సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ప్రకటించింది బీజేపీ. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ. ఇందులో భాగంగా.. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది. వీటితో పాటు..
అజిటేషన్ కమిటీ(నిరసనలు, ఆందోళన నిర్వహణల బాధ్యతలు) చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది. పొంగులేటి సుధాకర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు.
తెలంగాణను ఆరు జోన్లుగా విభజించుకుని.. ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని కమలం భావిస్తోంది. ఈక్రమంలోనే.. ఇవాళ నేడు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొంటారు. వెయ్యి మందికి పైగా ఈ సమావేశాలకు హాజరవుతారని అంచనా.పార్లమెంట్,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment