని సీఎం జగన్ సూచించారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ జి విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
-
ఈ సీజన్లో పోలవరం పనుల్లో పురోగతి: మంత్రి అంబటి
సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం నిర్మాణంలో రాబోయే నాలుగు ఐదు నెలలు కీలకమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వేల ఏళ్లపాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు అని, అందుకే కాస్త ఆలస్యమైనా నాణ్యత విషయంలో రాజీపడబోమని తెలిపారాయన. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపిన మంత్రి అంబటి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని మరోసారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని చెప్పారాయన. పోలవరంపై తానేం రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారాయన. ఇది తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవగాహనారాహిత్యం, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతోనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల ఇంత అనర్థం జరిగిందని స్పస్టం చేశారు. డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని, చర్యల సంగతి ప్రాజెక్టు పూర్తైన తర్వాతేనని చెప్పారాయన. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని.. నిపుణులు చెప్తున్న మాట అని మంత్రి అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందుకు వెళ్లాలి. ఏ విధంగా రిపేర్ చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని మరోసారి స్పష్టం చేశారాయన. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ తొందరపాటుతోనే ప్రాజెక్టకు నష్టం జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు తప్పిదం తప్ప మరొకటి లేదు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలి. దీని కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్లైన్లు ఎందుకు? వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అందుకే పనులు కాస్త ఆలస్యమైనా నాణ్యతగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారాయన. వైఎస్ఆర్ కలలు కన్న ప్రాజెక్టు ఇది. సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి. ఇదీ చదవండి: ఏపీ ఓ బంగారు గని -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వేదికగా పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ప్రభుత్వం వివరించనుంది. తద్వారా పెట్టుబడుల ఆకర్షణకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ సదస్సును వేదిక చేసుకోనుంది. ఇక సమీక్షలో భాగంగా కార్యక్రమాల షెడ్యూల్‌ను అధికారులు సీఎంకు వివరించారు. వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలను తెలియజేశారు. ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలు తదితర వివరాలను సీఎంకు తెలిపారు. సదస్సు నిర్వహణలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ► ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభం. ► 10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న సదస్సు. ► కీలక అంశాలపై సదస్సునుద్దేశించి మాట్లాడనున్న పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు. ► తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు. ► దీనితర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు. ► వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపనున్న సీఎం. ► సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ► తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం. ► తొలిరోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు, విందులో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ► రెండోరోజున వాలెడిక్టరీ సెషన్. ► ఈ సెషన్లో పాల్గోనున్న పలువురు ప్రముఖులు. ► రెండోరోజునా పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు. ► ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని అధికారులు మొత్తంగా షెడ్యూల్ ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకాడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు సీఎం జగన్. ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, మైన్స్ అండ్ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, ట్రాన్స్‌కో జేఎండీ పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్ బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామన్న అధికారులు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టంచేసిన సీఎం. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామన్న అధికారులు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడి. విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపిన అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్న అధికారులు. అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడి. ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించిన అధికారులు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడి. -
మాంసపు వ్యర్థాలు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. గురువారం వివిధ శాఖల అధికారులతో తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. నగరంలో కుక్కల బెడద నివారణకు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలో కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లుగా ఆహారం వేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపై వేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా చేరడానికి కారణమవుతోందని పేర్కొన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపై మాంసపు వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల విషయంలో ప్రస్తుతం 8 ప్రత్యేక టీములతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం.. కోతులు, కుక్కల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్ (040–21111111)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. కోతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రత్యేక అనుభవం ఉన్న వారి ద్వారా నగరంలోని కోతులను పట్టుకొని అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ శ్రుతిఓజా (హెల్త్), పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉండకూడదు: సీఎం జగన్
-
గృహనిర్మాణశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సొంత ఇల్లు అనేది పేదవాడి కల: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తెలిపిన వివరాలు ఇవే.. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబర్ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. స్టేజ్ కన్వెర్షన్ కూడా బాగా జరిగిందని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు, సిమెంటుపైన 34 పరీక్షలు, స్టీలుపై 84 పరీక్షలు, ఇటుకలపైన 95 టెస్టులు.. ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామన్నారు. ఎక్కడ లోపం వచ్చినా వెంటనే గుర్తించి నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబ్స్ వినియోగపడుతున్నాయని అధికారులు వివరించారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. సొంత ఇల్లు అనేది పేదవాడి కల, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ ల్యాబ్స్‌ను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలి. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు వెల్లడించారు. సుమారు 30 వేలమందికి ఇళ్ల నిర్మాణంలో కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అసవరమైన భూ సేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు రూ.7630 కోట్లు. ప్రభత్వం ఇప్పటి వరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసింది. ఇప్పటివరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో 74వేల ఇళ్లలో శ్వాబ్స్ వేసే పనులు జరుగుతున్నాయని, మరో 79వేల ఇళ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్ సమీక్ష.. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని సీఎం జగన్ తెలిపారు. ఈ మూడున్నర సంవత్సరాలలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉచితంగా 300 అడుగులు ఇళ్లు, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసింది. అధికారులు అందించిన వివరాల ప్రకారం.. టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ మొత్తంగా రూ.20,745 కోట్లని సీఎం జగన్ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు కింద, మౌలిక సదుపాయాలకోసం ఈ మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చుచేశామని, దీంతోపాటు 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల రూపాయల లబ్ధి పేదలకు జరిగిందని తెలిపారు. వీరు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బును పూర్తిగా మాఫీ చేయడమే కాకుండా, బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, నెలా నెలా వాయిదాలు కట్టాల్సిన పనిలేకుండా పూర్తి ఉచితంగా ఆ ఇళ్లను అందిస్తున్నామన్నారు. మిగిలిన వారికి ఊరట కల్పించే చర్యల్లో భాగంగా 365, 430 చదరపు అడుగులు ఇళ్లకు లబ్ధిదారులకు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ. 482 కోట్ల మేర లబ్ధి జరిగిందని, ఆ మేరకు ప్రభుత్వం ఆ భారాన్ని కూడా తీసుకుంటుందన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మరో రూ.1200 కోట్ల భారాన్ని ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. నిర్మాణ ఖర్చులు, పైన కల్పించిన ప్రయోజనాలు ద్వారా ప్రభుత్వం తీసుకున్న భారంగా చూస్తే రూ.20,745 కోట్లు ఈ ప్రభుత్వం టిడ్కో ఇళ్లమీద పెట్టిందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పేదలందరికీ ఇళ్ల కింద ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ఖర్చు.. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామాగ్రిని అందించడం వలన కలిగిన ప్రయోజనం రూపేణా ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.13,757.7 కోట్లు. ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారుల తదితర సదుపాయాల కోసం చేస్తున్న ఖర్చు రూ.32,909 కోట్లు. అంటే కేవలం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే చేసిన ఖర్చు రూ.36,026 కోట్లు. పేదలకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వ భూములు 28,554.64 ఎకరాలు. వీటి విలువ రూ.17,132.78 కోట్లు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం డబ్బు పెట్టి కొన్న భూమి 25,374.66 ఎకరాలు. ఈ భూముల విలువ సుమారు. 15,364.5 కోట్లు. విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు. ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలు. వీటి విలువ రూ.11,200.62 కోట్లు. మొత్తమ్మీద అన్ని రకాలుగా ఇళ్లపట్టాల రూపేణా పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు. ఈ భూములు విలువ రూ.56,102.91 కోట్లు. పేదలంరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, కార్యక్రమం విలువ మొత్తం రూ.1,05,886.61 కోట్లు. ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదిన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ట్యాక్స్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ(బుధవారం) బిఆర్కేఆర్ భవన్ లో అధికారులతో రాష్ట్రాల స్వంత పన్నులు పన్నుయేతర ఆదాయాల రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్ తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లను పెంచేందుకు అవసరమైతే ప్రత్యేక చర్యలను చేపట్టాలని అధికారులను సీఎస్ కోరారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి లక్ష్యాలను చేరుకోవాలని ఆమె తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖలైన కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, రవాణా శాఖలు అదనపు ఆదాయాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించాలని కోరారు. ఈ ఏడాది జనవరి చివరి నాటికి పన్నుల వసూళ్లలో రూ. 91,145 కోట్లు, పన్నుయేతర ఆదాయంలో రూ. 6996 కోట్లు మొత్తం రూ. 98,141 కోట్లుగా ఆదాయం సమకూరిందని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రాహుల్ బొజ్జా, కమీషనర్, కమర్షియల్ టాక్సెస్ నీతూ కుమారి ప్రసాద్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, డైరెక్టర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మరియు ఇతర అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
ఏపీ: మూడు నెలల్లో నిషేధిత ప్లాస్టిక్ వినియోగానికి చెక్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నిషేధిత ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ వినియోగాన్ని మూడు నెలల్లో పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర పర్యావరణ, శాస్త్రసాంకేతిక, ఇంధన, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగరంలో బుధవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి. మానవాళికి హాని కలిగించేలా, పర్యావరణంకు విఘాతం ఏర్పడేలా కాలుష్యంను విడుదల చేస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా పరిశ్రమలు వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేయకుండా, వాటిని శుద్దిచేసి, హానికర రసాయనాలను పూర్తిగా తొలగించిన తరువాతే బయటకు వదిలేలా చూడాలని కోరారు. అందుకు అవసరమైన వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లను పరిశ్రమలు సిద్దం చేసుకోవాలని అన్నారు. దాదాపు రూ.20.30 కోట్ల జరిమానా రాష్ట్ర వ్యాప్తంగా 17 కేటగిరిల్లోని 307 పరిశ్రమలు ఇప్పటికే AP PCB పరిధిలో నిత్యం కాలుష్య నియంత్రణ ప్రమాణాలపై ఆన్ లైన్ ద్వారా సమాచారంను అందిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఏ పరిశ్రమలో అయినా కాలుష్యం ప్రమాణాలకు భిన్నంగా వెలువడితే వెంటనే పీసీబీ అధికారులు సదరు పరిశ్రమలను అప్రమత్తం చేయడానికి వీలవుతోందని తెలిపారు. ఇదే విధానాన్ని అన్ని పరిశ్రమలకు వర్తింపచేయాలని అన్నారు. ఇప్పటికే ఇండస్ట్రియల్ పొల్యూషన్ మానిటరింగ్, హజార్డ్ వేస్ట్, బయోవేస్ట్, ఈ-వేస్ట్, ప్లాస్టిక్ వేస్త్, బ్యాటరీ వేస్త్, ఫ్లైయాష్ విభాగాల్లో పీసీబీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రమాణాలను పాటించని సంస్థలపై జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు దాదాపు రూ.20.30 కోట్లను జరిమానాలుగా విధించడం జరిగిందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఏపీ పీసీబీ పనిచేస్తోందని అన్నారు. వివిధ కేటగిరిల్లోని వ్యర్థాల నిర్వహణపై ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలకు నివేదికలను సమర్పిస్తున్నామని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై నేరుగా స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తోందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ప్రమాణాలు పాటించని సంస్థలపై తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారాయాన. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్ క్యాప్) కింద రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యంను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి గాలి కాలుష్యంపై పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఐఐటి తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ, ఎన్‌ఎఆర్‌ఎల్, సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ, ఐఐటి మద్రాస్ ల ద్వారా రాష్ట్రంలోని పలుచోట్ల గాలి కాలుష్యంపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. హాట్ స్పాట్ లను గుర్తించడం, కాలుష్యానికి కారణాలను పరిశీలించి, వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే 42.90 కోట్లతో పలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో బయో వ్యర్థాల నిర్వహణ సగ్రమంగా జరగాలని, బయోవేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఇస్తున్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపించే బయో వ్యర్థాలను నిర్థిష్టమైన ప్రమాణాల మేరకు డిస్పోజ్ చేస్తున్నారో లేదో పరిశీలించే విధానాలను రూపొందించాలని కోరారు. ఈ సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
-
ప్రతి ఎమ్మెల్యే మళ్లీ గెలవాలి: సీఎం జగన్
-
సీఎం జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం (ఫొటోలు)
-
వాళ్లను తిప్పికొడదాం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ముందుకు పోదాం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో.. ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ సమీక్ష సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ప్రతీ గడపకూ వెళ్లి గృహ సారథులు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడప మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు. 93 శాతం గృహసారథుల నియామకం పూర్తి దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నామని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవాళ్లు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్‌ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్ టు డోర్ నిర్వహిస్తారు. గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు. గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలన్నారు. వాళ్లను తిప్పికొడదాం సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి. వాటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. పుంజుకోవాల్సిందే గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ దాదాపు 7,447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ జరిగింది. సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శించారు ఎమ్మెల్యేలు. అలాగే.. ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలని సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు సూచించారు. గడప గడప కి మనప్రభుత్వ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి స్పష్టంచేసిన సీఎం జగన్.. నిర్వహణలో వెనకబడ్డ ఎమ్మెల్యేలు పుంజుకోవాలని చెప్పారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఆ ఎమ్మెల్యేలు మెరుగుపడాలని తెలిపారు. మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే గెలవాలి. నిరంతరం ప్రజలోనే ఉండాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. -
మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు అన్నారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని అధికారులు వివరించారు. డిసెంబర్-2022 వరకూ జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం. ఏపీలో వసూళ్లు 26.2 శాతం. తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలను కలిపిచూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని, దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా అధికారులు వెల్లడించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని, విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయన్న అధికారులు.. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామని తెలిపారు. టాక్స్ అసెస్మెంట్ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామని, డివిజన్ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్న సీఎం జగన్, తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. గనులు-ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరు శాతం చేరుకున్నామని అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్ల ఆర్జన. నిర్దేశించుకున్న రూ.5వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని, ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా రూ. 3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి... పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని అధికారుల వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(ఎక్సైజ్ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, అటవీపర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గనులు భూగర్భశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, రవాణాశాఖ కమిషనర్ పి ఎస్ ఆర్ ఆంజనేయలు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ ఎం గిరిజా శంకర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపి అటవీ అభివృద్ధి సంస్ధ సీజీఎం ఎం రేవతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, ఏపీ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి, గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జగనన్నకు చెబుదాం..
సాక్షి, అమరావతి: ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందుకు అధికారులంతా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సన్నాహకాల్లో భాగంగా స్పందన కార్యక్రమంలో అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతి పరిష్కారం అయ్యేంత వరకూ ట్రాక్ చేయాలని చెప్పారు. ‘అందిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్ చేయడంతో పాటు నివేదికలు తీసుకోవాలి. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్న దానిపై ప్రతివారం సమీక్ష చేయాలి’ అని అన్నారు. సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో ‘జగనన్నకు చెబుదాం’ ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలని చెప్పారు. తర్వాత జిల్లా, మండల స్థాయిలో, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఈ విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. మానిటరింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుందని తెలిపారు. ఈ మెకానిజం అంతా సిద్ధం కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సహనం, ఓపిక, పునఃపరిశీలన ►సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నది. సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునరి్నర్మాణాలతో ముందుకు సాగాలి. ►స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి. జగనన్నకు చెబుదాం ప్రారంభమయ్యాక కూడా ఇవే విభాగాల నుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సిబ్బందికి ఓరియంటేషన్ ►జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్ ఇవ్వాలి. మానిటరింగ్ యూనిట్ల ఏర్పాటుపై కూడా మార్గదర్శకాలు రూపొందించాలి. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి. ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యం. సమస్య పరిష్కారం అయ్యాక వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలి. ►ఏదైనా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తిరస్కరణకు గురైనా, జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలి. అవినీతికి సంబంధించిన అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలి. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి. ►పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో కూడిన మండల, మున్సిపల్ స్థాయి సమన్వయ కమిటీ వారంలో ఒక రోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికి అవగాహన కల్పించాలి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, సెర్ప్ సీఈఓ ఏఎండీ ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సబ్జెక్టుల వారీ టీచర్లు, తరగతి గదుల్లో ఐఎఫ్బీ, టీవీ స్క్రీన్లు, వీటిలో ఉంచాల్సిన పాఠ్యాంశాలు, బైజూస్ ట్యాబుల వినియోగం, స్వచ్ఛ, విద్యార్థులకు రాగి జావ, జగనన్న విద్యా కానుక, నాడు–నేడు కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ‘‘విద్యారంగంలో మనం అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరం. దీనివల్ల విద్యా కానుక దగ్గరనుంచి పాఠ్యాంశాల వరకూ, అదే విధంగా మౌలిక సదుపాయాలు దగ్గర నుంచి గోరుముద్ద వరకూ కూడా నాణ్యత పెరుగుతుంది. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా కూడా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరం. పాఠ్యపుస్తకాల్లో పేపర్ క్వాలిటీ బాగుండాలి’’ అని సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..: ►6వ తరగతి ఆపైన ఉన్న ప్రతి తరగతిగదిలోనూ ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం ►దీనివల్ల బోధన, నేర్చుకోవడం సులభతరమవుతుంది ►6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం ►తర్వాత 8 వ తరగతి నుంచి ట్యాబ్‌లను ఇస్తున్నాం ►దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం ►ఇలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా డిజిటిల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలి ►ఇది ఏ రూపంలో ఉండాలన్న దానిపై అధికారులు ఆలోచించి ప్రతిపాదనలు ఇవ్వాలి ►దీనివల్ల శాశ్వతంగా పిల్లలకు ఉత్తమ బోధన అందించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు అవుతుంది ►సీఎం ఆదేశాలతో సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు ►ఈ మార్పులు కారణంగా చక్కటి అర్హతలున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చారన్న అధికారులు ►గతంలో 3,4,5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదని, సబ్జెక్టు టీచర్స్ కాన్సెప్ట్‌లో భాగంగా సబ్జెక్టుల వారీ టీచర్లతో మంచి బోధన అందుతుందన్న అధికారులు ►విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్ అంశంగా తీసుకుని మరింత దృష్టి పెట్టాలన్న సీఎం ►ఐఎఎఫ్‌పి ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో వారి బోధనపై సీరియస్‌గా ఉండాలి ►సీరియస్‌గా బోధన లేకపోతే ఫలితం ఉండదు ►మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది ►ఐఎఫ్బీ ప్యానెల్స్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లందని తెలిపిన అధికారులు ►వీటిని నిర్దేశించుకున్న సమయంలోగా నాడు – నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లకు అందించాలన్న సీఎం ►వచ్చే విద్యాసంవత్సరంలోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు అందించాలన్న సీఎం ►నాడు – నేడు పూర్తవుతున్న కొద్దీ ఆ స్కూళ్లలో ఐఎఫ్‌పీలు ఏర్పాటు ఉండాలన్న సీఎం ►8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లు ప్రారంభంలోగా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం ►పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్.... ఇవన్నీ కూడా పూర్తి సినర్జీతో ఉండాలన్న సీఎం ►ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిషులో పట్టుపెంచుకునేందుకు వారికి చేదోడుగా నిలవాలన్న సీఎం ►ఈ క్రమంగా ఇంగ్లిషు మాట్లాడ్డం, రాయడంలో వారు మెరుగైన ప్రావీణ్యం సాధించాలన్న సీఎం ►టోఫెల్, మరియు కేంబ్రిడ్జి లాంటి సంస్థల భాగస్వామ్యాన్నికూడా తీసుకోవాలన్న సీఎం ►వీరి సహాయంతో 3వ తరగతి నుంచీ పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫకెట్లు జారీచేసేలా కార్యక్రమాలను రూపొందించాలని సీఎం ఆదేశం ►టీచర్లకూ ఇంగ్లిషుపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలన్న సీఎం ►విద్యార్థులు ట్యాబులను వినియోగిస్తున్న తీరును సీఎంకు వివరించిన అధికారులు ►ట్యాబుల వినియోగంలో వైఎస్సార్ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థుల మొదటి మూడు స్థానాల్లో ఉన్నారన్న అధికారులు ►ట్యాబుల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్‌బ్యాక్ అందించాలన్న సీఎం. ►సీఎం ఆదేశాల మేరకు గోరుముద్దలో భాగంగా రాగిమాల్ట్‌ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు జగనన్న విద్యాకానుకపైనా సీఎం సమీక్ష ►మార్చిలో మొదలుపెట్టి ఏప్రిల్ చివరినాటికి విద్యాకానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామన్న అధికారులు ►సీఎం ఆదేశాలమేరకు స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక కిట్ అందిస్తామన్న అధికారులు ►మొదటి దశ నాడు–నేడుపై ఆడిట్‌పై సీఎం ఆరా. ఆడిట్ పూర్తయ్యిందన్న అధికారులు ►మౌలికసదుపాయాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దాలన్న సీఎం ►ఐఎఫ్‌పీ, టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ►అప్పుడే పూర్తిస్థాయిలో నాడు – నేడు పూర్తవుతుందన్న సీఎం ►మొత్తంగా 11 రకాల సదుపాయాలను నాడు – నేడు కింద కల్పిస్తున్నామన్న అధికారులు రెండోదశ నాడు–నేడుపైన సీఎం సమీక్ష. ►మొదటి దశలో 15,715 స్కూళ్లను బాగుచేసిన ప్రభుత్వం ►రెండో దశలో 23,221 స్కూళ్లను బాగుచేస్తున్న ప్రభుత్వం ►మూడోదశలో 16,968 స్కూళ్లను బాగుచేయనున్న ప్రభుత్వం ►వీటితోపాటు అంగన్వాడీలు, హాస్టళ్లనుకూడా బాగుచేస్తున్న ప్రభుత్వం ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎం.వి శేషగిరిబాబు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్.దీవాన్ రెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శం కావాలి
సాక్షి, తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిగ్రామంలో క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ వెళ్తారని, జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సీఎం జగన్ స్పందిస్తూ.. అనుకున్నట్లు మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ► అలాగే.. మార్చి 1వ తేదీ నుంచి కూడా.. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ అందించాలన్నారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ లేదంటే జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడది. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి అని ఆకాక్షించారు సీఎం వైఎస్ జగన్. ► వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామని అధికారులు బదులిచ్చారు. వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్న ఆయన.. స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. విలేజ్ క్లినిక్స్ - ఎస్ఓపీ విలేజ్ క్లినిక్స్ ఎస్ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు చేర్చామని అధికారులు తెలిపారు. దానికి స్పందించిన సీఎం వైఎస్ జగన్.. విలేజ్ క్లినిక్స్ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రతిరోజూ ఈ అంశాలపై కూడా సమీక్షించాలని, కలెక్టర్లు కూడా నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది, ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందాలి. గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలి. హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలని సీఎం జగన్.. అధికారులకు సూచించారు. దీనికి స్పందించిన అధికారులు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎక్కడా రాజీ పడొద్దు గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) నివారణ, చికిత్సలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా వీరిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెడుతున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నాం. అక్కడి సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది. అలాగే పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. దానికి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలి. ఎక్కడా రాజీ పడొద్దు అని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. దానికి స్పందించిన అధికారులు.. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండు కూడా మార్చికల్లా పూర్తవుతాయని వివరించారు. అలాగే.. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వైద్య సిబ్బందికి స్క్రీనింగ్, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు, సీఎం జగన్‌కు వివరించారు. ప్రతీ బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలి. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలి. అన్ని చోట్లా క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఇవి ఏర్పాటు కావాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండెజబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారని సీఎం వైఎస్ జగన్.. అధికారులతో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలుగు వారి హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు: సీఎం జగన్ -
ఆక్వా రైతులకు మేలు జరగాలి... మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశం సందర్భంగా పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. వైద్య, ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం. అలాగే పశు సంవర్థక శాఖలో కూడా ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి. యూనిఫార్మిటీ (ఏకరూపత) తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చు. ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి ఒక హేతుబద్ధత ఉండాలి. దీనికోసం ఒక మార్గదర్శక ప్రణాళికను తయారుచేయాలి. పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలి. లక్ష్యాలు నిర్దేశించుకుని.. ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలి. ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్, అందులో ఏఎన్ఎం, అండగా ఆశావర్కర్లు ఇలా ఒక వ్యవస్థ జనరేట్ అయ్యింది. అలాగే ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలి. గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఎస్ఓపీ తయారుచేయాలన్నారు. ప్రతీ మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలి. దీనివల్ల సంతృప్తస్థాయిలో పశువులకు తగిన వైద్యం సహా పోషణ సేవలను అందించడానికి వీలవుతుంది. పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్ నంబర్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నంబర్లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి. దీనివల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. పశుసంవర్థక శాఖలో ఏ స్కీం అమలు చేసినా అర్హులందరికీ అది అందాలి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే.. అందరికీ ఆ స్కీంలు అందజేయాలి. వివక్ష లేకుండా అందరికీ స్కీంలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలి. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరగాలి. రసాయనాలకు తావులేని పశుపోషణ విధానలపై అవగాహన పెంచాలి. పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి. పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. దీనికోసం ఎస్ఓపీ రూపొందించాలి. పశువులకు సేవల్లో దేశానికి మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని కొనసాగించాలన్న సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు వచ్చి సందర్శించి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే రెండు సంవత్సరాలపాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాము. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడానికి, ఆ మార్గాలను బలోపేతంచేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాలకోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలో కూడా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వచేయడానికి ప్రతీ ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 4,765 ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. జగనన్న పాలవెల్లువ సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. 2.6 లక్షల మంది రైతులు పాలవెల్లువ కింద పాలు పోస్తున్నారన్న సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. 606 లక్షల లీటర్లను ఇప్పటివరకూ సేకరించాము. వచ్చే రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం వెళ్తుంది. చిత్తూరు డైయిరీ పునరుద్ధరణకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీంతో, మరో రెండు మూడు వారాల్లో శంకుస్థాపనకు అన్నీ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్ష.. మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వేగంగా పనులు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. జువ్వలదిన్నెలో ఇప్పటికే 92.5శాతం పనులు పూర్తి అయినట్టు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి జువ్వలదిన్నె పనులు పూర్తి అవుతాయన్నారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతీ త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబర్ నాటికి మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు.. సీఎం జగన్‌కు తెలిపారు. రెండో ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్నిరకాలుగా అనుమతులు మంజూరు అయ్యాయని అధికారులు వెల్లడించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇక, మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల జీడీపీ పెరుగుతుంది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుంది. దీని వల్ల ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఫిషింగ్ హార్భర్ నుంచి ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని సీఎం జగన్ అన్నారు. ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న సీఎం జగన్ ఆకాంక్షించారు. ఆక్వా రైతులకు మేలు జరగాలి. దీనికోసం ఫీడు, సీడు రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకువచ్చామన్నారు. వీటిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ఆక్వా రంగంలో కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసివేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. దీని ద్వారా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలని, ఈ సీజన్లో అధికారులు దీన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. దీనిపై అధికారులు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలన్నారు. ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ సెంటర్లపైనా దృష్టిపెట్టాలన్నారు. సహకార రంగం మాదిరిగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ,పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) వై మధుసూధన్‌రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు తదితరులు హాజరయ్యారు. -
రోడ్లు బాగు చేస్తున్నా.. విషప్రచారం ఆగట్లేదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై దురుద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన రోడ్లు, భవనాల శాఖపై పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయండి. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయండి. మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం కనిపించకూడదు. కనీసం ఏడేళ్లైనా అవి పాడవ్వకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా నిర్వహణ కూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని అధికారులను ఆదేశించారాయన. ఇందుకోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తిచేయాలని సూచించారాయన. నేల స్వభావంతోనే సమస్య.. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. అయితే.. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీని వాడితే ప్రయోజనం ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా.. అందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్న సీఎం జగన్.. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో చేపట్టాలని ఆదేశించారు. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలని, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారాయన. బాగు చేస్తున్నా.. విషప్రచారమే! అధికారులతో సీఎం జగన్.. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ఆ వివరాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ‘‘ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం తప్పట్లేదు. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. కంటగింపుతో విష ప్రచారం చేస్తున్నాయి. వాళ్ల కడుపుమంటకు మందులేదు. అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి అని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఏపీసీఎం ఎంఎస్ యాప్ ప్రారంభం పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను ఈ సమీక్షా సమావేశంలోనే సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఈ యాప్ ద్వారా రోడ్ల గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అలాగే.. ఫొటోలను సైతం అప్లోడ్ చేసే అవకాశం ఉంది ఈ యాప్‌లో. జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదుతో పాటు దీనిపై కమాండ్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే.. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు చేపడతారు అధికారులు. రిపేర్ మాత్రమే కాదు.. నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు ఏ సమస్యలు రావని సీఎం జగన్.. అధికారులతో అన్నారు. పట్టణాలు, నగరాలు ఎక్కడైనా సరే రోడ్ల మరమ్మతులు నాణ్యమైన ప్రమాణాలతో జరగాలని పేర్కొన్నారాయన. ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని ఏపీసీఎం ఎంఎస్ ద్వారా ఫిర్యాదు అందితే.. 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. అంతేకాదు.. యాప్ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. రోడ్ల మరమ్మతులపై అధికారులంతా ప్రత్యేక దృష్టిపెట్టాలి. కేవలం రిపేర్ మాత్రమే కాదు.. నాణ్యత మీదా ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్ల రిపేర్‌లో దీర్ఘకాలం నిలిచేలా టెక్నాలజీ సాయం తీసుకోండి. ఇకపైన కూడా రోడ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులు రావాలని సీఎం జగన్ అధికారుల వద్ద ఆకాంక్షించారు.