
శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
హైదరాబాద్: హుద్హుద్ తుపాను సహాయక చర్యల విషయంలో వైఎస్ఆర్సీఎల్పి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. సభ్యసమాజం సిగ్గుపడేవిధంగా ప్రభుత్వ ప్రవర్తన ఉందన్నారు. తుపాను సహాయక చర్యలు, ఆహార పొట్లాలు అందించే విషయం ప్రస్తావిస్తూ విశాఖపట్నంలో ప్రభుత్వం ఎలా సరఫరా చేసిందో తెలుసా? అని ప్రశ్నించారు.
తాను గానీ, తమ ఎమ్మెల్యేలుగానీ పులిహార పొట్లాలు తెప్పించి, విసిరేస్తే మీరు తీసుకుంటారా? అని అడిగారు. విశాఖలో బాధితులపై ఆహార పొట్లాలు విసిరేశారని చెప్పారు. ప్రతి ఇంటి తలుపు కొట్టి వారి గడప వద్దకు ఆహార పొట్లాలు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బాధల్లో ఉన్నవారిపట్ల ఇలాగేనా వ్యవహరించేది అని వైఎస్ జగన్ అడిగారు.