Komati Reddy Rajagopal Reddy
-
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
మరో మంత్రి పదవి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పదవి దక్కనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పలు సందర్భాల్లో తన మనసులోని మాటను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఎంపీ ఎన్నికల్లో అన్ని బాధ్యతలు తానే తీసుకొని చామల కిరణ్కుమారెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేసిన రాజగోపాల్‌రెడ్డి.. రెండు రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సీఎం రేవంత్‌రెడ్డి అభిమానాన్ని చూరగొన్నారు.లైన్ క్లియర్ అయినట్లేనా..ఎంపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేలా గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని చెప్పినా అందుకు ఆయన అంగీకరించలేదన్న చర్చ అప్పట్లో జరిగింది. పార్టీ సర్వేల ప్రకారం ఆమె పోటీలో ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారన్న చర్చ సాగడంతో అధిష్టానం లక్ష్మిని పోటీ చేయించాలని రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. అయితే, అటు లక్ష్మిని ఎంపీగా పోటీలో నిలిపి, ఇటు మంత్రి పదవి అడిగితే పార్టీ పరంగా విమర్శలు వస్తాయనే భావనతో లక్ష్మిని పోటీచేయించేందుకు ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు తాము ఎంపీ టికెట్ అడుగడంలేదని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. పార్టీ ఎవరిని బరిలో నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదన మేరకు అధిష్టానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించించింది. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.అమాత్య పదవి వస్తుందని ధీమాలో..అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత రాజకీయ సమీకరణల్లో భాగంగా రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. తరువాత తనకు మంత్రి పదవి వస్తుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల తరువాత విస్తరణ ఉంటుందని పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.మంత్రి పదవిపై ముగ్గురి ఆశలు?ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. లంబాడా కోటాలో తనకు మంత్రి పదవి కావాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తన సతీమణి పద్మావతి రెడ్డికి మంత్రి పదవి అడుగుతున్నట్లు తెలిసింది. అయితే, అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్లో బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి పదవిని కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ముచ్చటగా మూడు..!కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లు అవుతుంది. -
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్?.. ఎన్నికలకు సతీమణి దూరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. అధిష్టానం హామీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ విషయంలో అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. అయితే రాజగోపాల్‌రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండటంతో పాటు రాజగోపాల్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు మంత్రి పదవి వస్తుందని, హోం మినిస్టర్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల తరువాత తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. -
కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకకాలంలో అసెంబ్లీకి..
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాఽధించిన సమయంలో వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓడిపోగా.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2022లో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఉపఎన్నిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి గెలుపొందగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు సోదరులు ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉత్తమ్ హుజూర్నగర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా రెండు సార్లు, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడు సార్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే మళ్లీ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని.. బీజేపీలోకి వెళ్లిన, కాంగ్రెస్‌లో చేరినా ఆయనను గద్దె దించేందుకేనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘‘సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కాగా, తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు మరికాసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. చదవండి: బీఆర్ఎస్ను కాపాడుతోంది బీజేపీనే -
మునుగోడు బీజేపీ టికెట్ దక్కేదెవరికో?
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఆలేరు, మునుగోడు, నకిరేకల్ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి జాబితాలో భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థుల పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జిల్లా కేడర్‌లో జోష్ నింపింది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికతో పార్టీలో మరింత జోష్ పెరిగింది. వీటితో పాటు పార్టీ విస్తృతంగా చేపట్టిన కార్యక్రమాలతోనూ ప్రజ ల్లో ఆదరణపెరిగింది. దీంతో ఆశావహులు టికెట్ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా భువనగిరి, తుంగతుర్తి టికెట్లు ప్రకటించిన అధి ష్టానం.. ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌ను పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసింది. అందరి దృష్టి మునుగోడుపైనే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. ఆలేరు నుంచి ఐదుగురు ప్రయత్నం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అభ్యర్థిగా దొంతిరి శ్రీధర్‌రెడ్డి పేరును తొలి విడతలోనే ప్రకటించారు. ఈసారి భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరినప్పటికీ ఆయన తిరస్కరించారు. ప్రస్తుతం పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, సూదగాని హరిశంకర్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, పల్లెపాటి సత్యనారాయణలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు సాగి స్తున్నారు. వీరిలో కాసం వెంకటేశ్వర్లు 2009, 2014లో ఆలేరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నకిరేకల్‌లో భువనగిరికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పోటీ చేసి పరాజయంపాలయ్యారు. బూర నర్సయ్యగౌడ్‌పై అధిష్టానం ఆసక్తి రాజగోపాల్‌రెడ్డి బీజేపీని వీడడంతో మునుగోడు నుంచి ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయనున్నారనే చర్చకు తెరలేచింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను బరిలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అయితే బూర నర్స య్యగౌడ్ మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి 2018లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గంగిడి మనోహర్‌రెడ్డికి టికెట్ వస్తుందని బీజేపీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. -
రాజగోపాల్ పార్టీ మార్పుపై చర్చ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని రెండు రోజులుగా ప్రచారం జోరందుకోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా, బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాజగోపాల్‌రెడ్డి పేరు.. ఇటీవల బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో లేకపోవడం హాట్ టాపిక్ అయింది. తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని గతంలో ఆయన స్వయంగా ప్రకటించినా, ఆ తరువాత ఎల్బీనగర్ నుంచి పోటీచేయబోతున్నారని చర్చసాగడం, చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వాదన జోరందుకుంది. ఒకటీ రెండు రోజుల్లో రాజగోపాల్‌రెడ్డి సొంతగూటికి చేరుబోతున్నారని, దీనికి సంబంధించిన సంప్రదింపులు జరిగాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచే రాజకీయ అరంగేట్రం 2009 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అదే సంవత్సరం భువనగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన 2018లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ పదవీకాలం ముగియకుండానే 2022లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. బీజేపీలో చేరినా తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న భావన ఆయన అనుచరుల నుంచే వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితిలో బీజేపీలో లేదని రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా బీజేపీ మొదటి జాబితాలో రాజగోపాల్‌రెడ్డి పేరు చేర్చకుండా చూసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి పార్టీ మార్పు విషయంలో ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని, ఒకటీ రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు పేరొంటున్నారు. -
TS: బీజేపీ ఎలక్షన్ కమిటీల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ప్రకటించింది బీజేపీ. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ. ఇందులో భాగంగా.. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది. వీటితో పాటు.. అజిటేషన్ కమిటీ(నిరసనలు, ఆందోళన నిర్వహణల బాధ్యతలు) చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది. పొంగులేటి సుధాకర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు. తెలంగాణను ఆరు జోన్లుగా విభజించుకుని.. ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలని కమలం భావిస్తోంది. ఈక్రమంలోనే.. ఇవాళ నేడు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొంటారు. వెయ్యి మందికి పైగా ఈ సమావేశాలకు హాజరవుతారని అంచనా.పార్లమెంట్,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. -
పోటీకి సై అంటున్న నేతలు... మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి!
సాక్షి, యాదాద్రి : భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు జోరు పెంచారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీకి సై అంటున్నారు. భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భువనగిరి నియోజకవర్గంలో టికెట్ ఎవరికన్నది అంతుచిక్కకుండా ఉంది. ఇక్కడి నుంచి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు రేసులో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు జిట్టా బాలకృష్ణారెడ్డి టికెట్ రేసులో ఉన్నా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ ఆయనను బీజేపీ బహిష్కరించింది. అధిష్టానం తీరును ఎండగడుతూ జిట్టా విమర్శలు చేయడంతో బీజేపీతో ఆయనకున్న అనుబంధం ముగిసినట్లయింది. ఇక భువనగిరి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు పీవీ శ్యాంసుందర్‌రావు కూడా జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి టచ్‌లో ఉన్నారు. మరో వైపు నియోజకవర్గంలో జనం మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ టికెట్ బీసీలకు ఇవ్వాలంటూ భువనగిరిలో జరిగిన సమావేశం పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరఽథతో పాటు మరికొందరు నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇంకొందరు కూడా తెరపైకి వస్తున్నారు. ఆలేరులో ముగ్గురు.. ఆలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్, రాజాపేట మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సూదగాని హరిశంకర్‌గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు పార్టీ కార్యక్రమాలు కలిసి చేస్తూనే.. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఆలేరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాసం వెంకటేశ్వర్లు కూడా టికెట్ వేటలో ఉన్నారు. కాగా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్, బండ్రు శోభారాణిలు బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీకి ఆలేరులో పెద్ద దిక్కు లేకుండా పోయింది. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి! మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా సాధారణ ఎన్నికలో మాత్రం రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే విజయం సాఽధిస్తారనే చర్చ సాగుతోంది. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. అయితే, తాను పార్టీ మారడం లేదని పలు మార్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. -
బీజేపీకి గుడ్‌బై.. పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన ఇదే!
న్యూఢిల్లీ: పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. గత ఆరు నెలల నుంచి నా పని నేను చేసుకుంటుంటే కొందరు నాపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎక్కడ అనలేదని.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో బీజేపీలో చేరితే.. తనని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి తనమీద కుతంత్రాలు చేశారని ఫైర్ అయ్యారు. మునుగోడు ఎన్నికలు నైతిక విజయం తనదే అని అందరికీ తెలుసని.. కేసీఆర్ అవినీతి డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్లో పొరాడానని,రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన నియంత పోవాలని ప్రజల కోసం పోరాటము చేశానన్నారు. తెలంగాణ ప్రజలు దుబ్బాక, హైదరాబాద్ మేయర్ ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో బీజేపీని గెలిపించారని, బీఆర్ఎస్ ని ఓడించాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీతోనే సాథ్యమని చెప్పారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని, పారదర్శకంగా తమకు గ్లోబల్ టెండర్ వచ్చిందని స్పష్టం చేశారు. చదవండి: జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం.. వీడియోలు వైరల్ -
Telangana: సుశీ సంస్థల్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థపై రాష్ట్ర వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని సుశీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ, అనుబంధ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న కొందరి ఇళ్లపై దాడులు జరిగాయి. సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ సంస్థల్లో కూడా సోదాలు నిర్వహించారు. పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. 100 మందికి పైగా అధికారులు 25 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, సీపీయూ, హార్డ్ డిస్‌్కలను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. పన్ను చెల్లింపు లావాదేవీలు, పన్ను ఎగవేత సంబంధిత అంశాలు పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించినట్టు జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. దాడులకు సంబంధించిన వివరాలపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగగా, మంగళవారం కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశమున్నట్టు పన్నుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత..! సుశీ ఇన్ఫ్రా సంస్థకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్‌రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ అకౌంట్ నుంచి పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించారనే ఆరోపణలు వచ్చాయి. మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎవరెవరికి ఎంత నగదు సుశీ అకౌంట్ నుంచి వెళ్లిందనే వివరాలతో కూడిన డాక్యుమెంట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆ ఖాతా నుంచి డబ్బు వెళ్లిందనడంలో వాస్తవం లేదని సుశీ ఇన్ఫ్రాతో పాటు రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు ఖండించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత ఇప్పుడు సుశీ ఇన్ఫ్రాపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈడీ దాడులు జరిగిన కొద్ది రోజులకే.. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత రాష్ట్రంలోని పలు మైనింగ్ కంపెనీలపై ఈడీ దాడులు జరిగాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా సుశీ సంస్థల్లో రాష్ట్ర జీఎస్టీ అధికారుల దాడులు చేయడంతో.. టిట్ ఫర్ టాట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అధికారుల చేత రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో తనిఖీలు చేయించిందా? అనే చర్చ జరుగుతోంది. రాజకీయ కోణం లేదంటున్న జీఎస్టీ శాఖ సుశీ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో రాజకీయ కోణం లేదని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఈ తనిఖీలపై ఎలాంటి ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్న అధికారులు.. రాజకీయ ఆరోపణలను మాత్రం కొట్టిపారేస్తున్నారు. కాంట్రాక్టు వ్యాపారంలో ఉన్న సుశీ ఇన్ఫ్రా కూడా జీఎస్టీ డీలరేనని, రాష్ట్రంలోని ఏ డీలర్ (వ్యాపారి) కూడా పన్ను ఎగ్గొట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, అందులో భాగంగానే సుశీ ఇన్ఫ్రాలో కూడా తనిఖీలు చేశామని చెబుతున్నారు. పన్ను చెల్లింపు లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా? రిటర్నులు సకాలంలో ఫైల్ చేస్తున్నారా లేదా? పన్ను ఎగవేతకు ఎక్కడైనా ఆస్కారాలున్నాయా? అనే కోణంలోనే తనిఖీలు జరుపుతున్నామని అంటున్నారు. పన్నుల శాఖకు చెందిన అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సీటీవో స్థాయి అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. కాగా ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలోని అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిసింది. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట..
-
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీదే విజయం : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
టీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం తాకట్టు
చండూరు, మునుగోడు: ప్రాజెక్టులు, పథకాల పేరు తో రూ. లక్షల కోట్లు దోచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 2014కు ముందు సీఎం కేసీఆర్ బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలు చేసిన కారు, పార్టీ ప్రచార రథానికి వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకు అధికారులు వాటిని తీసుకువెళ్లా రని... అలాంటి కేసీఆర్ సీఎం పదవి లభించాక రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసి నేడు రూ. 100 కోట్లతో విమానం కొనుగోలు చేస్తున్నారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, ఎన్నికల సమన్వయకర్త సునీల్ బన్సల్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలసి నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన రోడ్ షోలో సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు వచ్చినా అక్కడ గెలిచేందుకు అభివృద్ధి పనులకు నిధులు, దళితబంధు, ఇతర పథకాలతో ఓటర్లని బుట్టలో వేసుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. అందులో భాగంగానే నియోజక వర్గంలోని యాదవులకు గొర్రెల పంపిణీ పథకం కింద ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 1.54 లక్షలు జమ చేశారన్నారు. అయితే లబ్ధిదారులు డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆ సొమ్మును స్తంభింపజేశారని... ఎన్నికలు పూర్తయ్యాక నిధులను వెనక్కి తీసుకొనే కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. గౌడ కులస్తుల వృత్తిని నిర్వీర్యం చేసేందుకు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు పెట్టించి కల్లు తాగేవారు లేకుండా సీఎం కుట్రలు పనుతున్నారని సంజయ్ ఆరోపించారు. నవంబర్ 3న జరిగే ఉపఎన్నికలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సంజయ్ కోరారు. ఓటుకు రూ.లక్ష ఇచ్చినా బీజేపీదే గెలుపు... సీఎం కేసీఆర్ మునుగోడులో గెలిచేందుకు ఓటుకు రూ. లక్ష ఇచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం ఏర్పడిందని, యాదవులకు గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, రోడ్ల మరమ్మతులకు నిధులను కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు మునుగోడు ఉప ఎన్నికతో చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆ పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడులో కాంగ్రెస్‌కు బూస్ట్.. ఆయన ఎంట్రీతో సీన్ మారుతుందా?
సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడులో విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సమీక్ష కోసం ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వస్తారని స్రవంతి రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశముంది. మునుగోడులో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. రెండు రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, ఉప ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14న తాను నామినేషన్ వేస్తున్నట్లు స్రవంతి ప్రకటించారు. మరోవైపు.. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి.. మునుగోడు సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. -
‘వచ్చే నెలలోనే మునుగోడు ఉప ఎన్నిక.. ఇన్ఛార్జ్లు రెడీగా ఉండండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో మునుగోడు ఉప ఎన్నిక వేడి ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక, ఉప ఎన్నికల షెడ్యూల్‌పైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సునీల్ బన్సల్.. మునుగోడు ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, శనివారం సునీల్ బన్సల్.. మునుగోడు బీజేపీ ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్.. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బన్సల్ మాట్లాడుతూ.. ‘మునుగోడు ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉప ఎన్నిక ఉంటుంది. మునుగోడులో బీజేపీ గెలుస్తుంది. ఇన్ఛార్జ్లు మునుగోడులోనే ఉండాలి’ అని తెలిపారు. -
కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకే రేవంత్ రెడ్డిపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ అధిష్టానం నియమించిన పీసీసీ అధ్యక్షుడిని విమర్శించడం ద్వారా పార్టీకి నష్టం చేయాలన్నదే వారి ఆలోచన అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదన్నారు. ఓపిక లేకపోవడం వల్లే దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లారని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారిన నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించవద్దని మల్లు రవి హితవు పలికారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
మునుగోడుపై ఫోకస్.. రివర్స్ గేర్‌లో ‘కారు’ రూట్ మార్చిన కేసీఆర్!
Munugode Assembly constituency.. సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిపై ముందే అప్రమత్తమైన కాంగ్రెస్ శుక్రవారం ఆ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి శంఖారావం పూరించింది. రాజగోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరిక కోసం ఏర్పాట్లు చేసుకుంటూనే ఉప ఎన్నిక కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఐప్యాక్ బృందంతోపాటు ఇతర సర్వే సంస్థలు, ప్రభుత్వ నిఘా విభాగాలు ఇచ్చిన నివేదికలను కేసీఆర్ అధ్యయనం చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తోపాటు పలువురు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ స్థితిగతులు, ఓటర్లు, టీఆర్ఎస్ కేడర్ మనోగతం, స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ బలం, పార్టీపరంగా ఉన్న బలాబలాలపై సీఎం కేసీఆర్ లోతుగా పరిశీలన జరుపుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డి.రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు విడతలుగా సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. ఉప ఎన్నికకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన సమాచారం, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. హడావుడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ఫలితాలను ప్రస్తావిస్తూ.. మునుగోడులో ఎలా ముందుకు సాగాలనే అంశంపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లే అవకాశమున్న స్థానిక కాంగ్రెస్ నేతలు, వారి బలం, బీజేపీకి ఈ నియోజకవర్గంలో ఉన్న బలం, వలసలు పోగా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్లో చేరికలకు ఉన్న అవకాశాలపైనా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో శనివారం కూడా సీఎం కేసీఆర్ సమీక్షించనున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: రేవంత్ చేతికి ‘టీడీపీ’ రంగు.. వారి ఎంట్రీ కోసమేనా ఇదంతా..? -
పొలిటికల్ గేమ్.. 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: బండి సంజయ్
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులో జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టిలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మును గోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని.. అదే సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఆయా ఎమ్మెల్యేలు వచ్చార న్నారు. చీకోటి ప్రవీణ్ దందా వెనుక కేసీఆర్ కుటుంబంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆరో పించారు. ప్రస్తుతం వారంతా పారిపోయారన్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుంచి 53 శాతం ఓట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థల నివేదికల్లో వెల్లడైందన్నారు. పార్టీ టికెట్లు అధిష్టానమే నిర్ణయిస్తుంది.. బీజేపీలో వ్యక్తిగత ఇమేజ్‌కోసం పనిచేసే వారికి స్థానంలేదని, టికెట్లు పార్టీ అధిష్టా నమే నిర్ణయిస్తుందని సంజయ్ తెలిపారు. పార్టీలో చర్చించి చేనేతబంధు పథకంపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్యాంగ్‌స్టర్ నయీం కేసుతోపాటు అనంతరం జరిగిన వ్యవహారంపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని తెలి పారు. తాము అధికారంలోకి వస్తే జర్నలిస్టుల కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తామని.. అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, రైల్వే పాసులను పునరుద్ధరించి, హెల్త్ కార్డులు, పింఛన్లు ఇస్తామని వివరించారు. కాగా, 3వ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్రను బండి సంజయ్ భువనగిరి పట్టణ శివారులోని టీచర్స్ కాలనీ సమీపంనుంచి ప్రారంభించారు. వర్షంలో తడుస్తూనే యాత్రను కొనసాగించారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో ఊహించని పరిణామం.. రేవంత్‌కు అధిష్టానం వార్నింగ్! -
రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు యత్నించి విఫలమైన కాంగ్రెస్ నేతలు
-
మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. కాగా, కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. శనివారం సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు. రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది. ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా చూస్తాము. వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు దారాపోశారు. ఇంత వరకు ఒక ఎకరాకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ కోసం సీనియర్లను కేసీఆర్ తొక్కేస్తుండు.. -
రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన వీహెచ్
-
రాజగోపాల్ వ్యవహారంపై రంగంలో దిగిన హైకమాండ్
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
-
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
రాజాగోపాల్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అరెస్ట్ చేసిన రాజగోపాల్‌రెడ్డి, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రొటోకాల్ పాటించకుండ అవమానిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. హిట్లర్ కంటే దారుణంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ.. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
జగదీశ్‌రెడ్డి వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకుంది. చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి పోటీగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. 2014కు ముందు సిగ్గులేని పాలన చేశారని, అప్పటి చీకటి ఇంకా ఉంటే బాగుండని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదని, మంత్రి కాంగ్రెస్ ప్రస్తావన తేవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తాను ప్రసంగిస్తున్న సమయంలో తన చేతిలోని మైకు లాక్కోవడం ఏంటని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చిల్లర చేష్టలని, మీడియాలో ప్రచారం కోసం ఆడుతున్న నాటకాలంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎమ్మెల్యేకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. రాత్రి ఓ మాట, పొద్దున మరో మాట మాట్లాడే అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి అన్నారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషంలో లోపల వేయిస్తామని, ఇకపై మునుగోడులో ప్రతి ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తానే స్వయంగా హాజరవుతానని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై లక్కారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రాజగోపాల్‌రెడ్డి రాస్తారోకో చేశారు. -
ఇలా అయితే ఫామ్‌హౌస్‌లోనే అసెంబ్లీ పెట్టాల్సింది
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలకు పరిష్కారం లభించేది దేవాలయం లాంటి శాసన సభలోనే.. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాల శాసనసభ సమావేశాలు రెండో రోజులో భాగంగా మంగళవారం భట్టీ మాట్లాడుతూ.. 19మంది శాసన సభ్యులున్న కాంగ్రెస్ సభ్యుల్లో కొందరిని కేసీఆర్ కలుపుకున్నారు. 19మంది ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారమే సమయం ఇస్తున్నారు. కేవలం 6 నిమిషాలు మాత్రమే కాంగ్రెస్‌కు మాట్లాడటానికి సమయం ఇస్తున్నారు.. ఇది చాలా దారుణం అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: జీవన్ రెడ్డి ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని జీవన్ రెడ్డి మండి పడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికం..దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది.. స్పీకర్ మీడియా పాయింట్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. (చదవండి: కేసీఆర్ తీర్మానం : వ్యతిరేకించిన ఎంఐఎం) ఇలా అయితే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీవీ నరసింహారావు ఘన కీర్తిని పొగిడి, సోనియా దేవత అని ప్రశంసించిన కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ కాంగ్రెస్‌ను బొంద పెడతా అని వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను మాట్లాడనివ్వటం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ లాంటి నియంతను సీఎంగా కోరుకోవట్లేదు అన్నారు. తెలంగాణ కేసీఆర్ అబ్బ సొత్తు కాదు. ప్రత్యేక రాష్ట్రం 1,000 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదన్నారు. కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు, అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే అసెంబ్లీ పెట్టుకోవాలని తీవ్రంగా మండి పడ్డారు రాజగోపాల్ రెడ్డి. -
రాజగోపాల్‌రెడ్డి మతి భ్రమించింది.. అందుకే..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘రాజగోపాల్‌రెడ్డికి మతి భ్రమించింది.. పిచ్చాసుపత్రికి పంపాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జీవన్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సోనియా గాంధీ దృష్టిలో పడేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో అతడి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసేవారని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడేది ప్రజలకు వినపడకుండా.. మమ్మల్ని సస్పెండ్ చేయాలంటూ పోడియం దగ్గరికి వెళ్లి గందరగోళం చేశారని, అసెంబ్లీని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సీఎం అభివృద్ధిపై మాట్లాడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై మార్క్ ఫెడ్ విషయంలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి వార్ వన్ సైడ్ అవుతోందన్నారు. ‘కారు సారు కేసీఆరు’ అనే విధంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారని అన్నారు. -
పదవి రాకపోతే పార్టీ మారడమే..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం గతరెండు సార్లు సరైన నాయకత్వాన్ని (టీపీసీసీ చీఫ్) ఎంపిక చేయడంలో విఫలమైందని, టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈసారి పీసీసీ చీఫ్ పదవి తమకు రాకపోతే బీజేపీలోకి వెళ్లడమా లేక సొంతపార్టీని ఏర్పాటు చేసుకోవడమా అనేది భవిషత్తు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా శుక్రవారం సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం అసెంబ్లీ హాల్లో మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈసారి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటుదనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నట్లు ఆయనపై ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సమయం వచ్చినప్పుడు ప్రజల నుంచే నాయకుడు పుడతాడు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు నేను రెడీగా ఉన్నా. కాంగ్రెస్ అధిష్టానం గత రెండు దఫాలుగా సరైన నాయకుని ఎన్నుకోవడంలో తప్పులు చేసింది. ఏ పార్టీ అనేది కాదు కేసీఆర్‌ని ఓడించామా లేదా అనేది ముఖ్యం. గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ గొప్పతనం వల్ల గెలువలేదు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే కేసీఆర్ గెలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారు’ అని అన్నారు. -
కాంగ్రెస్ మునిగిపోతున్న టైటానిక్: రాజగోపాల్
సాక్షి, హైదరాబాద్: ‘నేను టెక్నికల్‌గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. బీజేపీలోకి వెళ్లాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తా. రాష్ట్రంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన తర్వాత క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లోనూ పార్టీ పరిస్థితిపై చర్చ జరుగుతోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కలసిన అనంతరం లాబీలో ఎదురైన మీడియాతో రాజగోపాల్ పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ లాంటిది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో బీజేపేయే ప్రత్యామ్నాయం. బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది’ అని అన్నారు. -
‘ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తాం’
సాక్షి, నల్గొండ : ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.100 కోట్లు మంజూరు చేస్తే శివన్న గూడం, కృష్ణ రాంపల్లి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని తెలిపారు. 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.. కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని విమర్శించారు. ప్రాజెక్ట్‌లు, భూనిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తేనే ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్కను సభలో మాట్లాడనీయకపోవడం బాధాకరం అన్నారు రాజగోపాల్ రెడ్డి. -
కాంగ్రెస్‌లో కొనసాగేనా?.. బీజేపీలోకి జంపా!
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతార? లేక యూటర్న్ తీసుకుంటారా? ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని ఇటీవల వార్తలొచ్చాయి. స్వయంగా అతనే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని తెలంగాణలో టీఆర్ఎస్కి బీజేపీయే ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇటీవల అమిత్ షా పర్యటనలో బీజేపీలో చేరుతారని అందరూ ఊహించారు. కానీ అతను వెళ్లలేదు. నియోజకవర్గoలో క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. చదవండి: రాజ్‌గోపాల్ రెడ్డి యూటర్న్.. బీజేపీకి నో! నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన చౌటుప్పల్, చండూర్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల పైనే ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో పోటీ కాంగ్రెస్ నుంచా బీజేపీ నుందా అనే సస్పెన్స్ క్యాడర్ లో నెలకొంది. బీజేపీలోకి వెళితే 2024లో తానే సీఎం అని కార్యకర్త కు చెప్పిన ఫోన్ సంభాషణ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కోమటిరెడ్డికి కొంచెం ఇబ్బంది పరిస్థితి నెలకొంది. పార్టీలో చేరక ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ పెద్దలకు నచ్చలేదు. అదే విధంగా తాను పార్టీ మారితే క్యాడర్ అంతా తన వైపే వస్తుందనుకున్న రాజగోపాల్ రెడ్డికి చాలా వరకు కార్యకర్తలు బీజేపీ అంటే ఆసక్తి చూపకపోవడంతో రాజగోపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. అటు కాంగ్రెస్ పై ఘాటైన విమర్శలు చేసినప్పటికీ అధిష్టానం చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ చేస్తే ఫిరాయింపుకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇది రాజగోపాల్ రెడ్డికి కొంత కలిసొస్తుంది. ఈ ఒక్క నెల ఆగితే మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తవుతాయని అప్పటికి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుందని వేచిచూస్తున్నారు. తాను పార్టీ మారితే సోదరుడు ఎంపీ వెంకటరెడ్డి కూడా తనతో వస్తారని భావించిన రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలొనే కొనసాగుతానని చెప్పడంతో డైలమాలో ఉన్నారు. ఒక్కరూ వెళితే అంతగా ప్రాధాన్యత ఉండదని భావించిన రాజగోపాల్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి ఇద్దరూ ఒకే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. -
బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నేనే సీఎం. తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే రాజీనామా చేశారు. అందరం కలిసి బీజేపీకి వెళ్తే.. భవిష్యత్తులో తెలంగాణకు నేనే సీఎం అవుతా’’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడిన మాటలు లీకయ్యాయి. ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఓ అభిమాని ఆయనకు ఫోన్ చేశారు. మీరు గెలవడం కోసం తాము ఎంతో కష్టపడ్డామని, ఇలా పార్టీ మారడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సాగిన సంభాషణ ఫోన్లో రికార్డయింది. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యమ్నాయం బీజేపీయే అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వాటికి మరితం బలం చేకూరుస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని ఇప్పటికే నిర్ధారణ కాగా, ముహూర్తం కూడా ఖరారైందని ఆయన సహచరులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీని వీడి పోయే వారు ఎందరు..? కాంగ్రెస్‌లో కొనసాగే వారు ఎందరు..? ఆయన పార్టీ మారడం వల్ల ఏయే నియోజకవర్గాల్లో ఎంత ప్రభావం పడుతుంది..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. -
కాంగ్రెస్‌లో.. ‘కోమటిరెడ్డి’ కలకలం !
కాంగ్రెస్ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో.. ఆయన కూడా పార్టీ వీడుతారనే చర్చ సాగుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న ఆనందం కాంగ్రెస్‌లో ఆవిరి అవుతున్నట్లే కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చిన విజయం అందించిన ఉత్సాహం పట్టుమని నెల రోజులు కూడా నిలబడలేదని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఉసూరుమంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అపజయాన్ని దిగమింగుకుంటున్న తరుణంలోనే ఆ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఆయన ప్రకటన దుమారం కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం కావడం లేదు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాజగోపాల్‌రెడ్డి అడుగులు కమలం గూటివైపు వడివడిగా పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరాలన్న నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నా.. అంతిమంగా తీసుకోబోయే నిర్ణయం మాత్రం అదే అయివుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైన తరుణంలో ఇక టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉత్తమ్, కుంతియాపై.. విమర్శలు.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకత్వమంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో సీనియర్, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి వంటి నేతలున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండకు పేరుంది. దానికి తగినట్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రెండుకు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం అయినా.. రాష్ట్రంలో వీచిన టీఆర్ఎస్ గాలిని తట్టుకుని సాధించిన విజయం కావడంతో ఆ పార్టీ వర్గాలు కొంత సంతృప్తిగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాకే చెందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇటు ఉత్తమ్‌పైనా, అటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సి.కుంతియాపైనా త్రీవస్థా యిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు సరిగ్గా అదే ఇద్దరు నేతల వైఫలమ్యే రాష్ట్ర కాంగ్రెస్ దుస్థితికి కారణమని వేలెత్తి చూపారు. పీసీసీ పీఠం దక్కదని తెలిసే.. తిరుగుబాటు చేశారా? రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యం కోసం ఎప్పటి నుంచే కోమటిరెడ్డి సోదరులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆ పీఠంపై రాజగోపాల్‌రెడ్డికి ఆశ ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని అప్పట్లో జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, కానీ, మార్పు మాత్రం జరగలేదన్న అసంతృప్తి వీరిలో ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎంపీ టికెట్ దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జిల్లా నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ కోమటిరెడ్డి సోదరులే ముందుకు వచ్చి, రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని పోటీకి నిలబెట్టి, విజయం కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ ఎన్నికల్లో జిల్లా సీనియర్లుగానీ, టీపీసీసీ చీఫ్‌గానీ సీరియస్‌గా తీసుకుని పనిచేయలేదన్నది రాజగోపాల్‌రెడ్డి అభియోగం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని 31 మండలాలకు గాను 23 మండలాల్లో, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు మీదేసుకుని పనిచేశారు. ఇంత చేసినా.. జాతీయ నాయకత్వం గుర్తించకపోవడం, పీసీసీ పదవికి సోదరుల పేర్లను పరిశీలించకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారని విశ్లేషిస్తున్నారు. అడుగులు.. కమలం గూటివైపేనా..? కాంగ్రెస్ నాయకత్వాన్ని తూర్పారా బట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. అదేస్థాయిలో బీజేపీని పొగిడిన వైనం చూస్తే.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనపై, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించ లేదు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే పార్టీ మారుతారా? అయితే, వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక ఆయనా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల మదిని తొలుస్తున్నాయి. -
ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ సత్తా చాటారు. గత ఎన్నికల్లో తన తమ్ముడిని ఓడించిన టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బూర నర్సయ్యగౌడ్ 30,494 ఓట్లతో ఓడించారు. రాజగోపాల్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి నుంచి వెంకట్‌రెడ్డిని పోటీలో నిలిపింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో వెంకట్‌రెడ్డికి 5,31,014 ఓట్లు రాగా, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు 5,26,751 ఓట్లు వచ్చాయి. 4,263 ఓట్ల ఆధిక్యతతో వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఎమ్మెల్యే, ఎంపీలుగా ... కోమటిరెడ్డి బ్రదర్స్ మరో రికార్డు సృష్టించారు. ఇద్దరికీ దేశ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా 2014 వరకు 4 సార్లు నల్లగొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలుకాగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుంచి విజయం సాధిం చారు. 2009 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందగా, ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్..!
సాక్షి, నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్), రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్ఎస్ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. తాజాగా నకిరేకర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైన చిరుమర్తి.. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరనున్నాడనే ప్రచారం తీవ్రచర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికి టికెట్ నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి మరి టికెట్ ఇప్పించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయనను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రావడంలేదు. చిరుమర్తి, ఆయన సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఇంతటి నమ్మకద్రోహమా? ఇక చిరుమర్తి పార్టీ మారుతున్నాడనే వార్తలపై మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిచారు. ఇంతటి నమ్మకద్రోహం చేస్తారనుకోలేదని, పార్టీ మారే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వార్తల ద్వారనే తెలుసుకొని ఆశ్చర్యపోయానన్నారు. రెండు సార్లు టికెట్ ఇప్పించి ఆయన గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇక చిరుమర్తి పార్టీ మారడంతో జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యే అవకాశం ఉంది. -
రాజగోపాల్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
సాక్షి, నల్లగొండ : మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ దంపతులకు తృటిలో విద్యుత్ ప్రమాదం తప్పిం ది. శాలిగౌరారం మండలం చిత్తలూరుగ్రామంలోని సాంభవి శంభులింగేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉత్సవానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కల్యాణం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేకు వేదికపై సన్మానం చేశారు. ఈ క్రమంలో ఉత్సవాలకు ఏర్పాటు చేసిన లైటింగ్ విద్యుత్ వైరు తేలి ఉంది. దానిపై ఓభక్తురాలు కాలు వేయడంతో షాక్‌కు గురై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మిపై పడింది. దీంతో వీరిద్దరికి కూడా షాక్ కొట్టి కిందపడ్డారు. పది నిమిషాల తర్వాత తేరుకున్నారు. ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
నకిరేకల్ కాంగ్రెస్‌కే..
సాక్షి, న్యూఢిల్లీ: నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తుందని, ఈ స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తున్నారన్న ఆందోళన వద్దని కార్యకర్తల కు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచిం చారు. ఈ ఎన్నికల్లో తాను మునుగోడు నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూంలో స్క్రీనింగ్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భక్త చరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ బాగా పనిచేస్తోందని, గతంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఏ కమిటీ ఇంతలా పని చేయలేదన్నారు. అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలన్నారు. అలాగే ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇవ్వాలని నివేదించినట్టు చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉందని, నకిరేకల్ సీటు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఇన్చార్జి కుంతియా చెప్పారని ఆయన గుర్తుచేశారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సి.లింగయ్య పోటీ చేస్తారన్నారు. సీట్లు ఖాయమై నట్టు అధిష్టానం హామీ ఇచ్చిందా? అని మీడియా ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండి పనిచేసే నాయకులకు టికెట్లు కేటాయిస్తుంది కాబట్టి తమకు టికెట్లు దక్కుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. జనగామ టికెట్ నాకే: పొన్నాల చేర్యాల (సిద్దిపేట): జనగామ టికెట్ తనకే వస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం వెలువడకముందే తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాద న్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యా లలో విలేకరులతో మాట్లాడారు. జనగామ నియోజ కవర్గ టికెట్ తనకే వస్తుందని, టీజేఎస్‌కు కేటాయిస్తా రంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు పన్నుతున్న కుట్రలని కొట్టిపారేశారు. -
ఆ బ్రదర్స్ ప్రజల్లో తిరుగుతున్నారంటే..
నల్గొండ జిల్లా : కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ప్రజల్లో తిరుగుతున్నారంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే 2019 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్య యాభై వేల మెజార్టీ కాదు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు. పిళ్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు నా సొంతంగా రూ.4 కోట్లు ఖర్చు పెట్టి కాలువ పనులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూశానని తెలిపారు. నల్లొంగ జిల్లా అంటేనే కేసీఆర్‌కు భయమని, అందులోనూ నకిరేకల్ నియోజకవర్గం అంటే ఇంకా భయమని అన్నారు. -
మీ కండువా కప్పుకోకుంటే కేసులు పెడతారా?
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని, పార్టీ కండువా కప్పు కోవాలంటూ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనమండలిలో మంగళవారం ‘పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, శాంతి భద్రతల నిర్వహణ’పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటోం దని, ప్రతిపక్షాలపై అనవసర కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లే చేయాలని, లేకుంటే తమను బదిలీ చేస్తారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పోలీసులను ఇతర పార్టీలపైకి ఉసిగొల్పితే ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ తమ పార్టీకి లక్షల మంది సభ్యులున్నారని, ఇతర పార్టీల నుంచి తీసుకోవా ల్సిన అవసరం లేదన్నారు. ఇంతలోనే ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ జోక్యం చేసుకొని 24 మంది టీడీపీ, కాంగ్రెస్ సభ్యులను చేర్చుకోలేదా అని నిలదీశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలిసిందేనని, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. వందల వేల కేసులున్నాయని, ఎన్నని చెప్పాలని కోమటిరెడ్డి అనగా, మైకుంది కదాని ఏదిపడితే అది మాట్లాడితే ఎలా? నిరాధారమైన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
నల్లగొండ నేతలతోనే కాంగ్రెస్‌కు అధికారం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య శుక్రవారం మీడి యా పాయింట్ వద్ద సరదా సంభాషణ జరిగింది. ‘ఇద్దరు ఎమ్మెల్యేలే మిగిలారా’ అని రేవంత్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నిం చగా.. ‘మీ పార్టీ పరిస్థితీ అంతేకదా’ అని రేవంత్ సమాధానం ఇచ్చారు. ‘టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం. టీపీసీసీ అయినా, సీఎల్పీ అయినా నల్లగొండ నాయకుల చేతుల్లోనే ఉంది. భవిష్యత్తులోనూ నల్ల గొండ జిల్లా నాయకులతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జైపాల్‌రెడ్డి, డీకే అరుణకు అర్హతల్లేవా’ అని రేవంత్ ప్రశ్నించగా.. ‘జైపాల్ జాతీయ నాయకుడు, కేంద్రంలో మంచి అవకాశాలిచ్చి పార్టీ గౌరవించుకుంటుంది’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై వ్యతిరేకత మొదలైందని, ఇకపై క్షేత్రస్థాయిలో క్రియాశీల పోరాటాలు చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంగళవారం ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షునిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరున్నా ఇప్పుడు పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు. పీసీసీ అధ్యక్షుని సమర్థతపై ఇప్పుడే విశ్లేషించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై భవిష్యత్తులో చేసే పోరాటాలు, కార్యాచరణపై ఆధారపడి విశ్లేషించవచ్చని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి, అందరినీ కలుపుకుని, 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని నడిపించాలన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థికి అమ్ముడుపోయాడు
చింతలపై రాజగోపాల్‌రెడ్డి పరోక్ష ఆరోపణ భువనగిరిటౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయకుండా, టీఆర్ఎస్ అభ్యర్థి వద్ద డబ్బు తీసుకొని అమ్ముడుపోయాడని పీసీసీ మాజీ సభ్యుడు చింతల వెంకటేశ్వరరెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరోక్షంగా ఆరోపించారు. భువనగిరి పట్ట ణంలోని వివేరా హోటల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థుల నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు తనకు టిక్కెట్ రాకుండా ఎంత ప్రయత్నించినా అది ఫలించలేదన్నారు. తాను గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చింతల వెంకటేశ్వరరెడ్డి గెలుపు కోసం తాను కృషి చేశానన్నారు. రెండుసార్లు పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ వస్తే ఆయన గెలుపుకోసం చిం తల కృషి చేయలేదని అన్నారు. ఎన్ని కల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయనను తాను ఫోన్లో కోరానని, అయినా చింతల పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సిగ్గుచేటన్నారు. ప్రాదేశిక, మున్సిపల్ ఫలితాలు అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్, నాలుగు మండలాల ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పార్టీకి చిత్తశుద్ధి ఉన్నావారే ఎన్నికయ్యేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం అసెంబ్లీ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ నుంచి తరిమికొట్టాలన్నారు. భువనగిరి నియోజక వర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చింతల వెంకటేశ్వరరెడ్డిపై టీపీసీసీకి, రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాంటి వారిని జీవిత కాలం పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చేనెలలో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం టీపీసీసీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బొల్లు కిషన్ మాట్లాడారు. నియోజకవర్గం నుంచి అందిన నివేదిక ఆధారంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, పార్టీ క్రమశిక్షణ సంఘం నాయకుడు కోదండరాంరెడ్డికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు బర్రె జహంగీర్, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పెంట నర్సింహ, నానం కృష్ణ, జనార్దన్‌రెడ్డి, శివశాంతిరెడ్డి, రమేశ్, సత్తిరెడ్డి, బెండలాల్రాజ్, ఈరపాక నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రాహుల్ దూతతో కాంగ్రెస్ నేతల సమావేశం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూత సోమవారం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జనగామ సెగ్మెంట్ నేతలతో సమావేశం కానున్నారు. భువనగిరిలో సోమవారం ఉదయం 10 గంటలకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నాయకుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఈ సమావేశానికి రాహుల్దూతగా, ఏఐసీసీ పరిశీలకుడిగా మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే సేవక్వాగిల్ పాటిల్ హాజరవుతున్నారు. జిల్లాలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశానికి జనగామ పరిధిలోని నియోజకవర్గ నాయకులు, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, అనుబంధ సంఘాల నాయకులు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లా పీసీ సీ పరిశీలకులు రాపోలు జయప్రకాష్, లక్ష్మణ్‌రావుగౌడ్ ఇప్పటికే నియోజకవర్గ నాయకులకు స మాచారం అందజేశారు. సంక్రాంతి తర్వాతే ఈ సమాచారం సేకరించాలని పీసీసీ కోరినప్పటికీ ఏఐసీసీ పరిశీలకుని కోరిక మేరకు సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులకు సంబంధించిన సమాచారం సేకరించనున్న ఏఐసీసీ పరిశీలకులు సంక్రాంతి తర్వాత వచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రోజులుగా రాహుల్ దూతల కోసం జిల్లా కాంగ్రెస్ నేతలు ఎదురుచూశారు. ఎప్పుడు వస్తారనే స్పష్టమైన సమాచారం లేకపోవడంతో నేతల్లో సందిగ్ధత నెలకొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందస్తుగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఢిల్లీ నుంచి పరిశీలకులను పంపిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలోని లోక్ సభ అభ్యర్థులపై నివేదికలు సమర్పించాలని రాహుల్ ఆదేశించినప్పటికీ వీలుకాలేదు. ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి, పార్టీ నేతలు, శ్రేణులు నుంచి అభిప్రాయాలు సేకరిం చి సమర్థుడైన అభ్యర్థి పేరును రాహుల్‌కు నివేదించనున్నారు. మహారాష్ట్రకు చెందిన అగర్వాల్‌ను జిల్లాకు పంపించాలని నిర్ణయించినప్పటికీ స్వల్ప అనారోగ్య కారణాలతో ఆయన రాలేక పోయినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రాహుల్ దూతలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు వచ్చినా సమాచా రం అందించేందుకు పీసీసీ నుంచి జిల్లా పరిశీల కులుగా ఉన్న జయప్రకాష్, లక్ష్మణ్‌రావుతో పాటు, జిల్లా నాయకులు సిద్ధమయ్యారు.