'గిరిజనుల హక్కులను టీడీపీ సర్కార్ కాలరాస్తోంది' | tdp government does not care about st rights, says mla kalavati | Sakshi
Sakshi News home page

'గిరిజనుల హక్కులను టీడీపీ సర్కార్ కాలరాస్తోంది'

Published Fri, Jan 23 2015 5:52 PM | Last Updated on Sat, Sep 15 2018 6:02 PM

tdp government does not care about st rights, says mla kalavati

గిరిజనుల హక్కులను టీడీపీ సర్కారు కాలరాస్తోందని పాలకొండ ఎమ్మెల్యే బి. కళావతి ఆరోపించారు. హుద్హుద్ తుపాను కారణంగా పంటలను నష్టపోయిన గిరిజనులకు ఇంతవరకూ నష్టపరిహారం అందించలేదని టీడీపీ సర్కారుపై కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు.

కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి.. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులను పట్టించుకోకపోవడం.. ప్రజా తీర్పునకు విరుద్ధంగా నడుచుకోవడమే అన్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1న తణుకులో జరగనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement