సాక్షి, తాడేపల్లి: ఒడిశాలో త్రీవ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో దాదాపు 240 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఏపీలోకి శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి(60) కూడా ఈ ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
కాగా, మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒడిషా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించాం. ఏపీలో పెన్షన్ తీసుకుని వెళ్తుండగా గురుమూర్తి మృతిచెందాడు. బాలాసోర్‌లో గురుమూర్తి నివాసం ఉంటున్నారు. గురుమూర్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, బాధితులకు కూడా పరిహారం అందిస్తున్నామన్నారు.
ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణీకులను 695 మందిని గుర్తించాం. 553 మంది సురక్షితంగా ఉన్నారు. కోరమండల్ రైలులో 480 మంది, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ప్రయాణించారు. 22 మంది గాయపడ్డారు. 92 మంది రైలు ప్రయాణం చేయలేదు. ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. విశాఖ ఆసుపత్రిలో ఐదుగురికి చికిత్స అందిస్తున్నాం. స్వల్ప గాయాలైన 11 మందికి చికిత్స అందించి పంపించాము అని తెలిపారు.
ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment