కోవిడ్ అప్రమత్తతపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు | Cm Jagan Review Meeting On Corona Precautionary Measures | Sakshi
Sakshi News home page

కోవిడ్ అప్రమత్తతపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Fri, Dec 22 2023 1:28 PM | Last Updated on Fri, Dec 22 2023 6:42 PM

Cm Jagan Review Meeting On Corona Precautionary Measures - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు.. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.. అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

‘‘పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నాం. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నాం. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశాం. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి’’ అని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే...
ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారు
ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలి
అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలి
కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలి
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా  బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement