సాక్షి, అనకాపల్లి: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది.. తప్పకుండా విజయం సాధిసస్తామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.
కాగా, వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు శుక్రవారం అనకాపల్లిలోని ఎలమంచిలిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. టీడీపీ కంటే 400 ఓట్లు అధికంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి 620 పైగా ఓట్లు ఉన్నాయి. టీడీపీకి 200 ఓట్లు బలం మాత్రమే ఉంది. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే వైఎస్సార్‌సీపీ పోటీ నుంచి తప్పుకుంది. గత సాంప్రదాయానికి విరుద్ధంగా చంద్రబాబు పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. పెన్షన్ తప్పితే ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.
👉మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. టీడీపీకి బలం లేకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
👉మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..‘బొత్స సత్యనారాయణ ఎన్నో గొప్ప పదవులు చేశారు. ఎమ్మెల్సీ అనేది ఆయనకు పెద్ద పదవి కాదు. చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగట్టేందుకు మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఫలితం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించడానికి కేఏ పాల్ తప్పితే అందరూ ఏకమయ్యారు. బొత్సను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యల మీదనే కాదు రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా పోరాటం చేస్తారు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment