వైఎస్ ఆశయ సాధనకు ముందడుగు
దేవరాపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని తామరబ్బ, చింతలపూడి, వాలాబు గిరిజన పంచాయతీల్లో తుఫాన్ బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూప్ , వైఎస్సార్ సీపీ నాయకులు సమకూర్చిన బియ్యం, పప్పులు, దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రాంత బాధితులకు పూర్తి సహాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇందులో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సహాయం అందించడం అభినందనీయమన్నారు. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ గిరిజన పంచాయతీల్లో సుమారు 1200 కుటుం బాలకు 10 కేజీల బియ్యం, 2 కేజీ ల పప్పు, చీరలను ఎమ్మెల్యే బూడి పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌లు కోరాపు ఈశ్వరరావు, మూలగుమ్మి అప్పలకొండ, వరలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బండి స త్యం,మూలం నాయుడు, దొమ్మం గి సన్యాసమ్మ, కడారి రాజు, జి.నాగేశ్వరరావు, రామకృష్ణ, దేవరాపల్లి పీ ఏసీఎస్ అధ్యక్షుడు దాసరి గోపి తదితరులు పాల్గొన్నారు.