Precautionary measures
-
అతిజాగ్రత్తతో వృద్ధికి ఆటంకం
న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థలు జాగ్రత్త చర్యలు అతిగా అమలు చేస్తే ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. రెగ్యులేటర్లు మరీ సంప్రదాయకంగా, అతిజాగ్రత్తగా వ్యవహరించకూడదన్నారు. అయితే, ఏ రంగంలోనైనా ‘ప్రమాదాలు’ చోటు చేసుకుంటే సత్వరం స్పందించే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోటక్ ఈ విషయాలు తెలిపారు. ‘భారత్ భవిష్యత్తుపై నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను. అదే సమయంలో తగిన జాగ్రత్త లేకుండా కేవలం అవకాశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్లడమనేది రిసు్కతో కూడుకున్న వ్యవహారం. అలాగని, మరీ అతిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అక్కడికి (సంపన్న దేశం కావాలన్న లక్ష్యానికి) చేరుకోలేం‘ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్ల పాటు 7.5–8 శాతం జీడీపీ వృద్ధి రేటును కొనసాగించాలంటే సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ చెప్పారు. -
కోవిడ్ అప్రమత్తతపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు.. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ‘‘పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నాం. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధంచేస్తున్నాం. పీఎస్ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, డి–టైప్ సిలిండర్లు కూడా సిద్ధంచేశాం. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి’’ అని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ♦ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారు ♦ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలి ♦అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్ చేయాలి ♦కొత్తవేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలి ♦ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం -
కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ తుపాను ప్రభావం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలపై ఉంటుందని చెప్పారు. మిగతా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశముందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని సీఎస్ చెప్పారు. కోతకోసి పనలపై ఉన్నవారి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. వివిధ నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని.. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్ అండ్ బీ, విద్యుత్, టెలికం తదితర శాఖలను ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత వాతావరణ శాఖ అమరావతి డైరెక్టర్ స్టెల్లా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ హైఅలర్ట్ మరోవైపు.. మిచాంగ్ తుపానుపై విద్యుత్ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను పీడిత ప్రాంతాల్లోని మండలాల్లో 11కేవీ స్తంభాలు, లైన్లు, డీటీఆర్లు దెబ్బతింటే వాటిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక తుపాను సమయంలో లైన్మెన్ నుంచి చైర్మన్ వరకు ఎవరికీ సెలవులు ఉండవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబుతో మిచాంగ్ తుపాను సంసిద్ధతపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. -
మెడనొప్పి బాధిస్తుందా.. అయితే ఇలా చేయండి
ఇటీవలి కాలంలో మెడనొప్పి సమస్య చాలా మందిని వేధిస్తోంది. మెడనొప్పి ఉంటే ఏ పనులూ సరిగ్గా చేయలేం. ఈ మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. ముందుగా కారణాన్ని తెలుసుకుని, అందుకు తగ్గ చికిత్సను తీసుకుంటే మెడ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. ఆఫీసులో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న వారు గంటల తరబడి కూర్చుని లాప్టాప్ లేదా కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి వస్తుంది. సాధారణంగా మనం కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి వస్తుంది. చిన్న సమస్యే అని తేలిగ్గా తీసేస్తే సమస్య మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది. మెడ నొప్పికి కారణాలు: సరిగ్గా కూర్చోకపోవడం: కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువ సేపు ఉపయోగించేటప్పుడు సరిగ్గా కూర్చోకపోవడం వల్ల దీనివల్ల కండరాలకు ఒత్తిడి కలుగుతుంది. మంచం మీద పడుకుని లేదా కూర్చొని చదవడం వల్ల కూడా ఒత్తిడికి దారితీస్తాయి. ఇది మెడనొప్పికి కారణమవుతుంది. గాయాలు: తల అకస్మాత్తుగా వెనుకకు, తరువాత ముందుకు కదిలినప్పుడు, నరాలు ఒత్తుకుపోవడం... వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. కీళ్ళు అరిగిపోవడం: శరీరంలోని ఇతర కీళ్ళ మాదిరిగానే మెడ కీళ్లు కూడా వయస్సు వచ్చే కొద్దీ అరుగుతాయి. ఈ అరుగుదల వల్ల మెడ కదలికలు ప్రభావితం అవుతాయి. దీనివల్ల మెడనొప్పి వస్తుంది. ► అయితే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. మెడ నొప్పిని తగ్గించే చిట్కాలు సరైన భంగిమ: కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు భుజాలు తుంటిపై సమానమైన వాలులో ఉన్నాయని నిర్ధారించుకోండి. అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు సమకోణంలో ఉండేట్టు చూసుకోవాలి. సెల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా ఇతర చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు మెడను వంచకూడదు. అలా వంచకూడదంటే ఈ వస్తువులు మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో పెట్టాలి. అలాగే మీ వర్క్ టేబుల్, కంప్యూటర్, కుర్చీని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. విరామం అవసరం: ఎక్కువసేపు డ్రైవ్ చేయాల్సి వచ్చినా.. లేదా స్క్రీన్ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వచ్చినా.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా మెడను, భుజాలను బాగా కదిలించండి. అలాగే మీ శరీరాన్ని సాగదీయండి. భుజాలపై ఎక్కువ బరువును వేయద్దు: మీ భుజాలు, చేతులపై ఎక్కువ బరువుండే బ్యాక్ ప్యాక్ లను మోయకండి. ఎందుకంటే ఇవి మీ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా. మెడ నొప్పి వస్తుంది. సౌకర్యంగా పడుకోవాలి: మీ తల, మెడ.. మీ శరీరంలోని మిగిలిన భాగాలకు అనుగుణంగా ఉండాలి. మీ తలకింద పెద్ద సైజు దిళ్లను అసలే ఉపయోగించకండి. దిండు లేకుండా ఉండలేమనుకుంటే చిన్న దిండును మాత్రమే ఉపయోగించండి. కాళ్ల కింద దిండును వేసుకుంటే మంచిది. దీనివల్ల వెన్నెముక కండరాలు రిలాక్స్ అవుతాయి. జీవనశైలిలో మార్పులు: ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవద్దు. ఎక్కువగా తిరగండి. నడవండి. ధూమపానం అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది మెడ నొప్పి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు: ఇంటి నుంచి పనిచేయడం లేదా ల్యాప్ టాప్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. అయితే శరీరాన్ని సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాల వల్ల మెడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వైద్యులు లేదా ఫిజియో థెరపిస్టులు చెప్పే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల మెడనొప్పి తొందరగా తగ్గుతుంది. కాపడం: మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, వాపు లేదా మంటను తగ్గించడానికి చల్లని లేదా హీట్ కంప్రెస్ రెండింటినీ ఉపయోగించొచ్చు. ఇది కండరాల సడలింపునకు సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. అయితే ఈ టెక్నిక్ ను 20 నిమిషాల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు. మసాజ్: మెడ నొప్పికి మసాజ్ థెరపీ వల్ల కండరాలను సడలించవచ్చు. తీవ్రమైన మెడ నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మెడనొప్పి తగ్గడానికి నొప్పి నివారణ మందులు ఉంటాయి. అయితే అలా మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్టులు తప్పవు. అందువల్ల మందులకు బదులు కొన్ని నొప్పి నివారణ చర్యలు, ఉపశమన చర్యలను పాటించడం మంచిది. -
ముంపు ముప్పు తప్పాలంటే మేల్కొనే తరుణమిదే
సాక్షి, హైదరాబాద్: ముందుంది ముంచే కాలం.. నైరుతీ రుతుపవనాల కాలం మొదలయ్యే జూన్ తొలివారం నుంచే మొదలు కానుంది. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం మరో 30 రోజుల్లో పొంచి ఉంది. ముంపు కష్టాలకు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. తొలకరి పలకరింపుల అనంతరం వరుసగా కురిసే వర్షాలతో నగరం చిగురుటాకులా వణకడం ఏటా జరిగే తంతు. ఈ నేపథ్యంలో ఇప్పుడే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. శివార్లతో పోలిస్తే కోర్‌సిటీకే ముంపు ముప్పు ఎక్కువని ఐఐటీ హైదరాబాద్, వాతావరణ శాఖ తాజా అధ్యయనంలో తేలింది. గత కొన్నేళ్లుగా (2013–2019 సంవత్సరాలు) డేటాను అధ్యయనం చేసిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఏకంగా 29 సార్లు నగరాన్ని వరదలు ముంచెత్తినా.. అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగకపోవడం గ్రేటర్ పిటీ. కుండపోత లెక్కలివీ.. ► జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో 37 ఆటోమేటిక్ వర్షపాత లెక్కింపు కేంద్రాల్లో 118 రోజుల భారీ వర్షపాతం లెక్కలను పరిశీలించిన అనంతరం ప్రధాన నగరానికే ముంపు ముప్పు ఏటా తథ్యమని ఈ అధ్యయనం తేల్చింది. తరచూ వర్షం కురిసిన రోజులు, తీవ్రత, నమోదైన వర్షపాతం లెక్కలను పరిశీలించారు. ప్రధానంగా రుతుపవన వర్షాలు కురిసే జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసినట్లు గుర్తించారు. ► కొన్ని గంటల వ్యవధిలోనే కోర్‌సిటీ పరిధిలో క్యుములో నింబస్ మేఘాలు కుమ్మేయడంతో కుండపోత వర్షాలు కురిశాయని విశ్లేషించారు. శివార్లలోనూ భారీ వర్షాలు కురిసినప్పటికీ తీవ్రత అంతగా లేదని తేల్చారు. ప్రధాన నగరంలో పట్టణీకరణ పెరగడం, వర్షపు నీరు వెళ్లే దారి లేకుండా విస్తరించిన కాంక్రీట్ రహదారులు, నాలాలపై ఆక్రమణలు, బహుళ అంతస్తుల భవనాల కారణంగా ముంపు సమస్య అధికంగా ఉందని నిగ్గు తేల్చింది. ► దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన వరదనీటి కాల్వలు కుంచించుకుపోవడమూ ఇందుకు కారణమని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ వివరాలను నగరంలోని వాతావరణ మార్పులు,భారీ వర్షాల తీరుతెన్నులపై భారత వాతావరణ శాఖ ప్రచురించిన అర్బన్ క్లైమేట్ జర్నల్‌లోనూ ప్రచురించినట్లు పరిశోధకులు తేల్చారు. ఇరవైతొమ్మిదిసార్లు.. వరదలు.. నగరంలో 2013 నుంచి 2019 మధ్యకాలంలో 29 సార్లు ప్రధాన నగరాన్ని వరదలు ముంచెత్తినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రధానంగా జూన్–సెప్టెంబరు మధ్యకాలంలోనే 15 సార్లు వరదలు సంభవించినట్లు తెలిపింది. మార్చి –మే మధ్యకాలంలో 8 మార్లు, అక్టోబరు–డిసెంబరు మధ్యకాలంలో 5 మార్లు వరదలు ముంచెత్తాయని పేర్కొంది. జనవరి–ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి వరదలు సంభవించాయని తెలిపింది. సెంటీమీటరు మేర కురిస్తేనే.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకధాటిగా ఒక సెంటీమీటరు వర్షం కురిస్తే చాలు నగరంలో వరదనీరు పోటెత్తుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక 24 గంటల్లో ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నగరం అతలాకుతలమవుతుందని గుర్తించింది. ప్రధానంగా 90 శాతం వరదలు జూన్–అక్టోబరు మధ్యకాలంలోనే తలెత్తినట్లు తేల్చింది. 2013లో 31 రోజులు, 2016లో 25సార్లు నగరంలో వరదలు భారీగా సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైనట్లు అధ్యయనం తెలిపింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలతోనే అధిక నష్టం వాటిల్లినట్లు తేల్చింది. -
‘పెళ్లాడబోయే వాడే’ కదా అని పర్సనల్ వీడియోలు షేర్ చేయడంతో..
Cyber Crime And Phone Addiction Prevention Tips: లాస్య (పేరు మార్చడమైనది) డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆన్లైన్లో వినీత్ (పేరు మార్చడమైనది)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్లోనే చాటింగ్, వీడియో కాలింగ్‌తో రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి ఇద్దరికీ. ఇంట్లో కూడా వినీత్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇరువైపుల పెద్దలు ఆన్లైన్లో పరిచయాలు చేసుకున్నారు. నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేసుకొని, ఆ రోజున కలుసుకుందామనుకున్నారు. చివరికి ఎంగేజ్మెంట్ దగ్గర పడుతున్నా లాస్య నిర్లిప్తంగా... ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుండడంతో తల్లిదండ్రులు విషయం ఏంటని ఆరాతీశారు. తను మోసపోయిన విధానం గురించి లాస్య ఎలాగూ నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలను వినీత్‌తో పంచుకుంటే.. వాటిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు లక్షల రూపాయలు ఇవ్వమని వేధిస్తున్నాడని, లేదంటే వాటిని ఇతర సైట్లలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ భోరున ఏడ్చింది. ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు తల్లిదండ్రులు. డిజిటల్ మాధ్యమంగా అనుకోని పరిచయాల వల్ల జరిగే మోసాలు ఎన్నో. ;పదే పదే అదే పనిగా.. అనురాధ (పేరుమార్చడమైనది) ఆఫీసులో పనిలో ఉంది. కానీ, ఫోన్‌ని పదే పదే చూస్తోంది. మరో గంటలో ఫైల్ కంప్లీట్ చేసి, పై అధికారికి సబ్మిట్ చేయాలి. కానీ, ఉదయం అప్లోడ్ చేసిన పోస్ట్‌కి పెద్దగా స్పందన లేదు. ఏం చేయాలి?! కొత్తగా ఎవరైనా కామెంట్స్ పెట్టారా లేదా.. అని నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి ఫోన్ చూస్తూనే ఉంది. పని మీదకు ధ్యాస వెళ్లడం లేదు. సాధారణంగా శారీరక, మానసిక సమతుల్యంపై గతంలో దృష్టి పెట్టేవారు. ఇప్పుడు వీటికితోడు డిజిటల్ వెల్బీయింగ్ కూడా తోడైంది. అవగాహన లేమి కారణంగా డిజిటల్ మాధ్యమంగా ఆన్లైన్ వ్యసనానికి, రకరకాల మోసాల బారిన పడుతున్నవారి సంఖ్యా పెరుగుతుంది. ఎన్నోవిధాలుగా వచ్చే సమాచారం నిజమని నమ్మితే, ఆ తర్వాత జరిగే అనర్థాలు వేరు. డిజిటల్లో మంచిని తీసుకుంటూ, చెడును వదిలేస్తూ మన జీవనానికి ఉపయోగపడే సమాచారం తీసుకోవడానికి వెల్బీయింగ్ ఆఫీసర్ ఎందుకు అవసరమో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాదాపు రోజులో 6–7 గంటల పాటు ఫోన్‌కే సమయాన్ని కేటాయిస్తుంటారు. ఆన్లైన్లో ఉంటున్నవారిలో గృహిణులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆఫీసులో ఉన్నవారు అక్కడి పని మర్యాదను ఎలా పాటించాలి, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? పిల్లలు తమ చదువుకు సంబంధించిన విషయాల పట్ల ఎలా శ్రద్ధ చూపాలి... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. దీనిని చీఫ్ వెల్బీయింగ్ ఆఫీసర్ ద్వారా సాధించవచ్చు. డిజిటల్ క్షేమం... స్మార్ట్‌ఫోన్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. ఇందులో అలారం గడియారం, కెమరా, నగదు ట్రాన్సాక్షన్లను భర్తీ చేసేసింది. మీరు దీని నుంచి దూరం అవ్వాలనుకున్నా కాలేరు. అయితే, వీటిమూలాన ప్రతికూల పరిణామాలూ తప్పవు. 1. అలవాటు–స్వీయ నియంత్రణతో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. 2. సామాజిక బాధ్యతలలో బాహ్య ఒత్తిడి కూడా ఉంటుంది. 3. డిజిటల్ వెల్‌బీయింగ్‌ను అర్థం చేసుకోవడం, కుటుంబం, పని, వివిధ అవసరాలకు తగిన సాంకేతికతతో సమతుల్యతను సాధించడం అవసరం. 4. సాంకేతికతను ఉపయోగించడంలో సమయం పైనా దృష్టి పెట్టాలి. 5. డిజిటల్‌ను ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. 6. ముఖ్యంగా పరధ్యానాన్ని తగ్గించాలి. ఒక్క క్లిక్... కేవలం అప్లికేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా డిజిటల్ అనుభవాన్ని పొందలేం. వాటిని ఆచరణలో పెట్టడం ద్వారానే అనుకున్నవి సాధించవచ్చు. మానసిక ఆరోగ్యం కోసం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్, టైమ్ మేనేజ్మెంట్ సెషన్లను గుర్తించి, వాటిని ఉపయోగించుకోవచ్చు. భౌతిక శ్రేయస్సు కోసం డిజిటల్ వినియోగం అంతగాలేని పర్యటనలు, వ్యాయామాలు, ఉత్తరాలు.. వంటి వాటిమీద దృష్టి పెట్టవచ్చు. సోషల్ మీడియాను నిర్వహించడం, డిజిటల్ పేరెంటింగ్ వంటి డిజిటల్ శ్రేయస్సు చుట్టూ ఉన్న కొన్నింటిని ఉపయోగించుకోవచ్చు. ఉపయోగపడే యాప్‌లు మీరు రోజూ ఎన్నిగంటలు నిద్రపోతున్నారో తనిఖీ చేయడానికి స్లీప్ ట్రాకింగ్ యాప్‌లు ఉన్నాయి. డైటరీ ట్రాకింగ్ యాప్‌లతో భోజనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కేలరీలను లెక్కించడం, హైడ్రేటెడ్‌గా ఉండాలని గుర్తుచేయడం.. వంటి పనులను ఆ యాప్స్ చేస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. లేచి కదలాలని లేదా యోగా లేదా సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ చేయడంలో గైడ్ చేయాలని గుర్తు చేస్తాయి. ఆందోళన, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను ఎదుర్కోవడానికి విశ్రాంతి, ధ్యానం చేయడంలో మానసిక ఆరోగ్య యాప్‌లు సహాయపడతాయి. మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోండి. డిజిటల్ సంక్షేమ అధికారి పాత్ర ఎందుకంటే... డిజిటల్ వెల్బీయింగ్ పాలసీని రూపొందిండంతోపాటు దానిని ఆచరించాలి. అమలు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎంతవరకు డిజిటల్ ఉపయోగపడుతుందో.. సమీక్షించుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారిని కూడా గైడ్ చేస్తూ, మంచి పనులను ప్రోత్సహించండి. ఈ పనిని మీకు మీరుగా, కుటుంబంలో, స్నేహితుల్లో ఎవరైనా చేయచ్చు. - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మానవ మనుగడకి ముప్పుగా కాలుష్యం.. ఏటా 70 లక్షల మరణాలు!
ప్రకృతి ఒడిలో ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్నవారు తప్ప ప్రపంచంలో మిగతా ప్రజలంతా కలుషిత గాలినే పీల్చుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి కలుషితమైన గాలినే పీల్చుకుంటోంది ప్రపంచంలోని 99 శాతం జనాభా. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తాజా గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఎక్కువమంది ప్రాణాలను హరిస్తున్న కాలుష్య మహమ్మారి ఇది. ఏటా ఈ కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది బలవుతున్నారు. ఈ కాలుష్యం ఇంటా బయటా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఆరుబయటను పీల్చటం వల్ల ఏటా 42 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వంటగదుల్లో పొగ కాలుష్యం వల్ల ఏటా 38 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగటం వల్ల వస్తున్న క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్ సహా అనేక దీర్ఘకాలిక రోగాలతో ఏటా మన దేశంలో దాదాపు 13.5 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. మనదేశంలో నమోదైన మొత్తం మరణాలలో ఇది 18 శాతం. మరణాలు, వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఏకంగా రూ. 2,60,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. స్థూల జాతీయోత్పత్తి లో ఇది 1.4 శాతం మేరకు ఉంటుందని ఒక నివేదిక చెబుతోంది. కోవిడ్ –19 కారణంగా దాదాపు రెండేళ్లలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 54.4 లక్షలు. అయితే ఏటా వాయు కాలుష్యం 70 లక్షల మందిని బలిగొంటున్నా పాలకులకు అంతగా పట్టట్లేదు. ఇంతకీ వాయు కాలుష్యం అంటే ఏమిటి? భూ ఉపరితల వాతావరణంలో ప్రకృతిసిద్ధమైన గాలి సహజ గుణగణాలను ఇంటా బయటా రసాయనిక, భౌతిక, జీవ సంబంధమైన వాహకం ద్వారా కలుషితం కావటం. ఒక్కమాటలో చెప్పాలంటే అసాధారణమైన రసాయనాలు లేదా ధూళి కణాలు కలిగి ఉన్న గాలే కలుషితమైన గాలి. వాయు కాలుష్య రకాలు.. వంట కలప, మోటారు వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, అడవులు తగులబడటం వంటివాటి ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున పంట అవశేషాలను కాల్చడం.. పొగ, పొగమంచు, సూక్ష్మరేణువులతో కూడి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, రాడాన్ ప్రధాన కారణాలు. ఇంట్లో వాయు కాలుష్య కారకాలైన అత్యంత ప్రమాదరకమైన మూడు కారకాల్లో రాడాన్ ఒకటి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రధాన కాలుష్య కారకాలు.. అతిచిన్న ధూళి కణాలు (పిం.ఎం. 2.5, పి.ఎం. 10), కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్తో పాటు సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉంది. ఇవేకాక గ్యాసోలిన్, బెంజీన్, స్టైరిన్, ఫార్మాల్డిహైడ్ వంటి అస్థిర సేంద్రియ సమ్మేళనాలూ వాయు కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. సహజ వాయు కాలుష్య కారకాలు... అడవులను దహించే కార్చిచ్చు, పుప్పొడి, ధూళి తుపాను, రాడాన్ వాయువు మొదలైనవి. అసహజ కాలుష్య కారకాలు.. మనుషుల పనులు, వాహనాల్లో మండించే ఇంధనం, ఇళ్లు, ఫ్యాక్టరీలలో ఉపయోగించే బొగ్గు, కలప ఇతర ఇంధనాలు వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. హరిత గృహ వాయువులు.. వాతావరణ మార్పు వాతావరణ మార్పులతో వాయు కాలుష్యకారకాలు సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి. పార్టిక్యులేట్ మ్యాటర్ (పి.ఎం.) ధూళి కణాలు వాతావరణాన్ని వేడిక్కిస్తాయి లేదా చల్లబరుస్తాయి. బ్లాక్ కార్బన్, ఓజోన్ వంటి కొన్ని కాలుష్య కారకాలు వాతావరణంలో వేడిని బంధించడం ద్వారా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అయితే సల్ఫర్ డయాక్సైడ్ వంటివి కాంతిని పరావర్తనం చెందించే కణాలను ఏర్పర్చి వాతావరణాన్ని చల్లబరుస్తుంటాయి. సూర్యరశ్మిని భూవాతావరణంలో బంధిస్తూ హరిత గృహ వాయువులూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానమైనవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి (ఇవన్నీ సహజంగా ఏర్పడతాయి)తో పాటు ఫ్లోరినేటెడ్ వాయువులూ (ఇవి సింథటిక్) ఉన్నాయి. వీటిని హరిత గృహ వాయువులని, వీటి ప్రభావాన్ని హరిత గృహ ప్రభావమని అంటున్నాం. మన దేశంలో హరిత గృహ వాయువుల తలసరి ఉద్గారాలు తక్కువ. అయితే మొత్తంగా చూస్తే కాలుష్యకారక దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉంటే మూడో స్థానంలో మన దేశం ఉంది. మనుషుల అవసరాల కోసం బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే భూతాపోన్నతి.. గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. దీన్ని పారిశ్రామిక పూర్వకాలం (క్రీ.శ. 1850– 1900 మధ్య) నుంచే గమనిస్తున్నాం. ఇప్పుడు వాతావరణం వేగంగా మారుతోంది. 2100 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 5.4 డిగ్రీల సెల్సియస్ దాకా పెరగవచ్చు. ఈ మార్పు వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. ప్రజారోగ్యానికీ హాని కలుగుతోంది. జాతుల మనుగడకూ ముప్పే. దీన్ని తట్టుకొని నిలబడడం ప్రపంచానికే సవాలుగా మారింది. విధాన నిర్ణేతలు తప్పనిసరిగా మెరుగైన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వాయు కాలుష్య నివారణ,నియంత్రణ చట్టం – 1981 వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. పిల్లలను బడులకు పంపొద్దు పిల్లల ఊపిరితిత్తులు నాజూగ్గా ఉంటాయి. కాబట్టి వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని బడులకు పిల్లలను పంపవద్దు. ఎర్త్ లీడర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కార్యక్రమం కింద వ్యాస రచయిత సారథ్యంలో అహ్మదాబాద్, సూరత్‌లోని కొన్ని పాఠశాలల్లో వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే కిట్లను పిల్లలతోనే తయారుచేయించి, ఆయా పాఠశాలల్లో అమర్చారు. వాయు కాలుష్యం ఎప్పుడు, ఎంత ఉంటున్నదని తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా తెలుసుకోవడానికి వీలుగా డేటాను క్లౌడ్‌తో అనుసంధానించారు. వాయు కాలుష్య సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోంది. గాలిలో కాలుష్య కణాలు.. సల్ఫేట్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం క్లోరైడ్, బ్లాక్ కార్బన్ (డీజిల్ వాహనాల నుంచి విడుదలయ్యే కణాలు బ్లాక్ కార్బన్‌ను కలిగి ఉంటాయి), ఖనిజాల «ధూళి వంటివన్నీ కాలుష్య కణాలే. గాలిలో తేలియాడే ఈ అతిచిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకుంటున్నాం. పది మైక్రో మీటర్లు (మీటరులో 10లక్షల వంతు) లేదా అంతకంటే చిన్న కణాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లగలవు. అయితే వీటికన్నా ఇంకా చిన్న కాలుష్య కాణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న (పి.ఎం. 2.5) కాలుష్య కణాలు ఊపిరితిత్తులను దాటుకొని మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. పి.ఎం. 2.5 కణాలు మన వెంట్రుక వ్యాసంలో ముప్పయ్యవ వంతు సూక్ష్మంగా ఉంటాయి. మనుషులను మరణానికి చేరువ చేస్తున్న అయిదవ అతి ప్రమాద కారకాలివి. 80 శాతం వాయు కాలుష్య మరణాలకు పి.ఎం. 2.5 కాలుష్య కణాలే కారణం. వీటి మూలంగా 2010లో 6, 27,000 మంది మృత్యువాత పడ్డారని, ఆ ఏటి మరణాల్లో ఇవి 6 శాతమని 2012లో జీబీడీ – లాన్సెట్ పేర్కొంది. గాలి నాణ్యతపై నిఘా గాలి నాణ్యత విషయంలో ప్రతి దేశానికి వేరువేరు ప్రమాణాలున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను నిర్దేశించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సూచీలో కాలుష్య తీవ్రతను తెలియజెప్పే ఆరు విభాగాలున్నాయి. ఎనిమిది కాలుష్య కారకాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యత ఏ మేరకు ఉందో నిర్ధారిస్తారు. రెండేళ్లుగా బిఎస్6 ప్రమాణాలు శిలాజ ఇంధనాలు వినియోగించే మోటారు వాహనాలు తదితర యంత్రాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ (బీఎస్ఈఎస్)ను ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్ణీత కాలవ్యవధిలో ఈ గాలి కాలుష్య ప్రమాణాలు అమలవుతున్నాయి. భారత్స్టేజ్ 6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలకు మాత్రమే దేశవ్యాప్తంగా 2020 నుంచి రిజిస్ట్రేషన్ సాధ్యపడుతోంది. చమురు కంపెనీలు కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా 100 పీపీఎం మేరకు గంధకం కలిగిన పెట్రోలు డీజిల్‌ను సరఫరా చేస్తున్నాయి. తక్కువ కాలుష్య కారకమైన ఇంధనంగా పేరుగాంచిన సిఎన్జీతో సమానమైన సామర్థ్యం బిఎస్6 ప్రమాణాలతో కూడిన డీజిల్, పెట్రోల్‌కు ఉండడం విశేషం. కాటేస్తున్న వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 2019లో వాయు కాలుష్యం వల్ల 67 లక్షల మంది చనిపోయారు. చైనాలో అత్యధికంగా 18.5 లక్షల మంది, భారత్‌లో 16.7 లక్షల మంది వాయుకాలుష్యానికి బలయ్యారు. మన దేశంలో ప్రతి నలుగురు మృతుల్లో ఒకరు వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న కారణాల్లో రక్తపోటు, పొగాకు, నాసిరకం ఆహారం తర్వాత నాలుగో స్థానం వాయు కాలుష్యానిదే. దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైతే అనేక రకాల జబ్బుల పాలు కావడమే కాకుండా మరణాలూ సంభవిస్తున్నాయి. వాయు కాలుష్య మరణాలు ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది తెలంగాణలో35,364 మంది ∙ 2019లో దేశంలో వాయుకాలుష్యంతో చనిపోయిన వారిలో సగం మంది ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌కు చెందిన వారే. తద్వారా జరిగిన ఆర్థిక నష్టం 3,680 కోట్ల డాలర్లు. ఇంకా చెప్పాలంటే మన దేశ స్థూల ఉత్పత్తిలో 1.36 శాతం. ∙2019లో ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది వాయు కాలుష్యం బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏపీలో 15.6 శాతం మరణాలకు కారణం వాయుకాలుష్యమే. ఆర్థిక నష్టం 134.95 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 1.09 శాతం. ∙తెలంగాణలో 2019లో వాయు కాలుష్యం కారణంగా 35,364 మంది ప్రాణాలొదిలారు. రాష్ట్రంలో చనిపోతున్న వంద మందిలో 15.5 శాతం మంది వాయు కాలుష్యం వల్లనే చనిపోతున్నారు. ఆర్థిక నష్టం 111.59 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 0.91 శాతం. (సౌజన్యం: స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020) మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాలు ∙వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ∙వాయు కాలుష్యం ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. వృద్ధులు, శిశువులు, గర్భిణీలు, గుండె, శ్వాసకోశానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి హై రిస్క్ గ్రూపులోని వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ∙పిల్లల్లో ఊపిరితిత్తులు ఇంకా ఎదిగే దశలో ఉంటాయి కాబట్టి వాళ్లు వాయు కాలుష్యానికి బహిర్గతమైనప్పుడు అది వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ∙వాయు కాలుష్యం వల్ల కంటి దురదలు, తలనొప్పి, వికారం వంటి చిన్న చిన్న అనారోగ్యాలతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. అంతేకాదు దీర్ఘకాలం పాటు విషపూరిత వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి జబ్బులూ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ వాయు కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల దిగువ భాగాలకు చేరి శ్వాసనాళాల వాపు, సంధి వాపు వంటి వ్యాధులకూ కారణమవుతున్నాయి. డాక్టర్ ఎన్. సాయి భాస్కర్ రెడ్డి, జియో సైంటిస్ట్ 92463 52018 -
వాయువేగంతో ఒమిక్రాన్.. ఒకే రోజు 65శాతం జంప్
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ వాయువేగంగా విస్తరిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే కరోనా కేసులు దాదాపు 65 శాతం పెరిగిపోయాయి. సోమవారం 37,379 కేసులు నమోదైతే, ఆ తర్వాత 24 గంటల్లో ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయి. గత ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరగడం ఆందోళనను పెంచుతోంది. డిసెంబరు 30న 1.10 శాతంగా ఉన్న దేశ సగటు పాజిటివిటీ రేటు వారం తిరిగేసరికి 4.18 (జనవరి 5) శాతానికి చేరుకోవడం గమనార్హం. ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు మించిపోయాయి. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరుకున్నట్టు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీల కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్ 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. డిసెంబర్ 15న ఆయనకు కరోనా సోకగా జన్యుక్రమ విశ్లేషణ నివేదికలో ఒమిక్రాన్ సోకిందని డిసెంబర్ 25న వచ్చిన నివేదికలో తేలింది. అప్పటికే ఆయనకు జరిపిన పరీక్షల్లో రెండుసార్లు కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా తగ్గాక ఆ వృద్ధుడికి న్యుమోనియా సోకడంతో ప్రాణాలు కోల్పోయాడని ఉదయ్‌పూర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ ఖరాడి చెప్పారు. ప్రికాషన్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ నగరాలపై కరోనా పడగ విప్పడంతో బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడి వయసు ఉండి ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడేవారు ప్రికాషనరీ డోసు తీసుకోవాలని పేర్కొంది. అంతకు ముందు రెండు డోసులు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నారో అదే వ్యాక్సిన్ తీసుకోవాలని, వేరే కంపెనీది తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రికాషనరీ డోసుని జనవరి 10 నుంచి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్ స్పష్టం చేశారు. తమిళనాడు, హిమాచల్‌లో నైట్ కర్ఫ్యూ కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం ఆంక్షల్ని కఠినతరం చేసింది. గురువారం రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా వెల్లడించింది. జనవరి 9 ఆదివారం రోజంతా సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలను, మహిళల నాలుగు మారథాన్లను రద్దుచేసుకుంది. ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి సమీక్షించాలని పీసీసీలకు సూచించింది. -
Omicron Variant: ఏపీ యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత నెలలో విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు కనిపించడం లేదని వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ఈ 30 మంది ప్రయాణికులతోపాటు విదేశాల నుంచి వచి్చన వారెవరికీ కరోనా కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కానీ లేదని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి శుక్రవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు ఇందులో భాగంగా గత నెలలో ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ ఆరా తీసింది. గత నెలలో వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 7 వేల మందికి పైగా ప్రయాణికులు వచ్చారు. వీరిని జిల్లాల్లోని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఫోన్ ద్వారా, ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్ల ద్వారా నేరుగా సంప్రదించారు. కరోనా సోకిందా?ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కరోనా టీకా వేసుకున్నారా.. లేదా అనేవాటిని ఆరా తీశారు. అయితే విదేశాల నుంచి వచ్చిన ఎవరూ వైరస్ బారిన పడలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం సాయంత్రానికి విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 236 మంది విదేశీ ప్రయాణికుల వివరాలు రాష్ట్ర వైద్య శాఖకు అందాయి. రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. ఈ నేపథ్యంలో వీరు నేరుగా రాష్ట్రంలోకి ప్రవేశించలేరు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాల్లో దిగాల్సి ఉంటుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం స్వస్థలాలకు రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంబంధిత వ్యక్తుల వివరాలను ఆయా జిల్లాలకు పంపించారు. స్థానిక వైద్య సిబ్బంది వీరి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. విమానాశ్రయాల్లో చేసే వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలినప్పటికీ వారం పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. వారం అనంతరం తిరిగి వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ ప్రచారం అవాస్తవం.. రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికుల ఆచూకీ లభించడం లేదని శుక్రవారం పలు టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవం. విశాఖపట్నంతోపాటు పరిసర జిల్లాల్లో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాష్ట్రంలోకి విదేశీ ప్రయాణికులు ఎవరూ నేరుగా రావడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న వందే భారత్ పథకం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయి. వీరికి కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. – డాక్టర్ హైమావతి, డైరెక్టర్, రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
స్థిరాస్తి కొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
కరోనా ఉధృతి కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపారాలు మొదలయ్యాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు కూడా క్రమంగా జుకుంటున్నాయనే చెప్పాలి. ఆదాయపు పన్నుకి సంబంధించి స్థిరాస్తుల క్రయవిక్రయ లావాదేవీల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. ఈ వారం కొనే వారికి సంబంధించిన అంశాలు పరిశీలిద్దాం. దానికన్నా ముందు రెండు పక్షాలూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. - అటు అమ్మేవారు, ఇటు కొనేవారు ప్రతిఫలం విషయంలో సరైన అవగాహనకి రావాలి. హెచ్చుతగ్గులు పనికి రావు. భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఈ మేరకు ఒప్పందం .. అగ్రిమెంటు రాసుకోవాలి. - మొత్తం వ్యవహారం.. ప్రతిఫలం అంతా వైట్‌లోనే ఉండాలి. బ్లాక్ వ్యవహారం వద్దే వద్దు. మామూలు వస్తువులు, సేవల్లో నగదు లావాదేవీలు ఉండకూడదు. అలాగే, స్థిరాస్తి క్రయవిక్రయాలలో కూడా నిషేధం. - విక్రయించేటప్పుడు నగదు పుచ్చుకోకూడదు. ఇవ్వనూ కూడదు. - నగదు పుచ్చుకునే వ్యక్తికి, ఎంత మొత్తం నగదుగా పుచ్చుకుంటే అంత పెనాల్టీ ఉంటుంది. మిగతా అన్ని వ్యవహారాలనూ ఆరా తీస్తారు. అప్పుడు పాతవి, కొత్తవి బైటపడతాయి. కొండనాలుకకు మందు వేస్తే అసలు నాలుక బైటపడినట్లవుతుంది. కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. - ఒప్పందంలో రాసుకున్న ప్రతిఫలాన్ని పూర్తిగా వైట్‌లోనే చెల్లించాలి. - చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా .. అంటే చెక్కు ద్వారా RTGS లేదా NEFT ద్వారా లేదా డీడీల ద్వారా చేయాలి. - నగదు ప్రశ్న తలెత్తకూడదు. - చెల్లించే ప్రతి రూపాయికి ‘సోర్స్‘ ఉండాలి. దీని గురించి మనం గత వారం తెలుసుకున్నాం. ‘సోర్స్‘ అంటే ఆదాయమే అయి ఉండాలనేమీ లేదు. ఆదాయమే అయితే లెక్కల్లో చూపించి, డిక్లేర్ చేయండి. - పన్నుకు గురికాని ఆదాయమే అయితే, సంబంధించిన కాగితాలు భద్రపర్చుకోండి. రిటర్నులలో డిక్లేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఒక ‘కాలం‘ ఉంటుంది. అందులో రాయండి. - గత సంవత్సరానికి సంబంధించి పన్నుకి గురి కాని వాటి వివరాలు ఉంచుకోండి. మినహాయింపు పొందిన ఆదాయాలు, పీఎఫ్ విత్‌డ్రాయల్స్, ఎన్ఎస్సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల మెచ్యూరిటీలు, జీవిత బీమా గడువు తీరాక వచ్చే చెల్లింపులు, గ్రాట్యుటీలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటివెన్నో పన్ను భారం పడని వాటిల్లో ఉంటాయి. - మీ అబ్బాయి/అమ్మాయి విదేశాల నుంచి పంపే నిధులేమైనా ఉంటే వాటికి సంబంధించిన కాగితాలన్నీ భద్రపర్చండి. - బ్యాంకు అప్పులు,, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు, మిత్రులు ఇచ్చిన రుణాలు .. ఇలా ఎన్నో ఉంటాయి. ఏదైనా సరే ప్రతీ దానికి ఒక కాగితం .. ఓ రాత.. ఓ కోత.. రుజువులు ఉండాలి. - ముందుగా ‘సోర్స్‘ మీ అకౌంటులో జమగా ఉండాలి. ఆ తర్వాతే ‘ఖర్చు‘ డెబిట్ జరగాలి. ఈ ‘సీక్వెన్స్‘లో రెండోది ముందు, మొదటిది తర్వాత జరగకూడదు. ‘షార్ట్‌ఫాల్‘ ఉండకూడదు. ఒకవేళ ‘షార్ట్‌ఫాల్‘ ఉంటే దాన్ని ఆదాయంగా భావిస్తారు. కాబట్టి జాగ్రత్త. చెల్లించే ప్రతిఫలం రూ. 50,00,000 దాటితే టీడీఎస్‌కి సంబంధించిన నియమాలు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు చదవండి : రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి -
పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, వెబ్‌డెస్క్: పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోలు ధర వంద దాటింది. ఇప్పుడప్పుడే ధర తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్ముతున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పులకు అనుగుణంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జులై 9 నుంచి పెట్రోలు దిగుమతులు తగ్గించడంతో పాటు దేశీయంగా రైతులకు ఉపయోగపడేలా ఇథనాల్ వినియోగం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాబోయే ఐదేళ్లలో లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపాలంటూ ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. దీన్ని అనుసరించి జులై 9 నుంచి లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి బంకులు అమ్మకాలు సాగిస్తున్నాయి. సాధారణంగా పెట్రోలు, ఇథనాల్ కలపడం వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఇంజన్‌పై పెద్దగా ప్రభావం చూపదు. వాహనం నడిపేప్ప్పుడు పెద్దగా తేడాలు కూడా రావు. అయితే వాహనంలో ఉన్న పెట్రోలు ట్యాంకు నిర్వహాణలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. నీటితో ఇబ్బందులు తప్పవు పెట్రోలు, ఇథనాల్లను కలిపినా అవి రెండు వేర్వేరు లేయర్లుగానే ఉండి పోతాయి. నీరు పెట్రోలుతో కలవదు, కానీ ఇథనాల్, నీరు త్వరగా కలిసిపోతాయి. వర్షకాలంలో బైకులు బయట పెట్టినప్పుడు, లేదా వాటర్ సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు ఒక్క చుక్క నీరు పెట్రోలు ట్యాంకులోకి పోయినా సమస్యలు ఎదురవుతాయి. చిన్నీ నీటి బిందువు, తేమ ఉన్నా సరే ఇథనాల్ వాటితో కలిసి పోతుంది. నీరు, ఇథనాల్ కలిసి ప్రత్యేక పొరగా ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. హైవేలపై, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఇలా జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జాగ్రత్తలు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 10కి చేరడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్లు అవగాహన కల్పిస్తున్నాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. - పెట్రోలు పంప్ ట్యాంక్ మూతలను సరిగా పరిశీలించాలి. నీటి బిందువులు, తేమ లోపలికి వెళ్లకుండా గట్టిగా బిగించాలి - వాటర్ సర్వీసింగ్ చేసేప్పుడు ట్యాంకులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి - వర్షంలో వాహనాలు ఆపినప్పుడు ట్యాంకుపై నీరు పడకుండా చూసుకోవాలి - ప్రయాణం మధ్యలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుంటే వెంటనే మెకానిక్‌కి చూపించాలి -
వైన్స్, బార్ల వల్ల కరోనా వ్యాప్తి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండవచ్చని, కానీ కరోనా వ్యాప్తికి ఈ కేంద్రాలు అడ్డాగా మారుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలు పాటించని బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షలు ఇంతేనా? ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని తాము ఆదేశించినా ప్రభుత్వం వాటి సంఖ్యను ఆశించిన స్థాయిలో పెంచలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పరీక్షల్లో 20 శాతంలోపే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా గ్రామీణ జిల్లాల్లో వాటి సంఖ్య 5 శాతానికి మించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను 70 శాతానికి పెంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మాస్క్ ధరించని 1,16,467 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితితో పోలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పాతబస్తీకి వెళ్తే 2 రోజుల్లో లక్షల మంది మాస్క్ లేకుండా దొరుకుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. బార్లు, వైన్స్, పబ్బులు, క్లబ్బులు, మాల్స్, థియేటర్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ఆదేశించింది. వైద్య నిపుణులతో కమిటీ... రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని తాము చెప్పట్లేదని, అయితే కరోనా కేసుల ఆధారంగా మైక్రో, కంటైన్మెంట్ జోన్లను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యేలా చూడాలని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్–17 కింద వెంటనే వైద్య నిపుణులతో అడ్వయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే వారికి కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సీరో సర్వేలెన్స్ నివేదికతోపాటు కంటైన్మెంట్ జోన్ల వివరాలను తదుపరి విచారణలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్క డోసు టీకా కూడా వృథా కాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రానికి అందిన టీకా డోసుల సంఖ్య, వృథా అయిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా అందుకున్న లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే... పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 14లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. చదవండి: 10 మందిలో ఒకరిపై కరోనా దీర్ఘకాల ప్రభావం -
నో పాలిటిక్స్; అన్ని జాగ్రత్తలతో నీట్-జేఈఈ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. విద్యార్ధుల భద్రత, కెరీర్ తమకు ప్రధానమని, ఈ పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు మార్గదర్శకాలు, నిర్దిష్ట విధానాలను జారీ చేసిందని చెప్పారు. మే-జూన్ నుంచి ఈ పరీక్షలు రెండుసార్లు వాయిదాపడ్డాయని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణకు సానుకూలంగా స్పందించారని, మెయిల్స్ ఇతర మార్గాల ద్వారా తమ సమ్మతి తెలిపారని మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. విద్యార్ధుల సౌకర్యానికి అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసిందని చెప్పారు. 99 శాతం విద్యార్ధులు వారు ఎన్నుకున్న కేంద్రంలోనే పరీక్షకు హాజరవుతారని, ఎలాంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రాజకీయాలకు తావులేదని అన్నారు. అన్ని వాదనలు విన్నమీదట సుప్రీంకోర్టు సైతం విద్యార్ధుల విద్యా సంవత్సరాన్ని మనం వృధా చేయరాదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇక ఈ పరీక్షలకు హాజరవుతున్న 8.58 లక్షల విద్యార్ధుల్లో 7.50 లక్షల మంది విద్యార్ధులు తమ జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్‌లౌడ్ చేసుకోగా, నీట్ పరీక్షలకు హాజరయ్యే 15.97 లక్షల మంది విద్యార్ధుల్లో 10 లక్షల మంది విద్యార్ధులు అడ్మిట్ కార్డులను ఇప్పటివరకూ డౌన్లోడ్ చేసుకున్నారు. నీట్-జేఈఈ పరీక్షలకు ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలు చేస్తూ విద్యార్ధు భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఎన్టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని వివరించారు. విద్యా శాఖ కార్యదర్శి సైతం రాష్ట్రాల విద్యాశాఖాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఇక జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ నుంచి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వరకూ పలువురు ప్రముఖులు కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి : జేఈఈ, నీట్‌లపై గళమెత్తిన గ్రెటా థన్‌బెర్గ్ -
సేఫ్‌గా ఉండాలంటే ఇంట్లోనే ఉండండి
సాక్షి, హైదరాబాద్/అమరావతి : కరోనా బయటే ఉంది. భయపెడుతోంది. మనం ఇంట్లో ఉంటే అదేం చేయలేదు. అందుకే మనం సేఫ్‌గా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలి. ఈ వారం రోజులు గడప దాటొద్దు. మనకు రాలేదు కదా అనే ధీమా.. మనకేమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. ఆదివారం మనం కనబరిచిన బాధ్యతను రానున్న కొద్ది రోజులు మరింత నిబద్ధతగా కొనసాగించాలి. ఇది ఒకరి కోసం మరొకరు.. అందరూ పాటించాల్సిన ‘ఆరోగ్య ధర్మం’. కల్లోల సమయంలో ఎలా ఉండాలో, సమాజం, దేశం పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరించాలో మనకు కరోనా నేర్పిస్తోంది. ప్రస్తుతానికి కరోనాకు మన స్వీయ నియంత్రణే ఔషధం. అది సాధ్యం కావాలంటే మనం స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఇది ఇంట్లోనే కూర్చుని ప్రదర్శించే దేశభక్తి వంటిది. మనం మన ఇంట్లో ఉంటే చాలు.. ఇరుగుపొరుగు అందరికీ మేలు. అందరం ఇది పాటిస్తే మనల్ని, మన కుటుంబాన్ని, పొరుగు వారిని, గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకున్నట్టే. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు చేస్తున్న సూచనలు, ఇస్తున్న ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. ఒక్క వారం త్యాగం చేయలేమా? అనుక్షణం దేశాన్ని పహారా కాస్తూ మనం స్వేచ్ఛగా జీవించేందుకు సైన్యం అను నిత్యం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎండనకా, వాననకా, గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయక, సరిగా తినీ తినక మన జవాన్లు చేస్తున్న త్యాగానికి, ప్రదర్శిస్తున్న వీరత్వానికి మించిన దేశభక్తి ఏముంది? వారు పడుతున్న కష్టంతో పోలిస్తే ఇంట్లోనే వారం పాటు ఉండటం పెద్ద కష్టమా? అందుకే, ఇప్పుడు దేశభక్తిని, సమాజ హితాన్ని కోరే యుక్తిని కొత్త విధంగా ప్రదర్శించే సమయమిది. మన ఇంట్లో మనం ఉంటూ, ఉన్నది తింటూ, కుటుంబసభ్యులతో కలిసి వారం పాటు ఉంటే చాలు.. అది దేశభక్తిని మించినది అవుతుంది. సైనికుల త్యాగాలతో పోల్చలేకపోయినా స్వీయ నియంత్రణ దాదాపు దానికి సమానమే. ప్రభుత్వాలు చెబుతున్న మాటలు తూచ తప్పకుండా పాటించడమే నిజమైన సమాజ సేవ. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓ వారం పాటు ఇంట్లోనే ఉంటూ నిశ్శబ్దంగా చేసే యుద్ధమిది. ప్రస్తుతానికి కోరోనా నిరోధానికి స్వీయ నియంత్రణను మించిన వ్యాక్సిన్ లేదు. పరిస్థితులు చక్కబడే వరకు బయటకు రాకపోవడమే దానికి మందు. ఇలాంటి పరీక్ష సమయంలో మనమంతా విజ్ఞతతో వ్యవహరించి.. కోరి తెచ్చుకున్న రాష్ట్రానికి విపత్తు రాకుండా చూడాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇది మన ‘బాధ్యత’. మనకు రాలేదు కదా అనే ధీమా.. మనకేమవుతుందిలే అనే నిర్లక్ష్యం.. మనకు ఎందుకు వస్తుందనే మొండితనాన్ని కనీసం మరో వారం రోజుల పాటు మర్చిపోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కల్లోల సమయంలో మనిషిలోని మానవత్వం, సేవాగుణం.. నిబద్ధతను ప్రదర్శించాల్సిన అవసరాన్ని మనకు కరోనా నేర్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న విధంగా మనమంతా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని.. దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని, మన కుటుంబాన్ని, మనల్ని కాపాడుకునేందుకు మనిషి విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉందని ఈ వైరస్ పాఠం చెబుతోంది. అందుకే, ప్రజలెవరూ బయటకు రావద్దని.. అత్యవసరమైతేనే తప్ప నిబంధనలు కచ్చితంగా పాటించాలని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు కోరుతున్నారు. వారం రోజులు ఇంట్లో ఉండలేమా! సరిహద్దుల్లో అనుక్షణం పహారా కాస్తూ.. మనం స్వేచ్ఛగా జీవించేందుకు సైనికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించే అవకాశం మనకూ వచ్చింది. మనం చేయాల్సిందల్లా మన ఇంట్లో మనం ఉండడమే. ఇంట్లోనే ఉండి హాయిగా టీవీ చూస్తూ.. పిల్లా పాపలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే చాలు దేశాన్ని రక్షించిన వారమవుతాం. సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమని నిపుణులు అంటున్నారు. అందుకే ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. స్వీయ నియంత్రణే వ్యాక్సిన్ కరోనా అంటు వ్యాధి. ఆ వైరస్ సోకిన వ్యక్తితో కరచాలనం చేసినా.. తాకినా.. ఆ వ్యక్తి తుమ్మినా సరే మరొకరికి ఆ వైరస్ సోకుతుంది. చైనాలోని వూహాన్లో బయటపడిన ఈ వైరస్ (కోవిడ్–19) ఇప్పటికే 194 దేశాలకు విస్తరించింది. వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇప్పటికే 3,51,705 మందికి సోకింది. 15,361 మందిని కబళించింది. ఇటలీలో మారణహోమం సృష్టిస్తోంది. -
కరస్పర్శ కరువైన వేళ...!
ఇది యుద్ధమే. ఆయుధాలులేని యుద్ధం. భయాన్ని భయపెట్టి, ధైర్యాన్ని గురి పెట్టాలి. కాలం ఎన్నికల్లోలాలను కనలేదు చెప్పు. ఎన్నెన్ని గత్తర్లకు కత్తెరెయ్య లేదు చెప్పు... ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్న సమయంలో వాటిని తొలగించి ధైర్యం చెప్పి నిలపవలసిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇతరులు ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవలసిన మానవతా బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. వ్యక్తులు కాకుండా మొత్తం సమాజమే ప్రమాదంలో పడ్డప్పుడు ప్రతి ఒక్కరూ ఆపదలను జయించటానికి సిద్ధం కావాలి. అందుకోసం ప్రజలను సన్నద్ధం చేసేపనిని చేస్తూ ప్రజలను ఆపదల నుంచి దరిచేర్చేందుకు కేసీఆర్ పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కరోనా దూసుకొస్తున్న ఈ ప్రమాద ఘంటికల్లో మానవత్వానికి ప్రమాదం వచ్చింది. ఈ సందర్భంలో సీఎం చేస్తున్న పని గొప్పది. ఇలాంటి సంకటస్థితిలో మనిషిని మనిషి ద్వేషించే స్థితినుంచి మానవీయ దృక్పథాన్ని ప్రతిష్టించవలసిన సందర్భం ముఖ్యమైనది. శుభ్రతా పరిశుభ్రతలను ఖడ్గాయుధాలను చేసుకుని, ఈ తాజా గత్తరకు ఘోరీ కట్టాలి. శ్వాసకు ధైర్యకవచాలను ధరింపచేయాలి. కనిపించని శత్రువుపై చేస్తున్న సామూహిక యుద్ధం సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పరిస్థితులను సమీక్షించుకుంటూ స్వీయ ఆరోగ్య పరిరక్షణా చర్యలు అవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కునేందుకు కఠినచర్యలు తీసుకుంటూనే ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానాశ్రయాలనుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల దగ్గరే పరీక్షలు నిర్వహించి ఈ నేలమీదకు కరోనాను విస్తరించకుండా చేసేందుకు మొత్తం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. శ్వాసనాళాల దగ్గరే, పరిశుభ్ర నాలాల దగ్గరే దాన్ని మట్టుబెట్టాలి. దాన్ని పసికడితే చాలు, ఈ ప్రపంచం పొలిమేరలు దాటించవచ్చు. అప్రమత్తతే ఆయుధం. కడిగేయటమే పరిష్కారం. కరచాలనమే ఖడ్గ చాలనం. ప్రణామమే ఖడ్గ ప్రవాహం. పల్లె పట్టణ ప్రగతులే విషప్రాణిని చుట్టుముట్టే పద్మవ్యూహాలు. మన ఉష్ణమండల కాసారాలతో, నిప్పుకణికల ఎండలతో, శత్రువును నిలువరిద్దాం పద. ఇది ఆయుధాలులేని మహాయుద్ధం. మనిషి ఉనికినే అంతం చేసి ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా వైరస్ మహామ్మారిని ఈ ప్రపంచ పొలిమేరల దాకా తన్నితన్ని తరిమేయటానికి మనందరం కలిసి రెండు చేతులూ శుభ్రంగా కడుక్కుందాం. మన దృష్టిని మరల్చుకోకుండా లక్ష్యాన్ని ముక్కుతో నలుపుకోకుండా ధైర్యాన్ని గురిపెట్టిన బాణం చేసి వదలాలి. మన చేతుల్ని కడుక్కుని యుద్ధంపై పరిశుద్ధ యుద్ధం చేయాలి. పల్లె, పట్టణ ప్రగతుల శుభ్రతతోనే రూపంలేని విపత్తును తరిమితరిమి కొట్టాలి. తిరగబడ్డ నేలలకు పాఠాలక్కర్లేదు. శుభ్రం చేసిన చేతులే, పరిశుభ్ర పరిసరాలే శత్రుసంహారాలు. శత్రువు చావుబతుకులు మన చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. చేతులు కడిగి చప్పట్లు కొట్టి ఈ 3వ ప్రపంచయుద్ధాన్ని ప్రపంచం ఆమడల దాకా తరిమికొడదాం. పదండి ముందుకు. విరుగుడు లేనిది ఈ ప్రపంచంలో లేదు. మనందరి కట్టుదిట్టమైన కార్యాచరణే మహమ్మారి వైరస్‌కు విరుగుడు. శత్రు చొరబాటును మనకు మనమే గస్తీలు కట్టి కట్టడి చేద్దాం. మనకు మనమే విరుగుడు. దుఃఖ నదులకు ఆనకట్ట అప్రమత్త రెప్పలతోనే కట్టాలి. ఇది ఓ కవి పద్యంతో చేసే వైద్యం. కానరాని శత్రువుపై యుద్ధాన్ని ఆరోగ్య ప్రపంచంతోనే ఢీ కొట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జాడ ఇప్పటికి అంతగా లేకపోయినప్పటికినీ అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా ప్రదర్శిస్తున్న కర్కశత్వానికి ప్రజలు, పాలకులు జాగరూకతతో ఉండటమే సరైన సమాధానం. బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని, సామాజిక దూరాన్ని పాటిం చాలని ప్రచారప్రసార మాధ్యమాలు, విస్తృతంగా ప్రచారం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవులను ఆసరా చేసుకుని బయటతిరిగితే కరోనాను కట్టడి చేయటానికి ఆటంకాలు ఏర్పడతాయి. సెలవులు ఇచ్చింది బైట తిరగటానికి, అనవసర ప్రయాణాలు చేయటానికి కాదు. వ్యాధి నివారణకంటే వ్యాధి నిరోధక చర్యలు ముఖ్యం. మాట్లాడని మాస్కే మందుపాతర. శుద్ధమైన చేయే తిరుగులేని అస్త్రం. శత్రువా నిన్నెట్లా నివారిం చాలో తెలుసు. చేతులు కడిగి నీకు నీళ్లొదులుతాం. పద్యం కూడా వైద్యమే. ఇది మూడవ ప్రపంచయుద్ధం. చేయీ చేయీ కడిగి దీన్ని ఓడిద్దాం. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్ ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు -
ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్-19 నియంత్రణలో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ వైరస్ పుట్టిన చైనా పక్కనే ఉన్న వియత్నాం దేశంలో ఇబ్బందే లేదని పేర్కొన్నారు. వారు మొదటి రోజు నుంచీ కఠిన చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. అలా కఠిన చర్యలు తీసుకున్న చోట ఇబ్బంది లేదన్నారు. కానీ ఇటలీ, ఇరాన్‌లు బాగా దెబ్బతిన్నాయని, వారు నిర్లక్ష్యంగా ఉన్నందుకే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చైనా కూడా మొదట్లో కొంత నిర్లక్ష్యంగా ఉందని, అందుకే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. కాగా, విదేశాల నుంచి మార్చి 1 తర్వాత వచ్చిన ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. (ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) ఏ దేశం నుంచి వచ్చినా సరే వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్వచ్ఛందంగా రిపోర్టు చేయాలని కోరారు. మన రాష్ట్రంలో ఉన్న వారెవరికీ కోవిడ్ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని, ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం, మన పిల్లల క్షేమం దృష్ట్యా స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరొచ్చినా సరే వారికి పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్ చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 నుంచి 10 మందికి మించి గుమికూడొద్దని, ఆర్భాటాలు లేకుండా శుభకార్యాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రెస్మీట్లో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఇక్కడి వారెవరికీ సోకలేదు.. ‘కోవిడ్‌కు సంబంధించి కరీంనగర్లో జరిగిన ఉదంతం దృష్ట్యా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో విస్తృతంగా చర్చించాం. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఆదేశాలిచ్చాం. ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 14 మాత్రమే. అందులో ఐదుగురు మాత్రమే మన ఎయిర్‌పోర్టులో దిగారు. మిగతా తొమ్మిది మంది రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రంలోకి వచ్చారు. ఇతర మార్గాల్లో వస్తున్న వారిని కనిపెట్టడం ఇబ్బందిగా ఉంది. రామగుండానికి అలాగే వచ్చారు. వారందరికీ చికిత్స అందిస్తున్నాం. ఇలా ఇతర మార్గాల్లో వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశముంది. తామే విచారణ చేస్తాం.. ‘శుక్రవారం నుంచి జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్రానికి విదేశాల నుంచి ఎవరొచ్చారో గుర్తిస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారు వాళ్లంతట వాళ్లే రిపోర్టు చేస్తే మంచిది. వారికి, వారు ఉంటున్న ప్రాంతానికి కూడా మంచిది. నేటి నుంచి పోలీసుల సహకారంతో గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బందిని వినియోగించి విదేశాల నుంచి ఎవరు వచ్చారో విచారణ చేయిస్తాం. ఈ విషయంలో అన్ని మార్గాలను అన్వేషించాలని ఇంటెలిజెన్స్‌కు కూడా సమాచారమిచ్చాం. జిల్లా కలెక్టర్లు, పోలీసులు కలసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, డీఎంహెచ్వోలతో కమిటీ ఏర్పాటు చేసి వారిని హోం క్వారంటైన్ చేస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,165 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టాం. అందులో కొందరు ఇంటికి వెళ్తామంటున్నారు. వారిని పంపిస్తాం. కానీ వారి మీద పర్యవేక్షణ ఉంటుంది’అని సీఎం వివరించారు. (ఒలింపిక్స్ వాయిదా వేస్తే మంచిది) ఆంక్షలు 31 వరకు కొనసాగింపు ‘కోవిడ్ వ్యాప్తి చెందకుండా గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వారం రోజులు మూసేయాలని ప్రకటించిన వాటిపై ఆంక్షలు కొనసాగుతాయి. సినిమా, ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పార్కులు ఈ నెల 31 వరకు మూసేస్తాం. గతంలో మార్చి 31 వరకు మూసివేత ప్రకటించిన సంస్థలపై ఆంక్షలు అలాగే ఉంటాయి. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించొద్దు. ఇప్పటికే ఈ విషయంలో ఇస్లాం మతపెద్దలు ఇందుకు అంగీకరించారు. బిషప్‌లు, పాస్టర్లు, పూజారులు, గురుద్వారాలకు కూడా చెబుతున్నాం. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, చాలామంది గుమికూడకుండా ఉండటమే మార్గం. అన్ని మతాల వారూ దీన్ని పాటిస్తే మంచిది. ఈ నెల 22న షబ్–ఎ–మెరాజ్‌ను కూడా రద్దు చేశాం. వాళ్లు కూడా అంగీకరించారు. 28న ప్రభుత్వ పక్షాన ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించం. టీవీల్లో లైవ్ టెలీకాస్ట్ ద్వారా వినిపిస్తాం. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు చేశాం. ప్రజారవాణా వాహనాల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్యాక్సీల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. గ్రామాలు, మండలాల్లో, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలి. శుక్రవారం నుంచి క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం’అని కేసీఆర్ వెల్లడించారు. చెక్‌పోస్టుల్లో తనిఖీలు ‘కరోనా వైరస్ మొదట ఏడు దేశాల నుంచి ఎక్కువగా వస్తోందన్నారు. ఆ తర్వాత 11 దేశాలన్నారు. ఇప్పుడు 167 అంటున్నారు. అందుకే ఏ దేశం నుంచి వచ్చినా సరే వారి మీద నియంత్రణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎవరికైనా వ్యాధి లక్షణాలున్నాయని గుర్తిస్తే ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌కు తెలిపితే తగిన చర్యలు తీసుకుంటారు. మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు రోజూ 84 రైళ్లు వచ్చి వెళ్తాయి. వీటి విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడాం. ప్రధాని మోదీతో ఈ రోజు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అందులో ప్రధానితో మాట్లాడతాం. రోడ్డు మార్గాల నుంచి వస్తున్న వారిని నియంత్రించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. మనకు మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ, రాష్ట్ర రహదారులున్న చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ చెక్‌పోస్టుల ద్వారా వచ్చే అన్ని వాహనాలను చెక్ చేస్తారు. ఆ వాహనాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటే హోం క్వారంటైన్ చేస్తారు. దేశవ్యాప్తంగా ముగ్గురు చనిపోయారు. మన రాష్ట్రంలో 14 మందికి మాత్రమే వచ్చింది. వాళ్లందరూ బయటి నుంచి వచ్చిన వాళ్లే. మన రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికైతే ప్రభావానికి గురి కాలేదు. కావొద్దని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అని సీఎం చెప్పారు. పరీక్షలు కొనసాగుతాయి రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 60 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. 90 శాతం మంది పరీక్షలు జరగాలనే కోరుకుంటున్నారు. పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి. 8, 9 రోజులు కష్టపడితే అవి కూడా అయిపోతాయి. ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి. బ్లాక్ మార్కెటింగ్స్, కృత్రిమ కొరతలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో మాల్స్, నిత్యావసరాల దుకాణాలు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి. అయితే, అక్కడ జనసమ్మర్థం తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా షట్‌డౌన్ అంటున్నారు తప్ప 144 సెక్షన్ అని మాట్లాడట్లేదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలే మూసేసినప్పుడు మిగిలిన వాటికి భేషజాలు అవసరం లేదు. మాకు ఏమైతది అనే నిర్లక్ష్యం పనికిరాదు. గతంలో అనుమతిచ్చాం కాబట్టి 31 వరకు పెళ్లిళ్లు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మ్యారేజ్ హాల్స్ మూసేయాల్సిందే. షాదీఖానాలు కూడా బంద్ చేయాలని మత పెద్దలు కోరారు. పెళ్లిళ్లు జరిగినా 200 మందికి మించకుండా రాత్రి 9 గంటల లోపే ముగించుకోవాలి. మన రాష్ట్రాన్ని, మన పిల్లలను కాపాడుకునేందుకు వ్యక్తిగత, గ్రామ పారిశుధ్యం పాటించాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం’అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. (ఇటలీలో ఒక్కరోజే 475 మంది మృతి) భయోత్పాతం లేదు ‘రాష్ట్రంలో ప్రస్తుతం బస్సులు, ప్రజా రవాణా బంద్ చేసేంత ఘోరమైన పరిస్థితి ఏమీ లేదు. సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా కూరగాయలు, ఇతరత్రా నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడంలో ఇబ్బంది ఉండకూడదు. లక్ష టన్నుల కందులు మార్కెట్‌కు వస్తున్నాయి. ఒకవేళ అంతగా ఆందోళనకర పరిస్థితి తలెత్తితే పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష. స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశుభ్రత ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలం. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మీడియా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతర్జాతీయ విమానాలు తక్షణమే రద్దు ‘అంతర్జాతీయ విమానాలను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో డిమాండ్ చేస్తాం. ఈ నెల 22 వరకు వేచి చూడకుండా తక్షణమే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలి. వాటి రద్దుతో ఇబ్బందులు పడే వారికి అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ గుర్తించిన వారందరూ కోలుకుంటున్నారు. వారికి వెంటిలేటర్లు పెట్టే అవసరం కూడా రాలేదు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. చికిత్సకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 500 నుంచి 600 మందిని స్క్రీనింగ్ చేసే సదుపాయం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సీసీఎంబీలోని వసతులను ఉపయోగించే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరతాం’అని సీఎం కేసీఆర్ చెప్పారు. -
కోవిడ్-19 నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం!
అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇతర దేశస్తుల వీసాలు నిలిపివేస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి17 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే ఇదివరకే వీసా అమలుచేసిన వారికి ఈ నియమం వర్తించదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో అవసరమైతే తప్పా ప్రయాణాలు చేయోద్దని సూచించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ను కట్టడి చేయోచ్చని యూఏఈ పేర్కొంది. అంతేగాక అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా ఈ నేపథ్యంలో కీలకి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేశంలో ఎమర్జెన్సీ(నేషనల్ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇక కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు కూడా వెల్లడించారు. కాగా.. ఇప్పటి వరకూ ఈ కరోనా వైరస్ బాధితుల కేసుల సంఖ్య భారత్‌లో 81కి చేరాయి. ఈ నేపథ్యంలో వైరస్వ్యాప్తిని అడ్డుకునేందుకు కరోనా లక్షణాలున్న వ్యక్తులు, కరోనా పీడిత ప్రాంతాల నుంచి వచ్చిన భారతీయులను, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా హోం క్వారైంటైన్లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చూచిస్తున్నారు. హోం క్వారైంటైన్... కరోనా సోకిన వ్యక్తిని వెంటిలైజేషన్ ఉన్న గదిలో ఉంచాలి. వీలైతే అతనికి ప్రత్యేక టాయిలెట్ సదుపాయం కల్పించాలి. ఒకవేళ ఆ గదిలో ఇంకెవరైనా ఉండాల్సి వస్తే కనీసం 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ముఖ్యంగా వృద్దులు, గర్భిణిలు,చిన్న పిల్లలు వ్యాధి సోకిన వ్యక్తికి దూరంగా ఉండాలి. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉంది. క్వారంటైన్ గది నుంచి వ్యాధి బారిన పడ్డ వ్యక్తి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలి. గుంపులు, సమూహపు ప్రదేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దేనినైనా తాకితే వెంటనే శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. కరోనా సోకిన వ్యక్తి వాడిన కప్పులు, దుప్పట్లు, టవెల్స్ లాంటి వస్తువులేవీ ఇతరులు ఉపయోగించరాదు. కరోనా సొకిన వ్యక్తి మంచాన్నిముట్టరాదు . వైరస్ గాలి వల్ల వ్యాపించకున్నా తుంపరుల ద్వారా తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. కాబట్టి మాస్క్‌ని దరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ మాస్క్‌ని ప్రతి 6-8 గంటలకొకసారి మారుస్తూ ఉండాలి. కరోనా సోకిన వ్యక్తి ఎంత జాగ్రత్తలు పాటించాలో అతనికి వస్తువులు, సామాగ్రి అందించే కుటుంబసభ్యలు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి వాడిన మాస్క్‌లను మళ్లీ వాడరాదు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి కరోనా లక్షణాలు కనబడితే వెంటనే మీకు దగ్గర్లోని హెల్త్ సెంటర్ వారికి సమాచారం అందివ్వాలి. హోం క్వారైంటైన్లో కుటుంబసభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరోనా సోకిన వ్యక్తికి ఆహారం, పానీయాలు ఏమైనా ఇచ్చేముందు చేతులకు కశ్చితంగా డిస్పోజల్ గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత వాటిని పడేయాలి. కరోనా సోకిన బాధితుడి ఆరోగ్యం మెరుగుపడ్డా మరో 14 రోజులపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్‌లోనే ఉండాలి. బయటి వ్యక్తులను ఇంట్లోకి రానివ్వరాదు. క్వారంటైన్లో ఉంచిన వ్యక్తి వాడిన దుప్పట్లను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. రోగి ఉపయోగించిన దుస్తులను వేరెవరూ ఉపయోగించరాదు. వీటిని విడిగా శుభ్రం చేయాలి. కరోనా అనుమానిత వ్యక్తితో సన్నిహితంగా మెలగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో,ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యవంతమైన ఆహార నియమాలు అవలంభిస్తే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. -
కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-
ప్రజలను ఆందోళనకు గురిచేయద్దు : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్-19) నిరోధంకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించడంతోపాటు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానిత కేసులుంటే వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్ నిరోధంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. కరోనా వైరస్ సోకితే ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని సూచించారు. అనంతపురం, విజయవాడల్లో ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ. 60 కోట్లు , ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ. 200 కోట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.(చదవండి : పేదవాడి సొంతింటి కలకు.. బృహత్ ప్రణాళిక) విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారిని సంప్రదించి ఆరోగ్య వివరాలు సేకరించడంతోపాటు.. జాగ్రత్తలు సూచిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలియజేశారు. 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్ వచ్చాయని.. మరో నాలుగింటికి సంబంధించి రిపోర్ట్స్ రావాల్సి ఉందని వివరించారు. వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నాం :అధికారులు ‘కరోనా నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పిస్తున్నాం. ముందస్తుగా 351 బెడ్లు, 47 వెంటిలేటర్లు, 1.10 లక్షల మాస్కులు, 12,444 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు సిద్ధం చేశాం. మరో 12వేల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కొత్తగా కొనుగోలు చేయడంతోపాటు, మరో 50వేల మాస్కులు కూడా అందుబాటులో ఉంచుతాం. ఐసోలేషన్ వార్డులను ప్రధాన ఆస్పత్రికి దూరంగా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల సదుపాయాలతో వాటిని ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం, విజయవాడల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కరోనా వైరస్ కేసు బాధితులకు చికిత్స అందించడానికి సిద్ధంచేస్తున్నాం. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఎవరైనా కాల్చేస్తే ప్రభుత్వ అంబులెన్స్‌లో నేరుగా ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తాం. రోగిని తరలించిన వెంటనే ఆ అంబులెన్స్‌ను పూర్తిగా స్టెరిలైజ్ చేస్తాం. దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ రూపొందించుకున్నాం. ఎక్కడైనా పాజిటివ్ కేసు వస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి, చుట్టుపక్కల వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతాం. విదేశాలనుంచి వచ్చిన వారు ఎవరైనా 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్తున్నామ’ని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. (చదవండి : ఉపేక్షించొద్దు: సీఎం జగన్) -
టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్న కోవిడ్-19 (కరోనావైరస్) గ్లోబల్ టెక్ కంపెనీలను కూడా వణికిస్తోంది. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగి ఒకరు ఈ వైరస్ బారినపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ కార్యాలయంలో చాలా పరిమితం సమయాన్ని గడిపిన ఒక ఉద్యోగికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అధికారుల సలహాలను అనుసరించి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామనీ, ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించింది. అయితే ఆఫీసును మూసి వేయలేదని పేర్కొంది. ఇరాన్, ఇటలీ చైనాకు ప్రయాణించే ఉద్యోగులను పరిమితం చేయడంతోపాటు, జపాన్, దక్షిణ కొరియాకు ఆంక్షలను త్వరలోనే అమలు చేయనున్నామని కంపెనీ తెలిపింది. కాగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అమెజాన్ తన ఉద్యోగుల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే ఏప్రిల్‌లో ఉత్తర కాలిఫోర్నియాలో జరిగాల్సిన 'గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్' శిఖరాగ్ర సమావేశాన్ని గూగుల్ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనిపై విచారం వ్యక్తం చేసిన గూగుల్, తమ అతిథుల ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తప్పలేదని వెల్లడించింది. అటు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా మేలో జరగాల్సిన తన ప్రధాన ఎఫ్ 8 డెవలపర్ సమావేశాన్ని నిలిపివేసింది. కరోనావైరస్ 57 దేశాలకు చేరుకోవడంతో వైరస్ వల్ల ప్రపంచ ప్రభావం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. (కోవిడ్-19 : ఫేస్బుక్ కొరడా) -
నీరందక.. పంట దక్కక!
సాక్షి, బొంరాస్‌పేట: వ్యవసాయ బోర్లలో రోజురోజుకు నీరింకిపోవడంతో సాగులో ఉన్న వరిపంట నిలువునా ఎండిపోతోంది. రైతులు లబోదిబోమంటున్నారు. పొట్టదశలో నీరులేక వరిపంట ఎండిపోతుండటంతో తిండిగింజలు, పశుగ్రాసం కరువయ్యే పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు. మండలంలో 14 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో ప్రతిఏటా రబీలో వరిపంట 12 వందల హెక్టార్లలో పంట సాగవుతుంది. గత వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణ వర్షపాతం 525 మిల్లీ మీటర్లకుగానూ 291.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 24 గంటల కరెంటుకు ఆశపడిన రైతులుఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ప్రస్తుతం భూగర్భజలం తగ్గిపోయి మధ్యంతరంగా వరిపంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే మండల పరిధిలోని వడిచర్ల, బురాన్‌పూర్, చౌదర్పల్లి గ్రామాల్లో పెద్దమొత్తంలో బోర్లు నీరులేక ఇంతకింతకు అడుగంటి పంటలు నష్టమవుతున్నాయి. మరో వారంరోజుల్లో మరింత ఎక్కువగా పంటనష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టానికి కారణాలు.. సాధారణ వర్షపాతానికి 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదు కావడం. 24 గంటల కరెంటుపై ఆశలు పెంచుకొని రెండంతలు సాగుచేయడం. అవసరానికి మించి సాగునీరు వాడటం. (300 –500 మి.మీ. వరకు ఆరుతడి పంటలకు సరిపోతుంది. కాగా ఇక్కడి రైతులకు వరి తప్ప మిగతా పంటలు పండించని అలవాటు ఉంది. వరిలో కరిగెటకు, పంటలో మొక్కకు 1200 మి.మీ. వరికి అవసరమున్నా 1400 మి.మీ. వరకు సాగునీరు అవసరమవుతుంది.) రైతులకు వ్యవసాయశాఖ వారు అవగాహన కల్పించకపోవడం. ఎక్కువ సాగునీరు వరి బదులు రబీలో ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు చైతన్యం, ప్రచారం చేపట్టకపోవడం. -
ఇక మలేరియా మరణాలుండవు
వారం రోజుల పాటు అవగాహన సదస్సులు హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఐటీడీఏ పీవో హరినారాయణన్ అనంతగిరి: మన్యంలో ఇక ముందు మలేరియా మరణాలు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఐటీడీఏ పీవో హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని భీమవరం పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎపిడిమిక్లో భాగంగా మలేరియా నియంత్రణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలను వివరించారు. రెండో విడతగా 1830 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేపడుతున్నామన్నారు. మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామాల్లో మరోసారి స్పేయింగ్ చేపడతామన్నారు. హైరిస్క్ ప్రాంతాలైన దారకొండ, భీమవరం,గోమంగి పీహెచ్‌సీలకు జిల్లాకలెక్టర్ ప్రత్యేక వైద్యబృందాలను పంపార ని తె లిపారు. మలేరియా నియంత్రణ ఒక్క అధికారుల వల్లే సాధ్యం కాదని, ప్రజలు సహకరించాలని కోరారు. పారిశుధ్యం మెరుగుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 10 ,13,16,20,23,27,30 తేదీల్లో అన్ని మండలాల్లో పారిశుధ్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. వీటిని మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ఏది ఏమైనా ఇక ముందు మన్యంలో మలేరియా మరణాలు ఉండకూడదన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. అంతకు ముందు ఆయన గుమ్మకోట, గరుగుబిల్లి, భీమవరం, భీంపోలు,చిముడుపల్లి గ్రామాల్లో పర్యటించారు. జ్వరాల తీవ్రత అధికం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని డాక్టర్ కృష్ణమూర్తిని ఆదేశించారు. స్థానికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని భీమవరంలో డాక్టర్‌పై స్థానికులు ఫిర్యాదు చేయగా విధుల్లో ప్రజలతో సక్రమంగా మెలగాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలపై కొరడా: పర్యటనలో భాగంగా పీవో పలువురు అంగన్వాడీ కార్యకర్తలపై కొరడా ఝుళిపించారు. గరుగుబిల్లి అంగన్వాడీ కేంద్రంలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉండడంతో పాటు పౌష్టికాహారం పంపిణీపై కార్యకర్త సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మకోటలో పౌష్టికాహారం వండకపోవడం, భీంపోలులో కేంద్ర తెరవకపోవడంతో పాటు చిమిడిపల్లిలో కార్యకర్త అందుబాటులో లేకపోవడంతో మండిపడ్డారు. చిమిడిపల్లి కార్యకర్తను సస్పెండ్ చేయాలని, మిగతావారి వేతనాలు నిలుపుదల చేయాలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీవో ఎస్ ఉమాను ఆదేశించారు. గుమ్మకోట గురుకుల పాఠశాల, భీంపోలు బాలికల పాఠశాలను పరిశీలించారు. గురుకులంలో మంచినీటి సమస్య, భీంపోలులోని సమస్యలను పరిష్కరించాలని ఆయా ఉపాధ్యాయులు పీవోను కోరారు. పీవో వెంట అరకులోయ ఎస్పీ హెచ్‌వో గురునాథరావు, ఎంపీటీసీ కొండమ్మ, సర్పంచ్ పైడితల్లి, చిన్నయ్య ఉన్నారు.