సాక్షి, తాడేపల్లి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కాగా, రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించాడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిషా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరం. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి మనస్థైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2023
కోరమండల్ రైలులో పలువురు ఏపీ రాష్ట్రవాసులు..
- విజయవాడ రీజియన్‌లో దిగేందుకు మొత్తం 48 మంది రిజర్వేషన్
- కోరమండల్ నుంచి విజయవాడకు 35 మంది రిజర్వేషన్
- ఏలూరుకు రిజర్వేషన్ చేసుకున్న ఇద్దరు ప్రయాణీకులు
- తాడేపల్లిగూడెంకు ఒకరు రిజర్వేషన్
- రాజమండ్రి స్టేషన్‌లో దిగేందుకు 12 మంది రిజర్వేషన్.
ఇక, ఈ రైలులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 124 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి స్టేషన్‌లో 24 మంది దిగాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఒడిషాలో ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడం, పట్టాలు తప్పిన కోరమండల్ బోగీలను యశ్వంతపూర్ రైలు ఢీకొట్టడంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో అధికారికంగా ఇప్పటి వరకు 233 మంది ప్రయాణీకులు మృతి చెందగా, వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment