budi mutyalanayudu
-
విజయం వైఎస్సార్సీపీదే.. టీడీపీ బలం 200 మాత్రమే: బొత్స సత్యనారాయణ
సాక్షి, అనకాపల్లి: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది.. తప్పకుండా విజయం సాధిసస్తామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.కాగా, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు శుక్రవారం అనకాపల్లిలోని ఎలమంచిలిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. టీడీపీ కంటే 400 ఓట్లు అధికంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీకి 620 పైగా ఓట్లు ఉన్నాయి. టీడీపీకి 200 ఓట్లు బలం మాత్రమే ఉంది. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే వైఎస్సార్సీపీ పోటీ నుంచి తప్పుకుంది. గత సాంప్రదాయానికి విరుద్ధంగా చంద్రబాబు పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. పెన్షన్ తప్పితే ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.👉మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. టీడీపీకి బలం లేకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.👉మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..‘బొత్స సత్యనారాయణ ఎన్నో గొప్ప పదవులు చేశారు. ఎమ్మెల్సీ అనేది ఆయనకు పెద్ద పదవి కాదు. చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగట్టేందుకు మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఫలితం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదిరించడానికి కేఏ పాల్ తప్పితే అందరూ ఏకమయ్యారు. బొత్సను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యల మీదనే కాదు రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా పోరాటం చేస్తారు’ అని కామెంట్స్ చేశారు. -
అయ్యన్నపాత్రుడు అడ్డంగా దొరికిపోయారు : బూడి ముత్యాల నాయుడు
-
వైఎస్ ఆశయ సాధనకు ముందడుగు
దేవరాపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని తామరబ్బ, చింతలపూడి, వాలాబు గిరిజన పంచాయతీల్లో తుఫాన్ బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూప్ , వైఎస్సార్ సీపీ నాయకులు సమకూర్చిన బియ్యం, పప్పులు, దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రాంత బాధితులకు పూర్తి సహాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇందులో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సహాయం అందించడం అభినందనీయమన్నారు. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ గిరిజన పంచాయతీల్లో సుమారు 1200 కుటుం బాలకు 10 కేజీల బియ్యం, 2 కేజీ ల పప్పు, చీరలను ఎమ్మెల్యే బూడి పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌లు కోరాపు ఈశ్వరరావు, మూలగుమ్మి అప్పలకొండ, వరలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బండి స త్యం,మూలం నాయుడు, దొమ్మం గి సన్యాసమ్మ, కడారి రాజు, జి.నాగేశ్వరరావు, రామకృష్ణ, దేవరాపల్లి పీ ఏసీఎస్ అధ్యక్షుడు దాసరి గోపి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది కపట ప్రేమ
కె.కోటపాడు : ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తుంటారని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని చౌడువాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన బీసీలకు పదవి దక్కకపోవడం విచారకరమన్నారు. మొదటిసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అశోక్ గజపతిరాజుకు, రెండోసారి సుజనా చౌదరికి మంత్రి పదవులు దక్కాయన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీసీకి చెందిన ఒక్క ఎంపీకీ మంత్రి పదవి లభించలేదన్నారు. ఈమాత్రం దానికి బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు ప్రచారార్భాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బాబు బీసీలపై ప్రేమ ఒలకబోస్తారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల నాయకులు దాట్ల తాతరాజు, రెడ్డి జగన్మోహన్, దాట్ల శివాజీబాబు, బోయిదాపు జగదీశ్వరరావు, ఎటుకూరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బూడికి వైఎస్సార్ సీపీ ‘ముత్యాలు’ హారం
వార్డుమెంబరు నుంచి ఎమ్మెల్యే స్థాయికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక దేవరాపల్లి: మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడికి అరుదైన అవకాశం లభించింది. వైఎస్సార్సీపీ తరపున రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించే అవకాశాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కల్పించారు. వార్డు మెంబరుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా మాడుగుల ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన ముత్యాలునాయుడు అనేక రైతు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఈయన తండ్రి వెంకునాయడు 35ఏళ్లపాటు తారువ గ్రామం సర్పంచ్‌గా సేవలందించారు. అప్పుడే వార్డు మెంబరుగా కూడా వ్యవహరించారు. ఆయన వారసుడిగా 1984లో దేవరాపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పార్టీ బాధ్యతలు చేపట్టారు. 1995 లో తారువా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో దేవరాపల్లి ఎంపీపీగా ఎన్నికయి మాడుగుల నియోజకవర్గంలో ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. మారిన రాజకీయ పరిణామాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. మాడుగుల నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయ కర్తగా బాధ్యతలు చేపట్టారు. ఆపార్టీ తరపు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేసి తమ ప్రాంతానికి గుర్తింపు నిచ్చిన జగన్మోహనరెడ్డికి మాడుగుల నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.