Hudhud Cyclone
-
హుద్‌హుద్ కంటే బాబు వల్లే భారీ నష్టం
సీఎం విపరీత ప్రచారంతోపెట్టుబడులకు గండం కేంద్రానికి తప్పుడు లెక్కలు నిధులు పంచుకుతిన్న ’పచ్చ’ నేతలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం : విశాఖకు హుద్‌హుద్ తుఫాను తెచ్చిన నష్టం కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రకృతిని జయించిన వీరుడిలా, హుద్‌హుద్ తుఫానును జయించిన ధీరుడిలా చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హుద్‌హుద్ వచ్చి రెండేళ్లయిన సందర్భంగా బుధవారం సాయంత్రం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుద్‌హుద్ తర్వాత ఒక టీడీపీ ఎంపీ విశాఖలో ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని, మళ్లీ అలాంటి తుఫాను వస్తే నష్టపోతారని ప్రకటించారన్నా రు. హుద్‌హుద్ నష్టంపై సీఎం విశాఖలో ఎవ రూ నిలదొక్కుకోలేర నేలా పదేపదే ప్రచారం చేయడం వల్ల ఇక్కడ పెట్టుబడులకు ముందు కు రాలేదని చెప్పారు. హుద్‌హుద్ తర్వాత విశాఖ వచ్చిన ప్రధానికి రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.10 వేల కోట్ల సాయం అం దించాలని కోరడంతో తక్షణమే రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారన్నారు. ఇప్పటిదాకా అందులో రూ.680 కోట్లు విడుదలయ్యాయన్నారు. తుఫానులో పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, టమాటాలకు రూ. 400 కోట్లు ఖర్చయినట్టు చంద్రబాబు కేంద్రానికి లెక్కలు చూపించారని తెలిపారు. అవి తప్పుడు లెక్కలని పసిగట్టిన కేంద్రం నిత్యావసర సరకులకు కేవలం రూ.30 కోట్లను మాత్ర మే విడుదల చేసిందన్నారు. అంతేకాదు.. హుద్‌హుద్ నష్టంపై చంద్రబాబు ప్రభుత్వం వేసిన అంచనాలు కూడా తప్పేనన్నారు. సాయం సొమ్ము ఏమయింది? హుద్‌హుద్ తర్వాత ప్రపంచ దేశాలు, వివిధ సంస్థలు సాయం కింద ఇచ్చిన సొమ్ము ఏమయిందని, ఈ ప్రాంతానికి ఆ నిధులు ఖర్చు చేశారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఆ తుఫాన్‌కు లక్షా 40 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, 49 వేల పూరిగుడిసెలు నేలమట్టమయ్యాయని, ఇప్పటికి ఒక్క ఇల్లయినా కట్టించారా? అని నిలదీశారు. జిల్లాలోని పూడిమడకలో ఓ సాఫ్ట్వేర్ సంస్థ 200 ఇళ్లు నిర్మిస్తే సీఎం వాటి ప్రారంభోత్సవానికి వెళ్లడం సిగ్గుచేటన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కేవలం రూ.100 కోట్ల బీమా సొమ్ము తప్ప ఇంకేమీ రాలేదని, నవరత్న సంస్థను కాపాడడానికి సాయం చేయలేదని విమర్శించారు. హుద్‌హుద్‌లో పంటలు, తోటలు బాగా నష్టపోయాయని, వాటికి పూర్తిస్థాయిలో పరిహారం కూడా అందలేదన్నారు. ’హుద్‌హుద్ తర్వాత బస్సులో ఉంటూ పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించానంటున్న చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ఉన్నారా? తన బావమరిది బాలకృష్ణకు చెందిన షూటింగ్ బస్సులో రోజుకు రూ.24 వేల డీజిల్ ఖర్చు చేసి బసచేశారు’ అని గుర్తు చేశారు. పచ్చ నాయకులకు దసరా పండగ హుద్‌హుద్ రూపంలో వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో హైటెక్స్ నిర్మాణం మినహా చంద్రబాబు ఇంకేమీ అభివృద్ధి చేయలేదన్నారు. ప్రచారంలో దిట్టయిన బాబు.. పెద్దింటి పెళ్లిళ్లకు ఈవెంట్ మేనేజర్‌గా పనికొస్తారన్నారు. ఆయన తన ప్రచారాన్ని పేదలను ఆదుకోవడానికి చేస్తే మంచిదని హితవు పలికారు. ఆ భూములపై బహిరంగ చర్చకు సిద్ధం టీడీపీ నేతలు కబ్జాకు యత్నిస్తున్న రూ.వెరుు్య కోట్లకు పైగా విలువైన నగరంలోని దసపల్లా భూములపై బహిరంగ చర్చకు సిద్ధమని అమర్నాథ్ ప్రకటించారు. ఏ టీవీ ఛానల్ నేతృత్వంలోనైనా చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ భూములపై అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, సేవాదళ్ నగరాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు రాధ తదితరులు పాల్గొన్నారు. -
తుఫాన్ వస్తే అంతే!
వెక్కిరిస్తున్న వ్యవస్థలో లోపాలు పాడైన తుఫాన్ షెల్టర్లు నిధులివ్వని ప్రభుత్వం అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఊసేలేదు మెరుగుపడని సమాచార వ్యవస్థ విజయనగరం గంటస్తంభం: తుఫాన్లు సంభవిస్తే మనకు రక్షణ కల్పించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. హుద్‌హుద్‌లాంటి పెనువిపత్తు సంభవించి జిల్లా అతలాకుతలమైనా మనం ఇంకా గుణం పాఠం నేర్వలేదు. అందుకు తగ్గ వ్యవస్థను రూపొందించుకోలేదు. దీనిపై సర్కారు దష్టిసారించలేదు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాపై ఉంది. ఈ నెలతో వర్షాకాలం ముగుస్తుంది. ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. ఈ క్రమంలో ఆక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్లు రావడం పరపాటి. గత అనుభవాలు పరిశీలిస్తే ఈ మూడు నెలల్లో పదులసంఖ్యలో తుఫాన్లు వచ్చాయి. ఇందులో భీకరమైనవీ ఉన్నాయి. హుద్‌హుద్ కూడా 2014 ఆక్టోబర్‌లో వచ్చిందే. మళ్లీ అలాంటివి సంభవిస్తే మనం తట్టుకునే స్థితిలో లేమన్నది స్థానికుల భావం. తుఫాన్ షెల్టర్లు ఆధునీకరణ ఏదీ? తుఫాన్లు వస్తే తొలుత తీరప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇందుకు తుఫాన్ షెల్టర్లు అవసరం. ప్రస్తుతం తీరప్రాంతమైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సరైన షెల్టర్లు లేవు. జిల్లాలో 14 శాశ్వత తుపాను షెల్టర్లు ఉన్నా... దాదాపు అన్నీ శిధిలావస్థకు చేరుకున్నాయి. గత ప్రభుత్వం ఏడు బహుళ ప్రయోజన తుపాను షెల్టర్లు నిర్మించింది. ఇందులో నాలుగు పూర్తికాగా మరో మూడు నిర్మాణంలో ఉన్నాయి. మిగతా ఏడు శిధిలాలుగా ఉన్నాయి. వీటికోసం ప్రతిపాదనలు పంపినా ప్రస్తుత ప్రభుత్వం స్పందించనే లేదు. ఇప్పుడు జిల్లాలోని 31 తాత్కాలిక భవనాలైన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తుపాను షెల్టర్లు నడుస్తున్నాయి. వీటికీ తలుపులు, కిటికీలు లేకపోవడం, విద్యుత్, తాగునీరు సక్రమంగా లేకపోవడంతో మరమ్మతులకు రూ.6.83కోట్లుతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. దానికీ గతి లేదు.] సమాచార వ్యవస్థ లోపభూయిష్టం జిల్లాలో సమాచార వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. హుద్‌హుద్ సమయంలో అంత చేస్తాం... ఇంత చేసేస్తాం అని ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రుల వరకూ చేసిన హామీలు అమలు కాలేదు. సమర్థంగా పని చేసే వైర్లెస్ నెట్వర్కు తీరప్రాంతంలో పూర్తిగా విస్తరించలేదు. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈదురు గాలుల్ని తట్టుకునే విద్యుత్ వైర్లు, స్తంభాలు ఇంకా వేయలేదు. అండర్ గ్రౌండు విద్యుత్ లైన్లు వేస్తామని అప్పట్లో ప్రకటించినా జిల్లాలో అమలు జరగలేదు. నెలకోసారైనా జిల్లా విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశం కావాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల్లో ఆచరణ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మళ్లీ ఇబ్బందులు తప్పవని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
వాటిని ఎందుకు వదిలేశారు?
2014 అక్టోబర్ 12... ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని రోజు. నాడు హుద్‌హుద్ సృష్టించిన విలయం అలాంటిది మరి. చెట్లు కూలాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటలు జలమయమయ్యాయి. రహదారులు ఛిద్రమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఆ పరిస్థితినుంచి తేరుకునేందుకు ఎన్నో రోజులు పట్టింది. నాడు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు. సర్కారు పరిహారం మాత్రం కొందరికే అందింది. చాలా ఇళ్లను అధికారులు పట్టించుకోలేదు. దీనిని మానవహక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. విజయనగరం కంటోన్మెంట్: ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన నష్టాలకు ఇచ్చే పరిహారాన్ని అందించడంలోనూ... బాధితులను గుర్తించడంలోనూ జరిగిన అన్యాయానికి అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బాధితులు పదేపదే తమకు న్యాయం చేయాలని వేడుకున్నా పట్టించుకోని అధికారుల తీరుపై అందిన ఫిర్యాదు మేరకు మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది. తుఫాన్ బాధితులను గుర్తించడంలో ఎందుకు అలసత్వం వహించారంటూ జిల్లా అధికారులకు నోటీసులు అందడంతో ఇప్పుడు ఆయా మండలాల తహసీల్దార్లకు ఆయా నోటీసులను పంపించి రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన హెచ్ఆర్సీ జిల్లాలో 2014 అక్టోబర్ 12న సంభవించిన పెనుతుఫాన్ వల్ల జిల్లా ప్రజలు ఇళ్లను కోల్పోయారు. కూలిన ఇళ్లను గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) తీవ్రంగా ప్రశ్నించింది. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు నేలమట్టమయితే కేవలం ఉద్దేశపూర్వకంగా కొన్ని ఇళ్లను చేర్చలేదని జిల్లా నుంచి వెళ్లిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. డి లెస్లీ మార్టిన్ కేసును స్వీకరించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు నోటీసు ఇచ్చారు. గతంలో ఈ కేసుపై పూర్తిగా స్పందించని అధికారులకు రెండు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ ఎన్యూమరేషన్‌పై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చారు. రాజకీయ కారణాలేనా? జిల్లాలో సుమారు 18వేల ఇళ్లకు పైగా నేలమట్టమయినట్టు గుర్తించి పరిహారాన్ని పంపిణీ చేసిన యంత్రాంగం ఐదు మండలాల్లో వందలాది ఇళ్లు కూలినా రాజకీయంగా వాటిని పక్కన పెట్టేశారని జిల్లాకు చెందిన వారు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, గంట్యాడ, విజయనగరం మండలాల్లోని 652 ఇళ్లను గుర్తించలేదని సంబంధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దానిని స్వీకరించిన మానవ హక్కుల సంఘం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయానికి నోటీసు పంపించింది. గతంలోనూ ఒకసారి వివరణ ఇవ్వాలని కోరినప్పుడు ఈ ఎన్యుమరేషన్‌ను ఇతర జిల్లాలకు చెందిన వారు చేపట్టారని సూత్రప్రాయంగా తెలియజేసి ఊరుకున్నారు. అయినా పూర్తి వివరాలను ఇవ్వనందున మళ్లీ నోటీసు పంపించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. ప్రస్తుతం ఈ నోటీసును ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు పంపించారు. కుప్పలు తెప్పలుగా గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు జిల్లాలోని పూసపాటిరేగలో 166, భోగాపురంలో 144, డెంకాడలో 189, గంట్యాడలో 88, విజయనగరంలో 95 ఇళ్లు హుద్‌హుద్ తుఫాన్‌కు దెబ్బతిన్నా గుర్తించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కూలిన ఇళ్లకు పరిహారాలు పంపిణీ చేసిన సమయంలోనే జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వందలాది ఫిర్యాదులు వచ్చాయి. పశువుల శాలలు కూలిపోయిన వారికి కూడా ఇళ్లు కూలిపోయినట్టు ఇచ్చారనీ, పశువుల శాలలు లేనివారికి కూడా కూలిపోయినట్టు రాసేశారనీ, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద కూర్చుని ఎన్యూమరేషన్ చేశారనీ ఫిర్యాదులు అందాయి. అప్పట్లో ఓ సంస్థ దీనికి సంబంధించి పైన ఉదహరించిన మండలాల్లో పర్యటించి అర్హులయిన వారికి ఏ విధంగా పక్కన పెట్టారో ఓ నివేదికను కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చింది. అయితే అర్హులను గుర్తించడంలో అధికారులు స్పందించకపోవడంతో వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు మానవ హక్కుల సంఘం ఈ నోటీసును కలెక్టర్ కార్యాలయానికి పంపించింది. డీఆర్వో మారిశెట్టి జితేంద్ర పేరుతో జిల్లా కలెక్టర్ ఆయా మండలాలకు ఈ నోటీసులను పంపించారు. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. లేకుంటే మానవ హక్కుల సంఘం ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. -
చేదు జ్ఞాపకాలు
-
ఇంకెంత కాలం నిరీక్షించాలి?
హుద్‌హుద్ తుపాన్ వచ్చి అక్టోబర్ 12కి ఏడాది కావస్తుంది. ఉత్తరాంధ్రనూ, ప్రధానంగా విశాఖ నగరాన్నీ రూపు రేఖలు లేకుండా చేసిన ప్రకృతి వైపరీత్య మిది. కానీ సంవత్సరం గడిచిపోయినా విశాఖ నగరంలోని ఒక్క మురికివాడలో కానీ, మత్స్యకారులున్న ప్రాంతంలో కానీ పూర్తిస్థాయి సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు. ప్రజల పక్షాన పాలన నిర్వహించే ప్రభుత్వాలు ముందు ప్రజల దగ్గరకు వెళ్లి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. కాని అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటికైనా ఈవెంట్లూ, ఉత్సవాలూ ఆపి విశాఖనగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల, మత్స్య కారుల బాధలూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హుద్‌హుద్ వల్ల నష్టపోయిన ప్రజల సమస్యలూ తెలుసుకోవడానికి వారి వద్దకు వెళ్లాలి. తుపాను తర్వాత సర్వేలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ తమకు సరిగ్గా నష్టపరిహారం అందజేయలేదని ప్రజలు రోదిస్తుంటే వారి సమస్యల గురించి పట్టించుకోకుండా వేడుకలు నిర్వహించు కోవడం సబబుకాదు. హుద్‌హుద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటా యించిన కోట్లాది రూపాయలూ, దేశ విదేశాల్లోని దాతలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన కోట్లాది నిధులూ దేనికి వెచ్చించారు? ఆ మొత్తాలేవీ నగరంలోని పేదలకు మాత్రం అందలేదు. ఆ సహా యక నిధుల పద్దుల మీద అకౌంటెంట్ జనరల్ చేత ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అసెంబ్లీలో, ప్రజల మధ్య చర్చకు పెట్టాలి. హుద్‌హుద్‌లో ఒక్క ఎలక్ట్రిసిటీ విభాగం తప్ప మరే ఇతర శాఖలూ ప్రజలకు సేవ చేయడం కనిపించలేదు. పైగా తుపాను వల్ల ప్రజలు బాధపడుతుంటే మురికివాడల్లో ఇళ్లను అధికారులు పీకేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది అప్రజాస్వామికం. హుద్‌హుద్‌ను మించిన తుపానులు వచ్చినా తట్టుకునే స్థాయిలో పేదలకూ, మత్స్యకారులకూ, మురికివాడలలోని ప్రజ లకూ వారు ప్రస్తుతం నివసిస్తున్న చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఇంతవరకూ అనేక పర్యాయాలు ప్రజలు వినతి పత్రాలు అందజేసినా, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి పక్కాఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకంలో స్థానికంగా వ్యక్తిగత పక్కా గృహాలు నిర్మించాలి. హుద్‌హుద్ సంభవించిన సమయంలో ప్రభుత్వం అందించే సహాయం కంటే అనేక స్వచ్ఛంద సంస్థలూ, వ్యక్తులూ ప్రభుత్వా నికి రూ. 260 కోట్ల మేర సహాయ నిధి అందించారు. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కాని అమలు జరపకపోవడం అన్యాయం. నగరంలో లక్ష ఇళ్లకు పైగా ధ్వంసం అయినట్లు అధికారులు సర్వే చేశారు. కానీ నష్టపరిహారం అందించలేదు. తోపుడుబండ్లు, ఆటోలు నడిపేవారికీ, ఇతర వృత్తులు చేసే వారికీ కూడా ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. తుపానులో నష్టపోయిన కొద్ది మంది బోటు యజమానులకు మినహా అత్యధికంగా మత్స్యకారులకు నేటికీ పరిహారం చెల్లించ లేదు. చేపలు అమ్ముకునే చాలా మంది మహిళలకు సొసైటీల రిజిస్ట్రేషన్ లేదన్న మిషతో నష్టపరిహారం చెల్లించలేదు. గ్రామీణ ప్రాంతంలోని రైతులు, గిరిజన ప్రాంతంలో పంటలు కోల్పోయిన వారిలో సగానికి పైగా ఇప్పటికీ నష్టపరిహారానికి నోచుకోలేదు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరగడం వలన, సముద్రం ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని సముద్రం దగ్గర సీఆర్‌జెడ్ పరిధిని 500 మీటర్ల నుంచి, ఒక కిలో మీటరుకు పైగా పెంచవలసి వస్తుంది. ఆ పరిధిలో కట్టడాలకు అనుమతులు ఇవ్వకూడదు. సీఆర్‌జెడ్ పరిధిలో బోర్ బావులు తవ్వడం చట్టాన్ని ఉల్లంఘించడమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అటువంటి బోర్ బావులను మూసివేయాలని జిల్లా యంత్రాం గాన్ని ఆదేశించారు. కాని చాలా 5-స్టార్ హోటళ్లు ఈ ఆదేశాన్ని ఉల్లంఘించడం వలన సముద్రంలోని ఉప్పదనం భూగర్భ జలా లలోకి ప్రవేశించింది. హుద్‌హుద్ తరువాత, మునిసిపల్ నీళ్లకు అంతరాయం వచ్చినప్పుడు, ప్రజలకు భూగర్భ జలాలను విని యోగించే అవకాశం లేకపోయింది. సీఆర్‌జెడ్ నిబంధనలను పూర్తిగా అమలు చేయడం తక్షణ అవసరం. విశాఖ తీరప్రాంతంలో ఉన్న 146 సైక్లోను షెల్టర్లను పునరు ద్ధరించే పనిని కూడా వెంటనే చేపట్టాలి. అంతేకాక అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సైక్లోను షెల్టర్లను తీర్చిదిద్దాలి. ఆంధ్ర కోస్తా తీరమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. అలాగే మేఘాద్రిగెడ్డ సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి ఎగువన మన జాతీయ రహదారి వరకూ మడ అడవులు ఉండేవి. ప్రస్తుతం వాటిని తొలగించుకుంటూ పోతున్నారు. అది ఆపాలి. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు, ఈ మడ అడ వులే ఎన్నో గ్రామాలకు రక్షణ కవచాలుగా నిలిచాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ధ్వంస రచనలో ఈ మడ అడవులు రూపురేఖలు లేకుండా ధ్వంసం అయ్యాయి. హుద్‌హుద్‌ను దృష్టిలో పెట్టుకొని మిగిలి ఉన్న మడ అడవులను కాపాడుకోవడం, అక్కడ మిగిలిన చిత్తడి భూములలో మడ అడవులను పెంచడం, తీర ప్రాంతాలలో సరుగుడు, మొగలి వంటి చెట్లను పెంచడం, అభి వృద్ధి ప్రణాళికలో ఒక ముఖ్య అంశంగా చేసుకోవాలి. అలాగే ఇప్ప టికైనా విశాఖ నగరంలో సర్వే చేస్తే హుద్‌హుద్ ధాటికి తట్టుకొని ఏయే వృక్షాలు నిలిచి ఉన్నాయో అటువంటి వృక్షాలనే సిటీ పరి ధిలో నాటాలి. ఒక్కొక్కదానికి వేల రూపాయల వంతున వెచ్చించి రాయల్ ఫామ్ వంటి మొక్కలు తెచ్చి వేయడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. జీవిఎంసీ నుంచి యూసీడీ నిధులు 40 శాతం వెచ్చించి అన్ని మురికివాడల్లోనూ, మత్స్యకారులు నివసిస్తున్న గ్రామాల్లోనూ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించాలి. ఒకే చోట ఎన్నో పరిశ్రమలు పెట్టడం వలన వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రతల వలన హుద్‌హుద్‌ను మించి తుపానులు ఆ ప్రాంతానికి వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుందని శాస్త్ర పరిశోధ నలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక విధా నంలో మార్పుతేవాలి. (వ్యాసకర్త భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ విశ్రాంత కార్యదర్శి) మొబైల్: 98660 21646 - ఇ.ఎ.ఎస్.శర్మ -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ
హుద్‌హుద్ తుఫాన్ వచ్చి ఎనిమిది నెలలు దాటుతోంది.. ఇంకా వేలాది మందికి సాయం అందని పరిస్థితి . నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సాయం అందని ద్రాక్షగా మారింది. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో వేలాది మందిని జాబితాల నుంచి తొలగించారు. చిరునామాలు దొరికిన వారికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని తలపోసినా శాఖల మధ్య సమన్వయలోపం శాపంగా తయారైంది. - ఇంకా అందని హుద్‌హుద్ సాయం - 40 వేల మంది పేర్లు తొలగింపు - మరో 23వేలమందికి తప్పని నిరీక్షణ సాక్షి విశాఖపట్నం: హుద్‌హుద్ వల్ల నిరుపేదలు, మధ్య తరగతి నిలువనీడ లేక అల్లాడిపోయారు. లక్షలాది ఎకరాల్లో పంటలుదెబ్బతిన రైతులు, జీవనోపాదిలేక మత్స్యకారులు తల్లడిల్లిపోయారు. ఏడేసిలక్షల రూపాయలకు చొప్పున చనిపోయిన 45 మందికి పంపిణీ చేశారు. తుఫాన్ తర్వాత మరో ఎనిమిది మంది మృతి కేసులు నమోదైనా నలుగురు తుఫాన్ వల్ల చనిపోయినట్టుగా నిర్ధారించారు. వారికి పరిహారం ఇంతవరకూ రాలేదు. 1.18 లక్షల మందికి ఇళ్లు దెబ్బతినగా బట్టలు, సామాన్లు, పెట్టీషాపులు కోల్పోయిన మరో 37వేల మందికి రూ.82.44కోట్లు విడుదలైతే 1,18,499 మందికి రూ.64.05 కోట్ల జమ చేశారు. వ్యవసాయ పంటలు దెబ్బతిన్న 1,52,806 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 46.46కోట్లు విడుదలైతే 1,28,271 మందికి మాత్రమే రూ.40.42కోట్ల మేర జమచేసామన్నారు. బాధిత ఉద్యానవన రైతులకు రూ.161.56కోట్లు విడుదల కాగా రూ.101. 29కోట్లు, పాడి రైతులకు రూ.19.22కోట్లు విడుదల కాగా, రూ.15.51 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. వలలు,బోట్లు దెబ్బతిన్న 3993మంది మత్స్యకారులకు రూ.8.07 కోట్లు విడుదల కాగా రూ.3.50కోట్లు పంపిణీ చేశారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 4.80 లక్షల మంది బాధితులకు 3.70లక్షల మందికి రూ.249.20కోట్ల మేర పంపిణీ చేశారు. పేర్లు, అకౌంట్.. ఆధార్ నెంబర్ల నమోదులో దొర్లిన పొరపాట్ల వల్ల కొంతమందైతే..ఎన్యుమరేషన్ సమయంలో గుర్తించిన లబ్ధిదారులు ఆతర్వాత వేరే చిరునామాలకు మారిపోవడం లేదా వేరే ప్రాంతాలకు తరలిపోవడం వంటి ఘటనల వల్ల మరికొంతమందికి సాయం అందలేదు . ఈ విధంగా సుమారు లక్షా 3వేల మంది బాధితులకు పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. జాబితాలో ఉన్న ప్పటికీ ఎవరూ తమకు పరిహారం అందలేదని క్లైయిమ్ చేయని వారు, ఎన్నిసార్లు వెతికినా చిరునామాలుదొరకని వారి పేర్లను గుర్తించి జాబితాల నుంచి తొలగించారు. ఇప్పటి వరకు అన్ని శాఖలు కలిపి సుమారు 43వేల మంది పేర్లను తొలగించారు. వీరిలో గృహ లబ్ధిదారులు 6వేలుండగా,సుమారు 19వేల మంది రైతులు, మరో 15వేలమంది హార్టికల్చర్ రైతులు, ఇతర లబ్దిదారుల మరో మూడువేల మంది వరకు ఉన్నారు. గడిచిన నాలుగునెలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించిన లబ్దిదారులకు దశలవారీగా పంపిణీ చేస్తున్నారు.అకౌంట్ నెంబర్లు, ఆధార్ కార్డుల్లేక కొంతమంది..వివరాలు సరిపోక అర్హులైన లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటువంటి వారికి చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని ఇటీవలే జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయం తీసుకుని ఆ మేరకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు 40వేల మంది వరకు ఈ విధంగా పంపిణీచేయగా మరో 23వేలమందికి పంపిణీ చేయాల్సిఉంది. వీరిలో 7766మంది గృహలబ్దిదారులకు రూ.4.50కోట్లు 4,300మందికి రూ.1.10 కోట్లు, 2,200 మందికి రూ.2.50కోట్ల పంపిణీ చేయాల్సి ఉంది. మిగిలిన శాఖలకు సంబంధించి మరో రెండుకోట్ల వరకు పంపిణీ చేయాల్సి ఉందని తెలుస్తోంది. -
అడ్డగోలు దోపిడీ
హుద్‌హుద్ నిధులు వారికి కలిసొచ్చాయి... తోటపల్లి కాలువ ఎలాగూ ఉండనేఉంది... అధికారం అండగా నిలిచింది... నామినేటెడ్ పనులు కావడంతో ఆడిట్ భయం లేదు. ఇంకెందుకాలస్యం... ఒక్క పనికి రెండేసిబిల్లులు చేసేసుకుంటున్నారు... హాయిగా నిధులు కొల్లగొట్టేస్తున్నారు. పాలకొండ: తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాల్లో 60వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. కాలువను నిర్లక్ష్యంగా వదిలేయడంతో శివారు భూములకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలువ ఆధునికీకరణ చేస్తామంటూ హామీ ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చినా దానిని పట్టించుకోలేదు. ఇంతలో హుద్‌హుద్ వచ్చింది. దీనిపేరుతో దండిగా నిధులు మంజూరయ్యాయి. ఈఅవకాశాన్ని అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హుద్‌హుద్ వల్ల కాలువలు పాడయ్యాయని, నిధులు మంజూరు చేయాలని నీటి పారుదల శాఖ ద్వారా ప్రతిపాదనలు చేశారు. ఇటీవల కాలువ మరమ్మతుల కోసం రూ.43 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను 12 పనులకు కేటాయించి కాలువల్లో పూడికతీత పనులు జరిపిస్తున్నారు. పనులు పంచుకున్నారు... వాస్తవానికి విడుదలైన నిధులతో పనులు టెండరు విధానం ద్వారా చేపడితే పర్యవేక్షణ ఉండేది. అలా కాకుండా కాలువను భాగాలుగా విభజించారు. ఒకే కాలువపై జరుగుతున్న పనులను హద్దులుగా విభజించి పనులు పంచి పెట్టారు. ప్రతిపనీ రూ.5 లక్షలలోపు ఉండేలా చూసుకుని అధికార పార్టీకి చెందిన నాయకులకు గుత్తాధిపత్యం అప్పగించారు. జేసీబీతో నామ మాత్రంగా పనులు జరిపించి నిధులు కాజేసేలా పక్కా ఏర్పాట్లు చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఉన్నత స్థాయి నాయకుల ఆదేశాలకు తలొగ్గి పనులు పంపకానికి పచ్చ జెండా ఊపారు. పనులపై పర్యవేక్షణ కూడా లేకుండా నిధులు చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. పని ఒకటే... బిల్లులు రెండు తోటపల్లి కాలువలపై నవగాం నుంచి ఆట్టలి వరకు మూడు కిలో మీటర్ల పరిధిలో ఇటీవల ఉపాధి హామీ పనులు జరిపించారు. ఇందు కోసం రూ.2.83 లక్షలు వేతనాలుగా కూలీలకు చెల్లించినట్టు ఉపాధి రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆదే చోట నీరు - చెట్టు కార్యక్రమం పేరుతో కాలువ మరమ్మతుల కోసం నీటి పారుదలశాఖ రూ.4.70 లక్షలు నిధులు కేటాయించింది. పనులు జరిగిన చోటే నిధులు కేటాయించటం వెనుక అంతర్యమేమిటన్నది అధికారులకే తెలియాలి. ఓ వైపు ప్రభుత్వం నిధులే ఖర్చు చేసి పనులు జరిపిస్తే ఆదే చోట నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా పనులు జరిపించినట్టు చూపిస్తున్నారు. ఇదే కాలువపై హుద్‌హుద్ తుపాన్ నిధులతో కూడా పనులు జరుగుతున్నాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం అదికార పార్టీ నేతలు జేబులు నింపేందుకు ఈ నిధులు కేటాయించారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నీటి పారుదలశాఖ డీఈఈ గనిరాజు వద్ద ప్రస్తావిస్తే ఉపాధి పనులు కూలీలు జరిపారని, తాము యంత్రాలతో పని చేయిస్తామని చెబుతుండటం గమనార్హం. -
దేన్నీ...వదల బొమ్మాళీ వదల!
అన్నీ మావే....అన్నీ మాకే పోస్టుల భర్తీలో ముడుపులు అడ్డగోలుగా కాంట్రాక్ట్‌లు టీడీపీ నేతలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు సాక్షి ప్రతినిధి, విజయనగరం : అంగన్వాడీ పోస్టులు, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ పనులు, హుద్‌హుద్ తుపాను పనులు, ... ఇలా అన్ని పనులు, పోస్టుల భర్తీలో ప్రజాప్రతినిధుల జోక్యం అధికమవుతోంది. ఇందు గలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదికినా గలండు అన్నట్టుగా జిల్లాకు ఏదీ మం జూరైనా, జిల్లాలో ఏం చేసినా నేతల జోక్యం, చేతివాటం లేనిదే ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ‘దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి. నిధులొచ్చినప్పుడే నాలుగు కాసులు వెనుకేసుకోవాలి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంగన్వాడీ పోస్టులతో ప్రారంభం.... ఆ మధ్య జిల్లా వ్యాప్తంగా 130 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పంచేసుకున్నారన్న విమర్శలొచ్చాయి. నీకిన్ని- నాకిన్ని పద్ధతిలో కార్యకర్తల పోస్టుల్ని వాటాలేసుకుని దర్జాగా తమ అనుకూల వ్యక్తులకు కట్టబెట్టారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. మూడేసి లక్షలు గుంజేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ విషయమై అర్హులైన కొందరు బాధితులు కోర్టుల్ని సైతం ఆశ్రయించారు. ఈపీడీసీఎల్ పోస్టుల భర్తీలోనూ అదే పరిస్థితి షిఫ్ట్ ఆపరేటర్లు, జేఎల్ఎం పోస్టుల భర్తీలోనూ చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 12 షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు తీసుకోగా వాటిని ప్రాంతాల వారీగా, నాయకుల వారీగా పంచేసుకుని ఒక్కొక్క పోస్టును రూ.3లక్షలకు అమ్ముకున్నట్టు అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఈ విషయమై సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కోర్టును ఆశ్రయించారు. జూనియర్ లైన్మెన్ పోస్టుల విషయంలోనైతే మరింత దారుణంగా వ్యవహరించారు. ఎంపికైన దేన్నీ... వదల బొమ్మాళీ వదల! అభ్యర్థుల జాబితాను ముందే తెలుసుకుని, వారి వద్దకే వెళ్లి పోస్టులిప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. ఐదేసి లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. అధికార పార్టీ నేతలకు చిక్కిన భారీ మంచినీటి పథకాలు జిల్లాలోని 21 భారీ మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణ కాంట్రాక్టర్ కోసం టెండర్లు పిలవాలి. రూ.10లక్షల లోపు పనులకు సాధారణ టెండర్లు పిలవల్సి ఉండగా, రూ.10లక్షలు దాటే పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలవల్సి ఉంది. రూ.10 లక్షలు దాటితే ఆన్లైన్లో టెండర్లు పిలవాల్సి వస్తుందని తెలివిగా పని విలువను విభజన చేసి, రెండేసి నెలలకని టీడీపీ నేతల సూచనల ప్రకారం అధికారులు టెండర్లు పిలిచారు. ఇదే అవకాశంగా తీసుకుని బయట వ్యక్తులెవ్వరనీ టెండర్లు వేయనివ్వకుండా బెదిరింపులకు దిగి అధికార పార్టీ నాయకులే అన్నీ తామై కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌లను దక్కించుకున్నారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులే తమ బినామీలను రంగంలోకి దించి, వారిచేత టెండర్లు వేయించి సక్సెస్‌ఫుల్‌గా దక్కించుకున్నారు. హుద్‌హుద్ తుపాను పనులనూ వదలని తెలుగు తమ్ముళ్లు గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపానులో దెబ్బతిన్న ఇరిగేషన్ వనరుల పునరుద్ధరణ పనుల్ని సైతం తెలుగు తమ్ముళ్లు వదల్లేదు. జిల్లాలో మధ్య, చిన్న తరహా పథకాలకు సంబంధించి 1,014పనులు చేపట్టేందుకు రూ.37కోట్ల 55లక్షల 75వేలు మంజూరవగా వాటిని కూడా దాదాపు తమ చేతుల్లోకి తీసుకున్నారు. జన్మభూమి కమిటీల ముసుగులో అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు దక్కించుకున్నారు. అధికారులు అడ్డం తిరిగిన చోట(వైఎస్సార్సీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో) ఏకంగా పనులే జరగకుండా అడ్డుకున్నారు. నేతల మధ్య విభేదాలతో బయటపడ్డ ఉపాధి పనుల భాగోతం డబ్బే పరమావదిగా భావిస్తూ వస్తున్న టీడీపీ నాయకులు చివరికీ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని వదల్లేదు. అయితే ఆ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలతో ఉపాధి పనుల వ్యవహారం బయటపడింది. ఆ మధ్య జరిగిన సుమారు రూ.41కోట్లు విలువైన ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని ఇలాగే అధికార పార్టీ నేతలు పంచేసుకున్నారు. వాటిలో చాలా పనులు చేతులు మారిపోయాయి. ఒక్కొక్క వర్క్‌కు ఇంతని కమీషన్ తీసుకుని అమ్మేసుకున్నారన్న విమర్శలున్నాయి. అదే తరహాలో మరో పర్వానికి తెరలేచింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తనకున్న పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని రూ.5.29కోట్ల విలువైన పనుల్ని ప్రతిపాదించడమే కాకుండా అనుమతి కోసం ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. మరో విశేషమేమిటంటే అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో మైత్రి వెనుక ఈ స్వలాభ మే ఉందన్న వాదనలు ఉన్నాయి. ఎంపీ హోదాలో గీతచే పనులు ప్రతిపాదించారని, అవి మంజూరయ్యాక తన ఖాతాలో వేసుకుని లబ్ధిపొందాలన్నదే వ్యూహమని సాక్షాత్తు టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఈ విధంగా టీడీపీ నేతలు దేన్ని వదలడం లేదని, పంపకాలు చేసుకుని, వాటాలేసుకుని ప్రభుత్వ నిధుల్ని, నిరుద్యోగుల ఆశల్ని కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. -
హుద్‌హుద్ పేరుతో రూ.2 కోట్లు హాంఫట్?
దెబ్బతినని పామాయిల్ తోటలకు పరిహారం పొందిన వైనం సర్పంచ్ స.హ. చట్టం దరఖాస్తుతో వెలుగులోకి.. గుడివాడ (రావికమతం): హుద్‌హుద్ తుఫాన్‌ను కూడా కొందరు లాభసాటిగా మార్చుకున్నారు. అసలైన బాధితులు ఒక్క రూపాయి కూడా అందకుండా అలమటిస్తుంటే, మరికొందరు మాత్రం ఇదే అదనుగా లక్షలాది రూపాయలు కైంకర్యం చేస్తున్నారు. గుడివాడ రెవెన్యూ పరిధిలో ఏ మాత్రం నష్టపోని 20 మంది రైతులకు రూ.2 కోట్లు పరిహారంగా మంజూరైన సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ గ్రామ సర్పంచ్ ఫిర్యాదుతో ఇది వెలుగు చూసింది. ఆ పంచాయతీకి సమీపంలోని 60 ఎకరాల్లో ఇతర జిల్లాలకు చెందిన పి.లక్ష్మినారాయణ, జి.రామచందర్రాజు, సీతాదేవి, జగన్నాథరాజు, రమాదేవి, పి.వెంకటనరసింహ, గంగాకుమారి, ఎస్.కన్నారావు, టి.వసంత తదితర 20 మంది పామాయిల్ తోటలు వేశారు. హుద్‌హుద్ గాలులకు తోటలు ఏమాత్రం దెబ్బతినకపోయినా తీవ్రంగా ధ్వంసమైనట్టుగా అధికారులతో కుమ్మక్కై నమోదుచేయించారు. అక్కడ మొత్తం 60 ఎకరాల్లో ఉన్న తోట మొత్తాన్ని గుర్తించి ఆన్లైన్లో పంపారు. అయితే 60 ఎకరాలకు బదులుగా 600 ఎకరాలుగా నమోదవడంతో ఆ తోట యజమానులు ఒకొక్కరికి రూ.15 లక్షలు, రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.9 లక్షల చొప్పున రెండు కోట్లు మేర పరిహారం వారి ఖాతాలకు జమైంది. ఈ తతంగం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో గ్రామ సర్పంచ్ తలారి గణేష్ సమాచార ఉక్కు చట్టం ద్వారా దరఖాస్తుచేసి వివరాలు రాబట్టారు. వాస్తవంగా దెబ్బతిన్న రైతులను గ్రామంలో ఎందరినో చూపినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి వారిని గుర్తించకుండా, ఏమాత్రం నష్టం జరగని తోటలకు ఎలా నస్టపరిహారం ఇచ్చారని స్థానిక అధికారులను నిలదీశాడు. ఎవరూ స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు గురువారం ఫిర్యాదు చేసి ఆ ప్రతిని స్థానిక విలే కర్లకు అందించాడు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక ఉద్యానవన శాఖాధికారి డి.వి.రమణను సంప్రదించగా, ఆ సర్పంచ్‌కు అందిన కాపీలో వివరాలు తప్పుగా నమోదయ్యాయని, వాస్తవంగా వారికి రూ.18 లక్షలు నష్ట పరిహారం అందిందని చెప్పారు. అయితే ఏమాత్రం దెబ్బతినని తోటలకు అంతపెద్ద మొత్తం నస్టపరిహారం ఎలా మంజూరైందని అడగ్గా సమాధానం దాటవేశారు. -
'గిరిజనుల హక్కులను టీడీపీ సర్కార్ కాలరాస్తోంది'
గిరిజనుల హక్కులను టీడీపీ సర్కారు కాలరాస్తోందని పాలకొండ ఎమ్మెల్యే బి. కళావతి ఆరోపించారు. హుద్‌హుద్ తుపాను కారణంగా పంటలను నష్టపోయిన గిరిజనులకు ఇంతవరకూ నష్టపరిహారం అందించలేదని టీడీపీ సర్కారుపై కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి.. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులను పట్టించుకోకపోవడం.. ప్రజా తీర్పునకు విరుద్ధంగా నడుచుకోవడమే అన్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1న తణుకులో జరగనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి పిలుపునిచ్చారు. -
అందరి సలహాలతో.. ముందుకు సాగుతా
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘జిల్లాపై కొద్దిపాటి అనుభవమే ఉంది.. అందరి సహకారం, సమన్వయంతో జిల్లాను ప్రగతి బాట పట్టించేందుకు కృషి చేస్తాను’.. అని కొత్త కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. సోమవారం శ్రీకాకుళం వచ్చిన ఆయన జిల్లా 28వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ తన అనుభవాలను వివరించడంతోపాటు జిల్లా పరిస్థితులు, ప్రధాన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాపై కొద్దిపాటి అనుభవం ఉందని, ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో పాలకొండ డివిజన్లో వారం రోజులపాటు సహాయ పునరావాస పనులను పర్యవేక్షించానని వివరించారు. గతంలో ఇక్కడ పలువురు మంచి కలెక్టర్లు పని చేశారని, వారి స్థాయిలో జిల్లాకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు గ్రామీణులకు సక్రమంగా అందాలని, ఆ దిశగా సరైన సలహాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ప్రకృతి సంపదకు కొదవలేదని, ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు అనువైన వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు. అయితే మౌలిక వసతులు, విద్య, వైద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. బయోమెట్రిక్ వంటి విధానాల వల్ల ఉద్యోగులు, వైద్యుల్లో మార్పురాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిర్బంధ విధానాల వల్ల సమస్యలు మరింత పెరుగుతాయన్నారు. నైతిక విలువలు, పని పట్ల శ్రద్ధాశక్తులు పెంపొందించడం ద్వారా మార్పు తీసుకురావాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని అంటూ వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సామాజిక బాధ్యతగా నిర్వర్తించినప్పుడే బడి పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందని అభిప్రాయపడ్డారు. బెల్టు షాపుల గురించి మాట్లాడుతూ ఇది క్లిష్టమైన సమస్య అని, దీనిపై మహిళల్లో అవగాహన అవసరమని అన్నారు. ప్రజలు పొదుపుపై దృష్టి సారించాలని సూచించారు. చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలతో కంపోస్టు ఎరువు, బయోగ్యాస్ వంటి వి తయారు చేస్తే ఇంధన కొరత తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ బి.హేమసుందర వెంకట్రావు పాల్గొన్నారు. -
కౌలు రైతు కుదేలు !
పాలకొండ : అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి గందరగోళంగా మారింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సంతో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టపరిహారం అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం రెండు లక్షల మంది కౌలు రైతులున్నారని అంచనా. వీరంతా సామాన్య, భూస్వామ్య రైతుల వద్ద పొలాలను కౌలుకి తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన వచ్చిన హుద్‌హుద్ తుపాను పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. సరాసరి దిగుబడులు బాగా పడిపోయూరుు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వరి ఎకరాకు 15 నుంచి 19 బస్తాలకే పరిమితమైంది. ఇందులోనూ ధాన్యం బురద పట్టి పోవడంతో రంగుమారాయి. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో ఎకరాకు సరాసరి పొలం సొంతదారుకు 11 నుంచి 13 బస్తాల వరకు కౌలు రూపేణా చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన కౌలు రైతులు పండిన పం డంతా కౌలు కింద చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు చొప్పున పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు, రేషన్‌కార్డుల అనుసంధానంతో పరిహారం అందజేశారు. పాస్‌పుస్తకాలు ఉన్నవారి పేరునే పరిహారం అందజేయడంతో కౌలు రైతులు బిక్కుముఖం వేసుకున్నారు. గుర్తింపు కార్డులు ఉంటే... వాస్తవానికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉండి ఉంటే పరిహారం పొందేందుకు అవకాశముండేది. రైతుల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం దీనిపై కనీస చర్యలు చేపట్టకపోవడంతో గుర్తింపు కార్డులు పొందిన రైతులు పదుల సంఖ్యలో మాత్రమే మిగిలారు. రెవె న్యూ, వ్యవసాయాధికారులుకౌలుదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ఆసక్తి కనబర్చలేదు. ప్రభుత్వం కూడా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. పైసా పరిహారం రాలేదు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. వరదలు ముంచి వేయడంతో ఎకరాకు పది బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.25 వేలు చొప్పున అయింది. రైతుకు కౌలు చెల్లిస్తే పైసా మిగలక తిరిగి అప్పు మిగిలింది. పరిహారం కూడా అందలేదు. - గుమ్మిడి గురువులు, కౌలు రైతు, అంపిలి ప్రభుత్వ నిర్లక్ష్యం కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తుంది. గుర్తింపు కార్డుల కోసం పలుమార్లు ఆందోళన చేపట్టాం. అయినా కనీస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపలేదు. ఈ కారణంతోనే కౌలు రైతులు అప్పుల బారిన పడాల్సి వచ్చింది. - బుడితి అప్పలనాయుడు, రైతు సంఘం నాయకుడు -
ఇన్చార్జి కలెక్టర్‌గా వివేక్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఐఏఎస్ అధికారుల విభజనలో భాగంగా గౌరవ్ ఉప్పల్‌ను తెలంగాణకు కేటాయించడంతో ఆయన్ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌గా ఎవరినీ నియమించకపోవడంతో ఇన్చార్జి బాధ్యతలను జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌కు అప్పగించి రిలీవ్ అయ్యారు. దాంతో కొత్త కలెక్టర్ వచ్చే వరకు జేసీయే ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లాకు జేసీగా వచ్చిన యాదవ్ తుపాను సహాయ పనుల్లో సమర్థంగా వ్యవహరించారు. కొత్త కలెక్టర్ నియామకంలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఆయనే కొన్నాళ్లపాటు ఇన్చార్జిగా కొనసాగనున్నారు. -
ఒక్కరోజు వ్యాపారం @ : రూ.7 కోట్లు
తెలుగు ప్రజల పెద్దపండగ సంక్రాంతి సమీపిస్తుండడంతో విజయనగరం పట్టణంలో పండగ కళ ఉట్టిపడుతోంది. ఆదివారం చాలామందికి సెలవుదినం కావడంతో జిల్లాలోని పలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో జిల్లా కేంద్రానికి వచ్చి తమకు కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేశారు. ఈ ఒక్క రోజే సుమారు రూ.7 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ : వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్‌తో జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద మొత్తంలో నష్టపోయినప్పటికీ ఎవరి తాహతుకు తగ్గట్టు వారు పండగను చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వారం రోజులుగా అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు వస్తున్న వారితో పట్టణం కిటకిటలాడుతోంది. వాస్తవానికైతే సంక్రాంతికి నెల రోజుల ముందుగానే జిల్లా కేంద్రంలోని మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. క్రైస్తవలు ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్టమస్ పండగ నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అదే తరహాలో ఈ ఏడాది కూడా మార్కెట్లో పండగ శోభ కనిపిస్తోంది. పట్టణ వాసులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతో పట్టణంలోని రహదారులు రద్దీగా మారా యి. ప్రధానంగా మూడులాంతర్లు, కోట జంక్షన్, మెయిన్‌రోడ్, గంటస్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి ఆలయ కూడలి, కంటోన్మెంట్‌కు వెళ్లే గూడ్స్‌షెడ్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గ్రామాల్లోని పలు కుటుంబాల వారు ఉదయాన్నే బయలుదేరి పట్టణానికి వచ్చి రోజంతా మార్కెట్ చేసుకుని రాత్రి చివరి బస్సుకు తిరిగి గ్రామాలకు వెళ్తున్నారు. సందడిగా వస్త్ర విక్రయాలు సంక్రాంతి పండగ వచ్చిందంటే వస్త్ర విక్రయాలదే హవా. అన్ని వర్గాల ప్రజలు ఈ పండగకు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీ. అంతేకాకుండా చనిపోయిన పూర్వీకులకు నూతన వస్త్రాలు పెట్టి మొక్కు బడులు చెల్లించుకుంటారు. దీంతో గూడ్స్‌షెడ్ ప్రాంతంలో గల బాలాజీ టెక్స్‌టెల్ హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు మెయిన్‌రోడ్, ఉల్లివీధి, డాబాతోట, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలు వారాంతమైన శని, ఆదివారాల్లో కొనుగోలుదారులతో కళకళలాడాయి. సుమారు 170 దుకాణాలున్న బాలాజీ టెక్స్టైల్ హోల్‌సేల్ మార్కెట్లో ప్రధానంగా పిల్లల రెడీమేడ్ దుస్తులు, మహిళల చీరల అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి.ఈ మార్కెట్లో కేవలం జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారు, సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలకు చెందిన రిటైల్ వ్యాపారులు కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే పండగ కావడంతో రెండో రోజులుగా ఈ మార్కెట్‌కు సాధారణవినియోగదారులు తాకిడి పెరిగింది. హోల్‌సేల్ వ్యాపారంతో బిజీగా ఉన్న దుకాణ యాజమానులు సాధాణ వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని షాపు బయట కూడా అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ ఒక్క రోజే సుమారు రూ.5 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. అదే తరహాలో కిరాణా సామగ్రి విక్రయాలు సంక్రాంతి పండగలో వస్త్రాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో..అదే తరహాలో పిండివంటకాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త అల్లుళ్లకు, మనుమలు,మనుమరాండ్రకు ఇష్టమైన పిండివంటకాలు, మాంసాహార భోజనం పెట్టి వారిని సంతోషపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోనే ప్రథానమైన ప్రిన్స్ ఆఫ్ వేల్ (పీడబ్ల్యూ) మార్కెట్లో వినియోగదారుల హడావుడి అధికమైంది. జిల్లా కేంద్రంతో పాటు 34 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన చిరు వ్యాపారులు , జిల్లా నలుమూలలనుంచి వచ్చే వినియోగదారులు ఇక్కడి మార్కెట్లోనే తమకు కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేస్తుం టారు. ఆదివారం ఒక్క రోజు సుమారు రూ.రెండు కోట్ల మేర వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇచ్చిందే స్వల్పం..అందులోనూ స్వార్థం
పాలకొండ:గత అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సుమారు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నా.. పునరుద్ధరణ పనుల పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.50 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. తుపాను దాటికి జిల్లాలో విద్యుత్, రవాణా, నీటిపారుదల, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు కమిటీలు వచ్చి నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. రెండు నెలలు గడిచిన తర్వాత కూడా ఆ కోటిన్నర తప్ప ప్రభుత్వం నుంచి ఇంకేమీ అందలేదు. వచ్చిన ఆ కొద్దిపాటి నిధులనైనా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు.. ముఖ్యంగా ఎక్కువ నష్టం వాటిల్లిన నియోజకవర్గాలకు కేటాయించాల్సిన బాధ్యతను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు విస్మరించారు. విడుదలైన మొత్తంలో కార్మిక మంత్రి అచ్చెన్ననాయుడు నియోజకవర్గమైన టెక్కలికి రూ.90 లక్షలు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గానికి రూ.60 కేటాయించారు. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు ఒక్కపైసా అయినా కేటాయించలేదు. జిల్లాలకు తుపాను సాయం కింద ఇప్పటివరకు ఈ 1.50 కోట్లే వచ్చాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని, మరిన్ని నిధుల విడుదల గురించి తామేమీ చెప్పలేమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన నిధులను ఆ రెండు నియోజకవర్గాలకే తరలించుకుపోతే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువ నష్టం ఎక్కడంటే.. వాస్తవానికి తుపాను వల్ల టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల కంటే శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పాతపట్నం తదితర నియోజకవర్గాల్లో ప్రభుత్వ శాఖలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్, ఆర్అండ్బి రహదారులు, గ్రామీణ నీటిపారుదలకు సంబంధించి విద్యుత్ మోటార్లు కాలిపోవడ ంతో పాటు పలు రకాల మౌలిక వసతులపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. అయితే ఈ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడం గమనార్హం. ఉన్న నిధులను పలుకుబడి ఉన్న నేతలే పట్టుకుపోవడంతో మిగతా నియోజకవర్గాల పరిస్థితి దయనీయంగా మారింది. -
నీరుగారుతున్న పరిశ్రమ
పీఎన్ కాలనీ : హుద్‌హుద్ తుపాను విధ్వంసం సృష్టించి రెండు నెలలు దాటినా తుపానుకు దెబ్బతిన్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపశమనం లభించలేదు. తుపాను దాటికి జిల్లాలో మొత్తం 64 పరిశ్రమలకు రూ.168.68 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు నిర్థారించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు. పరిశ్రమలు మూతపడకుండా, కార్మికులు ఉపాధి కోల్పోకుండా ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఉపశమనం కలిగిస్తుందని ఆశించిన యజమానులకు నిరాశే మిగిలింది. నివేదిక అందిన కొన్ని రోజులకే నష్టపోయిన పరిశ్రమలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదనిపరిశ్రమల యజ మానులు నిస్పృహ చెందుతున్నారు. తుపాను దాటికి జరిగిన నష్టంతోపాటు రోజుల తరబడి విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు పనిచేయక పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అప్పుల్లో కూరుకుపోయాయి. కొన్ని పరిశ్రమలు ఏకం గా మూతపడ్డాయి. బీమా సౌకర్యం ఉన్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఇన్సూరెన్సు కంపెనీలు ఇచ్చిన బీమా పరిహారంతో ఉత్పత్తిని పునరుద్ధరించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత కొద్దిరోజుల వ్యవధి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పలు కమిటీలు, బృందాలు వచ్చి పరిశీలిం చినా ఎటువంటి సాయం ఇస్తారన్నదే ఇప్పటికీ స్పష్టం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన వైఖరి స్పష్టం చేయాలని పరిశ్రమల యజమానులు, కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ వద్ద ప్రస్తావించగా తుపాను నష్టాల నిర్థారణకు ప్రభుత్వం కమిటీని వేసిందన్నారు. ఈ కమిటీ సూచనల ఆధారంగా నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జిల్లాలో పరిశ్రమలకు వాటిల్లిన నష్టాలపై సమర్పించిన నివేదికకు స్పందనగానే ప్రభుత్వం ఈ కమిటీని వేసిందన్నారు. -
'ఇన్కాయిస్ వల్లే హుద్‌హుద్ ప్రాణనష్టం తగ్గింది'
హైదరాబాద్: ఇన్కాయిస్ అందించిన ముందుస్తు సమాచారం వల్లే హుద్‌హుద్ తుపానులో ప్రాణనష్టాన్ని తగ్గించ గలిగామని కేంద్ర మంత్రులు హర్షవర్థన్, సుజనా చౌదరి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇన్కాయిస్ 10వ వార్షికోత్సవ సభకు వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. సునామి లాంటి విపత్తులను ఆపడం సాధ్యం కానప్పటికీ భవిష్యత్తులో జరిగే విపత్తులను మాత్రం ఇన్కాయిస్ ద్వారా గుర్తించ వచ్చని హర్షవర్థన్, సుజనా చౌదరి తెలిపారు. -
గుండెమండిన రైతన్న
రైతన్న గుండె మండింది... తుపాను సాయంలోనూ నిర్లక్ష్యాన్ని భరించలేక ఒక్కసారిగా భగ్గుమంది....ప్రకృతి వైపరీత్యాన్ని సైతం తట్టుకున్న అన్నదాత, అధికారుల వంచనను భరించలేకపోయాడు. పంటపోయి కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్న రైతన్నను ఆదుకోవలసిన అధికారులు తమకు తోచిన విధంగా పంటనష్టం జాబితాలను రూపొందించడంతో వారు భరించలేపోతున్నారు. హుద్‌హుద్ తుపాను కారణంగా పంటనష్టపోయిన రైతులు, మళ్లీ పెట్టుబడులు పెట్టి కూలీలతో పంటను కోయించలేక పశువుల మేతకు వదిలేశారు. కంటిపాప కన్నా మిన్నగా కాపాడుకున్న పంటను ఇంటికి తరలించే స్థోమతలేక ఓ రైతు ఏకంగా పొలానికి నిప్పుపెట్టాడు. బలిజిపేట రూరల్:మండలంలోని పెద్దింపేట పంచాయతీ పరిధిలో ఉన్న గౌరీపురంలో రైతుల ఆగ్రహం, ఆవేదన కట్టలు తెంచుకుంది. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ కనీసం సాయమందించకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు రైతులకే సాయం లేకపోతే తమ పరిస్థితి ఏంటని వారు మధన పడుతున్నారు. సాయం సంగతి అలా ఉంచితే పండిన కొద్దిపాటి పంటను ఇంటికి చేర్చే దారిలేక పశువుల మేతకు వదిలేశారు. తూముల వెంకటరమణ అనే రైతు వేరే గత్యంతరం లేక, పండిని కొద్దిపాటి చేలను ఇంటికి తీసుకువెళ్లే స్థోమత లేక తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం పొలానికి నిప్పంటించారు. ఈయన అదే గ్రామంలో లోలుగు శ్రీనివాసరావు అనే రైతు వద్ద నుంచి ఎకరాకు 10 బస్తాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని 2.40 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. దానిలో వరి పంటవేసేందుకు రూ.22 వేలు మదుపు పెట్టాడు. తగినంత సొమ్ములేకపోవడంతో రూ.10వేలు అప్పుతెచ్చి మరీ మదుపు పెట్టాడు. వెంకటరమణ, ఆయన భార్య రెక్కలు ముక్కలు చేసుకుని, చెమటను చిందించి పండించారు. అయితే ప్రకృతి కన్నెర చేసింది. హుద్‌హుద్ తుపాను రూపంలో విరుచుకుపడింది. సువర్ణముఖి నది పొంగి పొలాలమీదుగా ప్రవహించింది. ఆ సమయంలో అధికారులు గ్రామం మొత్తాన్ని ఖాళీచేయించి పెద్దింపేట పంపించివేశారు. మరుసటి రోజు నీరు తగ్గుముఖం పట్టడంతో అందరూ తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కాని పంటపొలాల్లో సుమారు ఆరు రోజుల పాటు నీరు నిల్వ ఉండిపోయింది. వెంకటరమణ పొలంతో పాటు గ్రామంలో 300 ఎకరాల్లో పంట దెబ్బతింది. అయితే పొలాలను పరిశీలించిన అధికారులు సుమారు 23 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని జాబితాలు తయారు చేశారని ఆ గ్రామానికి లక్ష్మణరావు, అప్పలనాయుడు, రామారావు, రామకృష్ణ, కృష్ణమూర్తి తదితరులు తెలిపారు. దీనిపై జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా దోమపోటుతో పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు... జిల్లా అధికారుల వద్ద కాకమ్మ కథలు చెప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రైతులకే పంటనష్టపరిహారం ఇవ్వకపోతే కౌలుకు భూమిని తీసుకున్న తనను ఎవరు ఆదుకుంటారని తూముల వెంకటరమణ వాపోయాడు. పంటను కూలీలతో కోయించేందుకు మదులుపెట్టలేక, అక్కడక్కడక పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేక నిప్పు పెట్టామని తెలిపాడు. అధికారుల నిర్లక్ష్యానికి బలి అధికారులు, పాలకుల నిర్లక్ష్యాని బలయ్యామని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని గ్రామాన్ని వదిలి వలసపోవలసిందేనని వారు తెలిపారు. రుణమాఫీలు అంతంతగానే వర్తించడంతో ఆ అప్పులు, పంట మదుపులకు చేసిన అప్పులు కలిసి తడిసిపోపెడయ్యాయని, తాము పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయామని చెప్పారు. గ్రామంలో కౌలు రైతులు, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పండిన భూములకు తక్కువ దిగుబడి వచ్చిందని చెప్పారు. నష్టం వివరాలు... రెండు ఎకరాల భూమిని కౌలుకు చేసుకుంటున్న పాడి లక్ష్ముందొర పంట పూర్తిగా పోయింది. అలాగే పాడి సూరందొర, జడ్డు సత్యనారాయణ రెండేసి ఎకరాల్లో వేసిన పంటకు, వంజరాపు మహేశ్వరావు అనే రైతు మూడు ఎకరాల్లో వేసిన పంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది. తూముల పెదసత్యనారాయణ, జోగి అప్పలనాయుడు అనే రైతులకు ఎకరాకు ఐదు, సాదు రంగునాయుడు, జోగి లక్ష్మణరావుకు ఆరు బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. జోగి అప్పలనాయుడు, కృష్ణమూర్తి ఎనిమిదేసి ఎకరాల్లో పంటవేయగా 40 సెంట్ల చొప్పున అధికారులు నష్టపరిహారం రాశారని రైతులు తెలిపారు. ఇప్పటికీ హుద్‌హుద్ తుపాను నష్ట పరిహారం గురించి అధికారులు ప్రకటించడం లేదని వారు వాపోయారు. వేరే గతిలేక... కౌలు భూమి పండలేదు. వేరే గతి లేక, దిక్కుతోచక పం టను తగులపెట్టాను. అప్పుల ఊబిలోంచి వచ్చే అవకాశాలు లేవు. అధికారులు అన్యాయం చేశారు. ఇంక వలసలే శరణ్యం. - టి.వెంకటరమణ, రైతు. తీవ్ర నష్టం వాటిల్లింది, కాని అరకొరగా రాశారు... పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాని అధికారుల పర్యవే క్షణ సక్రమంగా లేకపోవడంతో సిబ్బంది, అరకొరగా పంట నష్టాన్ని అంచనావేశారు. హుద్‌హుద్ కారణంగా పంట నష్టపోతే దోమకాటు వల్ల జరిగిందన్నారు. ఇదెక్కడి న్యాయం, రైతులంతా ఇంత నిర్లక్ష్యమా - జోగి అప్పలనాయుడు, రామారావు, పాడి లక్ష్మందొర, రైతులు -
రాష్ట్రాన్ని విపత్తుల ప్రాంతంగా గుర్తించాలి
ఏపీ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విపత్తుల కేంద్రంగా గుర్తించి తీర్మానం చేయాలని శనివారం శాసనమండలిలో సభ్యులు తీర్మానించారు. హుద్‌హుద్ తుపాను నష్టంపై సంక్షిప్త చర్చలో మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తరచూ తుపాను తాకిడికి గురవుతున్న ఏపీని విపత్తుల ప్రాంతంగా పరిగణించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం పంపాలని ప్రతిపాదించగా అన్ని పార్టీలకు చెందిన సభ్యు లు మద్దతు పలికారు. అనంతరం మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ తుపాను నష్టంపై ప్రభుత్వం ముందుగా అంచనా వేయటంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. సాయం చేస్తామన్న కేంద్రం మొండి చెయ్యి చూపితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని వామపక్ష పార్టీకి చెందిన సభ్యుడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. 125 ఏళ్లలో రాష్ట్రంలో 77 పెద్ద తుపానులు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయని ఇప్పటికైనా శాశ్వత పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తుపాను బాధితులకు పంపిణీ చేయాల్సిన నిత్యావసర సరుకులను కూడా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దోచుకోవడం దురదృష్టకరమన్నారు. మడ అడవుల్లో కలపను అక్రమంగా తరలించడం వల్లే తుపాను విశాఖపై ప్రభావం చూపిందని ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి హుద్హుద్పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్ర పునర్నిర్మాణానికి పూర్తి తోడ్పాటు అందించాలని, హుద్‌హుద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. విరాళాలు ఇచ్చిన దాతలు, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపింది. ఈమేరకు హోం మంత్రి చినరాజప్ప ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తుపాను బీభత్సం సమాచారం అందిన వెంటనే స్పందించి తక్షణమే సందర్శించి కేంద్ర బృందాన్ని పంపిన ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ హోం మంత్రి-ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని శాసనసభ ఆమోదించింది. -
టెక్నాలజీతో ఎదుర్కొన్నాం
⇒హుద్‌హుద్ తుపానుపై శాసన సభలో చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం ⇒బాధితులను ఆదుకుంటుంటే.. ప్రతిపక్షం వాస్తవాలు జీర్ణించుకోలేక విమర్శిస్తోంది సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీని బాగా వినియోగించుకోవడం, అధికారులతో బాగా పనిచేయించడం వల్ల హుద్‌హుద్ తుపాను కలిగించిన కష్టాల నుంచి ప్రజలను త్వరగా రక్షించగలిగామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హుద్‌హుద్ నష్టం మీద శాసన సభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు శనివారం ఆయన తుది సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడ ఇబ్బంది, విపత్తు వచ్చినా వెళ్లి ఆదుకున్న చరిత్ర తనకు ఉందని, అదే విధంగా హుద్‌హుద్ బాధితులను ఆదుకున్నామని వివరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌లో విపత్తు సంభవిస్తే.. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయమ్యాయని, ప్రతిపక్ష నేతగా తాను విమానాల్లో బాధితులను తరలించానని చెప్పారు. ఒడిశాలో పెను తుపాను వచ్చినప్పుడు కూడా తాను రంగంలోకి దిగానని, అక్కడి సీఎంకు శాటిలైట్ ఫోన్ కూడా తానే ఇచ్చానని చెప్పారు. హుద్‌హుద్ తుపాను తీవ్రతను వాతావరణ కేంద్రం ముందుగానే చెప్పడంతో, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. అత్యంత కష్టమైనప్పటికీ, రోడ్డు మార్గంలో రాజమండ్రికి, అక్కడి నుంచి విశాఖపట్నానికి వెళ్లి, రేయింబవళ్లు కష్టపడి పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చానన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మనుసుపెట్టి పనిచేశారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని విధంగా ప్యాకేజీలు ఇచ్చామని తెలిపారు. 50 కిలోల బియ్యం, పప్పు, ఉప్పు, కారం, కూరగాయలు బాధితులకు అందించడం దేశంలోనే తొలిసారని అన్నారు. ఎవరికెంత పరిహారం వస్తుందో గ్రామాల్లో జాబితాలు విడుదల చేశామని, రాని పక్షంలో అడిగి తీసుకోవాలని చెప్పామన్నారు. రూ. 844 కోట్లే ఖర్చు చేశామని విపక్షం విమర్శిస్తోందని, విద్యుత్ శాఖ చేసిన ఖర్చు, పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు, పౌల్ట్రీ, ఫిషరీస్‌కు ఇచ్చిన మొత్తాన్ని అందులో చూపించలేదని వివరించారు. కేంద్రం వెంటనే స్పందించడమే కాకుండా, ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా రూ.10 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చాయని చెప్పారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల వల్ల రుణం తీసుకోలేదన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుం టుంటే.. ప్రతిపక్షం వాస్తవాలు జీర్ణించుకోలేక విమర్శిస్తోందన్నారు. బాబు నిధులు తెస్తారు: హోం మంత్రి దమ్మిడీ ఖర్చు చేయలేదని ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడటానికి ముందే చర్చకు ఆయన సమాధానమిచ్చారు. పునరావాసం, తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం రూ. 844 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఆపద సమయంలో ఏమిచ్చినా బంగారమేనని ప్రజలు భావించారని అన్నారు. తుపాను నష్టాలను,సాయాన్ని లెక్కలతో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లు సహాయంగా ప్రకటించి, రూ. 400 కోట్లు విడుదల చేసిందనీ మిగతా నిధులను కూడా కేంద్రం నుంచి తెచ్చి విశాఖ పునర్నిర్మాణాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారని చెప్పారు. -
శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను సహాయక చర్యల విషయంలో వైఎస్ఆర్సీఎల్పి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. సభ్యసమాజం సిగ్గుపడేవిధంగా ప్రభుత్వ ప్రవర్తన ఉందన్నారు. తుపాను సహాయక చర్యలు, ఆహార పొట్లాలు అందించే విషయం ప్రస్తావిస్తూ విశాఖపట్నంలో ప్రభుత్వం ఎలా సరఫరా చేసిందో తెలుసా? అని ప్రశ్నించారు. తాను గానీ, తమ ఎమ్మెల్యేలుగానీ పులిహార పొట్లాలు తెప్పించి, విసిరేస్తే మీరు తీసుకుంటారా? అని అడిగారు. విశాఖలో బాధితులపై ఆహార పొట్లాలు విసిరేశారని చెప్పారు. ప్రతి ఇంటి తలుపు కొట్టి వారి గడప వద్దకు ఆహార పొట్లాలు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బాధల్లో ఉన్నవారిపట్ల ఇలాగేనా వ్యవహరించేది అని వైఎస్ జగన్ అడిగారు. -
బాధితుల పై ఆహార పొట్లాలు విసిరేశారు
-
సీఎం గారు ఉన్నపుడే హుదూద్‌పై చర్చిద్దాం
-
సీఎం సభలో లేనందున రేపు చర్చిద్దాం:వైఎస్ జగన్
హైదరాబాద్: హుద్‌హుద్ తుపానుపై అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే బాగుంటుందని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు శాసనసభలో హుద్‌హుద్ తుపానుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇది ప్రధాన సమస్య అయినందున సభలో ముఖ్యమంత్రి ఉంటే బాగుండేదన్నారు. శాసనసభ తేదీలు ఖరారు చేసింది ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ప్రధాన సమస్య చర్చించే సమయంలో ముఖ్యమంత్రి సభలో లేకపోవడం బాధితులను కించపరచడమేనన్నారు. ముఖ్యమంత్రి సభలో లేనందున ఈ అంశాన్ని రేపు చర్చిద్దామని జగన్ సూచన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దామోదరం సంజీవయ్య న్యాయవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆ కార్యక్రమం ముగించుకొని సీఎం వస్తారని, అప్పటివరకు చర్చ కొనసాగించాలని ఆయన కోరారు. -
తుపాను విరాళంగా పింఛన్ల సొమ్మా!
ఉదయగిరి : మండలంలోని టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హుదూ ద్ తుపాను బాధితులకు తమ వంతు విరాళాలు అందించి సీఎం వద్ద ప్రశంసలు పొందాలని భావించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు విరాళంగా సొం త డబ్బు కాకుండా సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఒక నెల పింఛన్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. చివరకు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర రూ.100 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. హుదూద్ తుపాన్ విశాఖపట్టణం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత భాగాన్ని అతలాకుతం చేసింది. బాధితుల్ని ఆదుకునే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ వర్గాల ప్రజలు వారికి బాసటగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం తప్పులేదు. అది కనీస ధర్మం కూడా. కానీ కొంత మంది టీడీపీ నాయకులు తమ మెహర్బానీని చాటుకునేందుకు ఐకేపీ, పొదుపు గ్రూపులు, ప్రభుత్వ కార్యాలయాలకు టార్గెట్ నిర్దేశించి చందాలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఉదయగిరిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేసే సామాజిక పింఛన్లలో కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. మండలంలో 3,884 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ఈ నెలకు సంబంధించి రూ.43.29 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఈ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల మొత్తాన్ని హుదూద్ బాధితులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ దీన్ని కొంతమంది అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి నేతలు వ్యతిరేకించడంతో ప్రతి పింఛన్‌దారు నుంచి రూ.100 తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో గురువారం పంపిణీ జరిగిన బిజ్జంపల్లి, అయ్యవారిపల్లిల్లో ఈ మేరకు మినహాయించినట్లు సమాచారం. మండలంలోని మిగతా పంచాయతీల్లో విరాళాల పంచాయితీ వ్యవహారం సాయంత్రం వరకు సాగడంతో గురువారం పంపిణీ కాలేదు. శుక్రవారం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా రూ.100 నుంచి రూ.500 వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పింఛన్‌దారుల పరిస్థితులు, గ్రామ పరిస్థితులను అంచనా వేసుకుని అక్కడ చోటు చేసుకునే పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వసూళ్ల మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా మండల స్థాయి టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శులకు, గ్రామస్థాయి నేతలకు సూచించినట్లు సమాచారం. దీనికి స్థానిక నేతలు రూ.200 నుంచి రూ.1000కు పింఛను పెంచింది తమ ప్రభుత్వమేనని, మీరు కాదంటే వచ్చే నెల నుంచి మీకు పింఛను ఉండదని బెదిరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మండలంలో రూ.5 లక్షలకు పైగా ఒక్క పింఛన్‌దారుల నుంచే వసూలు చేయాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపాధి హామీ, ఐకేపీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టార్గెట్లు నిర్దేశించారు.ఈ విషయమై ఎంపీడీఓ ఫణి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా విరాళాల వసూలు తనకు తెలియదని, ఎక్కడైనా జరిగి ఉంటే విచారించి సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
సినీతారల క్రికెట్ మ్యాచ్
-
రీ సర్వే చేపట్టాలి
అలమండ (జామి):హూద్‌హుద్ తుపాను ధాటికి నాశనమైన మామిడి తోటలపై రీ సర్వే చేపట్టాలని మామిడి రైతులు డిమాండ్ చేశార. అలమండ గ్రామంలో మామిడి రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు లగుడు సింహాద్రి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి రైతుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, తుపాను ప్రభావం వల్ల మామిడి రైతులు ఎక్కువగా నష్టపోయారన్నారు. మామిడి, వరి, అరటి, తదితర రైతుల ఒక సంవత్సరం మాత్రమే నష్టపోతారని, అదే మామిడి రైతులతే సుమారు 20 సంవత్సరాల వరకు నష్టం భరించాల్సి ఉంటుందని చెప్పారు. తుపాను నష్టానికి సంబంధించి ఉద్యానవన శాఖాధికారులు చేపట్టిన సర్వే సక్రమంగా జరగలేదని ఆరోపించారు. తోటలకు సంబంధించి ప్రభుత్వ పరిహారంపై స్పష్టత లేదన్నారు. మామిడి రైతులను ఆదుకోవాలని గతంలో లగుడు సింహాద్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. రైతులను ఆదుకునేంతవరకూ ఐకమత్యంతో పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తప్ప మిగిలిన ప్రజా ప్రతినిధులెవ్వరూ రైతుల గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, విశాఖ ఎంపీ హరిబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు మరోసారి వినతిపత్రాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు లగుడు దేముడు మాట్లాడుతూ, కౌలు రైతులు, తోట యజమానులు సఖ్యతగా ఉండాలని సూచించారు. కౌలురైతుకు, తోట యజమానికి మధ్య ఒప్పందం కుదిరేవరకు మూడో వ్యక్తి తోటలను కొనుగోలు చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. అలాగే రైతులకు రాయితీపై పురుగు మందులు, ఎరువులు అందజేయాలని కోరారు. అలాగే మామిడి రవాణాపై కూడా రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మామిడి సంఘం జిల్లా కార్యదర్శి సీతారామరాజు, నేతలు గోపాలరాజు, మోపాడ కృష్ణ, సాయి జగ్గారావు, లగుడు వెంకటరావు, బండారు వెంకటేశ్వరరావు, ఉద్యానవనశాఖాధికారి రమేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో.. రొయ్య..!
పూండి: రొయ్యల సీజన్ మత్స్యకారునికి బోనస్ లాం టిది. చిన్నపాటి మత్స్యకారు డు సైతం రూ.50 వేలు వెనుకేసుకుంటాడు. ఈ ఏడాది రొయ్యల వేట మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లింది. హుద్‌హుద్ తుపాను ప్రభావం, సముద్రం అంతర్భాగంలో చోటుచేసుకున్న మార్పులు మత్స్యకారులను దెబ్బతీశాయి. ఏటా కాస్తో కూస్తో అనుకూలించిన వేట ఈ ఏడాది పూర్తిగా మందగించింది. మత్స్యకారులకు నిరాశే ఎదురైంది. రొయ్యల వేట కోసం లక్షలాది రూపాయ లు ఖర్చు చేసి ప్రత్యేకంగా వలలు కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన మేర చిక్కడంలేదు. దీంతో ఎగుమతులు పడిపోయాయి. వ్యాపారుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం నుంచి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వరకు ఉన్న తీరప్రాంతం రొయ్య ల వేటకు అనుకూలం. భావనపాడులో అయితే అత్యధికంగా వేట సాగుతుంది. వందల కిలోల రొయలు వలలకు చిక్కేవి. టైగర్ రొయ్యలు చిక్కితే ఆ మత్స్యకారుల ఆనందానికి అంతే ఉండదు. ఎందుకంటే కిలో రూ.850 నుంచి 1000 ధర పలుకుతుంది కాబట్టి. టైగర్ రొయ్యలను విశాఖపట్నం, కేరళ, కోల్కత్తా, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తరలించి అత్యధికంగా లాభాలు ఆర్జించే వారు. సంక్షోభమే... గత మూడేళ్లగా రొయ్యల వేట ఎగుమతుల పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఈ ఏడాది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది వ్యాపారం లేక వాహనాలకు కిరాయి కూడా చెల్లించుకోలేక పోయామని చెన్నై, కోల్కత్తా, కేరళకు చెందిన రొయ్యల వ్యాపారులు ముత్తు అళగర్, అరుణమణి వాపోయూరు. 2009 సంవత్సరంలో 14 టన్నులు, 2010లో 12 టన్నులు, 2011లో 15 టన్నులు, 2012లో 8 టన్నులు, 2013లో 5 టన్నుల రొయ్యలను కేరళకు ఎగుమతి చేశామని, అప్పట్లో మత్స్యకారులకు ఆశించిన మేర ధర కూడా లభించిందని వ్యాపారులు చెప్పారు. నెల రోజుల కిందట నుంచి కనీసం 100 కిలోల రొయ్యలు కూడా వలలకు చిక్కలేదని, దీంతో మత్స్యకారులతో పాటు తమకు నష్టాలే ఎదురయ్యూయన్నారు. ఇటీవల అక్కుపల్లి, బావనపాడు, కొత్తపేట తీరంలో నెలంతా వేటకు వెళితే 50 కిలోల టైగర్, సాధారణ రొయ్యలు మాత్రమే వలకు చిక్కాయంటే మత్స్యకారులు వంక రాజు, కె. సింహాచలం, దానేసు, కొర్లయ్య తదితరులు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి విపత్తులతో అన్ని విధాలా నష్టపోతున్నామంటూ ఆవేదన వెళ్లగక్కారు. -
హుద్‌హుద్ పరిహారం విడుదల
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో ఇటీవల బీభత్సం సృష్టించిన హుద్‌హుద్ తుపాను ధాటికి కూలిన ఇళ్లకు సంబంధించి పరిహారం విడుదలైంది. మొత్తం 14,781 మంది బాధితులకు పరిహారం విడుదలైందని, వారి బ్యాంక్ ఖాతాలకు సొమ్ము జమ చేశామని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. తుపాను తీవ్రంగా ప్రభావం చూపిన మండలాల్లో పూర్తిగా కూలిపోయిన పక్కా ఇళ్లకు రూ.50 వేలు, కచ్చా ఇంటికి రూ. 25 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. పాక్షికంగా ప్రభావం చూపిన ప్రాంతాల్లో కూలిన పక్కా ఇళ్లకు రూ. 6,300, కచ్చా ఇంటికి రూ.5వేలు, జిల్లా అంతటా పాక్షికంగా దెబ్బతిన్న కచ్చా, పక్కా ఇళ్లకు రూ.5వేల చొప్పున పరిహారాన్ని అందించారు. జిల్లాలో 13 పక్కా ఇళ్లు, 324 కచ్చా ఇళ్లు కూలిపోయినట్టు, పాక్షికంగా 7,237 కచ్చా ఇళ్లు దెబ్బతిన్నట్టు గుర్తించారు. అలాగే తుపాను కారణంగా నేలమట్టమైన 6,349 గుడిసెలకు రూ. 5 వేల చొప్పున, కూలిపోయిన 20 వేల పశువుల పాక లకు రూ. రెండు వేల చొప్పున పరిహారం ప్రకటించారు. విజయనగరం డివిజన్లో పదివేల పాకలు, పార్వతీపురంలో పదివేల పాకలు కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. పార్వతీపురం డివిజన్ కన్నా విజయనగరం డివిజన్లో నష్టం ఎక్కువగా జరిగింది. పార్వతీపురం డివిజన్లో 1,220 మంది బాధితులుండగా, విజయనగరం డివిజన్లో 13,561 మంది బాధితులున్నట్టు గుర్తించారు. ఇక్కడ రూ.7.50 కోట్లు పరిహారం మంజూరుకాగా, పార్వతీపురం డివిజన్లో రూ. 73.85 లక్షలను మంజూరు చేశారు. -
‘హుద్‌హుద్’ బాధిత రైతులకు రూ.140.36 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కోసం ప్రభుత్వం రూ. 140.36 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ ఏఆర్ సుకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెట్టుబడి రాయితీని 50 శాతం పైగా పంట నష్టపోయిన సన్న, చిన్నకారు రైతుల అకౌంట్లలో ఆన్లైన్ ద్వారా జమ చేయాలని ఆదేశించింది. -
తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరు భేష్
సాక్షి, విశాఖపట్నం: కనివినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించిన హుద్‌హుద్ తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరుపై హ్యాండ్‌బుక్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ తరుణ్‌బజాజ్ సూచించారు. ఎదుర్కొన్న తీరు అభినందనీయమన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో 220 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచాయని, 400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. బజాజ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు అధికారుల బృందం గురువారం జిల్లాలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందంలో బజాజ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అపర్ణ బాటియా, ఒన్నో రుహి, సౌరబ్ దాని, దీపక్ సింగ్, ఎం.తేరిసా ఖో, ఆండ్రూ జెఫ్రీస్, పుష్కర్ శ్రీవాత్సవ, అనీల్ మొత్వానిలకు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వాగతం పలికారు. తొలుత ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించి టెర్మినల్‌కు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ఉత్తరాంధ్రలో తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించి కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. తుఫాన్ నష్టాలపై బృందం సభ్యులకు కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లోని జీవీఎంసీ-యూఎల్బీ రోడ్, రాజీవ్ స్మృతి భవన్, ఎపీఐఐసీలోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింహపురి కాలనీలోని దెబ్బతిన్న అర్బన్ హౌసెస్, జీవీఎంసీ స్వర్ణభారతి ఆడిటోరియాన్ని పరిశీలించారు. సర్క్యూట్‌హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. సాయంత్రం మునగపాక మండలం వాడ్రాపల్లిలో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఉదయం జరిగిన సమీక్ష సమావేశంలో బజాజ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. జీవీఎంసీకి జరిగిన నష్టాన్ని ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని ఏపీ ఈపీసీడీఎల్ సీఎండీ శేషగిరిబాబులు వివరించారు. ఈ సమావేశంలో అటవీశాఖ చీఫ్ క న్జర్వేటర్ భరత్‌కుమార్, సోషల్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ కె. సూర్యనారాయణ, ఏజేసీ డి.వి.రెడ్డి, డీఎఫ్‌వో రామ్మోహనరావు, డీఆర్వో నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ లీలావతి, ఉద్యానవన శాఖ ఏడీ ప్రభాకరరావు, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తోట ప్రభావకరావు పాల్గొన్నారు. -
బాధితులతో.. పరిహాసం
విజయనగరం కంటోన్మెంట్: ఇటీవల వచ్చిన హుద్‌హుద్ పెను తుపానుతో జిల్లా అతలాకుతలమయింది. తుపాను బీభత్సంతో రూ.2,995 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతంలోని నష్టాలకు బాధితులకు అందజేయాల్సిన పరిహారాలకే దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడీ భారీ నష్టానికి సాయమందే అవకాశం ఉందా? అని బాధితులు వాపోతున్నారు. గతంలో రావాల్సిన పలు పంట నష్ట పరిహారాలు అందక రైతులు అప్పుల పాలవుతూ ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ఈ ఏడాది వేసవిలో వడగాడ్పులు భారీగా వీయడంతో వందలాది మంది మృతి చెందారు. మృతుల్లో 140 మందిని ప్రభుత్వం గుర్తించి వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం బాధిత కుటుంబాలకు అందజేస్తామని ప్రకటించింది. కానీ నేటికీపరిహారం అందలేదు. దీనికి సంబంధించిన ఫైళ్లు ఇంకా పెండింగ్‌లోనే ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ పరిహారాలపై పెద్దగా పట్టించుకోలేదని బాధిత కుటుం బాలు వాపోతున్నాయి. మే,జూన్ నెలల్లో వీచిన వడగాడ్పులకు మృతి చెందిన వారికి పరిహారాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, డాక్టర్, తహశీల్దార్లు కమిటీగా ఎండ వేడిమి తాళలేక వారంతా మృతి చెందారని నివేదించినప్పటికీ ప్రభుత్వం పరిహారాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తుండగా ఎండధాటికి తాళలేక మృతి చెందినప్పటికీ పరిహారం ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయా కుటుంబాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ప్రక టించిన పరిహారం అందలేదని 69ఏళ్ల వృద్ధురాలు కలెక్టరేట్‌కు వచ్చి వాపోయింది. నెల్లిమర్ల మండలం తాళ్లపూడి పేటకు చెందిన తాళ్లపూడి నారాయణమ్మ మిద్దె ఇంట్లో నివసిస్తోంది. వర్షాలకు మిద్దె ఇంటి గోడ కూలిపోవడంతో కాలు విరిగిపోయిందని నారాయణమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు రూ.50వేలు, కేంద్ర ప్రభుత్వం మరో రూ.50వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తే అధికారులు కేవలం రూ.15వేలు మాత్రమే ఇస్తామంటున్నారని వృద్ధురాలి అల్లుడు ఆరోపించాడు. ఇప్పటికే తమ అత్తకు చికిత్స కోస వేలాది రూపాయలు ఖర్చయ్యాయని, ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారాన్ని వెంటనే అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరాడు. గ్రామానికి చెందిన కార్యదర్శి రూ.3వేలు ఇస్తే పూర్తి పరిహారం ఇస్తానన్నాడని తీవ్రంగా ఆరోపించాడు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. -
పన్నెండు గంటలు...సందడే సందడి..
-
పన్నెండు గంటలు...సందడే సందడి..
ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన ‘మేము సైతం’ కార్యక్రమం ఆదివారం నాడు పన్నెండు గంటల పాటు జరిగింది. * ఉదయం 10 గంటలు దాటిన తరువాత అన్నపూర్ణా స్టూడియోలో కేవలం ప్రత్యేక ఆహ్వానితుల మధ్య ప్రారంభమైన ‘మేము సైతం’ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు సాగింది. కోటి స్వరాలు కూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ప్రత్యేక గీతం ‘మేము సైతం ఓ విశాఖ వాసులారా... ’ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. సీనియర్ సినీ నేపథ్య గాయని పి. సుశీల, తదితరులు కలసి ఈ గీతాన్ని ఆలపించారు. దర్శకుడు దాసరి నారాయణరావు, నటుడు మోహన్‌బాబు, బాలకృష్ణ మాట్లాడారు. ‘‘సినిమా వాళ్ళందరూ కలసి 10 కోట్ల దాకా ఇచ్చేయవచ్చు కదా అని అనవచ్చు. కానీ, బాధితులకు అండగా నిలిచి, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన ఆర్థిక సాయం అందించాలన్న స్ఫూర్తి ప్రజల్లో కలిగించడా నికే ఈ కార్యక్రమం’’ అని దాసరి అన్నారు. * ‘వందేమాతర’ గీతానికీ, ‘మనం’ చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశలు నాలో..’ పాటకు శ్రీయ డాన్స్ ఆకట్టుకుంది. * నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమంలో గాయకుడిగా అవతారమెత్తారు. గాయని కౌసల్యతో కలిసి ఆయన ‘చలాకీ చూపులతో...’ పాట పాడారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ వేదికపైకి వచ్చి మాళవికతో కలిసి ‘నీ కంటి చూపుల్లోన...’ పాట పాడారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు బాలకృష్ణ మైక్‌ని సునాయసంగా గాల్లోకి ఎగరేసి, స్టయిల్‌కి పట్టుకోవడం, చిన్ని చిన్ని స్టెప్స్ వేయడం వీక్షకులను అలరించింది. ఈ రెండు పాటలే కాక, ఆ తర్వాత ఓ స్కిట్ కూడా చేసి, కార్యక్రమానికి నిండుదనం తీసుకు వచ్చారు. * బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ అడపా దడపా తమదైన శైలిలో నవ్వించారు. * గాయకుడు బాబా సెహగల్ ‘గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..’ పాట పాడి అందరిలో జోష్ నింపారు. ఈ పాట ముగింపులో పలువురు దర్శక, నిర్మాతలు వేదికపైకి వచ్చి డాన్స్ చేయడం విశేషం. స్టెప్పులేసినవాళ్లల్లో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, ఎన్వీ ప్రసాద్, కేయల్ నారాయణ తదితరులు ఉన్నారు. * మణిశర్మ, కోటి, వందేమాతరం శ్రీనివాస్, మనో, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, అనూప్ రూబెన్స్, సునీత, శ్రీలేఖ తదితర సంగీతదర్శకులు, గాయనీ గాయకులు పాడిన పాటలు ఓ రిలాక్సేషన్. * డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్‌తో కలిసి ఇషా చావ్లా చేసిన డాన్స్ హృదయాన్ని హత్తుకుంది. పాట చివర్లో ‘ఈసారి సాయం మాకు కాదు.. హుద్‌హుద్ బాధితులకు చేయండి’ అని వారిలోని ఒక బాలుడు అనడం ఆహూతులను కదిలించింది. * ‘మేము సైతం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు.. దక్షిణాదికి చెందిన ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా విచ్చేస్తారని పేర్కొన్నారు. కానీ, వారెవరూ రాకపోవడం గమనార్హం. * మీడియాకు సైతం ప్రవేశం లేకుండా కేవలం టికెట్ కొన్నవారికే పరిమితం కావడంతో పత్రికలవారికి సమాచార సేకరణ ఇబ్బందిగా మారింది. పత్రికలకు ఫొటోలు, సమాచారం అందించే విషయంలో నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యవస్థ కొరవడ్డాయి. దాదాపు 12 గంటల పాటు టీవీలో లైవ్ టెలికాస్ట్ అని ప్రకటించినప్పటికీ, ముందుగానే రికార్డు చేసిన కార్యక్రమాలను వేదిక వద్ద ప్రదర్శిస్తూ, వాటినే ‘ప్రత్యక్ష ప్రసారం’గా టీవీలో చూపారు. * మధ్యాహ్నం దాటాక కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియమ్ వేదికగా తారల మధ్య సరదా ఆటల పోటీలు జరిగాయి. మంచు విష్ణు, మనోజ్‌లు రెండు కబడ్డీ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ పోటీలో బ్రహ్మానందం పాల్గొనడం ఓ ఆకర్షణ. ఈ పోటీలో మంచు మనోజ్ జట్టు విజేతగా నిలిచింది. * ఇక ఎన్టీఆర్, నాగార్జున కెప్లెన్లుగా రెండు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నాగార్జున జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌లో నాగశౌర్య వరుసగా మూడు సిక్సర్లు కొట్టి, స్టేడియమ్లో సందడి రేపారు. * అలాగే, వెంకటేశ్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా జరిగిన మ్యాచ్‌లో వెంకీ టీమ్ గెలిచింది. రామ్‌చరణ్ మూడు క్యాచ్‌లు పట్టారు. * నాకౌట్ దశలో విజయం సాధించిన రెండు జట్లతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. వెంకటేశ్, నాగార్జున జట్లు పోటాపోటీగా ఆడిన నేపథ్యంలో గెలుపు నాగ్ టీమ్‌దే అయ్యింది. * ఆరు ఓవర్లకే పరిమితమైన ఈ మ్యాచ్‌లను టెన్నిస్ బంతితో ఆడారు. * మరోపక్క సాయంత్రం వేళ మళ్ళీ అన్నపూర్ణా స్టూడియోలో తారల సందడి సాగింది. ‘బాహుబలి’ బృందం వంటకం చేయడాన్ని రికార్డు చేసి, ప్రదర్శించారు. * హుద్ హుద్ తుఫాను సమయంలో కొంతమంది ప్రాణాలను కాపాడిన, సమాచార వ్యవస్థను సరి చేయడానికి పాటుపడిన కొంతమంది వ్యక్తులను ‘రియల్ హీరోస్’ పేరుతో నాగార్జున పరిచయం చేశారు. * తుషాను బాధితుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించి, ఆ పాటలో అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం నటించడం విశేషం. * సాయంత్రం వేళ సందడిలో చక్రి, దేవిశ్రీ ప్రసాద్, తమన్‌లు పాటలతో అలరించారు. తమన్ ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ షోలో రవితేజ కొన్ని పాటలు పాడి, నర్తించారు. దేవిశ్రీ ప్రసాద్ ‘శంకర్‌దాదా జిందాబాద్...’ గీతానికి చిరంజీవి చాలా హుషారుగా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణ అయింది. గాయకుడు మనో సారథ్యంలో సినీ నటులు పాల్గొన్న ‘అంత్యాక్షరి’ ఉత్సాహంగా సాగింది. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్, రాజశేఖర్, అలీ, జయప్రద తదితరులు చాలా హుషారుగా పాటలు పాడారు. * ఈ కార్యక్రమంలో మరో హైలైట్ హీరో మహేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను హీరోయిన్ సమంత ఇంటర్వ్యూ చేయడం. అసలు ఇద్దరు స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్‌బాబులతో మీకెలా స్నేహం కుదిరింది? అని త్రివిక్రమ్‌ని సమంత అడిగితే - ‘‘ఇద్దరికీ ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఇద్దరూ నిరాడంబరంగా ఉంటారు. మహేశ్ వార్డ్ రోబ్‌లో రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు మినహా ఉండవు. ఎంత పెద్ద కారు, ఎంత ఖరీదు గల కారులో వెళ్లాలా అని ఆలోచించడు. ఉండటానికి చిన్న ఇల్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉండే చాలని మహేశ్ అనుకుంటాడు. పవన్ కల్యాణ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. తన దగ్గరా రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలే ఉంటాయి. ఖరీదు గల కారుల్లో తిరగాలని ఆయన అనుకోరు. చుట్టూ చెట్లు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉంటే చాలని కోరుకునే వ్యక్తి. ఇలా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టే, ఇద్దరితోనూ నాకు మంచి స్నేహం కుదిరింది’’ అని చెప్పారు. -
హుద్‌హుద్ తుపాన్ నష్టాలు పరిశీలన
ఎచ్చెర్ల రూరల్ : గత నెల 12 వ తేదీన సంభవించిన హుద్‌హుద్ తుపాన్ నష్టాలను అంచనాలు వేయడానికి ఎం. రమేష్‌కుమార్, రజీబ్‌కుమార్‌సేన్, పీఎస్ చక్రవర్తి, కె.రామ్‌వర్మలతో కూడిన కేంద్ర బృంద గురువారం జిల్లాలో పర్యటించింది. రణస్థలం మండలంలోని పర్యటించారు. అనంతరం వారు ఎచ్చెర్ల టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో తుపాన్‌కు జిల్లాలో శాఖల వారీగా నష్టాల వివరాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. జిల్లాలో మొత్తంగా రూ. 1,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో హుద్‌హుద్ తుపాన్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కేంద్ర బృందానికి వినతిపత్రం అందజేశారు. బోట్లు, వలలకు ప్రభుత్వం రూ.5 వేలు ప్రకటించిందన్నారు. మత్స్యకారులకు రూ. 25 వేలు సాయం అందించాలని వారు కోరారు. తమ్మినాయుడుపేట గ్రామానికి చేరుకున్న బృంద సభ్యులు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. స్థానికులు పలు సమస్యలపై వినతులు అందించారు. మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సాంప్రదాయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజారావు, ప్రతినిధులు ధనరాజ్, గణపతి బృందానికి వినతిపత్రం అందజేశారు. ఏజేసీ రజనీకాంతరావు, డుమాపీడీ కళ్యాణచక్రవర్తి, వివిదశాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బృందం సాయం అందించేందుకు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇక్కడ పర్యటన అనంతరం విశాఖలో సమావేశం నిర్వహించనున్నారన్నారు. ఆ సమావేశంలో జిల్లా మంత్రి కూడా హజరవ్వనున్నారని తెలిపారు. -
రిహార్సల్స్ లో.. మేముసైతం
హుద్‌హుద్ తుఫాన్ అందాల విశాఖను కకావికలం చేసింది. పగబట్టిన సుడిగాలి స్టీల్ సిటీ గుండె నిబ్బరాన్ని కొన్ని గంటలు పరీక్షించింది. తుపాను ధాటికి తల్లడిల్లిన విశాఖకు తనువెల్లా తూట్లు పడ్డాయి. లక్ష కోట్లు నష్టపోయింది. పెను విషాదంలో మునిగిన విశాఖ నగరాన్ని ఊరడించడానికి టాలీవుడ్ నడుం బిగించింది. ఆ తరం నుంచి నేటి తరం వరకూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ‘మేముసైతం’ అంటూ రంగంలోకి దిగారు. జూనియర్ ఆర్టిస్ట్స్ నుంచి బడా స్టార్స్ వరకూ.. లైట్‌మెన్ నుంచి కెమెరామెన్ వరకూ.. అందరూ తమ కళతో.. తుఫాను సృష్టించిన ‘అల’జడిని జయిస్తామంటున్నారు. జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. చేతనైన సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఈ నెల 30న మేముసైతం అంటూ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆటపాటలు, డ్యాన్స్‌లు, స్కిట్స్‌తో అందరినీ అలరిస్తూనే.. వైజాగ్‌వాసులను ఓదారుస్తామంటున్నారు. ఇండస్ట్రీ తరఫున రూ.35 కోట్లు సాయం చేయాలని సంకల్పించుకున్నారు. ఈవెంట్‌ను సకె ్సస్ చేయడానికి ప్రాక్టీస్‌లో మునిగిపోయిన నటీనటులను ‘సిటీప్లస్’ పలకరించింది. ..:: శిరీష చల్లపల్లి మారథాన్ పెర్ఫార్మెన్స్.. బిజీ షెడ్యూల్‌తో రెస్ట్‌లెస్‌గా ఉంది. అయితే హుద్‌హుద్ ధాటికి విశాఖలో నిలువ నీడ లేకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారికి చేయూతనివ్వడానికి నేనుసైతం మేముసైతంతో పాలుపంచుకుంటున్నాను. 12 నిమిషాల నిడివున్న సాంగ్‌పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. - శ్రేయ అందుకే అందరం.. విపత్కర పరిస్థితుల్లో ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీయే. మా తరఫున భారీగా నిధులు సేకరించాలని భావిస్తున్నాం. ఒకే వేదికపై ఇందరిని చూడటం జరగని పని. కానీ, ప్రకృతి వైపరీత్యానికి సర్వం కోల్పోయిన వారి కోసం అందరం చేతులు కలిపి.. బాధితులకు భరోసానిస్తున్నాం. -అలీ కమల్ వస్తున్నారు.. ఈ బిగ్ ఈవెంట్లో ఇండస్ట్రీ మొత్తం పాల్గొంటుంది. భారీనిధుల సేకరణే లక్ష్యంగా ఇంత పెద్ద ఈవెంట్‌ను డిజైన్ చేశాం. టాలీవుడ్ స్టార్స్ అందరితో పాటు కమల్‌హాసన్ కూడా వస్తున్నారు. స్టార్స్ ఆటపాటలతోపాటు ర్యాంప్‌వాక్ కూడా నిర్వహిస్తున్నాం. విశాఖ విలయం తర్వాత సిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన వ్యక్తుల గురించి అందరికీ తెలియజేస్తాం. - తమ్మారెడ్డి భరద్వాజ మీకోసం మేము.. విశాఖ బాధితుల కోసం నేను, డెరైక్టర్ మారుతి, నటి మధు, నటుడు సాయి కలసి స్పెషల్ షూట్ చేస్తున్నాం. ఇది హుద్‌హుద్ బాధితులకు మనోధైర్యాన్నిచ్చేలా ఉంటుంది. మనమంతా ఒక్కటై ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొందాం. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. కానీ, మీకు మేమున్నాం మనోధైర్యాన్ని కోల్పోకండి. - హీరో నందు గుడ్ కాజ్.. నేను అక్ష, సంజన కలసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఎనిమిదిన్నర నిమిషాల పాటు సాగే మాస్ సాంగ్ కోసం నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక గుడ్ కాజ్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. - మానస్ (కాయ్ రాజా కాయ్ హీరో) చారిటీ.. యూనిటీ.. విశాఖ వైపరీత్యానికి బాధగా ఉన్నా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ప్రజలకు ఆనందం పంచుతూనే విశాఖవాసులకు చారిటీ చేయడం నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా. స్టీల్ సిటీగా పేరొందిన వైజాగ్ అంతే నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాను. - అక్ష (కందిరీగ ఫేమ్) ఆనాటి నుంచే.. మమ్మల్ని బాగా ఉంచుతున్న ప్రేక్షకులు బాగుండాలని ఇండస్ట్రీ ఎప్పుడూ కోరుకుంటుంది. మేముసైతం ఈవెంట్లో టాలీవుడ్ టాప్ హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అందరూ పాల్గొంటున్నారు. మా పెద్దమ్మాయి చేతన తొందర్లోనే వెండితెరకు పరిచయం కాబోతుంది. తను కూడా ఇందులో పాల్గొంటోంది. - ఉత్తేజ్ ఓపెన్ హార్టెడ్‌గా.. మూడు రోజులుగా రిహార్సల్స్ సాగుతున్నాయి. అందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తమన్నా, ఇషాచావ్లా, కావ్యలకు మెడ్లీ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాను. ఒక కాజ్ గురించి ఇండస్ట్రీ అంతా కలసి వర్క్ చేయడం గొప్ప ఫీలింగ్. అందరూ ఓపెన్ హార్టెడ్‌గా పని చేస్తున్నారు. - రఘు మాస్టర్ (కొరియోగ్రాఫర్) నాలుగు రోజులుగా.. నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఓ కన్నడ సినిమా షూటింగ్ ఉంది. దాన్ని స్కిప్ చేసి మరీ ఇందులో పాల్గొంటున్నా. మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం దీన్ని ఓ బాధ్యతగా స్వీకరించాం. - సంజన మా తరఫున ఎందరో.. విశాఖ బాధితులకు మేం సాయం చేయడమే కాదు.. మా తరఫున ఎందరినో కదిలించి ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి మా నట కుటుంబం అంతా సీరియస్‌గా రిహార్సల్స్‌లో మునిగిపోయింది. - కామ్నా జెఠ్మలానీ సాయంకాలం విశాఖ విలయంలో పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ మా ఈవెంట్ ద్వారా విశాఖవాసులకు కొంత సాంత్వన కలుగుతుందని ఆశిస్తున్నాం. మేముసైతం 12 గంటలపాటు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో క్రికెట్, అంత్యాక్షరి, ఖోఖో, కబడ్డీ, తంబోలా, సాంగ్, డ్యాన్స్, మ్యూజిక్, స్కిట్స్ ఇలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. 29 నైట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో స్టార్ డిన్నర్ నిర్వహిస్తున్నాం. స్టార్స్‌తో భోజనం చేసేందుకు జంటకు రూ.లక్ష టికెట్ ధరగా నిర్ణయించాం. టికెట్ తీసుకున్నవారు స్టార్స్‌తో భోజనం చేయొచ్చు. 30న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది. దీని టికెట్ ధర రూ.3 వేలు. ఈ టికెట్లు బిగ్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ రోజు సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి. స్టార్ ఈవెంట్స్ చూడాలనుకునే వారు ముందుగా రూ.500 టికెట్స్ కొనాలి. వీటిని కొన్నవారిలో లక్కీ డ్రా ద్వారా 104 మందిని ఎంపిక చేస్తాం. వీరికి మాత్రమే స్టార్ సెలబ్రేషన్స్‌ను దగ్గరుండి చూసే చాన్స్ లభిస్తుంది. స్టేడియంలో తంబోలా గేమ్ టికెట్ ధర రూ.15 వేలు. ఇందులో గెలిచిన వారికి భారీ బహుమతి కూడా ఉంటుంది. - దగ్గుబాటి సురేష్ -
మిగిలేది మొండిచేయే
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు జిల్లాలో 34,180.22 హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. 9589 హెక్టార్లలో వరి, 20,137 హెక్టార్లలో చెర కు, 468 హెక్టార్లలో పత్తి, 209 హె క్టార్లలో కందులు, 121 హెక్టార్లలో మొక్కజొన్న, 3209 హెక్టార్లలో రాజ్మా, 11 హెక్టార్లలో మినుము, 66 హెక్టార్లలో వేరుశనగ, 321 హెక్టార్లలో రాగులు, 48 హెక్టార్లలో పొగాకు దెబ్బతిన్నట్టుగా అధికారులు నిర్ధారించారు.1, 55,915 మంది రైతులు నష్టపోయినట్టు లెక్కలు తేల్చారు. వీరికి రూ.49.18కోట్ల మేర ఇన్‌పుట్‌సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. హార్టికల్చర్ పంటలకుసంబంధించి 55,334.608 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా లక్షా 62 వేల మంది రైతులు నష్టపోయినట్టు నిర్ధారించారు. జిల్లాలోని రెండులక్షల మంది రైతుల్లో సొంతంగా సాగుచేసేది 50 నుంచి 70వేల మందే. మిగిలిన వారంతా కౌలురైతులే. భూయజమానికి..వీరికి మధ్య అవగాహన ఒప్పందం (నోటి మాటతోనే) కౌలుసాగుతుంటుంది. గత ప్రభుత్వం కౌలు అర్హత కార్డులు జారీకి శ్రీకారం చుట్టింది. సరైన అవగాహన, చైతన్యం కొరవడడం.. లిఖిత పూర్వకంగా ఎలాంటి కౌలు ఒప్పందాలు లేకపోవడం, అసలు రైతులు ఇబ్బందులు వెరశి కౌలు అర్హత కార్డులు పొందిన వారు జిల్లాలో చాలా తక్కువనే చెప్పాలి. 2012-13లో కార్డులు పొందిన వారు 50వేల మంది వరకు ఉంటే 2013-14లో ఈ సంఖ్య 35వేలకు మించలేదు. ఇక ఈఏడాది ఇప్పటి వరకు రెన్యువల్ చేయించుకున్న వారు కేవలం 10,783మంది మాత్రమే. వీరిలో బ్యాం కుల ద్వారా రుణాలు పొందిన వారు.. పంటలకు బీమా చేయించుకున్న వారి సంఖ్య రెండుమూడువేలకు మించరని అధికారులే పేర్కొంటున్నారు. ఈ లెక్కన హుద్‌హుద్ దెబ్బకు పంటలుకోల్పోయిన కౌలు రైతుల్లో నూటికి 90 శాతం పరిహారానికి నోచుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం జరిగిన పంటనష్టం అంచనాల సర్వేలో భూయజమానుల పేర్లనే జాబితాలో చేర్చారుతప్ప ఏ ఒక్క గ్రామంలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో కౌలురైతులకు చోటు దక్కలేదు. రుణాల మంజూరుకు బ్యాంకులు ముఖం చాటేయడంతో బంగారు నగలను కుదువపెట్టడం అవి సరిపోకపోతే ఐదు రూపాయల వడ్డీకి అప్పు చేసి మరీ సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. బీమా కాదుకదా కనీసం ఇన్పుట్ సబ్సిడీ దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఒక పక్క చేతి కంది వచ్చిన పంట తుఫాన్ పాలవ్వగా, మరోవంక ప్రభుత్వ సాయం అందక వీరు మరింత అప్పుఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో విచారిస్తే ఏ భూమిలో ఎవరుసాగు చేస్తారో చెబుతారు.. లేదా వీఆర్వోలు.. ఏవోలను అడిగినా చెబుతారు.. వాటిని ప్రామాణికంగానైనాతీ సుకుని తమకు పరిహారం జాబితాలో చోటు కల్పించాలి. భూమియజమానులుకూడా ఉదారంగా స్పందించి కనీసం పరిహారంలో కొంత భాగమైనా ఇవ్వాలి. అప్పుల ఊబిలో ఉన్న తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు పేర్కొంటున్నారు. ఏదీ వర్తంచదంటున్నారు. నాది నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట. పదెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. ఈ ఏడాది వరిపంట వేశా. తుఫాన్‌కు పూర్తిగా దెబ్బతినిపోయింది. బాధిత రైతుల జాబితాలో నాకు చోటు దక్కలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం, పంటల బీమా కూడా రావంటున్నారు. బ్యాంకులు రుణాలివ్వడం లేదు. బీమా చేయించుకునే అవకాశం లేకుండా పోతోంది. కనీసం దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం చెల్లించక పోతేమా గతేంటి..యజమాని కనికరించకపోతే అప్పులు పాలవ్వాల్సిందే. -పైల నూకన్ననాయుడు, కౌలు రైతు -
అయ్యో... ఎంత నష్టం !
విజయనగరం కంటోన్మెంట్ : భీకర గాలులతో జిల్లాను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను మిగిల్చిన నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం చలించిపోయింది. జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు బుధవారం వచ్చిన కేంద్ర బృందంలోని సభ్యులు పూసపాటిరేగ, భోగాపురంమండలాల్లో పర్యటించి, అక్కడ జరిగిన నష్టాన్ని కళ్లారా చూశారు. కొన్నిచోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో, అక్కడ జరి గిననష్టాలను ఫొటో ఎగ్జిబిషన్లో తిల కించారు. కేజీ బేసిన్ ఎస్ఈ ఆర్. రమేష్‌కుమార్, ఫైనాన్స్ కమిషన్ డివిజన్లోని వ్యయ శాఖ ైడె రెక్టర్ రాజీబ్ కుమార్‌సేన్, ఏహెచ్డీ అండ్ ఫైనాన్స్ శాఖకు చెందిన ఉప కార్యదర్శి పీఎస్ చక్ర బర్తి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ కె రామవర్మ జిల్లాలోని తుపాను బీభత్స ప్రాంతాల్లో పర్యటించారు. ముక్కాం, భోగాపురం, కుమిలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తుపాను దృశ్యాలను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన తీవ్రమైన నష్టాలను చూసి చలించిపోయారు. భోగాపురం, ముక్కాం తదితర ప్రాంతాల్లోని బాధితులనుద్దేశించి వారు మాట్లాడుతూ తుపాను గాలులు తీవ్రంగా వీచాయని విన్నాం! ఆ సమయంలో ఎలా గడిపారు,ఏం తిన్నారని ప్రశ్నించారు. వారు చెప్పిన విషయాలను కలెక్టర్ తర్జుమా చేసి కేంద్ర బృందానికి వివరించారు వీరి భృతికి ఏం చేశారని కలెక్టర్ ఎంఎం నాయక్‌ను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు బియ్య ం, ఉల్లిపాయలు, బంగళాదుంపలు, పప్పు, పంచదార, కిరోసిన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు తక్కువ ధరకు కూరగాయాలు అందజేశామని తెలిపారు. జిల్లాలోని 12 మండలాల్లో పైన పేర్కొన్న సరుకులను పూర్తిగా ఉచితంగా ఇచ్చామని, పాక్షికంగా నష్టం ఏర్పడిన 22 మండలాల్లో బియ్యం, పంచదార ఉచితంగా అందంజేశామన్నారు. రాజాపులోవ నుంచి కవులవాడ, తూడెం, దిబ్బపాలెం, ముక్కాం, భోగాపురం గ్రామాల్లో ఉదయం తొమ్మిదిన్నర గం టల నుంచి మధ్యాహ్నం వరకూ పర్యటించారు. జిల్లాలో జరిగిన నష్టాలపై శాఖల వారీగా పంపిన అంచనాలను పరిశీలించామని, దీనిపై కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా పంపిన అంచనాలను సరిపోల్చేందుకే వచ్చామని, ఈ పరిశీలన తరువాత నివేదికలను కేంద్రానికి పంపిస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బాధితులతో మాట్లాడినప్పుడు తుపాను సమయంలో ఎటువంటి సహాయం అందిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పడిపోయిన చెట్లకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చిందని, వాటిని తొలగించి, వేరే చోట వేయడానికి కూడా ఆ సొమ్ము సరిపోలేదనీ బాధితులు కేంద్రబృందానికి తెలిపారు. రహదారులు బాగు చేయాలని కోరారు. కూలిన టేకు, కొబ్బరి చెట్లు, విద్యుత్‌స్తంభాలను, ముక్కాంలో మత్స్య కారులకు జరిగిన నష్టాన్ని, కుమిలిలో వరి,చెరకు పంటలకు జరిగిన నష్టాలను బృందం సభ్యులు పరిశీలించారు. బృందం వెంట జేసీ బి రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ జి రాజకుమారి, ఆర్డీఓ జే వెంకటరావు, సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు. -
మీరైనా క ళ్లు తుడవండి ఢిల్లీ దొరలూ!
పిఠాపురం/తుని : పొరుగు జిల్లాలతో పోల్చినప్పుడు చాలావరకూ కనికరించినట్టే అయినా.. హుద్‌హుద్ తుపాను జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గట్టిదెబ్బే కొట్టింది. ఆ దెబ్బకు ఇళ్లు, చేలు ధ్వంసమై ఎందరో ఆర్థికంగా కుదేలయ్యారు. మత్స్యకారులకు వారం రోజుల పాటు వేట లేక పూట గడవక కటకటపడ్డారు. జిల్లాలోని పిఠాపురం, తుని నియోజకవర్గాలలోని తీరప్రాంతంలో హుద్‌హుద్ నష్టం కొట్టొచ్చినట్టు కనిపించింది. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటతో పాటు ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం వంటి గ్రామాలు తుపాను తాకిడికి అతలాకుతలమయ్యాయి. మత్స్యకార కుటుంబాలు విలవిలలాడాయి. బాధితులంతా ప్రభుత్వం ఆసరా ఇస్తుందని ఆశించారు. కానీ ఇప్పటి వరకూ వారిలో కొందరికి 25 కేజీల బియ్యం తప్ప ఎటువంటి సహాయం అందక పోవడంతో వారు లబోదిబో మంటున్నారు. ఒక్క కోనపాపపేటలోనే దాదాపు 50 గృహాలు నేలమట్టం కాగా 25 గృహాలు పూర్తిగా దెబ్బ తిని సుమారు రూ.కోటి ఆస్తినష్టం సంభివించిందని అంచనా. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం వంటి గ్రామాల్లో సుమారు 100 గృహాలు, వలలు, బోట్లు పాక్షికంగా దెబ్బతిని రూ.1.50 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా. ఉప్పాడ నుంచి కాకినాడ మధ్య ఉన్న బీచ్‌రోడ్డు పూర్తిగా దెబ్బతిని సుమారు రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తీరం వెంబడి ఉన్న పంటపొలాల్లోకి సముద్రపునీరు చొచ్చుకురావడంతో సుమారు 100 ఎకరాల పంటపొలాలు చవుడు బారిపోయాయి. అనేక చోట్ల వరి పంట నేలనంటి నాశనమైంది. రైతులకు ఇప్పటి వరకూ ఏ విధమైన పరిహారం అందలేదు. పలు విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. తుని, తొండంగి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో సుమారు 2300 ఎకరాల్లో అరటి, పత్తి, ఉల్లి, మల్బరీ, పచ్చిమిర్చి, పెండ్లం వంటి పంటలు దెబ్బతిన్నాయి. రెండు నియోజకవర్గాల పరిధిలో కొబ్బరి, టేకు, పామాయిల్, మామిడి, జీడిమామిడి చెట్లు సుమారు 12 వేల వరకు దెబ్బ తిన్నాయి. అధికారిక అంచనా ప్రకారం తుని, తొండంగి మండలాల్లో 350 గృహాలు దెబ్బ తిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హుద్‌హుద్ తుపాను పీడిత ప్రాంతంగా దృష్టినంతా ఉత్తరాంధ్రపైనే కేంద్రీకరించిందని, తమను ఉపేక్షించిందని జిల్లాలోని తుపాను బాధితులు వాపోతున్నారు. తుపాను నష్టాన్ని పరిశీలించడానికి గురువారం జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందమైనా తమకు జరిగిన నష్టాన్ని పరిగణన లోకి తీసుకుని, న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 350 కోట్ల నష్టం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు హుద్‌హుద్ తుపాన్ కారణంగా రూ. 350 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా ఉందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి విష్ణుదేవ్ తెలిపారు. లోక్‌సభtలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
అసౌకర్యాలకు కేరాఫ్..బస్టాప్
త్వరలో పునరుద్ధరిస్తాం తుఫాన్ ధాటికి దెబ్బతిన బస్షెల్టర్లలో 90 అందుబాటులోకి తెచ్చాం. మిగతావి త్వరలోనే బాగుచేస్తాం. బస్టాండుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిబ్బందికి సూచనలిస్తున్నాం. ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా చూడటానికే ప్రయత్నిస్తున్నాం. -వై.జగదీష్‌బాబు, ప్రాంతీయాధికారి బస్టాపుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అసౌకర్యాలకు నిలయంగా ఉండే ఇవి హుద్‌హుద్ దెబ్బకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైకప్పుల్లేని ప్లాట్‌ఫారాలు, శిథిలమైన బెంచీలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. గ్రామీణ ..సిటీ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి రోజూ 1013 బస్సుల్లో 6.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖలో 420 బస్షెలర్లలో తుఫాన్‌కు 260 దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బస్సులను నడుపుతున్న ఆర్టీసీ అధికారులు పాడై న వీటిని పట్టించుకోవడం లేదు.షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపైనే నిలబడుతున్నారు. విశాఖలో జాతీయ రహదారి వెంబడి షెల్టర్లు కనుమరుగయ్యాయి. బస్టాపుల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్ అసౌకర్యాలకు కేరాఫ్..బస్టాప్ * సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో బస్టాప్‌ల పరిస్థితి దయనీయంగా ఉంది. హుద్‌హుద్ ధాటితో మరింత అధ్వానంగా తయారయ్యాయి. * అనకాపల్లి బస్‌స్టాండ్‌లో ఫ్యాన్లు, మైక్ అనౌస్మెంట్ పనిచేయడం లేదు. 10 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. * అరకు వేలీ బస్‌స్టాండ్‌లో తాగునీరు కరువైంది. అరకువేలీ నుంచి లోతేరు వరకూ 90 గ్రామాలకు బస్ సౌకర్యమే లేదు. * చోడవరం నియోజకవర్గంలో 150 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. బస్టాండ్‌లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. 106 సర్వీసుల్లో ఇప్పుడు 86కు కుదించారు. * నర్శీపట్నం అడ్డురోడ్డు నుంచి ఒకే ఒక్క బస్సు తిరుగుతోంది. జల్లూరు వద్ద బ్రి డ్జి దెబ్బతిన్నదంటూ చూపిస్తున్నారు. * పాడేరులో సయమానికి బస్సులు రావడం లేదు. * చింతపల్లి కాంప్లెక్సులో తాగునీరు, మరుగుదొడ్లు లేవు. ఎనిమిది పంచాయతీల్లో గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. * నక్కపల్లిలో మెయిన్‌రోడ్డుపై బస్టాండ్ ఉన్నా ఎక్స్‌ప్రెస్‌లు రావడంలేదు. పా యకరావుపేటలోనూ ఇదే పరిస్థితి. * సబ్బవరం బస్టాండ్ భయానకంగా మారింది. * పెందుర్తిలో రూ.10లక్షలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. * భీమిలిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ లోకి ప్రయాణీకులు వెళ్లడం లేదు. యలమంచిలి బస్టాండ్‌కి పక్కనే 16వ నెంబర్ జాతీయ రహదారి ఉండటంతో ఎక్స్‌ప్రెస్‌లు బస్టాండ్‌లోకి రాకుండా వెళ్లిపోతున్నాయి. -
వాలుతున్న రాబందులు
హుద్‌హుద్ తుపాను పరిహారాన్ని తన్నుకుపోయేందుకు పాలక రాబందులు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాయి. సెంటు భూమి లేకున్నా పర్లేదు.. అధికార పక్ష సానుభూతిపరులైతే చాలు.. ఎలాగోలా పరిహారం ఇచ్చేయాలంటున్నాయి. జాబితాలపై సంతకాలు చేయాలంటూ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నాయి. దీనిపై తొండంగి, శృంగవృక్షం గ్రామాల్లో ‘సాక్షి’ పరిశీలన జరపగా.. అధికార పార్టీ నేతలే బినామీ పేర్లతో సొంత జాబితాలు తయారు చేసి, తద్వారా పెద్ద ఎత్తున పరిహారం సొమ్ములు కాజేసేందుకు పక్కా ప్లాన్ చేశారన్న విషయం వెల్లడైంది. ఈ జాబితాలను అధికారులకు అందజేసి ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నారు. దీనికి అధికారులు ససేమిరా అంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :గత నెలలో సంభవించిన హుద్‌హుద్ తుపానుతో జిల్లాలోని తుని, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని పలు మండలాలల్లో నష్టం సంభవించింది. అరటి, వరి, చెరకు సహా పలు పంటలను రైతులు నష్టపోయారు. వారికి పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉద్యావన శాఖాధికారి, వీఆర్వోలతో కూడిన బృందాలు పండ్ల తోటల నష్టంపై జాబితాలు రూపొందిస్తున్నారు. ఇక్కడే అధికార పార్టీ నాయకులు రంగప్రవేశం చేశారు. కొందరు అధికారులపై ఒత్తిడి తెచ్చి నాయకులు జాబితాలను తమవారి పేర్లతో నింపే పనిలో బిజీగా ఉన్నారు. తొండంగి మండలం శృంగవృక్షం, తొండంగి, ఎ.కొత్తపల్లి, సీతారాంపురం, కొమ్మనాపల్లి, గోపాలపట్నం, బెండపూడి, చిన్నాయిపాలెం, పైడికొండ, ఆనూరు, పి.అగ్రహారం గ్రామాల్లో అధికార బృందాల సర్వే పూర్తైది. వీటిలో గోపాలపట్నం, సీతారాపురం తదితర గ్రామాల్లో అనర్హులను జాబితాలో చేర్చారన్న ఫిర్యాదులున్నాయి. వీటితోపాటు తొండంగి, శృంగవృక్షం గ్రామాల్లో జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొండంగి తహశీల్దార్ కార్యాలయం, కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌కు ఈ రెండు గ్రామాల జాబితాలపై ఫిర్యాదులు వచ్చాయి. శృంగవృక్షంలో అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడి వెంట తిరిగే అనుచరులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం వచ్చేలా జాబితా తయారు చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఒక్క గ్రామంలోనే సుమారు 235 పేర్లతో జాబితా రూపొందింది. వాటిలో 80 పైగా పేర్లు అధికార పార్టీ నేతల బంధువర్గం, అనుయాయులవేనన్న ఆరోపణలు వస్తున్నాయి. తొండంగిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. అరటి, కొబ్బరి, టేకు చెట్లు కుప్ప కూలిపోయినట్టు జాబితాలు రూపొందించి, వాటిని ఆమోదించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఈ గ్రామానికి చెందిన రాంబాబుకు 539 సర్వే నంబరులో సుమారు మూడెకరాల భూమి ఉన్నట్టు నేతలు రూపొందించిన జాబితాలో ఉంది. ఆ పొలాన్ని కౌలుకు ఇవ్వగా, ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. పంట చేతికొచ్చి కోతకు సిద్ధంగా ఉంది. నష్టాలపై నేతలు రూపొందించిన జాబితాలో మాత్రం అరటితోట వేసినట్టు చూపించారు. 20 సెంట్లకుగానూ నష్టపరిహారంగా రూ.5 వేలు రాయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన పి.ఈశ్వరుడికి సెంటు భూమి కూడా లేదు. కానీ అతడి పేరున 544, 544/1 సర్వే నంబర్లు సృష్టించి 60 సెంట్లు భూమిలో అరటి తోట పడిపోయినట్టు జాబితాలో చూపించారు. అందుకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఇదే సర్వే నంబర్లలో గోవిందు అనే రైతుకు 30 సెంట్లలో అరటితోట నష్టపోయినట్టు చూపించారు. ఇందుకు రూ.7500 పరిహారం ఇవ్వాలని జాబితాలో పొందుపరిచారు. తొండంగి తహశీల్దార్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి సమీప బంధువుల పేరుతో రెండు బినామీ సర్వే నంబర్లు చూపించాడని తెలియవచ్చింది. వాటిలో అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు జాబితాలో నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఆ జాబితాతో రూ.లక్షన్నర పరిహారం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అర్హత ఉన్నా జాబితాలో దక్కని చోటు ఈ అవకతవకల జాబితాలపై తొండంగికి చెందిన అరటి రైతు అయ్యన్న కలెక్టరు నీతూ ప్రసాద్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 568/2లోని 2.72 సెంట్లు భూమిలో ఎకరం అరటి తోట పడిపోయిందని, అయినప్పటికీ జాబితాలో చోటులేకుండా చేశారని వాపోయారు గోపాలపట్నంలో కె.సత్యనారాయణ అనే రైతుకు 77 సర్వే నంబర్లో అర ఎకరం పొలం ఉంది. ఇందులో వేసిన అరటి తోట పడిపోయింది. కానీ జాబితాలో తన పేరు లేదని ఆయన లబోదిబోమంటున్నారు. దాదాపు ఇటువంటివే ఉదాహరణలు తుని మండలంలో కూడా ఉన్నాయి. ఈ మండలంలోని పి.వెంకటాపురం, తేటగుంట, కొలిమేరు గ్రామాల్లో కూడా అక్కడి అధికార పార్టీ నేతలు తమ అనుయాయులు, బంధువుల పేర్లను జాబితాల్లో చేర్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అరటి తోటల వరకూ ఫొటోలు తీయించి అధికారులకు ఇవ్వగా, మిగిలిన పూలతోటలు, కూరగాయల తోటలకు సంబంధించి తప్పుడు రికార్డులు సృష్టించారని చెబుతున్నారు. అవకతవకలు బయటకు పొక్కడంతో ఈ జాబితాల్లో మరోసారి మార్పులు చేసేందుకు నేతలు సిద్ధపడుతున్నారు. నియోజకవర్గంలో సర్వే చేసిన అన్ని గ్రామాల్లోనూ పంటనష్టం జాబితాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని మాజీ సర్పంచ్ కటకం ఈశ్వరరావు తదితరులు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 27న హుద్‌హుద్ తుపాను ప్రభావాన్ని పరిశీలించేందుకు జిల్లాకు రానున్న కేంద్రబృందం దృష్టికి ఈ అక్రమాల విషయాన్ని తీసుకువెళ్లేందుకు స్థానికులు సిద్ధపడుతున్నారు. -
ఈనెల 30న మిస్ వైజాగ్ కాంపిటీషన్
-
సత్వర సాయం అందించండి
-
కేంద్రం సహాయం పెంచాలి: ఎంపీ మేకపాటి
న్యూఢిల్లీ: హుదుహుద్ తుపాను బాధితులకు కేంద్ర సహాయం పెంచాలని వైఎస్ఆర్ సీపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. హుదుహుద్ తుపానుపై పార్లమెంటులో చర్చజరపాలని ఆయన కోరారు. తుపాను వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో భారీనష్టం సంభవించినట్లు తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అందువల్ల వారికి కేంద్రం చేసే సాయం పెంచాలని మేకపాటి కోరారు. ** -
ఇటు కోత..అటు మేట!
పరుపులను తలపించే ఇసుకతిన్నెలు లేవు.. తీరం వెంబడి సరదాగా కూర్చునేందుకు చదునైన చోటూ లేదు. తెల్లని ఇసుకంతా నల్లని బొగ్గుపొడిలా దర్శనమిస్తోంది. ఎగుడు దిగుడు గట్లను తలపిస్తోంది. ఆవేశంతో వస్తున్న కెరటాలు ముందుకెళ్లడం మా వల్లకాదంటూ వెనక్కి తగ్గుతున్నాయి. హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు మునుపటి విశాఖ సాగరతీరం అందాలు చెల్లాచెదురయ్యాయి. నిత్యం వేలాదిమందికి ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో ఇప్పుడు వేల టన్నుల ఇసుక కోతకు గురైంది. మరికొన్ని చోట్ల భారీగా ఇసుక మేటలు వేసింది. మళ్లీ అక్కడ పూర్వ స్థితి రావడానికి ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి! సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్‌కు విశాఖ తీరం అతలాకుతమైంది. ఎగసిపడ్డ అలలు బీచ్‌రోడ్డును సైతం తాకడంతో సహజసిద్ధంగా పరచుకున్న ఇసుక రూపురేఖల్ని మార్చేసింది. ప్రధానంగా ఆర్కే బీచ్, కురుసుర మ్యూజియం ప్రాంతాల్లో భారీగా ఇసుక కోరుకుపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) విభాగం అంచనాల ప్రకారం ఐదు వేల టన్నుల ఇసుక కోతకు గురై మాయమైంది. మరోవైపు రుషికొండ, ఫిషింగ్ హార్బర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. దీంతో అక్కడా సహజ సౌందర్యానికి గండి పడింది. కోతకు గురైన ఇసుకలో కొంత ఆయా చోట్ల మేటలు వేసినట్టు, చాలావరకు సముద్రంలోకి లాక్కుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది. వీరు బీచ్ నుంచి సముద్రంలోకి బోటులో వెళ్లి ఎక్కడెంత ఇసుక పేరుకుపోయిందో, ఎక్కడ నుంచి వెళ్లిందో అధ్యయనం చేస్తారు. భారీగా ఇసుక మాయమవ్వడంతో తిరిగి దానంతట అది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విశాఖ సాగరతీరంలో ఇదివరకటిలా సహజ సుందరమైన ఇసుక తిన్నెలు ఏర్పడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఇసుకను తెచ్చి కోతకు గురైన చోట ఫిల్లింగ్ చేయడమే సరైన మార్గంగా భావిస్తున్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ల సాయంతో ఆ పనిని పూర్తి చేయనున్నట్టు తెలిసింది. బీచ్‌లో తగ్గిన సందడి హుద్‌హుద్ బీభత్సం అనంతరం రూపుమారిన బీచ్‌లో హాయిగా పిల్లాపాపలతో గడపడానికి వీలు లేకుండా పోయింది. దీంతో గతంకంటే సంద ర్శకుల తాకిడి తగ్గింది. విశాఖవాసులు గాని, ఇక్కడకు వచ్చే పర్యాటకులు గాని, సందర్శకులు గాని ఆర్కేబీచ్, కురుసుర మ్యూజియంలు చూడకుండా వెళ్లరు. విశాఖ బ్రాండ్ ఇమేజిని పెంచిన వాటిలో వీటిదే అగ్రస్థానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడకు వెళ్లేందుకు వీరు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇదివరకటిలా ఆర్కే బీచ్, కురుసుర మ్యూజియం ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడేందుకు... ఇసుక ఫిల్లింగ్ను వేగవంతం చేసి, మునుపటి రూపురేఖలు సంతరించుకునేలా చేయాలన్న యోచనలో అధికారులున్నారు. -
నీకో ముద్ద.. నాకో ముద్ద
జిల్లా కలెక్టర్ యువరాజ్ గురువారం జీకేవీధి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. దారకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల చెంతకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. భోజనం చేస్తున్న ఓ చిన్నారి వద్దకు వెళ్లి నాకు కాస్త అన్నం పెడతావా అని అడిగారు. నాలుగో తరగతి చదువుతున్న వంతల లక్ష్మి తొలుత బిడియం పడింది. పదే పదే అడగడంతో కలెక్టర్ చేతిలో ఓ ముద్దను పెట్టి.. మీరు తినండి సార్ అంది. ఇలా మధ్యాహ్నభోజనాన్ని కలెక్టర్ రుచి చూశారు. చిన్నారులకు పెడుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అంతా బాగా చదువుకొని తల్లితండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. - గూడెంకొత్తవీధి గూడెంకొత్తవీధి: హుద్‌హుద్ తుఫాన్ కారణంగా పంటలు, ఇళ్లు, కాఫీ, సిల్వర్ ఓక్ చెట్లు నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందిస్తామని జిల్లా కలెక్టర్ యువరాజ్ స్పష్టంచేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా పేరొందిన జీకేవీధి మండలంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులతో పాటు రుణమాఫీ వర్తించే రైతుల సంబంధించి ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సర్వే చేశామని, వీరందరికి బ్యాంకులో నేరుగా పరిహారం సొమ్ము వేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిం దన్నారు. ఏజెన్సీలో కాఫీ తోటలకు 13 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు నివేదికలు అందాయని, మరో 2 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారని ఆయన తెలిపారు. ఏజెన్సీలో ఆధార్ నమోదు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. ఏజెన్సీలో రహదారులు అధ్వానంగా ఉన్నందున పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేయాలన్నారు. జిల్లాలో 85 పీహెచ్‌సీలు ఉండగా ఇప్పటి వరకు 50 పీహెచ్‌సీల్లో మాత్రమే పూర్తిస్థాయి వైద్యులు ఉన్నారని, పది మంది ఇన్చార్జిలు ఉండగా 25 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యం: మన్యంలో గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు పని చేయాలని కలెక్టర్ అన్నారు. మండలంలో ముందుగా దారకొండ పీహెచ్‌సీకి వెళ్లి అక్కడ రికార్డులను పరిశీలించారు. దారకొండలో అంగన్వాడీ భవనాన్ని తనిఖీ చేసి అక్కడ బాలింతలకు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. సప్పర్ల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రెజరీ కుంభకోణంలో దోషులపై క్రిమినల్ కేసులు చింతపల్లి: ట్రెజరీ కుంభకోణంలో దోషులుగా తేలే వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. గురువారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్ ట్రెజరీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఆడిటర్లను నియమించామన్నారు. జిల్లాలో తుఫాన్ పరిహారం రూ.100 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించామని ఆయన తెలిపారు. తుఫాను బాధితులకు రూ.165 కోట్లతో నిత్యవసర సరకులతోపాటు వివిధ రకాల వస్తువులు అందించామన్నారు. లంబసింగిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విశాఖ జిల్లాకు టూరిజం అధికారిని నియమించినట్లైతే ఈ ప్రాంతాలు వేగంగా పర్యాటక శాఖలో అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వానికి నివేదించామన్నారు. -
కోతలే మిగిలాయ్!
నరసన్నపేట రూరల్:ఖరీఫ్ రైతు నష్టాల సుడిలో చిక్కుకున్నాడు. సీజన్ ప్రారంభం నుంచీ అటుపోట్లు ఎదుర్కొంటున్న వరి రైతులు చివరి దశలో హుద్‌హుద్ తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్నారు. అది చాలదన్నట్లు పంట కోత దశలో సుడిదోమ కాటుకు గురై విలవిల్లాడుతున్నారు. ఒకవైపు రుణమాఫీ ఆశలు నీరుగారుతున్నాయి. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. తుపాను నష్టపరిహారం ఎప్పుడొస్తుందో తెలీదు. దోమపోటు నష్టాలను ఇప్పటికీ అంచనా వేయలేదు. ఆ హామీ ఇచ్చిన మంత్రులు తర్వాత ఆ విషయాన్నే విస్మరించారు. ఈలోగా అల్పపీడనం రూపంలో మరో ప్రమాదం ఎదురుకావడంతో ఉన్న పంటనైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో పంట కోతలు ప్రారంభించారు. అవి చివరి దశకు వచ్చినా దోమపోటు నష్టాల అంచనాకు ఆదేశాలే రాలేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతలు పూర్తి అయ్యాక నష్టాలను ఎలా లెక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. మూడోవంతు పంటకు నష్టం జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి పండించగా ఇందులో మూడో వంతు పంటను దోమ తినేసిందని రైతుల అంచనా ప్రకారం తెలుస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు నష్టాలను స్వయంగా పరిశీలించారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులు కూడా స్వయంగా పరిశీలించారు. ఎన్ని మందులు వాడినా దోమ నశించకపోవడంతో నష్టం ఎక్కువగానే ఉందని వ్యవసాయాధికారులు అంచనాకు వచ్చారు. ఇంత జరిగినా మంత్రు హామీలకు అనుగుణంగా తదుపరి చర్యలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో జిల్లాలో దోమపోటు తీవ్రతను వివరిస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. ఇది ప్రభుత్వానికి చేరిందో లేదో తెలియదు గానీ.. అటు నుంచి స్పందన లేదు. నష్టాల నివేదిక ఇవ్వాలని ఇప్పటి వరకూ రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. దీంతో అధికారులు తుపాను నష్టాల నివేదిక తయారీలోనే నిమగ్నమయ్యారు. కాగా మండలాల వారీగా దోమపోటు నష్టం వివరాలు జిల్లా అధికారులు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సేకరించినా.. క్షేత్రస్థాయి గణాంకాలు సేకరిచాలని గానీ, నష్టపోయిన రైతులను గుర్తించాలని గానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో నష్టపరిహారం విషయంలో వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆదేశాలు రాలేదు: జేడీ సుడి దోమ వల్ల జిల్లాలో రైతులకు నష్టం అధికంగా ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ బి.వి.ఎస్. హరి చెప్పారు. పరిస్థితి తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే నష్టాల పరిశీలన, అంచనాకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ఆయన వివరించారు. ఇంకెప్పుడు గుర్తిస్తారు దోమ నష్టాలకు గురైన రైతులను ఇంకెప్పుడు గుర్తిస్తారు. వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో కోతలు ముగుస్తాయి. అవి పూర్తి అయితే నష్టం అంచనా సాధ్యం కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే అధికారులను రంగంలోకి దించాలి. -గురువల్లి గోవిందరావు, దేవాది కోతల తర్వాత అంచనా ఎలా? ఈపాటికే దోమ పోటు నష్టాలను గుర్తిస్తే బాగుండేది. ఇంతవరకూ ప్రభుత్వం నాన్చి ఇప్పుడు పరిహారం ఎవరికి ఇస్తారు, పేర్లు ఎలా గుర్తిస్తారు. చివరి నిమషంలో టీడీపీ వారి పేర్లు రాసుకుంటారా?.. ఇప్పటికూనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. -యాళ్ల కృష్ణం నాయుడు. మాకివలస -
మేమేం చేశాం.. పాపం
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానంలో అన్యా యం జరిగింది. అవార్డులు కాదు కదా కనీసం సోమవారం రాత్రి వుడా పార్కు ఆవరణలో జరిగిన అభినందన సభకు ఆహ్వానం కూడా రాలేదు. దీనిపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు దాని అనుబంధ శాఖలైన మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమలు తదితర శాఖలను పూర్తిగా విస్మరించారంటూ ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తుపాను సమయంలో కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజల కోసం రేయింబవళ్లు శ్రమించామని, అయినా తమను గుర్తించకపోవడం బాధిస్తోందని వారు కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ ఎన్జీవో సంఘ నేతలు చెప్పిన సంఘాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని, తాము కూడా గెజిటెడ్ ఉద్యోగులమేనని వ్యవసాయ శాఖాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కూడా అవార్డుల ప్రదానంలో ఇదే రీతిలో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ వారు వాపోయారు. ఈసారి అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి తగురీతిలో గౌరవిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. -
తుపానులో సేవలకు అవార్డులు
హుద్‌హుద్ తుపాను సమయంలో ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి విశాఖలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన 196 మందిని ఎంపిక చేయగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏఎస్‌ఖాన్, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఏజేసీ మహ్మద్ హసన్ షరీఫ్, డీఆర్డీఏ పీడీ తనూజా రాణి, డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి, హౌసింగ్ పీడీ నర్సింగరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, ఆర్వీఎం పీవో గణపతిరావు తదితరులకు సీఎం స్వయంగా అందజేశారు. -శ్రీకాకుళం పాతబస్టాండ్ -
పరిశ్రమలకు తాళం.. బతుకు ఆగం
జిన్నారం: కరెంటు కోతలు...అంచనా మేరకు కాని ఉత్పత్తి...అర్డర్లూ అంతంతమాత్రం..దీంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రోజుకో ఫ్యాక్టరీ మూతపడుతుంటే మెతుకుసీమకే తలమానికంగా ఉన్న పారిశ్రామిక వాడలన్నీ వెలవెలబోతున్నాయి. ఏడాది క్రితం లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా ఇపుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు గేట్లు మూసేస్తుండడంతో కార్మికులు వీధిన పడుతున్నారు. బహుళ సంస్థలకు చెందిన పరిశ్రమలు నడుస్తున్నా, చిన్న పరిశ్రమలు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 50 వేల మంది భవిష్యత్ అగమ్యగోచరం జిన్నారం మండలంలోని బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం గ్రామాల్లో సుమారు 200పైగా వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్రం విడిపోవడం...కరెంటు కోతల ప్రభావం పరిశ్రమలపై భారీ చూపుతోంది. కరెంటు కోతల నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం...నిర్ణీత సమయానికి డెలివరీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఇపుడు రద్దయ్యాయి. దీంతో చిన్నా, చితక కంపెనీలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తాత్కాలికంగా గేట్లు మూసేశాయి. మరికొన్ని నడుస్తున్నా కార్మికులకు పూర్తిస్థాయిలో పని దొరకడం లేదు. ఒక్క జిన్నారం మండలంలో సుమారు 50 వరకు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 30 వరకు పరిశ్రమలు తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపివేశాయంటే పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డునపడ్డ జీవితాలు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వాటిల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమలు మూతపడడంతో జిన్నారం మండలంలోనే సుమారు 15 వేల మంది కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కార్మికులకు ప్రస్తుతం పనులు లేకపోవటంతో ఉపాధి కో సం రోడ్ల వెంట తిరుగుతున్నారు. నడుస్తున్న కొన్ని పరిశ్రమలు కూడా స్థానికులకు ఉపాధిని కల్పించటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బడుగు జీవులు అల్లాడిపోతున్నారు. స్టీల్ పరిశ్రమలకూ గడ్డుకాలం జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 30 వరకు స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నడిపేందుకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం. ప్రస్తుతం తీవ్రమైన కరెంటు సమస్య వల్ల స్టీల్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు మూతకు గల కారణాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ రావటంతో ఇక్కడి ఉత్పత్తులను అక్కడికి సరఫరా చేయలేకపోవటం. రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎగుమతులు, దిగుమతుల్లో అదనపు పన్నుల భారం. పెద్ద పరిశ్రమలు చిన్న పరిశ్రమలకు తగిన ఆర్డర్లు ఇవ్వక పోవటం. కష్టపడి పరిశ్రమను నడిపినా లాభాలు లేకపోవటం. -
పరువు తీసేశారు : చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘పోస్టులు అమ్ముకుని... ఆ విషయాన్ని బయటపెట్టుకుని ప్రభుత్వం పరువు తీసేశారు. హుద్‌హుద్ తుపానుతో ఏదో మంచిపేరు వస్తుందని నేను అనుకుంటే... మీరు అది కాస్తా ఆర్డీవో పోస్టులు అమ్ముకుని దెబ్బతీశారు. పోస్టులు అమ్ముకున్నారని ఎమ్మెల్యేలే చెబితే ఇక ఏం చేయగలం. అలా ఎవరైనా బయటపెట్టుకుంటారా!... ఇక ప్రజల్లోకి ఎలా వెళ్తాం!’ అని సీఎం చంద్రబాబు తనను కలిసిన మంత్రి గంటా వర్గీయులైన ఎంపీ,ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. ఆర్డీవోల బదిలీల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్నల వివాదంతో పరువు బజారున పడటంతో సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదే సమయంలో పోస్టులు అమ్ముకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి అయ్యన్న ప్రతిపాదనకే సీఎం చంద్రబాబు మొగుగచూపినట్లు తెలుస్తోంది. సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శనివారం ఈ వ్యవహారంపై ఆరా తీశారు. మరోవైపు గంటా వర్గీయులైన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయన్ని శనివారం రాత్రి కలిసి తమ వాదన వినిపించారు. ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాం ఆర్డీవో బదిలీల వ్యవహారంలో తమ మాటా చెల్లుబాటుకాకపోవడంతో మంత్రి గంటా వర్గం నేరుగా సీఎం చంద్రబాబుతోనే తేల్చుకోవాలని భావించింది. అందుకే మంత్రి గంటా వర్గీయులైన ఎంపీ అవంతీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణమూర్తి, పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, కెఎస్ఎన్ఎస్రాజు, అనితలు శనివారం రాత్రి చంద్రబాబును కలిశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ పోస్టులను అమ్ముకున్నారని ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి వైఖరి వల్ల పార్టీ పరువు బజారున పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్తామని ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వీరి వాదనను ఆసాంతం విన్న చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు. పోస్టులు అమ్ముకున్న విషయాన్ని మనమే బయటపెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ‘హుద్‌హుద్ తుపానుతో ఏదో చేసి మంచిపేరు తెచ్చుకుందామని నేను ప్రయత్నిస్తుంటే మీరు అంతా పాడు చేశారు. ప్రభుత్వం పరువు తీసేసి బజారున పడేశారు’అని సీఎం తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇక జిల్లాలో ప్రజలకు మొహం ఎలా చూపించాలని కూడా ఆగ్రహంగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. గంటా వర్గం మాత్రం అయ్యన్య వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ తమ వాదనను వినిపించి వచ్చింది. అయ్యన్నదే పైచేయి...గంటాకు ఝలక్! ఆర్డీవోల బదిలీల వ్యవహారంలో మంత్రి అయ్యన్నవైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఆయన శనివారం రెవెన్యూ మంత్రి కేవీ కష్ణమూర్తితో చర్చించడమే కాకుండా తన ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రను వివరణ కోరారు. కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రి అయ్యన్నను సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర అన్ని విషయాలను సీఎంకు వివరించారు. చంద్రబాబు చివరికి అయ్యన్న వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. ఆయన సూచించినట్లుగా ఆర్డీవోగా వై.రామచంద్రారెడ్డి బదిలీని ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పారు. విశాఖపట్నం ప్రసుత ఆర్డీవో వెంకట మురళిని రెండ్రోజుల్లో విధుల నుంచి రిలీవ్ చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామాలతో గంటా వర్గానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా వ్యవహారాల్లో గంటా మాటకంటే అయ్యన్నమాటకే ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని కూడా చెబుతున్నాయి. -
బాబుతో నీతూ, జుహీచావ్లా భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో ప్రముఖ మహిళ పారిశ్రామికవేత్తలు నీతూ అంబానీ, పింకీ రెడ్డిలతోపాటు బాలీవుడ్ నటి జూహీచావ్లా శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.11,11,11,111 (11 కోట్లు 11 లక్షల 11 వేల 11 వందల 111 రూపాయిలు) చెక్కును అందజేశారు. ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాల పునర్ నిర్మాణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుదూద్ తుపాన్ వల్ల జరిగిన నష్టంతోపాటు జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. -
వైఎస్ ఆశయ సాధనకు ముందడుగు
దేవరాపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని తామరబ్బ, చింతలపూడి, వాలాబు గిరిజన పంచాయతీల్లో తుఫాన్ బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూప్ , వైఎస్సార్ సీపీ నాయకులు సమకూర్చిన బియ్యం, పప్పులు, దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రాంత బాధితులకు పూర్తి సహాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇందులో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సహాయం అందించడం అభినందనీయమన్నారు. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ గిరిజన పంచాయతీల్లో సుమారు 1200 కుటుం బాలకు 10 కేజీల బియ్యం, 2 కేజీ ల పప్పు, చీరలను ఎమ్మెల్యే బూడి పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌లు కోరాపు ఈశ్వరరావు, మూలగుమ్మి అప్పలకొండ, వరలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బండి స త్యం,మూలం నాయుడు, దొమ్మం గి సన్యాసమ్మ, కడారి రాజు, జి.నాగేశ్వరరావు, రామకృష్ణ, దేవరాపల్లి పీ ఏసీఎస్ అధ్యక్షుడు దాసరి గోపి తదితరులు పాల్గొన్నారు. -
హుద్‌హుద్, తుపానుకు నెల
-
చేదెక్కుతున్న సాగు
అనూహ్య ఉత్పాతాలు అన్నదాత ఉసురు తీస్తున్నాయి. కష్టనష్టాల సుడిగుండాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అందివచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన అన్నదాతకు చేతికి చిల్లిగవ్వరాని దుస్థితి. జిల్లాలో ఏ చెరకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇలా అయితే కష్టమే నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. రెండు ఎకరాల్లో చెరకు పంట చేపట్టాను. హుద్‌హుద్ తుఫాన్‌కు ధ్వంసమైంది. మూడేళ్లుగా తుఫాన్లు, భారీ వర్షాలకు చెరకు పంట నష్టపోతున్నాం. పెట్టుబడులు సైతం తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత నెల 12న సంభవించిన హుద్‌హుద్ కారణంగా పంటంతా కుళ్లిపోతోంది. ఇలా అయితే చెరకు సాగు కష్టమే. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపులో నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తోంది. - యల్లపు వెంకట్, చెరకు రైతు సాక్షి, విశాఖపట్నం: చెరకు సాగు కలిసిరావడంలేదు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నాగిట్టుబాటు కావడం లేదు. దానికితోడు ఉత్పాతాలు నట్టేట ముంచుతున్నాయి. జిల్లాలోని నాలుగు చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించడం లేదు. తుఫాన్‌కు తీవ్రంగా నష్టపోయిన యాజమాన్యాలు ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు రూ.2260లు కనీసపు ధరను ఇచ్చే పరిస్థితిలో లేవు. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది 37,435 హెక్టార్లలో పంటను చేపట్టారు. ఇందులో 50శాతం పంట తుఫాన్‌కు ధ్వంసమైంది. పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇప్పటికే ఏటేటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎకరం భూమి ఐదు దుక్కులకు రూ.5వేలు, విత్తనం,నాట్లుకు రూ.10వేలు, నాలుగుసార్లు జడచుట్టు, బోదెలకు రూ.4వేలు,కలుపుతీత, ఎరువులు ఇలా మొత్తంగా రూ.25వేలు ఖర్చవుతోంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోంది. దానిని నరకడం,ఫ్యాక్టరీకి తరలించడానికి మరో రూ.ఆరు ఏడు వేలు ఖర్చు. ఇదంతా దిగుబడి బాగా వస్తేనే. హుద్‌హుద్‌లాంటి వాటికి గురయితే అంతే సంగతి. మిల్లులు మద్దతు ధర బాగా తగ్గించేశాయి. పర్యవసానంగా రైతుకు ఎకరాకు 30 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే తెగుళ్లు, మదుపుల భారంతో విలవిల్లాడుతున్న చెరకు రైతును తుఫాన్ మరింతగా ముంచేసింది. భారీ గాలులు, వర్షం ధాటికి పంట పూర్తిగా నేలమట్టమై కనీసం విత్తనం ఖర్చుకూడా రాని దయనీయ పరిస్థితి. దిగుబడి బాగా తగ్గి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎకరాకు కనీసం రూ.3వేలు రావని వాపోతున్నారు. ఇక కౌలుకు తీసుకుని పంట చేపట్టిన రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చెరకు సాగు చేపట్టలేం నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. ఎకరా పొలంలో సాగుచేస్తున్న చెరకుతోట ఎండిపోతోంది. రెండేళ్లక్రితం నీలం, గత ఏడాది భారీ వర్షాలు, ఈ ఏడాది హుద్‌హుద్ తుఫాన్ మా పాలిట శాపమవుతున్నాయి. ఏటా నష్టపోతున్నాం. విపత్తులప్పుడు పాలకులు, అధికారుల ప్రకటనలు చూస్తే మరుసటి రోజే నష్టపరిహారం వస్తుందన్న ఆశ కలుగుతోంది. కాని అది కార్యరూపం దాల్చేసరికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో కోలుకోలేకపోతున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలి. - వై.పరమేశ్వరరావు, చెరకు రైతు -
అమాత్యుని జాడేదీ!
నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే... అంతేకాదు ఆయన రాష్ట్ర మంత్రి కూడా. అయినా ఏం ప్రయోజనం!?... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది భీమిలి నియోజకవర్గ ప్రజల పరిస్థితి. హుద్‌హుద్ పెను తుపాను నియోజకవర్గంపై విరుచుకుపడి నేటికి సరిగ్గా నెలరోజులు. కాని మంత్రిగారేమో ఇప్పటి వరకూ బాధితుల చెంతకే వెళ్ల లేదు. నమ్మలేకుండా ఉన్నారా!... అయితే చదవండి... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్టోబరు 12న హుద్‌హుద్ తుపాను సాగరతీరంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, తగరపువలస మండలాలతోపాటు జీవీఎంసీ పరిధిలోని మధురవాడలో జనజీవనం అతలాకుతలమైంది. భీమిలిలోని తోటవీధి, మంగమారితోట తదితర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు ముంచెత్తింది. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బోట్లు కొట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు లేవు. వండుకునేందుకు పాత్రలు లేవు. తినేందుకు తిండిలేదు. దాదాపు 15 రోజులపాటు విద్యుత్తు సరఫరా లేక ప్రజలు అంధకారంలో అల్లల్లాడిపోయారు. పెనుతుపాను ఇంతటి విధ్యంసాన్ని సృష్టిస్తే ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు నుంచి బాధితులు ఎంతో సహాయం ఆశించారు. ఆయన బాధ్యతాయుతంగా వెంటనే రంగంలోకి దిగుతారని భావించారు. కాని వాస్తవానికి గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకూ ఒక్కసారిగా కూడా నియోజకవర్గంలోని బాధిత ప్రాంతాల్లో పర్యటించనే లేదు. బాధితులను పరామర్శించ లేదు. కూలిన ఇళ్లు చూడలేదు. మత్స్యకారులు, కూలీలు, పేదల అవస్థలు పట్టించుకోలేదు. కేవలం మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టారు. ఇతర ప్రాంతాలకు చెందిన సహచర మంత్రులు, ఒకట్రెండు సంఘాలు వచ్చినప్పుడు ముక్తసరిగా పది నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. తుపాను నుంచి నేటివరకు... అక్టోబరు 12న హుద్‌హుద్ తుపాను విశాఖపట్నం సమీపంలో తీరందాటి పెను విధ్వంసం సృష్టించింది. అప్పటి నుంచి గంటా భీమిలి నియోజకవర్గంలో పర్యటిన వివరాలిలా ఉన్నాయి... అక్టోబరు 17: హుద్‌హుద్ తుపాను అక్టోబరు 12న విధ్వంసం సృష్టిస్తే మంత్రి గంటా అక్టోబరు 17న భీమిలి వచ్చారు. అక్టోబరు 12 తరువాత అనారోగ్య కారణంతో ఆయన మూడురోజులు విశ్రాంతి తీసుకున్నారు. అక్టోబరు 17నే ఆయన భీమిలిలోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా విశాఖపట్నం బయలుదేరారు. దాంతో స్థానికులు కొందరు ఆయన్ను బాధిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాను రాలేనని మంత్రి గంటా చెప్పారు. కాని ఒక్కసారి వచ్చి కూలిన ఇళ్లు, రోడ్డునపడ్డ బతులకు చూడాలని వారు ప్రాథేయపడ్డారు. వారి ఒత్తిడి మీదే మంత్రి గంటా భీమిలిలోని తోటవీధి ప్రాంతానికి వచ్చారు. ఆప్రాంతం మొదట్లోనే కారు దిగి చూశారు. లోపలికి వచ్చి కూలిన ఇళ్లను చూడాలని బాధితులు కోరారు. కాని మంత్రి కేవలం పది అడుగులు వేసి అక్కడ నిలబడి రెండు నిమిషాలు పరికించి చూసి వెళ్లిపోయారు. అంతేగాని తీవ్రంగా దెబ్బతిన్న తోటవీధి ప్రాంతంలో ఆయన తిరగలేదు. ప్రజలను పలకరించనే లేదు. కూలిన ఇళ్లనుగాని ఇతర నష్టాన్నిగాని పరిశీలించకుండానే వెనుదిరిగారు. అక్టోబరు 18: ఎంపీ హరిబాబు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావులను తీసుకువచ్చి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి గంటా ఆ సమావేశానికి హాజరై 15 నిమిషాలు పాల్గొని వెళ్లిపోయారు. బాధితుల చెంతకు మాత్రం వెళ్ల లేదు. అక్టోబరు 19: గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రోమన్ కేథలిక్ చర్చి ప్రతినిధులు భీమిలిలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ కళాశాలలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆయనతోపాటు మంత్రి గంటా కూడా బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయారు. తుపాను బాధిత ప్రాంతాలకు వెళ్లలేదు. అక్టోబరు 20: నారా లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ భీమిలిలోని మంత్రి గంటా క్యాంప్ కార్యాలయంలో బాధితులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. దీనికి మంత్రి గంటా హాజరై ఫొటోగ్రాఫర్లు ఫొటో తీయగానే వెళ్లిపోయారు. అక్టోబరు 21: తుపాను రోజు దుర్మరణం పాలైన యర్రంశెట్టి కొండమ్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారంగా రూ. 5లక్షల చెక్‌ను అందించేందుకు కృష్ణా కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయారు. -
పింఛన్ల పంపిణీలో ఎడతెగని జాప్యం...
మచిలీపట్నం : జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రహసనంగా ముగిసింది. అక్టోబరు రెండో తేదీ నుంచి జన్మభూమి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో పింఛన్లు ఐదు రెట్లు పెంపుదల చేసి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం పుణ్యమా అంటూ గత ఐదారు సంవత్సరాలుగా ఏ నెలలోనూ బ్రేక్ పడని పింఛన్ల పంపిణీ ఒక నెల పాటు నిలిచిపోయింది. గత నెల రెండో తేదీన ప్రారంభమైన జన్మభూమి 11వ తేదీ వరకు జరిగి వాయిదా పడింది. హుదూద్ తుపాను తదితర కారణాలు చూపి అక్టోబరు 31 వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. పింఛన్ల సొమ్ము అందుబాటులో లేకపోవడం వల్లే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారనే వాదన అప్పట్లో వినబడింది. అధికారులు పాలకుల అవతారమెత్తి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తటం ఈ జన్మభూమి విశేషం. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినా మౌలిక అంశంపై దృష్టిపెట్టకుండా, అభివృద్ధి పనుల నిధుల విడుదలపై ఎలాంటి హామీ ఇవ్వకుండా అధికారులు, పాలకులు దాటవేత ధోరణితో ఈ కార్యక్రమాన్ని నడపటంలో తమదైన శైలిలో వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఏదైనా సమస్యను పరిష్కరించాలని కోరితే మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకారం అందించాలని పాలకులు కొత్త రాగం ఆలపించటం గమనార్హం. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, పింఛన్ల పంపిణీ, పశు వైద్య శిబిరాలు, సీమంతాలు, అన్నప్రాశనలు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు కానివారు సైతం వేదికలెక్కి ప్రభుత్వ పనితీరుపై ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు. కొంతమంది అధికారులు ఓ అడుగు ముందుకేసి జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులను నేరుగా ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, వాటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పటం గమనించదగ్గ అంశం. పింఛన్ల పంపిణీలో ఎడతెగని జాప్యం... జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులను అధికారులు ఏడిపించినంత పనిచేశారు. జిల్లాలో 2.77 లక్షల మంది పింఛను పొందేందుకు అర్హులని జన్మభూమి కార్యక్రమంలో నిర్ధారించిన అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు 2.25 లక్షల మందికి మాత్రమే సొమ్ము అందజేశారు. పింఛన్ల పంపిణీ కూడా ప్రహసనంగానే సాగిందని, ఎన్నాళ్లుగానో పింఛన్లు ఇస్తున్నా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇస్తున్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే విమర్శలు వినిపించాయి. పింఛను మంజూరు పత్రాలు అందజేసే సమయంలో ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తదితరుల ఫొటోలను ముద్రించిన ప్రత్యేక కవర్లను ఇవ్వటం గమనార్హం. పింఛన్ల సర్వేలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ప్రముఖ పాత్ర పోషించగా.. అనేకమంది అర్హులకు కూడా జాబితాల్లో చోటు దక్కకపోవడం గమనార్హం. సెంటు భూమి కూడా లేకపోయినా.. ఐదెకరాల పొలం ఉందంటూ కొంతమందికి, వయసు తేడా ఉందంటూ మరికొందరికి వివిధ రకాల కారణాలతో పింఛన్లు నిలిపివేశారు. గ్రామానికి పది మంది చొప్పున, పట్టణాల్లో వార్డుకు మరో 10, 12 మంది చొప్పున అర్హులైన వారి పింఛన్లు నిలిపివేయడం గమనార్హం. పింఛన్లు నిలిచిపోయిన వారంతా అధికారులు, కౌన్సిలర్లు, పంచాయతీ సర్పంచుల చుట్టూ నేటికీ తిరుగుతూనే ఉన్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటూనే ఉన్నారు. 4,71,871 దరఖాస్తులు ఈ నెల 10 వరకు జన్మభూమిలో వివిధ సమస్యలపై 4,71,871 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పింఛను కోసం వచ్చినవి 47,220. దరఖాస్తులు తీసుకునే సమయంలోనూ అధికారులు తమదైన శైలిలో వ్యవహరించారు. కార్యక్రమానికి మంత్రి లేదా ఎమ్మెల్యే ఇతర అధికారులు ఎవరైనా వస్తే వారి ప్రసంగాలు పూర్తయ్యేవరకు అర్జీలు స్వీకరించకుండా నిలిపివేశారు. ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన అధికారులు మంత్రులు వచ్చేవరకు కార్యక్రమాన్ని ప్రారంభించకుండా సభకు వచ్చిన ప్రజలను అలానే కూర్చోబెట్టడం అనేక ప్రాంతాల్లో జరిగింది. జన్మభూమి కార్యక్రమంలో గర్భిణులకు సీమంతం పేరుతో వారికి ఇచ్చే పూలు, గాజులు, చీరతో పాటు చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన పత్రాలు ఇవ్వడం గమనార్హం. సీమంతం కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఏదైనా గ్రామంలో లేదా వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగితే అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేసి ఈ తంతు ముగించారు. పొలం పిలుస్తోంది వల్ల ప్రయోజనం ఉందా... జన్మభూమి కార్యక్రమంలో ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయాధికారులు రైతులతో కలసి పొలం వద్దకు వెళ్లి, పైరును పరిశీలించి అన్నదాతలకు సూచనలు, సలహాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారులు మొక్కుబడిగా నిర్వహించడమే తప్ప రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న దాఖలాలే లేవు. బడి పిలుస్తోంది కార్యక్రమం కూడా ఇలాగే కొనసాగింది. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలంతా తప్పనిసరిగా బడిలోనే ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఫలితం శూన్యంగానే మిగిలింది. ఓ పక్క జన్మభూమి జరుగుతుండగానే చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, బాలకార్మికులు వారిలో పనుల్లో పాల్గొనటం గమనార్హం. సంచార జాతుల వారిని గుర్తించి వారు ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంలోని పాఠశాలలోనే వారి పిల్లలను చేర్పించాల్సి ఉన్నా అటువంటి ప్రయత్నమే జరగకపోవటం గమనార్హం. జన్మభూమి సభల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఏఎన్ఎంలు, వైద్యుల సమయాన్ని వృథా చేయడమే తప్ప ప్రజలకు పనికొచ్చే మందుబిళ్లలు మాత్రం ఇవ్వలేదనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. -
కేకే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్
అరుకు వెళ్లేందుకు ఇక రోజూ రైలు పర్యాటకుల్లో ఉత్సాహం విశాఖపట్నం సిటీ: కొత్తవలస-కిరండూల్(కేకే) రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హుద్‌హుద్ ధాటికి ఈ మార్గంలోని బొడ్డవర-గోరాపూర్ స్టేషన్ల మధ్య 45 ప్రాంతాల్లో ట్రాక్‌పై కొండచరియలు, భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. బ్రిడ్జిలు పడిపోయాయి. టైడా-చిమిడిపల్లి మధ్య ఉన్న 24 మీటర్ల పొడవైన బ్రిడ్జి దిమ్మ(పిల్లర్లు కాంక్రీట్‌తో నిర్మించిన దిమ్మ) కొట్టుకుపోయింది. దీంతో సుమారు నెల రోజులపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, ఆర్డీఎస్వో లక్నో అధికారులు, తూర్పుకోస్తా రైల్వే చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ విపి శ్రీవాస్తవ ఈ బ్రిడ్జి నిర్మాణానికి తీవ్రంగా శ్రమించారు. 120 టన్నుల బ్రేక్ డౌన్ క్రేన్ సాయంతో అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చి 24 మీటర్ల బ్రిడ్జి దిమ్మను నిర్మించారు. ఇలా అనుకున్న సమయానికన్నా రెండు రోజుల ముందుగానే తూర్పు కోస్తా అధికారులు రైలును పట్టాలెక్కించారు. ఈ నెల 9వ తేదీరాత్రి 8.30 గంటల ప్రాంతంలో గూడ్సు రైలును నడిపి ట్రాక్ ఫిట్‌ను పరీక్షించారు. ట్రాక్ ఫిట్ కావడంతో విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే 1వీకే ప్యాసింజర్‌ను మంగళవారం నుంచి రోజూ ఉదయం 6.45 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు జగదల్పూర్ వర కే నడుపుతున్నారు. తిరిగి జగదల్పూర్ నుంచి విశాఖకు బుధవారం నుంచీ రోజూ నడుస్తుందని రైల్వే సీనియర్ డివిజనల్‌కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. -
పని చేసేవాళ్ళపై బురద చల్లడమే వాళ్ళ పని!
-
బాధితులకు ఏం పరిహారం ఇస్తారో చెప్పండి?
జన్మభూమిలో అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ నేతలు నక్కపల్లి: హూదూద్ తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు, ఇతర బాధితులకు ప్రభుత్వం తరపున ఏ పరిహారం ఇస్తున్నారో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు వీసం రామకృష్ణ అధికారులను నిలదీశారు. శనివారం నక్కపల్లి మండల కేంద్రంలో జరిగిన జన్మభూమి కార్యక్రమం వాడివేడిగా జరిగింది. ప్రత్యేకాధికారి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు నాయకులు ఏకరువుపెట్టారు. తుఫాన్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఇళ్లు, ఉద్యాన వన తోటలు నష్టపోయిన వారికి ఇంతవరకు ఒక్కపైసా కూడా పరిహారం చెల్లించలేదని వీసం ఆరోపించారు. ఇళ్లకు, తోటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు పక్షపాతం చూపించారన్నారు. 90కి పైగా ఇళ్లు నష్టపోతే కేవలం 20కి మించి నష్టం వాటిల్లలేదని అధికారులు నివేదికలు తయారు చేసారన్నారు. ఇక తోటల విషయంలో ఎకరాకు 20కి మించి చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. గత ఏడాది మండలానికి మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను అన్ని గ్రామాల్లోను పంపిణీ చేసి నక్కపల్లిలో ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్లు రద్దుచేశారంటూ పలువురు బాధితులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి. పింఛన్లను సర్పంచ్ వీ సం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శేషారత్నం, వీసం దేవి తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలువురు గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపిడీవో కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకుడు వీసం నానాజీ, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, దేవవరపు శివ పాల్గొన్నారు. -
‘కాఫీ’ని కొల్లగొట్టిన హుద్‌హుద్
పాడేరు: హుద్‌హుద్ తుఫాన్ కాఫీ పంటను సైతం తీవ్రంగా దెబ్బతీసింది. రెండేళ్లుగా ఏజెన్సీలో కాఫీ దిగుబడులు అధికంగా ఉండటంతో గిరిజన రైతులు మంచి లాభాలను పొందారు. గత ఏడాది కాఫీ గింజల కొనుగోలు సీజన్లో కిలో రూ.120 ధరతో ప్రారంభంకాగా చివరిలో వ్యాపారులంతా పోటాపోటీగా రూ.200 ధరకు కొనుగోలు చేశారు. దీంతో గిరిజనులకు కాసుల వర్షం కురిసినట్టైంది. ఏజెన్సీ వ్యాప్తంగా లక్ష 60 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలను సాగు చేస్తుండగా 96 వేల ఎకరాల్లో కాఫీ పంట ప్రతి ఏడాది ఫలసాయాన్నిస్తుంది. తద్వారా ప్రతి ఏడాది 6 వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఏజెన్సీలోని కాఫీ తోటల్లో కాపు విరగ్గాసింది. సుమారు 7 వేల టన్నుల వరకు దిగుబడి ఉంటుందని గిరిజన రైతులు ఆశపడ్డారు. ఈ తరుణంలో తుఫాన్ భారీగా దెబ్బతీసింది. దిగుబడులు సంగతి పక్కన పెడితే పూర్తిగా కాఫీ తోటల్లోని నిడనిచ్చే వృక్షాలు నేలకొరిగి కాఫీ మొక్కలన్నీ ధ్వంసమయ్యాయి. నీడ కరువవ్వడంతో పండ్ల దశలో ఉన్న కాఫీ గింజలు కూడా నేలరాలాయి. కొన్ని చోట్ల వాడిపోవడంతో కాఫీ పంటకు నష్టం వాటిల్లింది. వచ్చే నెలాఖరు నుంచి సీజన్ డిసెంబరు నెలాఖరు నుంచి కాఫీ గింజల కొనుగోలు సీజన్ ప్రారంభం కానుంది. కొంత మంది వ్యాపారులు ఇప్పటికే బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు అధికంగా ఉన్నాయని, ఏజెన్సీ కాఫీ గింజల ధరలు పతనం అవుతాయని ప్రచారాన్ని చేపడుతున్నారు. కిలో రూ.100కు కాఫీ గింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులను దోచుకునేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏజెన్సీలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఐటీడీఏ మాత్రం గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది. ఈ ఏడాదైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని రైతులంతా కోరుతున్నారు. -
హుద్‌హుద్ @ కాసుల వర్షం
హుద్‌హుద్ తుపాను ఎందర్నో నిరాశ్రయులను చేసింది. ఆకలితో అలమటించేలా చేసింది. కానీ అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించింది. పేదలకు చేరాల్సిన నిత్యావసరాలు పక్కదారి పట్టించి వీరు సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు బాధితులకిచ్చే పరిహారంపై కన్నేశారు. దాన్ని కూడా కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరికి పలువురు ఎమ్మెల్యేల అండదండలు ఉన్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: తుపాను బాధితులకు తక్షణ సహాయం కోసం బియ్యంతో సహా ఎనిమిది రకాల నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్డులున్న వారికి ...లేని వారికి కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలుంటే కార్డులతో ప్రమేయం లేకుండా పంపిణీ చేశారు. గత నెల 29వ తేదీ వరకు నగర పరిధిలో పంపిణీ చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 5వ తేదీ వరకు పంపిణీ చేశారు. తేలిన లెక్కలను బట్టి చూస్తే ఏ మేరకు పక్కదారి పట్టాయో అర్థమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 11,08,521 రేషన్‌కార్డులుండగా, 11.74 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో విశాఖసిటీ పరిధిలో 3,76,939 కార్డులుంటే, రూరల్ జిల్లా పరిధిలో 7,36,517 కార్డులున్నాయి. జిల్లాలో 11.74 లక్షల కుటుంబాలుంటే తుపాను నేపథ్యంలో ఏకంగా 14.83 లక్షల కుటుంబాలకు బియ్యంతో సహా తొమ్మిది నిత్యావసరాల పంపిణీ జరిగింది. ఒక్క విశాఖ మహానగర పరిధిలోనే 4.54 లక్షల కుటుంబాలుంటే ఏకంగా 5.63,077 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇక రూర ల్ పరిధిలో 7.20 లక్షల కుటుంబాలుంటే 9.20 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు..జిల్లా కలెక్టర్‌తో సహా సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ప్రతి ఒక్క కుటుంబం తీసుకున్నట్టే లెక్క. కార్డుల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. కుటుంబాల సంఖ్య కంటే సాయం పంపిణీ చేసిన కుటుంబాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. కార్డులతో పోల్చుకుంటే 3.75 లక్షల కుటుంబాలకు అదనంగా ఇస్తే, కుటుంబాలతో పోలిస్తే 3లక్షల కుటుంబాలకు అదనంగా ఇచ్చినట్టే. వీటిలో కార్డుల్లేకుండా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో నగర పరిధిలో 71,720 కుటుం బాలు, రూరల్‌లో 30 వేల కుటుంబాలకు పంపిణీ చేసినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలన్నీ పొంతనలేకుండా ఉన్నాయి. రైతుబజార్ రేట్ల ప్రకారం చూసుకున్నా ఒక్కొక్క కుటుంబానికి పంపిణీ చేసిన సాయం విలువ రూ.800 వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో ఏకంగా రూ.8 కోట్ల విలువైన సరకును పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇక కుటుంబాల సంఖ్య కంటే అదనంగా పంపిణీ చేసిన సరకుల విలువ చూస్తే ఏకంగా పాతిక కోట్ల పైమాటే. ఒక్క బియ్యమే నగర పరిధిలో 14,469 మెట్రిక్ టన్నులు, గ్రామీణ ప్రాంతంలో 15వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టుగా చెబుతున్నారు. ఇంకా అందలేదంటూ క్షేత్రస్థాయిలో బాధితుల నుంచి ఫిర్యాదులొస్తూనే ఉన్నాయి 11.74 లక్షల కుటుంబాలున్న జిల్లాలో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారని చెబుతుండడం చూస్తుంటే ఏ మేరకు పక్కదారి పట్టిందో అర్థమవుతోంది. వీటిలో ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదారువేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరకులన్నీ డీలర్ల సహకారంతో తెలుగు తమ్ముళ్లు దారిమళ్లించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ దాడులేవీ?: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల నిర్వహించిన వరుస తనిఖీల్లో వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వ చేసిన వారిని వదిలేసి..ఆ బియ్యం సరఫరా చేసిన డీలర్లపై కేసులు పెట్టారు. వీరి తనిఖీల్లో దేశం నేతలు, కార్యకర్తల ప్రమేయం ఉన్నట్టుగా బట్టబయలవుతుండడంతో ఆ మచ్చ ఎక్కడ తమ ప్రభుత్వానికి అంటుతుందోననే భయంతో ప్రభుత్వం ఈ దాడులకు పుల్‌స్టాప్ పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెలాఖరులో హడావుడి చేసిన విజిలెన్స్ అధికారులు నాలుగైదురోజులుగా చడీచప్పుడు లేకుండా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా ఉన్న వారు ఈ తుపాను సాయం పుణ్యమాని లక్షలు వెనకేసుకున్నారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సాయం స్వాహాలో కోట్లు గడించిన తెలుగుతమ్ముళ్లు ఇప్పుడు పేదలకు దక్కాల్సిన పరిహారంపై కన్నేశారని విమర్శలున్నాయి. నచ్చిన వారికి ఒకలా..నచ్చని వారికి మరొకలా పరిహారం అందేలా చక్రంతిప్పుతున్న వీరు పరిహారంలో కూడాలో పర్సంటేజ్‌లు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
కొందరికే లబ్ధి
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే రుణాల రీషెడ్యూల్ ప్రకటన అన్నదాతలకు ఊరటనిస్తుంది. కానీ హుద్‌హుద్ తుఫాన్ నేపథ్యంలో ప్రకటించిన రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందే అవకాశం లేకపోవడంతో జిల్లాలోని మెజార్టీ రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నాలుగులక్షలఎనిమిదివేలమంది రైతులున్నారు. ఖరీఫ్ సీజన్లో 3.79 లక్షల హెక్టార్లలో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. 2.70లక్షల ఎకరాల్లో వరి, 75వేల ఎకరాల్లో చెరకు, అపరాలు పండిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్-రబీ సీజన్లకు కలిపి రైతులకు రూ.950కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే ఇప్పటి వరకు అందించింది రూ.320 కోట్లు మాత్రమే. అది కూడా అతికష్టమ్మీద 50వేల లోపు రైతులకు మాత్రమే ఇవ్వగలిగారు. రుణమాఫీ వల్ల రూ.1040కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని సుమారు 2.50లక్షల మంది రైతులు ఆశించారు. కానీ రు ణమాఫీ వల్ల మిగిలిన రైతులకు ఖరీఫ్ సీజన్లో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల వద్ద అం దినకాడికి రూ.10లు.. రూ.15లవడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేసారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో హుదూద్ విరుచుకుపడింది. జిల్లాలో 882 గ్రామాల పరిధిలో 1,35,184 మంది రైతులు సాగు చేసిన 82,385.681 ఎకరాల్లో పంటలు 50 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో జిల్లాలోని 43 మండలాలను తుఫాన్ ప్రభావిత మండలాలుగా ప్రకటించి ఆయా మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలన్నింటిని రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన హుదూద్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న లక్షా35వేల మంది రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తించాలి. కానీ ఆ పరిస్థితి లేదు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఖరీఫ్సీజన్లో రుణాలు ఇస్తుంటారు. ఈ ఏడాది సాగు ఆలశ్యమవడం..రుణ లక్ష్యాలు చేరుకోకపోవడంతో గడువును తొలుత ఆగస్టు, తర్వాత సెప్టెంబర్ వరకు పొడిగించారు. అయినా 40 శాతం రైతులకు మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయలేకపోయారు. ఈ లెక్కన 50వేలలోపు రైతులు మాత్రమే ఖరీఫ్ రుణాలు పొందగలిగారు. సగం మందికి పైగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. దీంతో పంట పూర్తిగా నష్టపోయిన రైతుల్లో ఎంతతక్కువ లెక్కేసుకున్నా 80వేల మందికి రీషెడ్యూల్ ద్వారా లబ్ది పొందే అవకాశం లేకుండా పోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క పంటల బీమా సౌకర్యాన్ని కోల్పోయి..మరొక పక్క రీషెడ్యూల్ వల్ల కలిగే లబ్దిని కోల్పోవడంతో వీరి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంకొక పక్క పరిహారం ఇప్పుడు ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. రీషెడ్యూల్ వల్ల లబ్దిపొందే అవకాశం లేకపోవడంతో మరింత అప్పుల ఊబిలో కూరకుపోవాల్సి వస్తుందంటూ రైతులు కలవరపడుతున్నారు. రుణమాఫీ విషయంలో సర్కార్ కాలయాపన చేయడం వలనే తమకీ దుస్థితి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసి ఉంటే ఖరీఫ్‌లో తామంతా రుణాలు పొందేవారమని,,ఆమేరకు పంటల బీమా వర్తించడంతో పాటు ఇప్పుడు రీషెడ్యూల్ పరిధిలోకి వచ్చేవారమని అంటు న్నారు. రీషెడ్యూల్ పొందిన రైతులకు గత ఖరీఫ్ సీజన్లో వారు పొందిన రుణాలన్నీ 3 నుంచి ఐదేళ్ల కాలపరిమితిలో రీషెడ్యూల్ అవుతాయి. అంతేకాకుండా రబీ సాగు చేసే రైతులకు జనవరి నుంచి కొత్త రుణాలు మంజూరవుతాయి. రుణాల రీషెడ్యూల్కు సంబంధించి స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించి.. జిల్లా పరిధిలో ఎన్ని కోట్ల మేర ఎంతమంది రైతులు రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందుతారో గుర్తించేందుకు వచ్చే వారంలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ (బ్యాంకర్స్) సమావేశం నిర్వహించి తుది జాబితా ప్రకటించే అవకాశాలు న్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. -
నవ విశాఖ నిర్మాణం.. విధ్వంసానికి సమాధానం
త్రికాలమ్ ఇంతవరకూ తుపానులు విశాఖను ఉపేక్షించాయి కనుక నగర నిర్మాణంలోని పరిమితులు బయటపడలేదు. ఇప్పుడు విశాఖనే ప్రధానంగా హుద్‌హుద్ తుపాను దెబ్బతీసిన ఫలితంగా అభివృద్ధి పేరు మీద ఎటువంటి ధ్వంసరచన సాగిందో అర్థం చేసుకోవడం అవసరం. ప్రతి విపత్తులోనూ ఒక అవకాశం ఉంటుంది. పూర్తిగా దెబ్బతిన్న నగరాన్ని పునర్నిర్మించుకునే సందర్భంలో పౌరులను భాగస్వాములను చేయాలి. తుపాను తాకిడిని తట్టుకొనే విధంగా ప్రతి నిర్మాణం సాగాలి. రాజమండ్రి నుంచి విశాఖకు శుక్రవారంనాడు కారులో ప్రయాణం చేస్తుంటే గుండె బరువెక్కింది. నాది ఆ ప్రాంతం కాకపోయినా హైదరాబాద్ తర్వాత విశాఖ పట్టణమే అద్భుతమైన నగరమని నా అభిప్రాయం. ప్రొఫెసర్ ప్రసన్నకుమార్బోటి వ్యక్తులకు ప్రపంచం లోనే విశాఖను మించిన నగరం లేదు. అన్ని ప్రాంతాల వారినీ, మతాలవారినీ ప్రేమించే, కలుపుకొని వెళ్లే, ప్రశాంతంగా జీవించే విశిష్ట సంస్కృతి విశాఖ పౌరు లది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించవలసిన ఏ కార్యక్రమం చేపట్టినా హైదరాబాద్ అనంతరం నా రెండో అడుగు ఇక్కడే. అనేక సందర్భాలలో విశాఖలో సదస్సులు నిర్వహించి అక్కడి ప్రజలతో మమేకమైనందుకేమో గాయ పడిన నగరాన్ని చూసినప్పుడు గుండె లయతప్పింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని అందరూ ఎదురు చూస్తున్న దశలో నగరాన్ని తుపాను బీభత్సం అతలాకుతలం చేసింది. అదొక యుద్ధానంతర దృశ్యం హుద్‌హుద్ విలయం తర్వాత విశాఖపట్టణం మొదటిసారి వెళ్లిన నాకు రోడ్డుకు ఇరువైపులా వొంగిపోయిన చెట్లూ, ఆకురాలిన చెట్లూ మౌనంగా, దీనంగా రోదిస్తున్నట్టు కనిపించాయి. విశాఖను సమీపించేకొద్దీ విలయం సృష్టించిన విధ్వంసం తీవ్రత ఎంతటిదో ఎవ్వరూ చెప్పకుండానే తెలిసిపోతోంది. నగర ప్రవేశం చేస్తుండగానే కప్పు లేచిపోయిన కొత్త విమానాశ్రయం వెక్కిరించింది. రోడ్డుకు రెండు వైపులా పచ్చగా కనిపించే చెట్లు అదృశ్యమైనాయి. జగదాంబ నుంచి రామ్‌నగర్ వరకూ ఒక్క చెట్టుకూడా లేదు. బ్రిటిష్ హయాంలోనే మొక్కలు నాటడానికి విశేష ప్రాధాన్యం ఇచ్చిన ఇక్కడి ప్రజలు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్క నాటడం అలవాటు చేసుకున్నారు. కానీ అభివృద్ధి పేరుతో ఆత్మహత్యాసదృశమైన, విధ్వంసాత్మకమైన విధానాలు అనుసరించాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. చెట్లు కొట్టివేసినందుకూ, కాలుష్య కారక కర్మాగారాలను విస్తరించినందుకూ, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ పెక్కంతస్తుల భవనాలు కట్టినందుకు భారీ మూల్యమే చెల్లించాం. అందమైన వనంలాంటి విశాఖనగరం కళావిహీనంగా బేలగా కనిపించింది. పచ్చదనం మీద దాడి కోస్తాంధ్ర ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వారికి తుపాను కొత్తకాదు. ప్రతి సంవత్సరం ఒక దెబ్బకొట్టి పోయే తుపాను ఈసారి కూడా భారీ వర్షాలు కురిపించి గ్రామీణ ప్రాంతాలపై ప్రతాపం చూపించి వెళ్లిపోతుందని అనుకున్నాం. కానీ సరాసరి నగరంపైనే అనూహ్యంగా విరుచుకుపడింది. వాతావరణ శాస్త్రజ్ఞుల సమాచారం ప్రకారం ఇటీవలి దశాబ్దాలలో ఇంత వరకూ వచ్చిన 75 తుపానులలో ఇది ఒక్కటే నగరాన్ని నేరుగా తాకి నవనాడులనూ కుంగదీసింది. లక్షలాది చెట్లను పొట్టను పెట్టుకున్నది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఫలితంగా వారంరోజుల ముందే హెచ్చరికలు అంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన కారణంగా ప్రాణనష్టం విపరీతంగా జరగలేదు కానీ ప్రాణవాయువు నష్టం తీవ్రంగా జరిగింది. ముఖ్యమంత్రి ఉన్నంత వరకే సేవ ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలు నడుం బిగించి రంగంలో దిగినప్పుడే సహాయ పునరావాస కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతాయి. వ్యక్తిగతంగా ఎంత కష్టం వచ్చినా ప్రజలు సమష్టిగా ప్రకృతి విలయాన్ని ఎదుర్కొన్నందుకు, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నందుకూ వారిని అభినం దించాలి. వచ్చిన విపత్తు సాధారణమైనది కాదు. నష్ట సామాన్యమైనది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ కార్యాలయంలో మకాం ఉన్న అయిదు రోజులూ విద్యుత్ సరఫరా లేదు. మొబైల్ ఫోన్లు పనిచేయలేదు. ముఖ్యమంత్రి శక్తి వంచన లేకుండా కష్టపడి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయను అటు వెళ్లగానే ఇటు అధికారులు విశ్రాంతి తీసుకున్నారు. తుపాను రాకడ గురించి వారం రోజుల ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులనూ, కొవ్వొత్తులనూ, పాలప్యాకెట్లనూ ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకోవాలన్న సూచన చేసి ఉంటే ప్రజల కష్టాలు కొంచెం తగ్గేవి. పొరుగున ఒడిశా సర్కార్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకు న్నది. ఉన్నతాధికారులకు పనులు పురమాయించి ప్రాథమిక సదుపాయాలను పునరుద్ధరించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు కానీ మంత్రులు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విశాఖ సమీపంలోని నియోజక వర్గం నుంచి ఎన్నికైన మంత్రికి కష్టాలలో ఉన్న ప్రజలను పలకరించే తీరిక కూడా లేకపోయింది. నిత్యావసర వస్తువులు లేకపోయినా, ఇతర వసతులు కరువైనా ప్రతి ఇంట్లో పుష్కలంగా బియ్యం మాత్రం ఉన్నాయి. ఇదీ సమాధానం విధ్వంసానికి సమాధానం నిర్మాణం ఒక్కటే. పునర్నిర్మాణం సమగ్రమైన ప్రణాళిక ప్రకారం జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా మొక్కలు విరివిగా నాటి వాటిని శ్రద్ధగా పెంచాలి. స్మార్ట్ సిటీ నెక్ట్స్, గ్రీన్ సిటీ ఫస్ట్ అంటూ ప్లకార్డులు పట్టుకొని హరిత ఉద్యమకారులు ప్రదర్శన చేస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి విశాఖలో స్థిరపడిన ఒక ఉపాధ్యాయుడు ఆపాదమస్తకం ఆకుపచ్చరంగు దుస్తులు ధరించి పర్యావర ణాన్ని పరిరక్షించాలనీ, మొక్కలు పెంచాలనీ ప్రచారం చేస్తూ కనిపించారు. నవ విశాఖ-చర్చావేదిక పేరుతో సాక్షి మీడియా గ్రూపు విశాఖలో నిర్వహించిన సెమి నార్లో వక్తలు ఇంతవరకూ చేసిన తప్పులు ఎత్తి చూపించి ఇక మీదట జాగ్రత్తగా పునర్నిర్మాణ కార్యక్రమాలు ఎట్లా అమలు జరపాలో చెప్పారు. 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ తట్టుకొని నిలబడే కట్టడాలను పోర్ట్ ట్రస్టు నిర్మించ బోతున్నదని ఆ సంస్థ అధిపతి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లను కూడా భూగర్భంలో డక్ట్ ద్వారా వేయాలనీ, మొబైల్ టవర్స్ కూడా అందు బాటులోకి రావాలనీ ఆయన చెప్పారు. మానవ తప్పిదంతోనే విలయం పట్టణీకరణ దుష్ఫలితాలన్నీ విశాఖపైన ప్రభావం వేశాయి. అభివృద్ధి పేరుతో బీచ్ రోడ్డులో చెట్లను నరికాం. సముద్రతీరంలో అక్రమ కట్టడాలు నిర్మించాం. ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుకుంటూ పోయాం. బీచ్ రోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువైన కొద్దీ తీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది ఉప్పెనలకూ, తుపానులకూ స్వాగతం పలుకుతుంది. చెట్లు నరికే సంస్కృతికి తక్షణం స్వస్తి చెప్పాలి. పర్యావరణ ఉద్యమ నాయకురాలు రాణిశర్మ చెప్పినట్టు హుద్‌హుద్ ప్రభంజనం తట్టుకొని ఏ రకం చెట్లు నిలబడి నిలిచాయో గమనించి ఆ రకం మొక్కలు మాత్రమే నాటాలి. తాటి, ఈత, సరుగుడు, గానుగ చె ట్లు పెంచాలి. దీర్ఘకాలంగా నిలబడే మర్రి, వేప, రావి చెట్లు పెంచడంపైన దృష్టి పెట్టాలి. కాలుష్యం వెదజల్లే కర్మాగారాలను క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. సౌర విద్యుదుత్పాదనకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. నగర జనాభా పెరగకుండా వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సముద్ర తీరంలో నిర్మించిన అన్ని భవనాలకు తెలుపురంగు వేయాలి. ఫోరమ్ ఫర్ బెటర్ విశాఖ ఇవే హితవులు చాలాకాలంగా చెబుతున్నప్పటికీ పురజనులు కానీ ప్రభు త్వాలు కానీ పట్టించుకోలేదు. చెట్లను కరెంట్ స్తంభాల పక్కన పెంచకూడదు. ఇళ్ల ముందు పెంచకూడదు. చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు నరుకుతూ అవి సవ్యంగా పెరిగేట్టు చూడాలి. ఢిల్లీ, చండీగఢ్ నగరాలలో మాదిరి రోడ్లకు రెండు వైపులా రక రకాల చెట్లు పెంచాలి. పౌరులను భాగస్వాములను చేయాలి ఇంతవరకూ తుపానులు విశాఖను ఉపేక్షించాయి కనుక నగర నిర్మాణంలోని పరిమితులు బయటపడలేదు. ఇప్పుడు విశాఖనే ప్రధానంగా హుద్‌హుద్ తుపాను దెబ్బతీసిన ఫలితంగా అభివృద్ధి పేరుమీద ఎటువంటి ధ్వంసరచన సాగిందో అర్థం చేసుకోవడం అవసరం. ప్రతి విపత్తులోనూ ఒక అవకాశం ఉంటుంది. పూర్తిగా దెబ్బతిన్న నగరాన్ని పునర్నిర్మించుకునే సందర్భంలో నగర అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయాలి. తుపాను తాకిడిని తట్టుకొని నిలిచే విధంగా ప్రతి నిర్మాణం సాగాలి. ప్రకృతి విలయం సంభవించినప్పుడు పౌరులు ఎట్లా స్పందిం చాలో తెలియజెప్పేవిధంగా అవగాహన కార్యక్రమాలు విరివిగా సాగాలి. పాఠశా లల్లో, కళాశాలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి, నగరంలో కాలుష్యం పెరగకుండా చూసేందుకు చేపట్టవలసిన పనుల గురించి వివరించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. ఈ విషయంపైన అవగాహన పెంచేందుకు చర్చావేదికలను నిర్వహించాలి. అధికారులకు మార్గదర్శనం చేయ డానికి ఒక బ్లూబుక్ని రూపొందించాలి. భూకంపాలనూ, సునామీలనూ తట్టుకొని నిలబడడమే కాకుండా వాటివల్ల కలిగిన విపరీతమైన నష్టాల నుంచి సత్వరం కోలుకోవడానికి జపాన్ వంటి దేశాలలో ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారో, ఏ రకమైన కట్టడాలు నిర్మించారో, చెట్ల పెంపకానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించారో గమనించాలి. అవే విధానాలను ఇక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నించాలి. మెట్రోరైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కనుక అది పూర్తయిన తర్వాత వాహన కాలుష్యం కొంత మేరకు తగ్గవచ్చు. బీచ్ రోడ్డులో పర్యాటకుల కోసం బ్యాటరీ కార్లు వినియోగించడం, సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్స హించడం అవసరం. పోర్టు ట్రస్టు వంటి ప్రభుత్వరంగ సంస్థలు కూడా కాలుష్యం పెంచుతున్నాయి. కాలుష్య నివారణకు తీసుకోవలసిన చర్యలు ఏమిటో నిర్ణయిం చుకోవాలి. పర్యావరణ రక్షణకోసం చేసుకున్న చట్టాలను అన్ని దశల్లోనూ ఉల్లంఘిం చాం. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా పాత ధోరణిలోనే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే రాబోయే తరాలు మనలను క్షమించవు. -
తుపాను బాధితులను ఆదుకోండి
కేంద్ర సాయం త్వరగా అందేలా చూడండి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చిన జగన్ న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రత్యేకించి విశాఖపట్టణం ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా మంజూరు చేసి, బాధితులకు సాయం అందించాలని కోరారు. జైట్లీ అన్ని అంశాలను సావధానంగా విన్నారని, సాయం అందిస్తానని హామీ ఇచ్చారని జగన్ తెలిపారు. జగన్ శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టారేణుకతో కలిసి సాయంత్రం 4-30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఢిల్లీ కృష్ణమీనన్‌మార్గ్-2లోని ఆయన నివాసంలో కలిశారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని, తుపాన్లతో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దాదాపు అరగంటకుపైగా అన్ని అంశాలను జైట్లీ కి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే... హుద్‌హుద్ తుపానుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికలు పంపామని చెబుతున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరగాలన్నదే మా కోరిక. బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకువచ్చాం. తుపానుతో జరిగిన నష్టం, రాష్ట్రం ఎదురు చూస్తున్న సహాయం సత్వరమే అందించాల్సిందిగా అభ్యర్థించాం. ఆయన సావధానంగా విన్నారు. తప్పకుండా మంచి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే సాయం అందిందన్న అంశమూ మా చర్చలో వచ్చింది. ‘దీనికి సంబంధించి నివేదికలు ఇంకా పూర్తిగా తయారు కాలేదు. మా దగ్గరికి ఇంకా రాలేదు. వచ్చాక సాయం చేస్తాం’అని జైట్లీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పది రోజులపాటు ఊరూరు తిరిగి, ప్రభుత్వం ఆ గ్రామాల్లో ఏం చేయలేదో అందరికీ చూపిస్తూ, చెప్పుకుంటూ వచ్చాం. హుద్‌హుద్ తుపాను సహాయక చర్యల్లో సర్కారు విఫలమైందని నాతోపాటు తిరిగిన మీడియా వారి క్లిప్పింగులు చూస్తే తెలుస్తుంది. ఎలాంటి సహాయం అందడంలేదని ప్రజలే చెప్పారు. చంద్రబాబుగారేమో తుపాను సహాయంగా 25 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చేస్తున్నానని చెబుతున్నారు. ఆ 25 కిలోల బియ్యం రేషన్ దుకాణాల్లో రూ.25కి ఇస్తారు. అంటే రూ.25 సాయం చేస్తున్నారు. అదికూడా అన్ని గ్రామాల్లో అందరికీ ఇవ్వలేదు. అధికారులెవరూ రాని పరిస్థితి. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో పంట బీమా రాక వారు నష్టపోయారు. ఈ విషయాలన్నీ ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చాం. ఈ రోజు కేవలం హుద్‌హుద్ బాధితుల సాయం అంశాన్ని మాత్రమే మంత్రి దృష్టికి తెచ్చాం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. అరుణ్‌జైట్లీకి ఇచ్చిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు... హుద్‌హుద్ తుపాను వచ్చిన మూడో రోజే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా రూ. వెయ్యికోట్ల సాయం ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకు ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకు సైతం నేటికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు. బాధిత కుటుంబాలకు సాయం కింద అందించే బియ్యం పంపిణీలోనూ స్థానిక రాజకీయాలు పనిచేస్తున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే, టెలికాం, ఎయిర్‌పోర్టు, ఓడరేవు, షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్, బీహెచ్‌పీవీ లకు జరిగిన నష్టాన్ని కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రూ. 21,640.63 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో వారికి పంట బీమా అందే పరిస్థితి లేదు. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే బాధితులకు కొంత ఊరట లభిస్తుంది. లేదంటే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి. పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి సంబంధించి అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి. తుపాన్ బాధిత ప్రాంతాల్లోని స్వయంసహాయ గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి. వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. రైతులందరికీ పంటబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరుకు, ఉద్యానవన ఉత్పత్తులు సేకరించేందుకు హామీ ఇవ్వాలి. హుద్‌హుద్ తుపాను సందర్భంగా అక్టోబర్ 2014న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 9, 10, 11, 12, 13, 15లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలివ్వాలి. బూపిందర్‌సింగ్ హుడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకుని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. ఇల్లు దెబ్బతిన్న ప్రతీ కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం చేయాలి. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి. తుపాను ప్రాంతాల్లోని వారికి రేషన్‌ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి. బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి. వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. -
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది!
-
ఢిల్లీకి వైఎస్ జగన్, సాయంత్రం జైట్లీతో భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ బాధితులు, ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవాలని ఆయన జగన్ కేంద్రాన్ని కోరనున్నారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో కలసి ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. తుపాను నష్టాన్ని వివరించడంతోపాటు తక్షణ సహాయం అందించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోరనున్నారు. అలాగే తుఫాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారు. -
తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్
-
కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ?
కింది చిత్రంలో కనిపిస్తున్న వారు కలెక్టరాఫీసు వరండా వద్ద ఏదో దరఖాస్తు రాస్తున్నారనుకుంటే పొరపడినట్టే! శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు రాస్తున్నది హుద్‌హుద్ తుపాను నష్టాల అంచనాల జాబితా. వీరిద్దరూ రామభద్రపురం వ్యవసాయ శాఖకు చెందిన ఏఈఓలు. తుపాను తీరం దాటి సుమారు నెల రోజులు కావస్తున్నా ఇంకా నష్టం అంచనాల ప్రతిపాదనలు పూర్తి చేయలేదు. త్వరగా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో వీరిలా ఆదరాబాదరాగా కలెక్టర్ కార్యాలయం వరండా వద్ద నష్టం అంచనాలను రాసుకుంటున్నారు. విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్ నష్టం అంచనాలను పదిహేను రోజుల క్రితమే కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు నివేదిస్తామని కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఇంకా వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈనెల 4న పూర్తి నివేదిక అందజేస్తామని వ్యవసాయ శాఖ చెప్పింది. కానీ శుక్రవారం నాటికి కూడా లెక్కలు కడుతూనే ఉన్నారు. ఒక్క వ్యవసాయ శాఖే కాదు పంచాయతీ రాజ్, ఉద్యాన వనాలు ... చాలా శాఖల పరిస్థితి ఇలాగే ఉంది. అంటే నష్టం అంచనాల తయారీలో ప్రభుత్వ శాఖలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ రోజూ... ఈ రోజు ఇస్తాం! రేపు ఇస్తాం అంటూ తుపాను నష్టాల నివేదికలు పంపడంలో ఆలస్యం చేస్తుండడంతో అవి ఎప్పుడు వెళతాయి? ఎప్పుడు కేంద్ర బృందం వస్తుంది? ఇంకెప్పుడు పరిహారం అందుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వీరు నివేదికలు ఇవ్వకముందే కేంద్ర బృందం వచ్చేలా ఉందని పలువురు ఆక్షేపిస్తున్నారు. దీనిపై కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావు కూడా జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం అంచనాలు పంపించడానికి మీకెన్ని రోజులు కావాలి? త్వరగా తేల్చండి!, ఇలా అయితే మన నివేదిక వెళ్లకుండానే కేంద్ర బృందంజిల్లాకు వచ్చేలా ఉందని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరో తుపాను తరుముకొస్తున్నా హుదుహుదు నివేదికలు పూర్తి కాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సవరణల మీద సవరణలు చాలా శాఖల్లో జరిగిన నష్టం ఇంతేనంటూ ముందు చెప్పి మళ్లీ కొన్ని రోజుల తరువాత ఆయ్యా.... చిన్న సబ్మిషన్! అంటూ మరికొన్ని నష్టాలను చూపెడుతున్నారు. దీంతో నష్టాల నివేదికలో సవరణలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో రూ.1197 కోట్లు నష్టం జరిగినట్టు గురువారం నాటికి అంచనా వేశారు. అయితే అంచనాలు పెరుగుతుండడంతో పూర్తి స్థాయి నివేదిక ఇంకా సిద్ధంకాలేదు. జిల్లాలో ఉన్న చిన్న చిన్న శాఖలన్నీ తమ నివేదికలను అందించేశాయి. కానీ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల నుంచి ఇంకా నివేదికలు రాలేదు. ప్రతీ రోజూ ఈ శాఖల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నష్టం వివరాలు అందుతునే ఉన్నాయి. గురువారం నాటికి నష్టం వివరాలను పంపించేయాలని, దీనికి అనుగుణంగా పని చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం త్వరపడడం లేదు. జిల్లాలో వ్యక్తిగత ఆస్తులతో కలిసి రూ. 1197 కోట్లు నష్టం వచ్చినట్టు గురువారం సాయంత్రానికి అంచనా వేశారు. అయితే ఇందులో వ్యక్తిగత నష్టాలను తొలగించి శాఖాపరంగా వచ్చిన నష్టం రూ. 1097 కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఇలా కూడికలు. తీసివేతలతో కాలహరణ చేస్తున్నారు తప్పా, పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించడం లేదు. నష్టం అంచానులు ఇంకా పెరిగే అవకాశముంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు తుపాను నష్టం అంచనాలు వేస్తారో అధికారులకే తెలియాలి!! -
తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నాన్ని ముంచెత్తిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలతో కలసి ఆయన శనివారం ఢిల్లీ వెళ్లి సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి తుపాను నష్టాన్ని వివరించడంతోపాటు తక్షణ సహాయం అందించాలని కోరనున్నారు. ఈ సందర్భంగా హుద్‌హుద్ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి తుపాను నష్టాన్ని వివరించి తక్షణ సహాయం కోరాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే శనివారం ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కుదరకపోవడంతో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలసి తక్షణ సహాయ ఆవశ్యకతను వివరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. -
అరసవిల్లి ఆదిత్యుని సేవలు ఆన్లైన్ చేయిస్తాం
అరసవల్లి : దేశంలోనే ఏకైక నిత్య పూజలందుకుంటున్న అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన సేవలను ఆన్లైన్ చేయిస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం అరసవల్లి ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 68 దేవాలయాలకు త్వరలో ట్రస్ట్‌బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. హుద్‌హుద్ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆలయాలు ధ్వంసం అయ్యాయని, రూ.5 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఆలయంలో గతంలో జరిగిన కేశాల మాయం విషయంపై దర్యాప్తు ముమ్మరం అయ్యేలా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఆలయంలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఈవోను ఆదేశించారు. ఏటా సౌరయాగం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ముఖలింగేశ్వరుని దర్శించుకున్న మంత్రి సారవకోట రూరల్ (జలుమూరు): మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామిని శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి పక్కనున్న చక్రతీర్థంలో స్నానాలు ఆచరించేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని, కేశఖండన శాల, స్వామి వారి వాహనాలు భద్ర పర్చేందుకు గది నిర్మించాలని సిబ్బంది కోరగా సంబందిత శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఆదేశించారు. శ్రీకూర్మనాథాలయంలో అన్నదాన సత్రం నిర్మిస్తాం శ్రీకూర్మం (గార) : స్థానిక శ్రీకూర్మనాథాలయంలో భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకుగానూ అన్నదాన సత్రం నిర్మిస్తామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన శ్రీకూర్మనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. సర్పంచ్ రామశేషు టీటీడీ సత్రం పరిస్థితిని మంత్రికి వివరించారు. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి, ఈవో శ్యామలాదేవి పాల్గొన్నారు. -
ప్రత్యేక చర్చ : విశాఖ వికసించాలి Part 4
-
ప్రత్యేక చర్చ : విశాఖ వికసించాలి Part 3
-
ప్రత్యేక చర్చ : విశాఖ వికసించాలి Part 2
-
ప్రత్యేక చర్చ : విశాఖ వికసించాలి Part 1
-
ముంచుకొస్తున్న మరో ముప్పు
హుద్‌హుద్ విధ్వంసం ఇంకా కళ్ల ముందు కదులాడుతుండగానే.. మరో తుఫాన్ ముంచుకొస్తోంది. జిల్లా వాసులకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. చిన్నపాటి ఈదురుగాలికే వణికి పోతున్న జనం మరో తుఫాన్ అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో భయాందోళనలకు గురవుతున్నారు. కోత దశలో ఉన్న పంటలు తుడిచిపెట్టుకుపోతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖకు దక్షిణ బంగాళాఖాతంలో 580 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని.. శుక్రవా రం నాటికి పెనుతుఫాన్‌గా మారి, తీరం లో 60 నుంచి 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో విశాఖ,తూర్పుగోదావరి జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ రెండురోజుల్లో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందంటున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో తీరం దాటే అవకాశాలున్నాయని, ఏ దిశగా పయనిస్తుందో శుక్రవారం సాయంత్రానికి కానీ చెప్పలేమంటున్నారు. ఒకటో ప్రమాద హెచ్చరిక: వాయుగుండం తీవ్రతను బట్టి ఇప్పటికే విశాఖపట్నంతో పాటు కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులంతా 8వ తేదీ ఉదయానికి తీరానికి రావాలని, ఇక నుంచి వేటకు వెళ్లరాదని జిల్లా అధికాారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్లు ఇప్పటికే సెలవుపై వెళ్లడంతో జిల్లా బాధ్యతలు చూస్తున్న జేసీ ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో 1800-4250-0002 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోనూ ప్రత్యేకంగా నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేసి మండల కేంద్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. విశాఖనగరంతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేశారు. ముందు జాగ్రత్తగా తీరప్రాంత మండలాల్లో బియ్యం, ఇతర నిత్యావసరాలను సిద్ధం చేశారు. డివిజనల్, మండల కార్యాలయాల్లో వీహెచ్ఎఫ్సెట్స్తో పాటు జనరేటర్లకు కనీసం రెండుమూడు రోజులకు సరిపడా అవసరమైన డిజిల్‌ను సిద్ధం చేశారు. వేటకెళ్లొద్దంటూ తీరప్రాంత గ్రామాల్లో టాంటాం వేసి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా మండలాల్లో 20 రెస్క్యూ బోట్లను నేవీ సిద్ధం చేసింది. -
తుపాన్ వేళ ఏపీ మంత్రుల తీరు సరికాదు
సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ ఐదు నక్షత్రాల హోటళ్లలో బసేంటి?.. డిమాండ్లేంటి? సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేయటాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తప్పు పట్టారు. దీనిపై ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల ఓ లేఖ రాశారు. ఒకపక్క జనం నిత్యావసరాల కోసం అల్లాడుతుంటే మరోపక్క ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసిన మంత్రులు తొలుత ఆ హోటళ్లకు నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపైన తీవ్ర ఒత్తిడి తెచ్చారని లేఖలో శర్మ పేర్కొన్నారు. ఆసుపత్రులు, మురికివాడలు, సామాన్య ప్రజలకు మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాల్సిన మంత్రులు తాము బస చేసిన ఐదు నక్షత్రాల హోటళ్లకు తొలుత ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు. -
హుదూద్ తుఫాన్ విరాళాల కోసం చిత్రకళా ప్రదర్శన
-
మరో గండం
విశాఖ రూరల్: హుదూద్ తుపాను నుంచి తేరుకోకముందే మరో ఉపద్రవం వచ్చేలా ఉంది. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జిల్లాను వణికిస్తోంది. ఈ నెల 10 లేదా 11 తేదీల్లో తుపాను మారే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. దీని ప్రభావం వల్ల విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హుదూద్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న తుపానును ఎదుర్కోడానికి ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాలు తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టరేట్లో సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వైర్లెస్ సెట్లను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో 12 సెం.మీ., వర్షం త్వరలో రానున్న తుపాను ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో 12 సెం.మీ.కు పైబడి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించింది. జిల్లాలో రిజర్వాయర్లు అన్నింటిలో ఇప్పటికే తగినంత స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయి. భారీ వర్షాలు పడితే జలాశయాల గేట్లు ఎత్తివేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరం అనుకుంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల్లోని గ్రామాలకు తగినన్ని నిత్యావసర సరుకులు ముందుగానే రేషన్ డిపోలకు తరలించాలని పౌర సరఫరా అధికారులకు సూచించారు. గర్బిణిలను ముందుగానే వారికి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏఎన్ఎం సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో పవర్‌సాస్, జెసీబీలు, జనరేటర్లు ముందుగానే సమకూర్చుకొవాలని, మండల, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు వారి కేంద్రాల్లోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ డి.వి.రెడ్డి, ఆర్డీఓలు వెంకటమురళి, వసంతరాయుడు, కె.సూర్యారావు, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీపీఓ సుధాకర్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామల, డీఎస్ఓ కృష్ణారావు, సివిల్ సప్లయిస్ డీఎం ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
తుపాను బాధితుల పక్షాన పోరు
విశాఖ రూరల్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫలాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించడానికి సిద్ధమైంది. బాధితులకు తక్షణం నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలో అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఉదయం 10 గంటలకు ధర్నాలకు శ్రీకారం చుట్టింది. తుపాను వచ్చి మూడు వారాలు గడిచినా గ్రామీణ ప్రాంతాల్లో పునరావాస, సహాయక కార్యక్రమాలు నత్తనడకన సాగుతుండడం పట్ల ప్రజల తరపున గళమెత్తేందుకు సన్నద్ధమైంది. జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంలో హడావుడి చేసి గ్రామాలను, ఏజెన్సీని పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించనుంది. తుపాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ పేరుతో టీడీపీ చేసిన అక్రమాలను తూర్పారపెట్టనుంది. బూటకపు హామీలపైనా.. ఎన్నికలకు ముందు ఇచ్చిన బూటకపు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయాలని, హామీ ఇచ్చిన మేరకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పించన్లు మంజూరు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్, ష్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులకు రూ.2 వేలు భృతి ఇవ్వాలని ఇలా చంద్రబాబు హామీలన్నింటినీ నెరవేర్చాలని ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయనున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులన్నీ తరలిరాడానికి సన్నద్ధమవుతున్నాయి. నగరంలో సీతమ్మధార ప్రాంతంలో ఉన్న అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నారు. -
చంద్రబాబు వంచక పాలనపై నేడే ఉద్యమ శంఖం
మూడు దశల్లో నిర్వహిస్తాం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం నుంచి మూడు నెలల పాటు మూడు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్లలో కోత, హుద్‌హుద్ తుపాను బాధితుల సమస్యలే ఎజెండాగా ఈ ఆందోళనలు సాగుతాయని తెలి పారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు స్వయంగా తానే గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలందరూ ఆందోళనలను జయప్రదం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని రైతులకు ఇప్పుడు అపరాధ వడ్డీ రూపేణా 28 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిం దని, డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొ మ్ము నుంచి వడ్డీ చెల్లించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలప్పుడు పింఛనుదారులందరికీ వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. బాబు వల్లే రైతులకు పంటల బీమా రాలేదు ‘‘హుద్‌హుద్ తుపానులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే 3.03 లక్షల హెక్టార్లలో పంటకు పూర్తిగా నష్టం జరిగింది. మరో 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగింది. చంద్రబాబు రుణ మాఫీ హామీని నిల బెట్టుకోని కారణంగా ఈ రైతులందరికీ పంటల బీమా కూడా రాని దారుణమైన పరిస్థితి ఏర్పడింది’’ అని జగన్మోహన్రెడ్డి చెప్పారు. ‘‘ఎన్నికలకు ముందు తనకు అన్నీ పూర్తిగా తెలుసం టూ చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పో యారు. ►రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనే 87,612 కోట్ల వ్యవసాయ రుణా లు, 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చారు. రెండు రకాల రుణాలు కలిపితే 1.01 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. చంద్రబాబు చెల్లించవద్దన్నందుకు రుణాలు కట్టని కారణంగా ఆయన పుణ్యామా అని వారందరిపై పోయిన ఏడాదికే 14 వేల కోట్ల రూపాయలు అపరాధ వడ్డీగా భారం పడింది. రుణ మాఫీకి ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించని కారణంగా ఈ సంవత్సరానికి మరో 14 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. ►రెండేళ్లకు కలిపి రుణాలపై వడ్డీనే 28 వేల కోట్లు రూపాయలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మాత్రం రుణమాఫీకి ఐదు వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు సంగతి దేవుడికి ఎరుక. వడ్డీనే 28 వేల కోట్లు ఉన్నప్పుడు 5 వేల కోట్లతో 20 శాతం రుణ మాఫీ చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్న మాటలనుబట్టే చంద్రబాబు ఎంతగా రైతులను మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది. ►చంద్రబాబు రుణాలు మాఫీ చేయని కారణంగా ఈ ఏడాది రైతుల రుణాలు తిరిగి రెన్యువల్ కాలేదు. పంటలకు బీమా రావడంలేదు. డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బు నుంచి బ్యాంకు వడ్డీని జమ చేసుకుంటున్నాయి’’ అని వివరించారు. ఈ సందర్భంగా బాబు అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశానికి సంబంధించిన పుస్తకాన్ని జగన్ విలేకరులకు చూపించారు. ఇంకెన్ని పింఛన్లకు కోత పెడతారో? ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం లో 43,11,686 వరకు పింఛన్లు ఉన్నాయి. వాటి లో దాదాపు 10 లక్షల పింఛన్లకు ఇప్పటికే కోత పెట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ వెయ్యి రూపాయల పింఛను చెల్లిస్తే ఏడాదికి దాదాపు 3,650 కోట్ల రూపాయ లు అవసరమవుతాయి. అయితే, బడ్జెట్లో మా త్రం 1,338 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పింఛన్లకు కోతపెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు బడ్జెట్లో అవసరమైనదాని కంటే తక్కువ నిధులు కేటాయించారు. పింఛన్ల ఖర్చు రూ. 1,338 కోట్లకు పరిమితం చేసేలా మరికొన్ని పింఛన్లకు ప్రభుత్వం కోతపెట్టే అవకాశం ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై విలేకరులు ప్రశ్నించగా.. దీనిపై వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం కూడా అందజేశారని జగన్ వివరించారు. మున్సిపల్ సమావేశాల్లో హత్యలా? ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతోంది. మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఒకరిపై ఒకరు గొడవ పడినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై పడిన గొడవకే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రౌడీషీటు తెరవడమే రాష్ట్రంలో ఆటవిక పాలనకు నిదర్శనం’’ అని జగన్ విరచుకుపడ్డారు. ‘‘మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొడవ పడతారే గానీ.. ఎవరైనా, ఎక్కడైనా ఆ సమావేశాల్లో హత్యలు చేస్తారా? హత్య చేయడానికి పూనుకుంటారా’’ అని ప్రశ్నించారు. ‘‘ఎవరిపైనయినా రౌడీషీట్ తెరవాలంటే అతనిపై కనీసం మూడు కేసులు ఉండాలని చట్టం చెబుతోంది. భూమా నాగిరెడ్డిపై ఇంతకుముందు ఒక్క కేసు కూడా లేదు. మున్సిపల్ సమావేశంలో సంఘటన ఆధారంగానే ఆయనపై టపటపా మూడు కేసులు కట్టేసి రౌడీషీటు తెరిచే పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబూ ఒక మనిషేనా అన్నది ఆయన గుండెల మీదే చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి. చివరకు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని కౌన్సిలర్లపైనా ఒక్క సంఘటన ఆధారంగానే మూడు కేసులు కట్టి వారిపై రౌడీషీట్లు తెరిచారు’’ అని ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై భూమా నాగిరెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే అఖిల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించమంటే బాబు వినలేదు ‘‘ప్రభుత్వ, అటవీ భూములున్న చోటే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సూచనను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్ద సమస్యలు వస్తున్నాయి. రాజధాని విషయంలోబాబుకు అసెంబ్లీలోనే మా వైఖరి స్పష్టంగా చెప్పాం. ఎక్కడైనా 30 వేల ఎకరాల ప్రభు త్వ భూమి ఉన్న చోట రాజధాని నిర్మించాలని సూచించాం. పునర్విభజన చట్టంలో అటవీ భూములు ఢీనోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చినందున, అవి ఉన్న చోటైనా నిర్మించమని చెప్పాం. ప్రభుత్వ భూములున్న చోట రాజధాని నిర్మిస్తే సామాన్యులు, ఉద్యోగులు కూడా అక్కడ సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు కొనుక్కొనే అవకాశముంటుందని కూడా చెప్పాం. ఇవేమీ చంద్రబాబు చెవికి ఎక్కించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని మొదలుపెట్టింది. చివరకు ల్యాండ్ పూలింగ్ కాస్తా ల్యాండ్ ఫూలింగ్ (రైతులను ఫూల్స్ చేసేలా) చేసే కార్యక్రమంగా తయారైంది. అందుకే రైతులు గట్టిగా నిరసన తెలుపుతున్నారు. రైతులకు అన్యాయం జరిగే ఏ పరిస్థితినైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ అని చెప్పారు. బాబుకు చిత్తశుద్ధే ఉంటే శ్రీశైలం సమస్య వచ్చేదే కాదు రాయలసీమ నీటి అవసరాలపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటి సమస్య ఇంత దూరం వచ్చేదే కాదని జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమ నీటి అవసరాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రాజెక్టుకు ఎడమ వైపు కేసీఆర్ ప్రభుత్వం, కుడి వైపు నుంచి బాబు ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఎడాపెడా తోడేసి విద్యుత్ కోసం వాడటంతో 15 రోజుల్లోనే ప్రాజెక్టులో నీరు 858 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో రాయలసీమకు నీరందుతుంది. నీటి మట్టం 858 అడుగులకు చేరాక బాబుకు సీమ అవసరాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఏపీ ప్రభుత్వం తమ వైపు విద్యుత్ ఉత్పతిని నిలిపివేసి కేసీఆర్‌ను తిట్టడం మొదలుపెట్టారు’’ అని అన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటన్నది తాను ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గించారని, దానిని తిరిగి 854 అడుగులకు సవరిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి 107 జీవో తీసుకొచ్చారని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తెలంగాణ విద్యుత్ సమస్య తీర్చవచ్చిలా.. ‘‘తెలంగాణకు విద్యుత్ కొరత ఉన్న మాట నిజమే. అయితే కేసీఆర్ కొంత మానవత్వంతో, వినూత్నంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య సరఫరా లైన్లు లేవు. లైన్ల నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ అందదు. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధర్యంలోని 2,600 మెగావాట్ల రామగుండం విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అందులో ఎన్టీపీసీకి వాటాగా దక్కే 75 శాతం విద్యుత్‌ను ఆ సంస్థ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో కొనే వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అక్కడ ఎన్టీపీసీకి అప్పగించి, రామగుండం ప్లాంట్‌లో ఎన్టీపీసీ వాటా నుంచి తెలంగాణకు విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చేస్తే విద్యుత్ లైన్లు వేసేవరకు ఆగాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు 1,000 మెగావాట్ల సామర్థ్యం గల విశాఖపట్నం సింహాద్రి ప్లాంట్ ఫేజ్-2లో 60 శాతం విద్యుత్ ఎన్టీపీసీ వాటాగా ఉంది. తెలంగాణ ఇక్కడి నుంచి ఎన్టీపీసీ నుంచి విద్యుత్ తీసుకోవచ్చు. దీనికి బదులుగా ఛత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేసే విద్యుత్‌ను ఆ సంస్థకు ఇవ్వవచ్చు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కొంత చొరవ చూపితే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని’’జగన్ తెలిపారు. -
హుద్‌హుద్ సాయం రూ. 400 కోట్లే
-
ఆంధ్రా యూనివర్సిటీ.. కళ తప్పిందిలా..!
-
సహృదయంతో స్పందించండి
తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కులనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (ysrfoundation2005@gmail.com) ద్వారా తమ పేరు, చిరునామా తెలపాలి. వారికి రసీదు, దాంతోపాటు 80జీ కింద పన్ను మినహాయించుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికెట్ పంపిస్తారు. రూ.5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం. -
వీఐటీ వర్సిటీ రూ. కోటి సాయం
హుద్‌హుద్ బాధితులకు వీఐటీ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. వర్సిటీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు సంయుక్తంగా రూ. కోటిని సేకరించారు. వర్సిటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అక్టోబర్ 30న సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ. కోటి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. -
తుపాను నిధికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల విరాళం
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుఫాన్ బాధితులను అదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను సహాయ నిధికి ఇద్దరు ఎమ్మెల్యేలు లక్ష చొప్పన విరాళం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, కొక్కిలగడ్డ రక్షణనిధిలు తమ ఎమ్మెల్యేల వేతనం నుంచి చెరో లక్ష రూపాయల సహాయ నిధికి అందజేశారు. ఇరువురు నాయకులు శుక్రవారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కులను అందజేశారు. -
పబ్లిసిటీ కోసమే చంద్రబాబు పాకులాట: చిరంజీవి
అనంతపురం: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆరోపించారు. తుపాను వస్తుందని తెలిసిన సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో 50 మంది చనిపోయారని తెలిపారు. గురువారం అనంతపురంలో చిరంజీవి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను సమయంలో కూడా చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పాకులాడారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు రోజుకో మాట చెప్పి ప్రజల నుంచి తప్పించుకుంటున్నారని బాబు వైఖరీని దుయ్యబట్టారు. బ్లాక్‌మనీపై బీజేపీది ద్వంద్వ వైఖరి అని అన్నారు. కేంద్రం దగ్గర చంద్రబాబుకు ఏ మాత్రం పలుకుబడి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. పచ్చని పొలాల్లో రాజధాని ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు భూ సేకరణ కోసం రైతులను ఒప్పించాలి కానీ... బెదిరించకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. -
'పంట పోయాక ప్రీమియం కడతామంటే ఎలా?'
-
నిలువ నీడ కోల్పోయిన అడవిబిడ్డలు!
-
సహాయక కార్యక్రమాలు సిటీకే పరిమితం: మోపిదేవి
విశాఖపట్నం: తుపాను సహాయ కార్యక్రమాలు సిటీకే పరిమితమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో తుపాను సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హుదూద్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తే కేవలం సహాయక చర్యలు విశాఖపట్నం నగరంలోనే చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హుదూద్ తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంకటరమణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్యుమరేషన్, సహాయ కార్యక్రమాలు రాజకీయ కోణాల్లో జరగుతున్నాయని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను బాధితులకు నష్టపరిహారం చెల్లించే సమయంలో బ్యాంకులతో మెలిక పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. కోపరేటివ్ సొసైటీలో సభ్యుత్వం ఉన్నవారికే... ఎండు చేపలు విక్రయించే మహిళలకు పరిహారం చెల్లిస్తామంటున్నారని ప్రశ్నించారు. ఇది సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయడ్డారు. మత్స్యకారులకు మోడల్ హౌసెస్ తరహాలో కాలనీలు ఏర్పాటు చేయాలని వెంకట రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సముద్రపు కోతకు గరైన ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
అనుబంధం తెగిపోయిందా చిన్నమ్మా?
మరిదిగారిపై కోపంతో హస్తంపార్టీకి స్నేహ హస్తం అందించింది. దాంతో ఖుషీ అయిపోయిన హస్తం పార్టీ ఏకంగా విశాఖపట్నం లోక్‌సభ ఎంపీ టికెటు ఇచ్చింది. కేవలం సూట్‌కేసుతో వెళ్లి నామినేషన్ వేసి... ఎంపీగా గెలిచింది. అంతేనా కేంద్రంలో సహాయమంత్రి పదవిని సైతం చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పార్టీ టికెట్‌పై గెలిచి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంది. ఆమె ఎవరో ఇప్పటికే గుర్తు వచ్చి ఉంటుంది. ఆమె దగ్గుబాటి పురందేశ్వరీ అలియాస్ చిన్నమ్మ. తనను ఇంతగా అందలం ఎక్కించిన మీకూ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనంటు ఒకానొక సమయంలో చిన్నమ్మ విశాఖ ప్రజలను పొగడ్తలతో ముంచెత్తింది. విశాఖ అంటే నేను... నేను అంటే విశాఖ అన్నట్లు మమేకమైపోయినా ఆమె రాష్ట్ర విభజన సమయంలో మీరు రాజీనామా చేయమంటే చేసేస్తా.... కేంద్రంతో పోరాడమంటే పోరాడతా నంటూ నాటి విశాఖ సభలలో చిన్నమ్మ ఉదరగొట్టింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోవడం... హస్తం పార్టీకే హ్యాండ్ ఇచ్చి కాషాయ వస్త్రం కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కాషాయం పార్టీ టికెట్టుపై ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైంది. అది వేరే సంగతి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలను హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. అందునా ఆమె ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గమైన విశాఖలో అయితే బీభత్సం సృష్టించింది. విశాఖ ప్రజలకు ఇంత జరిగిన ఆమె అటు వైపు కన్ను ఎత్తి కూడా చూడ లేదు. హుదూద్ తుపాను నేపథ్యంలో దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయనాయకులు, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోహీరోయిన్లు భారీగా తమ విరాళాలు ప్రకటించారు. కానీ హుదూద్ తుపాను పై చిన్నమ్మ కనీసం స్పందించలేదు. విశాఖతో ఇక తన అనుబంధం తెగిపోయిందని చిన్నమ్మా భావిస్తున్నారో ఏమో. కనీసం ఉలుకుపలుకు లేకుండా ఉండి పోయారు. -
ఏయూ లా కాలేజీ దత్తత తీసుకున్న గంటా
విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్శిటీ లా కాలేజీని దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్శిటీ క్యాంపస్‌లో గంటా మాట్లాడుతూ... లా కాలేజీని మోడల్ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రతి ఏటా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్శిటీకి రూ. 3 కోట్లు విరాళాలు అందాయని వెల్లడించారు. హుదూద్ తుపానును జయించిన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు నిర్వహించనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ... యూనివర్శిటీ క్యాంపస్‌లో 90 శాతం విద్యుత్ పునరుద్ధరించినట్లు తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. రేపటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. యూనివర్శిటీ కోసం పూర్వ విద్యార్థులు సహాయం అందించాలని ఈ సందర్భంగా వీసీ విజ్ఞప్తి చేశారు. -
హుదూద్ తుపాను : గ్రౌండ్ రిపోర్ట్
-
'గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తాం'
విజయనగరం: భూముల పట్టాలు లేని గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. శనివారం విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని హుదూద్ తుపాను ప్రభావంతో పంట కోల్పోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పంట నష్టంపై రైతులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తుపాను సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులతోపాటు టీడీపీ నేతలు ఉన్నారు. -
అంధకారంలో శ్రీకాకుళం జిల్లా
-
చంద్రబాబును కలసిన రామ్ చరణ్
హైదరాబాద్: ప్రముఖ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం రామ్ చరణ్ 15 లక్షల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. ఇటీవల సంభవించిన హుదూద్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తన వంతు సాయంగా 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన రామ్ చరణ్ చంద్రబాబుకు చెక్‌ను అందజేశారు. ఓ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో టీమ్ కూడా చంద్రబాబును కలసి 4.4 లక్షల విరాళం అందజేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు తుపాన్ బాధితులకు విరాళాలు అందజేశారు. -
సహాయ కార్యక్రమాలా? విజయోత్సవ సభలా ?
విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభలా నిర్వహిస్తోందని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు. శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాలలో మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ అంశంలో దాటివేత దోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. రైతులు ఇప్పటికే రుణమాఫీ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'80 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం'
హుదూద్ తుపాను సమయంలో అధికారులు, మంత్రులు అంతా కలిసి పని చేయడం ఓ రికార్డుగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఇలా జరగలేదని అన్నారు. దీనంతటికి సీఎం చంద్రబాబు స్పూర్తితోనే సాధ్యమైందని తెలిపారు. అధికారులు, మంత్రులు అంతాకలసి చాలా తక్కువ సమయంలో తుపాను ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ద్వారా మాములు స్థితికి తీసుకువచ్చామని పల్లె వివరించారు. ఉత్తరాంధ్రలో దాదాపు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని.... మిగిలిన విద్యుత్ సరఫరా కూడా సాధ్యమైనంత త్వరగా చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ కనెక్షన్లను కూడా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తామని చెప్పారు. తుపాను నష్టం వల్ల ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తామని పల్లె ప్రకటించారు. -
ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి: బాబు
విజయనగరం: ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కాల్వల ద్వారా నీరందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గొర్ల మండలం గుజ్జంగి వలస సభలో చంద్రబాబు మాట్లాడుతూ... మామిడి తోటలు నష్టపోయిన వారికి భూమి ఆధారంగా కాకుండా చెట్లు ప్రాతిపదికన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టేకు చెట్లు కోల్పోయిన వారికి అటవీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో టేకు చెట్లు వేలం ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామన్నారు. చిన్న టేకు చెట్లు కోల్పోయిన వారికి చెట్టుకు రూ. 500 చొప్పును పరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ నెల 30న జిల్లా పరిషత్ కార్యాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పటిలోగా అన్ని సహాయక పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. -
'దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం'
శ్రీకాకుళం: హుదూద్ తుపాను విపత్తుతో దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మిస్తామని కుందువాని పేట గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హమీ ఇచ్చారు. గురువారం శ్రీకాకుళంలో తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుందువానిపేట గ్రామంలో పర్యటించారు. తుపాన్ ప్రభావిత జిల్లాలోని మత్స్యకార గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా మారుస్తామన్నారు. భూగర్భ కరెంట్, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్ని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు విజయనగరం పర్యటనకు బయల్దేరి వెళ్లారు. -
వృత్తిపరమైన సంతృప్తికి.. డిజాస్టర్ మేనేజ్మెంట్
సుందర నగరం విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మాటలకందనిది. ఈ విపత్తుతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రూ.వేల కోట్ల నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తూ.. సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలకు అండగా నిలుస్తూ నగరాన్ని ఒక దారికి తీసుకొస్తున్న నిపుణులు కనిపిస్తున్నారు. పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్న ఈ సిబ్బందే.. విపత్తుల నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్మెంట్) నిపుణులు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ప్రకృతి బీభత్సాలతోపాటు ప్రేరేపిత విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు శిక్షణ పొందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సేవలు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి. అందుకే ఈ రంగాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభ్యమవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు తుఫాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విలయాలతోపాటు ఉగ్రవాద, తీవ్రవాదుల దాడుల్లో అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు విపత్తుల నిర్వహణ సిబ్బంది కృషి చేస్తుంటారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణ బాధ్యతలను చేపడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర(ఎన్జీవో) సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న భారీ పరిశ్రమలు, భవనాల్లో వీరి సేవలు అవసరం. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రిసార్ట్‌ల్లో వీరిని నియమించుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోనూ అవకాశాలున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ), ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), రెడ్ క్రాస్, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందికి కొలువులను కల్పిస్తున్నాయి. ఈ రంగంలో నిపుణుల కొరత వేధిస్తోంది. భారత్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో రీసెర్చ్ స్కాలర్స్ సంఖ్య స్వల్పంగానే ఉంది. మరోవైపు విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా అవకాశాలున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కు కేంద్ర హోంశాఖతోపాటు రాష్ర్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో చేరితే నిర్వాసితులకు సేవలు అందించామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది. కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రకాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. సకాలంలో వేగంగా స్పందించే గుణం అవసరం. అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలగాలి. కొత్త బాధ్యతలను చేపట్టి, పూర్తిచేసే సామర్థ్యం ఉండాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. అర్హతలు: డిజాస్టర్ మేనేజ్మెంట్పై మన దేశంలో డిప్లొమా, సర్టిఫికెట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్, అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరొచ్చు. ఏవైనా సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంది. వేతనాలు: డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. వృత్తిలో నాలుగైదేళ్ల అనుభవం ఉంటే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సొంతం చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఎన్జీవోల్లో చేరితే నెలకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌కు నెలకు రూ.35 వేల వేతనం ఉంటుంది. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా చేరితే హోదాను బట్టి జీతభత్యాలుంటాయి. కన్సల్టెన్సీల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెబ్సైట్: http://nidm.net/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్ వెబ్సైట్: www.nbu.ac.in ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్: www.unom.ac.in డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.dmibhopal.nic.in నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ వెబ్సైట్: http://ncdcnagpur.nic.in/ -
తుపాను బాధితులకు సహృదయంతో స్పందించండి
తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు విరాళాలకు సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ఈ-మెయిల్ ద్వారా రసీదు, డొనేషన్ సర్టిఫికెట్ విరాళాలు పంపాల్సిన ఖాతా వివరాలు.. ఖాతా పేరు : వైఎస్సార్ ఫౌండేషన్ ఖాతా సంఖ్య : 31868397566 బ్యాంకు పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0008022 బ్రాంచి : బంజారాహిల్స్, ైెహ దరాబాద్ బ్రాంచి కోడ్ : 08022 చెక్కులు/ డీడీలు పంపాల్సిన చిరునామా వైఎస్సార్ ఫౌండేషన్, C/oసాక్షి తెలుగు డైలీ, 6-3-249/1,సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్-500034. సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను రాకాసిలా విరుచుకుపడడంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి అండగా నిలవాలి. సహృదయంతో స్పందించాలి. లోగడ కూడా ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని సంకల్పించాయి. హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (డటటజౌఠఛ్చ్టీజీౌ2005ఃజఝ్చజీ.ఛిౌఝ)ద్వారా తమ పేరు, చిరునామా తెలియజేయాలి. వారికి రసీదు, దానితోపాటు 80జీ కింద పన్ను మినహాయించుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికెట్ పంపిస్తారు. రూ. 5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం. బుధవారం వరకు వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందిన విరాళాలు (రూపాయల్లో) 20వ తేదీ వరకు అందిన విరాళాలు 70,26,227 వంగవీటి రాధాకృష్ణ 1,00,000 లంకాడ గౌతమి(హైదరాబాద్) 16,000 డి.సాయినాథ్ రెడ్డి(చెన్నై) 11,500 గాదె వీరారెడ్డి(గుంటూరు) 5,555 చిలుకు రవికుమార్ 5,033 ఎం. ఉమామహేశ్వర రెడ్డి 5,000 గొంది ఉదయ్ కుమార్ 5,000 బి.సుబ్బారెడ్డి 5,000 ఎన్.ఎస్. మద్దిలేటి రెడ్డి 5,000 శీలం శ్రీనివాసరెడ్డి 5,000 చల్లా సుశీలమ్మ(తిరుపతి) 5,000 కట్టిరెడ్డి శేఖర్‌రెడ్డి 5,000 ఇతరులు 5,441 మొత్తం 72,04,756 -
కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న చంద్రబాబు
-
కొవ్వొత్తుల వెలుగుల్లో.. విశాఖ తీరం!
-
హుదూద్ నష్టం రూ.437.5 కోట్లు
విజయనగరం కంటోన్మెంట్ : హుదూద్ తుపాను పెను విధ్వంసమే కాదు పెను నష్టాన్నీ మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదించిన లెక్కల ప్రకారం నష్టపోయిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విలువ రూ.437.50 కోట్లుగా తేలింది. జిల్లాలోని పార్వతీపురం, విజయనగరం డివిజన్లలో విజయనగరం డివిజన్‌లోనే నష్టం ఎక్కువగా ఉంది. అందులోనూ విజయనగరం మున్సిపాలిటీలోనూ, తీర ప్రాంత మండలాల్లోనూ నష్టం అంచనాలు దాటిపోయింది. హుదూద్ తుపాను వర్షాలకు, ప్రచండ గాలులకు జిల్లా వ్యాప్తంగా 14 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాల్లో 12 తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. 22 మండలాల్లో పాక్షిక నష్టాలు కలిగాయి. జిల్లాలోని 928 పంచాయతీల్లో 411 గ్రామాలు పూర్తిగా నష్టపోగా, 1,140 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైతన్న కుదేలు... అన్నింటికన్నా ఎక్కువగా అన్నదాత నష్టపోయాడు. ఒకపక్క ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కోసం ఎదురుచూస్తూ.. మరోపక్క అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి రైతులు పంటల సాగు చేపట్టారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని 28,297 హెక్టార్లలో పంట నష్టం కలిగిందని వ్యవసాయాధికారులు ధృవీకరించారు. మరో 20 హెక్టార్లలో ఇసుక మేటలు వేశాయి. ఉద్యాన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 12,341.48 హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో 5,405 హెక్టార్లలో అరటి, 3,256 హెక్టార్లలో కూరగాయలు, 157 హెక్టార్లలో బొప్పాయి, 963 హెక్టార్లలో జీడి, 55.48 హెక్టార్లలో మామిడి, 2,505 హెక్టార్లలో కొబ్బరి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. మల్బరీ తదితర హెరీకల్చర్ పంటల నష్టం రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. భారీ సంఖ్యలో దెబ్బతిన్న ఇళ్లు... జిల్లా వ్యాప్తంగా 14,458 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పక్కా, మిద్దె ఇళ్లు కూడా ఉన్నాయి. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లతో ప్రజలు తీవ్ర అసౌకర్యాలను అనుభవిస్తున్నారు. 108 పశువులు మృత్యువాత పడగా 394 చిన్న దూడలు తుపాను ధాటికి మరణించాయి. 26 పశువైద్య కేంద్రాలకు నష్టం కలిగింది. రూ.7.95 కోట్ల విలువైన ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగింది. 484 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. 17 చోట్ల రహదారులకు గండ్లు ఏర్పడ్డాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన 2,226 చెట్లు కూలిపోయాయి. ఆర్‌అండ్‌బీకి రూ.78.51 కోట్ల నష్టం వాటిల్లింది. 585 పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతినగా, 943 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 34 భవనాలు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీల్లో 36 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. ప్రాజెక్టులకూ తీవ్ర నష్టం జరిగింది. మైనర్ ఇరిగేషన్‌కు చెందిన 478, మీడియం ఇరిగేషన్‌కు చెందిన 291 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. మత్స్యకారుల ఆస్తులు కూడా బాగా దెబ్బతిన్నాయి. 357 బోట్లు, వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి. 352 వలలు, 118 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 4 టన్నుల ఉప్పు కరిగిపోగా, 2 చేపలు ఎండబెట్టుకునే ప్లాట్‌ఫారాలు పాడయ్యాయి. 173 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. చెరువుల్లో నిల్వ ఉంచిన 160 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. 74 పీహెచ్‌సీలు, ఏడు జిల్లా స్థాయి ఆస్పత్రులకు ఆర్థిక నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు చెందిన ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. 9,516 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 506 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శాఖల రిపోర్టులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. అన్ని శాఖలకూ కలెక్టరేట్లోని అధికారులు ఒక ఫార్మాట్‌ను ఇస్తున్నారు. వాటి ఆధారంగా నష్టాలను అంచనా వేస్తున్నారు. ఇంకా పలు శాఖలకు చెందిన ఆస్తుల నష్టం వివరాలు రావాల్సి ఉంది. -
నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం:జగన్
శ్రీకాకుళం:మంగళవారం జిల్లాలోని లావేరు మండలం మురపాకలో పర్యటించిన జగన్.. తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తుపాను బాధితులకు నష్టపరిహారంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.తుపాను బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అవ్వా తాతలు, డ్వాక్రా అక్కా చెల్లెళ్లు, రైతన్నల కోసం నవంబర్ 5 వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరించారు. -
థమన్ మ్యూజికల్ నైట్‌కి భారీ స్పందన
-
సహృదయంతో స్పందించండి
తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు విరాళాలకు సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ఈ-మెయిల్ ద్వారా రసీదు, డొనేషన్ సర్టిఫికెట్ విరాళాలు పంపాల్సిన ఖాతా వివరాలు.. ఖాతా పేరు : వైఎస్సార్ ఫౌండేషన్ ఖాతా సంఖ్య : 31868397566 బ్యాంకు పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0008022 బ్రాంచి : బంజారాహిల్స్, ైెహ దరాబాద్ బ్రాంచి కోడ్ : 08022 సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను రాకాసిలా విరుచుకుపడడంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి అండగా నిలవాలి. సహృదయంతో స్పందించాలి. లోగడ కూడా ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని సంకల్పించాయి. హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (ysrfoundation2005@gmail.com)ద్వారా తమ పేరు, చిరునామా తెలియ జేయాలి. వారికి రసీదు, దానితోపాటు 80జీ కింద పన్ను మినహాయిం చుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికేట్ పంపిస్తారు. రూ.5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం. -
అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ!
శ్రీకాకుళం: హుదూద్ తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 21 గ్రామాలు మినహా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధిరించామని ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ తెలిపారు. ఉత్తరాంధ్రలో ఈపీడీసీఎల్ కు 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. త్వరలోనే గురివిడి సబ్ స్టేషన్ కు 220 కేవీ లైన్ ను పునరుద్దరిస్తామని విజయానంద్ తెలిపారు. -
వాళ్ళందరికీ ఆత్మవిశ్వాసం కల్పిద్దాం!
-
ఏ ఒక్కరికైనా సహాయం అందిందా ?!
-
'నష్ట పోయిన రైతులను ఆదుకోండి'
ఢిల్లీ: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పంటల భీమా పథకం ద్వారా నష్టపోయిన రైతులను మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. అంతకుముందు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని వివరించారు. అ తుపాను బాధితులకు కేంద్ర సాయాన్ని కోరారు. పెను తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించాలని జైట్లీకి తెలిపారు. -
చాలా గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేయలేదు:జగన్
విజయనగరం: హుదూద్ తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా అక్కడి పరిస్థితులను అధికారులు సరిగా అంచనా వేయలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చాలా గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు రాలేదన్న సంగతిని బాధితులు తన దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. సోమవారం బోగాపురం మండలం దిబ్బలపాలెంలో పర్యటించిన జగన్.. నవంబర్ 5 లోగా తుపానుతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఒకవేళ అలాకాకుంటే డ్వాక్రా, రైతు రుణమాఫీ దీక్షలతో పాటు ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్య్యకారులకు రూ. 2.50 లక్షలు నష్ట పరిహారంతో పాటు, వలలు కోల్పోయిన మత్య్సకారులకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. కొబ్బరి తోటలు కోల్పోయిన వారికి చెట్టుకు రూ. 5 వేలు ఇవ్వాలన్నారు. జీడి మామిడి తోటలకు ఎకరాలు రూ. 50 వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం పేరుతో ఎప్పుడూ ఇచ్చే రూ.25కు 25 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇవ్వడాన్ని జగన్ తప్పుబట్టారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక్క అధికారి రాలేదని బాధితులు స్పష్టం చేశారని జగన్ అన్నారు. ఒకవేళ వచ్చినా వారికి నచ్చిన వారి పేర్లు రాసుకుని వెళ్లిపోవడం ఎంత వరకూ సమంజసం అన్నారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు ఇవ్వాలని జగన్ తెలిపారు.పూర్తిగా పాడైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించాలని జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి
ఢిల్లీ:తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్ర సాయాన్ని కోరినట్లు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను బాధితులకు కేంద్ర సాయాన్ని కోరినట్లు తెలిపారు. పెను తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కోరినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరుపున జైట్లీ ఆరోగ్యపరిస్థితిని సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు. -
పూర్తిస్థాయి విద్యుత్ కు మరో 10 రోజులు!
విశాఖ:నగరంలోని అధికశాతం ప్రజలు ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతున్నారు. తొమ్మిది రోజులవుతున్నా..నగరంలో పూర్తిగా చీకట్లు పూర్తిగా తొలగలేదు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న అధికారుల మాటలు ఇప్పటికే అమలు కాలేదు. ఒకప్రక్క పనులు చేపడుతున్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. ప్రస్తుతం విశాఖలో 35 శాతానికే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రోజులో కొన్ని గంటలపాటే తాత్కాలిక లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పూర్తిస్థాయి విద్యుత్ కు 10 రోజులు పట్టే అవకాశ ఉంది. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు వారాలు పడుతుందని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. -
రబీలోనూ ఖరీఫ్ కష్టాలే..
గండేడ్: జిల్లాలో రబీ సీజన్లో అత్యధికంగా సాగయ్యే పంట వరి. వికారాబాద్ డివిజన్లో అత్యధికంగా పరిగి ప్రాంతంలోనే వరి సాగవుతోంది. గండేడ్ మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగవుతోంది. అదేవిధంగా జిల్లాలో 8,100 హెక్టార్లలో వేరుశనగ పంట సాగవుతుండగా.. ఇందులో సగం మండల పరిధిలో సాగవుతోంది. కానీ ఈసారి సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు గడి చినా ఇప్పటికీ చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవల హుధూద్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు చివరకి నిరాశే మిగిలింది. వర్షాల జాడలేకపోవడంతో డివిజన్ పరిధిలో అంతటా పొలాలన్నీ దుక్కులకే పరిమితమయ్యాయి. పాతాళగంగను తోడేదెలా.. రబీలో ప్రధానంగా సాగయ్యే వరిపంటకూ కష్టకాలం వచ్చింది. ప్రధాన ప్రాజెక్టులేవీ లేకపోవడంతో వరిసాగు భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో డివిజన్ పరిధిలోని రైతులంతా బోరుమోటర్లపైనే ఆధారపడి వరిసాగు చేస్తున్నారు. రబీలో సాధారణ విస్తీర్ణం 15,550 హెక్టార్లు. అధికంగా పరిగి, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో సాగవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వరిసాగకు కీలకమైన పాతాళగంగమ్మను పైకి తీసుకురావడం రైతులకు కష్టంగా మారింది. పొలాలకు కనీసం రెండు గంటలు సైతం కరెంటు అందకపోవడంతో బోరుమోటర్లు నడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో వరి సాగు ముందుకు సాగనిపరిస్థితి నెలకొంది. -
విద్యుత్ ను పొదుపుగా వాడండి: పల్లె
శ్రీకాకుళం: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో విద్యుత్ ను పొదుపుగా వాడాలని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు విజ్ఞప్తి చేశారు. సర్వే నిర్వహించి అర్హులైన తుఫాన్ బాధితులందరికి త్వరలోనే పరిహారం అందిస్తామని మంత్రులు తెలిపారు. తుఫాన్, నాగావళి వరద సహాయ చర్యలపై మంత్రులు పల్లె, కామినేనిలు సమీక్ష నిర్వహించారు. -
'రేషన్ కార్డులు లేవని బియ్యం ఇవ్వడం లేదు'
విశాఖ:హుదూద్ తుపాను ప్రభావంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితులు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భీమిలి పట్నంలోని తోటవీధిలో తుపాను బాధితులను జగన్ పరామర్శించారు. తమ ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, పడవులకు కొట్టుకుపోయాని జగన్ వద్ద వారు గోడు వెళ్లబోసుకున్నారు. తుపానుతో సర్వం కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్నారు. తమ వద్దకు ఏ నాయకుడు రాలేదన్న విషయాన్ని జగన్ కు తెలిపారు. తమ కష్టాల గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నామని, కనీసం ఆహారం కూడా ప్రభుత్వం నుంచి అందలేదని వారు జగన్ ఎదుట ఆవేదన చెందారు. తమ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు తుపానులో కొట్టుకుపోయాయని.. రేషన్ కార్డులు లేవని బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. తుపానుతో కట్టుబట్టులతో మిగిలినా.. ఏ అధికారి రాలేదని జగన్ కు తెలిపారు. తుపాను బాధితులకు సాయం అందే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందని వారికి జగన్ భరోసా ఇచ్చారు. -
టార్చిలైట్లు, లాంతర్ల వెలుగులో వైఎస్ జగన్ పరామర్శ
విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్షం, చీకటిని లెక్కచేయకుండా తుపాను ప్రభావ బాధితులను పరామర్శించారు. శనివారం రాత్రి వైఎస్ జగన్ టార్చ్లైట్లు, లాంతర్ల వెలుగులో పాడేరులోని ఎరడవల్లి గిరిజనులను పరామర్శించారు. తుపాన్ కారణంగా సర్వం కోల్పోయామని, కొంతమందికి బియ్యం తప్ప మరే సహాయం అందలేదని గిరిజనులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అందరికీ సరైనా పరిహారం అందేలా పోరాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అంతకుముందు అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలల్లో తుపాను కారణంగా నష్టపోయిన బాధిత రైతులను పరామర్శించారు. కాఫీ తోటల రైతులకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు మిరియాలు, కాఫీ తోటలతో ఎకరాకు లక్ష చొప్పున సంపాదిస్తున్నారని.. వారికి హెక్టారుకు రూ. 10 వేలు, రూ.15 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్నిప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ రూ.లక్ష చొప్పన పరిహారం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు అవుతుందని జగన్ స్పష్టం చేశారు. కాఫీ పంటకు ఆధారమైన సిల్వర్ ఓక్ చెట్లు భారీ ఎత్తున కూలిపోయాయని.. మళ్లీ చెట్లు పెరగాలంటే 15 సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వర్షంలోనూ తన పర్యటన కొనసాగించిన జగన్ మోదపల్లి వద్ద దెబ్బతిన్న కాఫీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులు వైఎస్ జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో చెట్టూ పెరగాలంటే 20 సంవత్సరాల కాలం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు రూ. 1,50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని జగన్ కు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. మిరియాలు, కాఫీ పంటల రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చెట్లు లేకపోతే కాఫీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తెలిపారు.ఏ ఒక్క గిరిజనుడికి రెండు ఎకరాలు మించి లేదని జగన్ పేర్కొన్నారు. -
ఆ పరిహారం వాళ్ళకేం సరిపోతుంది ?!
-
'ఏపీకి అవసరమైన సహాయాన్ని అందిస్తాం'
ఢిల్లీ:తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. దీనిపై ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన వివరాలను కేంద్రానికి పంపాలని రాధామోహన్ సింగ్ తెలిపారు. గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు రూ. వెయ్యి కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి
విశాఖ: తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన కాఫీ తోటల రైతులకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజనులు మిరియాలు, కాఫీ తోటలతో ఎకరాకు లక్ష చొప్పున సంపాదిస్తున్నారని.. వారికి హెక్టారుకు రూ. 10 వేలు, రూ.15 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్నిప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ రూ.లక్ష చొప్పన పరిహారం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు అవుతుందని జగన్ స్పష్టం చేశారు. కాఫీ పంటకు ఆధారమైన సిల్వర్ ఓక్ చెట్లు భారీ ఎత్తున కూలిపోయాయని.. మళ్లీ చెట్లు పెరగాలంటే 15 సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. శనివారం అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలల్లో తుపాను కారణంగా నష్టపోయిన బాధిత రైతులను జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడ్నుంచి పాడేరులో పర్యటించారు. వర్షంలోనూ తన పర్యటన కొనసాగిస్తున్న జగన్ మోదపల్లి వద్ద దెబ్బతిన్న కాఫీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులు వైఎస్ జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో చెట్టూ పెరగాలంటే 20 సంవత్సరాల కాలం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు రూ. 1,50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని జగన్ కు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. మిరియాలు, కాఫీ పంటల రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చెట్లు లేకపోతే కాఫీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తెలిపారు.ఏ ఒక్క గిరిజనుడికి రెండు ఎకరాలు మించి లేదని జగన్ పేర్కొన్నారు. -
అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్
విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విశాఖలో సహాయక చర్యలపై చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ అంతంత మాత్రంగా జరుగుతుందని... పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీ జరిగే విధంగా చూడాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. కూలీలు, వాహనాల కొరత తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలంటే మరో 10 రోజులు పడుతుందని బాబుకు ఉన్నతాధికారులు బదులిచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన బాబు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'రూ.10 వేల కోట్ల సాయం అందించాలి'
విశాఖ: హుదూద్ తుపాను కారణంగా భారీగా నష్టపోయిన విశాఖ నగరానికి రూ.10 వేల కోట్ల సాయం అందించాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. తాను వ్యక్తిగతంగా రూ.కోటి రూపాయలు సాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎంపీ నిధుల నుంచి మరో రూ. కోటి మంజూరు చేస్తానన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సుబ్బిరామి రెడ్డి.. తక్షణమే కేంద్రం రూ. 10 వేల కోట్లను విశాఖకు మంజూరు చేయాలన్నారు. ఇదిలా ఉండగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రాహుల్ సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. -
'విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తాం'
హైదరాబాద్:తుపాను ప్రాంతాల్లో ఆదివారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 65 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తుపాను సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇదిలా ఉండగా తుపానులో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర బాధితులకు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. టీడీపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో సాధారణ జనజీవన పరిస్థితులు వచ్చేంత వరకూ ఇక్కడ ఉండే పర్యవేక్షిస్తామని మరోమంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. -
38కి చేరిన తుపాను మృతుల సంఖ్య
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తొలుత పెద్దగా ప్రాణం నష్టం జరగలేదని అంచనా వేసినా.. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 38కి చేరింది. దీంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లింది. రెండు లక్షల 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే 24 చోట్ల కాల్వలకు గండిపడి అపారంగా పంట నష్టం చేకూరింది. ఆ పెను తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ నష్టానికి గురైయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 32, 983 కరెంటు స్తంభాలు భూస్థాపితం కాగా, 181 బోట్లు గల్లంతైయ్యాయి. దీంతో పాటు 16 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. -
'కాంగ్రెస్ కావాలనే మాపై బురద జల్లుతోంది'
హైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు వచ్చినా... హుదూద్ తుపాను బాధితులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను బాధితుల కోసం వివిధ రూపాల్లో నిధులు సేకరిస్తామని చెప్పారు. తుపాను విధ్వంసంపై తమ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తుపాను బాధితులను అదుకోవడం... సహాయక చర్యలు చేపట్టడంలో తమ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడంపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తమపై బురద జల్లుతుందని ఆరోపించారు. తుపాను సహయక చర్యల కోసం మరిన్ని నిధులను కేంద్రం నుంచి కోరతామని యనమల తెలిపారు. -
ఒక విలయం మిగిల్చిన నిశ్చబ్దం
-
హుదూద్ బీభత్సాన్ని కళ్ళకు కట్టే దృశ్యమిదీ!
-
ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే: ఐవీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే ఉందని ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఐవీఆర్ తెలిపారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరలో పునరుద్ధరిస్తామని ఐవీఆర్ అన్నారు. మోడీ ప్రకటించిన ఆర్ధిక సహాయం కేంద్రం నుంచి సత్వరమే అందుతుందని భావిస్తున్నామని సాక్షితో ఐవీఆర్ అన్నారు. -
హుదూద్ తుపాను విధ్వంసం వివరాలు
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాను నష్టం వివరాలను అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రను కుదిపేసిన ఈ తుపాను వల్ల భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తుపాను అతలాకుతలం చేసింది. పెనుగాలులకు ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. షోరూమ్‌లో నుంచి కారు కూడా ఎగిరి కిందపడింది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. మూడు జిల్లాలలో 38 మంది మృతి చెందారు. 8742 పశువులు మృతి చెందాయి. అధికారులు తెలిపిన ప్రాధమిక అంచనా ప్రకారం 11, 318 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. లక్షా 82వేల 128 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. 219 చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. 2250 కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆరు బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. 12,138 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి. ** -
'తుపాను ప్రభావంతో రాష్ట్రం అతాలకుతలం'
విశాఖ:హుదూద్ తుపానుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం నుంచి తేరుకోక ముందే.. పెను తుపానుతో రాష్ట్రం మరింత క్లిష్టపరిస్థితులకు వెళ్లిందని బాబు అన్నారు. గురువారం హుదూద్ తుపాను అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. ఈ తుపాను ప్రభావంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులవ్వగా,, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత విశాఖ చరిత్రలో ఇటువంటి ఘోర విపత్తు సంభవించలేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత ప్రజలను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టామని లేఖలో పేర్కొన్నారు. -
'తక్షణ సహాయాన్ని వెంటనే విడుదల చేయండి'
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు భేటి అయ్యారు. హుదూద్ తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాలు, బాధితులకు కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన వెయి కోట్ల సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని రాజ్ నాథ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. హుదూద్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరగా పంపాలని కేంద్రానికి కంభంపాటి రామ్మోహన్ రావు సూచించారు. -
కట్టలు తెంచుకున్న వైజాగ్ వాసుల ఆగ్రహం
-
తుఫాన్ సహాయంపై ప్రధాని స్పందన భేష్: వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం: హుదూద్ తుఫాన్ బాధితులకు సహాయంపై ప్రధాని నరేంద్రమోడీపై స్పందన భేష్ అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తక్షణ సహాయంగా 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం హర్షనీయం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని ఆయన విమర్శించారు. పునరావాస ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపించిందని ఆయన అన్నారు. ఆలేరు, అరకు ప్రాంతాల్లో ఇప్పటికి జనజీవనం అస్థవ్యస్తంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు:బాబు
-
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు: చంద్రబాబు
విశాఖపట్నం : బాధితులను ఆదుకోవడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుపాను బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్‌ను బాబు ఈ సందర్భంగా అభినందించారు. గురువారం విశాఖపట్నంలో పవన్ కల్యాణ్‌తో కలసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. తుపాన్ బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. హుదూద్ తుపానుకు ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నాని తెలిపారు. టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు సాయం అందించడానికి ముందుకు రావడం పట్ల బాబు హర్షం వ్యక్తం చేశారు. బంగాళదుంపల కోసం బెంగాల్ సీఎంతో మూడుసార్లు మాట్లాడినట్లు చంద్రబాబు వివరించారు. నేటి నుంచి తుపాను సహాయ కార్యక్రమాలు అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ప్రజలలో ఆత్మస్థైర్యం కలిగించామన్నారు. అవసరమైతే ఫైరింజన్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. సహాయక చర్యలో పాల్గొనని... పని చేయని వారేవరినీ ఊరుకోనని ఉన్నతాధికారులను హెచ్చరించారు. విశాఖపట్నంలో గురువారం పరిస్థితి చక్కబడిందని చంద్రబాబు అన్నారు. -
తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ పరామర్శ
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిషింగ్ హార్బర్, జాలరిపేటలోని హుదూద్ తుపాను బాధితులను పరామర్శించారు. రాజమండ్రి నుంచి విమానంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఫిషింగ్ హార్బర్, జాలరిపేట వెళ్లి బాధితులను కలుసుకున్నారు. బాధితుల సమస్యలు విని, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ '' నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. నేను రాకపోతే మీరు బాధపడతారు. అందుకే వచ్చాను'' అని అన్నారు. తుపాను బాధితులకు 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. పవన్ కల్యాణ్ రేపు ఉదయం విజయనగరంలో పర్యటిస్తారు. ఆ తరువాత శ్రీకాకుళం వెళ్లి అక్కడ బాధితులను పరామర్శిస్తారు. ** -
తుపాను బాధితులకు సినిమా రంగ ప్రముఖుల విరాళాలు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన నేపధ్యంలో సినిమా రంగానికి చెందిన వారు వెంటనే స్పందించారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు అందరూ నిన్నటి నుంచి బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ రోజు తాజాగా మరి కొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ సమంత ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు ప్రకటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఏడు లక్షల రూపాయలు, రచయిత చిన్నికృష్ణ లక్షల రూపాయల నగదుతోపాటు ఐదు లక్షల విలువైన బియ్యం, తన పిల్లల పేరిట మరో యాభైవేల రూపాయలు, దర్శకుడు శ్రీను వైట్ల, హీరో గోపిచంద్, హాస్య నటుడు సునీల్, హీరోయిన్ కాజల్ ఒక్కొక్కరు అయిదు లక్షల రూపాయలు ప్రకటించారు. హాస్యనటుడు ఆలీ, నవీన్ చంద్ర, రాహుల్ ఒక్కొక్కరు లక్ష రూపాయలు విరాళాలు ప్రకటించారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్ఎన్సీసీ) 10లక్షల రూపాయల చెక్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించనున్నట్టు క్లబ్ అధ్యక్షుడు కె.ఎస్.రామరావు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేకాక, ఎఫ్ఎన్సీసీకి చెందిన ఉద్యోగులు 350 మంది తమ ఒకరోజు వేతనాన్ని తుఫాను బాధితుల సహాయార్ధం అందించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారు: పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు రామానాయుడు ఫ్యామిలీ రూ.50 లక్షలు బాలకృష్ణ రూ.30 లక్షలు సూర్య రూ.25 లక్షలు మహేష్ బాబు రూ.25 లక్షలు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి రూ. 25 లక్షలు ఎన్టీఆర్ రూ. 20 లక్షలు అల్లు అర్జున్ రూ. 20 లక్షలు రేణుదేశాయ్ రూ.20 లక్షలు ప్రభాస్ రూ.20 లక్షలు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూ.20 లక్షలు విశాల్ రూ.15 లక్షలు రామ్‌చరణ్ రూ.15 లక్షలు కార్తీ రూ.12.5 లక్షలు జ్ఞాన్వేల్ రాజా రూ.12.5 లక్షలు కృష్ణ రూ.15 లక్షలు విజయనిర్మల రూ.10 లక్షలు నితిన్ రూ.10 లక్షలు రవితేజ రూ.10 లక్షలు రామ్ రూ. 10 లక్షలు వివి వినాయక్ రూ. 10 లక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 10 లక్షలు కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు సమంత రూ. 10 లక్షలు బోయపాటి శ్రీను రూ7 లక్షలు హరీశ్ శంకర్ రూ.3 లక్షలు ప్రకాశ్‌రాజ్ రూ.5 లక్షలు అల్లరి నరేష్ రూ.5 లక్షలు శ్రీను వైట్ల రూ.5 లక్షలు గోపిచంద్ రూ.5 లక్షలు సునీల్ రూ.5 లక్షలు కాజల్ రూ.5 లక్షలు పాప్ గాయని స్మిత రూ.5లక్షలు బ్రహ్మానందం రూ.3లక్షలు సందీప్ కిషన్ రూ.2.5లక్షలు సంపూర్ణేష్ బాబు రూ. లక్ష రకుల్ ప్రీత్ రూ.లక్ష నిఖిల్ రూ. 2 లక్షలు పూరి ఆకాశ్ రూ. లక్ష 50 వేలు ప్రతాప్ కొలగట్ల రూ. లక్ష నందూ రూ. లక్ష ఆలీ రూ. లక్ష నవీన్ చంద్ర రూ. లక్ష రాహుల్ రూ. లక్ష రావురమేష్ రూ. లక్ష రచయిత కోన వెంకట్ రూ. లక్ష రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ** -
''35కి చేరిన తుఫాను మృతుల సంఖ్య''
-
తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ పరామర్శ
-
'విశాఖ వాసుల్ని మోడీ మెచ్చుకున్నారు'
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను విశాఖపట్నం నగరాన్ని పూర్తిగా దెబ్బతీసిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హుదూద్ తుపాన్ విపత్తును ఎదుర్కొనేందుకు అందరూ ముందుకు రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హుదూద్ తుపాన్‌పై ప్రధాని మోడీ తక్షణమే స్పందించి రూ. 1000 కోట్లు ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ వాసుల ధైర్యాన్ని ప్రధాని మెచ్చుకున్నారన్నారు. తుపాను ఎదుర్కొనేందుకు వీలుగా భవన నిర్మాణంలో మార్పులు చేయాల్సి ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రధాని మోడీ మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం తక్షణ సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1000 కోట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హుదూద్‌తో విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం
విశాఖపట్నం : తుపాను కారణంగా విద్యుత్ వ్యవస్థకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఆ నష్టంలో 80 శాతం విశాఖ నగరంలోనే జరిగిందని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో అజయ్ జైన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ రోజు రాత్రికి 50 నుంచి 70 వేల మందికి విద్యుత్ ఇవ్వగలమన్నారు. పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరాకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. రేపు ఉదయం స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్‌లకు కరెంట్ ఇస్తామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లను తెప్పిస్తున్నామని చెప్పారు. విశాఖ ఒక్క నగరంలోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 2 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. గాజువాక సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్‌ను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా నక్కవారిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలో పలు 130 కేవీ సబ్ స్టేషన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం బాగా తగ్గించ గలిగామని అజయ్ జైన్ వెల్లడించారు. హుదూద్ తుపాన్‌తో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో గత మూడు రోజులుగా విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాలలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కరెంట్ సరఫరాను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
విశాఖపట్నం టూ హైదరాబాద్ @ 4000
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రూ. 5500, చెన్నైకి రూ. 4500, హైదరాబాద్‌కు రూ.4000... ఈ ఛార్జీలు విమానాలకు అనుకుంటే పొరపాటే. విశాఖ నుంచి ఆయా ప్రాంతాలకు బయల్దేరే బస్సు టికెట్ ఛార్జీలివి. హుదూద్ తుపాన్ ప్రభావంతో విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలను అమాంతంగా పెంచేశారు. విమాన, రైల్వే సర్వీసులు లేకపోవడం ఆపరేటర్లకు కలిసొచ్చింది. కేవలం ఇతర ప్రాంతాలకు రాత్రి వేళ సర్వీసులు నడిపే ఆపరేటర్లు పగలు కూడా సర్వీసులు ప్రారంభించారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన బస్సులతో సర్వీసులు నడుపుతున్నారు. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల నుంచి టూరిస్టు క్యాబ్‌లతో ఆపరేటర్లు వ్యాపారం చేస్తున్నారు. మరో వారం రోజులు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఆర్టీసీ దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు అంతంత మాత్రంగానే నడపడంతో ప్రైవేట్ ఆపరేటర్లు సర్వీసులు బాగా పెంచారు. -
ఫిషింగ్ హార్బర్ వాసులకు వైఎస్ జగన్ పరామర్శ
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్, జాలారిపేట, ఆంధ్రా యూనివర్శిటీ, పెద్ద గదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలెం, దుర్గగుడి, కొబ్బరితోట ప్రాంతాల్లో పర్యటించారు. తుపాను బాధితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని భవనాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నం చేరుకున్న సంగతి తెలిసిందే. -
నేటి నుంచి పూర్తి స్ధాయిలో రైళ్లు
-
అధికారులపై చంద్రబాబు అసంతృప్తి
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ అధికారులపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్బంగా వివిధ శాఖల ఉన్నతాధికారుల పనితీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. నగర వాసులు నాలుగు రోజులుగా త్రాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వియషం తెలిసిందే. అయితే ప్రజలకు తాగునీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రజలకు బియ్యం పంపిణీ కూడా సజావుగా సాగడం లేదని... అందుకు సంబంధించిన చర్యలు ఎంతవరకు వచ్చాయని సదరు శాఖ ఉన్నతాధికారులను బాబు ప్రశ్నించారు. అదికాక 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వాసులకు సరఫరా చేయాల్సి ఉండగా పక్క జల్లాల నుంచి ఇంకా నగరానికి బియ్యం ఎందుకు చేరుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కరెంట్ లేక ప్రజలు గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... సాధ్యమైనంత త్వరగా విద్యుత్ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. తుపాన్ బీభత్సానికి చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ పడి పోయాయి... వాటిని ఎంతవరకు తొలిగించారని అధికారులను చంద్రాబాబు ప్రశ్నించారు. దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఉత్తరాంధ్ర ఉక్కు సంకల్పం
-
ఉక్కు సంకల్పం